
© 2026 nimisham.in


నటీనటులు : సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్, వెంకటేష్ కాకుమాను, నరేంద్ర రవి, మణి ఏగుర్ల, సాయి సోహన్, ఉపేంద్ర లిమాయే తదితరులు దర్శకత్వం : వేణుగోపాల్ రెడ్డి సమర్పణ : సందీప్ రెడ్డి వంగా సంగీతం : వాసుకి వైభవ్ ఛాయాగ్రహణం : పవన్ పప్పుల కూర్పు : వేణుగోపాల్ రెడ్డి ‘మేమ్ ఫేమస్’ ఫేమ్ సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో వచ్చిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘రోమాంచకం’. నేడు థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు నవ్వించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం. అన్వేష్ (సుమంత్ ప్రభాస్) ఒక స్టార్టప్ నడుపుతుంటాడు. అతడు చెన్నైకి చెందిన మైథిలి (అనంతిక సనీల్‌కుమార్)తో ప్రేమలో పడతాడు. అన్వేష్‌ను కలిసేందుకు మైథిలి హైదరాబాద్ వచ్చిన క్రమంలో అనూహ్య సమస్యలు మొదలవుతాయి. ఆమె రాకతో అన్వేష్, అతని స్నేహితుల బృందం ఎలాంటి చిక్కుల్లో పడ్డారు? అసలు మైథిలికి ఏమైంది? ఆ సమస్యల వలయం నుంచి అన్వేష్ అండ్ గ్యాంగ్ ఎలా బయటపడ్డారు? అన్నదే ఈ సినిమా కథ. ‘రోమాంచకం’ సినిమా పెద్దగా కథాబలంపై కాకుండా, సిట్యువేషనల్, సిల్లీ కామెడీపైనే ఎక్కువగా ఆధారపడి సాగుతుంది. చాలావరకు ‘జాతిరత్నాలు’ జోన్‌ను తలపించేలా సాగే ఈ చిత్రంలో వినోదానికి లోటు లేకుండా చూసుకున్నారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫన్ ఎపిసోడ్స్ ఆడియన్స్‌ను బాగా నవ్విస్తాయి. క్లైమాక్స్ సీన్‌ను గందరగోళం (కన్ఫ్యూజన్) కామెడీతో డిజైన్ చేసిన విధానం సినిమాకు హైలైట్‌గా నిలిచింది. సుమంత్ ప్రభాస్ తన కేర్ఫ్రీ యువకుడి పాత్రలో ఎంతో ఈజ్‌తో నటించి మెప్పించాడు. ఫన్ సీన్లలో చలాకీగా కనిపిస్తూనే, హీరోయిన్ అనంతికతో మంచి కెమిస్ట్రీ పండించాడు. అనంతిక కూడా తన పాత్ర పరిధి మేరకు చక్కటి స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంది. ఇక హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్‌గా కనిపించిన వెంకటేష్ కాకుమాను, నరేంద్ర రవి, మణి ఏగుర్ల, సాయి సోహన్ పాత్రలు

వెంకటేష్, కీర్తి సురేష్, నందమూరి కళ్యాణ్ రామ్, కృతి శెట్టిలతో దర్శకుడు అనిల్ రావిపూడి ఒక మల్టీస్టారర్ మూవీ తీస్తున్నారు. ఈ సినిమాకి “జనవరి 12 విడుదల” (January 12 Vidudala) అనే పేరుని ఖరారు చేశారు. పేరుతో పాటు విడుదల తేదీ కూడా అదే ఫిక్స్ చేశారు. రిలీజ్ డేట్ ముందే ఫిక్స్ చేసుకొని షూటింగ్ మొదలుపెట్టడం అనిల్ రావిపూడి స్టయిల్. అతని ప్లానింగ్ అంతా పక్కాగా ఉంటుంది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఒక పాట తీశారు. తాజాగా రెండో పాట మొత్తం నలుగురు హీరో, హీరోయిన్లతో చిత్రకరిస్తున్నారు. మైసూర్ దగ్గర్లోని మేల్కొటిలో ఒక సెలెబ్రేషన్ సాంగ్ తీస్తున్నారు. హీరోలు ఇద్దరూ బైక్ పై వెళ్తుంటే వారితో హీరోయిన్లు పాల్గొనే గ్రామీణ నేపథ్యపు పాటని అనిల్ రావిపూడి చిత్రీకరిస్తున్నారు. ఈ పాటతో ఇప్పటికే 40 రోజులకి పైగా షూటింగ్ పూర్తి అవుతుంది. మరో నలభై రోజుల్లో మొత్తం షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేస్తారట. అంత స్పీడ్ అనిల్ రావిపూడిది. మరోవైపు, ఎప్పుడో మొదలుపెట్టిన “ఆదర్శ కుటుంబం” సినిమాని మాత్రం త్రివిక్రమ్ పూర్తి చెయ్యలేకపోయారు. మిగిలిన బ్యాలెన్స్ షూటింగ్ ని వెంకటేష్ ఈ నెలలో పూర్తి చేస్తారట. ‘జనవరి 12 విడుదల’ పాట చిత్రీకరణ పూర్తికాగానే త్రివిక్రమ్ సినిమా షూటింగ్ కి వచ్చి అది కంప్లీట్ చేస్తారు

చిత్ర పరిశ్రమలో నటీనటులుగా గొప్ప పేరు ప్రఖ్యాతలు సాధించి చివరకు దీన స్థితిలో మరణించిన వారు చాలా మందే ఉన్నారు. వారిలో హాస్య నటి కల్పనా రాయ్ ఒకరు. లేడీ కమెడియన్ గా కల్పనా రాయ్ ఎన్నో సినిమాల్లో నటించారు. 70వ దశకం నుంచే ఆమె కెరీర్ ప్రారంభం అయింది. 400పైగా సినిమాల్లో కల్పనా రాయ్ నటించారు. కమెడియన్ గా తిరుగులేని గుర్తింపు సాధించిన కల్పనా రాయ్ చివరి రోజుల్లో ఎవరూ లేని దీన స్థితిలో అనాథలా మరణించారు. కల్పనా రాయ్ పుట్టుకతో పేదవారు కాదు. కోటీశ్వరుల కుటుంబంలో జన్మించారు. సీనియర్ రచయిత నందం హరిశ్చంద్రరావు ఓ ఇంటర్వ్యూలో కల్పనా రాయ్ జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కల్పనా రాయ్ అచ్చతెలుగు మహిళ. ఆమె కాకినాడలో జన్మించారు. కానీ ఆమె పేరు చివర రాయ్ అని ఉండడం వెనుక ఆసక్తికర కథ ఉంది. పుట్టుకతోనే కల్పనా రాయ్ ధనవంతురాలు. ఆమె తల్లి దండ్రులు ఒళ్ళంతా బంగారం చేయించారు. ఓ కార్యక్రమంలో నటి శారద చిన్న వయసులో ఉన్న కల్పనా రాయ్ ని చూసి నటి అయ్యే లక్షణాలు ఉన్నాయి అని అభినందించారట. నటిని చేయమని ఆమె తల్లిదండ్రులకు కూడా చెప్పారు. కానీ దురదృష్టవశాత్తూ కల్పనా రాయ్ చిన్నతనంలోనే ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ మరణించారు. దీనితో కల్పనా రాయ్ బంధువులు ఆమె ఆస్తిని కరిగించేశారు. దీనితో ఆమె పేదరికంలోకి నెట్టివేయబడింది. సినిమాల్లోకి వెళ్లి సంపాదించాలని కల్పనా రాయ్ అనుకుంది. నటి శారద సహాయంతో ఆమెకి తెలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. యుక్త వయసులో ఉన్నప్పుడు మోహన్ రాయ్ అనే వ్యక్తిని కల్పనా రాయ్ ప్రేమించింది. పెళ్లి చేసుకోకుండానే అతడితో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రాయ్ అనే పేరు అతడి నుంచి ఆమెకి వచ్చింది. కానీ అతడు కల్పనా రాయ్ ని మోసం చేసి వెళ్ళిపోయాడు. తన బిడ్డని పోషించడం కోసం నటిగా మారింది. జీవితంలో ఎన్ని

Qutubullapur: 14 ఎకరాల ఆలయ భూమికి హద్దులు; రంగంలోకి రెవెన్యూ! Qutubullapur: జగద్గిరిగుట్ట వేంకటేశ్వరస్వామి ఆలయ భూముల పరి రక్షణకు రెవెన్యూ యంత్రాంగం శ్రీకారం చుట్టింది. మేడ్చల్ జిల్లా సర్వీ దేవాదాయ శాఖ కుత్బుల్లా పూర్ మండల రెవెన్యూ అధికారులు ఆలయ ప్రాంగ ణంలో స్థానిక నాయకులతో మంగళవారం సమా వేశం నిర్వహించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆట యానికి కేటాయించిన Mఏకరాల 10 గుంటల స్థలం చుట్టూ పెన్సింగ్ ఏర్పాటు చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం 318/1లో గల స్థలానికి సరిహద్దులను పరిశీలిస్తు న్నారు. కబ్జా అయిన ఆలయ స్థలాన్ని గుర్తించడా వికీ డిజిటల్ సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. ఆలయ ప్రాంగణంలో స్థానిక నాయకులతో సమావేశం నిర్వహిస్తున్న అధికారులు వినాయక చవితి వండగలోపు డిజిటల్ సర్వేచేసి సరిహద్దులు ఏర్పాటుచేయాలని, కళ్ళా అయిన స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని, కబ్జాదారులపై కేసులు నమోదు చేయాలని తీర్మానించారు. సర్వే దేవి ఆలయ భూములను రికార్డుల్లోకి ఎక్కిబడను వ్నట్లు అధికారులు. అదికారులు తెలిపారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం 12 వారాల్లో సర్వేపూర్తి చేయాల్సి ఉన్నా స్థానిక రెవెన్యూ అధికారులు, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులకు వట్టాదారులతో ఉన్న మిబాబత్ వల్లనే ఇప్పటి వరకు సర్వే చేయకుండా తాత్సర్యం చేశారని నాయకులు ఆరోపించారు. కబ్జాదారుల నుంచి లక్షల రూపాయలు తీసుకున్న రెవెన్యూ అది కబ్జాదారుల గుండెల్లో గుబులు జగద్గిరిగుట్ట వేంకటేశ్వరస్వామి ఆలయ భూముల పరిరక్షణకు అధికారులు శ్రీకారం ముట్టడంతో కబ్జాదారుల గుండెల్లో గుబులు మొదలైంది. కుల సంఘాల ముసుగులో ఆలయ స్థలాన్ని కబ్జాచేసి గదులు కట్టి లక్షల రూపాయ బంచారు. రెవెన్యూ అధికారులు డిజిటల్ సర్వే చేస్తే కబ్జాల బాగోతం బయేట పడుతుందని ఆందోళన చెందుతున్నారు. తమపై కేసులు నమోదు అవుతాయని కంగారు పడుతున్నారు. దీంతో అధికారులు, నాయకుల మాటూ ప్రదక్షిణ చేయడం మొదలు పెట్టారు. కాదులు వారికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తు న్నారని

‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘ఈ నగరానికి ఏమైంది 2’ (ENE2) నుంచి అభిమానులను ఉత్సాహపరిచే అప్డేట్ వచ్చింది. టాలీవుడ్లో కల్ట్ క్లాసిక్ బడ్డీ కామెడీగా గుర్తింపు పొందిన ‘ఈ నగరానికి ఏమైంది’ (Ee Nagaraniki Emaindi 2) చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘ఈ నగరానికి ఏమైంది 2’ (ENE2) నుంచి అభిమానులను ఉత్సాహపరిచే అప్డేట్ వచ్చింది. యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ ఫ్రాంచైజీ రెండో భాగం షూటింగ్ విజయవంతంగా పూర్తయినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా.. సినిమా టీమ్ విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్లో “One Side Done” అంటూ షూటింగ్‌లోని ఒక ప్రధాన భాగం పూర్తయిందని వెల్లడించారు. అదే సమయంలో “Other Side – November 19” అంటూ సినిమా విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు. దీంతో ‘ఈఎన్ఈ’ గ్యాంగ్ మరోసారి ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తేందుకు సిద్ధమవుతోంది. క్రియేటివ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విశ్వక్ సేన్ (Vishwak Sen), అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, సాయినాథ్ మాగంటి తమ పాత పాత్రలతోనే మరోసారి సందడి చేయనున్నారు. మొదటి భాగంలో స్నేహం, హాస్యం, జీవితంలోని సరదా క్షణాలను సహజంగా చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ గ్యాంగ్ ఇప్పుడు మరింత ఎంటర్టైన్మెంట్తో రాబోతోందని సినీ వర్గాలు ఇప్పటికే చెబుతూ వస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ ఒరిజినల్స్, రూట్ నోడ్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నవంబర్ 19న విడుదల కానున్న ఈ సినిమా యూత్ ఆడియన్స్‌కు మరో ఫన్ రైడ్‌గా నిలుస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి

సంక్రాంతికి వస్తున్నాం అని ఊరికే మాటలు చెప్పడం కాదు.. ఏకంగా 4 నెలల ముందే మేకర్స్ తమ ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. చట్టం తన పని తను చేసుకుపోతున్నట్లు.. పండగ బరిలో ఉన్న హీరోలంతా పక్కా ప్లానింగ్‌తో అప్డేట్స్ ఇస్తూ ఆసక్తి పెంచేస్తున్నారు. ఎవరికి ఎవరూ తగ్గట్లేదు.. మీరొక అప్డేట్ ఇస్తే మేం రెండిస్తామంటున్నారు. మరి ఆ హంగామా మనం కూడా చూద్దామా..? పండగ సినిమాల ప్రమోషన్స్ అనగానే అనిల్ రావిపూడే గుర్తుకొస్తున్నారు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబోలో వస్తున్న సినిమాను జనవరి 12 విడుదల అనే టైటిల్ ప్రకటిస్తూనే ప్రమోషనల్ వీడియో విడుదల చేసారు అనిల్. ఇక శర్వానంద్, శ్రీను వైట్ల కాంబోలో రాబోతున్న జార్జ్ క్రిష్ సినిమా ఓపెనింగ్ మొన్నే జరిగింది.. దీని షూట్ కూడా పక్కా ప్లానింగ్ ప్రకారమే జరగబోతుంది. ఈ ప్రమోషనల్ హంగామాలో చిరు కూడా చేరిపోయారు. బాబీతో ఈయన చేస్తున్న మెగా 158 ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఆగస్ట్ 22న టైటిల్ గ్లింప్స్ రానుంది. చిరు మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో రాబోతున్న ఈ సినిమా అప్డేట్ మెగా అభిమానుల్లో పండగ ముందే వచ్చినంత జోష్ నింపుతోంది. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతుంది. మెగా క్యాంపు నుంచే వస్తున్న సాయి ధరమ్ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ ప్రమోషన్స్ మొదలయ్యాయి. మొన్నే జనవరి 12 అంటూ డేట్ ప్రకటించారు. ఒకేరోజు ఇటు వెంకటేష్, అటు సాయి ధరమ్ తేజ్ సినిమాలు బాక్సాఫీస్‌పై దండెత్తబోతున్నాయి. మొత్తానికి 4 నెలల ముందే మొదలైన ఈ ప్రమోషన్ల జాతర చూస్తుంటే.. ఈసారి సంక్రాంతి థియేటర్లలో మామూలు రచ్చ ఉండేలా లేదు. పాన్,ఆధార్ వాట్సాప్‌లో పంపుతున్నారా? క్షణాల్లో రంగంలోకి సైబర్ నేరగాళ్లు.. రెప్పపాటులో బ్యాంకు ఖాతాలు గుల్ల బయటకి ఆరోగ్యంగా కనిపిస్తున్నా.. కొన్ని విటమిన్ లోపాలు ఉండొచ్చు.. ఎలా చెక్ చేసుకోవాలి? వేగంగా వేడెక్కుతున్న భూమి.. ప్రమాదంలో పెద్దల ప్రాణాలు మేలుకోకుంటే మరణ మృదంగమే !

మెగాస్టార్ చిరంజీవి దాదాపు 48ఏళ్లుగా హీరోగా రాణిస్తున్నారు. ఆయన `పునాది రాళ్లు` చిత్రంతో వెండితెరకు పరిచయమై `ఖైదీ`తో బ్లాక్ బస్టర్ అందుకొని వెనక్కి తిరిగి చూడకుండా స్టార్‌గా రాణించారు. మెగాస్టార్‌గా ఎదిగారు. దాదాపు మూడు దశాబ్దాలుగా టాలీవుడ్‌ని శాసిస్తున్నారు. యంగ్ హీరోలు పాన్ ఇండియా వేటలో, గ్లోబల్ సినిమా వేటలో రికార్డులు క్రియేట్ చేస్తున్నా, మెగాస్టార్ స్థానం మాత్రం చిరంజీవిదే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ ఆయన సినిమాలు చేస్తున్నారు. విజయాలు అందుకుంటున్నారు. ఈ సంక్రాంతికి `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో హిట్ కోసం రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే చిరంజీవి నేడు శనివారం(ఆగస్ట్ 22) 71వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలు, ఎవరికీ తెలియని విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చాలా మంది సెలబ్రిటీలు ఆయన గురించి కామెంట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఒకప్పటి స్టార్ డైరెక్టర్ గీతా కృష్ణ షాకింగ్ విషయాలు వెల్లడించారు. చిరంజీవి హవా గురించి చెబుతూ, నాగార్జున, వెంకటేష్ హీరోలు అయిన పరిస్థితిని వివరించారు. చిరంజీవి డేట్స్ ఇవ్వలేకపోవడంతో వెంకటేష్, నాగార్జున హీరోలు అయ్యారని తెలిపారు. 1983లో చిరంజీవికి `ఖైదీ` పడింది. దీంతో నిర్మాతలు, దర్శకులు ఆయనతో సినిమాలు చేసేందుకు క్యూ కట్టారు. ఆ సమయంలోనే ఎన్టీఆర్ పార్టీ పెట్టి రాజకీయాల్లో బిజీ అయ్యారు. సినిమాలు తగ్గించారు. ఫామ్ లో ఉన్న చిరంజీవి అందరికి డేట్స్ ఇవ్వలేకపోతున్నారట. ఆ టైమ్‌లో కృష్ణ, కృష్ణంరాజు, ఏఎన్నార్ కొంత వరకు నటిస్తున్నారు. కానీ వారి సినిమాలు కమర్షియల్‌గా వాహ్ అనేలా లేదు. ఈ క్రమంలో అందరి చూపు చిరంజీవిపైనే పడింది. అయితే ఆయన డేట్స్ కోసం ఏఎన్నార్ చాలా రోజులు తిరిగారట. ఏకంగా మూడేళ్లు చిరంజీవి వెంటపడ్డారట. కానీ తమ అన్నపూర్ణ

బూర్గంపహాడ్, ఆగస్టు 21 : నిరుపేదల పక్షాన నిలబడి ఇళ్లు, ఇళ్ల స్థలాలు, పోడు భూముల కోసం భూ పోరాటాలు చేసిన సిద్ధి వెంకటేశ్వర్లు సేవలు మరువలేనివని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గ సభ్యుడు మువ్వా వెంకటేశ్వరరావు(లడ్డా) అన్నారు. శుక్రవారం ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ మాజీ సహాయ కార్యదర్శిగా పనిచే సిన సిద్ధి వెంకటేశ్వర్లు 4వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. మువ్వా వెంకటేశ్వర్లు కపర్తిభవన్లో సిద్ధి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మువ్వా మాట్లాడుతూ బూర్గంపహాడ్ నియోజకవర్గంగా ఉన్న సమయంలో సిద్ధి పాత్ర గొప్పదన్నారు. ఆయన మనమధ్య లేకపోయినా సిద్ధి చేసిన పోరాటాలు పేదప్రజల గుండెల్లో నిలిచిపోయాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమితి సభ్యులు పేరాల శ్రీనివాసరావు, ఎండీ సాజిద్, 7వ వార్డు సభ్యులు గూగల్ బీమానాయక్, జహీర్ పాల్గొన్నారు

విక్టరీ వెంకటేష్ 40 ఏళ్ల సినీ ప్రయాణాన్ని అభిమానులు సామాజిక సేవతో ప్రత్యేకంగా జరుపుకున్నారు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో 43 మంది అభిమానులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా అభినందిస్తూ అభిమానులకు తన ప్రశంసలు తెలియజేశారు. వెంకటేష్ 40 ఏళ్ల సినీ ప్రయాణం సందర్భంగా వేడుకలకే పరిమితం కాకుండా సేవను ఎంచుకోవడాన్ని ఆయన కొనియాడారు. ఆల్ ఇండియా విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. వెంకటేష్ 1986 ఆగస్టు 14న విడుదలైన ‘కలియుగ పాండవులు’ చిత్రంతో కథానాయకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి కుటుంబ కథా చిత్రాలతో పాటు విభిన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. వెంకటేష్ 40 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తయిన సందర్భాన్ని గుర్తుండిపోయేలా చేయాలనే ఉద్దేశంతో అభిమానులు రక్తదాన కార్యక్రమాన్ని చేపట్టారు. రక్తదాన శిబిరంలో మొత్తం 43 మంది అభిమానులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తం అందించారు. దీంతో ఒక సినీ మైలురాయిని అభిమానులు సామాజిక బాధ్యతతో అనుసంధానించిన ప్రత్యేక కార్యక్రమంగా ఇది నిలిచింది. ఇదిలా ఉండగా చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున చిరంజీవి, అభిమాన సంఘం అధ్యక్షుడు రామకృష్ణకు ప్రత్యేక అభినందన లేఖ పంపారు. వెంకటేష్ 40 ఏళ్ల సినీ ప్రయాణాన్ని రక్తదానం వంటి సేవా కార్యక్రమంతో జరుపుకోవడం అభినందనీయమని అందులో పేర్కొన్నారు. వెంకటేష్‌తో తనకున్న స్నేహాన్ని కూడా చిరంజీవి తన అభినందన సందేశంలో ప్రస్తావించినట్లు అందుబాటులో ఉన్న వివరాలు చెబుతున్నాయి. కుటుంబ కథా చిత్రాల నుంచి విభిన్న పాత్రల వరకు వెంకటేష్ ప్రేక్షకులను అలరిస్తూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని ప్రశంసించారు. ఫలితంగా అభిమానుల సేవా కార్యక్రమంతో పాటు ఇద్దరు సీనియర్ నటుల మధ్య స్నేహం కూడా మరోసారి ప్రధానంగా నిలిచింది. ఈ నేపథ్యంలో రక్తదానం చేసిన 43 మందిని ‘బ్లడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్’గా అభివర్ణిస్తూ చిరంజీవి కృతజ్ఞతలు

విక్టరీ వెంకటేష్ తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి 40 వసంతాలు పూర్తి చేసుకున్న అరుదైన సందర్భంగా ఆయన అభిమానులు చేసిన పనికి మెగాస్టార్ చిరంజీవి ఫిదా అయ్యారు. విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి 40 వసంతాలు పూర్తి చేసుకున్న అరుదైన సందర్భంగా ఆయన అభిమానులు చేసిన గొప్ప సేవా కార్యక్రమంపై మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రశంసల జల్లు కురిపించారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణాన్ని పురస్కరించుకుని ఆల్ ఇండియా విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 43 మంది వెంకటేష్ అభిమానులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. అభిమానాన్ని సేవగా మలిచి ప్రాణదాతలుగా నిలిచిన అభిమానులను అభినందిస్తూ చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ఓ అభినందన లేఖను విడుదల చేశారు. ఆల్ ఇండియా వెంకటేష్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ రామకృష్ణకు రాసిన లేఖలో చిరంజీవి తన ఆప్తమిత్రుడు వెంకటేష్‌పై ఉన్న ప్రేమాభిమానాలను పంచుకున్నారు. ‘‘నాలుగు దశాబ్దాలుగా తన విలక్షణమైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ, కుటుంబ కథా చిత్రాల నుంచి విభిన్నమైన పాత్రల వరకు తనదైన ప్రత్యేకతను చాటుకున్న నా స్నేహితుడు విక్టరీ వెంకటేష్‌కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన మరెన్నో సంవత్సరాలు ప్రేక్షకులను అలరిస్తూ, మరిన్ని విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని చిరంజీవి పేర్కొన్నారు. అలాగే రక్తదానం చేసిన అభిమానులను కొనియాడుతూ.. ‘‘తమ అభిమాన కథానాయకుడి సినీ ప్రయాణంలో ఒక మైలురాయిని సమాజానికి ఉపయోగపడే రక్తదానం వంటి గొప్ప సేవా కార్యక్రమంతో జరుపుకోవడం నిజంగా అభినందనీయం. అభిమానం సేవా రూపం దాల్చినప్పుడు అది సమాజానికి ఎంతో స్ఫూర్తినిస్తుంది. ఈ శిబిరాన్ని నిర్వహించిన టీమ్‌తో పాటు.. రక్తదానం చేసిన 43 మంది ‘బ్లడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్’కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరు అందించిన రక్తం ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుంది’’

హీరోగా ఎంట్రీ ఇస్తున్న 'కింగ్డమ్' మురుగన్: విలన్ వద్దు.. హీరో ముద్దు.! ఈ వార్తకు సంబంధించిన

విజయ్ దేవరకొండ హీరోగా రూపుదిద్దుకున్న 'కింగ్డమ్'తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు మలయాళ నటుడు వెంకటేశ్ వి.పి.. ఇప్పుడు అతనికి తెలుగులో హీరోగా నటించే అవకాశం లభించింది. 'కె ర్యాంప్' వంటి సక్సెస్ ఫుల్ మూవీని నిర్మించిన బొమ్మక్ శివ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రుద్రాంశ్ సెల్యులాయిడ్ నిర్మాణంలో ధీరజ్ న్యాతి ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు సురేశ్ తేజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. దీనికి 'డి.జి.పి.' అనే వర్కింగ్ టైటిల్ ను పెట్టుకున్నారు. వెంకటేశ్. వి.పి. మలయాళ టీవీ, చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. 'సుడా సుడా ఇడ్లీ' అనే రెస్టారెంట్ స్టార్టప్ ను సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తున్నారు. 'కింగ్డమ్' చిత్రంలో వెంకటేశ్ పోషించిన మురుగన్ పాత్ర నటుడిగా అతనికి మచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు డి.జి.పి. వర్కింగ్ టైటిల్ తో వస్తున్న చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఆగస్ట్ 20 హీరో వెంకటేశ్. వి.పి. బర్త్ డే సందర్భంగా ఆయనకు మేకర్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ సినిమాలోకి వెల్ కమ్ చెప్పారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈ సినిమాకు జ్ఞానీ సంగీతం అందిస్తున్నారు

విక్టరీ వెంకటేశ్, నందమూరి కల్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సినిమాకు టైటిల్ ఖరారైంది. ఇంతవరకు #VenkyAnil5, #NKRAR2 పేర్లతో ప్రచారంలో ఉన్న ఈ చిత్రానికి ‘జనవరి 12 విడుదల’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను మేకర్స్ ప్రకటించారు. 2027 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్‌ను ప్రత్యేక వీడియో ద్వారా ప్రకటించారు. ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు నివాళిగా ‘అప్పుల అప్పారావు’లోని ఓ హాస్య సన్నివేశాన్ని గుర్తు చేస్తూ వీడియోను మొదలుపెట్టారు. ఈవీవీ సత్యనారాయణ తనకు స్ఫూర్తి అని అనిల్ రావిపూడి పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే.వెంకటేశ్, కల్యాణ్‌రామ్, కీర్తి సురేశ్, కృతిశెట్టి కలిసి అనిల్ రావిపూడిని సినిమా టైటిల్ ఏంటని అడుగుతారు. అందుకు ఆయన ఎలాంటి తడబాటు లేకుండా ‘జనవరి 12 విడుదల’ అని చెబుతారు. దీంతో నటీనటులు కాసేపు అయోమయానికి గురవుతారు. తాము విడుదల తేదీ గురించి కాదు.. టైటిల్ గురించి అడిగామని చెబుతారు. చివరికి అదే సినిమా టైటిల్ అని అనిల్ వెల్లడించడంతో వీడియో ముగుస్తుంది.కొద్ది రోజుల క్రితం వెంకటేశ్ ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. సినీ పరిశ్రమలో ఆయన 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పోస్టర్‌ను తీసుకొచ్చారు. ఇందులో లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్‌రెడ్డిగా వెంకటేశ్ కనిపించారు.భారత సైన్యంలో పనిచేసే ఈ అధికారి కౌంటర్ టెర్రరిజం, బందీలను రక్షించే కార్యకలాపాల్లో నిపుణుడిగా ఉంటారని పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఆర్మీ దుస్తుల్లో, సన్‌గ్లాసెస్‌తో, ఓ కారు

అనిల్ రావిపూడి ఏం చేసినా ప్రేక్షకుల దృష్టిని వెంటనే ఆకర్షిస్తుంటారు. ఆయన సినిమాల టైటిల్స్ విషయంలోనూ ఇదే ప్రత్యేకత కనిపిస్తుంది. గతంలో సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ ప్రకటించినప్పుడు కొందరు విమర్శలు, సెటైర్లు చేసినప్పటికీ, ఆ సినిమా విడుదలైన తర్వాత భారీ విజయాన్ని అందుకుంది. ప్రాంతీయ సినిమా పరిశ్రమలో పలు రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పుడు అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాకు కూడా ఆసక్తికరమైన టైటిల్‌ను ఎంచుకున్నారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు 'జనవరి 12 విడుదల' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ఆల్రెడీ ప్రకటించారు. దానికి అనుగుణంగానే సినిమా టైటిల్ కూడా ఫైనల్ చేశారు. టైటిల్‌ను ప్రకటిస్తూ చిత్రబృందం విడుదల చేసిన వీడియో కూడా సరదాగా సాగింది. ఇందులో వెంకటేష్, కల్యాణ్ రామ్‌తో పాటు కీర్తి సురేష్, కృతి శెట్టి కనిపించారు. జనవరి 12 విడుదల అనే మాట విన్న కీర్తి సురేష్, కృతి శెట్టి అది సినిమా టైటిల్ అనుకోవాలా, లేక విడుదల తేదీ అనుకోవాలా అన్న అయోమయంలో పడతారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి అసలు విషయాన్ని వివరిస్తారు. సినిమా పేరు కూడా జనవరి 12 విడుదలేనని, విడుదల తేదీ కూడా జనవరి 12నే అని చెబుతారు. ఈ సందర్భంగా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఓ పాత సినిమాలోని క్లిప్‌ను స్ఫూర్తిగా తీసుకున్నట్లు తెలుస్తోంది. టైటిల్ ప్రకటన వీడియోలోని కామెడీ, హీరోలతో పాటు హీరోయిన్లను కూడా భాగం చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకు బావ బామ్మర్ది సౌజన్యంతో అనే ట్యాగ్‌లైన్‌ను కూడా ఖరారు చేశారు. వెంకటేష్, కల్యాణ్ రామ్ కలయిక నేపథ్యంలో ఈ ట్యాగ్‌లైన్ మరింత ఆసక్తిని పెంచుతోంది. అసలు జనవరి 12 విడుదలతో అనిల్ రావిపూడి ఎలాంటి కథను చెప్పబోతున్నారు, బావ బామ్మర్ది సౌజన్యంతో అనే ట్యాగ్‌లైన్ వెనుక

విక్టరీ వెంకటేష్ మరియు నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ మల్టీస్టారర్ చిత్రానికి టైటిల్ ఖరారైంది. "జనవరి 12 విడుదల బావ బామ్మర్ది సౌజన్యంతో" అనే ఆసక్తికరమైన శీర్షికను చిత్ర బృందం అధికారికంగా ఎంపిక చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. టైటిల్ ద్వారానే ఇది పూర్తి స్థాయి ఫ్యామిలీ మరియు కామెడీ ఎంటర్టైనర్ అని స్పష్టమవుతోంది. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన శైలిలో ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే వరుస బ్లాక్‌బస్టర్ హిట్లతో దూసుకుపోతున్న ఈ దర్శకుడు, ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్ హీరోలను ఒకే స్క్రీన్‌పై చూపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో మరియు సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కీర్తి సురేష్, కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తూ సందడి చేయనున్నారు. మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే మార్కెట్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇదిలా ఉండగా, షూటింగ్ ఇప్పటికే సగం వరకు పూర్తి చేసుకున్నట్లు సమాచారం అందింది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ టైమింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేస్తూ పక్కా ప్లానింగ్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఫలితంగా, జనవరి 12న బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్ద పోటీని ఇవ్వనుంది. వెంకటేష్ మరియు కళ్యాణ్ రామ్ కెమిస్ట్రీ వెండితెరపై ఎలా ఉండబోతుందో చూడాలి. పండుగ రోజున కుటుంబ ప్రేక్షకులను అలరించడానికి ఈ సినిమా సిద్ధమవుతోంది. అనిల్ రావిపూడి మరోసారి

సంక్రాంతి సంబరాల్లో సక్సెస్ చూసిన పలువురు హీరోలు మళ్ళీ పొంగల్ బరిపైనే గురి పెట్టారు.. వారిలో టాప్ స్టార్స్, మీడియం స్టార్స్, యంగ్ హీరోస్ ఉన్నారు. వారి సినిమా టైటిల్స్ సైతం ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. ఆ ముచ్చటేంటో చూద్దాం. టాలీవుడ్లో సంక్రాంతి (Pongal Movies) సీజన్‌కు ఉన్న క్రేజ్ మరో పండుగకు లేదంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు పొంగల్ తరువాత సమ్మర్, దసరా, క్రిస్మస్ సీజన్స్ కు సినిమాలు వచ్చి అలరించేవి. కానీ, ఇప్పుడు అనేకమంది తెలుగు స్టార్స్ సంక్రాంతి బరిపైనే గురి పెడుతున్నారు. అలా ఈ సారి పలువురు స్టార్స్ ముగ్గుల పండుగకు మురిపించే ప్రయత్నం చేస్తున్నారు. వారి సినిమా టైటిల్స్ సైతం ఆసక్తిని కలిగిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)- బాబీ కాంబోలో రెండో సినిమా ముందు నుంచీ పొంగల్ కే వస్తుందని వినిపిస్తోంది. ఈ మూవీకి 'కదిరి నరసింహుడు', 'కాకాజీ' అన్న టైటిల్స్ వినిపిస్తున్నాయి. చిరంజీవి పలుమార్లు సంక్రాంతి సంబరాల్లో సక్సెస్ సాధించారు. పాలిటిక్స్ వీడి మళ్ళీ సినిమాల్లోకి వచ్చిన తరువాత చిరంజీవికి బంపర్ హిట్స్ చూపించిన "ఖైదీ నంబర్ 150, వాల్తేరు వీరయ్య, మన శంకరవరప్రసాద్ గారు" చిత్రాలు పొంగల్ కే ప్రేక్షకులను పలకరించడం గమనార్హం. అందువల్ల తన కొత్త సినిమాను కూడా సంక్రాంతికే రిలీజ్ చేసే దిశగా చిరంజీవి అడుగులు వేస్తున్నారు. మరో స్టార్ హీరో వెంకటేశ్ (Venkatesh) కూడా పలుమార్లు సంక్రాంతి బరిలో గ్రాండ్ సక్సెస్ చూశారు. వెంకీ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' 2025 బ్లాక్ బస్టర్ గా నిలచింది... అలాగే ఆయన కేమియో రోల్ పోషించిన సమన శంకరవరప్రసాద్ గారు' కూడా బంపర్ హిట్ అనిపించుకుంది. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేశ్, కళ్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తోన్న సినిమాను కూడా పొంగల్ లోనే రిలీజ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు మేకర్. ఈ చిత్రానికి 'జనవరి 12 విడుదల' అనే టైటిల్‌ను ఖరారు

