
Allu Arjun: ఆ సినిమా ఆగిపోలేదు.. ఊహించని డైరెక్టర్‌తో అల్లు అర్జున్!
Allu Arjun: ఆ సినిమా ఆగిపోలేదు.. ఊహించని డైరెక్టర్‌తో అల్లు అర్జున్!
© 2026 nimisham.in

Allu Arjun: ఆ సినిమా ఆగిపోలేదు.. ఊహించని డైరెక్టర్‌తో అల్లు అర్జున్!

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ గొప్ప మనసు.. 3 లక్షల మంది బాలికలకు HV వ్యాక్సిన్ పై అవగాహన..

Allu Arjun | అల్లు అర్జున్ ఫ్యాన్స్ మామూలుగా లేరుగా .. దేశవ్యాప్తంగా 3 లక్షల మంది బాలికలకు అవగాహన

Allu Arjun: ఫ్యాన్స్ అంటే ఇలా ఉండాలి.. సామాజిక సేవలో ప్రత్యేకత చాటుకుంటోన్న అల్లు అర్జున్ అభిమానులు

Allu Arjun | అల్లు అర్జున్‌తో క్రేజీ డైరెక్టర్ ఫ్యాన్ బాయ్ మూమెంట్.. ట్రెండింగ్‌లో స్టిల్

Allu Arjun : అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న రాకా సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాపై ఇప్పుడో ఓ ఆసక్తికరమైన గాసిప్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. సినిమాలో అల్లుఅర్జున్ ఒకటి కాదు.. ఏకంగా మూడు విభిన్న షేడ్స్‌లో కనిపించబోతున్నారట. ఈ మూడు పాత్రల లుక్స్, బాడీ లాంగ్వేజ్, క్యారెక్టరైజేషన్ పూర్తిగా డిఫరెంట్‌గా ఉంటాయని టాక్. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉందట. సాధారణంగా ఒక హీరో మూడు పాత్రల్లో కనిపిస్తే..వాళ్ల మధ్య అన్నదమ్ముల బంధమో, తండ్రీ కొడుకుల సంబంధమో, గత జన్మ కనెక్షన్లో ఉంటుందని ఊహిస్తాం. కానీ రాకాలో మాత్రం ఈ ముగ్గురు క్యారెక్టర్స్‌కు ఎలాంటి సంబంధం ఉండదట. ముగ్గురూ తమ తమ ప్రపంచాల్లో, తమ తమ కథల్లో కనిపిస్తారని..అయితే కథ ముందుకు వెళ్లే కొద్దీ ఈ మూడు కథలు ఒకే పాయింట్ దగ్గరికి వచ్చి కలుస్తాయని టాక్. మూడు పాత్రల జీవితాలు వేర్వేరు..వాళ్ల సమస్యలు వేర్వేరు..వాళ్ల నేపధ్యాలు కూడా వేర్వేరుగా ఉంటాయట. కానీ ఏదో ఒక కీలకమైన సంఘటన ఈ ముగ్గురినీ ఒకే కథలోకి తీసుకొస్తుందట. Manasa Varanasi : పువ్వుతో తెలుగు అందం.. మానస వారణాసి క్యూట్ ఫోటోలు.. ముగ్గురికీ సంబంధం లేదు. కానీ ముగ్గురి కథ ఒక్కటే అనే కాన్సెప్ట్ సినిమాలో మెయిన్ హైలైట్‌గా ఉండబోతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక అల్లుఅర్జున్ కూడా ఈ మూడు షేడ్స్ కోసం తన లుక్, మేనరిజమ్స్, యాక్టింగ్‌లో పూర్తిగా కొత్త వేరియేషన్స్ చూపించబోతున్నారనే టాక్ ఉంది. ఒక పాత్రలో పూర్తిగా రఫ్ అండ్ రా లుక్‌లో..మరో పాత్రలో స్టైలిష్‌గా..ఇంకో పాత్రలో ఇప్పటివరకు చూడని డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ మూడు పాత్రలు ఎందుకు ఒకేలా కనిపిస్తాయి.? వాళ్ల జీవితాల్లో ఒకే విధమైన సంఘటనలు ఎందుకు జరుగుతాయి.? చివరికి ఈ ముగ్గురి కథలు ఎలా కలుస్తాయి.? అన్నదే రాకాలో అసలు సస్పెన్స్ అంటున్నారు. నిజంగా ఇదే కాన్సెప్ట్‌తో

మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్(Allu Arjun) చేసిన స్పెషల్ ట్వీట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. చిరంజీవిని తనకు మాత్రమే కాకుండా తమ అందరికీ గొప్ప సపోర్ట్ సిస్టమ్‌గా అభివర్ణించిన బన్నీ.. ఆయన అందరినీ ప్రోత్సహించి, ఎదిగేలా స్ఫూర్తినిచ్చారని పేర్కొన్నారు. అయితే సాధారణంగా కనిపించే ఈ బర్త్‌డే విషెస్‌లో #KKAVCF అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించడం చర్చనీయాంశంగా మారింది. దాని అర్థాన్ని నేరుగా వెల్లడించకుండా “Iykyk” అంటూ బన్నీ ట్వీట్ చేయడం మరింత ఆసక్తిని పెంచింది. అల్లు అర్జున్ గతంలో చిరంజీవిపై చేసిన కామెంట్స్ ను పరిశీలిస్తే ఈ హ్యాష్‌ట్యాగ్ వెనుక భావం ఏమిటన్నది కొంతవరకు అర్థమవుతుంది. కట్టే కాలే వరకు చిరంజీవి ఫ్యాన్ అంటూ బన్నీ గతంలో చెప్పిన మాట ఫ్యాన్స్ లో బలంగా నిలిచిపోయింది. ఇప్పుడదే అభిమాన భావనను సంక్షిప్తంగా, కోడ్లా #KKAVCF ద్వారా గుర్తుచేసినట్టుగా కనిపిస్తోంది. దీంతో బన్నీ ట్వీట్లోని ఈ చిన్న హ్యాష్‌ట్యాగ్‌నే ఫ్యాన్స్ ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. చిరంజీవి వారసత్వం నుంచి మెగా కుటుంబానికి చెందిన పలువురు హీరోలు ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక స్థానాలను ఏర్పరచుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు అల్లు అర్జున్ కూడా తనదైన స్టార్డమ్తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. కుటుంబాల మధ్య ఈక్వేషన్స్‌పై సోషల్ మీడియాలో ఎన్ని డిస్కషన్స్ జరిగినా.. చిరంజీవిపై తనకున్న గౌరవం, అభిమానం మాత్రం ప్రత్యేకమేనని బన్నీ తాజా ట్వీట్ ద్వారా మరోసారి చెప్పకనే చెప్పారు. అందుకే ఈ బర్త్‌డే విషెస్ ఇప్పుడు సాధారణ శుభాకాంక్షల కంటే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి

కొన్నాళ్ల క్రితం చిరంజీవి కుటుంబానికి, అల్లు అర్జున్ కుటుంబానికి దూరం పెరిగింది. అటు ఇటు రాకపోకలు తగ్గిపోయాయి. అల్లు అర్జున్ వెళ్లి వైకాపా అభ్యర్థికి ప్రచారం చెయ్యడంతో విభేదాలు మరింత పెరిగాయి. ఐతే, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పార్టీ అధికారంలోకి రావడం, ఇక్కడ పుష్ప 2 సినిమా థియేటర్ తొక్కిసలాట కేసులో ఒకరోజు అల్లు అర్జున్ జైలులో ఉండి రావడంతో మళ్ళీ ఇరు కుటుంబాల మధ్య రిలేషన్స్ మెరుగు అయ్యాయి. ఐతే ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ చేసిన ట్వీట్ ప్రత్యేకంగా నిలిచింది. “మన ఏకైక మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మాకు ఎప్పుడూ గొప్ప అండగా నిలిచారు. మనలో ప్రతి ఒక్కరినీ ఆయన స్ఫూర్తిగా నిలిపి, ఎదిగేలా ప్రోత్సహించారు. #KKAVCF (Iykyk)” అంటూ బన్నీ మెగాస్టార్‌కు బర్త్‌డే విషెస్ తెలిపారు. అయితే ఈ ట్వీట్లో బన్నీ ఉపయోగించిన #KKAVCF హ్యాష్‌ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ హ్యాష్‌ట్యాగ్‌కు అసలు అర్థం ఏమిటో అల్లు అర్జున్ వివరించలేదు. అయితే అల్లు అర్జున్ గతంలో చేసిన ఓ వ్యాఖ్యను బట్టి ఆ భావం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఓ సందర్భంలో బన్నీ మాట్లాడుతూ “కట్టే కాలే వరకు చిరంజీవి ఫ్యాన్” అని అన్నారు. అప్పట్లో ఆయన చేసిన ఈ వ్యాఖ్య వైరల్‌గా మారింది. ఇప్పుడు అదే మాటను గుర్తు చేసేలా #KKAVCF అనే హ్యాష్‌ట్యాగ్‌ను అల్లు అర్జున్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. అయితే ఈ హ్యాష్‌ట్యాగ్‌కు పూర్తి అర్థాన్ని బన్నీ స్వయంగా వెల్లడించలేదు

టాలీవుడ్లో సరికొత్త టైటిల్స్ ఎప్పుడూ సినీ ప్రియులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. అయితే తాజాగా మెగా కాంపౌండ్‌లో ఒక ఆసక్తికరమైన ‘రైమింగ్, సెంటిమెంట్’ హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్లో సరికొత్త టైటిల్స్ ఎప్పుడూ సినీ ప్రియులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. అయితే తాజాగా మెగా కాంపౌండ్‌లో ఒక ఆసక్తికరమైన ‘రైమింగ్, సెంటిమెంట్’ హాట్ టాపిక్‌గా మారింది. అదే మెగా, అల్లు హీరోల ‘కా’ అక్షర ప్రాస సెంటిమెంట్. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) ఇద్దరూ తమ రాబోయే భారీ చిత్రాలకు సరిగ్గా రెండు అక్షరాల పవర్ఫుల్ టైటిల్స్‌ను ఎంచుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో సినీ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. మామ ‘కాకా’గా, అల్లుడు ‘రాకా’గా బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమవుతుండటంతో నెట్టింట తెగ సందడి నెలకొంది. ముందుగా అల్లుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయానికి వస్తే.. కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఆయన నటిస్తోన్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు ‘రాకా’ (Raaka) అనే టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. బన్నీలోని పూర్తిస్థాయి మాస్, యాక్షన్ అంశాలను ఎలివేట్ చేసేలా ఈ టైటిల్ ఉండటంతో.. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందులోనూ ‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ నుంచి వస్తోన్న చిత్రం కావడంతో ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులంతా ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారంటే అతిశయోక్తి కానే కాదు. ఇక మామ.. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న Mega158 చిత్రానికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను నేడు (ఆగస్ట్ 22) గ్రాండ్‌గా విడుదల చేశారు. అందరూ ఊహించినట్లు కాకుండా ఈ చిత్రానికి ‘కాకా’ (Kaaka) అనే అదిరిపోయే మాస్ టైటిల్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో సోషల్

ఓర్మాక్స్ మీడియా జులై నెలకు సంబంధించి ఇండియా మోస్ట్ పాపులర్ టాప్ 10 హీరోల జాబితాని విడుదల చేసింది. ఇందులో సరికొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. అల్లు అర్జున్ దుమ్ములేపారు. ఎన్టీఆర్ మళ్లీ లిస్ట్ లోకి రాగా, రామ్ చరణ్‌కి పెద్ద షాక్ ఇచ్చారు మహేష్ బాబు. అదే సమయంలో సూర్య తన సత్తాని చాటుకున్నారు. మరి ఇండియాలో టాప్ హీరో ఎవరనేది, టాప్ 10 లిస్ట్ లో ఎవరున్నారనేది చూస్తే. మొదటిస్థానం గురించి అందరు మర్చిపోవాల్సిందే. ఎందుకంటే ఆ స్థానంలో ఒక్కరే ఉన్నారు. ఒక్కరే శాసిస్తున్నారు. ఆయనే ప్రభాస్. చాలా కాలంగా ఆయన మొదటి స్థానంలో ఉన్నారు. ఇప్పుడు కూడా నెంబర్ 1గా నిలిచారు. తనదైన ఇమేజ్, పాపులారిటీ, భారీ సినిమాలతో నిత్యం చర్చల్లో ఉంటారు ప్రభాస్. దీంతో నెంబర్ 1గా రాణిస్తున్నారు. మిగిలిన హీరోల స్థానాలు నిత్యం మారుతూనే ఉన్నాయి. కానీ తన స్థానంలో మార్పు లేదని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆయన `ఫౌజీ`, `స్పిరిట్` చిత్రాల్లో నటిస్తున్నారు. రెండో స్థానంలో కోలీవుడ్ స్టార్, తమిళనాడు సీఎం విజయ్ ఉన్నారు. ఆయన జూన్‌లో మూడో స్థానంలో ఉండగా, ఇప్పుడు రెండో స్థానంలోకి వచ్చారు. అదే సమయంలో నాల్గో స్థానంలో ఉన్న అల్లు అర్జున్ మూడో స్థానంలోకి దూసుకొచ్చారు. బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్‌కి పెద్ద షాక్ ఇచ్చారు. ఈ ఇద్దరు రెండు మూడు స్థానాల్లోకి రావడంతో షారూఖ్ నాల్గో స్థానంలోకి పడిపోయారు. బన్నీ ప్రస్తుతం `రాకా`లో నటిస్తున్నారు. ఐదో స్థానంలోకి సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చారు. ఆయన జూన్‌లో ఆరో స్థానంలో ఉన్నారు. కానీ జులైలో రామ్ చరణ్‌కి ఝలక్ ఇస్తూ 5వ స్థానంలోకి రావడం విశేషం. రామ్ చరణ్ గురించి గత నెలలో పెద్దికి సంబంధించిన చర్చ జరిగినా కూడా ఆయన పడిపోవడం గమనార్హం. అదే సమయంలో ఎలాంటి చర్చ లేకుండా మహేష్ బాబు ఒక్క స్థానం మెరుగుపడ్డారు. ఐదో

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫాంటసీ రాకా. పుష్ప 2 , జవాన్ తర్వాత ఆ ఇద్దరు కలుస్తుండటంతో 'రాకా' పై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పాక్కర్లేదు. సన్ పిక్చర్స్ సుమారు 700 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ భారీ వండర్ ప్రాజెక్ట్ గురించి తాజాగా బయటకు వచ్చిన న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. ఆస్కార్ అవార్డు గ్రహీత, హాలీవుడ్ స్టార్ నటుడు విల్ స్మిత్ ఈ సైన్స్ ఫిక్షన్ ఎపిక్‌లో కీలకమైన విలన్ రోల్ లో లేదాప్రైమరీ అంటాగనిస్ట్ గా కనిపించనున్నారనే వార్తలు వినబడుతున్నాయి. విల్ స్మిత్ డేట్స్ ఖరారైన వెంటనే షూటింగ్ పార్ట్‌ని విదేశీ షెడ్యూల్లో ప్లాన్ చేయడానికి టీమ్ సమాయత్తమవుతుందని,అల్లు అర్జున్, విల్ స్మిత్ నేరుగా ఢీకొట్టే సన్నివేశాలు ఇండియన్ స్క్రీన్‌పై ఊహించని స్థాయిలో సరికొత్త విజువల్ వండర్ని ఆవిష్కరించనున్నాయని కూడా అంటున్నారు. మరి విల్ స్మిత్ రాకాలో భాగస్వామ్యం కావడం నిజమైతే భారతీయ సినిమా పక్కాగా ప్రపంచ సినీ ప్రేక్షకుల ఒడిలో చేరినట్టే. రాకా సబ్జెక్టు ప్రకారం ఒక భారీ విదేశీ స్టార్ విలన్ గా అవసరం అనేది మాత్రం నిజం. దీపికా పదుకొణే ఒక హీరోయిన్ గా చేస్తుండగా రష్మిక మందన్న, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ వంటి హీరోయిన్ల పేర్లు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఒక ప్రత్యేకమైన కేమియో రోల్ అనే టాక్ కూడా నడుస్తూ ఉంది. ఏది ఏమైనా రూమర్స్ అన్ని నిజం అయ్యి భారతీయ సినీ ప్రేమికులు, ముఖ్యంగా తెలుగు సినిమా ప్రేమికుల కలలు నెరవేరాలని కోరుకుందాం. సూపర్‌స్టార్స్ సినిమాలకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారిన పూర్ణ.! గ్లామర్ సెల్ఫీలతో కేక పుట్టిస్తున్న 'అర్జున్ రెడ్డి' భామ.. వైరల్ అవుతున్న పిక్స్.!

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకి కొత్త ట్యాలెంట్ ని వెతికి పట్టుకోవడంలో, కొత్త కథలని తయారు చేయించుకోవడంలో ఎంతో అనుభవం ఉంది. తన కెరీర్ బిగినింగ్ నుంచి దిల్ రాజు కథపై ఎక్కువగా ఫోకస్ పెట్టడం చూస్తూనే ఉన్నాం. ఒక కథ నచ్చి అది వర్కౌట్ అవుతుంది అనిపిస్తే దిల్ రాజు వదిలిపెట్టరు. అందుకే దిల్ రాజుకి ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎక్కువ. మహేష్ బాబు, రాంచరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలు రిజెక్ట్ చేసిన కథతో దిల్ రాజు సూపర్ హిట్ కొట్టి చూపించారు. దీని గురించి దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హ్యాపీ డేస్ టైం నుంచి శేఖర్ కమ్ములతో పరిచయం ఉంది. హ్యాపీడేస్ చిత్రాన్ని దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేసి రిలీజ్ చేశారు. ఆ సినిమాకి మంచి పబ్లిసిటీ లభించడంలో దిల్ రాజు స్ట్రాటజీ బాగా వర్కౌట్ అయింది. హ్యాపీడేస్ రిలీజ్ అయిన పదేళ్ల తర్వాత దిల్ రాజు నిర్మాణంలో శేఖర్ కమ్ముల చిత్రం ఖరారైంది. ఆ సినిమానే ఫిదా. ఈ చిత్రం విషయంలో తెరవెనుక చాలా కసరత్తు, పరిణామాలు చోటు చేసుకున్నాయి అని దిల్ రాజు తెలిపారు. దిల్ రాజు మాట్లాడుతూ.. ఫిదా స్టోరీ లైన్ విన్నప్పుడు ఈ సినిమాని నేనే ప్రొడ్యూస్ చేయాలి అని డిసైడ్ అయ్యాను. శేఖర్ కమ్ముల ఈ కథని ఎలాగైనా స్టార్ హీరోతోనే చేయాలి అనే పట్టుదలతో ఉన్నారు. నేను ఎంటర్ కావడానికి ముందే మహేష్ బాబుకి కథ వినిపించారు. మహేష్ కి కథ నచ్చింది. కానీ తన ఇమేజ్ కి సరిపోతుందా అనే డౌట్ తో పక్కన పెట్టారు. నేను ఎంటర్ అయ్యాక రాంచరణ్ కి కథ వినిపించాం. చరణ్ వద్ద కూడా అదే సిట్యుయేషన్. అల్లు అర్జున్ కూడా విని బావుంది అని అన్నారు. కానీ ఒక స్టార్ హీరోకి సరిపడే అంశాలు ఈ సినిమాలో

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun), డైరెక్టర్ అట్లీ(Atlee) కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ రాకా(Raaka)పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో రూపొందుతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్టు ఇప్పటికే టాక్ ఉంది. ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచీ భారీ స్థాయిలో అంచనాలు ఉండటానికి అట్లీ ప్లానింగ్‌తో పాటు సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన వార్తలు కూడా కారణంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఈ కథ అల్లు అర్జున్ కంటే ముందు పలువురు స్టార్ హీరోల వద్దకు వెళ్లిందనే ప్రచారం అప్పట్లో జరిగింది. ఇదే సమయంలో హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్‌ను కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం చేయాలని అట్లీ భావిస్తున్నారనే వార్తలు గతంలో సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే ఆ తర్వాత ప్రాజెక్ట్ అల్లు అర్జున్ చేతుల్లోకి రావడంతో ఆ ప్రచారం క్రమంగా మరుగున పడింది. ఇప్పుడు మరోసారి విల్ స్మిత్(Will Smith) పేరు రాకాతో ముడిపడి వినిపించడం ఆసక్తిని పెంచుతోంది. సినిమాలో ఆయన కీలక పాత్రలో కనిపించనున్నారనే రూమర్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తకు సంబంధించి మేకర్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. గతంలోనూ ఇదే తరహా ప్రచారం జరగడంతో తాజా రూమర్స్‌ను ఎంతవరకు విశ్వసించాలనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ విల్ స్మిత్ నిజంగానే రాకాలో భాగమైతే, అల్లు అర్జున్‌కు ఇది హాలీవుడ్ స్థాయిలో మరింత గుర్తింపు తెచ్చే కీలక అడుగుగా మారే అవకాశం ఉంది. అట్లీ, సన్ పిక్చర్స్(Sun Pictures) టీమ్ ఈ భారీ ప్రాజెక్ట్ కోసం ఎలాంటి సర్ప్రైజ్లు సిద్ధం చేశారో అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గంగోత్రి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మ్యూజికల్ హిట్ గా నిలిచింది. అయితే బన్నీకి ఈ మూవీతో సరైన గుర్తింపు మాత్రం రాలేదు. బన్నీ లుక్స్ పై ట్రోలింగ్ కూడా జరిగింది. అల్లు అర్జున్ కి యువతలో ఫాలోయింగ్ మొదలైంది మాత్రం ఆర్య మూవీతోనే. ఈ సినిమా ప్రారంభానికి ముందు చాలా కసరత్తు జరిగింది. దర్శకుడిగా సుకుమార్ కి ఇదే తొలి చిత్రం. దీనితో అందరినీ ఒప్పించి సినిమా ప్రారంభించడానికి చాలా టైం పట్టింది. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆర్య సినిమా విషయంలో తెరవెనుక జరిగిన సంగతులని పంచుకున్నారు. ఆర్య కథలో సెకండ్ హాఫ్ పై అల్లు అరవింద్ కి అంతగా నమ్మకం లేదు. కథ ఎటెటో వెళ్ళిపోతోంది అని ఆయన భావించారు. దీనితో దిల్ రాజు, సుకుమార్ టీం కథపై రీ వర్క్ చేయాల్సి వచ్చింది. అల్లు అరవింద్ కి నచ్చేలా కథని సిద్ధం చేయడానికి సుకుమార్ కి తల ప్రాణం తోకలోకి వచ్చింది. ఒక దశలో సుకుమార్.. నా వల్ల కావట్లేదు.. నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్లి కాలేజీలో లెక్చరర్ గా పాఠాలు చెప్పుకుంటా అని అన్నారు. లేదు ఇది వర్కౌట్ అవుతుంది అని తాను సుకుమార్ కి ధైర్యం చెప్పినట్లు దిల్ రాజు తెలిపారు. ఆ తర్వాత కథపై వర్క్ చేసి 2, 3 మీటింగ్స్ లో ఫైనల్ స్క్రిప్ట్ ని ఓకె చేయించినట్లు దిల్ రాజు తెలిపారు. అంత స్ట్రగుల్ తర్వాత ఆర్య మూవీ తెరకెక్కి సంచలన విజయం అందుకుంది. ప్రేమ కథా చిత్రాల్లో ఆర్య సరికొత్త ట్రెండ్ సృష్టించింది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా సినిమాకి ప్లస్ అయింది. అల్లు అర్జున్, దిల్ రాజు, సుకుమార్ ముగ్గురికీ ఈ సినిమా ఒక

తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన LCU బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్, మానగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో పాన్ -ఇండియా రేంజ్లో భారీ గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన LCU బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) , మానగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో పాన్ -ఇండియా రేంజ్లో భారీ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే, ఆయన దర్శకత్వంలో దళపతి విజయ్‌తో చేసిన లియో, రజనీకాంత్‌తో చేసిన కూలీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టినప్పటికీ.. కథ, సెకండ్ హాఫ్ స్క్రీన్‌ప్లే లోపాల వల్ల సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు, ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నాయి. ఇక ఆ ట్రోల్స్ ని తట్టుకొని DC సినిమాతో హీరోగా పరిచయమై భారీ విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం లోకేష్ .. అల్లు అర్జున్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై కూడా ట్రోలింగ్ నడుస్తూనే ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కథానాయకుడిగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న #AA23 చిత్రంపై సినీ వర్గాల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో, అనిరుధ్ రవిచందర్ సంగీతంలో రాబోతున్న ఈ సినిమా, అత్యంత వినూత్నమైన కాన్సెప్ట్, హై-వోల్టేజ్ యాక్షన్‌తో రూపొందనుంది. ఇటీవల లోకేష్ నటించిన చిత్రంపై అల్లు అర్జున్ ప్రశంసలు కురిపిస్తూ లోకేష్‌ను అభినందించడం, వీరి కాంబినేషన్ మూవీపై ఉన్న క్రేజ్‌ను మరోస్థాయికి తీసుకెళ్లింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో తనపై వస్తున్న విమర్శలు, ట్రోలింగ్‌పై లోకేష్ కనగరాజ్ చాలా హుందాగా, స్పష్టంగా స్పందించాడు. 'మా అమ్మ కూడా నాకు సంబంధించిన ఆ ట్రోల్స్, మీమ్లను స్క్రీన్షాట్లు తీసి పంపుతుంటుంది. ఇందులో కంగారు పడటానికి ఏమీ లేదు

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసు విచారణ నాంపల్లి కోర్టులో జరిగింది. ఈ విచారణకు ప్రముఖ నటుడు అల్లు అర్జున్ వర్చువల్‌గా హాజరయ్యారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టులో జరిగిన విచారణకు అల్లు అర్జున్ నేరుగా కాకుండా వీడియో కాన్ఫరెన్స్ (వర్చువల్) ద్వారా హాజరై తన వాదనలను వినిపించారు. ఇరుపక్షాల వాదనలను నమోదు చేసుకున్న న్యాయస్థానం, ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది. గతంలో సంధ్య థియేటర్ వద్ద భారీ సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో జరిగిన తొక్కిసలాట ఘటన, అనంతరం ఒక మహిళ మరణం, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడిన క్రమంలో నమోదైన కేసులో భాగంగా న్యాయస్థానం ఈ విచారణను చేపట్టింది. అల్లు అర్జున్ ప్రస్తుతానికి రాకా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దీంతో ఆయన ముంబైలోనే మకాం వేసి షూట్ లో పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడింది

రష్మిక మందన్న గాయంతో ‘మైసా’, ‘రణబాలి’ షూటింగ్స్‌పై ప్రభావం పడింది. తాజాగా అల్లు అర్జున్ ‘రాకా’ సినిమా షూటింగ్ కూడా దాదాపు 45 రోజులు ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఒక్క క్షణం కూడా తీరిక లేని స్టార్ హీరోయిన్‌కి గాయమై విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే ఎంత నష్టం? ఒకటా? రెండా? ఎన్ని సినిమాల చిత్రీకరణలు ఆగిపోతాయి? రష్మిక (Rashmika Mandanna) పరిస్థితిని చూస్తున్న వారికి ఇప్పుడు ఈ విషయం చాలా బాగా అర్థమవుతోంది. ‘మైసా’ సినిమా కోసం పాట చిత్రీకరిస్తుండగా రష్మిక మందన్న కుడి వైపు తుంటి భాగానికి గాయమైంది. ఆరు వారాల రెస్ట్ ఎప్పుడు పూర్తవుతుందా... రష్మిక మళ్లీ ఎప్పుడెప్పుడు వస్తారా అని ‘మైసా’ (Mysaa) మేకర్స్ ఎదురు చూస్తున్నారు. అలాగే ‘రణబాలి’ (Ranabaali) సినిమా యూనిట్ కూడా రష్మిక మునుపటిలా తుళ్లుతూ సెట్‌కి వచ్చే రోజు కోసం వెయిటింగ్. ఇటు అల్లు అర్జున్ (Allu Arjun) ‘రాకా’ మూవీ మీద కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు రెండు నెలల పాటు ఆ షూట్లో ఆలస్యం చోటు చేసుకోవచ్చనే మాటలు వినిపిస్తున్నాయి. ‘రాకా’ (Raaka) సెట్లో రష్మిక డబుల్ యాక్టివ్‌గా ఉండాలి. సెప్టెంబర్ ఆఖరునగానీ, అక్టోబర్ మొదటివారంలోగానీ ఆమె సెట్‌కి వచ్చే అవకాశాలుండటంతో, ఆ ప్రకారమే షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నాడట అట్లీ (Atlee)

అల్లు అర్జున్ వరుసగా అట్లీ, లోకేష్ కనగరాజ్, బాసిల్ జోసెఫ్‌లతో సినిమాలు చేస్తున్నారు. భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులతో బన్నీ డైరీ 2028 వరకు ఫుల్‌గా బిజీగా మారింది. 'పుష్ప' సిరీస్‌తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) క్రేజ్ పాన్ ఇండియా సరిహద్దులు దాటి ప్రపంచ వ్యాప్తంగా మారు మోగిపోయింది. తగ్గేదేలే అంటూ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించిన బన్నీ.. ఇప్పుడు తన తదుపరి సినిమాలను కూడా అదే రేంజ్లో, ఊహించని కాంబినేషన్లలో లైనప్ చేస్తున్నారు. ప్రస్తుతం బన్నీ ప్లాన్ చేసిన ప్రాజెక్ట్‌లు, లైనప్ చూస్తుంటే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. అయితే ఈ బిజీ లైనప్ వల్ల టాలీవుడ్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో రాకా (Raaka) అనే భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచే అభిమానుల్లో, ఇండస్ట్రీ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ (Sun Pictures)ఈ చిత్రాన్ని ఏకంగా 1000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు టాక్. హాలీవుడ్ యాక్షన్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్సులతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ ఏడాది చివరినాటికి షూటింగ్ పూర్తి చేసి, 2027లో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ క్వీన్ దీపికా పడుకోణె (Deepika Padukone) కథానాయికగా నటిస్తుండగా.. జాన్వీ కపూర్ (Janhvi Kapoor), నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna)లు కీలక పాత్రల్లో అలరించబోతున్నారనే వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. రాకా సినిమా పూర్తయిన వెంటనే, బన్నీ మరో తమిళ విలక్షణ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో తన 'AA23' ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నారు. మైత్రీ మూవీ

సంధ్య థియేటర్ (Sandhya Theater Stampede) తొక్కిసలాట ఘటన విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే నిందితులందరికీ బెయిల్ మంజూరు కాగా, విచారణ మినిమం గ్యాప్స్ లో త్వరితగతిన సాగుతోంది. ఈరోజు జరిగిన విచారణకు వర్చువల్ గా హాజరయ్యాడు అల్లు అర్జున్ (Allu Arjun). ముంబయిలో షూటింగ్ లో ఉన్న బన్నీ జడ్జి ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యాడు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నిందితులందరికీ చార్జ్ షీటు కాపీలు అందించారు. ప్రత్యక్షంగా హాజరుకావాలంటూ జడ్జి ఆదేశించగా, బన్నీ ప్రత్యేక అనుమతి కోరాడు. ముంబయిలో షూటింగ్ కారణంగా, వీడియో కాల్ ద్వారా హాజరయ్యేందుకు అనుమతించాలని కోరాడు. అలా ఈ కేసు విచారణకు వర్చువల్ గా హాజరవుతున్నాడు అల్లు అర్జున్. ‘పుష్ప-2’ బెనిఫిట్ షో టైమ్ లో సంధ్యా థియేటర్ కు వెళ్లాడు అల్లు అర్జున్. ఆ టైమ్ లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా, ఆమె కొడుకు ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే అతడు ఇప్పటికీ పూర్తిస్థాయిలో కోలుకోలేదు. గాయపడినప్పట్నుంచి ఇప్పటివరకు అతడి ఆలనాపాలనతో పాటు, ఆ కుటుంబ బాధ్యత మొత్తాన్ని బన్నీ తీసుకున్నాడు. ఓవైపు ఆ కుర్రాడి ఆరోగ్యాన్ని చూసుకుంటూనే, మరోవైపు కోర్టు విచారణకు హాజరవుతున్నాడు. ఈ కేసులో ఎ-11గా కొనసాగుతున్నాడు బన్నీ

తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రధాన పాత్రలో అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డీసీ’. ఈ మూవీపై తాజాగా అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ప్రధాన పాత్రలో అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డీసీ’ (DC). సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ వైవిధ్యమైన చిత్రం ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. రీసెంట్గా సూపర్ స్టార్ మహేశ్ బాబు (Super Star Mahesh Babu) ఈ చిత్రాన్ని మెచ్చుకుంటూ పోస్ట్ చేయగా, తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) సైతం ఈ సినిమాను వీక్షించి చిత్ర బృందంపై ప్రశంసల జల్లు కురిపించారు. లోకేష్ కనగరాజ్ నటనతో పాటు సినిమా మేకింగ్ అద్భుతంగా ఉందంటూ బన్నీ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాపై తన రివ్యూను పంచుకుంటూ.. ‘‘ఇప్పుడే ‘డీసీ’ సినిమా చూశాను. ఇది తమిళ చిత్రసీమలో ఒక క్లాసిక్ చిత్రం. అర్థం చేసుకునే వారికి ఇది ఒక అద్భుతమైన దృశ్య కావ్యంలా అనిపిస్తుంది. సినిమా ప్రేమికులందరూ తప్పక చూడాల్సిన చిత్రమిది. ఈ చిత్ర దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్కు నా హృదయపూర్వక అభినందనలు. అనిరుధ్ అందించిన సంగీతం సినిమాకు మాస్టర్ బూస్టర్‌లా నిలిచింది. సాంకేతికంగా ఈ సినిమా అత్యున్నత ప్రమాణాలతో రూపొందింది’’ అంటూ అల్లు అర్జున్ కొనియాడారు. చిత్రంలో నటించిన ఆర్టిస్టులందరూ అద్భుతంగా చేశారని, ముఖ్యంగా వామికా గబ్బి, హీరోగా నటించిన లోకేష్ కనగరాజ్ నటన ఎంతో ఆకట్టుకుందని బన్నీ పేర్కొన్నారు. ‘‘ఈ చిత్రానికి అతిపెద్ద పిల్లర్‌గా నిలిచిన నా దర్శకుడు లోకేష్ కనగరాజ్‌కు, నిర్మాతలు సన్ పిక్చర్స్, మొత్తం ‘డీసీ’ టీమ్‌కు నా ప్రత్యేక అభినందనలు’’ అని తెలిపారు. టాలీవుడ్ అగ్ర హీరోలైన మహేశ్ బాబు, అల్లు అర్జున్ వరుసగా ప్రశంసలు కురిపించడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ‘డీసీ’

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఇటీవల విడుదలైన తమిళ థ్రిల్లర్ 'డిసి' సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రాన్ని ఒక 'తమిళ క్లాసిక్'గా అభివర్ణిస్తూ, ప్రతీ సినిమా ప్రేమికుడు తప్పక చూడాల్సిన కళాఖండం అని సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆయన తాజా రివ్యూ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది."‘డిసి’ చూశాను! ఇదొక తమిళ క్లాసిక్. ప్రతీ సినిమా ప్రేమికుడు తప్పక చూడాలి. దీన్ని అర్థం చేసుకున్న వారికి ఇది ఒక కవిత్వం లాంటిది" అంటూ అల్లు అర్జున్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతూ, దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్కు తన అత్యున్నత గౌరవాన్ని తెలియజేశారు. రాకీ, సాని కాయిధమ్, కెప్టెన్ మిల్లర్ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అరుణ్ పనితనాన్ని ఆయన ప్రత్యేకంగా కొనియాడారు.సినిమాకు తన సంగీతంతో ప్రాణం పోసిన అనిరుధ్ రవిచందర్‌ను 'అబ్సొల్యూట్ మాస్టర్ బూస్టర్' అని పొగిడిన బన్నీ, సాంకేతికంగా సినిమా అత్యున్నత స్థాయిలో ఉందని అన్నారు. ఇక ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించిన ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌ను 'ప్రాజెక్ట్‌కు అతిపెద్ద ఆధారం' అని అభివర్ణించారు. ఆ పాత్రలో లోకేశ్ జీవించారని ప్రశంసించారు. కథానాయిక వామికా గబ్బితో పాటు ఇతర నటీనటులందరూ అద్భుతంగా నటించారని తెలిపారు.ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ఫామ్లో ట్రెండ్ అవుతున్న ఈ సినిమాకు అల్లు అర్జున్ రివ్యూ మరింత బూస్ట్ ఇచ్చింది. ఇప్పటికే ఈ సినిమాను సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా మెచ్చుకున్న సంగతి

టాలీవుడ్ స్టార్ హీరోలు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ కు సంబంధించిన పోస్టర్స్ సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. దాంతో వెంటనే వాటిని సోషల్ మీడియా నుంచి తొలగించారు. సినిమా స్టార్స్ వివాదాలకు దూరంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఒక్కోసారి ఊహించని విధంగా వివాదాలు వారిని చుట్టుముడుతుంటాయి. అలాంటిదే ఆగస్ట్ 15న తెలుగు స్టార్ హీరోలు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ విషయంలో జరిగింది. అల్లు అర్జున్ ఆగస్ట్ 15, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఓ పోస్ట్ పెట్టారు. అందులో ఢిల్లీ ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలాడుతున్నట్టుగా ఉంది. అయితే ఆ జెండాలో అశోక చక్రం మిస్ అయ్యింది. దాంతో కొందరు నెటిజన్స్ జాతీయ పతాకాన్ని అలా ఎలా తప్పుగా చూపిస్తారంటూ కామెంట్స్ పెట్టారు. ఆ వెంటనే, బన్నీ పీ.ఆర్. టీమ్ సోషల్ మీడియా నుంచి ఆ పోస్టర్ ను తొలగించింది. అయితే అప్పటికే కొందరు దాని స్క్రీన్ షాట్ ను తీసుకుని, అల్లు అర్జున్ ను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే... ఆగస్ట్ 15నే విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'రణబాలి'కి సంబంధించిన పోస్టర్ ను చిత్రనిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేసింది. ప్రేక్షకులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ఆ పోస్టర్ ద్వారా తెలిపింది. రక్తసిక్తమైన దేహంతో ఉన్న విజయ్ దేవరకొండ భారత జాతీయ పతాకాన్ని తన ఒంటికి కప్పుకున్నట్టుగా ఆ పోస్టర్ ను తయారు చేశారు. దాని మీద కూడా కొన్ని రక్తపు మరకలు ఉన్నాయి. ఈ పోస్టర్ పై ఎలాంటి వివాదం తలెత్తకపోయినా... ముందు జాగ్రత్తగా కావచ్చు, వెంటనే దానిని సోషల్ మీడియా నుంచి తొలగించి జాతీయ జండా రెపరెపలాడుతున్న నేపథ్యంలో హీరో గుర్రంపై వస్తున్న పోస్టర్ ను తిరిగి పోస్ట్ చేశారు. ఆగస్ట్ 15న తెలుగు సినిమా రంగంలో చోటు చేసుకున్న ఈ రెండు సంఘటనలతో అగ్ర కథనాయకులకు చెందిన
‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీతో దేశవ్యాప్తంగా అపారమైన ప్రజాదరణ సొంతం చేసుకున్న కన్నడ స్టార్ హీరో యశ్ ప్రస్తుతం గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ హిందీ టాక్ షో ఇంటర్వ్యూలో పాల్గొన్న యశ్.. హీరోల స్టార్డమ్, పాన్ ఇండియా ఇమేజ్‌పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.* రవితేజ రూ.12 లక్షలు పెట్టి కొన్న మామిడి తోట.. ఇప్పుడు రూ.వందల కోట్లు.. హిట్టు ఫ్లాప్ తీసి అవతల**టాక్ షోలో భాగంగా సదరు యాంకర్ యశ్‌ను ప్రశ్నిస్తూ.. "సౌత్ నుంచి రామ్ చరణ్, అల్లు అర్జున్ , జూనియర్ ఎన్టీఆర్, దళపతి విజయ్, మహేశ్ బాబు వంటి స్టార్ హీరోలు మీలాగా త్వరితగతిన పూర్తిస్థాయి పాన్ ఇండియా సూపర్ స్టార్లుగా ఎందుకు ఎదగలేకపోయారు?" అని అడిగారు. దక్షిణాది స్టార్లను తక్కువ చేసి మాట్లాడినట్లున్న ఈ ప్రశ్నకు యశ్ ఏమాత్రం తడబడకుండా ఎంతో పరిణతితో, హుందాగా బదులిచ్చారు. స్టార్ ఇమేజ్ అనేది శాశ్వతం కాదని స్పష్టం చేస్తూ యశ్ తనదైన శైలిలో విశ్లేషించారు. సౌత్ స్టార్ హీరోలంతా సినీ పరిశ్రమలో అద్భుతమైన విజయాలు సాధిస్తూ అత్యున్నత స్థాయిలో రాణిస్తున్నారని ప్రశంసించారు. 'పాన్ ఇండియా స్టార్' అనే పదం మనం చేసే పనిని బట్టి వచ్చే ఒక టెర్మినాలజీ మాత్రమేనని, చిత్ర పరిశ్రమలో ఏ ట్యాగ్ కూడా శాశ్వతంగా ఉండదని పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఒకే ఒక్క శుక్రవారం బాక్సాఫీస్ ఫలితం ఎవరి భవితవ్యాన్నైనా మార్చేయగలదని చెప్పారు. శుక్రవారం థియేటర్లలో వచ్చే తీర్పును బట్టి స్టార్లు, వారి పాన్ ఇండియా హోదాలు మారిపోతుంటాయని, కాలంతో పాటు విజయాలు రావడం, పోవడం సహజమని వివరించారు.* చివరి 40 నిమిషాలు సీట్లో కూర్చోలేరు.. ‘ఇరుముడి’పై అంచనాలు పెంచేసిన శివ నిర్వాణటాలీవుడ్ అభిమానుల అసంతృప్తియశ్ ఇచ్చిన సమాధానం చాలా హుందాగా, పరిణతితో కూడుకున్నదంటూ సినీ

ఒకప్పుడు సినీ తారల ఇళ్లను బయట నుంచి చూడటమే అభిమానులకు ప్రత్యేక అనుభూతి. ఇప్పుడు ఆ ఇళ్లలోనే ఒకటి రెండు రోజులు గడిపే అవకాశం వస్తోంది. బాలీవుడ్ నటులు, క్రీడాకారులు తమకు ఎంతో ఇష్టమైన ఇళ్లను హోమ్ స్టేలుగా మార్చడంతో ఈ కొత్త ట్రెండ్‌కు ఆదరణ పెరుగుతోంది. హైదరాబాద్‌కు చెందిన కొందరు వైద్యులు, వ్యాపారవేత్తలు కూడా ఇదే మోడల్‌ను అనుసరిస్తున్నారు. సెలబ్రిటీ నివసించిన ఇంట్లో ఉండటం అంటే కేవలం ఓ లగ్జరీ స్టే కాదు.. వారి అభిరుచి, జీవనశైలిని దగ్గరగా అనుభవించే అవకాశం. ఇంట్లోని ఫర్నిచర్, పెయింటింగ్స్, పుస్తకాలు, అలంకరణ వస్తువులు, తోటలు.. ఇలా ప్రతి అంశం ఆ ఇంటి ప్రత్యేకతను తెలియజేస్తుంది. శ్రీదేవి ఇంట్లో బస చేసే అవకాశం దివంగత నటి శ్రీదేవి నివసించిన ఇంటిని హోమ్ స్టేగా అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనను ఆమె కుమార్తె జాన్వీ కపూర్ గతంలో వెల్లడించారు. ఆ ఇంటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానుల్లోనూ ఆసక్తి పెరిగింది. శ్రీదేవి అభిరుచికి తగ్గట్టుగా రూపొందిన ఇంటి వాతావరణంలో కొంత సమయం గడపడం సినీ అభిమానులకు ప్రత్యేక అనుభూతిగా మారనుంది. అదే తరహాలో బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు తమ వెకేషన్ హోమ్స్‌ను ఖాళీగా ఉంచకుండా హాలిడే స్టేలుగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. షారుక్ ఖాన్, ఆలియా భట్, కత్రినా కైఫ్, అర్జున్ కపూర్ వంటి తారలతో పాటు మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, బైచుంగ్ భుటియా వంటి ప్రముఖుల పేర్లు కూడా ఈ ట్రెండ్‌లో వినిపిస్తున్నాయి. గోవాలో సెలబ్రిటీ హోమ్ స్టేలకు క్రేజ్ గోవా ఈ ట్రెండ్‌కు ప్రత్యేక కేంద్రంగా మారింది. నటుడు అర్జున్ మాథుర్‌కు చెందిన ‘ట్రాంక్విల్ హెవెన్’, యువరాజ్ సింగ్‌కు సంబంధించిన ‘కాసా సింగ్’ వంటి ప్రైవేట్ ప్రాపర్టీలు హాలిడే స్టేలకు ఆకర్షణగా నిలుస్తున్నాయి. నటుడు అజయ్ దేవగన్‌కు చెందిన గోవా విల్లా కూడా ఇలాంటి లగ్జరీ స్టే అనుభూతిని కోరుకునే వారికి
సినీ హీరోల అభిమానులంటే వారి సినిమాల సందర్భాల్లో థియేటర్ల వద్ద ఫ్లెక్సీలు కట్టడం, పుట్టినరోజున కేకులు కట్ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించడం చూస్తూనే ఉంటాం. అయితే తాము అందరి హీరోల ఫ్యాన్స్‌లా కాదంటూ తాజాగా నిరూపించారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు. సినిమా వేడుకలు, ఫ్లెక్సీలకే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వస్థ్ నారీ వికసిత్ భారత్’ లక్ష్యానికి మద్దతుగా, ‘ఆల్ ఇండియా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ’ ( AAFA ) దేశవ్యాప్తంగా మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం చేపట్టిన అవగాహన ఉద్యమం విశేష స్పందనను రాబడుతోంది. ముఖ్యంగా ప్రాణాంతక గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ( సర్వైకల్ క్యాన్సర్ ) నివారణకు దోహదపడే హెచ్‌పీవీ (HPV) టీకా ప్రాముఖ్యతపై విస్తృత ప్రచారం నిర్వహిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.* ‘బల్లగుద్ది చెప్తున్నా.. సినిమా అందరికీ నచ్చుతుంది’: ‘ఇరుముడి’ ప్రీ రిలీజ్ వేడుకలో రవితేజ ధీమా7 రాష్ట్రాలు.. 400కి పైగా సదస్సులు ‘ఒక లక్ష మంది బాలికలు.. ఒక ఉజ్వల భవిష్యత్తు’ అనే ప్రధాన ఆశయంతో AAFA ఈ మహా యజ్ఞాన్ని ముందుకు నడిపిస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు 7 రాష్ట్రాల్లో 400కి పైగా అవగాహన సదస్సులను విజయవంతంగా పూర్తి చేసి, సుమారు లక్ష మందికి పైగా యువతులకు, పాఠశాల-కళాశాల విద్యార్థినులకు ప్రత్యక్షంగా చేరువయ్యారు. సర్వైకల్ క్యాన్సర్‌కు కారణమయ్యే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV) ఇన్ఫెక్షన్లను సకాలంలో టీకా తీసుకోవడం ద్వారా ఎలా నిరోధించవచ్చో వైద్య నిపుణుల సమక్షంలో వివరించారు. 9 ఏళ్ల నుంచి 26 ఏళ్ల లోపు వయసున్న బాలికలు, యువతులకు ఈ వ్యాక్సిన్ అత్యంత కీలకమని తెలియజేస్తూ, చిన్న వయసులోనే టీకా తీసుకోవడం వల్ల కలిగే రక్షణను వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అందుబాటులో ఉన్న ఉచిత టీకా సదుపాయాల గురించి సాధారణ ప్రజలకు సులభంగా

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు కేవలం సినిమా వేడుకలు, రికార్డుల వేటకే పరిమితం కాకుండా నిరంతరం సమాజ హిత కార్యక్రమాల్లో ముందుంటూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) అభిమానులు కేవలం సినిమా వేడుకలు, రికార్డుల వేటకే పరిమితం కాకుండా నిరంతరం సమాజ హిత కార్యక్రమాల్లో ముందుంటూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఆల్ ఇండియా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) సామాజిక బాధ్యతతో చేపట్టిన మరో బృహత్తర కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘స్వస్థ్ నారీ వికసిత్ భారత్’ కార్యక్రమంలో భాగంగా సర్వైకల్ క్యాన్సర్ నివారణ, హెచ్‌పీవీ (HPV) వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించే దిశగా బన్నీ ఫ్యాన్స్ విశేష కృషి చేస్తున్నారు. ఈ మహోద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఏకంగా 7 రాష్ట్రాల్లో 400కు పైగా హెచ్‌పీవీ అవేర్నెస్ కార్యక్రమాలను AAFA విజయవంతంగా నిర్వహించింది. మహిళల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న సర్వైకల్ క్యాన్సర్‌ను హెచ్‌పీవీ టీకా ద్వారా ఎలా సమర్థవంతంగా అడ్డుకోవచ్చో వివరిస్తూ, ఈ డ్రైవ్ ద్వారా ఇప్పటివరకు 1 లక్ష మందికి పైగా యువతులు, బాలికలకు చేరువై వారికి పూర్తిస్థాయి అవగాహన కల్పించారు. ‘7 రాష్ట్రాలు, 400కి పైగా కార్యక్రమాలు, 1 లక్ష మందికి పైగా బాలికలు.. ఒక ఉజ్వల భవిష్యత్తు’ అనే నినాదంతో అభిమానులంతా సమష్టిగా కదిలి ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నారు. సినిమా రంగంలో తమ అభిమాన కథానాయకుడు అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో సరికొత్త రికార్డులు సృష్టిస్తుంటే, ఆయన స్ఫూర్తితో అభిమానులు కూడా దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాల్లో సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తున్నారు. భవిష్యత్ తరాలైన యువతుల ఆరోగ్య పరిరక్షణకు, క్యాన్సర్ రహిత సమాజ నిర్మాణానికి తోడ్పడుతూ చేపట్టిన ఈ భారీ అవగాహన కార్యక్రమంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. నెటిజన్లు, పలువురు సామాజిక కార్యకర్తలు #AAFASupportsHPVDrive హ్యాష్‌ట్యాగ్‌తో అల్లు అర్జున్

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా టాక్సిక్. గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేసిన ఈ ఈసినిమా మరో పది రోజుల్లో వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో అడుగుపెట్టబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ను జెట్ స్పీడ్ లో చేస్తున్నాడు యష్. అందులో భాగంగా బాలీవుడ్ లో చేసిన ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ ఇంటర్వ్యూలో విలేకరి ప్రశ్నిస్తూ.. “రామ్ చరణ్, విజయ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వంటి దక్షణాది నటులు మీలాగా పాన్ ఇండియా సూపర్‌స్టార్స్‌గా ఎందుకు ఎదగలేకపోయారు? దానికి గల కారణాలు ఏంటి?” అని అడగగా యశ్ దానికి కాస్త హుందాగా సమాధానమిచ్చారు. యశ్ స్పందిస్తూ.. “వారందరూ తమ పరిధిలో చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. ప్రతీ నటుడికి, ప్రతీ సినిమాకి ఒక ప్రత్యేకమైన ప్రయాణం ఉంటుంది. పైగా ‘పాన్ ఇండియా స్టార్’ అనే టైటిల్ ఎవరికీ శాశ్వతం కాదు. అది ఏ ఒక్కరి సొత్తు కాదు, చిత్రపరిశ్రమలో విజయాలు, హోదాలు సమయాన్ని బట్టి మారుతుంటాయని, కేవలం ప్రాజెక్ట్ సాధించే విజయాన్ని బట్టే ఆ సమయానికి గుర్తింపు లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.స్టార్డమ్ అనేది ఒక నిరంతర ప్రక్రియ అని అందరూ కలసి భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తున్నారు’ అని అన్నారు. తోటి కథానాయకుల శ్రమను, వారికున్న ప్రజాదరణను గౌరవిస్తూ యశ్ ఇచ్చిన ఈ సమాధానంపై నెటిజన్లు మరియు సినీ విమర్శకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో రాబోతున్న టాక్సిక్ తో యశ్ ఈసారి ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో చూడాలి

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Allu Arjun Independence Flag Controversy: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ తీవ్ర దుమారం రేపింది. నెటిజన్ల నుంచి వ్యతిరేకత రావడంతో వెంటనే ఆ పోస్టును డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. వివాదానికి కారణం ఏమిటి? స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అల్లు అర్జున్ తన అధికారిక ఎక్స్ (X) ఖాతాలో ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురుతున్నట్లుగా ఉన్న ఒక ఫోటోను షేర్ చేశారు. అయితే, ఆ జెండా మధ్యలో ఉండాల్సిన అశోక చక్రం అందులో కనిపించలేదు. దీంతో బాధ్యత గల ప్రముఖ నటుడిగా జాతీయ పతాకాన్ని సరిచూసుకోకుండా పోస్ట్ చేయడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జెండాలో చక్రం లేకపోయినా, అల్లు అర్జున్ తన సొంత లోగోను మాత్రం స్పష్టంగా వేసుకున్నారని సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలు పెరుగుతుండటంతో బన్నీ వెంటనే ఆ పోస్టును తొలగించారు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. అల్లు అర్జున్ లైనప్ ప్రాజెక్ట్స్ మరోవైపు, అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన చేతిలో భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న ఈ పాన్ వరల్డ్ మూవీ 'రాకా' భారీ బడ్జెట్‌తో వస్తోంది. గిరిజన, పురాణ నేపథ్యం, సమకాలీన కాలం అనే రెండు విభిన్న ప్రపంచాల నేపథ్యంలో ఈ సినిమా సాగనుందని సమాచారం. 2027 సెకండాఫ్‌లో రిలీజ్ కానున్న ఈ

టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ‘DC’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న లోకేష్‌కు అల్లు అర్జున్ టీమ్ ప్రత్యేక అభినందనలు తెలిపింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ AA23 టీమ్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ వేడుకను నిర్వహించారు. గత కొంతకాలంగా అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రకటన వచ్చినప్పటి నుండి చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. లోకేష్ కనగరాజ్ తనదైన శైలిలో రూపొందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇదిలా ఉండగా, DC చిత్ర విజయం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా మైత్రి మూవీ మేకర్స్ కీలక ప్రకటన చేసింది. “డిసి చిత్రానికి అఖండ విజయం అందించినందుకు అభినందనలు లోకేష్ కనగరాజ్, ఇప్పుడు AA23 వంతు” అని వారు పేర్కొన్నారు. దీంతో అల్లు అర్జున్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం మొదలైంది. ఈ నేపథ్యంలో లోకేష్ కనగరాజ్ త్వరలోనే AA23 ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులను పూర్తి చేసుకున్న లోకేష్, తదుపరి షెడ్యూల్ కోసం ప్లాన్ చేస్తున్నారు. ఫలితంగా అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులతో ఈ భారీ చిత్రాన్ని రూపొందించేందుకు మైత్రి మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ కెరీర్లోనే ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. లోకేష్ కనగరాజ్ మార్క్ మేకింగ్‌కు అల్లు అర్జున్ స్టార్డమ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం ఖాయమని స్పష్టమవుతోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ మరియు ఇతర వివరాలను చిత్ర బృందం అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది
దేశవ్యాప్తంగా 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటీనటులు, దర్శకులు, నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. భారత స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం సర్వస్వం త్యాగం చేసిన అమరవీరుల పోరాటాలను కొనియాడుతూ, దేశ సమగ్రతను కాపాడుకోవాలని ప్రముఖులు పిలుపునిచ్చారు. మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ విషెస్మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు."భారతదేశ విముక్తి కోసం పోరాడిన ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాలు, అసమాన ధైర్యసాహసాల అమూల్యమైన వారసత్వమే నేడు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ. మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ, దేశ స్వాతంత్య్రాన్ని కాపాడుతూ, భవిష్యత్ తరాలు గర్వపడేలా చేయడం ద్వారా ఆ మహనీయుల వారసత్వాన్ని మనం గౌరవించుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడికి 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు! జై హింద్.. వందేమాతరం!" పవన్ కళ్యాణ్ సందేశంఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సుదీర్ఘమైన, స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ప్రజలతో పంచుకున్నారు."80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. తమ అసమాన ధైర్యం, ప్రాణత్యాగాలు, దేశభక్తితో నేటి స్వేచ్ఛను మనకు ప్రసాదించిన అసంఖ్యాక స్వాతంత్య్ర సమరయోధులకు నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ అనేది తేలికగా తీసుకునే బహుమతి కాదు.. అది మన జాతీయ సమగ్రత, సార్వభౌమాధికారం, దేశ సమగ్రతను కాపాడాల్సిన ఒక పవిత్రమైన బాధ్యత అని వారి జీవితాలు నిరంతరం గుర్తుచేస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన ఈ 80 ఏళ్లలో భారత్ దృఢ సంకల్పంతో అద్భుతమైన ప్రగతిని సాధించింది. అంతరిక్ష రంగంలో గ్లోబల్ పవర్‌గా ఎదిగి చంద్రుడి దక్షిణ ధ్రువంపై చారిత్రాత్మక ల్యాండింగ్ సాధించడం నుంచి, ప్రపంచ స్థాయి మౌలిక వసతుల నిర్మాణం, యూపీఐ ద్వారా విప్లవాత్మక డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సృష్టి, రక్షణ రంగ సామర్థ్యాల బలోపేతం, ప్రపంచ

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Allu Arjun Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ వరల్డ్ చిత్రం రాకా పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ మూవీకి సంబంధించి ఇప్పటివరకు ఫస్ట్ లుక్ మినహా పెద్దగా ఎలాంటి వివరాలు బయటకు రాలేదు. దీంతో సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న వార్త సోషల్ మీడియాలో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా రాకా లో నటించే హీరోయిన్ల పాత్రలపై బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో ఏకంగా నలుగురు హీరోయిన్లు కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ ఈ ప్రాజెక్టులో భాగమని అధికారికంగా వెల్లడించారు. ఆమె సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న షూటింగ్లో దీపికా పాల్గొంటున్నారని, ఆమెకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జాన్వీ కపూర్, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ కూడా రాకా లో కీలక పాత్రలు పోషించనున్నారనే ప్రచారం జరుగుతోంది. జాన్వీ కపూర్ ఓ గిరిజన యువతిగా కనిపించనున్నారని, ఆమె పాత్రకు కథలో మంచి ప్రాధాన్యత ఉంటుందని టాక్. రష్మిక పాత్ర మాత్రం మరింత ఆసక్తికరంగా ఉండబోతుందని సమాచారం. ఆమె పాత్ర కథలో కీలక మలుపులకు కారణమవుతుందని, నెగెటివ్ షేడ్స్ కూడా ఉంటాయని ప్రచారం సాగుతోంది. మృణాల్ ఠాకూర్ కూడా కథలో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే వీరి పాత్రలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'రాకా' అనౌన్స్ అయినప్పటి నుంచే ఊహించని రేంజ్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ (Atlee) కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'రాకా'. ఈ ఇద్దరి కలయిక అనౌన్స్ అయినప్పటి నుంచే ఊహించని రేంజ్లో అంచనాలు ఏర్పడ్డాయి. విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి రోజుకో సంచలన వార్త సోషల్ మీడియాను ఊపేస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్లు, వారి పాత్రల గురించి బయటకొస్తున్న లీక్స్ ఇప్పుడు నెట్టింట రచ్చ చేస్తున్నాయి. అందులోనూ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) పాత్ర గురించిన అప్డేట్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా అట్లీ సినిమా అంటేనే బిగ్ స్క్రీన్ ప్రెజెన్స్, గ్రాండ్ విజువల్స్ ఉంటాయి. ఇక అల్లు అర్జున్‌తో ఆయన జతకడితే ఆ రేంజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన సన్ పిక్చర్స్ ఏకంగా రూ. 1000 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. హాలీవుడ్ యాక్షన్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్, మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్సులతో ఈ ప్రాజెక్ట్‌ను రూపుదిద్దుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబయిలో శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ ప్రాజెక్ట్‌లో ఇప్పటికే బాలీవుడ్ క్వీన్ దీపికా పడుకోణె కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమాలో కేవలం ఒకే ఒక్క కథానాయిక కాకుండా ముగ్గురు భామలు నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందులో ఒకరు జాన్వీ కపూర్ కాగా, మరొకరు నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ఇందులో జాన్వీ కపూర్ పాత్రపై ఒక క్రేజీ అప్డేట్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ ఒక శక్తివంతమైన 'గిరిజన రాణి' పాత్రలో కనిపించబోతోందట

ఒకప్పుడు బాలీవుడ్ ఆఫర్ల కోసమో లేదా సినిమాల ప్రమోషన్ల కోసమో దక్షిణాది నటీనటులు ముంబైకి వెళ్లేవారు. కానీ ఇప్పుడు పాన్-ఇండియా సినిమాల ట్రెండ్ పెరిగిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బాక్సాఫీస్ వద్ద సౌత్ సినిమాలు దుమ్మురేపుతుండటంతో ముంబై మహానగరం కూడా దక్షిణాది తారలకు మరో సొంత ఇల్లుగా మారుతోంది. బాలీవుడ్ గుండెకాయ లాంటి బాంద్రా, జూహూ, లోఖండ్వాలా వంటి ప్రైమ్ లోకేషన్లలో సౌత్ స్టార్స్, దర్శకులు వందల కోట్ల విలువైన లగ్జరీ ప్రాపర్టీలను కొనుగోలు చేస్తూ, భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ముంబైలో సౌత్ స్టార్స్ లగ్జరీ ఇళ్లు – అంచనా ధర : పాన్-ఇండియా సినిమాల హవా నడుస్తుండటంతో వరుస షూటింగ్‌లు, బ్రాండ్ ఎండోర్స్మెంట్లు, ముంబై ఆధారిత ప్రాజెక్ట్‌ల కోసం దక్షిణాది తారలు తరచూ ముంబైలోనే సమయాన్ని గడపాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే హోటళ్లలో ఉండటానికి బదులుగా తమదైన శైలిలో కోట్లాది రూపాయలతో లగ్జరీ పెంట్ హౌస్‌లు, డ్యూప్లెక్స్ ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జూహూలో లగ్జరీ పెంట్ హౌస్ కోసం ప్రతినెల రూ. 16 లక్షల అద్దె చెల్లిస్తుండగా, ధనుష్ ఏకంగా రూ. 150 కోట్ల విలువైన ఇల్లు కొనుగోలు చేసాడు. ఈ పరిణామం ఇండియన్ సినిమాలో సౌత్ స్టార్లకు పెరుగుతున్న క్రేజ్ ఏంటో తెలుస్తుంది

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Masala Mafia: హైదరాబాద్ మహానగర పరిసరాల్లో కల్తీ ఆహార పదార్థాలు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. నగర ప్రజల అవసరాలకు తగ్గట్టుగా నిత్యావసర వస్తువుల్లోనూ, మసాలా దినుసుల్లోనూ కల్తీ రాజ్యమేలుతోంది. హైదరాబాద్ పరిసరాల్లో ఆహార పదార్థాల కల్తీ నియంత్రణ విభాగం బృందం కల్తీ కేటుగాళ్ల ఆట కట్టించారు. హైదరాబాద్ పరిసరాల్లోని కిరాణా దుకాణాలకు సరఫరా అవుతున్న మసాలా దినుసులు, నిత్యావసరాలు ఎక్కడినుంచి వస్తున్నాయి? ఎక్కడ తయారు చేస్తున్నారనే అంశాలపై నిఘాపెట్టారు. బాలాపూర్, మైలార్ దేవ్ పల్లిలో నకిలీ మసాల గోడౌన్స్.. హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ హెచ్-ఫాస్ట్ బృందం, జీహెచ్ఎంసీ ఆహార భద్రతా అధికారులతో కలిసి హైదరాబాద్ వ్యాప్తంగా సోదాలు నిర్వహించారు. మైలార్‌దేవ్‌పల్లి, బాలాపూర్ గోడవున్లలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, కల్తీకి వాడుతున్న పదార్థాల రంగులు, మెరుపు కోసం ఫ్యాబ్రిక్ డైలు, సింథటిక్ రంగులు, పారిశ్రామిక రంగులను గుర్తించి వాటిని సీజ్ చేశారు. మసాలా దినుసులు నాణ్యంగా ఉన్నట్లు మెరిసేందుకు షైనింగ్ పౌడర్ , రైస్ బ్రాన్ ఆయిల్ వాడుతున్నట్లు గుర్తించారు. మసాలా దినుసుల్లో రసాయన కల్తీ పదార్థాల వల్ల క్యాన్సర్, కాలేయం, కిడ్నీ వ్యాధులు వచ్చే ప్రమాదముందని పోలీసు అధికారులు హెచ్చరించారు. కల్తీ మసాలా దినుసుల తయారీ స్థావరాల్లో తనిఖీలు.. ఒక ప్రాసెసింగ్ యూనిట్లో నకిలీ ఆవాల నిల్వలను వాటి రూపాన్ని, బరువును, పరిమాణాన్ని కృత్రిమంగా పెంచడానికి ఫ్యాబ్రిక్ డై, టాల్కమ్ పౌడర్ ,నూనె కలిపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇతర యూనిట్లలో లవంగాలు, షాజీరా వంటి

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Star Heroes Main Reason For Closing Single Screens: ఇక తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి ప్రసాద్ మల్టీప్లెక్స్ పేరుతో ఈ ట్రెండ్ మొదలైంది. ఒక మల్టీ అంటే ఎక్కువ ఒక చోట ఎక్కువ వినోద కార్యక్రమాలు లేదా ఒక చోట ఎక్కువ స్క్రీన్స్ ఉండటం అనేదే మల్టీప్లెక్స్ ట్రెండ్. అయితే మల్టీప్లెక్స్ రాకముందు వరకు ఓ వెలుగు వెలిగిన సింగిల్ స్క్రీన్స్ ఇపుడు బోసిపోతున్నాయనే చెప్పాలి. అదే సమయంలో స్టార్ హీరోల సినిమాలు విడుదలనపుడు అక్కడ ఉన్నంత హంగామా మరే చోట ఉండదు. అసలు సిసలు వినోదం కావాలంటే సింగిల్ స్క్రీన్స్‌లో సినిమా చూడాల్సిందే. అయితే ఒకప్పుడు ఓ యేడాది ఓ స్టార్ హీరో సినిమా విడుదల కాలేదంటే పెద్ద విశేషంగా చెప్పుకునేవారు. కానీ ఇపుడు ఒక్కో హీరో ఒక్క సినిమా కోసమే యేళ్లకు యేళ్లు వెచ్చిస్తున్నారు. క్రౌడ్ పుల్లర్ హీరోలు ఇలా చేయడం మూలానా సింగిల్ స్క్రీన్స్ బడా స్టార్ హీరోల సినిమాలు విడుదలపుడు మాత్రమే కళకళలాడుతున్నాయి. మిగతా సమయాల్లో థియేటర్స్ రెంట్ కట్టడానికి అపసోపాలు పడుతున్నారు. ఇదంతా స్టార్ హీరోలు యేడాదికో రెండేళ్లకో ఓ సినిమా చేయడం మూలానా సింగిల్ స్క్రీన్స్ మనుగడ ప్రశ్నార్ధాకం అవుతుంది. ఒకప్పుడు సినిమా రిలీజ్ అంటే పండగ వాతావరణం...స్టార్ హీరో సినిమా వస్తుందంటే థియేటర్ల దగ్గర సందడి... సింగిల్ స్క్రీన్లలో హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.చాలా ప్రాంతాల్లో థియేటర్లలో ఈగలు తోలుకుంటు

పాన్ ఇండియా మార్కెట్ వచ్చాక అల్లు అర్జున్‌లో మార్పు మొదలైందా..? ఆ రేంజ్ కాపాడుకోవడానికి మామూలు కథల వైపు చూడటమే మానేశారా..? రొటీన్ కమర్షియల్ సినిమాలకు గుడ్ బై చెప్పి లార్జర్ దెన్ లైఫ్ కాన్సెప్ట్స్‌లకే ఓటేస్తున్నారా..? బన్నీ సెట్ చేసుకున్న ఫ్యూచర్ లైనప్ చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. అసలు అల్లు వారబ్బాయి చేయబోయే ఆ సినిమాలేంటి.. వాటి జానర్స్ ఏంటి..? పుష్పతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అల్లు అర్జున్.. ఇప్పుడు తన ఆ ఇమేజ్ కాపాడుకునే పనిలో పడ్డారు. అందుకే గతంలోలా కమర్షియల్ ఫార్ములా కథలకు దూరంగా ఉంటూ.. వీలైనంత వరకు సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. తన స్టార్ డమ్‌కు తగ్గట్లుగా భిన్నమైన జోనర్స్ ఎంచుకుంటూ.. బాలీవుడ్ హీరోలకు సైతం వణుకు పుట్టించేలా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే అట్లీతో బన్నీ చేస్తున్న AA22 ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఇది పూర్తిగా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో నడిచే సైన్స్ ఫిక్షన్ కథ అని తెలుస్తుంది. లార్జెర్ దెన్ లైఫ్ క్యారెక్టరైజేషన్‌తో వస్తున్న ఈ సినిమాని ఏకంగా 600 కోట్లతో సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఎక్కువగా ముంబైలోనే షూట్ చేస్తున్నారు అట్లీ. మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించే లోకేష్ కనకరాజ్తోనూ ఓ సినిమా చేస్తున్నారు బన్నీ. ఇది అడవి నేపథ్యంలో సాగే ఒక ఉత్కంఠభరితమైన అడ్వెంచరస్ థ్రిల్లర్. అందుకే మోషన్ పోస్టర్లో అడవితో పాటు సింహాన్ని హైలైట్ చేసారు మేకర్స్. 300 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్నారు. హైదరాబాద్‌లోనే AA23 ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ‘మిన్నల్ మురళి’ ఫేమ్ బాసిల్ జోసెఫ్‌తోనూ సినిమా చేయబోతున్నారు బన్నీ. బడ్జెట్ పరిమితులేం పెట్టుకోకుండా సూపర్ హీరో కాన్సెప్ట్‌తో గీతా ఆర్ట్స్ ఈ సినిమాను నిర్మించబోతుంది. ఇప్పటికే పక్కాగా స్క్రిప్ట్ లాక్ అయింది కూడా. ఇలా వరుసగా టైమ్ ట్రావెల్, అడ్వెంచరస్

ప్రీమియం సినిమా అనుభూతికి పేరుగాంచిన AAA సినిమాస్..విశాఖపట్నంలోని ఇనార్బిట్ మాల్లో గ్రాండ్‌గా ప్రారంభమైంది. అత్యాధునిక టెక్నాలజీ, వరల్డ్‌క్లాస్ సినిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ప్రీమియం హాస్పిటాలిటీని ఒకే చోట అందిస్తూ ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించేందుకు AAA సినిమాస్ సిద్ధమైంది. ఈ AAA సినిమాస్ గ్రాండ్ లాంచ్ కార్యక్రమానికి వ్యాపార, సినీ పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దీంతో విశాఖపట్నం ఎంటర్టైన్మెంట్ ల్యాండ్‌స్కేప్‌లో AAA సినిమాస్ మరో కొత్త ల్యాండ్‌మార్క్‌గా నిలిచింది. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, ఏషియన్ సునీల్ నారంగ్, భారత్ నారంగ్, సిమ్రన్ నారంగ్, జ్యేష్ఠ్ నారంగ్, మురళీమోహన్, ఆర్కిటెక్ట్ ఎర్రన్న యెక్బోటే, నిర్మాత బన్నీ వాస్, విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే పి. విష్ణుకుమార్ రాజు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విశాఖపట్నం డీసీపీ విజయ్ మణికంఠ, ఇనార్బిట్ మాల్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రోహిత్ గోపాలనీ, ఇనార్బిట్ మాల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చంద్రేష్ దఫ్తరీ, ఇనార్బిట్ మాల్స్ సీనియర్ జనరల్ మేనేజర్ ఆపరేషన్స్ లలిత్ ఓజా, డిస్ట్రిక్ట్ మూవీస్ బిజినెస్ హెడ్ లవీ దువా, నిర్మాత వంశీ నందిపాటి, వి.ఎల్. శ్రీధర్, వెంకట్ నారాయణ్ (బాబీ), సదానంద్ గౌడ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. పలు రంగాలకు సంబంధించిన ప్రముఖులంతా ఒకే వేదికపైకి రావడంతో AAA సినిమాస్ గ్రాండ్ డెబ్యూ మరింత ఘనంగా, ప్రత్యేకంగా నిలిచింది. విశాఖపట్నం నగరానికి ఇది ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికిన సందర్భంగా దీన్ని ప్రముఖులు పేర్కొన్నారు. విశాఖ AAA సినిమాస్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆయన వేడుకలో పాల్గొని ఈ కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని, గ్రాండ్‌నెస్‌ను తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రేక్షకులతో మంచి అనుబంధం, ఎంతో క్రేజ్ ఉన్న స్టార్‌గా ఈ వేడుకలో అల్లు అర్జున్ పాల్గొనడం కార్యక్రమాన్ని మరింత ప్రత్యేకంగా, అందరికీ

బాలీవుడ్ స్టార్ నటి, లేడీ సూపర్ స్టార్ దీపికా పదుకొణే వర్క్ కమిట్మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ పాత్ర చేసినా, ఏ ప్రాజెక్ట్‌ను ఒప్పుకున్నా తన వంద శాతం శ్రమను అందించే దీపికా.. తాజాగా మరోసారి తన డెడికేషన్‌తో సినీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. బాలీవుడ్ స్టార్ నటి, లేడీ సూపర్ స్టార్ దీపికా పదుకొణే (Deepika Padukone) వర్క్ కమిట్మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ పాత్ర చేసినా, ఏ ప్రాజెక్ట్‌ను ఒప్పుకున్నా తన వంద శాతం శ్రమను అందించే దీపికా.. తాజాగా మరోసారి తన డెడికేషన్‌తో సినీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఎనిమిది నెలల నిండు గర్భవతిగా ఉన్న ఆమె, త్వరలోనే అంటే సెప్టెంబర్‌లో తన రెండవ బిడ్డకు జన్మనివ్వబోతున్న విషయం తెల్సిందే. అయితే ప్రసవ సమయం దగ్గరపడుతున్నా కూడా ఆమె విశ్రాంతి తీసుకోకుండా సెట్స్‌లోనే ఉండటం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. రాకా కోసం ప్రెగ్నెన్సీలో కూడా రిస్క్ తీసుకొంటుందట దీపికా. ప్రస్తుతం దీపికా నటిస్తోన్న భారీ ప్రాజెక్ట్ రాకా. అల్లు అర్జున్- అట్లీ కాంబోలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక రాకా షూటింగ్‌ను డెలివరీకి ముందే పూర్తి చేయాలనే పట్టుదలతో దీపికా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆమె సెట్స్‌లోనే సమయం గడుపుతూ, అవసరమైనప్పుడు అర్థరాత్రి వరకు కూడా షూటింగ్లో పాల్గొంటుందని ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్. ప్రసవానికి కొద్దిరోజుల సమయం మాత్రమే ఉన్నప్పటికీ, సినిమా షెడ్యూల్స్ ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో ఆమె చూపుతున్న ఈ అంకితభావం చూసి చిత్ర యూనిట్, సాంకేతిక నిపుణులు అవాక్కవుతున్నారట. ఆమె ప్రొఫెషనలిజం, సినిమా పట్ల ఉన్న ప్రేమాభిమానాలను చూసి యూనిట్ సభ్యులంతా హ్యాట్సాఫ్ చెబుతున్నారని సమాచారం. తన పర్సనల్ లైఫ్‌ను, ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ను సమానంగా బ్యాలెన్స్ చేస్తూ నటిస్తున్న దీపికా పదుకొణేను చూసి అభిమానులు ది రియల్ క్వీన్ అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మరి ఈ

చేతిలో గొడ్డలి.. ఒంటిపై పుష్పరాజ్ గెటప్.. నోట ‘తగ్గేదేలే’ డైలాగ్! ఝార్ఖండ్ రాజధాని రాంచీలో పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న విద్యార్థుల ఆందోళనలో మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. విద్యార్థుల డిమాండ్లకు మద్దతుగా పుష్ప గెటప్‌లో వచ్చి అందరి దృష్టినీ ఆకట్టుకున్నాడు.పేపర్ లీక్‌లను అడ్డుకోవాలని, డబ్బున్నవాళ్లకే ఉద్యోగాలు దక్కడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశాడు. విద్యార్థులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే నిరసనలో పాల్గొన్నట్లు చెప్పాడు. ఆందోళన శాంతియుతంగా సాగుతుండటంతో తాను మద్దతుగా నిలిచానని తెలిపాడు. విద్యార్థుల డిమాండ్లలో న్యాయం ఉందని, ప్రభుత్వం వాటిని నెరవేర్చాలని కోరాడు.చివర్లో పుష్ప స్టైల్లో ‘డిమాండ్లు నెరవేరే వరకు విద్యార్థులు తగ్గేదేలే’ అంటూ చెప్పిన డైలాగ్ అక్కడున్న వారిని ఆకట్టుకుంది.ఇక తన గెటప్ వెనుక మరో ఆసక్తికరమైన విషయం ఉందని అతడు చెప్పాడు. తాను అల్లు అర్జున్‌కు పెద్ద అభిమానినని తెలిపాడు. పుష్ప-2 విడుదలైనప్పటి నుంచి పుష్పరాజ్ గెటప్‌లోనే ఉంటున్నట్లు చెప్పాడు. పుష్ప-3 వచ్చే వరకు ఇదే గెటప్‌లో కనిపిస్తానని వెల్లడించాడు.ముంబయి సహా పలు నగరాల్లో పుష్ప గెటప్‌లో షోలు కూడా చేస్తుంటానని చెప్పాడు. అయితే ఈసారి తన గెటప్ వినోదం కోసం కాదు.. విద్యార్థుల పోరాటానికి మద్దతు తెలిపేందుకేనని స్పష్టం చేశాడు

ఒకప్పటి కంటే ఇప్పుడు తెలుగు సినిమాల్లో బాలీవుడ్ యాక్టర్స్ కనిపించడం ఎక్కువయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న్యూ ప్రాజెక్ట్ లో ఇప్పటి వరకూ తెలుగులో నటించని బాలీవుడ్ హీరో ఎంట్రీ ఇస్తున్నారట. దాంతో ఒక్కసారిగా టాలీవుడ్ మూవీస్ లో నటించిన బాలీవుడ్ నటులపై సినీ ఫ్యాన్స్ ఫోకస్ పెట్టారు. అల్లు అర్జున్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఈ ప్రాజెక్ట్ లోనే హిందీ హీరో షాహిద్ కపూర్ ఓ కీలక పాత్ర ధరించనున్నారని వినికిడి. ఈ చిత్రాన్ని పౌరాణిక గాథతో తెరకెక్కిస్తారనీ సమాచారం. ఇలా పలు విశేషాలను ఇప్పటి నుంచే అల్లు అర్జున్ - లోకేశ్ కనగరాజ్ కాంబోలో రూపొందే ప్రాజెక్ట్ అందిపుచ్చుకుంటోంది. అదే అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. షాహిద్ కపూర్ ఇప్పటి దాకా తెలుగు చిత్రాల్లో నటించలేదు. అయితే తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా నిర్దేశకత్వంలో షాహిద్ నటించిన 'కబీర్ సింగ్' బిగ్ హిట్ గా నిలచింది. అలాగే తెలుగు నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, నాగవంశీ సంయుక్తంగా నిర్మించిన 'జెర్సీ' సినిమాలోనూ షాహిద్ కపూర్ హీరోగా నటించారు. ఈ చిత్రం కూడా తెలుగు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కడం విశేషం.అయితే 'జెర్సీ' బాక్సాఫీస్ బాంబ్ గా మిగిలింది. తెలుగు చిత్రసీమకు, బాలీవుడ్ హీరోస్ కు అనుబంధం ఏ నాటి నుంచో ఉంది. ఆ మాటకొస్తే తెలుగు భాషలో హిందీ సినిమాలను డబ్బింగ్ చేసి సక్సెస్ సాధించిన వారూ ఉన్నారు. నాటి మేటి నటుడు రాజ్ కపూర్ తన 'ఆహ్' చిత్రాన్ని 1953లోనే తెలుగులో 'ప్రేమలేఖలు'గా డబ్ చేసి విజయం సాధించారు. ఆ పై విజయా ప్రొడక్షన్స్, సురేశ్ ప్రొడక్షన్స్, పద్మాలయా, ప్రసాద్ ప్రొడక్షన్స్ వంటి సంస్థలు పలు హిందీ చిత్రాలు నిర్మించి ఉత్తరాదిన జయకేతనం ఎగురవేశాయి. అంతకు ముందు తెలుగు నిర్మాతలు నిర్మించిన హిందీ చిత్రాల్లో పలువురు హిందీ హీరోలు నటించి

రామ్ చరణ్, అల్లు అర్జున్ వేర్వేరు సందర్భాల్లో ఒకే టయోటా ల్యాండ్ క్రూయిజర్‌లో ప్రయాణించారు. ఏపీ 40 ఎల్ 1 నంబర్ కారు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాలీవుడ్ అగ్రశ్రేణి నటులు రామ్ చరణ్ (Ram Charan), అల్లు అర్జున్ (Allu Arjun) లు ఇటీవల ఏపీ రాష్ట్ర పర్యటనలో భాగంగా వినియోగించిన కారుపై ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. మంగళగిరి (Mangalagiri) స్టేడియంలో ఈ ఏడాది జూన్‌లో జరిగిన ఏపీఎల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చిన రామ్ చరణ్ ప్రయాణించిన ఏపీ 40 ఎల్ 1 ల్యాండ్ క్రూయిజర్ (Toyota Land Cruiser) కారులోనే ఆదివారం అల్లు అర్జున్ విశాఖపట్నంలోని ఇనార్బిట్ మాల్లోని ఏఏఏ స్క్రీన్ల ప్రారంభోత్సవానికి వచ్చారు. దీంతో ఆ కారు గురించి ఇప్పుడు అనేకమంది ఆరా తీస్తున్నారు. ఈ కారు మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుటుంబానికి అత్యంత సన్నిహితు డైన భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ghanta Srinivasa Rao) ది కావడం గమనార్హం. తరుచూ మెగా కుటుంబ సభ్యులు విశాఖ వచ్చినప్పుడల్లా గంటానే స్వయంగా వారికి ఆత్మీయ ఏర్పాట్లు చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ మంగళగిరి పర్యటనకూ ఆయన ఈ కారును పంపారు. తాజాగా అల్లు అర్జున్ సైతం ఆ కారులోనే ప్రయాణించారు. ఈ సందర్భంగా అభిమానులు ఫ్యాన్ వార్లు పక్కన పెట్టాలని ట్యాగ్ చేస్తూ ఇద్దరు హీరోలు ప్రయాణించిన కారు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విశాఖపట్నంలో సందడి చేశారు. నగరంలోని ఇనార్బిట్ మాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఏఏఏ సినిమాస్ మల్టీప్లెక్స్‌ను ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే, ఈ పర్యటనలో అల్లు అర్జున్ ప్రయాణించిన 'AP 40 LE 1' నంబరు గల ల్యాండ్ క్రూయిజర్ కారు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలే మెగా పవర్‌స్టార్ రాంచరణ్ తన ఏపీ పర్యటనలోనూ ఇదే కారును ఉపయోగించడంతో ఇది ఎవరిదనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.సోషల్ మీడియాలో అభిమానులు ఆరా తీయగా, ఈ కారు మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితుడు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుది అని తేలింది. మెగా కుటుంబ సభ్యులు విశాఖకు వచ్చినప్పుడు గంటానే వారికి అన్ని ఏర్పాట్లు చూసుకుంటారని, అందులో భాగంగానే ఆయన తన కారును రాంచరణ్, అల్లు అర్జున్‌ల కోసం పంపారని స్పష్టమైంది. జూన్‌లో మంగళగిరిలో జరిగిన ఏపీఎల్ మ్యాచ్ ప్రారంభోత్సవానికి రాంచరణ్ ఇదే కారులో రావడం గమనార్హం.ఏఏఏ సినిమాస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అల్లు అర్జున్‌తో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, సునీల్ నారంగ్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పి.విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. మొత్తం ఎనిమిది స్క్రీన్లతో నిర్మించిన ఈ మల్టీప్లెక్స్‌లో ప్రస్తుతం ఏడు స్క్రీన్లను ప్రారంభించగా, త్వరలోనే మరొకటి అందుబాటులోకి రానుంది. మధ్యాహ్నం 1 గంటకు మాల్‌కు చేరుకున్న బన్నీ, దాదాపు రెండు గంటల పాటు అక్కడే ఉన్నారు.అల్లు అర్జున్ రాకతో విమానాశ్రయం నుంచి

అల్లు అర్జున్ విశాఖ పర్యటన సందర్భంగా అసాధరణ రీతిలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) విశాఖపట్నం(Visakhapatnam) పర్యటన సందర్భంగా పోలీసులు ఏర్పాటు చేసిన భారీ భద్రత ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇనార్బిట్ మాల్లోని ఏఏఏ సినిమాస్ (AAA Cinemas) ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు అల్లు అర్జున్ ఆదివారం ప్రత్యేక విమానంలో ముంబయి నుంచి విశాఖకు చేరుకున్నారు. పోర్టు ఆస్పత్రి సమీపంలో కొత్తగా నిర్మించిన ఇనార్బిట్ మాల్లో ఏఏఏ సినిమాస్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు ముందస్తుగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మాల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పలు రహదారులను బారికేడ్లతో మూసివేశారు. కైలాసపురం నుంచి నరసింహనగర్ వైపు వెళ్లే మార్గంతో పాటు పోర్టు క్వార్టర్స్ నుంచి జాతీయ రహదారికి చేరుకునే రోడ్డులోనూ ఆంక్షలు విధించారు. దీంతో ఆయా మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అల్లు అర్జున్ పర్యటన కోసం చేసిన భద్రతా ఏర్పాట్లు సీఎం స్థాయి బందోబస్తును తలపించాయని పోలీసు వర్గాల్లో చర్చ జరిగినట్లు సమాచారం. నగర పోలీస్ కమిషనర్ పర్యవేక్షణలో డీసీపీ నేతృత్వంలో ఏడీసీపీలు, ఏసీపీలు, సీఐలు సహా పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బందిని విధుల్లోకి దించారు. ఎయిర్‌పోర్టు నుంచి ఇనార్బిట్ మాల్ వరకు అల్లు అర్జున్ ప్రయాణించే మార్గంలో కీలక జంక్షన్ల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఆయన బస చేసే నోవాటెల్ హోటల్‌కు వెళ్లే దారిలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ విడుదల సమయంలో హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనను దృష్టిలో పెట్టుకుని ఈసారి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించినట్లు సమాచారం. భారీగా అభిమానులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.అయితే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైజాగ్ లో సందడి చేశారు.. AAA మల్టీప్లెక్స్ ను గ్రాండ్ గా ప్రారంభించారు. ఎయిర్ పోర్ట్ నుంచి.. ఇనార్బిట్ మాల్ కు వచ్చేవరకు అడుగడుగునా ఫ్యాన్స్ తమ అభిమాన నటుడిని చూసేందుకు పోటీపడ్డారు.. అందుకు తగ్గట్టుగానే పోలీసులు భద్రత ఏర్పాట్లు కూడా చేశారు. అయితే.. బన్నీ వైజాగ్ టూర్ లో వినియోగించిన కారుపై.. సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఎందుకంటే.. ఇటీవల రామ్ చరణ్ కూడా ఇదే కారులో తలుకుమన్నారు. ఎక్కువ మంది చదివినవి : Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్.. [caption id="attachment_1884696" align="alignnone" width="1280"] Allu Arjun[/caption] టాలీవుడ్ అగ్రశ్రేణి నటులు రాంచరణ్ తేజ్, అల్లు అర్జున్ లు వినియోగించిన కారు పై ప్రస్తుతం సోషల్ మీడియాలో, అభిమానుల్లో విస్తృత చర్చ జరుగుతోంది. మంగళగిరి స్టేడియంలో జూన్ నెలలో జరిగిన ఏపీఎల్ మ్యాచ్ లో రాంచరణ్ ప్రయాణించిన ఏపీ 40 ఎల్ఈ 1 ల్యాండ్ క్రూయిజర్ కారు విశాఖలో తళుక్కుమంది. అదే కారులో ఆదివారం అల్లు అర్జున్ విశాఖ ఇన్ ఆర్బిట్ మాల్ లోని ఏఏఏ థియేటర్ల ప్రారంభోత్సవానికి రావడంతో ఆ కారు పై ఆరా తీస్తున్నారు నెటిజెన్లు, అభిమానులు. ఎక్కువ మంది చదివినవి : Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. 3 ఏళ్లుగా ట్రెండ్ అవుతున్న క్రైమ్ సిరీస్.. [caption id="attachment_1884697" align="alignnone" width="1280"] Bunny Car[/caption] ఈ కారు మెగాస్టార్ చిరంజీవికి, ఆయన కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుది. మెగా కుటుంబ సభ్యులెవరు విశాఖ వచ్చినా గంటా వారికి ఆత్మీయ ఏర్పాట్లు చేస్తుంటారు. "ఇద్దరు హీరోలు ఒకే కారులో ప్రయాణించారు. అనుబంధం అంతర్గతంగా ఎప్పుడూ ఉంటుంది. అభిమానులు ఫ్యాన్ వార్ లు పక్కన పెట్టాలి" అని సోషల్
టాలీవుడ్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విశాఖపట్నంలో పర్యటించారు.. ఆయన ఇనార్బిట్ మాల్లో ఏఏఏ సినిమాస్ థియేటర్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నిర్మాతలు అల్లు అరవింద్, సునీల్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పి.విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం పర్యటనలో అల్లు అర్జున్ ప్రయాణించిన AP 40 LE 1 నంబరు ఉన్న ల్యాండ్ క్రూయిజర్ కారు ఎవరిదనే చర్చ జరుగుతోంది. ఇదే కారును అల్లు అర్జున్‌తో పాటుగా రాంచరణ్ కూడా ఏపీ పర్యటనకు వచ్చిన సమయంలో ఉపయోగించారు. రాంచరణ్ జూన్‌లో మంగళగిరి స్టేడియంలో జరిగిన ఏపీఎల్ మ్యాచ్ ప్రారంభోత్సవానికి ఇదే కారులో వచ్చారు.అల్లు అర్జున్, రాంచరణ్ ప్రయాణించిన AP 40 LE 1 నంబరు ఉన్న ల్యాండ్ క్రూయిజర్ కారులో వెళ్లారు. ఈ కారు గురించి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆరా తీశారు.. అయితే ఈ కారు మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితుడు, మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుదిగా తెలిసింది. విశాఖపట్నాకి మెగా కుటుంబసభ్యులు ఎవరొచ్చినా గంటా శ్రీనివాసరావు వారికి అవసరమైన ఏర్పాట్లు చేస్తుంటారు. అందుకే రాంచరణ్, అల్లు అర్జున్ తమ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గంటా శ్రీనివాసరావుకు చెందిన ల్యాండ్ క్రూయిజర్ కారును ఉపయోగించారు.విశాఖపట్నంలో ఇనార్బిట్ మాల్లో ఏఏఏ సినిమాస్ థియేటర్లను అల్లు అర్జున్ ప్రారంభించారు. ఎనిమిది స్క్రీన్లలో ఏడు ప్రారంభంకాగా.. త్వరలో మరో స్క్రీన్ అందుబాటులోకి రానుంది. విశాఖపట్నంలో అల్లు అర్జున్ను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు.. బైక్‌లపై విమానాశ్రయం నుంచి ఇనార్బి్ట్ మాల్ వరకు ర్యాలీగా వచ్చారు. అభిమానులు భారీగా తరలిరావడంతో మాల్ లోపలికి అనుమతించలేదు. అల్లు అర్జున్ మధ్యాహ్నం 1 గంటకు రాగా.. దాదాపు రెండు గంటల పాటు మాల్లోనే ఉన్నారు. అక్కడ థియేటర్ ప్రాంగణంలో పుష్ప విగ్రహం ఏర్పాటు చేశారు.. ఆయన ఆ విగ్రహం పక్కనే నిలబడి ఫొటో దిగారు. ఆయన ఫోటోలతో ఏర్పాటు చేసిన గ్యాలరీని సందర్శించారు.భోగాపురంలో కొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టడం తెలిసిందే. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ సినిమాస్‌తో కలిసి ఆయన ‘ఏఏఏ సినిమాస్’ (అల్లు అర్జున్ ఏషియన్ సినిమాస్) పేరుతో మల్టీప్లెక్స్ లు నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఏఏఏ సినిమాస్ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ స్పందిస్తూ, వైజాగ్ నగరంపై తనకున్న అభిమానాన్ని పంచుకున్నారు."ఈ అద్భుతమైన నగరానికి ఏఏఏ సినిమాస్‌ను తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. నా హృదయంలో వైజాగ్‌కు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇక్కడ ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం మరింత ప్రత్యేకంగా అనిపిస్తోంది" అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన సినిమా వీక్షణ అనుభూతిని అందించాలనే లక్ష్యంతో ఎంతో ఇష్టపడి ఈ మల్టీప్లెక్స్‌ను తీర్చిదిద్దామని తెలిపారు. ఈ కొత్త ప్రయాణంలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు.హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ఇప్పటికే ఏఏఏ సినిమాస్ విజయవంతంగా నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు విశాఖపట్నంలో కూడా తమ బ్రాంచ్‌ను విస్తరించడం ద్వారా అల్లు అర్జున్ థియేటర్ వ్యాపారంలో తనదైన ముద్ర వేస్తున్నారు

విశాఖపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ఇనార్బిట్ మాల్’ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఏషియన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ‘AAA సినిమాస్’ మల్టీప్లెక్స్ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. విశాఖపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ఇనార్బిట్ మాల్’ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun), ఏషియన్ సినిమాస్ (Asian Cinemas) సంయుక్తంగా నిర్మించిన ‘AAA సినిమాస్’ (AAA Cinemas) మల్టీప్లెక్స్ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్ ఈ మల్టీప్లెక్స్‌ని లాంఛ్ చేశారు. అనంతరం అల్లు అర్జున్ మాట్లాడుతూ.. విశాఖపట్నం అంటే తనకు ఎంతో ఇష్టమైన నగరమని, ఇది దుబాయ్ వంటి అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా ఎదగాలని ఆకాంక్షించారు. ముంబైలో జరుగుతున్న షూటింగ్ నుంచి కేవలం ఒక రోజు విరామం తీసుకుని వైజాగ్ ప్రజలను, అభిమానులను కలవడానికి వచ్చానని ఆయన తెలిపారు. ఎయిర్ పోర్ట్ నుంచి ఈవెంట్ వరకు తనని పువ్వులలో పెట్టుకుని తీసుకొచ్చినట్లుగా తీసుకొచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్కు ధన్యవాదాలని అన్నారు. అలాగే నగర అభివృద్ధికి సహకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, సహకారం అందించిన వైజాగ్ పోలీస్ విభాగానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వైజాగ్ తనకు ఎంతో ఇష్టమైన ఊరని, భోగాపురం విమానాశ్రయంతో పాటు ఇంకా ఇంకా ఇలానే అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మరోవైపు ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ అభిమానుల పట్ల చూపించిన ఆప్యాయత అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఆయన వేదికపై ప్రసంగిస్తున్న సమయంలో అభిమానులు ఫోటోలు కావాలని కోరగా.. ‘అభిమానులు అడిగితే కాదనడానికి నాకు మనసు రాదు’ అంటూ ఎంతో ఉదారంగా వారిని స్టేజిపైకి ఆహ్వానించారు. అందరినీ ఒక క్రమపద్ధతిలో సురక్షితంగా పైకి రమ్మని కోరి, వారితో ఓపిగ్గా ఫోటోలు దిగారు. అభిమానుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రశాంతంగా వ్యవహరించాలని కోరడం బన్నీకి అభిమానులపై ఉన్న ప్రత్యేక శ్రద్ధను చాటిచెప్పింది. ఈ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తి కావడానికి సహకరించిన

‘ప్రేమలు’ సినిమాతో దక్షిణాదిన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది మమితా బైజు. వివిధ భాషల్లో నటిస్తూ బిజీగా మారిందీ మలయాళ ముద్దుగుమ్మ. ‘ప్రేమలు’ సినిమాతో దక్షిణాదిన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది మమితా బైజు. వివిధ భాషల్లో నటిస్తూ బిజీగా మారిందీ మలయాళ ముద్దుగుమ్మ. ఒకే నెలలో మూడు భాషల్లో, భారీ ప్రాజెక్టులతో తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు వస్తోంది. వాటిల్లో సూర్య సరసన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కూడా ఉంది. ఈ సందర్భంగా ఆమె చెబుతున్న కబుర్లివి... డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నా. ఇప్పటిదాకా నా సినిమా అప్డేట్స్ను నేరుగా సోషల్ మీడియాలో పంచుకున్నా. ఇకపై నాకు సంబంధించిన విశేషాలను కేవలం నా పీఆర్ టీమ్ మాత్రమే వెల్లడిస్తుంది. సోషల్ మీడియా ఇచ్చే పబ్లిసిటీ కన్నా... నాకు మానసిక ప్రశాంతత ముఖ్యమనుకుంటున్నా. అల్లు అర్జున్‌కి డైహార్డ్ ఫ్యాన్‌ని. ఆయన ప్రతీ సినిమాను కనీసం పదిసార్లు రిపీట్ మోడ్‌లో పెట్టుకొని మరీ చూస్తుంటా. ఒకానొక సమయంలో బన్నీపై నాకున్న ఇష్టం అంతా ఇంతా కాదు. ఆయన ‘ఇద్దరమ్మాయిల్లో’ని క్యాసియో వాచ్‌లు చూసి... వాటిని నేనూ పెట్టుకొని తిరిగేదాన్ని. కొన్ని సినిమాల్లో ఆయన ఫుల్ స్లీవ్ టీషర్ట్ మీద షర్ట్ వేసుకొన్నారు. నేను కూడా అలాగే వేసుకొని టామ్‌బాయ్‌లా తిరిగేదాన్ని. మాది కేరళలోని కొట్టాయం. నాన్న బైజు కృష్ణన్. ఆయనొక డాక్టర్. కుదిరినప్పుడు నన్ను తన క్లినిక్‌కి తీసుకెళ్లేవారు. అక్కడికి వచ్చినవారంతా బేబీ డాక్టర్ అని పిలిచేవాళ్లు. అప్పుడే డాక్టర్ కావాలనుకొనేదాన్ని. ఆ ఆసక్తితోనే సైకాలజీలో డిగ్రీ పూర్తి చేశా. కానీ సినిమాల కారణంగా చదువు కొనసాగించలేకపోయా. కూచిపూడి నృత్యంలో శిక్షణ తీసుకున్నా. స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఒక దర్శకుడు చూసి నాకు సినిమాల్లో అవకాశం ఇచ్చారు. మా అన్నయ్య మిథున్ రాష్ట్రస్థాయి క్రికెటర్. మేమిద్దరం క్లోజ్ఫ్రెండ్స్లా ఉంటాం. నా విషయంలో ఏ నిర్ణయం అయినా తను తీసుకోవాల్సిందే! చివరకి నా పెళ్లి విషయంలోనూ

హీరోయిన్ రితికా నాయక్ (Ritika Nayak)కు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? ఆమెకు అల్లు అర్జున్ అంటే ఇష్టం. ఈ మాట చెబితే ఆమె ఊరుకోదు. తనకు బన్నీ అంటే ఇష్టం కాదు, పిచ్చి అంటోంది. ఇదేదో ‘పుష్ప’ ఫ్రాంచైజీ నుంచి మొదలైన పిచ్చి కాదు. ‘ఆర్య’ సినిమా చూసిన తర్వాత బన్నీకి వీరాభిమానిగా మారిపోయానంటోంది రితికా నాయక్. ఈ క్రమంలోనే తన డ్రీమ్ ప్రాజెక్టు కూడా సెట్ చేసుకుంది. టాలీవుడ్ లో ఎప్పటికైనా సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ గా నటించాలనేది తన కలల ప్రాజెక్టుగా చెప్పుకొచ్చింది. అమ్మడు టార్గెట్ బాగానే ఫిక్స్ చేసుకుంది. ఎటొచ్చి బన్నీ ఈమెను కన్సిడర్ చేస్తాడా అనేది డౌట్. ఎందుకంటే, ప్రస్తుతం ఈ హీరో పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో నటించే హీరోయిన్లు కూడా పాన్ ఇండియా అప్పీల్ ఉండేవాళ్లనే తీసుకుంటున్నాడు. సో.. బన్నీ దృష్టిలో పడాలంటే పాన్ ఇండియా స్థాయిలో కాకపోయినా లోకల్ గానైనా రితికా బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టాలి. ‘మిరాయి’తో ఇప్పటికే సక్సెస్ బాట పట్టిన ఈ ఢిల్లీ బ్యూటీ, ‘కొరియన్ కనకరాజు’తో ఆ సక్సెస్ ను కంటిన్యూ చేయాలని తపిస్తోంది