
TVK Vijay | సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ అలయెన్స్.. తమిళనాడులో విజయ్ టీవీకే కూటమికి పేరు ఖరారు
TVK Vijay | సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ అలయెన్స్.. తమిళనాడులో విజయ్ టీవీకే కూటమికి పేరు ఖరారు
© 2026 nimisham.in

TVK Vijay | సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ అలయెన్స్.. తమిళనాడులో విజయ్ టీవీకే కూటమికి పేరు ఖరారు

ఇంటర్నెట్ డెస్క్: స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే (DMK) పార్టీపై తమిళనాడు సీఎం విజయ్ (CM Vijay) విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపిన రైతులు, ఉపాధ్యాయుల పట్ల అమానవీయంగా ప్రవర్తించారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వం వారిపై పెట్టిన కేసులను పూర్తిగా ఎత్తివేస్తామని విజయ్ ఈ సందర్భంగా ప్రకటించారు. అసెంబ్లీలో సమావేశాల్లో భాగంగా సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘మే 2021- 2026 మధ్య సిప్కాట్ పారిశ్రామిక అభివృద్ధి, పరందూర్ విమానాశ్రయం వంటి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన రైతులు (Farmers), ఉపాధ్యాయులపై అనేక కేసులు నమోదయ్యాయి. అవి ఇప్పటికీ పెండింగ్‌లో ఉండటంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువల్లే ఆ కేసులను ఎత్తివేయాలని నిర్ణయించుకున్నాం. మా ప్రభుత్వం రైతులు, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లకు అండగా నిలుస్తుంది. ఇటువంటి చర్యల వల్ల సామాన్య ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుంది’’ అని విజయ్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్త సంక్షోభంలోనూ భారత్ పురోగమనం కాగా, ఇటీవల నీట్ పరీక్షకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన విద్యార్థులు, ఆందోళనకారులపైనా కేసులను ఉపసంహరించుకోవాలని సీపీఐ పార్టీ విజయ్‌ని కోరింది. అటు, నెయ్వేలి లిగ్నైట్ కార్పొరేషన్ (ఎన్ఎల్సి)కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారిపై నమోదు చేసిన కేసులను వెనక్కి తీసుకోవాలని పీఎంకే విజ్ఞప్తి చేయడం గమనార్హం. అయితే, దీనిపై టీవీకే ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలో రూన్ నదిలో చిక్కుకున్న ఇద్దరిని ఆర్మీ హెలికాప్టర్ రక్షించింది

కాక్రోచ్ ఉద్యమం తర్వాత దేశంలో మారిన పరిస్దితుల్లో ఇప్పటికిప్పుడు దేశంలో ఎన్నికలు జరిగితే ప్రధాని అభ్యర్ధిగా ఎవరికి మద్దతిస్తారంటూ ఇండియా టుడే-సీ ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో అడిగిన ప్రశ్నకు జనం మోడీ, రాహుల్ తర్వాత విజయ్ (Vijay) కు ఓటేశారు. దీంతో తమిళనాడు రాజకీయాల్లో ఇదో చర్చనీయాంశంగా మారింది. ఓవైపు తమిళనాడు ప్రభుత్వంలో భాగస్వాములుగా కొనసాగుతున్న కాంగ్రెస్-టీవీకే (Congress-TVK) మధ్య ఇది చిచ్చు రేపుతోంది. దీనిపై ఇరు పార్టీల నేతలు రోజుకో ప్రకటన చేస్తున్నారు. దీంతో గందరగోళం మరింత పెరుగుతోంది. అదే సమయంలో విజయ్, రాహుల్ మాత్రం దీనిపై మౌనం వహిస్తున్నారు.సీఎం విజయ్ తో వైఎస్సార్సీపీ ఎంపీ భేటీ..! తొలిసారి ఇలా..!ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎల్పీ నేత తారాహై కత్ బెర్ట్ .. రాహుల్ ప్రధాని అభ్యర్దిత్వానికి విజయ్ మద్దతిస్తానని చెప్పినట్లు బాంబు పేల్చారు. దీంతో ప్రధాని అభ్యర్థిత్వంపై టీవీకే-కాంగ్రెస్ మధ్య క్లారిటీ వచ్చినట్లు అంతా భావించారు. కానీ అంతలోనే టీవీకే ట్విస్ట్ ఇచ్చింది. టీవీకే ఎమ్మెల్యే కనిమొళి సంతోష్ విజయ్ ప్రధాని అవుతారని, ఏదో మ్యాజిక్ జరుగుతుందని తాజాగా వ్యాఖ్యానించారు. దీంతో విజయ్.. రాహుల్ ప్రధాని అభ్యర్దిత్వానికి మద్దతివ్వడం లేదని తేలిపోయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు కూడా స్పందించడం ప్రారంభించారు. ప్రధాని అభ్యర్ధి ఎవరో తేల్చేసిన విజయ్..! కాంగ్రెస్ క్లారిటీ..!విజయ్ ప్రధాన మంత్రి పదవి కోసం రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తారన్న కాంగ్రెస్ వాదనను టీవీకే తిప్పికొట్టింది. ప్రధాన మంత్రి పదవిని ఎవరు చేపట్టాలనే నిర్ణయం ఢిల్లీలో కాకుండా తమిళనాడులోనే జరుగుతుందని, ఆ పదవికి విజయ్ తమ పార్టీ అభ్యర్థి అని టీవీకే ఎమ్మెల్యే కనిమొళి సంతోష్ ( kanimozhi santosh) మరోసారి తేల్చిచెప్పారు. 2029లో విజయ్ ప్రధానమంత్రి అభ్యర్థి అవుతారని,, ఎవరు ప్రధాని కావాలనేది ఢిల్లీ నిర్ణయించదని, తమిళనాడు నిర్ణయిస్తుందని కనిమొళి స్పష్టం చేశారు. 2029లో ఒక అద్భుతం జరగబోతోందని, స్వయంగా రాహుల్ గాంధీయే విజయ్ను

