
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టాల్సిందే.. అజింక్య రహానే షాకింగ్ కామెంట్స్..!
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టాల్సిందే.. అజింక్య రహానే షాకింగ్ కామెంట్స్..!
© 2026 nimisham.in

Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టాల్సిందే.. అజింక్య రహానే షాకింగ్ కామెంట్స్..!

Vaibhav Sooryavanshi: "ఈషాన్ కిషన్‌ను చూసి నేర్చుకో!".. వైభవ్ సూర్యవంశీకి మాజీ క్రికెటర్ హెచ్చరిక

Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..

Vaibhav Sooryavanshi | వైభవ్ వీరకొట్టుడు.. సిరాజ్ మళ్లీ బలయ్యాడుగా..!

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు భారత స్టార్ బ్యాటర్ వికెట్ కీపర్ సంజు శాంసన్ జట్టులోకి వచ్చాడు. అటు యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కూడా చోటు దక్కించుకున్నాడు. దీంతో ఓపెనింగ్ జోడీపై ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. ఇంటర్నెట్ డెస్క్: వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల ఈ యువ సంచలనం బ్యాటింగ్ చూడటానికి రెండు కళ్లు సరిపోవు. భారీ షాట్లతో బౌలర్లను బెంబేలెత్తించే వైభవ్.. అత్యంత పిన్న వయసులోనే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే సెప్టెంబర్ 13 నుంచి టీమిండియా.. అఫ్గానిస్థాన్‌లో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఇందుకు సంబంధించిన జట్టును కూడా బీసీసీఐ ప్రకటించింది. స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ సంజు శాంసన్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అటు వైభవ్ సూర్యవంశీ కూడా జట్టులో ఉన్నాడు. దీంతో అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌లో భారత ఓపెనింగ్ జోడీ ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. ఇంగ్లండ్ పర్యటనలో విఫలమైన సంజును జట్టు నుంచి తప్పించి వైభవ్‌కు అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు అభిషేక్ శర్మ-వైభవ్ సూర్యవంశీ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ఇంగ్లండ్‌పై నిరాశపరిచిన వైభవ్.. జింబాబ్వేపై చెలరేగాడు. అయితే అఫ్గాన్ సిరీస్‌లో సంజు రాకతో వైభవ్ సూర్యవంశీకి షాక్ తగిలే అవకాశం ఉంది. ఎప్పటిలాగే సీనియర్ ప్లేయర్లు సంజు శాంసన్-అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తే.. వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తుంది. అక్కడ సంజు లేదా అభిషేక్ విఫలమైతేనే వైభవ్‌కు ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు, దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున వైభవ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 6 నుంచి ఫైనల్ మ్యాచ్‌లో ఆడనున్నారు. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 11 వరకు జరగనుంది. ఆ వెంటనే అఫ్గానిస్తాన్ సిరీస్ ప్రారంభం కానుంది. ఇషాన్ కిషన్ ఈస్ట్ జోన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. మరి ఈ ఇద్దరూ అఫ్గాన్ సిరీస్ కల్లా సిద్ధంగా ఉంటారా? లేదా? అనేది

దులీప్ ట్రోఫీ సెమీ ఫైనల్లో ఈస్ట్ జోన్ ఘన విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ సెంట్రల్ జోన్‌ను నాలుగు వికెట్ల తేడాతో మట్టికరిపించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు.159 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఈస్ట్ జోన్‌కు యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ (43 బంతుల్లో 43) మెరుపు ఆరంభాన్ని అందించాడు. అయితే, సెంట్రల్ జోన్ బౌలర్ హర్ష్ దూబే నాలుగు వికెట్లు పడగొట్టి ఈస్ట్ జోన్‌పై ఒత్తిడి పెంచాడు. ఈ దశలో సంయమనంతో ఆడిన కెప్టెన్ ఇషాన్ కిషన్ (41 బంతుల్లో 39 నాటౌట్) జట్టుకు విజయాన్ని ఖరారు చేశాడు. అతనికి మహమ్మద్ షమీ (8 నాటౌట్) సహకరించాడు.అంతకుముందు, సెంట్రల్ జోన్ తమ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 158 పరుగులకే కుప్పకూలింది. ఈస్ట్ జోన్ బౌలర్లు ముకేశ్ కుమార్ 4 వికెట్లతో, మహమ్మద్ షమీ 3 వికెట్లతో ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశారు. కాగా, ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇరు జట్లు 266 పరుగుల వద్ద సమానంగా నిలవడం విశేషం. ఈ విజయంతో, గత ఏడాది ఛాంపియన్‌ను టోర్నీ నుంచి నిష్క్రమింపజేసి, ఈస్ట్ జోన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది

అఫ్గానిస్థాన్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు బీసీసీఐ ఇవాళ భారత జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా ఉండనున్నాడు. స్పోర్ట్స్ డెస్క్: అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు బీసీసీఐ ఇవాళ(మంగళవారం) భారత జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా ఉండనున్నాడు. ఇక వికెట్ కీపర్లుగా సంజూ శాంసన్, ఇషాన్ కిషన్‌లను ఎంపిక చేసింది. జింబాబ్వేతో సిరీస్‌కు దూరమైన సంజూ శాంసన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ సిరీస్‌కు వైభవ్ సూర్వవంశీ కూడా ఎంపికయ్యాడు. అయితే స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు మాత్రం జట్టులో స్థానం దక్కలేదు. ఇక బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాలను ఎంపిక చేసినప్పటికీ వారు కూడా ఫిట్నెస్ క్లియరెన్స్ సాధించాల్సి ఉంటుంది. ఇక అఫ్గానిస్థాన్‌తో భారత్ సెప్టెంబర్ 13 నుంచి 17 మధ్య మూడు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. తొలి టీ20 మ్యాచ్ సెప్టెంబర్ 13న, రెండో టీ20 సెప్టెంబర్ 15న, మూడో టీ20 సెప్టెంబర్ 17న జరగనున్నాయి. ఈ మూడు టీ20లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది. ఈ సిరీస్ ద్వారా అఫ్గానిస్థాన్ భారత్ లో టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వనుండటం విశేషం. శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి*, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్*, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా*, అర్షదీప్ సింగ్, హర్షిత్ రానా* గమనిక: స్టార్ గుర్తు ఉన్నవాళ్లు జట్టులోకి ఎంపికైనప్పటికీ ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ముంబై ఇండియన్స్‌తోనే పాండ్య.. కానీ, కెప్టెన్‌గా కాదు! ఆ విషయంలో పాకిస్థాన్ క్రికెట్‌ను నమ్మోచ్చు: హర్షా భోగ్లే

దులీప్ ట్రోఫీ 2026 సీజన్లో ఈస్ట్ జోన్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీఫైనల్లో ఈస్ట్‌జోన్ 4 వికెట్ల తేడాతో సెంట్రల్ జోన్‌పై విజయం సాధించింది. స్పోర్ట్స్ డెస్క్: దులీప్ ట్రోఫీ (Duleep Trophy2026) ఫైనల్‌కు ఈస్ట్ జోన్ జట్టు దూసుకెళ్లింది. తొలి సెమీ ఫైనల్లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో సెంట్రల్ జోన్‌పై ఈస్ట్ జోన్ వికెట్ల తేడాతో విజయం సాధించింది. 159 పరుగుల టార్గెట్‌ని ఇషాన్ కిషన్ జట్టు 39.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (40), కెప్టెన్ ఇషాన్ కిషన్ (39) రాణించారు. అభిమన్యు ఈశ్వరన్ 24, కుమార్ కుశాగ్ర 22 పరుగులు చేశారు. షమి (8*) విన్నింగ్ షాట్ కొట్టాడు. సెంట్రల్ జోన్ బౌలర్లలో హర్ష్ దూబే 4 వికెట్లు తీయగా, సారాంశ్ జైన్, యశ్ ఠాకూర్ చెరొక వికెట్ పడగొట్టారు. అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో 45/3 స్కోరుతో ఇవాళ(మంగళవారం) ఆటను కొనసాగించిన సెంట్రల్ జోన్ 158 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ అమన్ మోఖడే (41) రాణించగా..అర్షద్ ఖాన్ (25), హర్ష్ దూబె (24), రింకు సింగ్ (20) పరుగులు చేశారు. ముకేశ్ కుమార్ 4, మహ్మద్ షమి 3 వికెట్లతో సత్తాచాటారు. అభిజిత్, అనుకుల్ రాయ్, కౌనైన్ ఖురేషీ ఒక్కో వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇరుజట్లూ 266 పరుగులకు ఆలౌటయ్యాయి. సెప్టెంబరు 6 నుంచి చెపాక్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ మొదలుకానుంది. నార్త్ జోన్, సౌత్ జోన్ మధ్య జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో విజేతగా నిలిచిన జట్టుతో ఈస్ట్ జోన్ ఫైనల్లో తలపడనుంది

