
Andhra News: విశాఖలో తప్పిన పెనుప్రమాదం.. చూస్తుండగానే పూర్తిగా కాలిపోయిన ఆర్టీసీ బస్సు!
Andhra News: విశాఖలో తప్పిన పెను ప్రమాదం.. చూస్తుండగానే పూర్తిగా కాలిపోయిన ఆర్టీసీ బస్సు!
© 2026 nimisham.in

Andhra News: విశాఖలో తప్పిన పెను ప్రమాదం.. చూస్తుండగానే పూర్తిగా కాలిపోయిన ఆర్టీసీ బస్సు!

Andhra News: చిన్నారుల ఆరోగ్యానికి ఏపీ సర్కార్ బిగ్ ప్లాన్.. ఇక ప్రతి ప్రాంతానికి పోషకాహార చికిత్స!

Andhra News: కన్నీళ్లు పెట్టుకున్న బొత్స సత్యనారాయణ.. కార్యకర్తల సమక్షంలోనే వెక్కి వెక్కి ఏడుస్తూ..

Andhra News: పుట్టిన 13 రోజులకే పాస్‌పోర్ట్.. ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేసిన చిన్నారి!

Andhra News: ఇంటికొచ్చిన కుమారుడికి రక్తపు మడుగులో కనిపించిన తల్లి.. లోపలికెళ్లి చూడగా..

Andhra News: అదినా 20 ఏళ్ల కష్టం.. కాస్త కరుణించండి సారు.. అన్నదాత వినూత్న నిరసన!

Andhra News: కాపాడండయ్యా నన్ను.. భార్య నుంచి రక్షణ కల్పించాలని పీజీఆర్ఎస్లో భర్త ఫిర్యాదు!

అమరావతి: నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. మొత్తంగా 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026ను (ap job calendar 2026) విడుదల చేసింది. మొత్తం నాలుగు దశల్లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. గ్రూప్- 1లో 149 పోస్టులు, గ్రూప్- 2లో 673 ఉద్యోగాలు, విద్యాశాఖలో 2,995 పోస్టుల (టీచర్ పోస్టులు సహా)తో పాటు పోలీస్, ఫైర్, జైళ్లు, అటవీ, పశు సంవర్ధక, ఎక్సైజ్, ఇంజినీరింగ్, విద్యుత్ తదితర శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు (ap government jobs notifications latest 2026) ఆర్థికశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. విశాఖలో బ్రిక్స్ దేశాల క్రీడామంత్రుల సదస్సు ప్రారంభమైంది. తిరుమల శ్రీవారిని మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు కుటుంబసభ్యులు దర్శించుకున్నారు

కె.కోటపాడు: అభివృద్ధి అంటే పరిశ్రమలు, పెట్టుబడులు, కంపెనీలే కాదు.. స్వచ్ఛమైన ప్రాంతాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం ఎ.కోడూరులో పర్యటించిన సీఎం.. ప్రజావేదికలో మాట్లాడారు. సెప్టెంబరు తొలివారంలోనే అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు తీసుకొస్తామని ప్రకటించారు. మన ఊరు-మన బాధ్యత సంకల్పం అందరూ తీసుకోవాలని సూచించిన సీఎం.. స్వచ్ఛత కోసం ముందుకొస్తున్న ప్రతి ఒక్కరినీ అభినందించారు. ఆరోగ్యకర జీవనానికి స్వచ్ఛత మరింత అవసరమన్నారు. 2047 నాటికి మోదీ నాయకత్వంలో అగ్రదేశంగా వికసిత్ భారత్ వెలుగొందుతుందన్నారు. 2047కు తలసరి ఆదాయం రూ.50లక్షల వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ‘‘విశాఖకు మించి అనకాపల్లికి పెట్టుబడులు వస్తున్నాయి. స్టీల్ సిటీ నిర్మాణం కాబోతోంది. డేటా సెంటర్లు వస్తున్నాయి. భవిష్యత్తులో నాలెడ్జ్ ఎకానమీకి కేంద్రంగా అనకాపల్లి మారబోతోంది. మంచి పనులు చేస్తుంటే అడ్డుకోవడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. గూగుల్ డేటా సెంటర్.. సుందరమైన విశాఖకు వస్తోంది. మన అభివృద్ధిని చూసి వేరే రాష్ట్రాలు ఆశ్చర్యపోతే.. ఇక్కడుండే కొద్దిమంది మాత్రం దుష్ప్రచారం చేస్తున్నారు. ఇంతవరకూ డేటా సెంటర్ ప్రారంభం కాలేదు.. అప్పుడే నీళ్లు ఇంకిపోయాయంటారు. తాగడానికి నీళ్లు లేవంటూ.. తప్పుడు ప్రచారం ప్రారంభించారు. డేటా సెంటర్ వస్తే లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఆదాయం కూడా ఆకాశమే హద్దుగా ఉండబోతుంది. అనకాపల్లి జిల్లాలోని ప్రతి చెరువు, రిజర్వాయర్ నింపే బాధ్యత మాది. ప్రతి గ్రామం జీరో వేస్ట్ పంచాయతీగా తయారు కావాలి. గత ఐదేళ్ల వైకాపా పాలనలో చెత్తమయం చేశారు. గుట్టలుగా పేరుకుపోయిన చెత్తను తొలగించే పనులు ఊపందుకున్నాయి. ప్రతి గ్రామానికి స్వచ్ఛరథాలను పంపుతున్నాం. ఇంటిపై సోలార్ ప్యానెల్ పెట్టుకుంటే ఒక్క రూపాయి ఖర్చు ఉండదు’’ అని సీఎం అన్నారు. రాష్ట్రమంత్రులు నారాయణ, కొల్లు రవీంద్ర, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ తదితరులు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి

హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు ముగిశాయి. సీబీఐ కేసు ఆధారంగా హైదరాబాద్, కడప సహా ఏడు చోట్ల ఈడీ తనిఖీలు చేపట్టింది. ఈ కేసులోని కీలక నిందితుల నివాసాల్లో సోదాలు జరిగాయి. పలు పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి నివాసాల్లోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. అవినాష్ నివాసంలో లెక్క చూపని రూ.24లక్షల నగదును సీజ్ చేశారు. ఆయనకు చెందిన రెండు లాకర్ల తాళాలను స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో లభించిన డిజిటల్, ఆర్థిక ఆధారాలపై ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. చెరువులు, కుంటల్లో సహజసిద్ధంగా పెరిగే తామర పూలను ఓ రైతు వరికి ప్రత్యామ్నాయంగా పొలంలో సాగు చేస్తున్నారు. శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా అనకాపల్లిలో నూకాలమ్మ.. ధనలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. విజయవాడ దుర్గగుడికి దశాబ్దం తర్వాత.. అన్నదానం, ప్రసాదం తయారీకి ప్రత్యేక భవనాలు అందుబాటులోకి వచ్చాయి. శ్రావణ మాసం శుక్రవారం, వరలక్ష్మీ వత్రం పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ శోభ సంతరించుకుంది. జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోని ఆలయాల్లో అమ్మవారిని కూరగాయలు, కరెన్సీ నోట్లు, పసుపు కొమ్ములతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయాలకు అధిక సంఖ్యలో తరలిరావడంతో రద్దీ నెలకొంది. మరోవైపు మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నారు. ఆ ఫొటోలు మీకోసం

విశాఖపట్నం (వన్‌టౌన్): విశాఖపట్నంలో దారుణం చోటు చేసుకుంది. టీచర్ దెబ్బలు తాళలేక ఓ ఆరేళ్ల విద్యార్థి మృతిచెందాడు. నగరంలోని వన్‌టౌన్ పరిధి లిటిల్ గార్డెన్ స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం ఉదయం స్కూల్‌కి వచ్చిన విద్యార్థి ప్రణయ్ తేజ (6)ను హోంవర్క్ చేయలేదని ఉపాధ్యాయురాలు మందలించారు. ఈ క్రమంలో ఆమె చేయిచేసుకున్నారు. టీచర్ కొట్టిన దెబ్బలకు తాళలేక క్లాస్‌రూమ్‌లోనే విద్యార్థి స్పృహ తప్పిపడిపోయాడు. అనంతరం ఆస్పత్రికి తరలించగా.. మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు. తేజ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. టీచర్ నిర్వాకంతోనే తమ కుమారుడు మృతిచెందాడని తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ విచారణ చేపట్టింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ మంత్రివర్గం 55కి పైగా అజెండా అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. స్థానిక సంస్థల్లో రూరల్ ప్రాంతాల్లో బీసీలకు 34శాతం, అర్బన్‌లో 33.1 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు, మేయర్ల ఎన్నికలకు ప్రత్యక్ష పద్ధతిలో వెళ్లాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని గుప్తేశ్వర ఆలయానికి ‘బోల్ భం’ యాత్ర కోసం భక్తులు భారీగా తరలి వచ్చారు. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం తాళ్వాయిపాడు వద్ద ఓ వ్యాను దగ్ధమైంది

