
Vaibhav Sooryavanshi Misses Youngest Century Record: భారత దేశవాళీ క్రికెట్లో అరంగేట్రం చేసినప్పటి నుంచీ తన ఆటతో ఆకట్టుకుంటున్న 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి దులీప్ ట్రోఫీ 2024లో చేదు అనుభవం ఎదురైంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తొలి శతకం సాధించే అవకాశాన్ని ఈ చిచ్చరపిడుగు మరోసారి త్రుటిలో చేజార్చుకున్నాడు. ప్రతిష్టాత్మక రెడ్ బాల్ టోర్నీ దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో ఈస్ట్ జోన్ తరపున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ, సెంట్రల్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో 92 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటై తీవ్ర నిరాశకు గురయ్యాడు.
ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ గాయపడటంతో, 15 ఏళ్ల 157 రోజుల వయసులోనే వైభవ్ సూర్యవంశీ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం ఈ మ్యాచ్‌కు మరో ప్రత్యేక ఆకర్షణ. బెంగళూరు వేదికగా ఆదివారం సెంట్రల్ జోన్‌తో మొదలైన ఈ సెమీఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఈస్ట్ జోన్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం తమ మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈస్ట్ జోన్‌కు ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, అభిమన్యు ఈశ్వరన్ అదరిపోయే ఆరంభం ఇచ్చారు.
ఎక్కువమంది చదివినది: వన్డే ప్రపంచకప్ 2027 కోసం దూసుకొస్తోన్న తెలుగోడు.. డేంజర్ జోన్లో సర్పంచ్ సాబ్ ప్లేస్..!
వైభవ్ సూర్యవంశీ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. కేవలం 42 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 భారీ సిక్సర్ల సాయంతో తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకుని ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇదే జోరును కొనసాగిస్తూ, తన తొలి ఫస్ట్ క్లాస్ సెంచరీకి చేరువయ్యాడు. అభిమానులందరూ అతడు శతకం పూర్తి చేయాలని ఆతృతగా ఎదురుచూస్తుండగా, 92 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హర్ష్ దుబే బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. బంతి గాల్లోకి లేవగా, డీప్ మిడ్ వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అర్షద్ ఖాన్ క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో వైభవ్ మెరుపు ఇన్నింగ్స్‌కు తెరపడింది.
15 saal ka king of nervous nineties #VaibhavSooryavanshi — Crichack India (@crichackindia) August 31, 2026 మొత్తంగా 81 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 92 పరుగులు చేసిన వైభవ్, సెంచరీకి కేవలం ఎనిమిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఇది అతడి ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్లో రెండో అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్ కావడం గమనార్హం. గతంలో 93 పరుగుల వద్ద ఔటైన వైభవ్, మరోసారి శతకాన్ని త్రుటిలో చేజార్చుకోవడం దురదృష్టకరం. అయితే, ఈ ఇన్నింగ్స్‌తో వైభవ్ సూర్యవంశీ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 15 ఏళ్ల 157 రోజుల వయసులో దులీప్ ట్రోఫీలో అర్ధశతకం సాధించిన అత్యంత పిన్న వయస్కుడైన ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు.
ఎక్కువమంది చదివినది: Video: 6 ఫోర్లు, 7 సిక్సర్లతో విధ్వంసం.. 26 బంతుల్లో 296 స్ట్రైక్ రేట్‌తో కాటేరమ్మ కొడుకు ఊచకోత చూశారా..?
కాస్త నెమ్మదిగా ఆడి శతకం సాధించి ఉంటే, దులీప్ ట్రోఫీ చరిత్రలో అత్యంత పిన్న వయసులోనే శతకం కొట్టిన ప్లేయర్‌గా ఆల్ టైం రికార్డు సాధించే అవకాశం వైభవ్‌కు లభించేది. ఈ అవకాశాన్ని మిస్ చేసుకున్నప్పటికీ, అతడి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వైభవ్ ఔట్ అయిన తర్వాత వన్ డౌన్ బ్యాటర్ కుమార్ కుశాగ్ర డకౌట్‌గా వెనుతిరిగినప్పటికీ, మరో ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. భోజన విరామ సమయానికి ఈస్ట్ జోన్ 31 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. క్రీజ్‌లో అభిమన్యు ఈశ్వరన్ 58 పరుగులతో, సుదీప్ కుమార్ ఘరామి 16 పరుగులతో నిలిచారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