పాన్ఇండియా రేంజులో ఆర్భాటంగా విడుదలవుతున్న సినిమాలు అంచనాలను అందుకోలేక చతికిలపడుతున్న తరుణంలో, ఓ చిన్న సినిమా అద్భుతాలు సృష్టిస్తోంది. ప్రచారానికి కూడా బడ్జెట్ లేక సైలెంటుగా విడుదలైన ఆ సినిమా బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అది సాధిస్తున్న విజయం చూసి బాలీవుడ్ సైతం నివ్వెరపోతోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి? దాని ప్రత్యేకతలేంటి? ఆగస్టు 7న ఏమాత్రం హడావుడి లేకుండా విడుదలైంది ‘హనుమాన్ అంశ్’ (Hanuman Ansh). స్టార్లుగానీ, తెలిసిన ముఖాలుగానీ లేని ఆ సినిమాకు తొలిరోజు వసూళ్లు.. కేవలం రూ.10 లక్షలు. ఓపెనింగే ఇంత డల్‌గా ఉంటే ఇంకేం ఆడుతుంది అనుకున్నారంతా. తొలివారంలో రూ.1కోటి 8లక్షలు వసూలు చేసింది. రెండో వారం మరింత దయనీయం. రూ.40లక్షలు మాత్రమే వచ్చాయి. ఇక దీని పనైపోయినట్లే, బొమ్మ తీసేయడమే తరువాయి అని అనుకున్నారు. కానీ అప్పుడే అద్భుతం జరిగింది. తొలి 14 రోజుల్లో రూ.1.48 కోట్లు వసూలు చేసిన ఆ సినిమా, ఒక్క మూడో వారంలోనే ఏకంగా రూ.10.4 కోట్లు రాబట్టింది! నాలుగో వారంలో ఈ సినిమా దూకుడు చూసి ట్రేడ్ విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు. 22వ రోజు రూ.6.25 కోట్లు, 23వ రోజు రూ.9.25 కోట్లు, 24వ రోజు రూ.12.75 కోట్లు.. ఇలా రోజురోజుకూ కలెక్షన్లు పెంచుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తొలి రెండు వారాల మొత్తం కలెక్షన్ల కన్నా, 24వ రోజు వచ్చిన వసూళ్లే ఎక్కువంటే, ఈ చిత్రానికి ప్రేక్షకాదరణ ఏ స్థాయిలో పెరుగుతోందో అర్థమవుతోంది. ఇప్పటివరకూ ఈ సినిమా రూ.47.33 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి రూ.50 కోట్లకు చేరువవుతోంది. ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ తీస్తే రూ.200 కోట్లొచ్చాయ్..! 1900-1973 మధ్య జీవించిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, హనుమాన్ భక్తుడు నీమ్ కరోలి బాబా(మహరాజ్జీ) జీవితం, ఆయన బోధనల ఆధారంగా ఈ సినిమాను విశాల్ చతుర్వేది తెరకెక్కించారు. అతి తక్కువ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా ప్రచారానికి కూడా డబ్బుల్లేక

టీడీపీ ఎంపీ గొప్ప మనసును చాటుకున్నారు. ప్రభుత్వ స్కూళ్లు (Government Schools), హాస్టల్స్ (Hostels) కు అండగా నిలిచారు. నెల్లూరు జిల్లా ( Nellore District)లోని సంక్షేమ వసతి గృహాలు, గురుకుల రెసిడెన్షియల్ స్కూల్స్ వసతుల కల్పనకు సాయం ప్రకటించారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షుశుక్లా ప్రారంభించిన విద్య-వసతి-వికాసం కార్యక్రమానికి టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (Vemireddy Prabhakar Reddy) రూ.కోటి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. నెల్లూరులోని కలెక్టరేట్లో కలెక్టర్ హిమాన్షుశుక్లా (Himanshu Shukla)ను ఎంపీ వేమిరెడ్డి కలిసి రూ.కోటి విరాళం ఇస్తానని తెలియజేయగా, కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. విద్య-వసతి-వికాసం కార్యక్రమానికి ఇప్పటి వరకు రూ.5 కోట్ల విరాళాలు అందాయని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షుశుక్లా తెలిపారు

Vaibhav Sooryavanshi Misses Youngest Century Record: భారత దేశవాళీ క్రికెట్లో అరంగేట్రం చేసినప్పటి నుంచీ తన ఆటతో ఆకట్టుకుంటున్న 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి దులీప్ ట్రోఫీ 2024లో చేదు అనుభవం ఎదురైంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తొలి శతకం సాధించే అవకాశాన్ని ఈ చిచ్చరపిడుగు మరోసారి త్రుటిలో చేజార్చుకున్నాడు. ప్రతిష్టాత్మక రెడ్ బాల్ టోర్నీ దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో ఈస్ట్ జోన్ తరపున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ, సెంట్రల్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో 92 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటై తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ గాయపడటంతో, 15 ఏళ్ల 157 రోజుల వయసులోనే వైభవ్ సూర్యవంశీ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం ఈ మ్యాచ్‌కు మరో ప్రత్యేక ఆకర్షణ. బెంగళూరు వేదికగా ఆదివారం సెంట్రల్ జోన్‌తో మొదలైన ఈ సెమీఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఈస్ట్ జోన్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం తమ మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈస్ట్ జోన్‌కు ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, అభిమన్యు ఈశ్వరన్ అదరిపోయే ఆరంభం ఇచ్చారు. ఎక్కువమంది చదివినది: వన్డే ప్రపంచకప్ 2027 కోసం దూసుకొస్తోన్న తెలుగోడు.. డేంజర్ జోన్లో సర్పంచ్ సాబ్ ప్లేస్..! వైభవ్ సూర్యవంశీ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. కేవలం 42 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 భారీ సిక్సర్ల సాయంతో తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకుని ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇదే జోరును కొనసాగిస్తూ, తన తొలి ఫస్ట్ క్లాస్ సెంచరీకి చేరువయ్యాడు. అభిమానులందరూ అతడు శతకం పూర్తి చేయాలని ఆతృతగా ఎదురుచూస్తుండగా, 92 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హర్ష్ దుబే బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. బంతి గాల్లోకి లేవగా, డీప్ మిడ్ వికెట్ వద్ద

అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. IND vs SL 2nd Test Predicted Playing 11: శ్రీలంకపై టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ చేసేందుకు టీమిండియా రెడీ అవుతోంది. తొలి టెస్టులో 165 పరుగుల భారీ తేడాతో గెలిచిన భారత్.. ఇప్పటికే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. కొలంబోలోని ఎస్ఎస్సీ స్టేడియం వేదికగా రేపటి (ఆగస్టు 23) నుంచి రెండో టెస్ట్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలు మరింత మెరుగుపరుచుకోవాలని గిల్ సేన చూస్తోంది. మరోవైపు సిరీస్ సమం చేయాలంటే ఆతిథ్య శ్రీలంక తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తొలి టెస్టులో దేవదత్ పడిక్కల్ (167), కేఎల్ రాహుల్ (82) అద్భుతంగా రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంకను 284 పరుగులకే కట్టడి చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో లంక స్పిన్నర్లు ప్రభాత్ జయసూర్య, కేశర నువాంత రాణించి భారత్ 193 పరుగులకు పరిమితమైంది. 445 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 206 రన్స్‌కు ఆలౌట్ అయింది. రెండో టెస్టులో భారత బౌలింగ్ విభాగంలో ఒక మార్పు చోటుచేసుకునే అవకాశం ఉంది. తొలి మ్యాచ్‌లో రవీంద్ర జడేజా, మానవ్ సుతార్ స్పిన్ మాయాజాలంతో లంకను దెబ్బకొట్టగా.. కుల్దీప్ యాదవ్ మాత్రం లయ అందుకోలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం ఒకే వికెట్ తీశాడు. కుల్దీప్ను గిల్ కేవలం మూడో స్పిన్నర్‌గా చూస్తున్నట్లు అర్థమవుతోంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కుల్దీప్కు సపోర్ట్‌గా ఉన్నా.. ఇప్పటికే సిరీస్‌లో ఆధిక్యం ఉండటంతో అతనికి విశ్రాంతినిచ్చి ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్‌ను

టీ20 క్రికెట్లో సంచలనం సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీ.. భవిష్యత్తులో టెస్టు క్రికెట్‌కు కొత్త ఉత్సాహాన్ని తీసుకురాగలడని భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. అయితే 15 ఏళ్ల వైభవ్ ఎదుగుదలను జాగ్రత్తగా పర్యవేక్షించాలని సూచించాడు. అతడికి తగినంత సమయం, అనుభవం ఇవ్వాలని చెప్పాడు.వైభవ్ దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున ఆడనున్నాడు. వైట్‌బాల్ క్రికెట్లో ఇప్పటికే సత్తా చాటిన అతడికి.. రెడ్‌బాల్ క్రికెట్లో నిలకడ సాధించేందుకు ఇది కీలక అవకాశం. 2025 ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున వైభవ్‌కు ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరించాడు.వైభవ్ ఇప్పటివరకు ఎనిమిది ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. అతడి సగటు 17.25గా ఉంది. దేశవాళీ రెడ్‌బాల్ క్రికెట్లో ఎక్కువకాలం వరుసగా ఆడే అవకాశం అతడికి ఇప్పటివరకు పెద్దగా దక్కలేదు. దులీప్ ట్రోఫీతో ఆ లోటు తీరే అవకాశం ఉంది. సెప్టెంబరులో ఆస్ట్రేలియా-ఏతో ఇండియా-ఏ రెండు అనధికారిక టెస్టులు ఆడనుంది. ఈ మ్యాచ్‌లు కూడా వైభవ్‌కు ఉపయోగపడే అవకాశముంది.టీ20 క్రికెట్‌కు, టెస్టు క్రికెట్‌కు చాలా తేడా ఉంటుందని ద్రవిడ్ పేర్కొన్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో ఇన్నింగ్స్‌ను నిర్మించడం, ఒత్తిడిని తట్టుకోవడం, ఎక్కువసేపు ఏకాగ్రతతో బ్యాటింగ్ చేయడం వైభవ్ నేర్చుకోవాల్సి ఉంటుందని చెప్పాడు.వైభవ్ ఇంకా 15 ఏళ్లేనని ద్రవిడ్ గుర్తు చేశాడు. అతడి కెరీర్లో విజయాలతో పాటు వైఫల్యాలు కూడా వస్తాయని పేర్కొన్నాడు. అందుకే అతడిపై ఓపికతో వ్యవహరించాలని సూచించాడు.టెస్టు క్రికెట్ మనుగడ సాగించాలన్నా, ఎదగాలన్నా మూడు ఫార్మాట్లలో ఆడగల ఆటగాళ్లు అవసరమని ద్రవిడ్ అన్నాడు. వైభవ్ భవిష్యత్తులో భారత్ తరఫున టెస్టు ఆటగాడిగా ఎదిగితే ప్రపంచ

భారత బ్యాటింగ్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి టెస్టు క్రికెట్లోనూ అవకాశాలు ఇవ్వాలని భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డారు. అతడిని రెడ్‌బాల్ క్రికెట్లోనూ తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన ఆటతో 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక అతడి బ్యాటింగ్ శైలీని పలువురు దిగ్గజ క్రికెటర్లు ప్రశంసిస్తుంటారు. అంతేకాక అతడికి పలు సూచనలు సైతం చేస్తుంటారు. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్, కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం ఈ యువ హిట్టర్ గురించి కీలక విషయాలను ప్రస్తావించారు. ఐర్లాండ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ... వైభవ్ సూర్యవంశీకి టెస్టు క్రికెట్లోనూ అవకాశం కల్పించాలన్నారు. టెస్ట్ క్రికెట్ అభివృద్ధి చెందాలంటే వైభవ్‌లాంటి ఆటగాళ్లు ఆడాలని ద్రవిడ్ వెల్లడించారు. 15 ఏళ్ల వైభవ్‌ను రెడ్ బాల్ క్రికెట్లోనూ తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని సూచించారు. వైభవ్ ప్రస్తుతం ఐపీఎల్, అంతర్జాతీయ టీ20ల ద్వారా వైట్‌బాల్ అనుభవం సంపాదిస్తున్నాడని, అదే సమయంలో దేశవాళీ క్రికెట్లో రెడ్‌బాల్ మ్యాచ్‌లు కూడా ఆడేలా చూడాలని ద్రవిడ్ అభిప్రాయపడ్డారు. దులీప్ ట్రోఫీ 2026లో ఈస్ట్ జోన్‌కు వైభవ్ ప్రాతినిధ్యం వహించనున్న నేపథ్యంలో ఈ టోర్నీ అతడి రెడ్‌బాల్ సామర్థ్యాలను పరీక్షించడానికి కీలకంగా మారనుందని ద్రవిడ్ అన్నారు. భవిష్యత్తులో టెస్టు క్రికెట్‌కు ఎంపిక కావాలంటే ఇలాంటి అవకాశాలను అతడు సద్వినియోగం చేసుకోవాలని ద్రవిడ్ సూచించారు. ఇదే సమయంలో వైభవ్ విషయంలో క్రికెట్ అభిమానులకు ద్రవిడ్ కీలక సూచనలు చేశాడు. వైభవ్‌పై అంచనాలు పెట్టుకునే విషయంలో తొందరపడకూడదని ఆయన స్పష్టం చేశారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ పెద్ద స్థాయిలో విజయాలు సాధించాడని, భవిష్యత్‌లో కూడా ఆటలో హెచ్చుతగ్గులు సహజమేనని, అందుకే అతడికి తగినంత సమయం ద్రవిడ్ సూచించారు. ద్రవిడ్ చెప్పినట్లుగా, వైభవ్ విషయంలో తొందరపడకుండా సమయం ఇవ్వడం కీలకమని

వన్డే వరల్డ్‌కప్-2027కు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికి భారత జట్టు కూర్పుపై ఇప్పటినుంచే చర్చలు మొదలయ్యయి. తాజాగా ఈ మెగా టోర్నీ కోసం సీఎస్కే మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించాడు. ఉతప్ప అందరిని ఆశ్చర్యపరుస్తూ తన వరల్డ్ కప్ జట్టులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటిచ్చాడు. ప్రస్తుత వన్డే జట్టులో రోహిత్ శర్మకు బ్యాకప్‌గా ఉన్న యశస్వి జైశ్వాల్‌ను కాదని వైభవ్‌కు రాబిన్ ఛాన్స్ ఇచ్చాడు. 15 ఏళ్ల వైభవ్ ఇటీవల భారత సీనియర్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన డెబ్యూ సిరీస్‌లో విఫలమైనప్పటికి తర్వాత జింబాబ్వే పర్యనటలో మాత్రం వైభవ్ ఇరగదీశాడు. ఈ రాజస్తాన్ చిచ్చరపిడుగు వచ్చే నెలలో జరగనున్న ఏషియన్ క్రీడలకు సన్నదమవుతున్నాడు. అయితే సూర్యవంశీ ఇప్పుడే వన్డే జట్టులోకి సూచనలు కనిపించడం లేదు. ఎందుకంటే ఓపెనింగ్ స్లాట్ కోసం ఇప్పటికే జైశ్వాల్, రుతురాజ్ వంటి యువ ఆటగాళ్లు పోటీలో ఉన్నారు. రోహిత్ రిటైర్మెంట్ తర్వాత వీరిలో ఎవరో ఒకరు ఆ స్దానాన్ని భర్తీ చేయనున్నారు. ఇక రాబిన్ ఉతప్ప తను ఎంపిక చేసిన జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్లగా కేఎల్ రాహుల్‌తో పాటు సంజూ శాంసన్‌లకు అవకాశమిచ్చాడు. ఇషాన్ కిషన్‌కు బదలుగా సంజూను ఉతప్ప ఎంపిక చేశాడు. సంజూ చివరగా భారత్ తరపున మూడేళ్ల కిందట వన్డే మ్యాచ్ ఆడాడు. ఈ జట్టులో కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ వంటి సీనియర్ ప్లేయర్లు ఉన్నారు. ఆల్రౌండర్లగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలను ఉతప్ప ఎంపిక చేశాడు. అదేవిధంగా అందరి మాజీ క్రికెటర్లలానే రాబిన్ కూడా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయాలని సూచించాడు. ఐపీఎల్ వంటి ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో భువనేశ్వర్ అద్భుతంగా

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో 165 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా సిరీస్‌పై కన్నేసింది. అయితే, ఈ గెలుపు ఉత్సాహంలో ఉన్నప్పటికీ, జట్టు కూర్పుపై యాజమాన్యం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ప్రదర్శనపై అసంతృప్తితో ఉన్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కోచ్ గౌతమ్ గంభీర్.. కొలంబోలో జరగబోయే రెండో టెస్టుకు జట్టులో ఒక మార్పు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.గాలే వేదికగా జరిగిన మొదటి టెస్టులో కుల్దీప్ యాదవ్ తేలిపోయాడు. 25 ఓవర్లు బౌలింగ్ చేసి 103 పరుగులు ఇచ్చి కేవలం ఒకే ఒక్క వికెట్ పడగొట్టాడు. ఇదే మ్యాచ్‌లో రవీంద్ర జడేజా, మానవ్ సుతార్ వంటి ఇతర లెఫ్టార్మ్ స్పిన్నర్లు అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో, కుల్దీప్ను పక్కనపెట్టి, అతడి స్థానంలో మధ్యప్రదేశ్‌కు చెందిన 33 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ సరాన్ష్ జైన్‌కు అరంగేట్రం చేసే అవకాశం ఇవ్వాలని జట్టు యాజమాన్యం యోచిస్తున్నట్లు సమాచారం.తొలి టెస్టులో భారత్ ముగ్గురు లెఫ్టార్మ్ స్పిన్నర్లతో (జడేజా, సుతార్, కుల్దీప్) బరిలోకి దిగింది. అయితే శ్రీలంక జట్టులో ఉన్న ఎడమచేతి వాటం బ్యాటర్లను ఎదుర్కోవడానికి ఒక రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ ఉంటే జట్టుకు వైవిధ్యం లభిస్తుందని భావిస్తున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే సరాన్ష్ జైన్‌ను సిరీస్‌కు ఎంపిక చేశారు. ఇప్పుడు అతడిని తుది జట్టులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు.అయితే, ఈ మార్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ దీనిపై స్పందిస్తూ

IND vs SL: గాలే వేదికగా జరిగిన మొదటి టెస్టులో భారత్ మూడు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్ ఈ విభాగాన్ని నడిపించారు. యంగ్ స్పిన్నర్ మానవ్ సుతార్ అద్భుత ప్రదర్శనతో ఏకంగా 10 వికెట్లు తీసి మ్యాచ్ విజేతగా నిలిచాడు. జడేజా రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 4 వికెట్లు పడగొట్టాడు. తిరుగులేని స్పిన్ పిచ్‌పై కూడా కుల్దీప్ యాదవ్ మాత్రం పూర్తిగా ప్రభావం చూపలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 25 ఓవర్లు బౌలింగ్ చేసిన కుల్దీప్ 103 పరుగులిచ్చి కేవలం ఒకే ఒక్క వికెట్ మాత్రమే తీసుకోగలిగాడు. ఇండియా టుడే నివేదికల ప్రకారం ఆగస్టు 23 నుంచి కొలంబోలో ప్రారంభమయ్యే రెండో టెస్టు మ్యాచ్‌లో కుల్దీప్ స్థానంలో సారాంశ జైన్‌కు అవకాశం ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 33 ఏళ్ల ఈ మధ్యప్రదేశ్ ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్‌ను తుది జట్టులోకి తీసుకోవడం ద్వారా లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ బలాన్ని కూడా పెంచవచ్చని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. సారాంశ జైన్ తన అంతర్జాతీయ అరంగేట్రాన్ని ఎదురుచూస్తున్న తరుణంలో ఈ వార్త క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేపుతోంది. ఇది కూడా చదవండి: SL vs IND 2nd Test: ఆ రూల్ ఎఫెక్ట్.. 2వ టెస్ట్ కు ముందే ఊహించని షాక్.. ఏకంగా ముగ్గురు ఔట్..! మధ్యప్రదేశ్‌కు చెందిన సారాంశ జైన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో 188 వికెట్లు పడగొట్టడమే కాకుండా బ్యాట్‌తో 2223 పరుగులు సాధించాడు. అతని ఖాతాలో 2 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2021-22 సీజన్లో మధ్యప్రదేశ్ రంజీ ట్రోఫీ విజేతగా నిలవడంలో సారాంశ కీలక పాత్ర పోషించాడు. ఆ సీజన్లో 13 వికెట్లు తీయడంతో పాటు ఫైనల్లో 57 పరుగుల అమూల్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాతి సీజన్లో 360 పరుగులు

ఈ మధ్య లేడీ ఓరియంటెడ్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ భామ యామీ గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. ఈ మధ్య లేడీ ఓరియంటెడ్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. రీసెంట్గా సమంత ‘మా ఇంటి బంగారం’ అంటూ వచ్చి రూ. 100 కోట్లు పట్టుకెళ్లింది. ఇప్పుడు బాలీవుడ్ భామ యామీ గౌతమ్ (Yami Gautam) కూడా దసరాకు సెన్సేషన్‌ను క్రియేట్ చేయడానికి సిద్ధమవుతోంది. యామీ గౌతమ్ ధార్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘నయ్యి నవెల్లి’ (Nayyi Navelli). ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి బాలాజీ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. హిమాన్షు శర్మ, దివ్య నిధి శర్మ కథను అందించగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ దసరా పండుగకు ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఒక అద్భుతమైన ఫాంటసీ కామెడీ చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని అమెజాన్ MGM స్టూడియోస్, కలర్ ఎల్లో సంస్థలు నిర్మించాయి. ఈ చిత్రాన్ని 16 అక్టోబర్ 2026న దేశవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారిక ప్రకటనతో ఓ పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరట్ నగరంలోని ఒక చలాకి కుటుంబంలోకి పెళ్లై కొత్తగా కోడలు అడుగుపెడుతుంది. ఆమె రాకతో ఆ ఇంటిలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా మంచి వాతావరణ నెలకొంటుంది. అయితే ఎంతో పర్ఫెక్ట్ గా, ఆదర్శంగా కనిపిస్తున్న తన వదిన నిజానికి ఒక మాంత్రికురాలు ఏమో అని.. ఆమె మరిదికి అనుమానం మొదలవుతుంది. ఆ తర్వాత ఆ ఇంట్లో ఎలాంటి వింతలు జరిగాయి? ఎంతటి నవ్వుల హంగామా సృష్టించబడింది? అనేదే ఈ సినిమా కాన్సెప్ట్. కచ్చితంగా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని, సినిమా చూసిన వారంతా దసరాకు సరైన చిత్రమని అనుకుంటారని, ఫ్యామిలీ

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Tirumala VIPs Darshan: ఆపద మొక్కులవాడు కొలువుదీరిన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించేందుకు భారీ ఎత్తున భక్తులు వస్తున్నారు. వారాంతం ముగిసినా కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల ఆలయాన్ని సందర్శించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మంగళవారం పలువురు ప్రముఖులు స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఎవరెవరు శ్రీవారిని దర్శించుకున్నారో తెలుసుకుందాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు సుప్రభాత సేవలో దర్శించుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున శ్రీవారి ఆలయంలో నిర్వహించిన సుప్రభాత సేవలో భారత క్రికెట్ జట్టు ఆటగాడు తిలక్ వర్మ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ నారాయణ్ సింగ్ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. సుప్రభాత సేవ అనంతరం ప్రముఖులకు రంగనాయక మండపంలో ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు ఆశీర్వచనం అందించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేశారు. దర్శనం అనంతరం ప్రముఖులు తిరుమల ఆలయ విశేషాలను తెలుసుకున్నారు. ప్రముఖుల పర్యటన నేపథ్యంలో తిరుమల ఆలయ పరిసరాల్లో అధికారులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కొనసాగుతున్న భక్తుల రద్దీ ఇక తిరుమలలో దర్శనానికి సంబంధించిన సమాచారాన్ని టీటీడీ అధికారులు వెల్లడించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆగస్టు 17వ తేదీన శ్రీవారిని మొత్తం 79,445 భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి 36,834 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.80 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. లడ్డూ విక్రయాలు 3.95 లక్షలు జరగ్గా.. అన్నప్రసాదాలు 3.39 లక్షల మంది భక్తులు స్వీకరించారు. భక్తుల రద్దీ కొనసాగుతుండడంతో సుమారు సర్వదర్శనం కోసం అంటే ఎస్ఎస్డీ టోకెన్లు లేని భక్తులకు

దివంగత లెజెండరీ నటుడు, ‘రియల్ స్టార్’ శ్రీహరి 62వ జయంతి వేడుకలను బాచుపల్లిలోని మండపం వద్ద కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీహరి భార్య శాంతి శ్రీహరి, కుమారులు హీరో మేఘాంశ్ శ్రీహరి, శశాంక్ శ్రీహరిలు ఆయన స్మారకానికి ఘన నివాళులు అర్పించారు. ఇదే ప్రాంగణంలో శ్రీహరి కుమార్తె స్వర్గీయ అక్షర స్మారక స్థలం కూడా ఉండటంతో కుటుంబ సభ్యులు ఎమోషనల్ అయ్యారు. హీరో మేఘాంశ్ శ్రీహరి మాట్లాడుతూ “ఈరోజు నాన్నగారి 62వ జయంతి. ఆయన ఆశీస్సులతో నేను నటించిన పాన్-ఇండియా చిత్రం ‘ఆస్మాన్’ ఫస్ట్ లుక్‌ను ఈరోజే రిలీజ్ చేశాం. ఈ సినిమా కోసం చిత్ర బృందం అంతా ఎంతో కష్టపడింది. నాన్నగారిని మీరందరూ ఎలాగైతే గుండెల్లో పెట్టుకుని ఆశీర్వదించారో, నన్ను కూడా అలానే ఆశీర్వదించి ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను.” అన్నారు. శాంతి శ్రీహరి మాట్లాడుతూ “శ్రీహరి గారు ఈరోజు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన చేసిన మంచి పనులు, ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ మన గుండెల్లో పదిలంగా ఉంటాయి.” అన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు అభిమానులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు

‘ఆస్మాన్’తో మేఘాంశ్‌కి మంచి విజయం దక్కాలని ఓ తల్లిగా కోరుకుంటున్నాను. నేను ఇప్పటికీ మేఘాంశ్‌ని చిన్న పిల్లాడిలానే చూస్తుంటాను. మేఘాంశ్ శ్రీహరి(Meghams Srihari) హీరోగా రామ్ నందన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆస్మాన్’ (Asmaan) వెంకటేష్ కొండారు, శ్రీకాంత్ మన్నెం నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, అరబిక్ భాషల్లో రూపొందుతోంది. స్వర్గీయ నటుడు శ్రీహరి జయంతి సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను శనివారం రిలీజ్ చేశారు. శాంతి శ్రీహరి మాట్లాడుతూ ‘మేఘాంశ్ మీద నమ్మకంతో ‘ఆస్మాన్’ చేసేందుకు ముందుకు వచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. మేఘాంశ్ రాత్రింబవళ్ళు పని చేస్తున్నాడు. బావ కూడా అలాగే చేసేవారు. ఆర్టిస్టులు ఎప్పుడూ అలానే కష్టపడి నటించాలి. మేఘాంశ్‌ని అద్భుతంగా చూపిస్తున్న రామ్ నందన్‌కి థాంక్స్. ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌కి మంచి విజయం దక్కాలని ఓ తల్లిగా కోరుకుంటున్నాను. నేను ఇప్పటికీ మేఘాంశ్‌ని చిన్న పిల్లాడిలానే చూస్తుంటాను. కానీ ఈ రోజు పోస్టర్ చూశాన తర్వాత సింహాన్ని చూసినట్టుగా అనిపించింది' అన్నారు. హీరో మేఘాంశ్ శ్రీహరి మాట్లాడుతూ 'రామ్‌తో వర్క్ చేయడం ఓ గొప్ప ఎక్స్‌పీరియెన్స్. సెట్లో ఎప్పుడూ ఓ పండుగ వాతావరణం కనిపించేది. ప్రశాంత్ గారి బీజీఎం అద్భుతంగా ఉండబోతోంది' అని అన్నారు. దర్శకుడు రామ్ నందన్ మాట్లాడుతూ ‘‘ఆస్మాన్’ మూవీతో అందరికీ ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. థియేటర్లో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాత వెంకట్ గారు, హీరో మేఘాంశ్ గారికి, విజువల్స్ ఇచ్చిన షోయబ్ గారికి థాంక్స్. మేఘాంశ్ గారు బయట కూడా హీరోనే. మున్ముందు మరిన్ని అప్డేట్లతో వస్తామ’ని అన్నారు. నిర్మాత వెంకటేష్ మాట్లాడుతూ ‘‘ఆస్మాన్’ పోస్టర్ అద్భుతంగా ఉంది. నాకు పోస్టర్ చూస్తుంటే మాత్రం ఫుల్ ఎనర్జిటిక్‌గా అనిపిస్తోంది. మేఘాంశ్‌ది ట్రాన్స్‌ఫార్మర్‌లాంటి బాడీ. మేఘాంశ్ యాక్టింగ్ చూసి అందరం ఆశ్చర్యపోయేవాళ్లం. సెట్లో అందరి కంటే ముందుంటాడు. రియల్ స్టార్ కొడుకు అంటే ఇలానే

దివంగత నటుడు శ్రీహరి 62వ జయంతిని కుటుంబ సభ్యులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. దివంగత నటుడు శ్రీహరి 62వ జయంతిని కుటుంబ సభ్యులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఆగస్టు 15న బాచుపల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో సమాధికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హీరో మేఘాంశ్ శ్రీహరి మాట్లాడుతూ తన తండ్రిని గుర్తు చేసుకున్నారు. ‘‘ఈరోజు నాన్నగారి 62వ బర్త్ డే. ఆయన జయంతిని ఘనంగా నిర్వహించాం. ఈ మండపం పక్కనే మా చెల్లి అక్షరకు సంబంధించిన స్మారకం కూడా ఉంది. నాన్నగారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు, ఆశీస్సులు ఎప్పటికీ మాతోనే ఉంటాయి’’ అని అన్నారు. తన తండ్రి జయంతి సందర్భంగా తాను నటిస్తున్న ‘ఆస్మాన్’ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తున్నట్లు మేఘాంశ్ తెలిపారు. ఈ సినిమా కోసం తామంతా ఎంతో కష్టపడ్డామని, ప్రేక్షకుల సపోర్ట్ కావాలని కోరారు. శాంతి శ్రీహరి మాట్లాడుతూ ‘‘ఈరోజు బావ శ్రీహరి 62వ పుట్టినరోజు. ఆయన ఈరోజు మన మధ్య లేకపోయినా ఎప్పటికీ మన హృదయాల్లోనే ఉంటారు. ఆయన జ్ఞాపకాలను ప్రతి ఏడాది ఇలాగే గుర్తు చేసుకుంటున్నాం' అని తెలిపారు
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆటలో భారత జట్టు పూర్తి ఆధిపత్యం చెలాయించింది. అయితే, 162 బంతుల్లో 77 పరుగులు చేసి నిలకడగా ఆడుతున్న సీనియర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ మూడో సెషన్లో కండరాల నొప్పుల (క్రాంప్స్) కారణంగా మైదానాన్ని వీడటం తీవ్ర ఆందోళన కలిగించింది. దీనిపై మ్యాచ్ అనంతరం భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ విలేకరుల సమావేశంలో కీలక అప్డేట్ ఇచ్చారు. రాహుల్‌కు తీవ్రమైన గాయమేమీ కాలేదని, కేవలం డిహైడ్రేషన్, క్రాంప్స్ వల్ల మాత్రమే వెనుతిరిగాడని, ప్రస్తుతం అతడు పూర్తిగా కోలుకున్నాడని స్పష్టం చేశారు.దేవదత్ పడిక్కల్‌తో కలిసి రాహుల్ రెండో వికెట్‌కు 150 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడని, జట్టు కంట్రోల్లోకి రావడంలో కీలక పాత్ర పోషించాడని కోచ్ ప్రశంసించారు. "కేఎల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. శరీరం అంతటా క్రాంప్స్ రావడంతో ఇబ్బంది పడ్డాడు, కానీ ఇప్పుడు అతడు బాగున్నాడు. టెస్టుల్లో ఓపెనింగ్, వన్డేల్లో నెంబర్ 5 లేదా 6లో ఆడుతూ జట్టు కోసం ఏ పాత్రనైనా పోషించే ఫిజిబిలిటీ రాహుల్ సొంతం" అని సితాంశు కోటక్ కొనియాడారు.ఇదే సమయంలో 2024 ఆస్ట్రేలియా (ప్యాసెంజర్ పెర్త్) టెస్ట్ తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చి తన తొలి అంతర్జాతీయ టెస్ట్ సెంచరీ (178 బంతుల్లో 131*) సాధించిన దేవదత్ పడిక్కల్‌పై కోచ్ ప్రశంసల జల్లు కురిపించారు. గత రెండేళ్లుగా పడిక్కల్ పడ్డ కష్టానికి, సాధన చేసిన విధానానికి ఇది సరైన ప్రతిఫలమని చెప్పారు. పడిక్కల్‌తో పాటు సాయి సుదర్శన్ కూడా అద్భుతంగా ఆడుతున్నారని, ముఖ్యంగా లంక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్యపై పడిక్కల్ చూపిన అటాకింగ్ మైండ్‌సెట్ (స్వీప్‌లు, షాట్లు) అద్భుతమని తెలిపారు.ఇక ఈ టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 73 ఓవర్లలో 288/2 పరుగుల వద్ద పటిష్ట స్థితిలో నిలిచింది. వర్షం అంతరాయం కలిగించడంతో కేవలం 73 ఓవర్ల ఆట

Yashasvi Jaiswal Run Out: క్రికెట్ మైదానంలో ఊహించని నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. సింగిల్ తీసే క్రమంలో బౌలర్‌ను ఢీకొని యశస్వి జైస్వాల్ కిందపడిపోవడం, కేఎల్ రాహుల్‌తో సమన్వయ లోపం వెరసి అనూహ్యంగా వికెట్ సమర్పించుకోవాల్సి వచ్చింది. కీపర్ డిక్వెల్లా సంకోచించినా శ్రీలంక కెప్టెన్ నైతికత పక్కనపెట్టి వ్యవహరించిన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో కేశర నువంత బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ బంతిని మిడ్-ఆన్ దిశగా ఆడాడు. సులువైన సింగిల్ కోసం రాహుల్ వెంటనే పరుగు ప్రారంభించాడు. అదే సమయంలో బంతిని ఆపే క్రమంలో బౌలర్ నువంత కుడివైపునకు డైవ్ చేయగా, నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న జైస్వాల్‌కు అడ్డుపడ్డాడు. బ్యాలెన్స్ తప్పిన జైస్వాల్ నేరుగా పిచ్‌పై కిందపడిపోయాడు. అప్పటికే రాహుల్ సగం క్రీజు దాటేయడంతో అసలు హైడ్రామా మొదలైంది. కిందపడిన జైస్వాల్ వెంటనే లేచి పరుగు కోసం ముందుకు అడుగు వేసి పచ్చజెండా ఊపాడు. అప్పటికే ఆగిపోయిన రాహుల్ ఆ సైగ చూసి మళ్లీ క్రీజులోకి పరుగెత్తాడు. సరిగ్గా అదే క్షణంలో జైస్వాల్ వెనక్కి తగ్గి బౌలర్ ఎండ్‌కు చేరుకునే ప్రయత్నం చేశాడు. ఇద్దరూ ఒకే ఎండ్‌కు చేరుకోగా, రాహుల్ ముందుగా క్రీజులో బ్యాట్ పెట్టడంతో జైస్వాల్ రనౌట్‌గా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఎక్కువమంది చదివినది: 41 సిక్సర్లు, 39 ఫోర్లతో 487 పరుగులు.. భారీ ప్రపంచ రికార్డ్‌తో టీ20 హిస్టరీనే షేక్ చేశారుగా..! నిరోషన్ డిక్వెల్లా తడబాటు.. కెప్టెన్ సైగతో అప్పీల్.. Jaiswal dismissed fro 32 runs. #INDvsSL #KLRahul #BCCI #Teamindia ఫీల్డర్ ప్రభాత్ జయసూర్య విసిరిన బంతిని అందుకున్న వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లా వెంటనే బెయిల్స్ ఎగరగొట్టలేదు. బౌలర్ డైవ్ చేయడం వల్లే జైస్వాల్ కిందపడ్డాడన్న విషయం కీపర్‌కు అర్థమైంది. అప్పీల్ చేయాలా వద్దా అన్న సందిగ్ధంలో స్లిప్‌లో ఉన్న కెప్టెన్ ధనంజయ డి సిల్వా (డీడీఎస్) వైపు డిక్వెల్లా చూశాడు. అప్పీల్

నటీనటులు : వాసవి గణేశన్, అన్ష్, గోవర్ధన్ రెడ్డి, రమేష్ నకిరేకంటి, అంజి తదితరులు దర్శకత్వం : భిక్షు సంగీతం : చరణ్ అర్జున్ నిర్మాత : వెంకట్ యాదవ్ సినిమాటోగ్రఫీ : రుద్ర సాయి ఎడిటింగ్ : మార్తాండ్ కే వెంకటేష్ ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన తాజా చిత్రాల్లో బోల్డ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం “హుషార్ పిట్టలు” కూడా ఒకటి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఓ చిన్నపాటి గ్రామానికి చెందిన టీనేజర్స్ రవి (అన్ష్), చిట్టి (వాసవి గణేశన్) లలో రవి అప్పుడే పదో తరగతి పూర్తి చేసి ఇంటర్ కి వస్తాడు. చిట్టి స్కూల్ స్టేజి లోనే ఉంటుంది కానీ ఇద్దరూ ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులై హద్దులు దాటి ప్రవర్తించడం మొదలు పెడతారు. కానీ వీరిపైనే పంచ ప్రాణాలు పెట్టుకున్న వారి తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలు బాగుపడతారు. పెద్ద స్థాయికి వెళతారు అని భావిస్తారు. ఈ క్రమంలో రవి, చిట్టిలు ఏం చేశారు? తమ తల్లిదండ్రుల మాట విని మారారా లేదా? ఈ ప్రాసెస్ లో వారు తెలుసుకున్నది ఏంటి? ఈ చిత్రం ద్వారా దర్శకుడు ఇచ్చిన సందేశం ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ చిత్రంలో మొదటిగా మాట్లాడుకోవాలింది మాత్రం దర్శకుడు తీసుకున్న బోల్డ్ అటెంప్ట్ కోసమే అని చెప్పాలి. తాను ఇచ్చిన సందేశం ఇందులో చాలా బాగుంది. ప్రస్తుతం ఉన్న జెనరేషన్ లో టీనేజ్ లో ఉన్న పిల్లలు ఎలా పాడైపోతున్నారు అనే అంశాన్ని నిక్కచ్చిగా కళ్ళకి కట్టినట్టు చూపించేసారు. పైగా దీనికి సాలిడ్ కామెడీ ఎలిమెంట్స్ ని కూడా యాడ్ చేయడం సినిమాలో బాగుంది. ఫస్టాఫ్, సెకండాఫ్ లలో కొన్ని కామెడీ సీన్స్ తో పాటుగా అక్కడక్కడా ఆలోచింపజేసే సన్నివేశాలు ఇందులో యాడ్ చేయడం

అంతా కొత్తవారితో తెరకెక్కిన చిత్రం ‘హుషారు పిట్టలు’. అన్ష్, వాసవి గణేషన్ జంటగా బిక్షు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వెంకట్ యాదవ్ నిర్మించారు. టీజర్, ట్రైలర్‌తో విపరీతంగా బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. సినిమా రివ్యూ: హుషారు పిట్టలు (Husharu Pittalu Review) అంతా కొత్తవారితో తెరకెక్కిన చిత్రం ‘హుషారు పిట్టలు’. అన్ష్, వాసవి గణేషన్ జంటగా బిక్షు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వెంకట్ యాదవ్ నిర్మించారు. టీజర్, ట్రైలర్‌తో విపరీతంగా బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. యువతను టార్గెట్ చేసి తీసిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో చూద్దాం. మాసినపల్లి రవి (అన్ష్) చదువులో ఫస్ట్. పదో తరగతిలో స్కూల్ ఫస్ట్ ర్యాంక్ సాధిస్తాడు. అదే ఊళ్లో ఉండే చిట్టి (వాసవి గణేషన్) రవిపై ఇష్టం పెంచుకుంటుంది. అయితే రవికి ప్రేమ, ఎట్రాక్షన్ ఇవేమీ తెలీదు. అతని ప్రపంచం అంతా చదువే! అతని చుట్టూ ఉండే బ్యాచ్‌లో ఉండే బాలన్న రవిని ప్రభావితం చేసి తప్పుదారిలోకి తీసుకెళ్లాడు. అతని మాటలకు, చేష్టలకు ఎట్రాక్ట్ అయిన రవి చిట్టితల్లి ప్రేమలో పడతాడు. యుక్త వయసులో వచ్చే మార్పులు, అవగాహన లేమీ ఇద్దరిని దారి తప్పి, హద్దులు దాటే దాకా తీసుకెళ్తుంది. వీరిద్దరి వ్యవహారం తెలిసిన చిట్టి అక్క శైలు (ప్రణీ రెడ్డి)కి హెచ్చరించినా వినే పరిస్థితిలో రవి, చిట్టి ఉండరు. హద్దు దాటిన విషయం ఇరు కుటుంబాల్లో తెలియడంతో వీరిద్దరి పరిస్థితులు తారుమారవుతాయి. దీంతో ఇరు కుటుంబాలు ఎలా స్పందించాయి. చిన్న వయసులో తెలిసీతెలియక చేసిన తప్పు ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? రవి, చిట్టి జీవితాలు ఏమయ్యాయి? అన్నది కథ. స్కూలింగ్ పూర్తయిన ఓ యువకుడు

సాధారణంగా చిత్ర పరిశ్రమలో సినీ ప్రముఖుల, హీరోల వారసులు కథానాయకులుగా ఎంట్రీ ఇవ్వడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. టాలీవుడ్లో అధిపత్యం వహిస్తున్న మెజారిటీ హీరోలు ఇలా సినీ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచే వచ్చినవారే. సాధారణంగా చిత్ర పరిశ్రమలో సినీ ప్రముఖుల, హీరోల వారసులు కథానాయకులుగా ఎంట్రీ ఇవ్వడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. టాలీవుడ్లో అధిపత్యం వహిస్తున్న మెజారిటీ హీరోలు ఇలా సినీ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచే వచ్చినవారే. అయితే రాజకీయ నాయకుల కుటుంబాల నుంచి కథానాయకులుగా రావడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు కీ.శే. నారా రామ్మూర్తి నాయుడు కుమారుడైన నారా రోహిత్ బాణం చిత్రంతో కథానాయకుడిగా పరిచయమై, తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే ఇటీవల కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి జూనియర్ చిత్రంతో టాలీవుడ్లోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు ఇదే క్రమంలో తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రముఖమైన కుటుంబం నుంచి మరొక వారసుడు వెండితెరపైకి రావడానికి సిద్ధమవుతున్నట్లు టాక్ నడుస్తోంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) మనవడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు టాలీవుడ్లోకి ప్రవేశించనున్నాడనే వార్తలు ఫిలిం నగర్ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ విపరీతంగా ప్రచారమవుతున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో, సంగీత ప్రపంచంలో తన ప్రతిభతో గుర్తింపు తెచ్చుకున్న హిమాన్షు, ఇప్పుడు కథానాయకుడిగా ఒక పవర్ఫుల్ ప్రాజెక్ట్‌తో వెండితెరపై కనిపించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని టాక్ నడుస్తోంది. దీనికోసం హిమాన్షు ప్రత్యేకంగా నటన, బాడీ లాంగ్వేజ్‌పై దృష్టి పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిన్నతనంలో కొద్దిగా బొద్దుగా ఉన్న ఈ కుర్రాడు.. వయస్సు పెరిగేకొద్ది బరువు తగ్గి అందంగా తయారయ్యాడు. అందుతున్న సమాచారం ప్రకారం కేటీఆర్ కొడుకును గ్రాండ్ గా లాంచ్ చేయడానికి తగిన దర్శకుడు వేటలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి

Himanshu Rao:తెలంగాణ రాజకీయాల్లో ప్రముఖ కుటుంబానికి చెందిన మరో యువకుడు త్వరలో టాలీవుడ్లోకి అడుగుపెట్టబోతున్నాడనే వార్తలు ఆసక్తిని పెంచుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావు సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉందంటూ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హిమాన్షు రావు ఇప్పటివరకు రాజకీయాలకు దూరంగానే ఉంటూ తన చదువు, ఇతర కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. అయితే ఆయనకు సినిమాలు, సంగీతం వంటి రంగాలపై ఆసక్తి ఉందనే విషయం గతంలో కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు ఆయన టాలీవుడ్లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం మొదలైంది. హిమాన్షుకు చిన్న వయసులోనే ఓ షార్ట్ ఫిల్మ్‌లో నటించే అవకాశం వచ్చినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే అప్పట్లో చదువుపై దృష్టి పెట్టడంతో ఆ అవకాశాన్ని ఆయన తీసుకోలేదని సమాచారం. ఇప్పుడు మాత్రం సినిమాలపై ఆసక్తితో టాలీవుడ్లోకి రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. అయితే హిమాన్షు ఏ సినిమాలో నటించబోతున్నారు? ఆయనను ఏ దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు? ఏ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది? అనే విషయాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఆయన హీరోగానే ఎంట్రీ ఇస్తారా లేక సినిమాల్లో మరో విభాగంలోకి వస్తారా అన్నది కూడా స్పష్టంగా తెలియదు. హిమాన్షు గతంలో సామాజిక కార్యక్రమాలతో కూడా వార్తల్లో నిలిచారు. ఓ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్న విషయం అప్పట్లో చర్చనీయాంశమైంది. సంగీతంపై కూడా ఆయనకు ఆసక్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మరో తెలంగాణ రాజకీయ కుటుంబానికి చెందిన యువకుడు కూడా టాలీవుడ్లోకి వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ కుటుంబానికి చెందిన ఓ యువకుడు సినిమాల్లోకి రావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. సంతోష్ కుమార్ 2018 నుంచి 2024 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఆయన ప్రారంభించిన గ్రీన్ ఇండియా

Vaibhav Sooryavanshi: భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ఆటతీరుతో నిరంతరం వార్తల్లో నిలుస్తున్నారు. ఇంగ్లాండ్ పర్యటనలో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అనంతరం, జింబాబ్వే సిరీస్‌లో అసాధారణ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం రాబోయే దేశవాళీ క్రికెట్ సీజన్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన పంచుకున్న ఒక వీడియోలో, నెట్స్‌లో డిఫెన్స్‌తో పాటు భారీ షాట్లు ఆడుతూ తీవ్రంగా శ్రమిస్తున్నట్లు కనిపించింది. Preparation అనే ఒకే ఒక్క క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియో, ఆయన రాబోయే రెడ్ బాల్ క్రికెట్ సవాలుకు ఎంత సిద్ధంగా ఉన్నారో తెలియజేస్తోంది. ఇటీవల ముగిసిన జింబాబ్వే పర్యటన వైభవ్‌కు ఎంతో బాగా కలిసివచ్చింది. మూడు టీ20 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 151 పరుగులు సాధించి సిరీస్‌లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచారు. ఈ క్రమంలో 50.33 సగటు, 196.10 స్ట్రైక్ రేట్‌తో చెలరేగిపోవడమే కాకుండా, ఒక ఇన్నింగ్స్‌లో 81 రన్స్ బాదారు. ఆయన అందించిన అద్భుతమైన ప్రదర్శనకు గాను ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు వరించింది. భారత్ కూడా కొత్త టీ20 కెప్టెన్సీ నేతృత్వంలో ఈ సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్ ద్వారా వైభవ్ అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. ఆ సమయంలో ఆయన వయస్సు కేవలం 15 సంవత్సరాల 99 రోజులు మాత్రమే. దీని ద్వారా భారతదేశం తరఫున అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు ఆడిన 6 టీ20 మ్యాచ్‌ల్లో 189.21 స్ట్రైక్ రేట్‌తో 193 పరుగులు సాధించడమే కాక, అందులో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉండటం విశేషం. వేగంగా దూసుకుపోతున్న వైభవ్ కెరీర్లో మరో మైలురాయి చేరింది. రాబోయే దులీప్ ట్రోఫీ కోసం ఈస్ట్ జోన్ సెలెక్టర్లు ఇషాన్ కిషన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయగా, వైభవ్ సూర్యవంశీకి వైస్

భారత క్రికెట్ రంగాన్ని శాసిస్తున్న 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ మైదానంలోనే కాకుండా ప్రకటనల ప్రపంచంలోనూ సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట దశాబ్దాలుగా భద్రంగా ఉన్న అత్యంత పిన్న వయస్కుడి అంతర్జాతీయ అరంగేట్రం రికార్డును ఈ యువ ఆటగాడు బద్దలు కొట్టాడు. మైదానంలో చూపిస్తున్న అసాధారణ ప్రతిభతో పాటు అతని స్వచ్ఛమైన ఇమేజ్ వల్ల ఇప్పుడు దేశంలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థల దృష్టి అతడిపై పడింది. ప్రఖ్యాత బ్రాండ్లు తమ ఉత్పత్తుల ప్రచారానికి అతడిని ఎంచుకోవడానికి పోటీపడుతున్నాయి. 2011 మార్చి 27న బీహార్‌లోని సమస్తీపూర్ జిల్లా తాజ్‌పూర్‌లో వైభవ్ సూర్యవంశీ జన్మించాడు. చిన్నతనం నుంచే క్రికెట్‌పై ఉన్న మక్కువతో 12 ఏళ్ల వయస్సులోనే రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించాడు. అనంతరం 13 ఏళ్లకే ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కించుకొని, 14 ఏళ్ల వయస్సులో ఐపీఎల్లో వీరవిహారం చేస్తూ అద్భుతమైన సెంచరీ సాధించాడు. 1989లో సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల 205 రోజుల వయస్సులో సాధించిన రికార్డును దాటి, 2026 జూలై 4న మాంచెస్టర్‌లో ఇంగ్లండ్‌పై 15 ఏళ్ల 99 రోజుల వయస్సులో భారత టీ20 జట్టు తరఫున ఆడి రికార్డు నమోదు చేశాడు. 2026 ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ సూర్యవంశీ 16 మ్యాచ్‌ల్లో ఏకంగా 776 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అతడు ఆరెంజ్ క్యాప్‌తో పాటు అత్యంత విలువైన ఆటగాడిగా ఎంవీపీ అవార్డును సొంతం చేసుకున్నాడు. దీంతో అతని స్ట్రైక్ రేట్ 237 దాటడమే కాకుండా, సీజన్ మొత్తంలో 72 సిక్సర్లు బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇదిలా ఉండగా మైదానంలో చూపిన ఈ విధ్వంసకర ప్రదర్శన అతడికి జాతీయ జట్టులో చోటు కల్పించడమే కాకుండా బ్రాండ్ మార్కెట్లో అతడి విలువను అమాంతం పెంచేసింది. ఈ అసాధారణమైన విజయాల ఫలితంగా ప్రముఖ హెల్త్ డ్రింక్ బ్రాండ్ కాంప్లాన్ అతడిని