కాకినాడ: పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కీకల పరిణామం చోటుచేసుకుంది. నూకరాజు వియ్యంకుడు భాస్కర్‌రెడ్డి ఫిర్యాదుతో సాధిక్‌ఖాన్‌పై మరో కేసు నమోదైంది. జులై 2న తన కుమారుడు జగదీశ్‌రెడ్డికి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి సాధిక్ హత్య చేశాడని భాస్కర్‌రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. హత్య కేసులో సాధిక్తో పాటు మరో వ్యక్తి పాత్ర ఉన్నట్టు అనుమానం వ్యక్తంచేశారు. సాధిక్ కారణంగానే నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకుందని ఇప్పటికే కేసు నమోదైంది. నిన్న మనవడు కార్తికేయరెడ్డితో మాట్లాడగా విషయం తెలిసిందని భాస్కర్‌రెడ్డి పోలీసులకు తెలిపారు. నూకరాజు కుమార్తె సౌజన్య బండిలో మూడు కవర్లను పోలీసులు గుర్తించారు. జగదీశ్‌రెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సౌజన్య రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘‘సాధిక్ ఖాన్ నన్ను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేశాడు. నా భర్తను సాధిక్ హత్య చేశాడు. నా ఆస్తి, ఫోన్, ఎస్బీఐ లాకర్ వివరాలు తీసుకున్నాడు. మతం మారాలని ఒత్తిడి చేశాడు. నా కుటుంబాన్ని చంపుతానని బెదిరించాడు. సాధిక్ వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నాం’’ అని లేఖలో పేర్కొన్నట్టు సమాచారం. కేసు నమోదు చేసిన సర్పవరం పోలీసులు సాధిక్‌ఖాన్ కోసం ఇప్పటికే గాలిస్తున్నారు. మరోవైపు.. నిన్న గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఏఈ నూకరాజు భార్య మీనా, కుమార్తె సౌజన్య కోసం ఎస్డీఎఆర్ఎఫ్ బృందం, పోలీసులు, గజ ఈతగాళ్లు గాలింపు కొనసాగిస్తున్నారు. కాకినాడ అశోకనగర్లో నివాసముంటున్న తిల్లపూడి నూకరాజు (61) పిఠాపురం మండలంలో పంచాయతీరాజ్ ఏఈగా గత పదేళ్లుగా విధులు నిర్వరిస్తున్నారు. వచ్చే జనవరిలో ఆయన ఉద్యోగ విరమణ చేయాల్సిఉంది. ఆదివారం అర్ధరాత్రి భార్య మీనా (58), కుమార్తె కోవూరి సౌజన్య (38), మనుమడు రియాన్ష్ కార్తికేయరెడ్డి(10)తో కలిసి కారులో రాజమహేంద్రవరం వచ్చారు. రోడ్డు కం రైలు వంతెనపై కారు నిలిపి నలుగురూ గోదావరిలో దూకేశారు. స్థానికులు పోలీసులకు సమాచారమివ్వడంతో వారు వెంటనే సమీప లంకల్లోని మత్స్యకారులను రప్పించి గాలింపు చర్యలు