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మల్టీస్టారర్ చిత్రంపై చిత్ర బృందం అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోలుగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మల్టీస్టారర్ చిత్రంపై చిత్ర బృందం అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఈ చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ టైటిల్ రివీల్ చేస్తూ మేకర్స్ విడుదల చేసిన స్పెషల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ నవ్వులు పూయిస్తూ వైరల్ అవుతోంది. దివంగత లెజెండరీ దర్శకుడు ఇవివి సత్యనారాయణ వింటేజ్ కామెడీ స్పూర్తితో ఈ టైటిల్ గ్లింప్స్‌ను డిజైన్ చేశారు. హీరోలు వెంకటేష్, కళ్యాణ్ రామ్‌లతో పాటు హీరోయిన్లు కీర్తి సురేష్, కృతి శెట్టి కలిసి దర్శకుడు అనిల్ రావిపూడిని ‘సినిమా టైటిల్ ఏంటి?’ అని అడగ్గా, ఆయన ‘జనవరి 12 విడుదల’ అని పదే పదే బదులిస్తారు. రిలీజ్ డేట్ కాదు సినిమా టైటిల్ అడుగుతున్నాం కదా అని వెంకీ అడగగా, అసలు ఆ సినిమా పేరే ‘జనవరి 12 విడుదల’ (January 12 Vidudala) అని రివీల్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రానికి ‘బావ బావమర్ది సౌజన్యంతో’ అనే సరదా ట్యాగ్‌లైన్ కూడా జోడించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తోన్న ఈ భారీ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా పండగ వాతావరణంలో 12 జనవరి, 2027న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. టైటిల్, రిలీజ్ డేట్ రెండూ ఒకటే అయ్యేలా డిజైన్ చేసిన ఈ వినూత్న టైటిల్‌తో సినిమాపై ఓ రేంజ్లో అంచనాలు మొదలయ్యాయి. అనిల్ రావిపూడి ప్రమోషన్స్ నిర్వహించే తీరు

2027 సంక్రాంతి బరిలో నిలిచే సినిమాల లెక్కలు అప్పుడే మొదలైపోయాయి.. 4 ముందే దర్శక నిర్మాతలు పండగ రేసులో కర్చీఫ్‌లు వేసేస్తున్నారు. పాత సినిమాలకు తోడుగా కొత్త క్రేజీ ప్రాజెక్టులు కూడా ఈ ఫెస్టివల్ బరిలోనే దిగేందుకు ఆసక్తి చూపిస్తూ క్యూ కడుతున్నాయి. ఇంతకీ 2027 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్న ఆ భారీ సినిమాలేంటో చూద్దామా? చిరంజీవి, బాబీ కాంబినేషన్లో వస్తున్న మెగా 158వ చిత్రం ఆన్ టైమ్‌లో సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు రావడం పక్కా.. దీని షూట్ కూడా వేగంగా జరుగుతుంది. పైగా చిరంజీవి రీ ఎంట్రీలో ఖైదీ నెం 150, వాల్తేరు వీరయ్య, మన శంకరవరప్రసాద్ గారు పండక్కే వచ్చి హిట్టవ్వడంతో.. ఆ సెంటిమెంట్‌ను గట్టిగా నమ్ముతున్నారు చిరు. అందుకే మెగా 158ను పండక్కే ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్లో సంక్రాంతి అల్లుడు అనే బ్రాండ్ నేమ్ తెచ్చుకున్న అనిల్ రావిపూడి.. తన సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తూ 2027 సంక్రాంతికి వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో మల్టీస్టారర్‌ను సిద్ధం చేస్తున్నారు. పండక్కి మళ్లీ నవ్వించడానికి వచ్చేస్తున్నారు.. ఇప్పటికే ఫస్టాఫ్ షూటింగ్ కూడా అయిపోయింది.. ఆన్ టైమ్ పండక్కి ల్యాండ్ కానున్నారు అనిల్. సంక్రాంతికి 100 పర్సెంట్ సక్సెస్ రేట్ ఉన్న శర్వానంద్.. సీనియర్ దర్శకుడు శ్రీను వైట్లతో కలిసి జార్జ్ క్రిష్ అంటూ పండగ బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకున్నారు. జనవరి 14న సినిమా విడుదల కానుంది. కామెడీ ఎంటర్టైనర్స్కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన శ్రీను వైట్ల.. 2010లో వచ్చిన నమో వెంకటేశ తర్వాత పండగ సీజన్లో రానున్నారు. ఇలా స్టార్స్ నుంచి యంగ్ హీరోల వరకు ముందుగానే సీట్లు రిజర్వ్ చేసుకున్నారు. ఎదురెదురుగా వచ్చిన రెండు విమానాలు.. ఆకాశంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్.. ఆ తర్వాత ప్రియురాలిని హత్య చేసి గోనె సంచిలో తరలిస్తుండగా.. ఫ్రిజ్ ఓపెన్ చేయడానికి

విక్టరీ వెంకటేష్(venkatesh)తో ఆదర్శ కుటుంబం(Aadarsa Kutumbam) సినిమాను తెరకెక్కిస్తున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas).. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడంపై ఫోకస్ పెట్టారు. అక్టోబర్ 2న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ పూర్తిగా ఎన్టీఆర్(NTR)తో చేయాల్సిన మైథలాజికల్ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టాల్సి ఉంది. డ్రాగన్(Dragon) షూటింగ్లో ఎన్టీఆర్‌కు గాయమైన నేపథ్యంలో ఆ సినిమా షూటింగ్ ఆలస్యమైనప్పటికీ, 2027 జూన్‌లోనే రిలీజ్ చేయాలనే టార్గెట్‌తో టీమ్ ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. డ్రాగన్ రిలీజ్ వరకు ఎన్టీఆర్ అదే లుక్‌ను కొనసాగిస్తూ ప్రమోషన్స్‌లోనూ పాల్గొనాల్సి ఉంటుంది. దీంతో జూన్ 2027 వరకు ఆయన త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌కు పూర్తిగా అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. ఆ తర్వాత కొత్త లుక్‌లోకి మారేందుకు కూడా ఎన్టీఆర్‌కు కొన్ని వారాల టైమ్ అవసరమవుతుంది. ఈ గ్యాప్‌లో త్రివిక్రమ్ మరో సినిమాను త్వరగా పూర్తి చేస్తారా? అనే డిస్కషన్ మొదలైంది. అయితే పదినెలల్లో ఓ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసే డైరెక్టర్ గా త్రివిక్రమ్‌కు ట్రాక్ రికార్డ్ లేదు. అందుకే ఎన్టీఆర్ రాక కోసం వేచి చూస్తూనే, ఈలోపు మైథలాజికల్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను మరింత పక్కాగా పూర్తి చేయడమే త్రివిక్రమ్ ప్లాన్‌గా కనిపిస్తోంది. కథ, క్యారెక్టర్ డిజైన్, భారీ సెట్స్, విజువల్ ట్రీట్మెంట్ వంటి అంశాలపై ఆయన ఎక్కువ టైమ్ కేటాయించే అవకాశముంది. గాడ్ ఆఫ్ వార్(God Of War) అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్(Harika Haasinee Creations) బ్యానర్ నిర్మించనుంది. ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న ఈ భారీ సినిమా కోసం ఈ వెయిటింగ్ పీరియడ్ కీలకంగా మారనుంది

వెంకటేశ్ గౌడ్ లింగంపల్లి రూపొందించిన యానిమేషన్ మూవీ 'సర్దార్ సర్వాయి పాపన్న' ఈ నెల 21న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మంగళవారం ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను నిర్వహించారు. బహుజన చక్రవర్తిగా కీర్తి పొందిన చారిత్రక వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర ఆధారంగా దర్శక నిర్మాత వెంకటేష్ గౌడ్ లింగంపల్లి రూపొందించిన యానిమేషన్ మూవీ 'సర్దార్ సర్వాయి పాపన్న'. ఈ సినిమాను వి.జి.మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. దీపక్ న్యాతి నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలు వహిస్తున్నారు. ఈ యానిమేషన్ మూవీ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. మంగళవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, 'పన్నుల దోపిడీ నుంచి పేద ప్రజలను కాపాడిన వీరుడు సర్దార్ పాపన్న. బడుగు, వెనకబడిన కులాల వారిని ఒక్కటి చేసి పోరాడం సాగించాడు, 30 కోటలను జయించాడు. గోల్కొండ కోటపై కూడా తిరుగుబాటు చేశాడు. అలాంటి ధీరుడిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. నేను పాతికేళ్ల కిందట 'సర్వాయి పాపన్న' సినిమా రూపొందించాను. అప్పటికి ప్రజల్లో ఆయన గురించి అవగాహన లేదు. ఈ రోజు పల్లె పల్లెనా సర్దార్ పాపన్న విగ్రహాలు ఉన్నాయి. ఆయన చరిత్ర గురించి తెలిసింది. ఆ ధీరుడి గురించి సినిమా రూపొందించిన వెంకటేష్ గౌడ్ ను అభినందిస్తున్నాను' అని అన్నారు. దర్శక నిర్మాత వెంకటేష్ గౌడ్ లింగంపల్లి మాట్లాడుతూ, 'సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి సందర్భంగా ఈ రోజు మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నాం. పాపన్న గురించి అనేక గ్రంథాల్లో సమాచారం సేకరించి ఈ సినిమాను రూపొందించాను. 'బాహుబలి'లా మా సినిమా కూడా అలాంటి భారీ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇస్తుందని నమ్ముతున్నాం' అని అన్నారు. ఈ

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2027 Pongal Race: 2027 సంక్రాంతికి లెక్కలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఆల్రెడీ ఆరు నెలలు ముందుగానే హీరోలు, దర్శక, నిర్మాతలు ఒకప్పడు బస్సుల్లో ఖర్చీఫ్‌లు వేసి సీటు రిజర్వ్ చేసుకున్నట్టు .. ఆయా హీరోలు దర్శక, నిర్మాతలు దస్తీలు వేసి పెట్టుకున్నారు. ఇప్పుడు కొత్త సినిమాలు యాడ్ అవుతూనే ఉన్నాయి.. చిరంజీవి- బాబీ కలయికలో వస్తున్న చిత్రం మెగా 158 ఖచ్చితంగా ఆన్ టైమ్ సంక్రాంతికే రావడం పక్కా. ఇందులో ఎవరికీ ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. పైగా చిరంజీవికి రీ ఎంట్రీలో ఖైదీ నెం 150, వాల్తేరు వీరయ్య, మన శంకరవరప్రసాద్ గారు పండక్కే వచ్చి హిట్ కొట్టాయి. దీంతో మరోసారి మెగాస్టార్ సంక్రాంతి సెంటిమెంట్‌నే నమ్ముకున్నాడు. ఈ సినిమాకు ‘కదిరి నరసింహుడు’ అనే టైటిల్ దాదాపు ఖరారు అయింది. ఈ నెల 22న చిరంజీవి బర్త్ డే సందర్భంగా అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నారు. అనిల్ రావిపూడి వెంకటేష్, కళ్యాణ్ రామ్‌ల మూవీ.. అనిల్ రావిపూడికి సంక్రాంతి అల్లుడు అనే పేరు వచ్చేసింది. అది నిలబెట్టుకుంటూ 2027 సంక్రాంతికి వెంకటేష్, కళ్యాణ్ రామ్్ల మల్టీస్టారర్ సంక్రాంతికి రెడీ చేస్తున్నాడు. గత మూడు సంక్రాంతులకు వరుసగా తన సినిమాలను రిలీజ్ చేస్తున్నాడు. ఇక సంక్రాంతి రేసులో మరో సినిమా శర్వానంద్, శ్రీను వైట్ల ‘జార్జ్ క్రిష్’ కూడా ఏడాది ముందే సంక్రాంతి బెర్త్ లాక్ చేసుకున్నారు. ఇక శర్వానంద్ కూడా ఈ యేడాది సంక్రాంతికి ‘నారీ నారీ

తెలుగు సినిమా పరిశ్రమకు సంక్రాంతి పండుగ కేవలం పండుగ మాత్రమే కాదు, బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద సినిమాల జాతర. 2027 సంక్రాంతి బరిలో నిలిచేందుకు ఇప్పటికే పలు ఆసక్తికరమైన కాంబినేషన్లు, భారీ ప్రాజెక్ట్‌లు సిద్ధమవుతుండటంతో అప్పుడే సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది. 2027 సంక్రాంతి రేసులో అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిన సినిమాలను ఓసారి చూస్తే.. వెంకటేష్ – కల్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి : సంక్రాంతి కింగ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ కలసి ఒక క్రేజీ మల్టీస్టారర్ గా కత్తిలాంటి ఐడియాతో వస్తున్నారు. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతికి నవ్వుల పంట పండించడం ఖాయంగా కనిపిస్తోంది. సాయి ధరమ్ తేజ్ : ‘హను-మాన్’ వంటి సంచలన విజయాన్ని అందించిన ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘సంబరాల ఏటిగట్టు’. సాయి ధరమ్ తేజ్ హీరోగా రోహిత్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రవితేజ – శ్రీవిష్ణు – దిల్ రాజు : మాస్ మహారాజా రవితేజ కామెడీ అండ్ విలక్షణ నటనకు పేరుగాంచిన శ్రీవిష్ణు కాంబినేషన్లో ఒక హిలేరియస్ మల్టీస్టారర్ రూపుదిద్దుకుంటోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ఎంటర్టైనర్కు హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్నారు. శర్వానంద్ – శ్రీను వైట్ల –జార్జ్ క్రిష్ :‘సంక్రాంతి హీరో’గా పేరున్న శర్వానంద్, ఎంటర్టైన్మెంట్ సినిమాల స్పెషలిస్ట్ శ్రీను వైట్ల కాంబినేషన్లో వస్తున్న అవుట్ అండ్ అవుట్ ఫన్ రైడ్ ‘జార్జ్ క్రిష్’. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 14, 2027న విడుదల చేసేలా ప్లాన్ చేశారు. కార్తి – కళ్యాణ్ శంకర్ –

‘ఆస్మాన్’తో మేఘాంశ్‌కి మంచి విజయం దక్కాలని ఓ తల్లిగా కోరుకుంటున్నాను. నేను ఇప్పటికీ మేఘాంశ్‌ని చిన్న పిల్లాడిలానే చూస్తుంటాను. మేఘాంశ్ శ్రీహరి(Meghams Srihari) హీరోగా రామ్ నందన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆస్మాన్’ (Asmaan) వెంకటేష్ కొండారు, శ్రీకాంత్ మన్నెం నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, అరబిక్ భాషల్లో రూపొందుతోంది. స్వర్గీయ నటుడు శ్రీహరి జయంతి సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను శనివారం రిలీజ్ చేశారు. శాంతి శ్రీహరి మాట్లాడుతూ ‘మేఘాంశ్ మీద నమ్మకంతో ‘ఆస్మాన్’ చేసేందుకు ముందుకు వచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. మేఘాంశ్ రాత్రింబవళ్ళు పని చేస్తున్నాడు. బావ కూడా అలాగే చేసేవారు. ఆర్టిస్టులు ఎప్పుడూ అలానే కష్టపడి నటించాలి. మేఘాంశ్‌ని అద్భుతంగా చూపిస్తున్న రామ్ నందన్‌కి థాంక్స్. ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌కి మంచి విజయం దక్కాలని ఓ తల్లిగా కోరుకుంటున్నాను. నేను ఇప్పటికీ మేఘాంశ్‌ని చిన్న పిల్లాడిలానే చూస్తుంటాను. కానీ ఈ రోజు పోస్టర్ చూశాన తర్వాత సింహాన్ని చూసినట్టుగా అనిపించింది' అన్నారు. హీరో మేఘాంశ్ శ్రీహరి మాట్లాడుతూ 'రామ్‌తో వర్క్ చేయడం ఓ గొప్ప ఎక్స్‌పీరియెన్స్. సెట్లో ఎప్పుడూ ఓ పండుగ వాతావరణం కనిపించేది. ప్రశాంత్ గారి బీజీఎం అద్భుతంగా ఉండబోతోంది' అని అన్నారు. దర్శకుడు రామ్ నందన్ మాట్లాడుతూ ‘‘ఆస్మాన్’ మూవీతో అందరికీ ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. థియేటర్లో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాత వెంకట్ గారు, హీరో మేఘాంశ్ గారికి, విజువల్స్ ఇచ్చిన షోయబ్ గారికి థాంక్స్. మేఘాంశ్ గారు బయట కూడా హీరోనే. మున్ముందు మరిన్ని అప్డేట్లతో వస్తామ’ని అన్నారు. నిర్మాత వెంకటేష్ మాట్లాడుతూ ‘‘ఆస్మాన్’ పోస్టర్ అద్భుతంగా ఉంది. నాకు పోస్టర్ చూస్తుంటే మాత్రం ఫుల్ ఎనర్జిటిక్‌గా అనిపిస్తోంది. మేఘాంశ్‌ది ట్రాన్స్‌ఫార్మర్‌లాంటి బాడీ. మేఘాంశ్ యాక్టింగ్ చూసి అందరం ఆశ్చర్యపోయేవాళ్లం. సెట్లో అందరి కంటే ముందుంటాడు. రియల్ స్టార్ కొడుకు అంటే ఇలానే
విక్టరీ వెంకటేష్ , నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. వినోదానికి సరికొత్త హంగులు అద్ది, పక్కా కమర్షియల్ హంగులతో రూపొందుతున్న ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఏమాత్రం విరామం లేకుండా నిరంతరాయంగా చిత్రీకరణ జరుపుతోంది.చిత్ర యూనిట్ నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. దర్శకుడు అనిల్ రావిపూడి ఆదివారాలు, పండుగ సెలవులు అనే తేడా లేకుండా ఏకధాటిగా షూటింగ్ పనులను ముందుకు నడిపిస్తున్నారు. సంక్రాంతి నాటికి విడుదల చేయాలన్న పక్కా ప్రణాళికతో టీమ్ మొత్తం రాత్రింబవళ్లు శ్రమిస్తోంది. వేగంతో పాటు అవుట్‌పుట్ విషయంలో కూడా రాజీపడకుండా ప్రతి సన్నివేశాన్ని ఎంతో గ్రాండ్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటివరకు పూర్తి చేసుకున్న విజువల్స్ క్వాలిటీ అద్భుతంగా వచ్చిందని, థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.* కావేరీ పాత్ర కోసం చాలా కష్టపడ్డా... ‘ఇరుముడి’లో సెంటిమెంట్‌తో పాటు మంచి మెసేజ్ ఉంటుంది - ప్రియా భవానీకల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్ఈ సినిమాలో వెంకటేష్ పోషిస్తున్న పాత్ర కథకి ప్రధాన బలంగా నిలవనుంది. ఆర్మీలోని కౌంటర్-టెర్రరిజం, బందీల విముక్తి విభాగంలో పనిచేసే 'లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి' అనే మోస్ట్ పవర్ఫుల్ సైనిక అధికారి పాత్రలో ఆయన కనిపించనున్నారు. చిత్ర పరిశ్రమలో 40 ఏళ్ల మైలురాయిని పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదలైన వెంకటేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. మిలిటరీ గెటప్‌లో వెంకటేష్ చూపించిన గాంభీర్యం సినిమాపై అంచనాలను ఒక్కసారిగా రెట్టింపు చేసింది.అనిల్ మార్క్ ఎంటర్టైన్మెంట్అనిల్ రావిపూడి అనగానే గుర్తొచ్చే ఫ్యామిలీ ఎమోషన్స్, కడుపుబ్బా నవ్వించే హాస్యానికి ఈసారి భారీ యాక్షన్, ఆర్మీ నేపథ్యాన్ని జోడించి సినిమాను అత్యున్నత ప్రమాణాలతో మలుస్తున్నారు. ఇందులో వెంకటేష్‌కు

కొత్తదనం లేకుంటే ఎంత పెద్ద స్టార్ నటించిన ఆ చిత్రాన్ని ప్రేక్షకులు నిర్దాక్షింగా పక్కన పెట్టేస్తున్న పరిస్థితి. దీంతో ప్రముఖ స్టార్స్ కూడా తమ చిత్రాల్లో మంచి ప్యాడింగ్ ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఇందుకు ఉదాహరణ నటుడు రజనీకాంత్. ఈయన జైలర్ చిత్రం నుంచి తనతో పాటూ ఇతర భాషలకు చెందిన స్టార్ హీరోలను అతిధి పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా మరో స్టార్ హీరో అజిత్ కూడా ఆయన బాటలోనే పయనించడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. గతేడాది గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి కమర్షియల్ హిట్ చిత్రం తర్వాత అజిత్ తన దష్టిని కార్ రేస్ పోటీలపై మరలించారు. ఆ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో పతకాలను గెలుచుకున్నారు. కాగా ఆ సన్నివేశాలను విజయ్ చిత్రంగా మలిశారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం గ్లాడియేటర్స్ ఇన్ పర్చూట్ ఆఫ్ ఛాలెంజర్స్ పేరుతో త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అజిత్ తన సతీమణి శాలినిని ప్రొడ్యూసర్‌గా పరిచయం చేస్తూ బ్రేవ్ హార్ట్స్ ప్రొడక్షన్ సంస్థను ప్రారంభించి డేర్ డెవిల్ అనే చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధమయ్యారు. దీనికి గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం ఫేమ్ ఆధిక్ రవిచంద్రన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్‌లో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ఒకే షెడ్యూల్లో పూర్తి చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇకపోతే పాన్ ఇండియా స్థాయిలో రూపొందబోతున్న ఇందులో టాలీవుడ్ స్టార్ నటుడు వెంకటేశ్.. మాలీవుడ్ స్టార్ మోహన్ లాల్ తీసుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే దీని గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఇప్పుడుఈ టాపిక్ కోలీవుడ్‌లో ఆసక్తిగా మారింది. ఆదిలాబాద్ లో సందడి చేసిన ఐశ్వర్య రాజేష్,హెబ్బా పటేల్ (ఫొటోలు) ‘వణక్కం జెన్‌జీ’.. సీఎంగా విజయ్ ఫస్ట్

విక్టరీ వెంకటేష్(Venkatesh), నందమూరి కళ్యాణ్ రామ్ కీలక పాత్రల్లో దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. విక్టరీ వెంకటేష్(Venkatesh), నందమూరి కళ్యాణ్ రామ్ కీలక పాత్రల్లో దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సంక్రాంతి కానుకగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో షూటింగ్‌ను ఎలాంటి బ్రేక్ లేకుండా శరవేగంగా పూర్తి చేసే పనిలో చిత్రబృందం నిమగ్నమైంది. ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అనిల్ క్షణం తీరక లేకుండా సినిమా షూటింగ్ చేస్తున్నారట. ఆదివారాలు, సెలవులు అనే తేడా లేకుండా టీమ్ షూటింగ్ చేస్తోందట. సంక్రాంతి విడుదలను టార్గెట్‌గా పెట్టుకుని వీలైనంత త్వరగా చిత్రీకరణను పూర్తి చేయాలని దర్శకుడు అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పూర్తయిన సన్నివేశాల అవుట్‌పుట్ కూడా అద్భుతంగా వస్తున్నట్లు చిత్రబృందం చెబుతోంది. ప్రాజెక్ట్ విషయంలో నిర్మాణ సంస్థ, దర్శకుడు ఎక్కడా రాజీపడటం లేదని తెలుస్తోంది. భారీ స్కేల్‌తో పాటు అత్యున్నత నిర్మాణ విలువలను పాటిస్తూ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. థియేటర్లలో ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు గ్రాండ్ విజువల్ ఎక్స్పీరియన్స్ అందించేలా ప్రతి అంశాన్ని పక్కాగా ప్లాన్ చేస్తున్నారట. (VenkyANIL5 - #NKRAR2) అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్, ఎంటర్టైన్మెంట్కు ఈసారి మరింత భారీ స్కేల్‌ను జోడిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వెంకటేష్–కళ్యాణ్ రామ్ కాంబినేషన్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇందులో వెంకటేష్ ‘లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి’ అనే పవర్ఫుల్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. వెంకటేష్ సరసన కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్‌కు జోడీగా కృతి శెట్టి నటిస్తున్నారు. జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి

తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘డేర్ డెవిల్’ చిత్రంలో టాలీవుడ్ కథానాయకుడు విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్ర పోషించనున్నారనే పరిశ్రమలో వినిపిస్తున్నాయి. గతంలో ‘ఎకే64’గా ప్రచారంలో ఉన్న ఈ భారీ ప్రాజెక్టులో వెంకటేష్ భాగం కానున్నట్లు ట్రేడ్ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఈ కాంబినేషన్ కు సంబంధించి ఇప్పటివరకు చిత్ర యూనిట్ నుంచి గానీ, నటుల వైపు నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆగస్టు 3న దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ సోషల్ మీడియా వేదికగా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేస్తూ ఈ చిత్రానికి ‘డేర్ డెవిల్’ అని పేరు ఖరారు చేశారు. అజిత్ భార్య శాలిని అజిత్‌కుమార్ తన సొంత నిర్మాణ సంస్థ ‘బ్రేవ్ హార్ట్స్ ప్రొడక్షన్’ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ ఈ ప్రాజెక్టుకు సంగీతాన్ని అందిస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సాధించిన విజయం తర్వాత అజిత్-ఆధిక్ కలిసి చేస్తున్న రెండో సినిమా ఇది. ఈ సినిమా షూటింగ్ 2026 సెప్టెంబర్‌లో ప్రారంభం కానుండగా, 2027 వేసవిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం కాస్టింగ్ ఎంపిక ప్రక్రియ వేగంగా జరుగుతోందని చిత్ర వర్గాలు వెల్లడించాయి. అధికారిక పోస్టర్లో అజిత్ మినహా ఇతర నటీనటుల వివరాలను వెల్లడించలేదు. దక్షిణాదికి చెందిన ప్రముఖ నటులతో పాటు బాలీవుడ్ నటులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. దీంతో గతంలో కాయడు లోహర్, మోహన్‌లాల్ వంటి నటుల పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. ఇదిలా ఉండగా ఆగస్టు 11న వెంకటేష్ పేరు ప్రముఖంగా తెరపైకి వచ్చింది. వెంకటేష్ ఈ పాత్రకు ఓకే చెప్పడానికి మూడు ప్రధాన కారణాలు ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అజిత్‌తో ఉన్న ప్రత్యేక పర్సనల్ అనుబంధం, కథలో తన పాత్రకు ఉన్న ప్రాధాన్యత, మరియు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడం ఇందులో ముఖ్యమైనవి. ఫలితంగా

హీరోగా విక్టరీ వెంకటేశ్ తొలి సినిమా ‘మనవూరి పాండవులు’ ఆగస్ట్ 14తో నలభై ఏళ్ళు పూర్తి చేసుకుంది. అంటే వెంకటేశ్ తెర వయసు నాలుగు పదులే అన్నమాట, హీరోగా విక్టరీ వెంకటేశ్ (Victory Venkatesh) తొలి సినిమా ‘మనవూరి పాండవులు’ ఆగస్ట్ 14తో నలభై ఏళ్ళు పూర్తి చేసుకుంది. అంటే వెంకటేశ్ తెర వయసు నాలుగు పదులే అన్నమాట. ఈ నాలుగు దశాబ్దాలలో వెంకటేశ్ కెరీర్ సాగిన తీరును గమనిస్తే.. పదేళ్ళ వయసులో వెంకటేశ్ తొలిసారి తన తండ్రి డి. రామానాయుడు నిర్మించిన ‘ప్రేమనగర్’ సినిమాలో చిన్నప్పటి సత్యనారాయణగా నటించారు. ఆ తరువాత మళ్ళీ తెరపై కనిపించలేదు. అమెరికాలో చదువు పూర్తి చేసుకొని వచ్చాక వెంకటేశ్ మనసులోని కోరిక తెలుసుకున్న డి. రామానాయుడు ‘కలియుగ పాండవులు’తో తనయుడిని హీరోగా పరిచయం చేశారు. అలా సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థకు వెంకటేశ్ రూపంలో సొంత హీరో దొరికారు. ‘కలియుగ పాండవులు’కు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ మూవీతో ఖుష్బూ తెలుగు చిత్రసీమకు పరిచయమయ్యారు. పరుచూరి బ్రదర్స్ రచనతో రూపొందిన ‘కలియుగ పాండవులు’ చిత్రం 1986 ఆగస్ట్ 14న విడుదలైంది. ఆ చిత్రం నటునిగా వెంకటేశ్‌కు మంచి పేరు సంపాదించి పెట్టింది. ఆరంభంలో వరుస ఫ్లాపులు పలకరించిన వెంకటేశ్‌కు బి. గోపాల్ డైరెక్షన్లో రూపొందిన ‘రక్తతిలకం’ మంచి విజయాన్ని అందించింది. ఆ పై గోపాల్ దర్శకత్వంలోనే రూపొందిన ‘బొబ్బిలి రాజా’ బంపర్ హిట్‌ను సొంతం చేసింది. ‘శత్రువు, కూలీ నంబర్ వన్, క్షణక్షణం’ చిత్రాల తరువాత వెంకటేశ్ నటించిన ‘చంటి’ ఇండస్ట్రీ హిట్‌గా వెలిగింది. ఈ మూవీ హిందీ రీమేక్ ‘అనాడీ’లోనూ వెంకటేశ్ నటించి బాలీవుడ్లో అడుగు పెట్టారు. వరుసగా రీమేక్ మూవీస్‌లో నటిస్తూ సందడి చేశారు వెంకటేశ్. ‘ఇంట్లో ఇల్లాలు- వంటింట్లో ప్రియురాలు, పవిత్రబంధం, ప్రేమించుకుందాం రా, పెళ్ళిచేసుకుందాం, సూర్యవంశం, గణేశ్, ప్రేమంటే ఇదేరా, రాజా’ సినిమాలతో వరుస విజయాలు చూశారు వెంకటేశ్. ‘కలిసుందాం రా

సినీ ఇండస్ట్రీలో ఏ మూల ఏం జరుగుతుందో తెలిపే సమాచార మాలిక ‘ర్యాపిడ్ చిత్రం’. టాలీవుడ్ టు హాలీవుడ్ ఫిల్మ్ అప్డేట్స్ ఇందులో చూడొచ్చు. ఆలస్యమెందుకు వీడియో చూసేయండిక! విక్టరీ వెంకటేశ్ సినీ ప్రయాణం 40 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఫ్యాన్స్ కు అనిల్ రావిపూడి అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. వీరి క్రేజీ కాంబోలో వస్తున్న సినిమా నుంచి వెంకటేశ్ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు. ‘లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి’గా పవర్ ఫుల్ రోల్లో ఇందులో వెంకీ కనిపించనున్నారు. శర్వానంద్, శ్రీను వైట్ల కొత్త సినిమా సినీ ప్రముఖుల మధ్య ప్రారంభమైంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు ‘జార్జ్ క్రిష్’ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. సురేశ్ బాబు కెమెరా స్విచ్ఛాన్ చేయగా.. తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లాప్ కొట్టారు. హవీష్, కావ్య థాపర్ జంటగా త్రినాథ్ రావు నక్కిన తెరకెక్కిస్తోన్న ‘నేను రెడీ’ చిత్రం నుంచి ‘మస్తుగుందిరా యవ్వారం’ పాట విడుదలైంది. మిక్కీ జె మేయర్ స్వరపరిచిన ఈ పాటను కాసర్ల శ్యామ్ రాయగా, అనురాగ్ కులకర్ణి, మనీషా పాడారు. అశోక్ గల్లా, శ్రీగౌరీ ప్రియ జంటగా నటిస్తోన్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘వీసా’ నుంచి రెండో టీజర్ విడుదలైంది. ఉద్భవ్ రఘు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం అక్టోబర్ 17న విడుదల కానుంది.. ఇంకా ఇలాంటి సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి. నా మాటలను వక్రీకరించారు: ట్రోలింగ్‌పై అనసూయ సంచలన పోస్ట్ ‘జార్జ్ క్రిష్’.. శ్రీను వైట్లకు శర్వానంద్ అయినా హిట్ ఇస్తాడా మహేష్ బాబు కాదా.. బుచ్చిబాబు నెక్ట్స్ ప్రాజెక్ట్ మెగాస్టార్‌తోనా?

2027 సంక్రాంతి (2027 Sankranthi) పండుగకి ఇంకా ఐదు నెలలపైనే టైముంది. కానీ అప్పుడే పండగకి వస్తామంటూ అనేక సినిమాలు ప్రకటిస్తున్నాయి. విడుదల తేదీ ప్రకటిస్తూ కర్చీఫ్ లు వేసేస్తున్నారు నిర్మాతలు. ఇప్పటివరకు సంక్రాంతి డేట్ ప్రకటించిన సినిమాలేవో చూద్దాం. అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా ఒక మల్టీస్టారర్ చిత్రం తీస్తున్నారు. ఈ సినిమా ఓపెనింగ్ రోజే సంక్రాంతి విడుదల అని ప్రకటించారు. జోరుగా షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తి అయింది. జనవరి 13న విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకి “బామ్మర్ది బాల్ రెడ్డి,” “జనవరి 13 విడుదల” అనే పేర్లు పరిశీలిస్తున్నారు. శర్వానంద్ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల సినిమా తీస్తున్నారు. ఈ సినిమాకి జార్జి క్రిష్ అనే పేరు ఖరారు అయింది. ఆగస్టు 13న సినిమాని లాంచ్ చేశారు. కానీ ఐదు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేస్తారట. ఎందుకంటే సంక్రాంతి 2026కి శర్వానంద్ నటించిన ‘నారి నారి నడుమ మురారి’ విడుదలై అతన్ని ఫ్లాపుల నుంచి బయటపడేసింది. గతంలో కూడా “శతమానం భవతి” సంక్రాంతికి పెద్ద హిట్ అయింది. సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న ‘సంబరాల ఏటిగట్టు’ దాదాపు రెండేళ్ళకి పైగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా ఆగిపోయింది అనే పుకార్లు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు సంక్రాంతి 2027 విడుదల అంటూ మేకర్స్ ప్రకటించారు. రవితేజ, శ్రీ విష్ణు హీరోలుగా నిర్మాత దిల్ రాజు ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి హసిత్ గోలి దర్శకుడు. షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. కానీ సంక్రాంతికి విడుదల అని ముందే ఫిక్స్ అయ్యారు. “అక్కాయిలు బాగున్నారా” అనే టైటిల్ పరిశీలనలో ఉంది. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ తీస్తున్న చిత్రం కూడా మొదట సంక్రాంతికి ప్లాన్ చేశారు. ఐతే, ‘విశ్వంభర’

విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న #VenkyAnil5 #NKRAR2 భారీ వినోదాత్మక చిత్రంగా రూపుదిద్దుకుంటూ శరవేగంగా ముందుకు సాగుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. కళ్యాణ్ రామ్ పుట్టినరోజున విడుదల చేసిన ఆయన ఫస్ట్-లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఇండస్ట్రీలో వెంకటేష్ 40 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ ఆయన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో వెంకటేష్ ఇండియన్ ఆర్మీ క్యామోఫ్లేజ్ యూనిఫామ్‌లో, సన్‌గ్లాసెస్, స్కార్ఫ్ ధరించి పవర్ ఫుల్ గా కనిపించారు. ఓ రగ్గడ్ SUV పక్కన నిల్చున్న ఆయన లుక్‌లో ఇంటెన్సిటీ అదిరిపోయింది. ఈ లుక్‌తో వెంకటేష్ ఓ రగ్గడ్ మిలటరీ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారనే విషయం అర్థమవుతోంది. పోస్టర్లో వెంకటేష్ పాత్రను లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డిగా పరిచయం చేశారు. ఇండియన్ ఆర్మీలో పనిచేసే ఆయన కౌంటర్ టెర్రరిజం, హోస్టేజ్ నెగోషియేషన్‌లో నిపుణుడిగా కనిపించనున్నారు. బ్యాక్‌డ్రాప్‌లో కనిపించే ఆర్మీ ఇన్సిగ్నియా, క్రాస్డ్ స్వోర్డ్స్ ఎంబ్లమ్ సినిమా మిలటరీ నేపథ్యాన్ని మరింత ఎఫెక్టివ్ గా వున్నాయి. మ్యూటెడ్ బ్లూ-గ్రీన్ స్కై, రాకీ టెర్రైన్, భారీ SUVతో పోస్టర్‌కు అడ్వెంచరస్, దేశభక్తి టచ్ వచ్చింది. ఎర్తీ క్యామోఫ్లేజ్ టోన్స్ కూడా ఈ రగ్గడ్ లుక్కు చక్కగా సరిపోయాయి. వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. వారి మధ్య ఉండే కెమిస్ట్రీ, కామెడీ.. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్కు మరింత బలాన్ని చేకూర్చనున్నాయి. వెంకటేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా, కళ్యాణ్ రామ్‌కు జోడీగా కృతి శెట్టి కనిపించనున్నారు. జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా

తెలుగు చిత్రసీమలో విక్టరీ వెంకటేష్ తన సినీ ప్రస్థానంలో 40 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. 1986 ఆగస్టు 14న కలియుగ పాండవులు సినిమాతో కథానాయకుడిగా రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆయన, సరిగ్గా నాలుగు దశాబ్దాల తర్వాత అదే తేదీన అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఆగస్టు 14న దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గరపటి, సురేష్ ప్రొడక్షన్స్ బృందం సంయుక్తంగా ఆయన కొత్త చిత్రాన్ని ప్రకటించాయి. ఈ ప్రత్యేక సందర్భంగా వెంకటేష్‌ను లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డిగా పరిచయం చేస్తూ శక్తివంతమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. వెంకటేష్ 1986లో తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించి బ్రహ్మపుత్రుడు, స్వర్ణకమలం, ప్రేమ, బొబ్బిలి రాజా, చంటి, దృశ్యం, గురు, ఎఫ్2 వంటి ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలతో అలరించారు. కుటుంబ కథా చిత్రాల నుండి పవర్ ఫుల్ యాక్షన్ సినిమాల వరకు ప్రతి విభాగంలోనూ తనదైన ముద్ర వేసి విక్టరీ అనే బిరుదును సార్థకం చేసుకున్నారు. ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు అనేక నంది పురస్కారాలను అందుకొని నాలుగు దశాబ్దాలుగా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ నూతన చిత్రం వెంకీఅనిల్5 మరియు ఎన్‌కేఆర్‌ఏఆర్2గా ప్రచారంలో ఉంది. విడుదల చేసిన పోస్టర్లో వెంకటేష్ కాంబాట్ కామోఫ్లాజ్ యూనిఫాం, సన్‌గ్లాసెస్, స్కార్ఫ్‌తో చాలా కమాండింగ్‌గా కనిపించారు. కౌంటర్-టెర్రరిజం మరియు హోస్టేజ్ నెగోషియేషన్‌లో నిపుణుడైన ఆర్మీ అధికారిగా ఆయన పాత్ర ఉండబోతోందని చిత్ర బృందం స్పష్టం చేసింది. దీంతో ఈ ఆర్మీ ఆఫీసర్ అవతార్ సోషల్ మీడియాలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇదిలా ఉండగా బ్యాక్‌డ్రాప్‌లో ఆర్మీ ఇన్సిగ్నియా, క్రాస్డ్ స్వోర్డ్స్ సింబల్ మరియు లగ్జరీ కారు పక్కన ఆయన నిలబడి ఉన్న శైలి సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. దర్శకుడు అనిల్ రావిపూడి తన ఎక్స్ ఖాతాలో వెంకటేష్‌తో కలిసి పనిచేయడం ఎంతో గౌరవంగా ఉందని రాసుకొచ్చారు

టాలీవుడ్లో సంక్రాంతి సీజన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్ల వర్షం కురిపించే పండగ కావడంతో పెద్ద హీరోల నుంచి యంగ్ హీరోల వరకు ప్రతీ ఒక్కరూ తమ సినిమాలను సంక్రాంతికే తీసుకురావాలని తహతహలాడుతుంటారు. అయితే ఈసారి పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ఇంకా షూటింగ్ కూడా మొదలుకాని సినిమాలు సైతం ముందే సంక్రాంతి స్లాట్‌పై కర్చీఫ్ వేసేస్తున్నాయి. ఈ ఏడాది ‘నారీ నారీ నడుమ మురారి’తో మంచి హిట్ అందుకున్న యంగ్ హీరో శర్వానంద్, దర్శకుడు శ్రీనువైట్లతో కలిసి జార్జ్ క్రిష్ చిత్రాన్ని ఈ రోజు ప్రారంభించారు. సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేసారు. మరోవైపు రవితేజ – శ్రీవిష్ణు కాంబినేషన్లో దిల్ రాజు నిర్మించనున్న ప్రాజెక్ట్ ఇంకా అధికారికంగా సెట్స్ పైకి వెళ్లనప్పటికీ సంక్రాంతి రేసులోనే నిలపాలని దిల్ రాజు పట్టుదలతో ఉన్నారు. ఇక సీనియర్ స్టార్ హీరోలు కూడా పండగ బరిలో గట్టిగానే పోటీపడుతున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం సంక్రాంతికి సిద్ధమవుతోంది. అలాగే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో వెంకటేష్ – నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ కూడా ఇదే బరిలో ఉంది. దీనికి తోడు కోలీవుడ్ డబ్బింగ్ సినిమాలు కూడా ఈ పోటీని మరింత హీటెక్కిస్తున్నాయి. కమల్ హాసన్ నిర్మాణంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘ధర్మన్’ సినిమాతో పాటు, ‘ఆవేశం’ ఫేమ్ జిత్తు మాధవన్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న కొత్త సినిమా కూడా సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సమాయత్తమవుతున్నాయి. మొత్తానికి సినిమా షూటింగ్‌లు పూర్తి కాకుండానే విడుదల తేదీల ప్రకటనలతో బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి పోరు అప్పుడే వేడెక్కింది

హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని డెక్కన్ కిచెన్ ప్రాపర్టీ వివాదంలో నటులు దగ్గుబాటి వెంకటేశ్, రానా దగ్గుబాటిలకు తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేయాలని దగ్గుబాటి కుటుంబ సభ్యులు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎన్. తుకారాంజీ ఇటీవల తోసిపుచ్చారు. దీంతో నాంపల్లి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈ కేసు విచారణ యథాతథంగా కొనసాగనుంది. ఈ వ్యవహారంలో నటులతో పాటు నిర్మాత డి. సురేష్ బాబు, డి. అభిరామ్, అకౌంటెంట్ గడ్డం విశ్వనాథం కూడా క్రిమినల్ విచారణను ఎదుర్కోనున్నారు. ఈ వివాదం మూలాలు 2014 కాలం నాటి లీజు ఒప్పందంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ సమయంలో దగ్గుబాటి కుటుంబం తమ భూమిని డబ్ల్యూ3 హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు లీజుకు ఇవ్వగా, వ్యాపారవేత్త కొరే నందు కుమార్ అక్కడ డెక్కన్ కిచెన్ రెస్టారెంట్ ఏర్పాటుకు భారీ పెట్టుబడులు పెట్టారు. అయితే 2018 నుంచి ప్రాపర్టీ లీజు హక్కులు, స్థలం స్వాధీనం విషయంలో ఇరువర్గాల మధ్య తీవ్ర విభేదాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత 2022 నవంబర్‌లో జీహెచ్ఎంసీ అధికారులు ప్రాంగణంలోని కొన్ని నిర్మాణాలను పాక్షికంగా కూల్చివేశారు. హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు అమలులో ఉన్నప్పటికీ 2024 జనవరిలో నిర్మాణాలను పూర్తిగా కూల్చివేశారని బాధితుడు నందు కుమార్ కోర్టును ఆశ్రయించారు. దీంతో దగ్గుబాటి కుటుంబ సభ్యులు అధికారుల సహకారంతో లీజు ప్రాంగణంలోకి అక్రమంగా ప్రవేశించి, ఆస్తులను ధ్వంసం చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడ్డారని ప్రైవేట్ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హౌస్ ట్రెస్పాస్, దొంగతనం, క్రిమినల్ కుట్ర వంటి తీవ్రమైన సెక్షన్ల కింద నమోదు చేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు విచారణకు స్వీకరించింది. క్రిమినల్ కేసును రద్దు చేయాలంటూ దగ్గుబాటి కుటుంబం 2024 లోనే హైకోర్టును ఆశ్రయించి తమ వాదనలను బలంగా వినిపించింది. ఇది కేవలం లీజు, ఆస్తుల స్వాధీనానికి సంబంధించిన సివిల్ వివాదమని, కాబట్టి క్రిమినల్ ప్రొసీడింగ్స్ సరికాదని

‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (2025) వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత హీరో అజిత్, దర్శకుడు అధిక్ రవిచంద్రన్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘డేర్ డేవిల్’. అజిత్ కెరీర్‌లోని ఈ 64వ సినిమాను బ్రేవ్ హార్ట్స్ప్రోడక్షన్స్ పతాకంపై ఆయన భార్య షాలినీ అజిత్‌కుమార్ నిర్మించనుండటం విశేషం. ఈ సినిమా చిత్రీకరణను అతి త్వరలోనే ప్రారంభించాలనుకుంటున్నారు. ప్రస్తుతం ప్రీప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. అలాగే ఈ సినిమాలోని నటీనటుల ఎంపికపై కూడా దృష్టి పెట్టారు దర్శకుడు అధిక్. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని ఓ కీలక పాత్రకు వెంకటేశ్‌ను సంప్రదించారట మేకర్స్. కథ నచ్చడం, పైగా కథను మలుపు తిప్పే పాత్ర కావడంతో ఈ సినిమా చేసేందుకు దాదాపు ఓకే చె΄్పారట వెంకటేశ్. అంతే కాదండోయ్... ఈ చిత్రంలోని మరో కీలక పాత్రలో మోహన్‌లాల్ నటించనున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే ఈ అంశాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. మరోవైపు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలోని ‘ఆదర్శ కుటుంబం–ఏకే 47’, అనిల్ రావిపూడి డైరెక్షన్‌లోని ‘బామ్మర్ది బాల్‌రెడ్డి’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాల్లో వెంకటేశ్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆదర్శ కుటుంబం’ సినిమా అక్టోబరు 2న, అనిల్ రావిపూడి డైరెక్షన్‌లోని చిత్రం వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానున్నాయి. హాఫ్ శారీలో చిన్న పిల్లలా హీరోయిన్ నభా నటేశ (ఫొటోలు) ఫైరింగ్ కియారా.. అందం ఏ మాత్రం తగ్గలే (ఫొటోలు) ఐశ్వర్య రాజేశ్ ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు) కొత్త కరెన్సీ వచ్చేస్తోంది.. 100 కోట్ల ప్లాస్టిక్ నోట్లతో కేంద్రం ట్రయల్ ఒక్క ఉద్యోగం లేని టెసారా కంపెనీలో కోట్ల డబ్బు ఎలా..? భారతి సిమెంట్స్ వద్ద హై టెన్షన్.. TDP గూండాల బీభత్సం YS జగన్ కర్నూల్ పర్యటన షెడ్యూల్ ఇదే... పోలీసులకు మా విజ్ఞప్తి ఏంటంటే..?

విక్టరీ వెంకటేష్ కేవలం హీరోగానే కాకుండా కథకు బలం ఇచ్చే కీలక పాత్రలు చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. ఒకవైపు హీరోగా సూపర్‌హిట్ చిత్రాలు అందిస్తూనే, మరోవైపు స్టార్ హీరోల సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న ప్రత్యేక పాత్రలను చేయడానికి ఆయన వెనుకాడరు. విక్టరీ వెంకటేష్ (Venkatesh) కేవలం హీరోగానే కాకుండా కథకు బలం ఇచ్చే కీలక పాత్రలు చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. ఒకవైపు హీరోగా సూపర్‌హిట్ చిత్రాలు అందిస్తూనే, మరోవైపు స్టార్ హీరోల సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న ప్రత్యేక పాత్రలను చేయడానికి ఆయన వెనుకాడరు. ఇప్పటివరకు టాలీవుడ్లో మహేష్ బాబుతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పవన్ కళ్యాణ్‌తో గోపాల గోపాల, అలాగే రామ్ తో మసాలా.. వరుణ్ తేజ తో ఎఫ్ 2, ఎఫ్ 3 వంటి మల్టీస్టారర్లలో నటించి మెప్పించారు. ఇక బాలీవుడ్‌లోనూ సల్మాన్ ఖాన్‌తో కలిసి కిసీ కా భాయ్ కిసీ కా జాన్ చిత్రంలో కీలక పాత్ర పోషించి అక్కడ కూడా అలరించారు. ఇప్పటివరకు తెలుగు, హిందీ చిత్రాలకే పరిమితమైన వెంకీ మామ, ఇప్పుడు కోలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సినీ వర్గాల్లో బలమైన వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న డేర్ డెవిల్ చిత్రంలో వెంకటేష్ ఒక అత్యంత కీలకమైన పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని ఈ మధ్యనే మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో పాటు టైటిల్ ని కూడా అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. వెంకీ మామ ఈ సినిమాలో నటిస్తున్నట్లు తెలియడంతో ఒక్కసారిగా డేర్ డెవిల్ పై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించడానికి వెంకటేష్ అంగీకరించడం వెనుక ఫిలిం నగర్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. అజిత్‌తో ఉన్న ప్రత్యేక అనుబంధం, స్నేహం కారణంగానే వెంకీ ఈ ఆఫర్‌కు సుముఖత వ్యక్తం చేశారని ఒక

Veldanda: పోతేపల్లిలో ఉప్పల ట్రస్ట్ ఉదార్యత బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం! Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పోతేపల్లి గ్రామం లో అప్పల గున్నమ్మ మరణించిన విషయం తెలుసుకొని ఉప్పల ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ సహకారం తో కుటుంబ సభ్యులకు 3000రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో అంజి మాస్టర్,తాగుళ్ల చంద్రయ్య, సాయిబాబు, బోయినిపల్లి తిరుపతయ్యగౌడ్ , డీలర్ వెంకటయ్య, ఏనుముల నారయ్య ,వార్డు నెంబర్ గోరటి అశోక్ కుమార్ పాల్గొన్నారు

విక్టరీ వెంకటేష్(venkatesh) కెరీర్లో అనౌన్స్మెంట్ తర్వాత కూడా ఆగిపోయిన సినిమాల లిస్ట్ చిన్నదేమీ కాదు. కథలు ఫైనల్ కావడం, డిస్కషన్స్ పూర్తవడం, ఇండస్ట్రీలో వార్తలు రావడం వరకు వెళ్లిన కొన్ని సినిమాలు చివరికి సెట్స్ మీదికి వెళ్లలేదు. అలాంటి ప్రాజెక్టుల్లో డైరెక్టర్ త్రినాథరావు నక్కిన(Trinadh Rao Nakkina)తో చేయాల్సిన సినిమా కూడా ఒకటి. వరుస కమర్షియల్ సక్సెస్‌ల తర్వాత వెంకటేష్‌తో ఆయన సినిమా దాదాపు ఫిక్స్ అయిందనే ప్రచారం అప్పట్లో బలంగా వినిపించింది. ఈ ప్రాజెక్టుపై ఇద్దరి మధ్య విస్తృతంగా స్టోరీ డిస్కషన్స్ జరిగాయని త్రినాథరావు తాజాగా వెల్లడించారు. రైటర్ ప్రసన్న కుమార్(Prasanna Kumar Bezawada) రెడీ చేసిన స్క్రిప్ట్ వెంకటేష్‌కు బాగా నచ్చిందని, ముఖ్యంగా తన క్యారెక్టర్ పట్ల ఆయన అసాధారణ ఆసక్తి చూపించారని చెప్పారు. పాత్రకు సంబంధించిన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, మేనరిజమ్స్ వంటి అంశాలపై తరచూ చర్చలు జరిపేవారని, ఇతర సినిమా షూటింగ్లలో కూడా ఆ క్యారెక్టర్ ను మనసులో పెట్టుకుని ప్రాక్టీస్ చేసిన సందర్భాలున్నాయని ఆయన వివరించారు. అయితే కథలోని ఫ్లాష్‌బ్యాక్ విషయంలో ఇద్దరికీ పూర్తి సంతృప్తి కలగలేదని త్రినాథరావు స్పష్టం చేశారు. ఆ భాగాన్ని మరింత బలంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆశించిన స్థాయిలో మార్పు రాకపోవడంతో ప్రాజెక్టు ఆలస్యమైందని చెప్పారు. అనంతరం అదే తరహా కథాంశంతో మరో హీరో సినిమా తెరకెక్కడంతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే అవకాశం లేకుండా పోయిందని పేర్కొన్నారు. ప్రస్తుతం త్రినాథరావు నేను రెడీ(Nenu Ready) సినిమాపై దృష్టి సారించగా, వెంకటేష్ తన తదుపరి ప్రాజెక్టులతో బిజీగా కొనసాగుతున్నారు

మీనాక్షి చౌదరి సంక్రాంతి సెంటిమెంట్ ఇంకా కొనసాగుతోంది. వచ్చే యేడాది పొంగల్ సీజన్ లోనూ మీనాక్షి సినిమా రాబోతోంది. ఆమె చిరంజీవి - బాబీ మూవీలో ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. మీనాక్షి చౌదరికి, సంక్రాంతి సీజన్ కు ఓ అవినాభావ సంబంధం ఉంది. గత మూడేళ్ళుగా ఆమె నటించిన సినిమాలు సంక్రాంతి సీజన్ లో జనం ముందుకొచ్చి విజయాన్ని పొందుతున్నాయి. 2024లో 'గుంటూరు కారం'తో ఈ సెంటిమెంట్ మొదలైంది. అందులో హీరోయిన్ శ్రీలీలే అయినా... మీనాక్షి చౌదరి... మహేశ్ బాబు అత్త కూతురుగా నటించింది. ఆ తర్వాత సంవత్సరం 'సంక్రాంతికి వస్తున్నాం, ఈ యేడాది 'అనగనగా ఒక రాజు' సంక్రాంతి సీజన్ లోనే వచ్చాయి. ఇక వచ్చే సంక్రాంతి సీజన్ ను మీనాక్షి చౌదరి మిస్ అవుతుందేమో అని అంతా అనుకున్నారు. అయితే ఈ విషయంలో మాత్రం తగ్గేదే లే అంటోంది మీనాక్షి చౌదరి. మీనాక్షి చౌదరి 2021లో సుశాంత్ నటించిన 'ఇచ్చట వాహనములు నిలుపరాదు'తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు అదే అక్కినేని కాంపౌండ్‌లోని నాగ చైతన్య సరసన 'వృషకర్మ'లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఇదే యేడాది జనం ముందుకు రాబోతోంది. సో... మీనాక్షి సంక్రాంతి కోరిక ఎలా నెరవేరుతుందనే సందేహం రావచ్చు. దానికి మెగాస్టార్ మూవీతో సమాధానం చెప్పబోతోంది మీనాక్షి చౌదరి. మెగాస్టార్ చిరంజీవి, బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సెకండ్ మూవీ ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఇది 2027 సంక్రాంతికి వస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి ఓ స్పెషల్ రోల్ చేయబోతోందట. ఇందులో చిరంజీవి సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో మాఫియా డాన్ గా కనిపించబోతున్నారని సమాచారం. ఓ డిఫరెంట్ లుక్ ను చిరంజీవి కోసం ట్రై చేస్తున్నారని, అది సినిమాకు హైలైట్ అవుతుందని అంటున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను వెంకట్ నారాయణ భారీగా
టాలీవుడ్ లో ఎస్.ఎస్ రాజమౌళి తర్వాత అపజయం ఎరుగని దర్శకుడు అనిల్ రావిపూడి. వరుస విజయాలతో ‘హిట్ మెషీన్’ అనే పేరు తెచ్చుకున్నారు. ఒక్క సినిమా తీయడానికి ఏళ్లకు ఏళ్లు సమయం తీసుకుంటున్న ఈరోజుల్లో.. అనిల్ ఏడాదికో సినిమా చేస్తున్నారు. ఎంత పెద్ద హీరో అయినా సరే, తక్కువ డేట్స్ లో సినిమాని కంప్లీట్ చేయడం ఆయన స్పెషాలిటీ. సెట్స్ మీదకు వెళ్లడానికి ముందే అన్నీ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకునే రావిపూడి.. ఒక్కసారి సినిమా పట్టాలెక్కిన తర్వాత షూటింగ్ పరుగులు పెట్టిస్తారు. ఇప్పుడు VenkyAnil5 చిత్రాన్ని కూడా అదే స్పీడుతో పూర్తి చేస్తున్నారు.అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ , కళ్యాణ్ రామ్ హీరోలుగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి #VenkyAnil5, #NKRAR2 వంటి వర్కింగ్ టైటిల్స్ తో పిలుచుకుంటున్నారు. ఇందులో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. అయితే అప్పుడే సినిమా మొదటి భాగం షూటింగ్ కూడా కంప్లీట్ అయిందట. ఇప్పటికే ఫస్టాఫ్ ఎలా వచ్చిందో చూసుకున్నారట. ఇది సినీ వర్గాల్లో వినిపిస్తున్న మాట కాదు. సినిమాకి పాటలు రాస్తున్న లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ స్వయంగా చెప్పిన విషయం.అనంత శ్రీరామ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘VenkyAnil5’ మూవీ విశేషాలను పంచుకున్నారు. “సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా గోదావరి జిల్లాల్లోని కుటుంబ నేపథ్యంలో వస్తే, ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా సిటీలోని ఫ్యామిలీ నేపథ్యంలో వచ్చింది. ‘వెంకీ - కళ్యాణ్ రామ్’ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతోంది” అని అనంత శ్రీరామ్ చెప్పారు. 2027 సంక్రాంతికి బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకంగా ఉన్నామని తెలిపారు. ఎందుకంటే ఇప్పటికే ఫస్టాఫ్ చూసుకున్నామని వెల్లడించారు.‘Venky Anil5’ బావాబామదర్దుల కథ అని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో వెంకటేష్

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు (HBD Mahesh Babu) పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ‘నా ప్రియమైన సూపర్ స్టార్ మహేశ్‌కు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. సంవత్సరాలుగా మహేశ్ ఎదుగుదల చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. భారతీయ సినిమాకు అత్యంత ప్రేమాభిమానాలు పొందిన, ప్రముఖ నటుల్లో ఒకరిగా ఎదగడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. దేవుడు ఎల్లప్పుడూ ఆయనను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’ అని చిరంజీవి అన్నారు. 'సూపర్‌స్టార్ మహేశ్‌బాబు గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనకు మంచి ఆరోగ్యం, సంతోషం, మరెన్నో విజయాలు దక్కాలని కోరుకుంటున్నాను. మానవతా కార్యక్రమాల్లో ఆయన చేస్తున్న సేవలు, ముఖ్యంగా చిన్నారులకు సహాయం చేయడంలో చూపిస్తున్న నిబద్ధత ఎంతో స్ఫూర్తిదాయకం’. ‘నా చిన్నోడు మహేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ జీవితంలో ఎప్పుడూ ప్రేమ, నవ్వులు నిండిపోవాలి. ‘వారణాసి’లో రుద్రగా మహేశ్ రగ్గడ్, హ్యాండ్సమ్గా కనిపిస్తున్నాడు. వచ్చే ఏడాది ‘వారణాసి’తో ప్రపంచాన్ని ఏలబోతున్న మహేశ్‌ను చూడటానికి ఆతృతగా ఎదురుచూస్తున్నాను’

టాలీవుడ్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఎంటర్టైన్మెంట్ న్యూస్ అప్డేట్స్కు చిరునామా. ఇంకెందుకు ఆలస్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ వార్తలను తెలుసుకోండి! ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో రానున్న ‘గాడ్ ఆఫ్ వార్’ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. సుబ్రహ్మణ్య స్వామి ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కే ఈ పౌరాణిక చిత్రంలో ఎన్టీఆర్ యోధుడిగా కనిపించనున్నారు. 2027 మార్చి తర్వాతే ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభించి, ఆ తర్వాత షూటింగ్ మొదలుపెట్టనున్నారు. వెంకటేశ్, కళ్యాణ్ రామ్ కాంబోలో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తో్న్న మూవీ షూటింగ్ వేగంగా సాగుతోంది. ఈ నెల 20 నుంచి ‘గుంటూరు కారం’ సెట్లో ఓ మాస్ పాట చిత్రీకరించనున్నారు. ఇందులో వెంకీ, కళ్యాణ్ రామ్, కీర్తి సురేశ్, కృతి శెట్టి పాల్గొననున్నారు. నాని-సుజీత్ ‘బ్లడీ రోమియో’లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా ఎంపికైనట్లు తెలుస్తోంది. మేకర్స్ చెప్పిన కథ నచ్చడంతో భాగ్యశ్రీ ఓకే చెప్పారని.. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ‘శ్రీనివాస మంగాపురం’ ఫెయిల్యూర్‌ను డైరెక్టర్ అజయ్ భూపతి స్వీకరించారు. ఈ సినిమా ఫలితానికి పూర్తి బాధ్యత తనదేనని చెబుతూ త్వరలోనే అందరికీ నచ్చే మంచి చిత్రంతో తిరిగొస్తానని చెప్పారు. ఈ సినిమా తనకెంతో ప్రత్యేకమని.. ఎన్నో తీపి జ్ఞాపకాలను అందించిందన్నారు.. ఇంకా ఇలాంటి సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూడండి. అందుకే చెత్త సినిమాల్లో నటించా: సీనియర్ నటి ‘స్పిరిట్’ అద్భుతంగా వస్తోంది - సందీప్ రెడ్డి వంగా అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ టీజర్ వచ్చేది ఎప్పుడంటే