
విజయవాడ: లంచం తీసుకుంటూ రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజినీర్ సీబీఐకి చిక్కారు. విజయవాడలో ఈ ఘటన చోటుచేసుకుంది. సీనియర్ సెక్షన్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న బాపిరాజు.. ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ పనుల వ్యవహారంలో రూ.15 లక్షలు లంచం డిమాండ్ చేశారు. దీనిపై సీబీఐ అధికారులకు ఫిర్యాదు అందడంతో.. వారు ట్రాప్ చేసి ఆయన్ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయనతో పాటు ప్రైవేటు వ్యక్తి శ్రీచందన్ను అరెస్ట్ చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