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలే ప్రధాన అజెండాగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. సచివాలయం మొదటి బ్లాక్‌లో జరుగుతున్న ఈ భేటీలో దాదాపు 55కు పైగా అజెండా అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై మంత్రివర్గం కీలకంగా చర్చించనుంది. కేబినెట్ భేటీ అనంతరం బీసీలకు స్థానిక సంస్థల్లో 33.50 శాతం, పంచాయతీరాజ్ సంస్థల్లో 34.50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేయనుంది. బీసీలకు రిజర్వేషన్లపై ఏర్పాటుచేసిన డెడికేటెడ్ కమిషన్ నివేదికపై ఎలా ముందుకు వెళ్లాలి? అన్న కోణంలో మంత్రివర్గంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. కమిషన్ నివేదికను అమలుచేస్తే బీసీలకు 34 శాతం రిజర్వేషన్ వీలు పడదు కాబట్టి, ప్రత్నాయ్నాయాలేంటి? అన్న విషయంలో లోతుగా చర్చించనున్నట్టు సమాచారం. పట్టణ స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం, ఆ తీర్మానానికి నేడు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలపనుంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

విజయవాడ: లంచం తీసుకుంటూ రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజినీర్ సీబీఐకి చిక్కారు. విజయవాడలో ఈ ఘటన చోటుచేసుకుంది. సీనియర్ సెక్షన్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న బాపిరాజు.. ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ పనుల వ్యవహారంలో రూ.15 లక్షలు లంచం డిమాండ్ చేశారు. దీనిపై సీబీఐ అధికారులకు ఫిర్యాదు అందడంతో.. వారు ట్రాప్ చేసి ఆయన్ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయనతో పాటు ప్రైవేటు వ్యక్తి శ్రీచందన్ను అరెస్ట్ చేశారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

తిరుమల: నవంబరులో జరిగే శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల కోటాను ఈ నెల 18న ఉదయం పది గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఎంపికైన భక్తులు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం లోపు సొమ్ము చెల్లించి లక్కీడిప్ టికెట్లు పొందాల్సి ఉంటుంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

అమరావతి: రాష్ట్ర అగ్నిమాపకశాఖలోకి మరికొన్ని ఆధునిక వాహనాలు రానున్నాయి. తాజాగా 58 ఆధునిక ఫైర్‌ఫైటింగ్ వాహనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) జెండా ఊపి ప్రారంభించారు. 25 అధునాతన ఫైర్ ఫైటింగ్ వాహనాలు.. 20 వాటర్ బౌజర్లు.. 13 క్విక్ రెస్పాన్స్ మల్టీపర్పస్ ఫైర్‌ఫైటింగ్ వాహనాలను లాంచ్ చేశారు. గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా 25 అధునాతన ఫైర్‌ఫైటింగ్ వాహనాలను అగ్నిమాపక శాఖ సమకూర్చుకుంది. భారీ అగ్నిప్రమాదాల్లో మంటలను అదుపు చేయడానికి అవసరమయ్యే నిరంతర నీటి సరఫరాకు 20 వాటర్ బౌజర్లు కొనుగోలు చేసింది. ఇరుకైన, రద్దీ ప్రాంతాల్లోకి వేగంగా చేరుకునేలా 13 క్విక్ రెస్పాన్స్ మల్టీపర్పస్ ఫైర్‌ఫైటింగ్ వాహనాలు పనిచేస్తాయి. తొలి దశలో ఇప్పటికే రూ.33 కోట్లతో 65 ఫైర్‌ఫైటింగ్ వాహనాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. వాహనాల ప్రత్యేకతలను అధికారులు సీఎంకు వివరించారు. కార్యక్రమంలో హోంమంత్రి అనిత, అగ్నిమాపక శాఖ డీజీ వెంకట రమణ, అధికారులు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. ఆంధ్రప్రదేశ్‌లో వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి, సమృద్ధిగా వానలు కురవాలని ఆకాంక్షిస్తూ విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో వరుణ యాగం నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం పరజపాడులో అరుదైన ఘటన జరిగింది

DigiLocker | ఇంటర్నెట్ డెస్క్: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE 2027) పరీక్షకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు కీలక అప్డేట్! ఈ పరీక్ష షెడ్యూల్(GATE 2027 Reschedule)లో ఐఐటీ మద్రాస్(IIT Madras) కీలక మార్పులు చేసింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ తొలుత ప్రకటించినట్లుగా ఆగస్టు 14 నుంచి కాకుండా.. ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించింది. అర్హులైన అభ్యర్థులంతా ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 27వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఆలస్య రుసుంతో అక్టోబర్ 5వరకు దరఖాస్తు చేసుకోవచ్చని., పరీక్ష తేదీల్లో మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. మరోవైపు, గేట్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసేందుకు అభ్యర్థులు డిజిలాకర్ ఖాతాతో లింక్ చేయడం తప్పనిసరని ఐఐటీ మద్రాస్ తెలిపింది. దరఖాస్తు చేసే ముందే అభ్యర్థులు వెబ్సైట్లో తమ డిజిలాకర్ ఖాతాను క్రియేట్/అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో దరఖాస్తుదారులు తమ డిజిలాకర్ను అనుసంధానం చేయాలని, దీనివల్ల ధ్రువీకరించిన వ్యక్తిగత సమాచారాన్ని పోర్టల్ సురక్షితంగా సేకరించగలుగుతుందని ఐఐటీ మద్రాస్ పేర్కొంది. అభ్యర్థి ఒకసారి అనుమతి ఇచ్చాక వారి పేరు, పుట్టిన తేదీ, ప్రొఫైల్ ఫొటో, వెరిఫైడ్ గుర్తింపు పత్రం నంబర్, ఈ-మెయిల్ అడ్రస్, మొబైల్ నంబర్, ఇంటి అడ్రస్ వంటి వ్యక్తిగతమైన వివరాలను ఆటోమేటిక్‌గా పోర్టల్ సేకరిస్తుందని తెలిపింది. తద్వారా అప్లికేషన్ ప్రక్రియ వేగంగా, మరింత కచ్చితంగా పూర్తయ్యేందుకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొంది. ఇటీవల ప్రకటించినట్టుగానే గేట్ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 6, 7, 13, 14, 20, 21 తేదీల్లో జరగనున్నాయి. ఫలితాలను మార్చి 19న ప్రకటించనున్నట్లు ఐఐటీ మద్రాస్ తన షెడ్యూల్లో పేర్కొంది. సర్టిఫికెట్లు, విలువైన డాక్యుమెంట్లను డిజిటల్‌గా భద్రపరుచుకోవడం, షేర్ చేసుకోవడం, అవసరమైనప్పుడు వెరిఫై చేసుకోవడం కోసం కేంద్రప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందే ఈ ‘డిజిలాకర్’. పేపర్‌లెస్ సదుపాయం కోసం మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఏర్పాటైన

ఓర్వకల్లు: వైకాపా అధినేత జగన్ (Jagan) కర్నూలు పర్యటనలో అడగడుగునా పోలీసు ఆంక్షలను ఉల్లంఘించారు. అనుమతి లేకపోయినా బళ్లారి చౌరస్తాలో జాతీయ రహదారిపై డీజే పెట్టుకుని బైక్‌లతో స్టంట్స్ చేస్తూ జనానికి చుక్కలు చూపించారు. ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కర్నూలు జిల్లా కారాగారంలో ఉన్న ఆలూరు వైకాపా ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు జగన్ ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్నారు. అనుమతులు లేకపోయినా అక్కడి నుంచి భారీ ర్యాలీతో కర్నూలు బయల్దేరారు. దీంతో పలు వాహనాల రాకపోకలు స్తంభించాయి. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు హెచ్చరించినా.. వైకాపా నాయకులు ఖాతరు చేయకుండా భారీ జనసమీకరణ చేసినట్టు సమాచారం. జగన్ కాన్వాయ్ తొందరగా వెళ్లాలని రూరల్ సీఐ చంద్రబాబు కోరగా.. వైకాపా కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఆయన వాహనానికి అడ్డుగా నిలిచి ఆందోళన చేపట్టారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. అమరావతిలో రాజధాని నిర్మించాలని నిర్ణయించినప్పుడు మీడియా దిగ్గజం దివంగత రామోజీ రావు తనకు ఫోన్ చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేసుకున్నారు