ఏపీలో అరకు వైఎస్సార్సీపీ ఎంపీ గుమ్మ తనూజరాణి (Gumma Thanuja Rani) ఇవాళ తమిళనాడు వెళ్లి సీఎం విజయ్ (CM Vijay)తో భేటీ అయ్యారు. తనతో పాటు కుటుంబ సభ్యుల్ని కూడా తీసుకుని అక్కడికి వెళ్లారు. దీంతో విజయ్ కూడా వీరికి స్వాగతం పలికారు. ఆత్మీయంగా కలిసి మాట్లాడారు. అనంతరం ఫొటోలు కూడా దిగారు. ఏపీ రాజకీయాల్లో ఇదో చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక ఓ కీలక కారణం కూడా ఉంది. ఈ విషయాన్ని ఎంపీ తనూజరాణి స్వయంగా ట్వీట్ కూడా చేశారు.ప్రధాని అభ్యర్ధి ఎవరో తేల్చేసిన విజయ్..! కాంగ్రెస్ క్లారిటీ..!పార్లమెంటరీ పట్టణ, అభివృద్ధి అధ్యయన పర్యటనలో భాగంగా తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ను తమిళనాడు సచివాలయంలో కలిసినట్లు తనూజరాణి తెలిపారు. విజయ్ తో తనూజరాణి, ఆమె భర్త, వైసీపీ నేత చెట్టి వినయ్ కూడా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తనను కలిసేందుకు వచ్చిన అరకు ఎంపీ దంపతులకు సీఎం విజయ్.. ఆత్మీయంగా ఓ జ్ఞాపిక కూడా అందజేశారు. ఈ భేటీలో అరకు గిరిజన మన్య ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చెట్ట వికాస్ కూడా పాల్గొన్నారని ఎంపీ తనూజ తెలిపారు. Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు కట్టిందెవరు ? జగన్- లోకేష్ క్రెడిట్ వార్..!గతంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ను సీఎం కాకముందే విజయ్ చెన్నైలో జరిగిన ఓ వ్యక్తిగత కార్యక్రమంలో కలిశారు. అప్పట్లో జగన్ సోదరుడి పెళ్లి సందర్భంగా విజయ్ అక్కడికి రావడంతో వీరిద్దరి మధ్య సంభాషణ జరిగింది. ఆ తర్వాత మాత్రం వైసీపీ నేతలు ఎక్కడా విజయ్ తో కనిపించలేదు. కానీ ఇప్పుడు అరకు ఎంపీ తనూజరాణి ఏకంగా కుటుంబంతో కలిసి వెళ్లి విజయ్ ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అదీ పార్లమెంటరీ పట్టణాభివృద్ధి అధ్యయన పర్యటన కోసం అక్కడికి వెళ్లినట్లు ఎంపీ తనూజరాణి స్వయంగా ట్వీట్ చేయడంతో ఊహాగానాలకు కూడా తావులేకుండా పోయింది

సాక్షి, చెన్నై: జాతీయ స్థాయిలో జరిగే ఎన్నికల్లో రాహుల్ గాంధీ మాత్రమే ప్రధాని అభ్యర్థిగా ఉంటారని, తమిళనాడు సీఎం విజయ్‌కి అలాంటి ఆలోచన ఊహల్లో కూడా ఉండదని ఎండీఎంకే నేత వైగో వ్యాఖ్యానించారు. ఇకపై మంత్రులు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా సీఎం విజయ్ చూసుకోవాలని సూచించారు. సోమవారం తిరునెల్వేలిలో వైగో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమిళనాడులో ఒక భారీ ప్రభుత్వ మార్పు వచ్చిందని, టీవీకే ప్రభుత్వాన్ని సీఎం విజయ్ అవి నీతి రహితంగా నడిపిస్తున్నారని కొనియాడారు. గతంలో ప్రతి శాఖలో లంచాలు ఇస్తేనే పనులు జరిగే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు అది పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందన్నారు. ప్రజలు ఏ ప్రభు త్వ కార్యాలయానికి వెళ్లినా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. కమీషన్లు లేకుండా నేరుగా పాల న సాగుతోందన్నారు. 100 రోజులు పూర్తి చేసుకున్న ఈ ప్రభుత్వానికి తాను 100కి 80 మార్కులు ఇస్తున్నానని, అవినీతిని పూర్తిగా నిర్మూలించడం హిమాలయాన్ని కదిలించినంత కష్టమైన పనిగా పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చక్కగా పనిచేస్తున్నట్టు వైగో అభినందించారు. రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిత్వం: ‘’రాహుల్ గాంధీని ప్రధానిగా అంగీకరించకపోతే రాజీనామా చేస్తాం’’ అని మంత్రి రాజేష్‌కుమార్ చేసినట్లుగా వచ్చిన వ్యాఖ్యలపై స్పందిస్తూ సీఎం విజయ్ ఊహల్లో కూడా అలాంటి ఆలోచన ఉండదన్నారు. జాతీయ స్థాయిలో రాహుల్ గాం«దీనే ప్రధాని అభ్యరి్థగా ఉంటారని, మంత్రులు బాధ్యతారాహిత్యంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా సీఎం విజయ్ నిరోధించాలని సూచించారు. ఇక, కావేరీ నిర్వహణ బోర్డు తన బాధ్యతను విస్మరించిందని, కర్ణాటక ప్రభుత్వానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అండగా నిలుస్తూ తమిళనాడుకు ద్రోహం చేస్తోందని ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు అని, ఈ ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని వైగో డిమాండ్ చేశారు. కాగా, సీఎం విజయ్ భావి ప్రదాని అంటూ మంత్రులు వ్యాఖ్యల తూటాలను అందుకోవడంతో కాంగ్రెస్ నాయకులు గుర్రు మంటున్న విషయం

Telangana Politics : తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి... వరుసగా రెండుసార్లు సీఎంగా చేశారు. ఇక ఆయన తనయుడు కల్వకుంట్ల తారక రామారావు (KTR) సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్... ఆ పార్టీ సీఎం అభ్యర్థి కూడా ఆయనే అనేది పొలిటికల్ టాక్. అయితే కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత కూడా సీఎం రేసులో ఉన్నారా? అంటే అవుననే జవాబు వినిపిస్తోంది. బిఆర్ఎస్ పార్టీ ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేసిన ఆమె తండ్రి, సోదరుడికి పొలిటికల్ గా దూరమయ్యారు... ఇటీవల కొత్త పార్టీ పెట్టారు. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పేరు కలిసివచ్చేలా తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ పెట్టారు... దీంతో ఆమె ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ క్రమంలో కవిత పలువురు ముఖ్యమంత్రులకు ఆధ్యాత్మిక సలహాదారుగా ఉన్న ఓ జ్యోతిషుడిని కలిశారు... ఇలా మరోసారి వార్తల్లో నిలిచారు కవిత. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రముఖ జ్యోతిషులు రాధన్ పండిట్ వేత్రివేల్తో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని కవిత నివాసానికి రాధన్ పండిత్ విచ్చేశారు... ఆమెతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ మీటింగ్‌కు సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో పొలిటికల్ గా ప్రాధాన్యం సంతరించుకుంది. కవిత, రాధన్ పండిత్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి... ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. రాధన్ పండిట్ ప్రముఖ రాజకీయ జ్యోతిషులు. ఆయన చూసే జాతకాలు, చెప్పే జోస్యాలు కరెక్ట్‌గా జరుగుతాయని చాలామంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు నమ్ముతారు. దేశవ్యాప్తంగా చాలా మంది రాజకీయ నాయకులకు, సెలబ్రిటీలకు ఈయనే ఆధ్యాత్మిక, జ్యోతిష సలహాదారు. వేద జ్యోతిషం, న్యూమరాలజీలో ఆయనకు ఏకంగా నలభై ఏళ్లకు పైగా

సాక్షి, చెన్నై: తమిళనాడులోని శాసన సభ్యులకు ప్రభుత్వం తరఫున కొత్త వాహనాలను కేటాయించేందుకు కసరత్తు వేగవంతమైంది. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20 లక్షల నుంచి రూ.34 లక్షల విలువైన కార్లను అందించనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీనికి సంబంధించిన మోడల్ కార్లను సచివాలయ ప్రాంగణానికి తీసుకువచ్చి అధికారులు పరిశీలిస్తున్నారు ఎమ్మెల్యేలందరికీ ప్రభుత్వం తరఫున ఉచిత కార్లను అందజేస్తామని అసెంబ్లీలో సీఎం విజయ్ తెలిపిన విషయం తెలిసిందే. ఇంధనం, వాహన నిర్వహణ, వ్యక్తిగత సహాయకుడి నియామకం వంటి వాటి ఖర్చులకు నెలకు రూ.లక్ష అందజేయనున్నట్టు ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రకటన అమల్లో భాగంగా వివిధ ప్రముఖ ప్రైవేట్ వాహన తయారీ సంస్థలకు చెందిన 6 రకాల మోడల్ కార్లను (మహీంద్రా స్కార్పియో, ఎక్స్‌యూవీ తదితరాలు) అధికారులు పరిశీలన కోసం చెన్నైలోని సచివాలయ ప్రాంగణానికి తీసుకువచ్చారు. ఈ కార్లను టెస్ట్ డ్రైవ్ చేసి, అత్యంత అనుకూలమైన మోడల్‌ను ఎంపిక చేయనున్నారు. 234 కార్ల కొనుగోలుకు ప్రణాళిక రూపకల్పన చేసి ఉన్నా, డీఎంకే సభ్యులు 59 మంది తమకు కార్లు వద్దని ప్రకటించడం గమనార్హం. దీంతో ఎన్ని కార్లు కొనుగోలు చేస్తారో? అన్న చర్చ ఊపందుకుంది. ఒక్కో కారు ఖరీదు కనిష్టంగా రూ.20 లక్షల నుంచి గరిష్టంగా రూ.34 లక్షల వరకు ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం. బ్యూటీఫుల్ డ్రెస్‌లో మలయాళ బ్యూటీ అభిరామి అందాలు.. ఫోటోలు శారీలో హీరోయిన్ ఆదితి శంకర్ అందాలు.. ఫోటోలు వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. టాలీవుడ్ సినీతారల ప్రత్యేక పూజలు.. ఫోటోలు హైదరాబాద్: నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశ్వీరాదం(ఫొటోలు) ‘ఇరుముడి’మూవీ ప్రెస్‌మీట్...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా? 20 మంది MLAల లేఖ కొండా సురేఖ మెడకు ఉచ్చు బర్తరఫ్ చేయాల్సిందే విశాఖ పిల్లాడి ఘటనపై త్రీమెన్ కమిటీ నియమించిన ప్రభుత్వం తీరని విషాదం.. కొడుకు ఎంత చెప్పినా వినలేదు, చివరికి తల్లి కూడా ! రోహిత్, గిల్ రికార్డులు OUT పంత్ @ NO.1

తమిళనాడు రాజకీయాల్లో కొత్త రగడ మొదలైంది. అసెంబ్లీలోని 234 మంది ఎమ్మెల్యేలకు ఉచిత కార్లు ఇస్తామని టీవీకే ప్రభుత్వం ప్రకటించడం పెద్ద సంచలనంగా మారింది. ప్రతి ఎమ్మెల్యేకు కారుతో పాటు డ్రైవర్, పెట్రోల్, వాహన నిర్వహణ కోసం నెలకు ₹75,000 భత్యం కూడా ఇస్తామని ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈ ఆఫర్‌ను ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకించారు. తమ డీఎంకే పార్టీకి చెందిన 59 మంది ఎమ్మెల్యేలు ఈ ఉచిత కార్లను తీసుకోకూడదని నిర్ణయించుకున్నారని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలను ఉదయనిధి స్టాలిన్ సభలో వివరంగా వెల్లడించారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటించేందుకు రవాణా సౌకర్యాలు అవసరమని వీసీకే ఎమ్మెల్యే జ్యోతిమణి డిమాండ్ చేశారని ప్రభుత్వం పేర్కొంది. ప్రజా ప్రతినిధులు సమర్థవంతంగా పనిచేయాలంటే ఈ సదుపాయం తప్పనిసరి అని సర్కార్ సమర్థించుకుంది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎత్తిచూపుతూ ఉదయనిధి స్టాలిన్ ప్రభుత్వంపై విమర్శల బాణాలు విసిరారు. దింతో రాష్ట్రం ఎదుర్కొంటున్న అప్పుల భారాన్ని తగ్గించడానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఉదయనిధి తెలిపారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం ఒకవైపు ఆర్థిక సంక్షోభం, అప్పుల భారం గురించి మాట్లాడుతూ, మరోవైపు ఉచిత పథకాలను వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఇలాంటి ఆఫర్లు ఇవ్వడం ద్వంద్వ విధానమని విమర్శించారు. పన్ను చెల్లింపుదారుల సొమ్మును వృథా చేయకుండా, కార్లు లేని పేద ఎమ్మెల్యేలకు మాత్రమే ఈ సౌకర్యాన్ని కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఫలితంగా ఈ అంశంపై తమిళనాడు అసెంబ్లీలో తీవ్రమైన చర్చ నడిచింది. ఈ నేపథ్యంలో మిగతా రాజకీయ పార్టీలు ప్రభుత్వ ఆఫర్‌ను స్వాగతించగా, డీఎంకే మాత్రం తోసిపుచ్చడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం ఇచ్చే ఉచిత సదుపాయాలను నిరాకరించడం ద్వారా ప్రజల వైపు తాము నిలబడ్డామని డీఎంకే వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ముందుముందు ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది. ప్రజాధనాన్ని పదుపుగా వాడాలని డీఎంకే పట్టుబడుతుండటంతో టీవీకే

సుమారు ఏడాదిన్నర క్రితం జరిగిన ఓ సంఘటనను టీవీకే మంత్రి బుస్సీ ఆనంద్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. గుర్తు చేసుకున్నారు. విజయ్ సినిమాలకు దర్శకత్వం వహించిన ఓ ప్రముఖ దర్శకుడు, ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక నియోజకవర్గాన్ని కేటాయించమని విజయ్ను అడిగారట. ఈ విషయాన్ని ఆనంద్ సభలో వెల్లడించారు. ‘ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేస్తున్న జిల్లా కార్యదర్శిని కాదని, మీకు ఆ నియోజకవర్గాన్ని ఎలా ఇవ్వగలను?’ అని విజయ్ ఆ దర్శకుడితో అన్నట్లు బుస్సీ ఆనంద్ వివరించారు. పార్టీ కోసం కష్టపడేవారికే విజయ్ విలువిస్తారని చెప్పేందుకే ఈ ఉదాహరణ అని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో పదవుల కన్నా, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకే విజయ్ ఇంపార్టెన్స్ ఇస్తారని ఈ ఘటన చెబుతోందని బుస్సీ ఆనంద్ అన్నారు. ఆయన ఈ సీక్రెట్ బయటపెట్టగానే, ఆ డైరెక్టర్ ఎవరంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో వెతకడం మొదలుపెట్టారు. కానీ, అసెంబ్లీలోనే దానికి సమాధానం దొరికిందని, ఆ డైరెక్టర్ ఎవరో కూడా డీకోడ్ చేస్తున్నారు. బుస్సీ ఆనంద్ ఆ డైరెక్టర్ గురించి మాట్లాడుతుండగా, అసెంబ్లీలో ఉన్న తవెక ఎమ్మెల్యే, వ్యవసాయ మంత్రి వినోత్.. తన పక్కనే ఉన్న విగ్నేష్ వైపు సైగ చేశారట. ప్రస్తుతం మంత్రిగా ఉన్న విగ్నేష్, కినత్తుకడవు నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆ కినత్తుకడవుకు చెందిన దర్శకుడే లోకేష్ కనగరాజ్. కాబట్టి, విజయ్ను ఎమ్మెల్యే సీటు అడిగింది ఆయనేనని నెటిజన్లు అంటున్నారు. మాస్టర్, లియో వంటి రెండు బ్లాక్‌బస్టర్ హిట్లు ఇచ్చిన లోకేష్‌కే విజయ్ సీటు ఇవ్వలేదన్న వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. మరి ఇందులో నిజం ఎంతో తెలియాల్సి ఉంది

