
© 2026 nimisham.in

మెగాస్టార్ చిరంజీవి పెళ్లి జరిగిన టైమ్ కు పవన్ కళ్యాణ్ చాలా చిన్నవాడు. దాంతో పవన్ ను కూడా చిరంజీవితో కలిసి చెన్నైలోనే ఉండేవాడు. చిరంజీవి భార్య సురేఖ పవన్ కళ్యాణ్ ను కన్న కోడుకులా చూసుకుంది. పిల్లలు పుట్టిన తరువాత కూడా తన పిల్లలో సమానంగా పవర్ స్టార్ ను ఆమె ప్రేమించేది. అందుకే పవన్ కళ్యాణ్ కూడా సురేఖను తల్లితో సమానంగా చూసుకుంటాడు. అసలు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నాడంటే దానికి కారణం కూడా సురేఖ తీసుకున్న నిర్ణయమే. ఆమే పవన్ కళ్యాణ్ ను హీరోను చేయాలని చిరంజీవితో చెప్పి పట్టుబట్టి ఒప్పించిందట.
వదిన సురేఖ తనకు ద్రోహం చేసిందని పవన్ కళ్యాణ్ గతంలో జరిగిన ఓ ఈవెంట్ లో వెల్లడించారు. సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో మూవీలో పవన్ కూడా నటించారు.ఈ సినిమా ఈవెంట్ లో పవర్ స్టార్ ఈ కామెంట్స్ చేశారు. తనకు సినిమాల్లోకి రావడం ఇష్టం లేదని, తాను ఎప్పుడూ అనుకోలేదని, ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ, పొలం పనులు చేసుకోవాలనుకున్నా. అన్నయ చిరంజీవి మెగాస్టార్‌గా ఇమేజ్ పొంది పీక్‌లో ఉన్నప్పుడు హీరో అవుతావా? అని అడినప్పుడు భయమేసింది. తాను చేయగలనా అనిపించింది. కానీ మనల్ని నమ్మేవ్యక్తులు ఇంపార్టెంట్. వదిన సురేఖ నన్ను నమ్మింది. ఆమె సినిమాలు చేయమని ప్రోత్సహించింది.
ఓ సారి జగదాంబ థియేటర్ వద్ద బస్ ఎక్కి డాన్సు చేయమన్నారు. ఆ రోజు డాన్సు చేయడానికి నేను చచ్చిపోయాను. ఆ రోజు ఫోన్ చేసి మా వదినని అడిగాను. నన్ను ఎందుకు ఇలా చేశావని నిలదీశాను. ఆమె ఆ రోజు చేసిన తప్పు కారణంగానే ఇప్పుడు నేను ఇలా మీ ముందు నిల్చున్నాను. దీనంతటికి కారణం వదిన చేసిన ద్రోహమే అని కామెంట్స్ చేశారు. తన ఎదుగుదలకు వదిన తీసుకున్న నిర్ణయమే కారణం అని పవన్ కళ్యాణ్ ఫన్నీ వేలో క్లారిటీ ఇచ్చారు.
1996లో 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో హీరోగా టాలీవుడ్లో పవన్ కళ్యాణ్ ప్రయాణం ప్రారంభమైంది. 'తొలిప్రేమ', 'తమ్ముడు', 'బద్రి', 'ఖుషి' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో టాలీవుడ్లో తిరుగులేని ఇమేజ్ను, సొంత మేనరిజమ్స్‌తో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు పవన్. దాదాపు 30 ఏళ్ల సినీ కెరీర్లో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరిగా నిలిచారు. పలు నివేదికల ప్రకారం ఆయన ఒక్కో సినిమాకు ₹50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని సమాచారం.
2008లో చిరంజీవి స్థాపించిన 'ప్రజారాజ్యం' పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా రాజకీయారంగేట్రం చేసిన పవన్.. 2014లో 'జనసేన' పార్టీని స్థాపించారు. 2019 ఎన్నికల్లో ఓటములు ఎదురైనా కుంగిపోకుండా, ప్రజా సమస్యలపై నిలకడగా పోరాడారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమితో కలిసి పోటీ చేసిన జనసేన, పోటీ చేసిన 21 స్థానాల్లోనూ విజయం సాధించి 100% స్ట్రైక్ రేట్ సాధించింది. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఘనవిజయం సాధించిన పవన్ కళ్యాణ్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ తన మార్క్ చూపిస్తున్నారు.
Film Critic & Entertainment Desk • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.