అమరావతి: అమరావతి రైతులది త్యాగమే కాదు.. స్ఫూర్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతిని కలిపే ప్రధాన రహదారి సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ-3ని సీఎం ప్రారంభించారు. సీడ్ యాక్సెస్ రోడ్డును అనుసంధానించే స్టీల్ బ్రిడ్జీల ప్రారంభానికి సూచికగా ఉండవల్లి వద్ద శిలాఫలకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం కాలినడకన వెళ్లి స్టీల్ బ్రిడ్జిలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు హాజరైన రైతులు, స్థానికులను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. ‘‘రాష్ట్ర విభజన తర్వాత ఏమవుతుందో తెలియని స్థితిలో అందరం ఉన్నాం. రాజధాని ఎక్కడ నిర్మించాలో అర్థం కాని పరిస్థితి. శివరామకృష్ణ ఆధ్వర్యంలో కమిటీ వేశారు. మెజారిటీ ప్రజలు అమరావతినే సూచించారు. రాజధాని లేకపోతే మనం ఏమీ చేయలేమని గ్రహించి నిర్మాణానికి సంకల్పించా.. మరి భూములు కావాలి కదా? మహానగరంగా ఎలా చేయాలని ఆలోచిస్తే.. ల్యాండ్‌పూలింగ్ కాన్సెప్ట్ వచ్చింది. రాజధాని నిర్మాణంలో రైతులను భాగస్వాములను చేస్తే బాగుంటుందని ఆలోచించా. ఒక్కమాట చెప్పగానే.. నన్ను నమ్మి భూములిచ్చేందుకు అన్నదాతలు ముందుకొచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చిన 58 రోజుల్లోనే రైతుల నుంచి విశేష స్పందన వచ్చింది. 33వేల ఎకరాలు ఇచ్చేందుకు.. 29వేల మంది రైతులు ముందుకొచ్చారు. అమరావతి రైతాంగానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా’’ అని నాటి సంగతులను సీఎం వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పి.నారాయణ, నాదెండ్ల మనోహర్, తాడికొండ శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్ కుమార్, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ భాష్యం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

విజయనగరం: నేరాలు చేసేవారిని పరామర్శించేందుకే జగన్ యాత్రలు చేస్తున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. జగన్ అసెంబ్లీకి రారు.. వాళ్ల ఎమ్మెల్యేలను కూడా పంపట్లేదని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా పీపీపీ విధానంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి ఆలోచన చేస్తున్నట్టు మంత్రి చెప్పారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

అమరావతి: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అసెంబ్లీ ప్రాంగణంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించే ఈ కార్యక్రమాల్లో విద్యార్థులతో పాటు ఎవరైనా పాల్గొనవచ్చన్నారు. సాయంత్రం పూట ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. స్వాతంత్ర్య ఉద్యమ ఘట్టాలను ప్రదర్శిస్తామన్నారు. వైకాపా ఎమ్మెల్యేలు సభకు హాజరు కావడం లేదని.. అలాంటి వారికి జీతాలు ఎందుకు ఇవ్వాలని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన ఎమ్మెల్యేలు శాసనసభకు హాజరుకాకపోవడమేంటన్నారు. సభకు రాని వారికి వేతనాలు ఇవ్వకూడదని.. ఈ అంశాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. దీనిపై పార్లమెంట్లో చర్చ జరిగి చట్టం తీసుకురావాలని అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ఇంటర్నెట్ డెస్క్: విజయవాడ, తిరుపతిలోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాల్లో సర్వర్లు పనిచేయడం లేదు. అక్కడికి వచ్చిన ప్రజలను బుధవారం రావాలని అధికారులు వెనక్కి పంపుతున్నారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చినవారు ఇబ్బంది పడుతున్నారు. విజయవాడలో పెద్ద ఎత్తున ప్రజలు ఉదయం నుంచీ పడిగాపులు కాస్తున్నారు. వీరిలో అత్యధికంగా విద్యార్థులు ఉన్నారు. కేటాయించిన స్లాట్ ప్రకారం వచ్చామని.. సాంకేతిక సమస్యపై అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. చచ్చినపోయిన కోళ్ల కోసం జనం ఎగబడిన ఘటన తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలంలో చోటుచేసుకుంది. ఎప్పుడూ నీలిరంగులో కళకళలాడే కృష్ణమ్మ ప్రస్తుతం గోదావరి జలాలతో ఎరుపెక్కింది

