
జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ట్రాప్’లో మరో ఇద్దరి అరెస్ట్
సోషల్ మీడియాలో పరిచయం.. ఆ తర్వాత స్నేహం.. వ్యక్తిగత వివరాల సేకరణ.. చివరకు బ్లాక్మెయిల్! హైదరాబాదు నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ ‘రిచ్ కిడ్స్ ట్రాప్’ కేసులో దర్యాప్తులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో మరో ఇద్దరు కీలక నిందితులను పోలీసులు రాజస్థాన్‌లో అరెస్ట్ చేయడంతో కేసు మళ్లీ హాట్‌టాపిక్‌గా మారింది. హఫీజ్‌పేటకు చెందిన కోడూరి మీనా కుమారి, విజయవాడకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వినీల్ చౌదరి అలియాస్ వినీల్ బాబు పోలీసులకు చిక్కారు. జూబ్లీహిల్స్‌లో మొదలైన పోలీసుల వేట.. చివరకు రాజస్థాన్‌లోని జైపూర్ వరకు సాగింది. బందర్సెంద్రీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరినీ అదుపులోకి తీసు కున్న పోలీసులు అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ వ్యవహారంలో నిందితు లందరూ సోషల్ మీడియా నే ప్రధాన ఆయుధంగా ఉపయోగించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బాలికలు, యువతులను సోషల్ మీడియా ద్వారా పరిచ యాలు పెంచుకుని.. వారి కుటుంబ నేపథ్యం, వ్యక్తి గత వివరాలు, ఇతర సమాచారాన్ని సేకరించి నట్లు తెలుస్తోంది. పరిచ యం పెరిగిన తర్వాత సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, అదే సమాచారంతో వారిని బ్లాక్మెయిల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడి గా పేర్కొంటున్న కోడూరి చంద్రశేఖర్ ఆజాద్ అలి యాస్ అర్జున్‌తో పాటు పలువురిని పోలీసులు జూన్‌లోనే అరెస్ట్ చేశారు. అప్పట్లో మీనాకుమారి, వినీల్ చౌదరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకు న్నప్పటికీ వారిని రిమాండ్‌కు పంపలేదు. కానీ దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ పోలీసుల చేతికి మరిన్ని ఆధారాలు చిక్కాయి. దీంతో ఇద్దరినీ మరోసారి అరెస్ట్ చేసేం దుకు పోలీసులు ప్రయ త్నించగా.. అప్పటికే వారు పరారైనట్లుగా గుర్తించారు. దీంతో పోలీసులు నింది తుల కోసం ప్రత్యేక గాలింపు చేపట్టారు. వారి ఆచూకీపై సమాచారం సేకరించి హైదరాబాద్ నుంచి రాజస్థాన్ వరకు వేట కొనసాగించారు