సినీ హీరోల అభిమానులంటే వారి సినిమాల సందర్భాల్లో థియేటర్ల వద్ద ఫ్లెక్సీలు కట్టడం, పుట్టినరోజున కేకులు కట్ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించడం చూస్తూనే ఉంటాం. అయితే తాము అందరి హీరోల ఫ్యాన్స్‌లా కాదంటూ తాజాగా నిరూపించారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు. సినిమా వేడుకలు, ఫ్లెక్సీలకే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వస్థ్ నారీ వికసిత్ భారత్’ లక్ష్యానికి మద్దతుగా, ‘ఆల్ ఇండియా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ’ ( AAFA ) దేశవ్యాప్తంగా మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం చేపట్టిన అవగాహన ఉద్యమం విశేష స్పందనను రాబడుతోంది. ముఖ్యంగా ప్రాణాంతక గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ( సర్వైకల్ క్యాన్సర్ ) నివారణకు దోహదపడే హెచ్‌పీవీ (HPV) టీకా ప్రాముఖ్యతపై విస్తృత ప్రచారం నిర్వహిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.* ‘బల్లగుద్ది చెప్తున్నా.. సినిమా అందరికీ నచ్చుతుంది’: ‘ఇరుముడి’ ప్రీ రిలీజ్ వేడుకలో రవితేజ ధీమా7 రాష్ట్రాలు.. 400కి పైగా సదస్సులు ‘ఒక లక్ష మంది బాలికలు.. ఒక ఉజ్వల భవిష్యత్తు’ అనే ప్రధాన ఆశయంతో AAFA ఈ మహా యజ్ఞాన్ని ముందుకు నడిపిస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు 7 రాష్ట్రాల్లో 400కి పైగా అవగాహన సదస్సులను విజయవంతంగా పూర్తి చేసి, సుమారు లక్ష మందికి పైగా యువతులకు, పాఠశాల-కళాశాల విద్యార్థినులకు ప్రత్యక్షంగా చేరువయ్యారు. సర్వైకల్ క్యాన్సర్‌కు కారణమయ్యే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV) ఇన్ఫెక్షన్లను సకాలంలో టీకా తీసుకోవడం ద్వారా ఎలా నిరోధించవచ్చో వైద్య నిపుణుల సమక్షంలో వివరించారు. 9 ఏళ్ల నుంచి 26 ఏళ్ల లోపు వయసున్న బాలికలు, యువతులకు ఈ వ్యాక్సిన్ అత్యంత కీలకమని తెలియజేస్తూ, చిన్న వయసులోనే టీకా తీసుకోవడం వల్ల కలిగే రక్షణను వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అందుబాటులో ఉన్న ఉచిత టీకా సదుపాయాల గురించి సాధారణ ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా చైతన్యపరిచారు. సెప్టెంబర్ 8, 9 తేదీల్లో ప్రత్యేక డ్రైవ్‌ల ద్వారా మరింత మందిని చేరుకునేలా పోస్టర్లను విడుదల చేసి విస్తృత ప్రచారం కల్పించారు.* రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్స్... ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో సూర్య సరికొత్త చరిత్రసాధారణంగా హీరోల అభిమాన సంఘాలు రక్తదానాలు, అన్నదానాలు, సేవా కార్యక్రమాలు చేయడం చూస్తుంటాం. కానీ భవిష్యత్ తరాలైన ఆడబిడ్డల ప్రాణాలను కాపాడేలా ఇంతటి క్లిష్టమైన ఆరోగ్య సమస్యపై భారీ ఎత్తున అవగాహన కల్పించడం అభిమాన సంఘాల చరిత్రలోనే అత్యంత అరుదైన విషయంగా నిలిచింది. తమ అభిమాన హీరో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో రికార్డులు సృష్టిస్తుంటే, ఆయన పేరుతో అభిమానులు సమాజానికి మేలు చేసే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, సామాజిక కార్యకర్తలు #AAFASupportsHPVDrive హ్యాష్‌ట్యాగ్‌తో బన్నీ ఫ్యాన్స్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొనియాడుతున్నారు. ఈ భారీ ప్రజా ఉద్యమం ద్వారా అల్లు అర్జున్ ఫ్యాన్స్ దేశవ్యాప్తంగా ఇతర హీరోల అభిమానులకు కూడా ఆదర్శంగా నిలిచారు.