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేలా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. సూపర్ ఎల్ నినో ప్రభావంతో తలెత్తే కరువు సవాళ్లను ఎదుర్కొంటూనే, 15% వృద్ధి రేటును సాధించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఆర్థికాభివృద్ధి ఏమాత్రం తగ్గకూడదని, సంక్షోభ సమయాల్లోనూ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. జూలై 2026 నాటి ఆర్థిక నివేదికను ప్లానింగ్ విభాగం సమర్పించగా, దానిపై సీఎం సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. గత క్వార్టర్ (2025-26) ఫలితాలను విశ్లేషించగా, ఏపీ 10.7% నామినల్ వృద్ధిని నమోదు చేసి జాతీయ సగటును దాటేసింది. వ్యవసాయ రంగంలో 13.5%, పరిశ్రమల్లో 10.6%, సేవా రంగంలో 9.9% వృద్ధి నమోదవ్వడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని నివేదిక వెల్లడించింది. దీంతో ఎల్ నినో వల్ల వర్షపాతం లోపించినా, సాగునీటి లభ్యతకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. నిత్యావసరాల ధరలు పెరగకుండా, సామాన్య ప్రజలపై ఏమాత్రం భారం పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ ఉత్పత్తులలో విలువ జోడింపుపై దృష్టి పెట్టాలని, ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో రూ. 2.88 లక్షల కోట్ల విలువైన మెగా ప్రాజెక్టులలో 75.4% గ్రౌండింగ్ పూర్తయినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఈ ప్రాజెక్టులను వేగవంతం చేయడం ద్వారా రాబోయే రోజుల్లో మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిల్లో ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసి, వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని కోరారు. ముగింపుగా, ప్రకృతి వైపరీత్యాలు అడ్డుపడినా ఏపీ ఆర్థిక స్థిరత్వం దెబ్బతినకూడదని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి విభాగం బాధ్యతాయుతంగా పనిచేస్తేనే లక్ష్యిత 15% వృద్ధి సాధ్యమవుతుందని ఆయన నొక్కి చెప్పారు. ప్రజల సంక్షేమం మరియు రాష్ట్ర అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి పాలన సాగిస్తున్నట్లు ఆయన

అమరావతి: సూపర్ ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ రాష్ట్రం 15శాతం వృద్ధిరేటు సాధించేలా సమగ్ర కార్యాచరణ రూపొందించి, ప్రజలపై ధరల భారం పడకుండా చూడాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రణాళిక విభాగం సమర్పించిన 2026 జులై ఆర్థిక నివేదికను పరిశీలించిన ఆయన, ప్రతి ప్రభుత్వశాఖ అత్యున్నత లక్ష్యాలను చేరుకునేలా వనరుల సమర్థ నిర్వహణ చేపట్టాలని సూచించారు. నీటి లభ్యత, ఉత్పత్తుల విలువ జోడింపుపై జిల్లా, నియోజకవర్గం, మండలాల వారీగా కంటింజెన్సీ ప్రణాళికలు సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. నివేదిక ప్రకారం.. 2025-26 రెండో త్రైమాసికంలో 10.7 శాతం, వాస్తవ వృద్ధిరేటులో 9.9 శాతంతో గత రెండేళ్లుగా జాతీయ సగటు కంటే మెరుగైన ప్రగతిని నమోదు చేసింది. రంగాల వారీగా వ్యవసాయంలో 13.5 శాతం, పారిశ్రామికంలో 10.6 శాతం, సేవల రంగంలో 9.9 శాతం వృద్ధి నమోదైంది. సాంకేతికత అనుసంధానంతో జీఎస్టీ వసూళ్లు 21శాతం పెరిగి రూ.13,282 కోట్లకు, సాధారణ ఎగుమతులు రూ.16,322 కోట్లకు చేరాయి. వీటితో పాటు ఎస్టీపీఐ ఎగుమతులు 32.2శాతం, వాణిజ్య వాహనాల నమోదు 51.6శాతం మేర పెరగ్గా, రూ.2.88 లక్షల కోట్ల మెగా ప్రాజెక్టుల పెట్టుబడుల గ్రౌండింగ్‌లో 75.4 శాతం పురోగతి సాధించినట్లు వెల్లడైంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

పులివెందుల: డీఎస్సీపై వైకాపా (YSRCP) నిర్వహించిన ర్యాలీలో ఆ పార్టీ కార్యకర్తలు, కళాశాల విద్యార్థులు మాత్రమే ఉన్నారని తెదేపా పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి అన్నారు. డీఎస్సీ రాసిన విద్యార్థులు ఎవరూ ఆ ర్యాలీలో లేరని చెప్పారు. స్థానిక తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మైనర్ విద్యార్థులకు వైకాపా కండువాలు వేసి ర్యాలీలు చేయడం బాధిస్తోందన్నారు. పులివెందులలో విద్యార్థులు ర్యాలీకి రాకపోతే కళాశాలలు నడపలేరంటూ కొందరు వైకాపా నేతలు యాజమాన్యాలను బెదిరించారని ఆరోపించారు. వైకాపా ఎంపీ అవినాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ర్యాలీలో ఇలా చేయడమేంటని బీటెక్ రవి ప్రశ్నించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ఒంగోలు: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa reddy)పై కరపత్రాలు ముద్రిస్తే పుస్తకాలు సరిపోవని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ (Damacharla janardhan) అన్నారు. కూటమిలో విభేదాలు సృష్టించేలా ఆయన మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై బాలినేని విమర్శల నేపథ్యంలో దామచర్ల స్పందిస్తూ మీడియా సమావేశం నిర్వహించి కౌంటర్ ఇచ్చారు. ‘‘అమావాస్యకు ఓసారి బాలినేని ఒంగోలు వస్తారు. ఆయన కూటమిలో ఉన్నారని మౌనంగా ఉన్నాం. నాపై బాలినేని అనుచరుడు మురళి కరపత్రాలు వేశారు. ఆయనే కరపత్రాలు వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. బాలినేనిపై కరపత్రాలు ముద్రిస్తే పుస్తకాలు కూడా సరిపోవు. గత ప్రభుత్వంలో మాపై 79 కేసులు పెట్టించారు. బాలినేని పార్టీ మారారు కాబట్టి సరిపోయింది.. లేకుంటే తండ్రీకుమారులను లోపల వేసేవాళ్లం. గత ప్రభుత్వంలో చేసినట్లు రౌడీయిజం చేస్తామంటే కుదరదు. జనసేనను అడ్డుపెట్టుకుని వైకాపా నేతలకు పనిచేస్తున్నారు. బార్ షాపులు సిండికేట్ చేసి తండ్రీకుమారులు రూ.కోట్లు వసూలు చేశారు. చేసిన అక్రమాలపై ప్రమాణం చేసేందుకు బాలినేని కాణిపాకం వస్తారా? నేను ఎలాంటివాడినో ప్రజలకు తెలుసు కనుకే 34వేల మెజారిటీ ఇచ్చారు. తలకిందులుగా తపస్సు చేసినా బాలినేనికి ఆ మెజారిటీ రాదు. ప్రభుత్వ భూముల్లో ఆయన వియ్యంకుడి విల్లాలున్నాయి. ఆ భూమిని వెంగముక్కలపాలెం ప్రజలకు కమ్యూనిటీ హాల్ కింద ఇస్తాం’’ అని దామచర్ల జనార్దన్ అన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

రాజమహేంద్రవరం: మద్యం మత్తులో యువకులు.. వైద్య విద్యార్థిని ప్రియాంకను కారుతో ఢీకొట్టిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఘటనపై బాధితురాలి తండ్రి వెంకటేష్ రాజమహేంద్రవరంలోని ప్రకాశ్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులు సూరావరపు దస్వంత్, ఆండ్రూ జోసఫ్ అడ్వర్డ్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘‘ఈనెల 3న రాత్రి మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేసిన నిందితులు మూడు సార్లు కారుతో ప్రియాంక స్కూటీని ఢీకొట్టారు. ప్రస్తుతం పోలీసులు పెట్టిన సెక్షన్లు తక్కువ తీవ్రతతో ఉన్నాయి. నిందితులకు కఠిన శిక్ష పడేలా సెక్షన్లు మార్చాలి’’ అని కోరారు. జిల్లా అదనపు ఎస్పీ పాటిల్, డీఎస్పీ సుభాష్.. ఫిర్యాదుదారుతో చర్చిస్తున్నారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రియాంక ప్రస్తుతం సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు