© 2026 nimisham.in
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు,ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి దక్కింది. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ నాగబాబును ఏపీ ప్రభుత్వం నియమించింది. నాగబాబుకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్గా నాగబాబు త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి నాగబాబును అభినందించారు. సతీమణితో కలిసి నాగబాబును సత్కరించారు. మెడలో పూలమాల వేసి అభినందనలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే సోషల్ మీడియా వేదికగా నాగబాబుకు పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.మరోవైపు రాష్ట్రంలో పచ్చదనం, అటవీ విస్తీర్ణం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్రిచ్మెంట్ (ఏపీ గ్రీన్)’ ఏర్పాటు చేసింది. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్గా నాగబాబు పేరును నామినేట్ చేస్తూ ఏపీ పర్యావరణ, అటవీ శాఖ జీవో జారీ చేసింది. ఈ నియామకంతోపాటు, ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్గా నాగబాబుకు కేబినెట్ హోదా కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.గ్రీన్ కవర్ను మన రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 50 శాతానికి పెంచాలనే లక్ష్యాన్ని 2047 నాటికల్లా సాధించేందుకు ఏపీ గ్రీన్ పనిచేయనుంది. ఇందులో భాగంగా ఏపీ గ్రీన్ గవర్నింగ్ బోర్డు, ఎగ్జిక్యూటివ్ కమిటీ, జిల్లాస్థాయి పాలక మండళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. కమిటీ ఛైర్మన్గా.. ఏపీ గ్రీన్ లక్ష్యాలు, కార్యక్రమాల అమలులో సమన్వయం, వేగవంతం చేయడం, పురోగతిని పర్యవేక్షించడం వంటి బాధ్యతలను నాగబాబు నిర్వహించనున్నారు. మరోవైపు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని గతంలో చంద్రబాబుప్రకటించారు. ఈ క్రమంలోనే ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఇప్పుడు కేబినెట్ మంత్రి హోదాతో కూడిన ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్గా నాగబాబును నియమించారు.మరి ముందు ముందు రోజులలో నాగబాబుకు మంత్రిగా అవకాశం దక్కుతుందా.. వేరొకరికి ఛాన్స్ ఉంటుందా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
Senior Editorial Lead • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.








