
© 2026 nimisham.in

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విశాఖపట్నంలో సందడి చేశారు. నగరంలోని ఇనార్బిట్ మాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఏఏఏ సినిమాస్ మల్టీప్లెక్స్‌ను ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే, ఈ పర్యటనలో అల్లు అర్జున్ ప్రయాణించిన 'AP 40 LE 1' నంబరు గల ల్యాండ్ క్రూయిజర్ కారు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలే మెగా పవర్‌స్టార్ రాంచరణ్ తన ఏపీ పర్యటనలోనూ ఇదే కారును ఉపయోగించడంతో ఇది ఎవరిదనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.సోషల్ మీడియాలో అభిమానులు ఆరా తీయగా, ఈ కారు మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితుడు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుది అని తేలింది. మెగా కుటుంబ సభ్యులు విశాఖకు వచ్చినప్పుడు గంటానే వారికి అన్ని ఏర్పాట్లు చూసుకుంటారని, అందులో భాగంగానే ఆయన తన కారును రాంచరణ్, అల్లు అర్జున్‌ల కోసం పంపారని స్పష్టమైంది. జూన్‌లో మంగళగిరిలో జరిగిన ఏపీఎల్ మ్యాచ్ ప్రారంభోత్సవానికి రాంచరణ్ ఇదే కారులో రావడం గమనార్హం.ఏఏఏ సినిమాస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అల్లు అర్జున్‌తో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, సునీల్ నారంగ్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పి.విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. మొత్తం ఎనిమిది స్క్రీన్లతో నిర్మించిన ఈ మల్టీప్లెక్స్‌లో ప్రస్తుతం ఏడు స్క్రీన్లను ప్రారంభించగా, త్వరలోనే మరొకటి అందుబాటులోకి రానుంది. మధ్యాహ్నం 1 గంటకు మాల్‌కు చేరుకున్న బన్నీ, దాదాపు రెండు గంటల పాటు అక్కడే ఉన్నారు.అల్లు అర్జున్ రాకతో విమానాశ్రయం నుంచి
Film Critic & Entertainment Desk • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.