భారత క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్నాడు 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత జట్టులోకి అడుగుపెట్టి, అతి పిన్న వయసులో దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును వైభవ్ బద్దలుకొట్టాడు. మైదానంలో తన అద్భుత ప్రదర్శనలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ యువ కెరటం, ఇప్పుడు బ్రాండ్ల ప్రపంచంలోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. అతి చిన్న వయసులోనే అతని బ్రాండ్ విలువ కోట్లకు పడగలెత్తింది.ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన తర్వాత వైభవ్ బ్రాండ్ విలువ అమాంతం పెరిగింది. నివేదికల ప్రకారం.. ప్రస్తుతం అతను ఒక్కో బ్రాండ్ ఎండార్స్మెంట్ కోసం కోటి రూపాయలకు పైగా వసూలు చేస్తున్నాడు. ఐపీఎల్ జీతం, మ్యాచ్ ఫీజులు, దేశవాళీ క్రికెట్, బ్రాండ్ ఒప్పందాల ద్వారా ఇప్పటికే అతని నికర ఆస్తి రూ. 7 కోట్ల నుంచి రూ. 10 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. ఇంత చిన్న వయసులో భారీ వాణిజ్య ఒప్పందాల ఒత్తిడి లేకుండా అతని కుటుంబం జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, ప్రముఖ బ్రాండ్లు అతని కోసం క్యూ కడుతున్నాయి.ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ పలు పెద్ద బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. ప్రముఖ స్పోర్ట్స్ పరికరాల సంస్థ 'సరీన్ స్పోర్ట్స్ (ఎస్ఎస్)'తో అతను ఏడాదికి రూ. 50 లక్షల విలువైన ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ సంస్థ 'వైభవ్ సూర్యవంశీ ఎడిషన్' పేరుతో ప్రత్యేక బ్యాట్లను కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. హెల్త్ డ్రింక్ 'కంప్లాన్' కోసం "థోడా ప్లాన్, థోడా కంప్లాన్" యాడ్

Brett Lee Comments on Vaibhav Suryavanshi: తన తుఫాన్ బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను షేక్ చేస్తున్న 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ వయస్సు వివాదంపై ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం బ్రెట్ లీ ఘాటుగా స్పందించారు. వివాదాలకు చెక్ పెడుతూ అతడిని టీమిండియా సాధించిన అరుదైన రత్నంగా ఆకాశానికెత్తిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం. ఐపీఎల్ 2026 సీజన్లో మైదానంలో పరుగుల సునామీ సృష్టిస్తూ ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. అయితే అతడి ఆట కంటే కూడా వయస్సు ఎంత అనే అంశంపైనే సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చలు, వివాదాలు చెలరేగుతున్నాయి. ఈ అంశంపై తాజాగా ఆస్ట్రేలియా పేస్ దిగ్గజం బ్రెట్ లీ స్పందించారు. వైభవ్ వయస్సుపై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన పూర్తిగా కొట్టిపారేశారు. ప్రపంచమంతా అతనికి నిజంగానే 15 ఏళ్లా కాదా అని ఆరా తీస్తోందని, కానీ తనకు ఆ వయస్సుతో అసలు సంబంధమే లేదని స్పష్టం చేశారు. అతడికి 15 ఏళ్లున్నా, 17 లేదా 18 ఏళ్లు ఉన్నా వచ్చిన నష్టమేమీ లేదని పేర్కొన్నారు. ఎక్కువమంది చదివింది: Video: 6,6,6,6,4.. 15 బంతుల్లో బీభత్సం.. 213 స్ట్రైక్‌రేట్‌తో టెస్ట్ ఫార్మాట్‌కే ఇచ్చిపడేసిన హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్! ఆ కుర్రాడికి అద్భుతంగా క్రికెట్ ఆడే నైపుణ్యం ఉందంటూ ప్రశంసించిన బ్రెట్ లీ, టీమిండియాకు ఒక అరుదైన రత్నం దొరికిందని కొనియాడారు. ఒకవేళ తాను బౌలింగ్ చేస్తుంటే ఈ చిన్నోడిని ఎలా ఎదుర్కొనేవాడో సరదాగా వివరించారు. షార్ట్ బాల్స్ బాగా ఆడే బ్యాటర్లు అంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన ఆసీస్ లెజెండ్, అతడి ఛాతీ పైకి గట్టిగా బౌన్సర్లు వేసేవాడినని అన్నారు. తన బౌలింగ్‌లో వైభవ్ సిక్స్ కొట్టినా సరే అస్సలు తగ్గకుండా, మళ్లీ ఇంకొక షార్ట్ బాల్ వేసి మైదానంలోనే సవాల్ విసిరేవాడినని బ్రెట్ లీ చెప్పుకొచ్చారు. ఒత్తిడి పెంచకండి - స్వేచ్ఛగా
భారత క్రికెట్ చరిత్రలో శ్రీలంక పర్యటనలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా 2000 తర్వాత లంక గడ్డపై ప్రతిష్టాత్మకమైన రెడ్ బాల్ క్రికెట్లో భారత్ తరఫున అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించిన ఆటగాళ్లు నలుగురు మాత్రమే ఉన్నారు. 2010లో అభిమన్యు మిథున్‌తో పాటు డాషింగ్ ఆల్ రౌండర్ సురేష్ రైనా లంకలోనే తమ తొలి టెస్ట్ మ్యాచ్ ఆడారు. ఆ తదుపరి 2015లో వికెట్ కీపర్ బ్యాటర్ నమన్ ఓజా, 2017లో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా శ్రీలంకలోనే భారత టెస్ట్ క్యాప్‌ను అందుకున్నారు.ఇప్పుడు 2026లో మరోసారి భారత్, శ్రీలంక వేదికగా టెస్టు సిరీస్ ఆడుతున్న తరుణంలో, ఈ ప్రతిష్టాత్మక జాబితాలోకి మరో నయా ప్లేయర్ వచ్చి చేరే అవకాశం కనిపిస్తోంది. జట్టులో చోటు దక్కించుకున్న యువ ఆటగాళ్లలో ప్రధానంగా ఆకిబ్ నబీ, సారాంశ్ జైన్, గుర్నూర్ బ్రార్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఏ ఒక్కరు గాలేలో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌లో తుది జట్టులోకి వచ్చినా, లంక గడ్డపై టెస్ట్ డెబ్యూ చేసిన ఐదో భారత ఆటగాడిగా నిలుస్తారు.రసవత్తరంగా సాగుతున్న ఈ రేసులో జమ్మూ కశ్మీర్‌కు చెందిన రైట్ ఆర్మ్ పేసర్ ఆఖిబ్ నబీ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన జస్ప్రీత్ బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన నబీ, రంజీ ట్రోఫీలో అత్యుత్తమ బౌలింగ్‌తో మెరిశాడు. అదే సమయంలో పంజాబ్ విజిట్ టూర్ నుంచి ఎదిగిన గుర్నూర్ బ్రార్ కూడా లంక-ఏ తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లలో ఏకంగా 10 వికెట్ల సాధించి మేనేజ్మెంట్ దృష్టిని ఆకర్షించాడు. ఇక ఆల్ రౌండ్ స్పిన్నర్ సారాంశ్ జైన్ కూడా తుది బెర్త్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు.శ్రీలంక పిచ్‌లపై స్పిన్‌తో పాటు లెంగ్త్ బౌలింగ్‌కు అనుకూలించే పరిస్థితులు ఉండటంతో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కోచ్ గౌతమ్ గంభీర్ ఏ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతారనేది ఉత్కంఠగా మారింది. ఓవైపు సీనియర్ల అనుభవం, మరోవైపు యంగ్

శారీరక, మానసిక సమస్యలు కొంతమంది జీవితానికి సవాలు విసురుతుంటాయి.. తమ లక్ష్యాల్ని చేరుకోకుండా అడ్డుపడాలని చూస్తాయి. అయితే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్ని దాటుకొని మరీ తమను తాము నిరూపించుకుంటున్నారు కొందరు అమ్మాయిలు. హిమాన్షికా శర్మ ఇదే కోవకు చెందుతుంది.... శారీరక, మానసిక సమస్యలు కొంతమంది జీవితానికి సవాలు విసురుతుంటాయి.. తమ లక్ష్యాల్ని చేరుకోకుండా అడ్డుపడాలని చూస్తాయి. అయితే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్ని దాటుకొని మరీ తమను తాము నిరూపించుకుంటున్నారు కొందరు అమ్మాయిలు. హిమాన్షికా శర్మ ఇదే కోవకు చెందుతుంది. అరుదైన ఎముక సమస్య కారణంగా టీనేజ్లోనే చక్రాల కుర్చీకి పరిమితమైన ఆమె.. తన శారీరక స్థితిని చూసుకొని అధైర్యపడలేదు. తానెలా ఉన్నా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలనుకుంది. ఈ పట్టుదలే నేడు ఆమెను ఫ్రీలాన్స్ రైటర్‌గా, కంటెంట్ స్ట్రాటజిస్ట్‌గా ఎదిగేలా చేసింది. ‘కోల్పోయిన వాటి గురించి బాధపడకుండా.. అందివచ్చిన అవకాశాల్ని అందుకున్నప్పుడే కెరీర్‌ని నిర్మించుకోగలం..’ అంటోన్న హిమాన్షిక సక్సెస్ స్టోరీ ఇది! అవి చేదు జ్ఞాపకాలు! చండీగఢ్‌లో పుట్టి పెరిగింది హిమాన్షిక. ఎనిమిదేళ్ల వరకు అందరు పిల్లల్లా ఆరోగ్యంగా, ఆడుతూపాడుతూ పెరిగింది. అయితే ఈ సమయంలోనే ఆమె శరీరంలో మార్పులు మొదలయ్యాయి. కీళ్లు వంగిపోవడం, వంకరపోవడం గుర్తించింది. ఇదంతా ‘జువెనైల్ రుమటాయిడ్ ఆర్థ్రైటిస్’ అనే ఆటోఇమ్యూన్ వ్యాధి వల్లే అని వైద్యులు తేల్చారు. ‘నా చిన్నతనంలో నేను ఆనందంగా గడిపిన రోజులు నాకు గుర్తులేవు. తరచూ ఆస్పత్రుల చుట్టూ తిరగడం, ఇంజెక్షన్లు, చికిత్సలు.. వీటితోనే నా బాల్యం గడిచిపోయింది. నన్ను తిరిగి మామూలు మనిషిని చేయాలని అమ్మానాన్నలు చేయని ప్రయత్నమంటూ లేదు. కానీ అది జరగలేదు. మోకాళ్లు, మణికట్టు, చేతి వేళ్లు, మెడ, నడుము.. ఇలా ఒక్కో శరీర భాగాన్నీ డ్యామేజ్ చేసిన ఈ వ్యాధి కారణంగా అందమైన స్కూల్ డేస్‌ని మిస్సయ్యా.. ఏళ్ల తరబడి నాలుగ్గోడలకే పరిమితమవ్వాల్సి వచ్చింది. ఓ రోజు మెట్లు దిగలేక ఏడుస్తుంటే నాన్నే నన్ను కిందికి మోసుకొచ్చిన సందర్భాన్ని

అన్షు, వాసవీ గణేశన్ జంటగా నటించిన 'హుషార్ పిట్లలు' చిత్రం ఆగస్ట్ 15న విడుదల కాబోతోంది. ఈ సినిమాను ఏషియన్ సురేశ్ ఫిలిమ్స్ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేయబోతోంది. అన్షు, వాసవి గణేషన్ జంటగా రూపొందుతోన్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం 'హుషారు పిట్టలు'. వెంకట్ యాదవ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బిక్షు దర్శకుడు. ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఫిలింస్ సంస్థలు ఆగస్టు 15న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను మేకర్స్ సోమవారం ఉదయం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు విచ్చేసి ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, 'కొన్ని నెలల ముందు బెక్కెం వేణుగోపాల్ ద్వారా ఈ సినిమా గురించి తెలిసింది. తెలంగాణ నుంచి వచ్చిన దర్శక, నిర్మాతలు ఎంతో పాషన్‌తో సినిమా తీశారు. మా సురేష్ ప్రొడక్షన్స్ ప్రతినిధులు ఈ సినిమా చూసి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వడంతో ఈ సినిమాను మా సురేష్ ఏషియన్ ఫిలింస్ ద్వారా విడుదల చేస్తున్నాం. ఈ సినిమా విషయంలో ఎదురైన అన్ని కష్టాలు దాటుకుని ఈ స్టేజ్‌కు వచ్చారు. వాళ్ల ఎగ్రెసివ్‌తో ఈ సినిమాను మార్కెటింగ్ చేస్తున్నారు. తప్పకుండా అందరి టైమ్‌కు, డబ్బుకు విలువ నిచ్చే సినిమా ఇది అని నమ్ముతున్నారు. విడుదలకు ముందే కొన్ని షోలు వేస్తున్నారు. ఆ పాజిటివ్ ఫీడ్‌బ్యాక్‌తో.. మౌత్ టాక్‌తో ఈ సినిమా మరింత మందికి రీచ్ అవుతుంది. తప్పకుండా ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు. సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ మాట్లాడుతూ, 'ఈ చిత్రం ఎంతో నేచురల్‌గా ఉంటుంది. ఈ సినిమా చూస్తే అందరికి మీ ఊరికి వెళ్లొచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. నా హృదయానికి తాకిన సినిమా ఇది. నేను ఎప్పట్నుంచో కోరుకుంటున్న సక్సెస్ ఈ సినిమాతో దక్కుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమా విజయంతో నాకు సినీ

భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ పేసర్ బ్రెట్ లీ ప్రశంసల వర్షం కురిపించాడు. వైభవ్ వయసు చుట్టూ జరుగుతున్న చర్చ అనవసరమని, అతనిలో అపారమైన ప్రతిభ ఉందని, భారత క్రికెట్‌కు సుదీర్ఘకాలం సేవలు అందించగలడని అభిప్రాయపడ్డాడు. ఇటీవలే 'బీర్ బైసెప్స్' అనే యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ బ్రెట్ లీ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు."భారత్ బయట, ప్రపంచవ్యాప్తంగా అందరూ వైభవ్ వయసు నిజంగా 15 ఏళ్లేనా? అని చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఇదే అతిపెద్ద టాకింగ్ పాయింట్. కానీ, అతడి వయసు ఎంతైతే నాకేంటి? 15 అయినా, 17 లేదా 18 అయినా పర్వాలేదు. ఈ కుర్రాడు అద్భుతంగా క్రికెట్ ఆడగలడు. భారత క్రికెట్‌కు దొరికిన గొప్ప ఆటగాడు. భవిష్యత్తులో అతను మరెన్నో గొప్ప విజయాలు సాధించబోతున్నాడు" అని బ్రెట్ లీ పేర్కొన్నాడు.ఐపీఎల్ 2026 సీజన్లో వైభవ్ సూర్యవంశీ తన భయంలేని ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షించాడు. బౌలర్ల పేరు, ప్రతిష్ఠలతో సంబంధం లేకుండా తనదైన శైలిలో భారీ షాట్లతో చెలరేగాడు. అతని అసాధారణమైన బ్యాట్ స్పీడ్, దూకుడైన బ్యాటింగ్ అతన్ని టోర్నమెంట్‌లోని యువ స్టార్లలో ఒకడిగా నిలబెట్టాయి. ఐపీఎల్లో కనబరిచిన ఈ అద్భుత ప్రదర్శనతోనే, అతనికి భారత టీ20 జట్టు నుంచి పిలుపు వచ్చింది. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో పెద్దగా రాణించకపోయినా, జింబాబ్వే పర్యటనలో అద్భుతంగా పుంజుకుని 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచాడు. ఇది ఎటువంటి ఒత్తిడిలోనైనా రాణించగల అతని సామర్థ్యాన్ని తెలియజేసింది.వైభవ్ బ్యాటింగ్‌లోని పరిణతిని బ్రెట్ లీ ప్రత్యేకంగా

కేవలం 15 ఏళ్ల వయసులోనే క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపై ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ ప్రశంసలు కురిపించాడు. వయసు గురించి జరుగుతున్న చర్చను పక్కనపెట్టి, మైదానంలో అతను చూపిస్తున్న ప్రతిభను మాత్రమే చూడాలని లీ సూచించాడు. సూర్యవంశీ భవిష్యత్తులో మరిన్ని గొప్ప విజయాలు సాధిస్తాడని ఆయన అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2026లో సూర్యవంశీ తన ఫియర్లెస్ బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. పెద్ద పేరున్న బౌలర్లు, వారి ప్రతిష్ట తన బ్యాటింగ్‌ను ప్రభావితం చేయకుండా అటాకింగ్ క్రికెట్ ఆడాడు. విస్తృత శ్రేణి షాట్లు, అద్భుతమైన బ్యాట్ స్పీడ్‌తో వేగంగా పరుగులు సాధిస్తూ టోర్నమెంట్లో అత్యంత చర్చనీయాంశమైన యువ ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. ఐపీఎల్‌లోని ప్రదర్శనలతో సూర్యవంశీకి భారత టీ20 జట్టులో చోటు దక్కింది. ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో అంతర్జాతీయ క్రికెట్‌ను కొంత నెమ్మదిగా ప్రారంభించినప్పటికీ, జింబాబ్వే పర్యటనలో అతను పుంజుకున్నాడు. ఆ సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచి తన ప్రతిభను మరోసారి చాటుకున్నాడు. సూర్యవంశీ వయసుపై ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చపై బ్రెట్ లీ స్పందించాడు. అతనికి 15 ఏళ్లే అయితే అద్భుతమేనని, 17 లేదా 18 ఏళ్లు ఉన్నా తన ప్రతిభలో మార్పేమీ ఉండదని పేర్కొన్నాడు. ఈ యువ ఆటగాడు క్రికెట్ ఆడగలడని, భారతదేశానికి దొరికిన గొప్ప ఆణిముత్యాల్లో అతను ఒకడని ప్రశంసించాడు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యవంశీ సాధించిన 97 పరుగుల ఇన్నింగ్స్‌ను బ్రెట్ లీ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఆస్ట్రేలియా బౌలర్లు వేగంగా బంతులు వేసినప్పటికీ, సూర్యవంశీ వాటిని భయపడకుండా ఎదుర్కొన్న తీరు తనను ఆకట్టుకుందని చెప్పాడు. సరైన క్రికెటింగ్ షాట్లతో పాటు అసాధారణమైన పవర్ కూడా అతనిలో ఉందని పేర్కొన్నాడు. సూర్యవంశీకి వచ్చిన వేగవంతమైన గుర్తింపుతో పాటు భారీ అంచనాలు కూడా ఏర్పడుతున్నాయని బ్రెట్ లీ అభిప్రాయపడ్డాడు. అయితే అవే అతనిపై ఒత్తిడిగా మారకుండా జాగ్రత్తపడాలని సూచించాడు. అతన్ని