తమిళనాడు ముఖ్యమంత్రి సీ. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం విద్యార్థులు మరియు యువతపై విధించిన వివాదాస్పద నిషేధ ఆదేశాలను వెనక్కి తీసుకుంటూ సంచలన నిర్ణయం ప్రకటించింది. ఎడమపక్ష పార్టీలు మరియు కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించే నిరసనల్లో విద్యార్థులు పాల్గొనకూడదంటూ జారీ చేసిన ఆదేశాలను ఆగస్టు 19న రద్దు చేసింది. జెన్ జీ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురుకావడంతో విజయ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. విద్యార్థుల ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం చివరికి దిగిరాక తప్పలేదు. ఈ వివాదానికి సంబంధించిన నేపథ్యాన్ని పరిశీలిస్తే ఆగస్టు 14న స్కూల్ ఎడ్యుకేషన్ మరియు హయ్యర్ ఎడ్యుకేషన్ విభాగాలకు ప్రభుత్వం కొన్ని సూచనలు ఇచ్చింది. ప్రతిపక్షాలు మరియు విపక్ష విద్యార్థి సంఘాల నిరసనలకు యువత లొంగకుండా విద్యా శాఖలు, పోలీసులు, జిల్లా పరిపాలన యంత్రాంగం నిరోధించాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీనికి కొనసాగింపుగా ఆగస్టు 17న కాలేజియేట్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ప్రిన్సిపాల్స్‌కు లేఖ రాస్తూ ఆగస్టు 20లోగా నివేదిక సమర్పించాలని కోరింది. అత్యవసరంగా పంపిన ఈ కమ్యూనికేషన్ బయటకు రావడంతో తమిళనాడు వ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యాయి. దీంతో విద్యాసంస్థలు మరియు విద్యార్థి సంఘాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమై వాతావరణం వేడెక్కింది. ఇదిలా ఉండగా జూలై 28న జరిగిన లా అండ్ ఆర్డర్ సమావేశంలో చీఫ్ సెక్రటరీ ఇచ్చిన సూచనల మేరకే విద్యాశాఖ ఈ చర్యలు చేపట్టినట్లు కథనాలు వెలువడ్డాయి. ప్రత్యేకంగా కొన్ని రాజకీయ సంస్థలను లక్ష్యంగా చేసుకుని నిరోధించడం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనేనని విద్యార్థి లోకం భగ్గుమంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో జెన్ జీ మద్దతుతోనే టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చిందనే విషయాన్ని యువత గుర్తుచేస్తూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర నిరసనలు తెలిపింది. ఫలితంగా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరిగి రాజకీయంగా రచ్చ సాగింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 19న
MLA లవ్ ఫెయిల్ మాటలకి అవాక్కైన సీఎం విజయ్.. ఒక్కసారిగా..! తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో పెరియకుళం నియోజకవర్గ TVK ఎమ్మెల్యే శబరి అయ్యంగరన్ చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి. ఎమ్మెల్యేలకు కార్లు కేటాయించినందుకు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌కు ధన్యవాదాలు తెలిపిన ఆయన, తన గత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. కాలేజీ రోజుల్లో ప్రేమలో విఫలమైన తనకు ఉద్యోగం, కారు లేవని.. కానీ సీఎం విజయ్ తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడంతో పాటు కారు కూడా కేటాయించారని సరదాగా వ్యాఖ్యానించారు. ట్రైన్లో వచ్చి, ఆటోలో అసెంబ్లీకి వస్తున్నప్పుడు పోలీసులు ఎమ్మెల్యే అంటే నమ్మలేదని, ఇప్పుడు ఈ రెండు నిర్ణయాలతో ఎమ్మెల్యేలతో పాటు ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఈ వార్తకు సంబంధించిన

తమిళనాడులో జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మొత్తం 234 మంది ఎమ్మెల్యేలకు ప్రభుత్వ వాహనంతో పాటు భారీగా అలవెన్సులను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. నియోజకవర్గ పనుల కోసం ఎమ్మెల్యేలకు ఒక కారు, దాని నిర్వహణకు అవసరమైన భత్యం, అధికారిక పనుల కోసం ఒక సెక్రటరీని నియమించుకునేందుకు గ్రాంట్‌ను అందిస్తున్నట్టు అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా ప్రకటించారు.ఈ నిర్ణయాన్ని సమర్థించుకుంటూ సీఎం విజయ్ మాట్లాడారు. "ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో తరచూ పర్యటించాల్సి ఉంటుంది. వారికి ప్రభుత్వ వాహనం కేటాయించడం ద్వారా పారదర్శకమైన, అవినీతి రహిత పాలనను అందించడానికి వీలవుతుంది" అని ఆయన వివరించారు. ప్రస్తుత అసెంబ్లీలో చాలా మంది ఎమ్మెల్యేలు మొదటిసారి ఎన్నికైన వారని, వారిలో కొందరు సాధారణ ఆర్థిక నేపథ్యం నుంచి వచ్చారని, ప్రజా ప్రతినిధులుగా తమ విధులు సమర్థవంతంగా నిర్వర్తించేందుకు వారికి కారు అవసరమని విజయ్ పేర్కొన్నారు.ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం.. ప్రతి ఎమ్మెల్యేకి కారు డ్రైవర్, ఇంధనం, నిర్వహణ ఖర్చుల కోసం నెలకు రూ.75,000 అలవెన్సు అందనుంది. అదనంగా అధికారిక పనుల కోసం ఒక సెక్రటరీని నియమించుకునేందుకు నెలకు రూ.25,000 రాష్ట్ర గ్రాంట్‌ను కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. వీసీకే పార్టీ ఎమ్మెల్యే జ్యోతిమణి.. ఎమ్మెల్యేలు సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.సీఎం ప్రకటనపై అధికార పక్ష ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. టీవీకే మిత్రపక్షమైన కాంగ్రెస్ ఎమ్మెల్యే తారగై కత్బర్ట్ మాట్లాడుతూ, ఈ నిర్ణయం తమకు

తమిళనాడులో విజయ్ దళపతి టీవీకే పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. డీఎంకే, అన్నాడీఎంకే లాంటి కంచుకోటలను బద్దలు కొట్టి పార్టీ పెట్టిన తొలిసారే తమిళనాడు సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు విజయ్. తమిళనాట తనదైన శైలిలో పరిపాలన సాగిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే తాజాగా తమిళనాడు అసెంబ్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది.టీవీకే పార్టీ ఎమ్మెల్యే ఎంఆర్. పల్లవి తన పసిబిడ్డతో అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. నెలల వయసున్న చంటిబిడ్డను మెయిన్ హాల్ లో అక్కడే ఉన్న అటెండెంట్ కు ఇచ్చి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు ధ్రువీకరించాయి. అసెంబ్లీ హాల్ వద్ద రూమ్ లో కేర్ గివర్ వద్దే ఆ పసిబిడ్డ ఉండగా.. సమావేశాల అనంతరం ఎమ్మెల్యే ఎం. ఆర్ పల్లవి తన బిడ్డను తీసుకుని వెళ్లారు. అయితే ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ఆమెను విమర్శిస్తుండగా.. మరికొందరు ఆమెను ప్రశంసిస్తున్నారు. ఓ ప్రజాప్రతినిధిగా తన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారంటూ పలువురు ఆమెకు మద్దతును ప్రకటిస్తున్నారు. మరికొందరు మాత్రం ఎమ్మెల్యే తీరును విమర్శిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాలు సహా అన్ని ప్రదేశాలకు ఆమె తన బిడ్డను తీసుకెళ్తూ హడావిడి సృష్టిస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలపై ఎమ్మెల్యే ఎం. ఆర్ పల్లవి తాజాగా స్పందించారు. పసిబిడ్డ కావడంతో తాను ఇంట్లో వదిలి రాలేకపోతున్నానని అన్నారు. ఒక తల్లిగా నా బాధ్యతలను, ఎమ్మెల్యేగా నా వృత్తి ధర్మాన్ని ఏకకాలంలో నిర్వర్తించడంలో ఎలాంటి తప్పు లేదు. నేను కేవలం నా కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాను తప్ప.. ఎవరికీ ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశం నాకు లేదు. వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోకుండా సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం సరికాదు అని ఎమ్మెల్యే ఎం. ఆర్ పల్లవి స్పష్టం చేశారు. మరోవైపు తమిళనాడులో సీఎం విజయ్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు.

తమిళనాడు అసెంబ్లీ సమావేశాలకు ఓ మహిళా ఎమ్మెల్యే తన పసిబిడ్డతో హాజరవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆర్. పల్లవి, కొన్ని నెలల వయసున్న తన బిడ్డను ఎత్తుకుని సభా కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఈ ఉదంతంపై సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో పల్లవి తన బిడ్డను సహాయకురాలి పర్యవేక్షణలో ఉంచి, విరామ సమయాల్లో పసికందు బాగోగులు చూసుకుంటున్నారు. అయితే, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు పసిబిడ్డను తీసుకువచ్చి అసౌకర్యం కలిగిస్తున్నారంటూ కొందరు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు, ఒక తల్లిగా పసిబిడ్డను సంరక్షించుకుంటూనే, ప్రజాప్రతినిధిగా తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తున్నారంటూ పలువురు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.ఈ విమర్శలపై ఎమ్మెల్యే పల్లవి స్పందించారు. "బిడ్డకు కొన్ని నెలలే వయసే కావడంతో ఇంట్లో వదిలి రావడం సాధ్యం కాదు. ఒక తల్లిగా నా బాధ్యతలను, ఎమ్మెల్యేగా నా విధులను ఏకకాలంలో నిర్వర్తించడంలో ఎలాంటి తప్పు లేదు. నేను కేవలం నా కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాను తప్ప, ఎవరికీ ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశం నాకు లేదు. వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోకుండా సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేయడం సరికాదు" అని ఆమె స్పష్టం చేశారు

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడులో అసెంబ్లీ (Assembly) సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాలకు టీవీకే ఎమ్మెల్యే ఆర్.పల్లవి (TVK MLA Pallavi) తన పసిబిడ్డతో హాజరవుతున్నారు. చిన్నారిని సహాయకురాలి సంరక్షణలో వదిలి సభా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆమెకు మద్దతు తెలుపుతుండగా.. మరికొందరు మాత్రం ఎమ్మెల్యే తీరును విమర్శిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాలు సహా అన్ని ప్రదేశాలకు ఆమె తన బిడ్డను తీసుకువెళ్తూ హడావిడి సృష్టిస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలపై ఎమ్మెల్యే పల్లవి స్పందిస్తూ.. చిన్నారి ఇంకా నెలల బిడ్డే కావడంతో తనను ఇంట్లో వదిలి రాలేకపోతున్నానని అన్నారు. వృత్తి ధర్మాన్ని, తల్లి బాధ్యతను నిర్వర్తించడంలో తప్పేముందని ప్రశ్నించారు. తన పని తాను చేసుకుంటున్నానని.. ఎలాంటి హడావిడి సృష్టించాలనే ఆలోచన లేదని పేర్కొన్నారు. ఇతరుల బాధలు అర్థం చేసుకోకుండా ట్రోల్ చేయడం సరైన పద్ధతి కాదన్నారు. ఇదీ చదవండి: సీఎం విజయ్ రోజుకు 20 గంటలు పనిచేస్తారు: ఆధవ అర్జున గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదిలో చిక్కుకున్న ఇద్దరిని ఎస్డీఆర్ఎఫ్ బృందం ప్రాణాలకు తెగించి కాపాడింది

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Annamalai reacts on trishan and udhayanidhi stalin row: తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం త్రిష చుట్టునే తిరుగుతున్నాయి. ఇటీవల ఇండిపెండెన్స్ డే వేడుకల్లో కూడా త్రిష సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. అంతే కాకుండా సీఎం విజయ్ దళపతి తల్లిదండ్రుల పక్కనే కూర్చొవడం కూడా త్రిషకు వారి ఇంట్లో ఏస్థానం ఉందో అందరికి తెలిసినట్లైంది.ఈ నేపథ్యంలో ఇటీవల సీఎం విజయ్ ఎన్నికల్లో ఇచ్చిన హమీల్ని నెరవేరుస్తునే పాలనతో తనదైన మార్కు చూపిస్తున్నారు. తాజాగా.. బీజేపీ మాజీ నేత అన్నామలై చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. తమిళనాడు ప్రజలు కోరుకున్న రాజకీయ మార్పును ప్రతిపక్ష పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు. అసలు రాజకీయాల్లో లేని వారిపై ఈ విమర్శలు ఏంటని మండిపడ్డారు. డీఎంకే నేత ఉదయ నిధి స్టాలీన్, అన్నాడీఎంకే సీనియర్ నేత ఆర్.బీ. ఉదయకుమార్ ఇటీవల త్రిషపై చేసిన వ్యాఖ్యలపై సెటైరికల్ గా స్పందించారు. రాజకీయాల్లోకి మహిళలను లాగడం ఏమాత్రం సమంజసం కాదని ఆయన హితవు పలికారు. ఇటీవల కొంత మంది వారసత్వ రాజకీయాల నుంచి వచ్చిన వారు మహిళల్నిఅనవసరంగా వివాదాల్లోకి లాగుతున్నారని ఎద్దేవా చేశారు. వ్యక్తిగత దూషణలు, మహిళల్ని రాజకీయాల్లోకి లాగుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం చెన్నైలో నిర్వహించిన 'ఇండియా టుడే రౌండ్‌టేబుల్' సమావేశంలో అన్నామలై పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో రాజకీయ పరిస్థితులు మారాయన్న వాస్తవాన్ని కొంత మంది ఇప్పటికి గ్రహించలేకపోతున్నారన్నారు. Read more: Assam Govt: అస్సాం ప్రభుత్వం మరో సంచలనం.. రెండో పెళ్లి చేసుకుంటే

TVK Vijay Government Completes 100 Days in Tamil Nadu : తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సినీ నటుడు విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే, విజయ్‌కు అధికారం చేపట్టేందుకు పూర్తిస్థాయి మెజార్టీ రాకపోవటంతో కాంగ్రెస్‌సహా ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సీఎంగా విజయ్ బాధ్యతలు చేపట్టారు. కాగా.. విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 100 రోజులు పూర్తయింది. ఈ వంద రోజుల పాలనలో విజయ్ ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.. ఏ మేరకు హామీలను అమలు చేశారు.. 100రోజుల విజయ్ పాలన ఎలా ఉందనే విషయాలను పరిశీలిద్దాం.. విజయ్ ప్రభుత్వం తొలి 100 రోజుల పాలన తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. సినిమాలో 100వ రోజు విజయానికి సంకేతమైతే.. రాజకీయాల్లో మాత్రం అది పాలనకు తొలి పరీక్ష. అయితే, ఈ వంద రోజుల పాలనలో సీఎం విజయ్ అవినీతి నిర్మూలపై ప్రత్యేక దృష్టిసారించారు. అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణను టీవీకే సర్కార్ చేపట్టింది. మంచి పాలన అంటే కేవలం ప్రభుత్వ పథకాలను అమలు చేయడం మాత్రమే కాదు. ప్రభుత్వ నిర్ణయాల్లో పారదర్శకత, అధికార వ్యవస్థలో జవాబుదారీతనం, ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందడం కూడా కీలకమే. ముఖ్యమంత్రి విజయ్ అవినీతిని అంతం చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారనే చెప్పొచ్చు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు ఎవరైనా కేవలం రూ. 1,000 లంచం డిమాండ్ చేసినా, ఆడియో లేదా వీడియో సాక్ష్యాలతో ఫిర్యాదు చేసే పౌరులకు రూ. 1,00,000 నగదు బహుమతి ప్రకటిస్తూ విజయ్ సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు.. అవినీతి ఫిర్యాదుల స్వీకరణ కోసం 24 గంటలు పనిచేసేలా ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్, వాట్సాప్ వేదికలను అందుబాటులోకి తెచ్చారు. అవినీతికి పాల్పడితే మంత్రులైనా, అధికారులైనా ఎలాంటి

సాక్షి, చెన్నై: తమిళనాడు శాసనసభకు తొలిసారిగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ప్రభుత్వమే కారు, వ్యక్తిగత సహాయకుడిని కేటాయించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ప్రచారం వెలువడింది. వివరాలు.. రాష్ట్రంలో 234 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో టీవీకేకు చెందిన 107 మంది అత్యధిక సభ్యులుగా ఉన్నారు.వీరిలో సీఎం విజయ్‌తో పాటూ 90 శాతం మంది తొలి సారిగా అసెంబ్లీ మెట్లు ఎక్కిన వారే. ఇక, డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్, వీసీకే, సీపీఎం, సీపీఐ, ఐయూఎంఎల్ , ఎండీఎంకే ,డీఎండీకే తదితర పారీ్టలలో ఇద్దరు ముగ్గురు కొత్త వారు ఉన్నారు. ఈసారి అసెంబ్లీకి ఎన్నికైన వారిలో మెజారిటీ శాతం కొత్త వారు, తొలి సారిగా అడుగు పెట్టినవారే ఉన్నారు. వీరికి అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించిన ప్రత్యేక శిక్షణను కూడా ఇవ్వాల్సిన పరిస్థితిఏర్పడింది. టీవీకే నుంచి గెలిచిన వారిలో అత్యధిక శాతం అభిమానులే. వీరి ఆస్తి పస్తులు అంతంత మాత్రమే. అప్పోసొప్పో చేసి ఎన్నికల్లో గెలిచిన అసెంబ్లీలోకి వచ్చిన వారు ఎందరో ఉన్నారు. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వీసీకే చెందిన కాట్టుమన్నార్కోయిల్ ఎమ్మెల్యే జ్యోతిమణి మాట్లాడుతూ.. సభలో చెప్పులు కూడా వేసుకోలేని నిరుపేద ఎమ్మెల్యేలు ఉన్నారని వివరించారు.. నియోజకవర్గంలో పర్యటించి ప్రజలకు సేవ చేయడానికి తమకు సొంత వాహనాలు లేవు అని, అద్దె వాహనాల్లో తిరగాల్సి వస్తున్నట్టు వివరించారు. అలాగే సహాయకుడిని పెట్టుకుని జీతం ఇచ్చే ఆర్థిక స్థోమత కూడా లేదన్నారు. అవినీతి లేని పాలన అందించాలంటే ఎమ్మెల్యేల కనీస అవసరాలను ప్రభుత్వం తీర్చాలని కోరారు. ఈ విజ్ఞప్తిపై శాసనసభ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ స్పందిస్తూ.. ఎమ్మెల్యేలు , మాజీ ఎమ్మెల్యేల నుండి వచ్చిన విజ్ఞప్తులను ముఖ్యమంత్రి విజయ్ దృష్టికి తీసుకెళ్తానని, ఆయన సానుకూల నిర్ణయం తీసుకుంటారని హామీ ఇచ్చారు. సీఎం వద్దకు ప్రతిపాదన.. ఈ విషయంగా స్పీకర్ వినతిపత్రాన్ని సీఎం విజయ్‌కు పంపించారు. ఎమ్మెల్యేలు ఎలాంటి అవినీతికి తావులేకుండా పారదర్శకంగా ప్రజలకు సేవ చేసేలా చూడాలనే ఉద్దేశంతో

తమిళనాడు రాజకీయాల్లో మాటల యుద్ధం వ్యక్తిగత విమర్శల స్థాయికి చేరుతోంది. ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీలో చేసిన 'నాన్న ఎక్కడ?’ వ్యాఖ్యకు స్పందిస్తూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో మాటల యుద్ధం వ్యక్తిగత విమర్శల స్థాయికి చేరుతోంది. ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీలో చేసిన 'నాన్న ఎక్కడ?’ వ్యాఖ్యకు స్పందిస్తూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. విజయ్ తల్లిని ఉద్దేశించి నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ తీవ్రంగా మండిపడింది (Vijay Nainar Nagendran). ఇటీవల అసెంబ్లీలో విజయ్.. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ను ఉద్దేశించి 'నాన్న ఎక్కడ?' అని ప్రశ్నించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన ఎంకే స్టాలిన్‌ను ఉద్దేశిస్తూ విజయ్ వ్యంగ్యంగా మాట్లాడుతూ ఇలా అడిగారు. దీనికి కౌంటర్ ఇస్తూ నైనార్ నాగేంద్రన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'శాసనసభలో కొందరు తండ్రి కోసం వెతుకుతున్నారు. కానీ ఇంట్లో తల్లిని అడిగితేనే తండ్రి ఎవరో తెలుస్తుంది. శాసనసభలో అతని కోసం వెతికితే ఎలా..' అని వ్యాఖ్యానించారు (Vijay mother controversy). బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి వ్యాఖ్యలను తమిళగ వెట్రి కళగం తీవ్రంగా ఖండించింది (Vijay father remark). రాజకీయ నాయకుడి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యక్తిగత, అవమానకర వ్యాఖ్యలు చేయడం సరికాదని పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్‌మోహన్ అన్నారు. నాగేంద్రన్ వ్యాఖ్యలను తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై కూడా ఖండించారు. రాజకీయ ప్రత్యర్థుల విధానాలను విమర్శించవచ్చని, కానీ వారి కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడం సరికాదని ఆయన పేర్కొన్నారు. బెంగళూరులో బెంగాల్ యువకుడి అరెస్ట్.. ఉగ్రసంస్థల లింకులతో దర్యాప్తు.. అరుణాచల్‌ప్రదేశ్‌లో వరద బీభత్సం.. నలుగురి మృతి, ఆర్మీ సిబ్బంది గల్లంతు

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ బుధవారం రాష్ట్ర శాసనసభలో నియోజకవర్గాల పునర్విభజన అనగా డీలిమిటేషన్ ప్రక్రియకు వ్యతిరేకంగా ఒక ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దేశంలో లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 543 వద్దే శాశ్వతంగా నిలిపి ఉంచాలని ఈ తీర్మానం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని బలంగా డిమాండ్ చేశారు. రాష్ట్రాల మధ్య సీట్ల కేటాయింపు నిష్పత్తిని ఎలాంటి పరిస్థితుల్లోనూ మార్చకూడదని స్పష్టం చేశారు. అలాగే 2029 లోక్‌సభ ఎన్నికల్లోనే 33 శాతం మహిళా రిజర్వేషన్‌ను ఎలాంటి నియోజకవర్గాల పునర్విభజన షరతు లేకుండా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రతిపాదిత తీర్మానం తమిళనాడు శాసనసభలో మెజారిటీ సభ్యుల మద్దతుతో ఆమోదం పొందింది. ఇదిలా ఉండగా ఎఐఏడీఎంకే, పీఎంకే, బీజేపీ వంటి కొన్ని ప్రతిపక్ష రాజకీయ పక్షాలు ఈ తీర్మానానికి వ్యతిరేకంగా నిలిచాయి. సీఎం విజయ్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానంలో ప్రధానంగా నాలుగు రకాల కీలక అంశాలను పొందుపరిచారు. దేశంలోని లోక్‌సభ సీట్ల సంఖ్యను 543 వద్దే స్తంభింపజేయడంతో పాటు తమిళనాడుకు చెందే 39 లోక్‌సభ స్థానాల ప్రాతినిధ్యాన్ని కాపాడాలని పేర్కొన్నారు. పార్లమెంటులోని లోక్‌సభ మరియు రాజ్యసభ మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న 2.2:1 నిష్పత్తిని యథాతథంగా కొనసాగించాలని కోరారు. సభలో సీఎం విజయ్ మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ అనేది ఎవరికీ ఇచ్చే ఉపకారం కాదని, అది వారి ప్రజాస్వామ్య హక్కు మరియు సామాజిక న్యాయమని స్పష్టం చేశారు. తమిళనాడులో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఓటింగ్ లో పాల్గొంటున్నారని గుర్తుచేశారు. జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలను శిక్షించే విధంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టే డీలిమిటేషన్ ప్రక్రియ ఉండకూడదని తీవ్ర హెచ్చరిక చేశారు. ఈ నేపథ్యంలో జనాభా ప్రాతినిధ్యం ఆధారంగా సీట్లు తగ్గిస్తే దక్షిణాది తీవ్రంగా నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో లోక్‌సభ సీట్ల పంపిణీ 1971 జనాభా లెక్కల ఆధారంగా గత 50 ఏళ్లకు

హీరో ధనుష్ రాజకీయ కార్యకలాపాలపై టీవీకే ప్రభుత్వం దృష్టి సారించినట్టు సమాచారం. హీరో ధనుష్ (Dhanush) చర్యలపై విజయ్ టీవీకే (TVK)ప్రభుత్వం దృష్టిసారించింది. రాష్ట్ర నిఘా వర్గాలు అందించిన నివేదికతో అప్రమత్తమైన సర్కారు ధనుష్, ఆయన అభిమాన సంఘాలు చేపట్టే సంక్షేమ, సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై దృష్టి సారించింది. ప్రభుత్వానికి నిఘా వర్గాలు అందించిన నివేదిక మేరకు.. హీరో ధనుష్ యువతను లక్ష్యంగా చేసుకుని, ఆయన రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించారని, ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదుకు టికే కోవై జిల్లాలోని పది నిజయోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు ప్రారంబించారు. నియోజకవర్గాల వారీగా చేపట్టే ఈ సభ్యత్వ నమోదును రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో వీలైనంత త్వరగా పూర్తి చేయాలని తన అభిమానులను ఆదేశించినట్టు నిఘా వర్గాల నివేదిక ఇచ్చినట్టు సమాచారం. ముఖ్యంగా ధనుష్ చేపట్టే కార్యక్రమాలు భవిష్యత్‌లో టీవీకే సర్కారుకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉందని, అందువల్ల ధనుష్ కార్యకలాపాలను నిశితంగా పర్యవేక్షిం చాలని సీఎం విజయ్ ఆదేశించినట్టు వినికిడి. ఇందుకోసం నిఘా విభాగంలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారని, ఈ బృందం ధనుష్ సహా ఇతర నటుల అభిమాన సంఘాల కార్యకలాపాలను పర్యవేక్షించి నివేదిక ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అలాగే, సీఎం విజయ్ వ్యక్తిగత కార్యదర్శి జగదీష్ పర్యవేక్షణలో ధనుష్‌కు చెందిన సోషల్ మీడియా పోస్టులపై కూడా దృష్టి సారించినట్టు సమాచారం

తమిళ స్టార్ హీరో ధనుష్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని ప్రముఖ జ్యోతిష్యుడు రతన్ పండిట్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో చర్చకు దారితీశాయి. భవిష్యత్‌లో హీరో ధనుష్ (Dhanush) రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించే యోగం ఉందని, అదే జరిగితే రాష్ట్రంలో సరికొత్త పోటీ నెలకొంటుందని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (Vijay)కు జ్యోతిష్యుడిగా వ్యవహరిస్తున్న రతన్ పండిట్ (Rathan Pandit) వ్యాఖ్యానించారు. తమిళనాట ప్రముఖ జ్యోతిష్యుడిగా గుర్తింపు పొందిన రతన్ పండిట్.. రాష్ట్రంలోని అనేక మంది సినీ రాజకీయ ప్రముఖులకు జ్యోతిష్యం చెబుతూ ప్రఖ్యాతిగాంచారు. ముఖ్యంగా ముఖ్య మంత్రి విజయ్ ఆస్థాన జ్యోతిష్యుడిగా ఉన్నారు. గత మే నెలలో రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల సమయంలో కూడా రతన్ పండిట్ చెప్పిన జ్యోతిష్యం ఫలించడంతో ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభానికి ముందే పూల బొకేతో విజయ్‌ని కలిసి మరి విజయోత్సవ శుభాకాంక్షలు అని చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో టీవీకే అత్యధిక స్థానాలు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. భవిష్యత్‌లో నటుడు ధనుష్ రాజకీయాల్లోకి వచ్చే యోగం ఉంది. నిజంగానే ఆయన రాజకీయ ప్రవేశం చేస్తే రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పోటీ ఏర్పడుతుంది. ఇప్పటివరకు రాష్ట్ర రాజకీయాల్లో సీఎం విజయ్ (Tamil Nadu CM Vijay)కి చెప్పుకోదగిన పోటీ లేదు. కానీ, ధనుష్ రాజకీయరంగ ప్రవేశం చేసిన తర్వాత రాష్ట్ర రాజకీయాలు మరో స్థాయికి వెళతాయి' అని వ్యాఖ్యానించారు. అయితే.. రతన్ పండిట్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. అయితే ధనుష్ మాత్రం ఇప్పటివరకు రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఆయన నటుడిగా అర డజన్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే అభిమాన సంఘాల పేరుతో ప్రజల్లోకి వెళుతున్నారు

డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతుండగానే.. తాజాగా ఏఐఏడీఎంకే సీనియర్ నేత ఆర్బీ ఉదయకుమార్ కూడా త్రిషను ప్రస్తావిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌పై విమర్శలు చేశారు. ఇంటర్నెట్ డెస్క్: నటి త్రిష పేరును ప్రస్తావిస్తూ తమిళ రాజకీయ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు మరోసారి వివాదానికి దారితీశాయి. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతుండగానే.. తాజాగా ఏఐఏడీఎంకే సీనియర్ నేత ఆర్బీ ఉదయకుమార్ కూడా త్రిషను ప్రస్తావిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌పై విమర్శలు చేశారు. తూత్తుకుడిలో జరిగిన జయలలిత పేరవై సమావేశంలో ఆర్బీ ఉదయకుమార్ మాట్లాడారు (Trisha Vijay controversy). 'విజయ్‌కు ఇష్టమైన త్రిషను తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఎప్పుడు నియమిస్తారోనని తమిళనాడు ప్రజలు ఎదురుచూస్తున్నారు' అని ఉదయకుమార్ అన్నట్టు వార్తలు వచ్చాయి. ప్రధానంగా కావేరీ నీటి వివాదాన్ని ప్రస్తావిస్తూ తమిళనాడు ప్రభుత్వంపై ఉదయకుమార్ విమర్శలు చేశారు. కర్ణాటక నుంచి తమిళనాడుకు రావాల్సిన కావేరీ నీటిని సాధించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. అదే సమయంలో త్రిష గురించి కూడా మాట్లాడారు (RB Udhayakumar Trisha remarks). ఉదయకుమార్ వ్యాఖ్యలపై త్రిష అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు (Vijay Tamil Nadu politics). మదురైలో త్రిష అభిమానుల సంఘం ఆధ్వర్యంలో పోస్టర్లు ఏర్పాటు చేసి ఆయన వ్యాఖ్యలను ఖండించారు. ఒక నటిని రాజకీయ విమర్శలకు ఉపయోగించడం సరికాదంటూ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దశాబ్దాల నష్టానికి పరిహారం చెల్లించాలి.. ఇరాన్ ముందు ట్రంప్ కొత్త డిమాండ్.. అమిత్ షా సభకు రావాలి.. విపక్షాల నినాదాలు
TN Assembly Anti NEET Resolution : దేశవ్యాప్తంగా వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 'నీట్' ప్రవేశ పరీక్షపై తమిళనాడు ప్రభుత్వం మరోసారి తీవ్ర నిరసన స్వరం వినిపించింది. జాతీయ స్థాయి నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం రాష్ట్ర శాసనసభలో సంచలన తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె. అరుణ్‌రాజ్ మంగళవారం ఈ ప్రతిపాదిత తీర్మానాన్ని సభ ముందుకు తీసుకువచ్చారు. అయితే ఈ తీర్మానానికి ప్రధాన ప్రతిపక్షాలైన డీఎంకే, ఏఐఏడీఎంకేలతో పాటు టీవీకే మిత్రపక్షాలు సైతం పరిపూర్ణ మద్దతు ప్రకటించాయి. అయితే ఈ అంశంపై నిరసన తెలుపుతూ భారతీయ జనతా పార్టీ సభ్యులు మాత్రం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం గమనార్హం.కోచింగ్ సెంటర్ల వ్యాపారీకరణ.. పేద విద్యార్థులకు అన్యాయం!అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి కె. అరుణ్‌రాజ్ ప్రసంగిస్తూ నీట్ విధానం వల్ల కలుగుతున్న నష్టాలను ఎండగట్టారు. నీట్ పరీక్ష ప్రవేశ పెట్టిన నాటి నుంచి విద్యార్థుల దృష్టంతా సాధారణ చదువుల నుంచి ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల వైపు మళ్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విపరీతంగా ఫీజులు వసూలు చేసే కోచింగ్ సంస్థలు గల్లీ గల్లీకీ పెరిగిపోయాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితి వల్ల గ్రామీణ ప్రాంతాలకు చెందిన, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులు వైద్య విద్య అవకాశాలను తీవ్రంగా కోల్పోతున్నారని విచారం వ్యక్తం చేశారు. నీట్ విధానం అనేది సామాజిక న్యాయం, సమానత్వం, రాష్ట్రాల రాజ్యాంగబద్ధ హక్కులకు సంపూర్ణంగా వ్యతిరేకమని.. ఈ విషయంలో తమిళనాడులో ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే వైఖరితో పోరాడుతోందని మంత్రి గుర్తుచేశారు.ప్లస్ టు మార్కుల ఆధారంగానే మెడికల్ సీట్లు!రాష్ట్రంలోని విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు 12వ తరగతి మార్కుల ఆధారంగానే వైద్య కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలని విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. గతంలో పాలించిన డీఎంకే

ఇంటర్నెట్‌డెస్క్: వైద్య కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ ప్రవేశ పరీక్షను తొలినుంచీ తమిళనాడు వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో నీట్‌కు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆరోగ్యశాఖ మంత్రి కె.అరుణ్‌రాజ్ మంగళవారం ఈ తీర్మానాన్ని తీసుకువచ్చారు. దీనికి ప్రధాన విపక్షాలైన డీఎంకే, ఏఐఏడీఎంకే మద్దతు తెలిపాయి. టీవీకేకు మిత్రపక్షాల నుంచి ఎలాగూ మద్దతు ఉంది. ఒక్క భాజపా మాత్రం సభ నుంచి వాకౌట్ చేసింది. తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా ఆరోగ్య మంత్రి అరుణ్‌రాజ్ మాట్లాడారు. ‘‘కేంద్ర ప్రభుత్వం నీట్ (NEET)ను రద్దు చేయాలి. ఈ ప్రవేశ పరీక్షవల్ల విద్యార్థుల దృష్టి కోచింగ్ సెంటర్ల వైపు మళ్లింది. ఫీజులు భారీగా వసూలు చేసే కోచింగ్ సెంటర్లు పెరిగిపోయాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని, సామాజికంగా-ఆర్థికంగా వెనకబడిన విద్యార్థుల అవకాశాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి’’ అని ఆందోళన వ్యక్తంచేశారు. సామాజిక న్యాయం, సమానత్వం, రాష్ట్రాల హక్కులకు ఈ పరీక్ష వ్యతిరేకం అనే విషయాన్ని తమిళనాడులోని ప్రతి ప్రభుత్వం వాదిస్తోన్న విషయాన్ని గుర్తుచేశారు. 12వ తరగతి మార్కుల ఆధారంగా వైద్య కోర్సుల్లో ప్రవేశం ఉండాలని విజయ్ (Vijay) ప్రభుత్వం ప్రతిపాదించింది. గతంలో డీఎంకే ఇదే ప్రతిపాదన చేసిన సంగతి తెలిసిందే. నీట్ పేపర్ లీక్ అంశాన్ని కూడా తమిళనాడు ప్రభుత్వం తీర్మానంలో ప్రస్తావించింది (NEET Row). విద్యార్థుల ఆత్మహత్యలకు ఈ పరీక్ష ఒత్తిడి కారణమని పేర్కొంది. నీట్ రద్దుతోనే వాటికి ముగింపు వస్తుందని అభిప్రాయపడింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర