
Team India: లాంగ్బ్రేక్తో ఇంటికొచ్చాడు.. కట్‌చేస్తే.. రీఎంట్రీతో మనోడి కెరీర్క్లోజ్..?
Team India: లాంగ్ బ్రేక్‌తో ఇంటికొచ్చాడు.. కట్‌చేస్తే.. రీఎంట్రీతో మనోడి కెరీర్ క్లోజ్..?
© 2026 nimisham.in

Team India: లాంగ్ బ్రేక్‌తో ఇంటికొచ్చాడు.. కట్‌చేస్తే.. రీఎంట్రీతో మనోడి కెరీర్ క్లోజ్..?

Team India: 16 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన ఛోటా ప్యాకెట్.. అదేంటంటే?

BCCI Meeting: భారత క్రికెట్ బోర్డు ముంబైలోని ప్రధాన కార్యాలయంలో గురువారం అత్యంత కీలకమైన రివ్యూ మీటింగ్ నిర్వహిస్తోంది. భారత జట్టు ఇటీవలి ప్రదర్శనలతో పాటు రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడాలా వద్దా అనే అంశంపై తీవ్ర చర్చ జరగనుంది. కోచ్ గంభీర్, సెలెక్టర్ అగార్కర్ హాజరవుతున్న ఈ భేటీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీసీసీఐ సంయుక్త కార్యదర్శి దేవజిత్ సైకియా నేతృత్వంలో ఈ ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. ఈ ముఖ్యమైన భేటీకి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌లతో పాటు బోర్డు అగ్రశ్రేణి అధికారులు హాజరుకానున్నారు. అందరూ బుధవారం రాత్రికే ముంబై చేరుకున్నారు. ఆయా పర్యటనల్లో జట్టు ప్రదర్శించిన వైఫల్యాలు, భవిష్యత్తు ప్రణాళికలపై బోర్డు పెద్దలు పూర్తి స్థాయి విశ్లేషణ చేయనున్నారు. రోహిత్ శర్మ భవిష్యత్తుపై తేలనున్న నిర్ణయం ఈ సమావేశంలో అందరి దృష్టి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వన్డే కెరీర్‌పైనే ఉంది. 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్ శర్మ పేరు లేదంటూ ప్రచారంలో ఉన్న కథనాలపై బోర్డు ఒక స్పష్టతకు రానుంది. రోహిత్‌ను జట్టులో కొనసాగించాలా లేక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొత్త ఆటగాడిని తీర్చిదిద్దాలా అనే కోణంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. వయసు, ఫిట్నెస్ కారణాల దృష్ట్యా రోహిత్ భవిష్యత్తు పై ఒక కీలక రోడ్‌మ్యాప్ రూపుదిద్దుకునే అవకాశం కనిపిస్తోంది. ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనల్లో టీ20 సిరీస్ ఓటములతో పాటు ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ పరాజయంపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తిగా ఉంది. వాస్తవానికి ఈ సమావేశం ముందే జరగాల్సి ఉన్నప్పటికీ జింబాబ్వే, శ్రీలంక పర్యటనల కారణంగా వాయిదా పడింది. ఆ రెండు సిరీస్‌లు గెలిచినప్పటికీ విదేశీ గడ్డపై ఎదురైన ప్రతికూల ఫలితాలకు గల కారణాలను గంభీర్, అగార్కర్ వివరించాల్సి ఉంటుంది. బౌలింగ్, బ్యాటింగ్ లోపాలను ఎత్తిచూపుతూ బోర్డు గట్టి నిలదీతలకు

ICC Test Rankings: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్థానాలు దిగజారడం అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. అదే సమయంలో ఇంగ్లాండ్ బౌలర్ ఆలీ రాబిన్సన్ అనూహ్యంగా టాప్-5లోకి దూసుకొచ్చాడు. టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వరుసగా రెండో వారం కూడా ఒక స్థానాన్ని కోల్పోయాడు. గత మూడు టెస్టు మ్యాచ్‌లకు దూరంగా ఉండటంతో ఐసీసీ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో బుమ్రా మూడో స్థానానికి పడిపోయాడు. న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ.. బుమ్రాను అధిగమించి రెండో స్థానానికి చేరుకున్నాడు. మైదానంలోకి దిగకపోవడం వల్ల పాయింట్లు కోల్పోయి బుమ్రా ఈ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ర్యాంకింగ్స్‌లో ప్రతికూల ఫలితాన్ని ఎదుర్కొన్నాడు. సిరీస్‌లోని మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 74 పరుగులు మాత్రమే సాధించడంతో గిల్ రెండు స్థానాలు దిగజారి తొమ్మిదో ర్యాంక్‌కు పడిపోయాడు. ప్రస్తుతం టెస్టు బ్యాటింగ్ విభాగంలో ఏడో స్థానంలో ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మాత్రమే భారత్ నుంచి అత్యుత్తమ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ పేసర్ ఆలీ రాబిన్సన్ సంచలన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 8 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ అద్భుత ప్రదర్శనతో సుదీర్ఘ దూకుడు ప్రదర్శిస్తూ ఐసీసీ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నేరుగా ఐదో స్థానానికి చేరుకున్నాడు. భారత్‌పై టెస్టు విజయంలో కీలక పాత్ర పోషించిన శ్రీలంక ఆటగాడు సోనాల్ దినుషా బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఏకంగా 29 స్థానాలు ఎగబాకి 25వ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. భారత్‌పై 140 సగటుతో 420 పరుగులు చేసి అతడు ఈ అరుదైన ఘనత సాధించాడు. భారత్ తరఫున

Sachin vs Virat: భారత క్రికెట్లో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల మధ్య పోలిక ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. అయితే వీరిద్దరి వన్డే కెరీర్ తొలి ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెలుగులోకి వస్తాయి. ఒకరు సెంచరీ కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తే, మరొకరు సెంచరీల వర్షం కురిపించారు. క్రికెట్ దేవుడిగా కొలిచే సచిన్ టెండూల్కర్ 1989లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డే అరంగేట్రం చేశారు. ఆశ్చర్యకరంగా తన మొదటి మ్యాచ్‌లో సచిన్ డకౌట్‌గా వెనుతిరిగారు. ఆ తర్వాత నుంచి ఏకంగా ఐదేళ్ల పాటు అంటే 1989, 1990, 1991, 1992, 1993 సంవత్సరాల్లో ఒక్క వన్డే సెంచరీ కూడా నమోదు చేయలేకపోయారు. మూడంకెల స్కోరు సాధించడానికి సచిన్ చాలా కాలం పాటు వేచి చూడాల్సి వచ్చింది. సచిన్ తన వన్డే కెరీర్‌లోని 76వ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాపై తొలి సెంచరీ సాధించి సెంచరీల ఖాతాను ఓపెన్ చేశాడు. ఆ తర్వాత నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోకుండా సచిన్ రికార్డుల వేట మొదలుపెట్టారు. తన కెరీర్ పూర్తయ్యే సమయానికి వన్డేల్లో ఏకంగా 49 సెంచరీలు బాది ప్రపంచ రికార్డు నెలకొల్పారు. అంతర్జాతీయ క్రికెట్ మొత్తంలో 100 సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. సచిన్ వన్డే కెరీర్ తొలి ఐదేళ్లలో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోతే, విరాట్ కోహ్లీ మాత్రం అదే సమయంలో విధ్వంసం సృష్టించాడు. 2008లో అరంగేట్రం చేసిన కోహ్లీ తన తొలి ఐదేళ్లలోనే ఏకంగా 13 వన్డే సెంచరీలు బాదేశాడు. తొలి ఏడాది 2008లో సెంచరీ చేయకపోయినప్పటికీ 2009లో ఒకటి, 2010లో మూడు, 2011లో నాలుగు, 2012 నాటికి ఐదు సెంచరీలు సాధించి రన్ మెషిన్‌గా పేరు తెచ్చుకున్నాడు. సచిన్ నెలకొల్పిన 49 వన్డే సెంచరీల రికార్డు సుమారు 11 సంవత్సరాల పాటు చెక్కుచెదరకుండా ఉంది. 2023 నవంబర్‌లో న్యూజిలాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ తన

ICC Rankings 2026: ప్రపంచ క్రికెట్లో భారత జట్టు తన అజేయ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్ ప్రకారం వన్డే, టీ20 ఫార్మాట్లలో టీమిండియా నంబర్ వన్ స్థానంలో నిలిచింది. టెస్టుల్లో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ, మరో విజయం సాధిస్తే మూడో స్థానానికి చేరే అవకాశం స్పష్టంగా ఉంది. పాకిస్థాన్ జట్టు విషయానికొస్తే వన్డేల్లో మాత్రమే ఐదో స్థానంలో నిలిచి టాప్-5లో చోటు దక్కించుకుంది. టెస్టుల్లో ఎనిమిదో స్థానానికి పడిపోగా, టీ20ల్లో ఆరో స్థానానికి పరిమితమైంది. వ్యక్తిగత బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. వన్డేల్లో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మొదటి స్థానంలో నిలవగా, విరాట్ కోహ్లీ మూడో స్థానంలో, రోహిత్ శర్మ నాలుగో స్థానంలో ఉన్నారు. టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో యువ కిరటం ఇషాన్ కిషన్ అగ్రపీఠాన్ని కైవసం చేసుకోగా, అభిషేక్ శర్మ మూడో స్థానంలో, తిలక్ వర్మ ఆరో స్థానంలో నిలిచారు. టెస్టుల్లో రిషభ్ పంత్ ఏడో స్థానంలో, శుభ్ మన్ గిల్ ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నారు. పాకిస్థాన్ నుంచి కేవలం బాబర్ ఆజమ్ మాత్రమే టెస్టుల్లో 10వ ర్యాంక్, వన్డేల్లో 6వ ర్యాంక్‌లో స్థానం సంపాదించుకున్నాడు. బౌలింగ్, ఆల్‌రౌండర్ విభాగాల్లో మనోళ్ల హవా బౌలింగ్, ఆల్‌రౌండర్ విభాగాల్లోనూ భారత్ అత్యంత బలంగా కనిపిస్తోంది. టెస్టు బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా రెండో స్థానంలో కొనసాగుతుండగా, టీ20ల్లో వరుణ్ చక్రవర్తి ఎనిమిదో ర్యాంక్‌లో ఉన్నాడు. టెస్టు ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా మొదటి స్థానంలో, వాషింగ్టన్ సుందర్ ఆరో స్థానంలో నిలిచి సత్తా చాటారు. టీ20 ఆల్రౌండర్లలో హార్దిక్ పాండ్యా ఐదో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. పాకిస్థాన్ బౌలర్లలో నోమాన్ అలీ టెస్టుల్లో 8వ ర్యాంక్, అబ్రార్ అహ్మద్ వన్డే, టీ20ల్లో రెండో స్థానంలో నిలిచారు. ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి రెండు టెస్టుల్లో ఘోరంగా ఓడిపోవడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీవ్ర నిర్ణయాలు తీసుకుంది. జట్టు

India T20I Squad for Afghanistan Series: రింకు సింగ్ భారత్ తరపున ఫినిషర్‌గా అద్భుతంగా రాణించాడు. కానీ ఆ తర్వాత భారత జట్టు నుంచి తొలగించబడ్డాడు. అనంతరం, అతను అకస్మాత్తుగా జింబాబ్వే సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఇప్పుడు మరోసారి జట్టు నుంచి తప్పించారు. జింబాబ్వేతో జరిగిన సిరీస్‌లో 12, 25 పరుగులు చేసిన రింకు సింగ్‌కు అవకాశం లభించగా, ఇప్పుడు అతడిని టీ20 జట్టు నుంచి తొలగించారు. అయితే, ఆ తర్వాత రింకు సింగ్ యూపీ టీ20 లీగ్‌లో మంచి ఫామ్‌ను కనబరిచాడు. అతను మీరట్ తరపున 7 మ్యాచ్‌లలో 42.25 సగటుతో 19 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 219 కాగా, అతను 15 సిక్సర్లు కొట్టాడు. అయినప్పటికీ, ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్‌లో టీమిండియా అతనికి అవకాశం ఇవ్వలేదు. ఫినిషర్ పాత్రను పోషించే నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ టీ20 జట్టులోకి తిరిగి వచ్చారు. అక్షర్ పటేల్, శివమ్ దుబే కూడా జట్టులో ఉన్నారు. అందువల్ల, రింకుకు టీమ్ ఇండియాలో స్థానం సంపాదించడం కష్టంగా ఉంది. రింకు సింగ్ టీమ్ ఇండియా తరపున 48 టీ20 మ్యాచ్‌లలో 36.94 సగటుతో 702 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ కూడా 156.34గా ఉంది. అయినప్పటికీ, అతను జట్టులో తన స్థానాన్ని పదిలపరచుకోలేకపోయాడు

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు భారత స్టార్ బ్యాటర్ వికెట్ కీపర్ సంజు శాంసన్ జట్టులోకి వచ్చాడు. అటు యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కూడా చోటు దక్కించుకున్నాడు. దీంతో ఓపెనింగ్ జోడీపై ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. ఇంటర్నెట్ డెస్క్: వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల ఈ యువ సంచలనం బ్యాటింగ్ చూడటానికి రెండు కళ్లు సరిపోవు. భారీ షాట్లతో బౌలర్లను బెంబేలెత్తించే వైభవ్.. అత్యంత పిన్న వయసులోనే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే సెప్టెంబర్ 13 నుంచి టీమిండియా.. అఫ్గానిస్థాన్‌లో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఇందుకు సంబంధించిన జట్టును కూడా బీసీసీఐ ప్రకటించింది. స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ సంజు శాంసన్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అటు వైభవ్ సూర్యవంశీ కూడా జట్టులో ఉన్నాడు. దీంతో అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌లో భారత ఓపెనింగ్ జోడీ ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. ఇంగ్లండ్ పర్యటనలో విఫలమైన సంజును జట్టు నుంచి తప్పించి వైభవ్‌కు అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు అభిషేక్ శర్మ-వైభవ్ సూర్యవంశీ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ఇంగ్లండ్‌పై నిరాశపరిచిన వైభవ్.. జింబాబ్వేపై చెలరేగాడు. అయితే అఫ్గాన్ సిరీస్‌లో సంజు రాకతో వైభవ్ సూర్యవంశీకి షాక్ తగిలే అవకాశం ఉంది. ఎప్పటిలాగే సీనియర్ ప్లేయర్లు సంజు శాంసన్-అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తే.. వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తుంది. అక్కడ సంజు లేదా అభిషేక్ విఫలమైతేనే వైభవ్‌కు ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు, దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున వైభవ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 6 నుంచి ఫైనల్ మ్యాచ్‌లో ఆడనున్నారు. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 11 వరకు జరగనుంది. ఆ వెంటనే అఫ్గానిస్తాన్ సిరీస్ ప్రారంభం కానుంది. ఇషాన్ కిషన్ ఈస్ట్ జోన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. మరి ఈ ఇద్దరూ అఫ్గాన్ సిరీస్ కల్లా సిద్ధంగా ఉంటారా? లేదా? అనేది

BCCI Selection Policy: ఆటగాళ్ల ఫిట్నెస్ విషయంలో బీసీసీఐ కీలక మార్పు చేసినట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఇకపై జాతీయ జట్టుకు ఎంపిక చేసే సమయంలో ఆటగాడు మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడనే విషయంలో బోర్డు మరింత స్పష్టత తీసుకోనుంది. అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా పేర్లకు ఫిట్నెస్ షరతు విధించారు. గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నారా లేదా అనే విషయంలో స్పష్టత వచ్చిన తర్వాతే వారి తుది లభ్యతపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇటీవల గాయపడిన ఆటగాళ్లను జట్టులోకి తీసుకుని, ఆ తర్వాత వారు మ్యాచ్‌లకు దూరమైన సందర్భాల నేపథ్యంలో ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు సమాచారం. నివేదిక ప్రకారం.. ఇక ఆటగాడి ఫిట్‌నెస్‌పై 100 శాతం కాకుండా 200 శాతం నమ్మకం ఉన్నప్పుడే అతడిని పూర్తిగా ఎంపిక చేసినట్లు పరిగణించే విధానాన్ని బీసీసీఐ అవలంబించనుంది. దీనివల్ల జాతీయ జట్టులోకి ఎంపికైన తర్వాత ఫిట్నెస్ కారణంగా ఆటగాడు అందుబాటులో లేకపోయే పరిస్థితులను తగ్గించడమే లక్ష్యంగా కనిపిస్తోంది. Viral Video: ఏం క్యాచ్ గురూ.. సూపర్‌మ్యాన్ కూడా చేతులెత్తేయాల్సిందే.. బౌండరీ లైన్లో ఒంటి చేత్తో..! అయితే అంతర్జాతీయ సిరీస్‌కు జట్లను సాధారణంగా కొన్ని వారాల ముందే ఎంపిక చేస్తారు. ఎంపిక తేదీకి ఆటగాడు పూర్తి ఫిట్‌గా లేకపోయినా, సిరీస్ ప్రారంభానికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటే అతడిని పూర్తిగా పక్కన పెట్టకుండా ‘ఫిట్‌నెస్‌కు లోబడి’ ఎంపిక చేసే విధానాన్ని బీసీసీఐ కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా వివరించినట్లు నివేదిక పేర్కొంది. సెప్టెంబర్ 13 నుంచి ఢిల్లీలో అఫ్గానిస్థాన్‌తో భారత్ మూడు టీ20లు ఆడనుంది. ఈ సిరీస్‌కు ప్రకటించిన 15 మంది జట్టులో బుమ్రా, నితీశ్, వాషింగ్టన్, హర్షిత్ రాణాలకు ఫిట్నెస్ క్లియరెన్స్ తప్పనిసరి. నివేదిక ప్రకారం బుమ్రా, నితీశ్ సిరీస్ తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండే

టీమిండియాలోకి తిరిగి రావాలని ఎదురుచూస్తున్న ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యకు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ క్రమంలో అతడు చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇంటర్నెట్ డెస్క్: టీమిండియాలోకి తిరిగి రావాలని ఎదురుచూస్తున్న ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యకు మరోసారి నిరాశే ఎదురైంది. సెప్టెంబర్ 13 నుంచి అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు మంగళవారం బీసీసీఐ భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. జట్టులో ప్లేయర్లను వరుస గాయాలు వెంటాడుతుండటంతో కృనాల్‌కు అవకాశం దక్కుతుందంటూ వార్తలు వచ్చాయి. ఐదేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడని అభిమానులు ఆశించారు. కట్ చేస్తే.. జట్టులో కృనాల్‌కు చోటు దక్కలేదు. ఈ క్రమంలో అతడు చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. కృనాల్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ‘ఆశ ఇంకా సజీవంగానే ఉంది’ అన్నట్లు ఓ పోస్ట్ చేశాడు. దానికి ఫింగర్ క్రాస్(HOPE) ఎమోజీతో పాటు భారత జెండా ఎమోజీని జత చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. కృనాల్ పాండ్య చివరిసారిగా 2021లో భారత జట్టు తరఫున బరిలోకి దిగాడు. టీ20ల్లో భారత్‌కు 19 మ్యాచ్‌లు ఆడిన అతడు 10 ఇన్నింగ్స్‌ల్లో 124 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 15 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత అనూహ్య కారణాల వల్ల కృనాల్ జట్టుకు దూరమయ్యాడు. ఇటీవల ఐపీఎల్లో ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న అతడిని.. జాతీయ జట్టులోకి తీసుకుంటారని భావించారు. అయితే వాషింగ్టన్ సుందర్‌కు ఫిట్నెస్ క్లియరెన్స్ రావాల్సి ఉంది. అతడు ఒకవేళ సుందర్ అందుబాటులోకి రాలేకపోతే.. కృనాల్ పేరును పరిశీలించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వంద కాదు 200 శాతం క్లారిటీ.. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం! ఇదేం విచిత్రం.. ఫీల్డింగ్ కోచ్ కోసం లింక్డిన్లో పాకిస్థాన్ ఓపెన్ హైరింగ్!

బీసీసీఐ టీమ్ ఇండియా స్క్వాడ్‌ను ప్రకటించింది. అఫ్గానిస్థాన్‌తో జరగబోయే 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును వెల్లడించింది. సెప్టెంబర్ 13 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లు అన్నీ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలోనే జరుగుతాయి. అయితే ఈసారి ఎంపిక చేసిన జట్టులో అనూహ్య మార్పులు కనిపించాయి. ఇటీవలే జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో ఆడిన ఎనిమిది మంది ఆటగాళ్లను అఫ్గానిస్థాన్ సిరీస్ నుంచి బీసీసీఐ తప్పించింది. వారి స్థానంలో సీనియర్లు, గాయాల నుంచి కోలుకున్న ప్లేయర్లు తిరిగి జట్టులోకి వచ్చారు. ఈ మార్పులతో జట్టు స్వరూపమే పూర్తిగా మారిపోయింది. కొత్తగా వచ్చిన ఆటగాళ్లు చేరడంతో పాత వాళ్లకు చోటు దక్కలేదు. జట్టు నుంచి బయటకు వెళ్లిన 8 మందిలో యంగ్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ కూడా ఉన్నాడు. జింబాబ్వే సిరీస్‌లో 3 మ్యాచ్‌లలో 5 వికెట్లు తీసి మంచి ఫామ్‌లో ఉన్నా అతడిని పక్కన పెట్టారు. తొలి, మూడో టీ20ల్లో తొలి బంతి కే వికెట్ తీసి మయాంక్ మెరిసాడు. మరోవైపు స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, ఆల్‌రౌండర్లు నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయాల నుంచి కోలుకుని మళ్లీ స్క్వాడ్‌లోకి వచ్చారు. జింబాబ్వే సిరీస్ ఆడి ఇప్పుడు అఫ్గాన్ సిరీస్‌కు ఎంపిక కాని 8 మంది ఆటగాళ్ల జాబితా ఇదే.. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో టీమ్ ఇండియా ఈ సిరీస్ ఆడనుంది. తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్

Sanju Samson: భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య సెప్టెంబర్ 13 నుంచి 3 మ్యాచ్‌ల టి20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం సెలెక్టర్లు దాదాపు మెయిన్ ప్లేయర్లతో కూడిన 15 మంది సభ్యుల పవర్ఫుల్ జట్టును ఎంపిక చేశారు. శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించనున్న ఈ జట్టులో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సంజూ శామ్సన్ మళ్లీ స్థానం సంపాదించుకోవడం. ఈశాన్ కిషన్‌తో పాటు ఆయనను స్పెషలిస్ట్ వికెట్ కీపర్‌గా జట్టులోకి తీసుకున్నారు. జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో సంజూ శామ్సన్ పేరు లేకపోవడంతో సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సంజూ పట్ల జట్టు యాజమాన్యం అన్యాయంగా వ్యవహరిస్తోందని, ఆయనను జట్టు నుంచి తొలగించారని పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆరోపణలు చేశారు. అయితే ఆ సమయంలోనే బీసీసీఐ వర్గాలు స్పందిస్తూ ఆయనను జట్టు నుంచి తప్పించలేదని, బిజీ షెడ్యూల్ కారణంగా పనిభారాన్ని తగ్గించేందుకే విశ్రాంతినిచ్చామని స్పష్టం చేశాయి. ఇప్పుడు అఫ్గానిస్థాన్ సిరీస్‌కు ఆయనను నేరుగా ఎంపిక చేయడంతో బోర్డు చెప్పిన మాట నిజమేనని రుజువైంది. జింబాబ్వే పర్యటన నుంచి శామ్సన్‌కు విశ్రాంతి ఇవ్వడానికి ఆయన పాత యూకే టూర్ ప్రదర్శన కూడా ఒక కారణంగా నిలిచింది. ఐర్లాండ్‌తో జరిగిన 2 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆయన కేవలం 5 పరుగులు మాత్రమే చేశారు. అందులో ఒక ఇన్నింగ్స్‌లో పరుగులేమీ చేయకుండానే అవుట్ అయ్యారు. ఇక ఇంగ్లండ్ పర్యటనలోని 5 మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో ఆయనకు కేవలం 2 మ్యాచ్‌లలోనే అవకాశం లభించగా, మొదటి మ్యాచ్‌లో 1 పరుగు, చివరి మ్యాచ్‌లో 27 పరుగులు మాత్రమే చేయగలిగారు. మిగిలిన మ్యాచ్‌లలో ఆయన స్థానంలో యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకున్నారు. నిరాశపరిచిన యూకే పర్యటన తర్వాత లభించిన చిన్నపాటి విరామం సంజూ శామ్సన్‌కు మానసికంగా రీఛార్జ్ అవ్వడానికి ఎంతో ఉపయోగపడింది. ఆ విరామం తర్వాత ఇప్పుడు

IND vs AFG: అఫ్గానిస్థాన్‌తో సెప్టెంబర్ 13 నుంచి ఢిల్లీ వేదికగా ప్రారంభం కానున్న మూడు టి20ల సిరీస్ కోసం భారత సెలెక్షన్ కమిటీ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. గత జింబాబ్వే పర్యటనలో ఆడిన 8 మంది ఆటగాళ్లను ఈ సిరీస్ నుంచి తప్పించడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఎదురైన ఘోర పరాభవం వల్ల పాకిస్థాన్ జట్టు ఏకంగా 7 మంది ఆటగాళ్లపై వేటు వేసింది. కానీ టీమిండియాలో జరిగిన ఈ 8 మార్పుల వెనుక కారణం ఏమాత్రం శిక్ష కాదని తెలుస్తోంది. జింబాబ్వే పర్యటనలో సీనియర్లకు విశ్రాంతినివ్వడంతో ఎక్కువ మంది యువ ఆటగాళ్లకు అవకాశం లభించింది. అయితే అఫ్గానిస్థాన్‌తో జరిగే సిరీస్ కోసం సీనియర్ ప్లేయర్లు తిరిగి రావడంతో, గత సిరీస్‌లో ఆడిన చాలామంది కుర్రాళ్లు బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. జింబాబ్వే సిరీస్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న యంగ్ పేసర్లు మయూంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, అశోక్ శర్మలు ఈ సిరీస్‌కు ఎంపిక కాలేదు. వీరితో పాటు ఆల్‌రౌండర్లు సూర్యాంశ్ షెడ్గే, హర్ష్ దూబే కూడా తమ స్థానాలను కాపాడుకోలేకపోయారు. వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్‌తో పాటు ఫినిషర్ బాధ్యతలు నిర్వర్తించే రింకూ సింగ్‌ను కూడా ఈ సిరీస్ నుంచి పక్కన పెట్టడం గమనార్హం. అఫ్గానిస్థాన్ జట్టుపై పూర్తి ఆధిక్యత సాధించాలనే లక్ష్యంతో భారత సెలెక్టర్లు సీనియర్లతో కూడిన ప్రధాన జట్టును ఎంపిక చేశారు. వేగవంతమైన బౌలింగ్ విభాగంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాలు తిరిగొచ్చారు. స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్‌తో పాటు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి రీఎంట్రీ ఇచ్చారు. వీరితో పాటు సంజూ శామ్సన్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డిల పునరాగమనంతో జట్టు కలయిక పూర్తిగా మారిపోయింది. అఫ్గానిస్థాన్ టి20 సిరీస్ కోసం భారత జట్టు

అఫ్గానిస్థాన్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు బీసీసీఐ ఇవాళ భారత జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా ఉండనున్నాడు. స్పోర్ట్స్ డెస్క్: అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు బీసీసీఐ ఇవాళ(మంగళవారం) భారత జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా ఉండనున్నాడు. ఇక వికెట్ కీపర్లుగా సంజూ శాంసన్, ఇషాన్ కిషన్‌లను ఎంపిక చేసింది. జింబాబ్వేతో సిరీస్‌కు దూరమైన సంజూ శాంసన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ సిరీస్‌కు వైభవ్ సూర్వవంశీ కూడా ఎంపికయ్యాడు. అయితే స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు మాత్రం జట్టులో స్థానం దక్కలేదు. ఇక బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాలను ఎంపిక చేసినప్పటికీ వారు కూడా ఫిట్నెస్ క్లియరెన్స్ సాధించాల్సి ఉంటుంది. ఇక అఫ్గానిస్థాన్‌తో భారత్ సెప్టెంబర్ 13 నుంచి 17 మధ్య మూడు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. తొలి టీ20 మ్యాచ్ సెప్టెంబర్ 13న, రెండో టీ20 సెప్టెంబర్ 15న, మూడో టీ20 సెప్టెంబర్ 17న జరగనున్నాయి. ఈ మూడు టీ20లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది. ఈ సిరీస్ ద్వారా అఫ్గానిస్థాన్ భారత్ లో టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వనుండటం విశేషం. శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి*, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్*, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా*, అర్షదీప్ సింగ్, హర్షిత్ రానా* గమనిక: స్టార్ గుర్తు ఉన్నవాళ్లు జట్టులోకి ఎంపికైనప్పటికీ ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ముంబై ఇండియన్స్‌తోనే పాండ్య.. కానీ, కెప్టెన్‌గా కాదు! ఆ విషయంలో పాకిస్థాన్ క్రికెట్‌ను నమ్మోచ్చు: హర్షా భోగ్లే

అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. India Squad for Afghanistan T20: ఆఫ్ఘనిస్థాన్‌తో త్వరలో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ (BCCI) సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ వ్యవహరించనుండగా.. వైస్ కెప్టెన్‌గా తెలుగు ఆటగాడు తిలక్ వర్మ ఎంపికయ్యాడు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో పాటు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ జట్టులో చోటు దక్కించుకున్నారు. అయితే నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణాల ఎంపిక ఫిట్నెస్ క్లియరెన్స్ ఆధారంగా ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. భారత పూర్తి జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివం దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా మొదటి టీ20: సెప్టెంబర్ 13, 2026 (ఆదివారం) రెండవ టీ20: సెప్టెంబర్ 15, 2026 (మంగళవారం) మూడవ టీ20: సెప్టెంబర్ 17, 2026 (గురువారం) గమనిక: ఈ మూడు మ్యాచ్‌లు కూడా ఢిల్లీ వేదికగానే జరగనున్నాయి

అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించింది. సెప్టెంబర్ 1న ప్రకటించిన ఈ జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్నారు. వికెట్ కీపర్లుగా సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ చోటు దక్కించుకున్నారు. భారత జట్టులో అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ ఉన్నారు. పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాకు అవకాశం లభించింది. అయితే నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, అర్ష్‌దీప్, హర్షిత్ రాణాల ఎంపిక ఫిట్నెస్ క్లియరెన్స్‌కు లోబడి ఉంటుందని బీసీసీఐ తెలిపింది. అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. మూడు మ్యాచ్‌లకు ఢిల్లీ ఆతిథ్యమివ్వనుంది. తొలి టీ20 సెప్టెంబర్ 13న ఆదివారం, రెండో మ్యాచ్ సెప్టెంబర్ 15న మంగళవారం, మూడో టీ20 సెప్టెంబర్ 17న గురువారం జరగనుంది. ఈ సిరీస్‌లో యువ ఆటగాళ్లకు కూడా సెలక్షన్ కమిటీ ప్రాధాన్యం ఇచ్చింది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ ఎంపికపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు సీనియర్ ఆటగాళ్లైన బుమ్రా, అర్ష్‌దీప్, అక్షర్ పటేల్‌ల అనుభవం జట్టుకు బలంగా మారనుంది. మూడు మ్యాచ్‌లు ఢిల్లీలోనే జరగనున్న నేపథ్యంలో స్వదేశంలో అఫ్గానిస్థాన్‌ను ఎదుర్కొనేందుకు భారత జట్టు సిద్ధమవుతోంది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో కొత్త కాంబినేషన్‌తో బరిలోకి దిగనున్న టీమిండియా ప్రదర్శనపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది

Gurnoor Brar: టీమిండియాలో ఉద్భవిస్తున్న ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ తన భవిష్యత్తు లక్ష్యాలను స్పష్టం చేశారు. సీనియర్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌లతో కలిసి బౌలింగ్ చేయడం ద్వారా ఎంతో నేర్చుకున్నానని, భారత జట్టు తరఫున మూడు ఫార్మాట్లలోనూ ప్రాతినిధ్యం వహించడమే తన ప్రధాన ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. గత మూడు నెలల కాలంలో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ వంటి దిగ్గజ పేసర్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం, వారితో ప్రాక్టీస్ చేయడం తన బౌలింగ్ రీతిని పూర్తిగా మార్చేసిందని 26 ఏళ్ల గుర్నూర్ బ్రార్ తెలిపారు. బెంగళూరు వేదికగా విలేకరులతో మాట్లాడిన ఆయన, సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను సీనియర్ల నుంచి నేర్చుకున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటివరకు ఆరు వన్డేలు ఆడిన ఈ పంజాబ్ పేసర్, 11 వికెట్లు తీసి నిలకడైన ప్రదర్శన కనబరిచారు. అఫ్గానిస్థాన్, ఇంగ్లండ్ సిరీస్‌లలో లభించిన అనుభవం తన బౌలింగ్ శైలిని మరింత మెరుగుపరిచిందని ఆయన వివరించారు. రంజీ ట్రోఫీ, ఇండియా-ఎ తరఫున కనబరిచిన అద్భుత ప్రదర్శనే తన్ను జాతీయ జట్టు తలుపు తట్టేలా చేసిందని గుర్నూర్ చెప్పారు. ముఖ్య కోచ్ గౌతమ్ గంభీర్, బౌలింగ్ కోచ్ మోర్కీ మోర్కెల్ మార్గదర్శకత్వంలో పని చేయడం తన బౌలింగ్ నైపుణ్యాన్ని విపరీతంగా పెంచిందని తెలిపారు. పిచ్ స్వభావాన్ని బట్టి బ్యాటర్లకు ఎలాంటి బంతులు వేయాలో, తన బౌలింగ్ కన్సిస్టెన్సీని ఎలా కాపాడుకోవాలో మోర్కెల్ సర్ నుంచి ఎన్నో విషయాలు తెలుసుకున్నట్లు ఆయన వెల్లడించారు. మైదానంలో మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లుగా బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ తమను తాము ఎలా సిద్ధం చేసుకుంటారో చాలా దగ్గర నుంచి గమనించినట్లు గుర్నూర్ చెప్పారు. సహజసిద్ధమైన బౌలింగ్ శైలిని మార్చుకోవద్దని, కాకపోతే పరిస్థితులకు తగ్గట్లు వేగం, లెంగ్త్‌ను నిలకడగా కొనసాగించాలని సీనియర్లు தனకు సూచించినట్లు తెలిపారు. ఎక్కువ మ్యాచ్‌లు ఆడుతున్న కొద్దీ అనుభవంతో ఆట

టీమిండియాలోకి తిరిగి రావడంపై భారత బ్యాటర్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పూర్తి విశ్వాసంతో ఉన్నాడు. దేశవాళీ క్రికెట్లో పరుగులు సాధిస్తూ తన స్థానాన్ని తిరిగి సంపాదించుకోవడంపైనే దృష్టి పెట్టినట్లు చెప్పాడు. అవకాశం వచ్చినప్పుడు సత్తా చాటేందుకు సిద్ధంగా ఉంటానని తెలిపాడు.టీమిండియాలోకి పునరాగమనంపై మంగళవారం కోయంబత్తూర్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా రుతురాజ్‌ను మీడియా ప్రశ్నించింది. దీనికి స్పందిస్తూ.. ‘‘చాలా నమ్మకంగా ఉన్నా. మళ్లీ వెళ్లి పరుగులు చేయడంపైనే దృష్టి. ఇన్నాళ్లూ పరుగులు సాధిస్తూనే ఉన్నా. ఇక నిలకడగా రాణిస్తూ అవకాశం కోసం ఎదురుచూడాలి’’ అని చెప్పాడు.ప్రస్తుతం జాతీయ జట్టులో చోటు కోసం దేశవాళీ క్రికెట్లో రుతురాజ్ తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తన బ్యాటింగ్‌పై నమ్మకం ఉందని స్పష్టం చేశాడు. దేశవాళీ సీజన్ మొదలుకానున్న నేపథ్యంలో రాబోయే టోర్నీలపై దృష్టి పెట్టినట్లు తెలిపాడు.ఇదిలా ఉంటే.. ఆఫ్ఘనిస్థాన్‌తో భారత్ తలపడనున్న నేపథ్యంలో రషీద్ ఖాన్, యువ భారత బ్యాటర్ సూర్యవంశీ మధ్య ఆసక్తికర పోరు ఉంటుందా? అని రుతురాజ్‌ను అడిగారు. అయితే ఈ పోరుపై తాను పెద్దగా ఆలోచించలేదని చెప్పాడు. ‘‘మీరు మీ దేశానికి మద్దతు ఇవ్వాలని కోరుకుంటారు.. నేనూ అంతే, నా దేశానికి మద్దతివ్వాలని కోరుకుంటాను" అని అన్నాడు.జట్టులో లేనప్పుడు తాను మ్యాచ్‌లను ఎక్కువగా చూడనని తెలిపాడు. ప్రస్తుతం తన సాధనపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లు రుతురాజ్ తెలిపాడు. ప్రాక్టీస్‌తో పాటు దేశవాళీ టోర్నీలు కూడా ఉండటంతో టీమిండియా మ్యాచ్‌లను రోజూ చూడటం సాధ్యం కావడం లేదన్నాడు.దులీప్ ట్రోఫీ తర్వాత ఇరానీ

Team India: భారత టెస్టు క్రికెట్లో నంబర్-3 స్థానానికి సుదీర్ఘకాలం పాటు వెన్నెముకగా నిలిచిన ఛతేశ్వర్ పుజారా తన డ్రీమ్ 11 సహచర ఆటగాళ్ల జట్టును ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తనతో కలిసి ఆడిన దిగ్గజాల్లో అత్యుత్తమ 11 మందిని ఎంచుకున్న ఆయన, మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ, భువనేశ్వర్ కుమార్‌లకు స్థానం కల్పించకపోవడం క్రీడావర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీమిండియా తరఫున దాదాపు 13 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా టెస్టు క్రికెట్ ఆడిన పుజారా అనేక మంది దిగ్గజ ఆటగాళ్లతో మైదానాన్ని పంచుకున్నారు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ వంటి ప్రఖ్యాత ఆటగాళ్ల నుంచి నేటితరం స్టార్ల వరకు అందరితో కలసి ప్రాతినిధ్యం వహించారు. ఆయన ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల సారథ్యంలో మ్యాచ్‌లు ఆడినప్పటికీ, తన ఆల్ టైమ్ బెస్ట్ 11 తోటి ప్లేయర్ల జాబితాలో మాత్రం కేవలం విరాట్ కోహ్లీకి మాత్రమే చోటు కల్పించారు. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో ప్లాట్‌ఫారమ్ వేదికగా ఈ ఆసక్తికరమైన వివరాలను ఆయన వెల్లడించారు. టెస్టుల్లో ద్రవిడ్ వదిలివెళ్లిన డిఫెన్సివ్ బ్యాటింగ్ వారసత్వాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లిన పుజారా, తన జట్టులో ద్రవిడ్‌ను చేర్చుకోవడం మరచిపోలేదు. ఆయన ఎంచుకున్న 11 మంది సభ్యులలో ఆరుగురు రిటైర్ అయిన మాజీలు ఉండగా, ఐదుగురు ప్రస్తుత యాక్టివ్ క్రికెటర్లు ఉన్నారు. రిటైర్డ్ జాబితా నుంచి వీరేందర్ సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ, వీవీఎస్ లక్ష్మణ్, రవిచంద్రన్ అశ్విన్‌లను ఎంపిక చేసుకున్నారు. వీరందరిలో ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఒక్కరే వన్డే ఫార్మాట్లో కొనసాగుతున్నారు. యాక్టివ్ ప్లేయర్లలో ఎవరెవరికి చోటు దక్కిందంటే? ప్రస్తుతం ఆడుతున్న అంతర్జాతీయ క్రికెటర్లలో నుంచి రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రాలను పుజారా తన తుది జట్టులోకి తీసుకున్నారు. అదనంగా 12వ ఆటగాడిగా ఫాస్టెస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మను సెలక్ట్ చేయడం విశేషం. పిచ్ పరిస్థితులను బట్టి

BCCI Chief Selector: భారత జట్టు ఆప్ఘాన్ టీంతో సిరీస్ కోసం బిజీగా మారింది. ఈ క్రమంలో టీం స్వ్కాడ్ 3వ తేదీన ప్రకటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం ముగుస్తుండడంతో.. ఆయన భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది. 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాలు ఇప్పటికే మొదలవ్వడంతో.. అగార్కర్‌ను మరో ఏడాది పాటు సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా కొనసాగించాలా? వద్దా? అనే అంశంపై బీసీసీఐ కీలక సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బోర్డులోని ఓ వర్గం ఆయనను కొనసాగించాలని కోరుకుంటున్నట్లు వార్తలు వినిపస్తున్నాయి. టీమిండియా మాజీ ప్లేయర్ అజిత్ అగార్కర్ ప్రస్తుతం భారత పురుషుల సీనియర్ సెలక్షన్ కమిటీకి ఛైర్మన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుత కాంట్రాక్ట్ 2026 సెప్టెంబర్‌లో ముగియనుంది. దీంతో 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆయనను కొనసాగించడంపై బీసీసీఐ మల్లగుల్లాలు పడుతోంది. తాజా సమాచారం ప్రకారం.. అగార్కర్‌కు మరో ఏడాది గడువు ఇచ్చేందుకు బీసీసీఐ సుముఖంగా ఉందని తెలుస్తోంది. అయితే తుది నిర్ణయం సమావేశం అనంతరం తీసుకోనున్నారు. అంతేకాదు.. ఈ బాధ్యతను కొనసాగించాలా? వద్దా? అనే విషయంలో అగార్కర్ అభిప్రాయం కూడా కీలకం కానుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఎక్కువమంది చదివినది: వన్డే ప్రపంచకప్ 2027 కోసం దూసుకొస్తోన్న తెలుగోడు.. డేంజర్ జోన్లో సర్పంచ్ సాబ్ ప్లేస్..! 2023లో చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీకి కొన్ని అద్భుత విజయాలు సాధించింది. భారత్ 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 ప్రపంచకప్ సాధించింది. దీంతో వైట్‌బాల్ క్రికెట్లో జట్టు విజయాల్లో సెలక్షన్ కమిటీ పాత్రపై ప్రశంసలు వచ్చాయి. 2027 వన్డే ప్రపంచకప్ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీకి ఏడాది మాత్రమే సమయం ఉండటంతో సెలక్షన్ కమిటీలో

Hardik Pandya Injury: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పునరాగమనానికి మరోసారి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఫిట్నెస్ సాధించి జట్టులోకి వచ్చేందుకు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో శిక్షణ తీసుకుంటున్న హార్దిక్‌కు తాజాగా కాలికి మరోసారి స్వల్ప గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతానికి బౌలింగ్‌కు దూరంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. భారత్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య మూడు టీ20ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో హార్దిక్ పునరాగమనం చేస్తాడని భావించినా.. తాజా పరిణామంతో అతడి ఎంపికపై సందేహాలు నెలకొన్నాయి. టీ20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఉంటాయి. ఈ నేపథ్యంలో హార్దిక్ పూర్తి ఫిట్నెస్ సాధించాడా? బౌలింగ్ చేయగలిగే స్థితిలో ఉన్నాడా? అన్నది సెలెక్టర్లకు కీలకంగా మారింది. గాయం నుంచి కోలుకున్న తర్వాత హార్దిక్ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో పునరావాస కార్యక్రమం కొనసాగిస్తున్నాడు. ఇటీవల అతడి ఫిట్నెస్ మెరుగుపడటంతో త్వరలోనే మైదానంలోకి వస్తాడని అభిమానులు ఆశించారు. అయితే శిక్షణ సమయంలో కాలికి స్వల్ప ఇబ్బంది రావడంతో ప్రస్తుతం బౌలింగ్ చేయకుండా విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. దీంతో హార్దిక్ రీఎంట్రీపై మరోసారి అనిశ్చితి నెలకొంది. ఎక్కువమంది చదివినది: Video: 6 ఫోర్లు, 7 సిక్సర్లతో విధ్వంసం.. 26 బంతుల్లో 296 స్ట్రైక్ రేట్‌తో కాటేరమ్మ కొడుకు ఊచకోత చూశారా..? హార్దిక్ పాండ్యాను గాయాలు చాలాకాలంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఐపీఎల్ సమయంలో ఎదురైన సమస్యల అనంతరం అతడు సీఓఈలో రిహాబిలిటేషన్ ప్రారంభించాడు. అనంతరం ఫిట్నెస్ పరీక్షల సమయంలోనూ కాలి కండరాలకు సంబంధించిన ఇబ్బందులు ఎదురయ్యాయి. పూర్తి ఫిట్నెస్ సాధించిన తర్వాతే పోటీ క్రికెట్లోకి అనుమతించాలని బీసీసీఐ భావిస్తోంది. అందుకే హార్దిక్ విషయంలో సెలెక్టర్లు ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకపోవచ్చని తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా భారత టీ20 జట్టులో కీలకమైన ఆల్‌రౌండర్. బ్యాటింగ్‌లో భారీ షాట్లు ఆడటంతో పాటు.. మీడియం పేస్‌తో కీలక వికెట్లు తీయగలడు. ముఖ్యంగా జట్టు కూర్పులో అతడి బౌలింగ్ ఎంతో కీలకం

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. గాయం నుంచి కోలుకుని బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో (జాతీయ క్రికెట్ అకాడమీ) శిక్షణ పొందుతున్న అతడికి, తాజాగా కాలికి స్వల్ప గాయమైంది. దీంతో అతడి కమ్‌బ్యాక్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ గాయం కారణంగా, సెప్టెంబర్ 13న ప్రారంభం కానున్న ఆఫ్ఘనిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు హార్దిక్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.'టైమ్స్ ఆఫ్ ఇండియా' కథనం ప్రకారం.. హార్దిక్ పాండ్యా ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తిస్థాయిలో శిక్షణ తీసుకుంటున్నాడు. అయితే, చివరి నిమిషంలో కాలికి స్వల్పంగా నొప్పి రావడంతో అతడిని బౌలింగ్ చేయవద్దని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సిబ్బంది సూచించారు. బ్యాటింగ్, ఇతర కదలికలకు పెద్దగా సమస్య లేనప్పటికీ, పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు ధ్రువీకరణ లభించే వరకు అతడిని జట్టులోకి అనుమతించేది లేదని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్థాన్ సిరీస్ నాటికి అతను పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించడం అనుమానంగానే ఉంది.32 ఏళ్ల హార్దిక్ పాండ్యా, మే 24న ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడినప్పటి నుంచి మరే ఇతర మ్యాచ్‌లో పాల్గొనలేదు. ఇక, భారత్ తరఫున చివరిసారిగా మార్చి 8న టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆడాడు. అప్పటి నుంచి స్వదేశంలో ఆఫ్ఘనిస్థాన్‌తో సిరీస్‌తో పాటు ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు దూరమయ్యాడు. గతంలో క్వాడ్రిసెప్స్ కండరాల గాయం కూడా అతడి కోలుకునే ప్రక్రియను ఆలస్యం చేసింది.ఈ వారం సెలెక్టర్లు సమావేశమై ఆఫ్ఘనిస్థాన్ సిరీస్‌కు

Jalaj Saxena Stats: దేశవాళీ క్రికెట్లో అసాధారణ రికార్డులు నెలకొల్పి, పరుగుల వరదతో పాటు వికెట్ల పంట పండించినా కొందరు ఆటగాళ్లకు జాతీయ జట్టు తలుపులు తెరుచుకోవు. రంజీ ట్రోఫీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఆల్‌రౌండ్ విన్యాసాలు ప్రదర్శించిన ఓ ప్లేయర్ భారత టెస్టు జట్టులో కనీసం ఒక్కసారైనా చోటు దక్కించుకోలేకపోవడం భారత క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. భారత రెడ్ బాల్ క్రికెట్ సర్క్యూట్లో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా పేరుగాంచిన జలజ్ సక్సేనా, రంజీ ట్రోఫీ చరిత్రలోనే ఇంతవరకు ఎవరూ సాధించని అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నమెంట్లో 6000 కంటే ఎక్కువ పరుగులు చేయడంతో పాటు 400 కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన ఏకైక ఆటగాడిగా ఆయన ఆల్‌టైమ్ రికార్డు సృష్టించాడు. మైదానంలో నిలకడైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను అలసిపోయేలా చేయడమే కాకుండా, తన ఆఫ్ స్పిన్ మాయాజాలంతో కీలక సమయాల్లో భాగస్వామ్యాలను విడదీస్తూ ఎన్నో అద్భుత విజయాలను అందించాడు. ఇలాంటి ఆల్‌రౌండ్ నైపుణ్యం ఉన్న ఆటగాడు మరే ఇతర దేశంలో ఉన్నా సులువుగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టేవాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎక్కువమంది చదివినది:SL vs IND: లంకపై ఘన విజయం.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో భారత్ దూకుడు.. ఆ జట్టు ఔట్..? ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మైలురాళ్లు.. 500 వికెట్లు, 14 సెంచరీలు.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో జలజ్ సక్సేనా నమోదు చేసిన గణాంకాలు ఆయన ప్రతిభకు అద్దం పడతాయి. తన సుదీర్ఘ రెడ్ బాల్ కెరీర్లో మొత్తం 157 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఆయన 33.75 సగటుతో ఏకంగా 7224 పరుగులు సాధించాడు. ఇందులో 14 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలు ఉండటం విశేషం. బౌలింగ్ విభాగంలోనూ ఆయన అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 25.45 సగటుతో 512 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు. ఒకే ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ఘనతను

ప్రస్తుతం చర్చంతా టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గురించే! శ్రీలంకతో తొలి టెస్టులో అతడికి అవకాశాలు ఇవ్వలేదంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం చర్చంతా టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గురించే! శ్రీలంకతో తొలి టెస్టులో అతడికి అవకాశాలు ఇవ్వలేదంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. టీమ్ మేనేజ్మెంట్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. కుల్దీప్ యాదవ్‌ను పూర్తిగా నమ్మడం లేదనే సంకేతాలు కనిపిస్తున్నాయని తెలిపాడు. ప్రస్తుతం అశ్విన్ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. తొలి టెస్టులో కుల్దీప్ 25 ఓవర్లు బౌలింగ్ చేసి 103 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. స్పిన్నర్లకు అనుకూలంగా ఉన్న గాలే పిచ్‌పై కూడా అతడు పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అయితే కుల్దీప్కు తగినంత బౌలింగ్ అవకాశాలు ఇవ్వకపోవడమే అతడి వైఫల్యానికి కారణమని అశ్విన్ పేర్కొన్నాడు. ‘జడేజా ఒక వైపు, సుతార్ మరోవైపు వికెట్లు తీస్తున్నారని అందరూ ప్రశ్నిస్తారు. కానీ కుల్దీప్ మూడో స్పిన్నర్. నేను, జడేజా ఆడుతున్నప్పుడు కూడా అతడు మూడో స్పిన్నర్‌గానే ఉండేవాడు. ఇప్పుడు కూడా పరిస్థితి మారలేదు. 11 మంది ఉన్న జట్టులో మూడో లేదా నాలుగో స్పిన్నర్‌గా ఉండటం అంత సులభం కాదు’ అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. ‘కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు కుల్దీప్ యాదవ్ ప్రాధాన్యత కలిగిన బౌలర్ కాకపోవచ్చు. కుల్దీప్ ప్రస్తుతం చాలా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. అతడు తన నైపుణ్యాన్ని కోల్పోయాడా? అంటే అస్సలు కాదు. చాలా కాలం తర్వాత మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో కూడా అతడిని సరిగ్గా ఉపయోగించలేదు. ఇది ఆటగాడి తప్పు కాదు. ఇది ప్లేయర్‌పై మేనేజ్మెంట్కు నమ్మకం లేదనడానికి ఒక సంకేతం. అతడికి

శ్రీలంక పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టుకు కొలంబోలో ఘనమైన ఆతిథ్యం లభించింది. పర్యటనలో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో రెండో మ్యాచ్‌కు ముందు, శ్రీలంకలోని భారత హైకమిషనర్ సంతోష్ ఝా ఇరు దేశాల జట్లకు విందు ఏర్పాటు చేశారు. కొలంబోలోని ఇండియా హౌస్‌లో నిన్న రాత్రి ఈ కార్యక్రమం జరిగింది. రెండో టెస్టుకు సన్నద్ధమవుతున్న భారత, శ్రీలంక ఆటగాళ్లు ఈ విందులో పాల్గొన్నారు.ఈ కార్యక్రమం గురించి బీసీసీఐ తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది. "కొలంబోలో ఇదొక చిరస్మరణీయ సాయంత్రం! రెండో టెస్టుకు ముందు శ్రీలంకలో భారత హైకమిషనర్ సంతోష్ ఝా, టీమిండియాకు ఇండియా హౌస్‌లో ఆతిథ్యం ఇచ్చారు" అని పేర్కొంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను కూడా పంచుకుంది.భారత హైకమిషనర్ సంతోష్ ఝా కూడా ఈ కార్యక్రమంపై హర్షం వ్యక్తం చేశారు. "టీమిండియాకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా శ్రీలంకలో పర్యటిస్తున్న టీమిండియా, శ్రీలంక జట్లకు ఆతిథ్యం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇరు దేశాలను కలిపి ఉంచే క్రికెట్, భారత్-శ్రీలంక మధ్య ఉన్న చిరకాల బంధాన్ని మరింత బలోపేతం చేస్తూనే ఉంది" అని ఆయన తన 'ఎక్స్' పోస్టులో తెలిపారు.సిరీస్‌లో భారత్ ఆధిక్యంప్రస్తుతం రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో శ్రీలంకపై 165 పరుగుల భారీ తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇక, ఇరు జట్ల మధ్య రెండో టెస్టు

భారత మాజీ క్రికెటర్ జాకబ్ మార్టిన్ 22 ఏళ్ల నాటి క్రిమినల్ కేసులో నిర్దోషిగా విడుదలయ్యాడు. 2004లో జాకబ్ మార్టిన్ పాస్‌పోర్ట్ ఫోర్జరీ చేశాడన్న ఆరోపణలు రావడంతో అతడిపై క్రిమినల్ కేసు నమోదైంది. ఐపీసీలోని సెక్షన్లు 420, 468, 471, 120బితో పాటు పాస్‌పోర్ట్ చట్టంలోని సెక్షన్ 12 కింద జాకబ్ మార్టిన్‌పై అభియోగాలు మోపబడ్డాయి. తాజాగా 22 ఏళ్ల తర్వాత పాస్‌పోర్ట్ ఫోర్జరీ, నకిలీ యూకే ఇమ్మిగ్రేషన్ స్టాంప్, ప్రయాణ ఏర్పాట్లు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి జాకబ్‌పై వచ్చిన ఆరోపణలు రుజువు కాలేదు. దీంతో పాటియాలా హౌస్ కోర్టు జాకబ్‌పై వచ్చిన ఆరోపణలన్నింటిని కొట్టివేస్తూ నిర్దోషిగా విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జాకబ్ మార్టిన్ పాస్‌పోర్ట్ అవకతవకలకు పాల్పడినట్లు గానీ, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి విశ్వసనీయమైన ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. కేసులో ముఖ్యులైన పలువురు సాక్ష్యాలు, ఆధారాలు నిరూపించడంలో విఫలమయ్యారని, అందుకే జాకబ్ మార్టిన్‌ను నిర్దోషిగా విడుదల చేస్తున్నట్లు పాటియాలా కోర్టు తమ తీర్పును వెల్లడించింది. తాను నిర్దోషిగా విడుదలవ్వడంపై జాకబ్ మార్టిన్ మీడియాతో స్పందించాడు. "2004లో యూకే పర్యటనకు వెళ్లిన జట్టులో ఒక సభ్యుడు వీసా గడువు ముగిసినప్పటికీ అక్కడే ఉండిపోయాడు. అయితే నకిలీ ఇమ్మిగ్రేషన్ స్టాంప్ పొంది భారత్‌కు తిరిగి రావడంతోనే పట్టుబడడంతో కేసు వెలుగులోకి వచ్చింది. అసలు ఎఫ్ఐఆర్లో మొదట నా పేరు లేదు. కానీ విచారణ సమయం వచ్చేనాటికి నా పేరును కేసులో చేర్చారు. తాను అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదగకూడదనే ఉద్దేశంతో కొందరు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఏ తప్పు చేయనప్పటికీ నేను దోషిగా తేలడం వల్ల రైల్వే ఉద్యోగాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది. క్రికెటర్‌గా ఎదగలేకపోయానన్న బాధ ఒత్తిడికి గురయ్యాను. తాజాగా 22 ఏళ్ల తర్వాత కేసులో నిర్దోషిగా బయటికి రావడం ఉపశమనాన్ని కలిగిస్తోంది. ఇది నా జీవితంలో ఒక కీలక మలుపు" అని చెప్పుకొచ్చాడు. 1999లో అంతర్జాతీయ అరంగేట్రం ఇక

క్రికెట్లో బ్లాక్‌క్యాప్స్‌గా పిలుచుకునే న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఆర్థిక కష్టాల్లో పడింది. గతేడాది ఆర్థిక సంవత్సరంలో భారీ నష్టాలను చవిచూసినట్లు ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో 7.3 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 69 కోట్లు) ప్రాథమిక లోటు ఉన్నట్లు ప్రకటించింది. జూలై 31, 2026తో ముగిసిన గతేడాది ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో అంచనా వేసిన రూ. 1.8 మిలియన్ల నష్టం కంటే ఇది చాలా ఎక్కువ. స్పాన్సర్‌షిప్‌లు తగ్గడం, అకౌంటింగ్ సర్దుబాట్లు , ఖర్చులు పెరగడం ఇందుకు ప్రధాన కారణమని కివీస్ బోర్డు తెలిపింది. ముఖ్యంగా డ్రీమ్ 11 స్పాన్సర్‌షిప్‌ను కోల్పోవడం వల్ల ఆదాయం తగ్గిపోవడంతో పాటు ఖర్చులు పెరిగినట్లు స్పష్టం చేసింది. అయితే ఈ ఏడాది చివర్లో స్వదేశంలో టీమిండియా పర్యటన వల్ల సుమారు 10 మిలియన్ డాలర్లు వస్తాయని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఆశాభావం వ్యక్తం చేస్తోంది. సూపర్ స్మాష్ పోటీ స్థానంలో 2027-28 సీజన్ కోసం ప్రతిపాదిత టీ20 ఫ్రాంచైజీ లీగ్‌కు సంబంధించి ప్రణాళికలు రచిస్తోంది. ఈ వేసవిలో జరిగే సూపర్ స్మాష్ పోటీల్లో మొత్తం 64 మ్యాచ్‌ల్లో ఫైనల్ సహా 24 మ్యాచ్‌లను డబుల్ హెడర్‌గా ప్రసారం చేస్తామని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కార్యనిర్వహణాధికారి జియోఫ్ అల్లట్ స్పష్టం చేశాడు. ఇక డిసెంబర్-జనవరి నెలలో జరిగే సూపర్ స్మాష్ పోటీలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ వచ్చే నెలలో విడుదల కానుంది. ఇక ఇంగ్లండ్‌పై టెస్టు సిరీస్, వెస్టిండీస్‌పై వన్డే సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్ స్వదేశంలో భారత్‌తో అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య సుదీర్ఘ సిరీస్ ఆడనుంది. ఈ పర్యటనలో టీమిండియా ఐదు టీ20లు,ఐదు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. Read: భారీగా యూఎస్ ఓపెన్ ప్రైజ్‌మనీ.. సింగిల్స్ విజేతకు 52 కోట్లు ‘ఇరుముడి’మూవీ ప్రెస్‌మీట్...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా? నలుపు చీరలో వితిక షేరు గ్లామర్ ఫోటోలు (ఫొటోలు) ‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ

ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) 2025-27 సైకిల్ ఫైనల్ రేస్ ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. మొత్తం 27 టెస్ట్ సిరీస్‌లలో ఇంకా 15 సిరీస్‌లు మిగిలి ఉన్నాయి. 2027 జూన్ 9 నుంచి 13 వరకు లండన్‌లోని 'ద ఓవల్' లో జరగనున్న టైటిల్ పోరుపైనే అన్ని జట్లు కన్నేశాయి. గత రెండు సైకిళ్ల లెక్కలు చూస్తే, ఏ జట్టు అయినా ఫైనల్ చేరాలంటే కనీసం 60% నుంచి 65% పాయింట్ల శాతం సాధించాల్సి ఉంటుంది. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని టీమిండియా ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో రెండు టెస్టుల సిరీస్ ఆడుతోంది. గాలేలో జరిగిన మొదటి టెస్టులో భారత్ 165 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ పాయింట్ల శాతంలో కాస్త మెరుగైంది. గత ఏడాది సొంతగడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో 0-2తో సిరీస్ ఓడిపోవడంతో భారత్ అవకాశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్ నుంచి భారత్ దాదాపు అవుట్ అయినట్లే అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు టీమిండియాకు మళ్లీ అవకాశం దక్కింది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత జట్టు ప్రస్తుతం 5వ స్థానంలో కొనసాగుతోంది. శ్రీలంకపై విజయం సాధించిన తర్వాత భారత్ పీసీటీలు పెగిగింది. ఇప్పటివరకు భారత్ మొత్తం 10 టెస్టులు ఆడింది. అందులో 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 4 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. దక్షిణాఫ్రికా చేతిలో రెండు, ఇంగ్లాండ్ చేతిలో రెండు మ్యాచ్‌ల్లో భారత్ ఓడిపోయింది. ఇంగ్లాండ్‌తో జరిగిన మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. భారత్‌కు ప్రస్తుతం శ్రీలంకతో ఆడాల్సిన రెండో టెస్టుతో కలిపి మొత్తం 8 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఆ తర్వాత న్యూజిలాండ్ పర్యటనలో భారత్ 2 టెస్టులు ఆడుతుంది. అనంతరం ఆస్ట్రేలియాతో స్వదేశంలో 5 టెస్టుల భారీ సిరీస్ ఆడాల్సి ఉంది. భారత్‌కు ఇప్పుడు ప్రతి మ్యాచ్ చాలా కీలకం. ఫైనల్ చేరేందుకు కావాల్సిన 60% PCT

Shubman Gill Comments on India Test Victory: తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన భారత్ 462 పరుగుల భారీ స్కోరు సాధించి మ్యాచ్‌పై పూర్తి పట్టు బిగించింది. ఫస్ట్ డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో అద్భుత సెంచరీ నమోదు చేశాడు. అనంతరం బౌలింగ్‌లో స్పిన్నర్ మానవ్ సుతార్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసి ప్రత్యర్థిని 284 పరుగులకే కట్టడి చేశాడు. దీంతో లభించిన 178 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో బరిలోకి దిగిన భారత్, రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులకు ఆలౌటైనా శ్రీలంక ముందు 372 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో లంక జట్టు 206 పరుగులకే కుప్పకూలడంతో భారత్ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. పడిక్కల్ క్లాస్.. మానవ్ సుతార్ స్పిన్ మ్యాజిక్.. మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ గిల్ మాట్లాడుతూ జట్టు ప్రదర్శనపై ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా స్పిన్నర్ మానవ్ సుతార్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అసాధారణ బౌలింగ్‌తో ప్రత్యర్థిని దెబ్బతీశాడని, అతనికి భారత జట్టులో గొప్ప భవిష్యత్తు ఉందని కొనియాడాడు. మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించడంతో పాటు రెండో ఇన్నింగ్స్‌లోనూ ప్రత్యర్థి స్పిన్నర్లపై పూర్తి ఆధిపత్యం చలాయించిన పడిక్కల్ ఆటతీరు అమోఘమని గిల్ పేర్కొన్నాడు. పడిక్కల్ ఇలాంటి స్థిరమైన ప్రదర్శన కొనసాగిస్తే జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకోవడం సులువవుతుందని వివరించాడు. ఎక్కువమంది చదివినది: IPL 2027: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. హార్దిక్ పాండ్యా సహా 8 మందికి గుడ్‌బై..? రెండో ఇన్నింగ్స్ వికెట్ల పతనంపై క్లారిటీ.. 600వ టెస్టు సంబరం.. రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు వరుసగా వికెట్లు కోల్పోవడంపై గిల్ వ్యూహాత్మక వివరణ ఇచ్చాడు. రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియని కారణంగా ప్రత్యర్థి ముందు వీలైనంత వేగంగా 400 పైచిలుకు లక్ష్యం ఉంచాలనే ఆలోచనతోనే బ్యాటర్లు దూకుడుగా ఆడారని స్పష్టం చేశాడు. అప్పటికే మ్యాచ్ భారత్ నియంత్రణలోనే

SL vs IND 2nd Test: కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టులో భారత తుది జట్టులో పెద్దగా మార్పులు ఉండే అవకాశం కనిపించడం లేదు. గాలే టెస్టులో భారత ఆటగాళ్లు సమష్టిగా రాణించి విజయాన్ని అందించడంతో టీమ్ మేనేజ్మెంట్ విన్నింగ్ కాంబినేషన్నే కొనసాగించాలని భావిస్తోంది. తొలి మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు మరో అవకాశం దక్కనుంది. అలాగే మిడిలార్డర్లో కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌లతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. బౌలింగ్ విభాగంలో కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ తమ స్థానాలను నిలబెట్టుకునే అవకాశం ఉంది. మ్యాచ్ డ్రా అయినా సిరీస్ భారత్ సొంతమవుతుంది కాబట్టి అదే జట్టుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. బెంచ్‌కే పరిమితం కానున్న నలుగురు ఆటగాళ్లు.. విన్నింగ్ టీమ్‌ను యథాతథంగా కొనసాగిస్తే జట్టులోని నలుగురు కీలక ఆటగాళ్లు రెండో టెస్టులోనూ రిజర్వ్‌గా మిగిలిపోనున్నారు. బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్, పేసర్లు ఆకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్ మరోసారి బెంచ్‌కే పరిమితం కాక తప్పదు. జట్టులోని ప్రధాన ఆటగాళ్లు ఫామ్‌లో ఉండటంతో వీరికి తుది జట్టులో అవకాశం దక్కే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎక్కువమంది చదివినది: IPL 2027: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. హార్దిక్ పాండ్యా సహా 8 మందికి గుడ్‌బై..? తొలి టెస్టులో అరంగేట్రం చేసి అద్భుత ప్రదర్శన కనబరిచిన యువ స్పిన్నర్ మానవ్ సుతార్, సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తమ స్పిన్ మ్యాజిక్‌తో శ్రీలంక బ్యాటర్లను కట్టడి చేశారు. పేస్ విభాగంలో మహ్మద్ సిరాజ్ తోడుగా ప్రసిద్ధ్ కృష్ణ వేగంతో రాణించనున్నారు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

గాలే క్రికెట్ స్టేడియంలో బుధవారం మధ్యాహ్నం 1:20 గంటల సమయంలో నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. వర్షం పడే సూచనలు స్పష్టంగా కనిపించాయి. దీంతో మ్యాచ్ డ్రాగానే ముగుస్తుందని అందరూ భావించారు. కానీ, అప్పుడు శ్రీలంకను కోలుకోలేని దెబ్బకొట్టాడు భారత యంగ్ ప్లేయర్. అద్భుతమైన బౌలంగ్ తో భారత యంగ్ స్పిన్నర్ మానవ్ సుతార్ మ్యాచ్ ను ముగించాడు. వర్షం పడటానికి సరిగ్గా ఐదు నిమిషాల ముందు, సుతార్ భారత్ టీమ్ కు అద్భుతమైన సెలబ్రేషన్స్ అందించాడు. విదేశీ గడ్డపై తనకు తొలి 6 వికెట్ల హాల్ అందించిన మ్యాచ్ విన్నింగ్ బంతిని తీసుకున్నాడు. కేషర నువాంతను క్లీన్ బౌల్డ్ చేసి భారత్‌కు 165 పరుగుల భారీ విజయాన్ని అందించాడు. టెస్ట్ మ్యాచ్ ఐదో రోజు బ్యాటర్ల ముందు కొన్ని కఠినమైన ప్రశ్నలు ఉంటాయి. ఎంతసేపు క్రీజులో నిలబడగలరు? అవుట్‌సైడ్ ఎడ్జ్ కాకుండా బంతిని ఎలా మిస్ చేయాలి? డిఫెన్సివ్ మైండ్‌సెట్‌తో రోజంతా బ్యాటింగ్ చేయడం సాధ్యమేనా? ఇవన్నీ ఆలోచిస్తేనే ఏ బ్యాటర్‌కైనా ఒత్తిడి పెరుగుతుంది. పాజిటివ్ నోట్‌తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన ధనంజయ డిసిల్వా, సోనాల్ దినూష మొదట్లో బాగానే నిలబడ్డారు. పిచ్‌పై స్పిన్‌కు పెద్దగా తిరుగుడు లేకపోవడంతో బ్యాటింగ్ చేయడం కాస్త ఈజీగానే అనిపించింది. రోజు ప్రారంభమయ్యే సమయానికి బంతి 34 ఓవర్ల పాతదిగా, కాస్త సాఫ్ట్‌గా మారింది. లంకకు ఇది కాస్త హోప్స్ ఇచ్చింది. మొదటి ఇన్నింగ్స్‌లో కూడా 90 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన సమయంలో పాత బంతితోనే కోలుకున్నారు. ఈసారి కూడా అదే రిపీట్ చేస్తే భారత్‌ను ఇబ్బంది పెట్టవచ్చని అనుకున్నారు. మొదటి గంటన్నర పాటు శ్రీలంక ప్లాన్ ప్రకారమే ముందుకు సాగింది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో ధనంజయ డిసిల్వా స్పిన్‌ను సరిగ్గా ఆడలేక రెండుసార్లు మాత్రమే పొరపాటు చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో జడేజా బౌలింగ్‌లో స్లిప్‌లో క్యాచ్ ఇచ్చాడు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా అదే తప్పు

టీమిండియా డ్రెసింగ్ రూమ్ వాతావరణంపై తాజాగా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా డ్రెస్ రూమ్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని, ఇక్కడ నేర్చుకునే విషయంలో ఆటగాళ్లకు సిగ్గు, అహంభావం వంటివి లేవని తెలిపాడు. స్పోర్ట్స్ డెస్క్: శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 10 వికెట్లు సాధించిన యువ స్పిన్నర్ మానవ్ సుతర్ టీమిండియా విజయంలో కీలక పాత్ర షోపించాడు. అతడి పాటు బ్యాటింగ్ విభాగంలో దేవదత్ పటిక్కల్, కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణించి.. భారత్ విజయంలో తమవంతు పాత్ర పోషించారు. మ్యాచ్ అనంతరం టీమిండియా డ్రెసింగ్ రూమ్ పరిస్థితులపై తాజాగా రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా డ్రెస్ రూమ్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని, ఇక్కడ నేర్చుకోవడంలో సిగ్గు, అహంభావం వంటివి లేవని తెలిపాడు. మీడియాతో రాహుల్ మాట్లాడుతూ...'దేవదత్ పడిక్కల్, మానవ్ సుతార్ వంటి యువ ఆటగాళ్లు తక్కువ సమయంలో అద్భుత ప్రదర్శన చేసి.. మంచి గుర్తింపు సంపాదించడం చూసి ఒక సీనియర్ ఆటగాడిగా నేను ఎంతో సంతోషించాను. భారత డ్రెస్సింగ్ రూమ్ ఒక స్వేచ్ఛా యుతమైన వాతావరణంగా ఉంటుంది. ఇక్కడ ఆటగాళ్లను స్వేచ్ఛగా మాట్లాడటానికి, వారి అభిప్రాయాలను వ్యక్తపర్చడానికి అవకాశం ఉంటుంది. వయస్సుతో ఆడిన మ్యాచులతో సంబంధం లేకుండా తోటి ఆటగాళ్లకు సహాయం చేయడం ప్రతి ప్లేయర్ బాధ్యత అని నేను భావిస్తున్నాను' అని రాహుల్ అన్నాడు. 'కొన్ని సందర్భాల్లో మా జట్టులో సీనియర్ ప్లేయర్లు, తక్కువ మ్యాచులు ఆడిన జూనియర్ ఆటగాళ్లు ఉంటారు. ఆ సమయంలో 'నేను నీ దగ్గర ఏమీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు' అని సీనియర్ ఆటగాళ్లు , 'అతను చాలా టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు కాబట్టి నేను వెళ్లి అతనితో మాట్లాడలేను' అని యువ ఆటగాళ్లు ఏదైనా చెప్పేందుకు సంకోచించరు. మా ఆటగాళ్ల మధ్య ఎటువంటి సిగ్గు లేదా అహంభావం

IND vs SL: గాలే వేదికగా జరిగిన మొదటి టెస్టులో భారత్ మూడు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్ ఈ విభాగాన్ని నడిపించారు. యంగ్ స్పిన్నర్ మానవ్ సుతార్ అద్భుత ప్రదర్శనతో ఏకంగా 10 వికెట్లు తీసి మ్యాచ్ విజేతగా నిలిచాడు. జడేజా రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 4 వికెట్లు పడగొట్టాడు. తిరుగులేని స్పిన్ పిచ్‌పై కూడా కుల్దీప్ యాదవ్ మాత్రం పూర్తిగా ప్రభావం చూపలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 25 ఓవర్లు బౌలింగ్ చేసిన కుల్దీప్ 103 పరుగులిచ్చి కేవలం ఒకే ఒక్క వికెట్ మాత్రమే తీసుకోగలిగాడు. ఇండియా టుడే నివేదికల ప్రకారం ఆగస్టు 23 నుంచి కొలంబోలో ప్రారంభమయ్యే రెండో టెస్టు మ్యాచ్‌లో కుల్దీప్ స్థానంలో సారాంశ జైన్‌కు అవకాశం ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 33 ఏళ్ల ఈ మధ్యప్రదేశ్ ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్‌ను తుది జట్టులోకి తీసుకోవడం ద్వారా లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ బలాన్ని కూడా పెంచవచ్చని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. సారాంశ జైన్ తన అంతర్జాతీయ అరంగేట్రాన్ని ఎదురుచూస్తున్న తరుణంలో ఈ వార్త క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేపుతోంది. ఇది కూడా చదవండి: SL vs IND 2nd Test: ఆ రూల్ ఎఫెక్ట్.. 2వ టెస్ట్ కు ముందే ఊహించని షాక్.. ఏకంగా ముగ్గురు ఔట్..! మధ్యప్రదేశ్‌కు చెందిన సారాంశ జైన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో 188 వికెట్లు పడగొట్టడమే కాకుండా బ్యాట్‌తో 2223 పరుగులు సాధించాడు. అతని ఖాతాలో 2 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2021-22 సీజన్లో మధ్యప్రదేశ్ రంజీ ట్రోఫీ విజేతగా నిలవడంలో సారాంశ కీలక పాత్ర పోషించాడు. ఆ సీజన్లో 13 వికెట్లు తీయడంతో పాటు ఫైనల్లో 57 పరుగుల అమూల్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాతి సీజన్లో 360 పరుగులు

Kuldeep Yadav Bowling Stats: శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత బౌలర్లు సమిష్టిగా రాణించినప్పటికీ, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ప్రత్యర్థి బ్యాటర్లను బోల్తా కొట్టించడంలో అతడు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తున్న సమయంలోనూ కుల్దీప్ తన మాయాజాలాన్ని ప్రదర్శించలేక చేతులెత్తేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో అతడు 14 ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 65 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడి ఎకానమీ రేటు 4.64గా నమోదు కావడం గమనార్హం. టెస్టు ఫార్మాట్లో ఒక స్పిన్నర్ ఇంత భారీగా పరుగులు ఇచ్చుకోవడం జట్టు యాజమాన్యాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అతడి బౌలింగ్‌ను శ్రీలంక బ్యాటర్లు చాలా సులువుగా ఎదుర్కొన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో చేసిన తప్పుల నుంచి కుల్దీప్ యాదవ్ ఏమాత్రం పాఠాలు నేర్చుకోలేదు. రెండో ఇన్నింగ్స్‌లో అతడి ప్రదర్శన మరింత నిరాశపరిచింది. మ్యాచ్ నిర్ణయాత్మక దశకు చేరుకున్న సమయంలో అతడు 11 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఇందులో 3.45 ఎకానమీతో 38 పరుగులు ఇచ్చాడు కానీ, ఒక్క బ్యాటర్‌ను కూడా పెవిలియన్ పంపలేకపోయాడు. ఒకవైపు మిగతా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు విసురుతుంటే, కుల్దీప్ మాత్రం శ్రీలంక ఆటగాళ్లకు ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నాడు. వికెట్ల వేటలో విఫలమవడమే కాకుండా ఇలా పరుగులు సమర్పించుకోవడం మైదానంలో జట్టుపై తీవ్ర ఒత్తిడి పెంచింది. ఎక్కువమంది చదివినది: IPL 2027: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. హార్దిక్ పాండ్యా సహా 8 మందికి గుడ్‌బై..? ఈ పేలవ ప్రదర్శన నేపథ్యంలో కుల్దీప్ యాదవ్ స్థానానికి తీవ్ర ముప్పు వాటిల్లింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, శ్రీలంకతో త్వరలో జరగనున్న రెండో టెస్టు తుది జట్టు నుంచి అతడిని తప్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పిచ్ పరిస్థితులను అర్థం చేసుకోవడంలో అతను పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో బెంచ్‌పై ఉన్న ఇతర స్పిన్నర్లకు

భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగనున్న మూడు మ్యాచ్ టీ20 సిరీస్ క్రికెట్ ప్రసారంలో కొత్త అనుభూతిని అందించనుంది. 2026 FIFA వరల్డ్ కప్‌లో ఉపయోగించిన అధునాతన ప్రసార సాంకేతికతలను ఈ సిరీస్‌లో తొలిసారిగా పూర్తి స్థాయిలో ఉపయోగించనున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ఈ సిరీస్‌కు అధికారికంగా ఆతిథ్య జట్టు అయినప్పటికీ, మ్యాచ్‌లు భారత్‌లోని ఢిల్లీలో జరగనున్నాయి. ఈ సిరీస్‌ను FIFA వరల్డ్ కప్ హోస్ట్-బ్రాడ్కాస్ట్ ప్రమాణాలతో రూపొందించనున్నట్లు ప్రసార హక్కులు కలిగిన ITW Universe వెల్లడించింది. FIFA వరల్డ్ కప్ మ్యాచ్‌లను, అలాగే పలు UEFA ఛాంపియన్స్ లీగ్ ఫైనల్స్‌ను డైరెక్ట్ చేసిన జేమీ ఓక్‌ఫోర్డ్ ఈ సిరీస్ ప్రసారానికి దర్శకత్వం వహించనున్నారు. ఆయన 2002 నుంచి ప్రతి FIFA వరల్డ్ కప్‌ను కవర్ చేశారు. ప్రసారంలో AI-స్టెబిలైజ్డ్ POV కెమెరాలు, వాల్యూమెట్రిక్ ఫ్రీ-వ్యూపాయింట్ టెక్నాలజీ, అధునాతన Spidercam, Ultra-Motion కెమెరాలు, సినీ-స్టైల్ విజువల్స్ వంటి సాంకేతికతలు ఉపయోగించనున్నారు. ఇవే కాకుండా Quidich Innovation Labsకు చెందిన Spatio సిస్టమ్ ద్వారా స్టెబిలైజ్డ్ డ్రోన్ ఫీడ్‌పై బ్రాడ్కాస్ట్-గ్రేడ్ ఆగ్మెంటెడ్ రియాలిటీ గ్రాఫిక్స్‌ను చూపించనున్నారు. మరో ప్రత్యేక Ultra-Slow-Motion కెమెరా సెకనుకు 600 ఫ్రేమ్‌ల వేగంతో బంతి, ఎడ్జ్‌లు, షాట్లు వంటి కీలక క్షణాలను రికార్డ్ చేయనుంది. ప్రస్తుతం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మూడు టీ20లు సెప్టెంబర్ 13 నుంచి 17 మధ్య ఢిల్లీలో జరగాల్సి ఉంది. అయితే గణేశ్ చతుర్థి కారణంగా షెడ్యూల్లో స్వల్ప మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొత్తంగా, ఈ సిరీస్ క్రికెట్ మ్యాచ్‌ను టీవీలో చూసే అనుభూతిని FIFA వరల్డ్ కప్ స్థాయి విజువల్ ప్రొడక్షన్‌కు తీసుకెళ్లే తొలి ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌గా నిలవనుంది. కొండను తొలిచి కట్టిన అద్భుత గుహాలయం..ఎక్కడో తెలుసా? (ఫొటోలు) సాంప్రదాయ దుస్తులులో మెరిసిన ముద్దుగుమ్మ అదా శర్మ..(ఫోటోలు) కేబీఆర్ ట్రాఫిక్ ‘ట్రాప్’.. ఎటు వెళ్లాలో తెలియక జనం పరేషాన్!(చిత్రాలు) చీరకట్టులో మంత్రముగ్ధం చేస్తున్న శ్రీలీల అందం ...(ఫొటోలు)

IND vs SL: గాలే వేదికగా జరిగిన మొదటి టెస్టులో భారత్ చేతిలో 165 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న శ్రీలంకకు ఆ తర్వాతి రోజే కోలుకోలేని షాక్ తగిలింది. ఆగస్టు 23 నుంచి జరగబోయే ఆఖరి టెస్టుకు జట్టులోని కీలక ప్లేయర్లు అందుబాటులో లేకుండా పోయారు. ఇప్పటికే గాయాలతో ఇబ్బంది పడుతున్న కుసల్ మెండిస్, పథుమ్ నిస్సాంక బాటలోనే సీనియర్ బ్యాటర్ దినేష్ చండీమాల్ కూడా రెండో టెస్టు నుంచి తప్పుకున్నట్లు హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ అధికారికంగా ప్రకటించారు. తొలి టెస్టులో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో దినేష్ చండీమాల్ తల, మెడ భాగానికి తీవ్ర గాయమైంది. గ్రౌండ్‌లోనే తీవ్ర అస్వస్థతకు గురికావడంతో అతడి స్థానంలో పాసిందూ సూర్యబండారను కన్కషన్ సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి దించారు. ఇదే క్రమంలో పాసిందూ టెస్టు అరంగేట్రం కూడా జరిగింది. గాయం తీవ్రత తగ్గకపోవడంతో వైద్యుల సలహా మేరకు చండీమాల్ను రెండో టెస్టు నుంచి తప్పించారు. అతడితో పాటు తొడకండరాల గాయంతో బాధపడుతున్న కుసల్ మెండిస్, మణికట్టు గాయంతో ఉన్న ఓపెనర్ పథుమ్ నిస్సాంక ఈ మ్యాచ్‌కు పూర్తిగా దూరమయ్యారు. గాయాలపై హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ స్పందిస్తూ మీడియాకు కీలక విషయాలు వెల్లడించారు. "కుసల్ మెండిస్ తొడకండరాల గాయంతో బాధపడుతున్నాడు, అతడు కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. చండీమాల్ కూడా తదుపరి టెస్టుకు అందుబాటులో లేడు. సీనియర్ ఆటగాళ్లను మిస్ అవ్వడం జట్టుకు పెద్ద లోటే అయినప్పటికీ, ఇది యువ ఆటగాళ్లకు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి లభించిన అద్భుతమైన అవకాశం" అని కిర్‌స్టన్ పేర్కొన్నారు. మొదటి టెస్టులో భారత జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దుమ్మురేపింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగుల భారీ స్కోరు సాధించింది. దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో అద్భుత శతకంతో మెరిశాడు. అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌట్ కాగా, భారత

Mohammed Siraj Injury: బుమ్రా విశ్రాంతి తీసుకోవడంతో లంక పర్యటనలో పేస్ బాధ్యతలను సిరాజ్ తన భుజాలపై వేసుకున్నాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కోచ్ గంభీర్ కేవలం ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగారు. అయితే మ్యాచ్‌లో సిరాజ్ బౌలింగ్ వేగం సాధారణం కంటే చాలా తక్కువగా నమోదు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఐదో రోజు తొలి సెషన్లో అతను కేవలం మూడు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. ఆ సమయంలో అతని అత్యధిక వేగం 132.8 కిలోమీటర్లు మాత్రమే కావడం గమనార్హం. మ్యాచ్ మొత్తం మీద సగటున 126 కిలోమీటర్ల వేగంతోనే బంతులు విసిరాడు. దీన్ని బట్టి అతను వంద శాతం ఫిట్‌గా లేడని, ఏదో నొప్పితో బాధపడుతున్నాడని దొడ్డ గణేశ్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. మామూలుగా అయితే సిరాజ్ ఇంత నెమ్మదిగా బౌలింగ్ చేయడని ఆయన గుర్తుచేశారు. సిరాజ్ ఫిట్‌నెస్‌పై వస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు నేషనల్ క్రికెట్ అకాడమీ (ప్రస్తుత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్), బీసీసీఐ మెడికల్ టీమ్ పనితీరును బోనులో నిలబెడుతున్నాయి. శ్రీలంక పర్యటనకు వెళ్లే ముందు సిరాజ్ చాలా రోజుల పాటు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోనే గడిపాడు. అప్పుడే అతని గాయం గురించి వైద్యులకు తెలియలేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు దూరంగా ఉంటున్న ఈ స్టార్ బౌలర్ కెరీర్‌ను ప్రమాదంలో పడేసేలా మేనేజ్మెంట్ వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎక్కువమంది చదివినది: IPL 2027: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. హార్దిక్ పాండ్యా సహా 8 మందికి గుడ్‌బై..? Is Siraj carrying a niggle? This isn’t the pace he usually bowls #SLvIND — Dodda Ganesh | ದೊಡ್ಡ ಗಣೇಶ್ (@doddaganesha) August 19, 2026 గాలే టెస్టులో స్పిన్నర్లు రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్ అద్భుతంగా రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో

India vs Sri Lanka 1st Test : శ్రీలంక జట్టుతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 372 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక 206 పరుగులకే ఆలౌట్ కావడంతో.. భారత జట్టు 165 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో టీమిండియా రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 462 పరుగులు చేసింది. శ్రీలంక 284 పరుగులు మాత్రమే చేయగలిగింది. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 193 పరుగులు చేసి.. శ్రీలంక జట్టుకు 372 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే, లంక బ్యాటర్లు లక్ష్య ఛేదనలో విఫలమయ్యారు. కేవలం 206 పరుగులు మాత్రమే చేయగలిగారు. శ్రీలంక జట్టు ఓటమిలో టీమిండియా యువ స్పిన్నర్ మానవ్ సుతార్ కీలక భూమిక పోషించాడు. తొలి ఇన్నింగ్స్ లో నాలుగు పడగొట్టిన సుతార్.. రెండో ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు పడగొట్టాడు.. మొత్తంగా రెండు ఇన్నింగ్స్ లలో కలిపి 10 వికెట్లు పడగొట్టి శ్రీలంక బ్యాటర్లు భారీ పరుగులు చేయకుండా తన స్పిన్ మాయాజాలంతో అడ్డుకట్ట వేశాడు

Yashasvi Jaiswal Test Career: శ్రీలంకతో గాలేలో జరుగుతున్న తొలి టెస్టులో యశస్వి జైస్వాల్ నుంచి టీమిండియా ఆశించిన ఇన్నింగ్స్ రాలేదు. రెండు ఇన్నింగ్స్‌లను కలిపి అతడు 32 పరుగులు మాత్రమే చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగులు చేసిన యశస్వి, రెండో ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. మొదటి ఇన్నింగ్స్‌లో నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో బౌలర్‌తో ఢీకొన్న సందర్భంలో రనౌట్‌గా పెవిలియన్ చేరడం అతడి ఇన్నింగ్స్‌ను ముగించింది. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం సాధారణ బంతికి వికెట్ సమర్పించుకున్నాడు. కీలక టెస్టు సిరీస్‌లో ఓపెనర్ నుంచి పెద్ద ఇన్నింగ్స్ ఆశించిన వేళ ఈ ప్రదర్శన టీమ్ మేనేజ్మెంట్కు ఆందోళన కలిగించే అంశంగా కనిపిస్తోంది. గాల్ టెస్టుకు ముందు కూడా యశస్వి ఫామ్‌పై ప్రశ్నలు ఉన్నాయి. అఫ్గానిస్థాన్‌తో ముల్లాంపూర్‌లో జరిగిన టెస్టులో అతడు 24 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 83 పరుగులు మాత్రమే సాధించాడు. ఆ సిరీస్‌లో ఒక అర్ధశతకం మాత్రం అతడి ఖాతాలో ఉంది. ఎక్కువమంది చదివినది: SL vs IND: రిషబ్ పంత్ @ 100.. ప్రపంచ క్రికెట్లో ఎవరికీ సాధ్యంకాని రికార్డులో మనోడు..! ఇలా గత మ్యాచ్‌లతో కలిపి ఏడు ఇన్నింగ్స్‌ల్లో ఒక్క అర్ధశతకం మాత్రమే రావడం యశస్వి టెస్టు స్థానంపై చర్చకు కారణమవుతోంది. టెస్టు క్రికెట్లో భారత జట్టు ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనలపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ దృష్టి సారించినట్లు మూల సమాచారం పేర్కొంటోంది. భారత్, శ్రీలంక రెండో టెస్టు ఆగస్టు 23న కొలంబోలో ప్రారంభం కానుంది. అక్కడ యశస్వి బ్యాట్‌తో ప్రభావం చూపకపోతే అతడి టెస్టు భవిష్యత్‌పై టీమ్ మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. ఎక్కువమంది చదివినది: వైభవ్ సూర్యవంశీ కంటే నేనే తోపు అన్నాడు.. కట్‌చేస్తే.. మైదానంలోనే పరువు పోగొట్టుకున్నాడుగా..! యశస్వి జైస్వాల్‌కు కోలంబో టెస్టు ఎంతో కీలకంగా

Manav Suthar Pitch Complaint: గాలే టెస్టులో శ్రీలంక ముందు భారత్ 372 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. తొలి ఇన్నింగ్స్‌లో వచ్చిన భారీ ఆధిక్యం కారణంగా టీమిండియా ఇప్పుడు మ్యాచ్‌పై పట్టు సాధించింది. ఈ క్రమంలో భారత రెండో ఇన్నింగ్స్ 193 పరుగులకే ముగిసింది. శ్రీలంక నాలుగో ఇన్నింగ్స్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండటంతో పిచ్ పరిస్థితులు ఆ జట్టుకు కీలకంగా మారాయి. ఇలాంటి సమయంలో భారత ఆటగాడు మానవ్ సుతార్ చేసిన ఓ చర్యపై శ్రీలంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా అభ్యంతరం వ్యక్తం చేశాడు. సుతార్ ఒక పరుగు కోసం పరిగెత్తే సమయంలో పిచ్ మధ్య భాగంలో అడుగులు వేశాడని ధనంజయ అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన గాలే టెస్టులో కొత్త చర్చకు దారితీసింది. క్రికెట్లో బ్యాటర్లు సాధారణంగా హాఫ్ స్పైక్స్ ధరిస్తారు. పిచ్ మధ్యలో పరుగెత్తడం వల్ల వారి బూట్ల ముద్రలతో ఆ ప్రాంతం దెబ్బతినే అవకాశం ఉంటుంది. దాంతో తర్వాత బ్యాటింగ్ చేసే ఆటగాళ్లకు పరిస్థితులు మరింత కఠినంగా మారవచ్చు. ఎక్కువమంది చదివినది: 59 ఫోర్లు, 1 సిక్స్.. ఒకే ఇన్నింగ్స్‌లో 451 పరుగులతో బీభత్సం.. ప్రపంచ రికార్డ్‌నే షేక్ చేసిన దిగ్గజాలు..! శ్రీలంక నాలుగో ఇన్నింగ్స్ ఆడాల్సి ఉండటంతోనే ధనంజయ ఈ విషయంపై అంపైర్ వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. మ్యాచ్‌లో పిచ్‌ను కావాలనే దెబ్బతీసే ప్రయత్నం జరిగిందా అనే అంశాన్ని అంపైర్లు పరిశీలిస్తారు. పిచ్‌ను దెబ్బతీసేలా బ్యాటర్ ప్రవర్తిస్తే అంపైర్ తొలుత హెచ్చరిక ఇస్తాడు. ఆ హెచ్చరిక మొత్తం ఇన్నింగ్స్‌కు వర్తిస్తుంది. ఆ తర్వాత అదే చర్య మళ్లీ జరిగితే, ఆ బంతికి వచ్చిన పరుగులను రద్దు చేసి ఫీల్డింగ్ జట్టుకు 5 అదనపు పరుగులు ఇచ్చే నిబంధన కూడా ఉంది. మ్యాచ్ పరిస్థితులు మాత్రం భారత్‌కు అనుకూలంగా కనిపిస్తున్నాయి. గాలేలో శ్రీలంక ఇప్పటివరకు నాలుగో ఇన్నింగ్స్‌లో 300 పరుగులు కూడా చేయలేదు

భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు టీమిండియా ఆటగాడు ధ్రువ్ జురెల్ పట్టిన ఓ క్యాచ్ వివాదానికి దారితీసింది. శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో లహిరు ఉదారాను ఔట్ చేసేందుకు అతడు తీసుకున్న లో క్యాచ్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. శ్రీలంక ఇన్నింగ్స్‌లో 22వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. భారత స్పిన్నర్ మానవ్ సుతార్ వేసిన బంతిని ఉదారా డిఫెన్స్ చేయబోయాడు. అయితే బంతి బ్యాట్ అంచుకు తగిలి గల్లీ దిశగా వెళ్లింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న జురెల్ అద్భుతంగా కిందకు డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. అయితే బంతి నేరుగా జురెల్ చేతిలో పడిందా..? లేక ముందుగా నేలను తాకిందా..? అనే అనుమానం తలెత్తింది. ఫీల్డ్ అంపైర్ క్యాచ్‌ను సమీక్ష కోసం థర్డ్ అంపైర్‌కు పంపాడు. రిప్లేలలో కూడా పరిస్థితి చాలా క్లిష్టంగా కనిపించింది. బంతి జురెల్ చేతుల్లోకి వెళ్లే సమయంలో నేలను తాకినట్లు కొందరికి అనిపించగా, మరికొందరు బంతి నేలను తాకకుండానే జురెల్ క్యాచ్ పూర్తి చేశాడని వాదించారు. చివరికి థర్డ్ అంపైర్ భారత్‌కు అనుకూలంగా నిర్ణయం ఇచ్చాడు. దీంతో లహిరు ఉదారా ఔట్‌గా వెనుదిరిగాడు. అంపైర్ నిర్ణయం వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. కొంతమంది అభిమానులు జురెల్ క్యాచ్‌ను అద్భుతమైనదిగా అభివర్ణించగా, మరికొందరు బంతి నేలను తాకిందని పేర్కొంటూ థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని ప్రశ్నించారు. లంక టార్గెట్ 372 తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేసిన భారత్.. శ్రీలంకను 284 పరుగులకుఆలౌట్ చేసి 174 పరుగుల ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 193 పరుగులకు ఆలౌటైంది. దీంతో శ్రీలంక ముందు 372 పరుగుల విజయలక్ష్యం నిలిచింది. విజయానికి 6 వికెట్ల దూరంలో భారత్ భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలవాలంటే

ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా డాషింగ్ ఆటగాడు రిషభ్ పంత్ చరిత్ర సృష్టించాడు. భారత టెస్టు చరిత్రలో అరుదైన రికార్డు నెలకొల్పిన తొలి బ్యాటర్‌గా ఘనత సాధించాడు. ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని ఫీట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. అదేనండి.. టెస్టుల్లో భారత్ తరఫున శత సిక్స్‌ల వీరుడిగా నిలిచాడు. శ్రీలంకతో జరుగుతోన్న తొలి టెస్టులో పంత్ 66 పరుగులు చేశాడు. ఇందులో రెండు సిక్స్‌లు ఉన్నాయి. దీంతో 100 సిక్స్‌లు కొట్టిన తొలి భారత బ్యాటర్‌గా అవతరించాడు. అతడి తర్వాత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ (90), రోహిత్ శర్మ (88) ఉన్నారు. ప్రస్తుతం భారత్ తరఫున ఆడుతున్నవారిలో రవీంద్ర జడేజా (82) మాత్రమే కాస్త దగ్గరగా ఉన్నాడు. యువ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్ (47), యశస్వి జైస్వాల్ (45)కు ఈ మార్క్‌ను అందుకొనే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా రిషభ్ పంత్ కంటే ముందు ముగ్గురు మాత్రమే ఈ ఫీట్‌ను సాధించారు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్ (122 టెస్టుల్లో 138 సిక్స్‌లు), బ్రెండన్ మెక్కల్లమ్ (101 మ్యాచుల్లో 108), ఆడమ్ గిల్‌క్రిస్ట్ (96 టెస్టుల్లో 100) వంద సిక్స్‌ల మైలురాయిని దాటారు. అత్యంత వేగంగా ఈ ఫీట్‌ను సాధించిన బ్యాటర్ మాత్రం రిషభ్ పంత్‌నే. అతడు కేవలం 51వ టెస్టుల్లోనే నమోదు చేశాడు. మున్ముందు మెక్కల్లమ్తోపాటు బెన్ స్టోక్స్ అత్యధిక సిక్స్‌ల రికార్డును పంత్ బద్దలు కొట్టేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. శ్రీలంకతో

Rishabh Pant: భారత టెస్ట్ క్రికెట్లో వికెట్ కీపర్ల పాత్ర ఎంతో కీలకమైనది. గతంలో ఎంఎస్ ధోనీ కీపర్‌గా 6 సెంచరీలు చేసి భారతదేశం తరఫున అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన వికెట్ కీపర్‌గా మొదటి స్థానంలో ఉండేవాడు. సుదీర్ఘ కాలం పాటు ఈ రికార్డు ధోనీ పేరిటే భద్రంగా ఉంది. అయితే రిషభ్ పంత్ తన ధనాధన్ బ్యాటింగ్‌తో ఏకంగా 8 సెంచరీలు నమోదు చేసి ధోనీని రెండో స్థానానికి నెట్టేశాడు. 2018లో టెస్ట్ అరంగేట్రం చేసిన పంత్, అతి తక్కువ కాలంలోనే జట్టులో కీలక సభ్యుడిగా మారాడు. ఒత్తిడి ఉన్న సమయంలో భయపడకుండా కౌంటర్ ఎటాక్ చేయడం పంత్ ప్రత్యేకత. మ్యాచ్ పరిస్థితికి తగినట్లుగా తన గేర్‌ను మారుస్తూ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే విధానం ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టింది. భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన వికెట్ కీపర్ల జాబితాను ఒకసారి పరిశీలిస్తే రిషభ్ పంత్ 8 సెంచరీలతో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఎంఎస్ ధోనీ 6 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. వృద్ధిమాన్ సాహా 3 సెంచరీలు సాధించగా, ఫరూక్ ఇంజనీర్, సయ్యద్ కిర్మాణీ చెరో 2 సెంచరీలు చేశారు. ఈ గణాంకాలను బట్టి పంత్ భారత కీపింగ్ విభాగంలో ఎంతటి భారీ జంప్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. ఇది కూడా చదవండి: Kavya Maran: గుసగుసలకు చెక్.. ఎట్టకేలకు అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి డేట్ ఫిక్స్.. వెడ్డింగ్ ఎక్కడంటే ? విదేశీ గడ్డపై చెలరేగుతున్న డాషింగ్ వికెట్ కీపర్ పంత్ బ్యాటింగ్ కేవలం సెంచరీల సంఖ్యకే పరిమితం కాలేదు. విదేశీ గడ్డ పై క్లిష్టమైన పరిస్థితుల్లో ఆయన ఆడిన ఇన్నింగ్స్‌లు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి సవాలుతో కూడిన మైదానాల్లోనూ బౌలర్లను బెదరగొడుతూ పంత్ ఆడిన తీరు క్రీడాభిమానులను అలరించింది. 2025లో ఇంగ్లాండ్‌తో హెడింగ్లేలో జరిగిన టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేసి, ఒకే


భారత క్రికెట్లో రవీంద్ర జడేజాకు వారసుడు వచ్చేశాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్ మొదటి మ్యాచ్‌లోనే సత్తా చాటాడు. ఏంటి అతడి రెండో టెస్టుకే ఓ నిర్ణయానికొచ్చేస్తారా? అనే సందేహం రాకమానదు. కానీ, టాలెంట్ ఉన్న ఆటగాడిని గుర్తించడానికి మరీ ఎక్కువ సమయం అవసరంలేదు కదా.. ఆ జాబితాలో చేరే బౌలర్ కమ్ బ్యాటర్ మానవ్ సుతార్(Manav Suthar). శ్రీలంకతో మొదటి టెస్టు (India vs Srilanka) తొలి ఇన్నింగ్స్‌లో ఫస్ట్ బంతికే వికెట్ తీసి తన ఉద్దేశం ఏంటో మానవ్ సుతార్ స్పష్టం చేశాడు. ఆ తర్వాత కూడా లంక బ్యాటర్లను కుదురుకోనీయలేదు. నాలుగు వికెట్లు తీసి సత్తా చాటాడు. అంతకుముందు బ్యాటింగ్‌లోనూ విలువైన 24 పరుగులు (43 బంతులు) రాబట్టాడు. ఇక వార్మప్ మ్యాచ్‌లోనూ లోయర్ ఆర్డర్లో పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రవీంద్ర జడేజాలా మరో నాణ్యమైన స్పిన్ ఆల్‌రౌండర్ దొరికాడంటూ ప్రశంసలు అందుకొంటున్నాడు. ఎప్పుడో టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన జడేజా (Ravindra Jadeja) టెస్టులు, వన్డేల్లోనే కొనసాగుతున్నాడు. ప్రస్తుతం జడ్డూ వయసు 37 ఏళ్లు. మరో రెండు లేదా మూడేళ్ల వరకు మాత్రమే టెస్టులు ఆడగలడు. అతడి స్థానాన్ని భర్తీ చేయగల సమర్థత సుతార్‌లో ఉందనేది మాజీల వాదన. ఈ కుర్రాడి నైపుణ్యాలకు పదునుపెడితే మరింత రాటుదేలడం ఖాయం. ఇటీవల కాలంలో అంతర్జాతీయంగా స్పిన్‌ను ఆడటంలో బ్యాటర్లు ఆరితేరారు. వారిని బోల్తా కొట్టించాలంటే ప్రత్యేకమైన శైలి ఉండాలి. అలాంటి బౌలర్ సుతార్ (Suthar Bowling) అనడంలో సందేహం లేదు. ప్లైటెడ్ డెలివరీలను సంధించి ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెడతాడు. ఆడదామా.. వద్దా అనే అనుమానం కలిగిస్తాడు. ఇలాంటిదే శ్రీలంకపై తన తొలి బంతికే వికెట్ తీసి అబ్బురపరిచాడు. చండిమాల్ డిఫెన్స్ ఆడేద్దామని అనుకొనేలోపే బంతి గ్లౌవ్స్‌ను తాకుతూ కీపర్ చేతిలో పడింది. ఆడుతోంది రెండో టెస్టు అయినాసరే.. ఓపికగా లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడే బౌలర్‌గా పేరొందాడు. బంతిని

Shubman Gill:భారత టెస్ట్ జట్టు సారథిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి శుభ్‌మన్ గిల్ ఆటగాడిగా నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. అయితే కెప్టెన్‌గా మైదానంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం తరచుగా విఫలమవుతున్నాడు. ప్రధానంగా డీఆర్ఎస్ (డిసిషన్ రివ్యూ సిస్టమ్) కోరే విషయంలో గిల్ నిర్ణయాలు జట్టును తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. మైదానంలో ఆవేశానికి లోనై లేదా బౌలర్ల ఒత్తిడికి తలొగ్గి రివ్యూలు కోరడం వల్ల విలువైన అవకాశాలు చేజారిపోతున్నాయి. గిల్ తన నాయకత్వ ప్రస్థానంలో ఇప్పటివరకు మొత్తం 41 సార్లు డీఆర్ఎస్ తీసుకున్నాడు. అందులో కేవలం 5 రివ్యూలు మాత్రమే అనుకూలంగా రావడం గమనార్హం. మిగిలిన 36 రివ్యూలు పూర్తిగా వ్యర్థమయ్యాయి. అంటే అతని డీఆర్ఎస్ సక్సెస్ రేటు అత్యంత ఘోరంగా ఉంది. శ్రీలంకతో జరుగుతున్న గాల్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో కూడా 30వ ఓవర్, 35వ ఓవర్లలో గిల్ తీసుకున్న నిర్ణయాలు నిరాశనే మిగిల్చాయి. చెరొక సమీక్షను వృథా చేయడంతో మూడింట్లో రెండు రివ్యూలు చేజారాయి. బౌలర్లు, కీపర్ సలహాలు రివర్స్ అవుతున్నాయా? డీఆర్ఎస్ కోరే సమయంలో గిల్ ఒక్కడే నిర్ణయం తీసుకోడు. బౌలర్, వికెట్ కీపర్, స్లిప్ ఫీల్డర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటాడు. అయినా సరే ఫలితం మాత్రం ప్రతికూలంగానే వస్తోంది. మైదానంలో బౌలర్ల ఆత్రుతను అదుపు చేసి, కీపర్ ఇచ్చే స్పష్టమైన సమాచారాన్ని విశ్లేషించడంలో కెప్టెన్‌గా గిల్ విఫలమవుతున్నాడనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ఆవేశంతో కాకుండా స్పష్టత ఉన్నప్పుడు మాత్రమే రివ్యూలు కోరడం అలవాటు చేసుకోవాలి. మాజీ కెప్టెన్లు మహేంద్రసింగ్ ధోని, రోహిత్ శర్మ లాంటి దిగ్గజాలు డీఆర్ఎస్ కోరడంలో సిద్దహస్తులుగా పేరుగాంచారు. ధోని రివ్యూ తీసుకుంటే వికెట్ ఖాయం అనే నమ్మకం ఉండేది. ఇప్పుడు గిల్ కూడా వారి నుంచి ఆ వ్యూహాత్మక ఆలోచనలను నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కీలక సమయాల్లో రివ్యూలు మిగిలి ఉంటేనే మ్యాచ్ మలుపు తిరిగే అవకాశం ఉంటుంది. రాబోయే మ్యాచ్‌ల్లో గిల్ ఈ

ఆగస్టు 18, 2008.. శ్రీలంకతో మ్యాచ్‌లో ఒక 19 ఏళ్ల కుర్రాడు 18వ నెంబర్ జెర్సీ మైదానంలో బరిలోకి దిగాడు. నునుగు మీసాలతో ఉన్న ఆ కుర్రాడు మ్యాచ్‌లో 22 బంతులాడి 12 పరుగులే చేసి ఔటయ్యాడు. అయితే ఆ కుర్రాడే భారత క్రికెట్‌ను ఏలబోతున్నాడన్న విషయం అతడితో సహా అక్కడున్న వారికి ఎవరికీ తెలియదు. కట్‌చేస్తే 18 ఏళ్లు తిరిగేసరికి అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లు (టెస్టు, వన్డే, టీ20లు) కలిపి 28,359 పరుగులు చేసి ఆల్‌టైమ్ అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇందులో 85 సెంచరీలు, 125 హాఫ్ సెంచరీలున్నాయి. వన్డే క్రికెట్లో సచిన్ టెండూల్కర్ సెంచరీల రికార్డును బద్దలు కొట్టిన ఆ వ్యక్తి ఎవరో కాదు.. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి. 18 ఏళ్ల ప్రయాణంలో కోహ్లి ఎన్నో మైలురాళ్లను అందుకున్నాడు. విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణం మొదలై ఇవాళ్టితో (ఆగస్టు 18) 18 సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కోహ్లి లక్కీ నంబర్ 18 అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతడు వేసుకునే జెర్సీ నెంబర్ 18.. ఐపీఎల్లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తొలి టైటిల్ సాధించింది 18వ ఎడిషన్‌లోనే కావడం విశేషం. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే కోహ్లికి 18వ సంఖ్య అంటే బాగా ఇష్టం. ఈ నేపథ్యంలో కోహ్లి 18 ఏళ్ల ప్రయాణంలో 18 అద్భుత క్షణాలను ఒకసారి గుర్తుకుతెచ్చుకుందాం. 1) తండ్రి మరణం 2006 రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో, 18 ఏళ్ల వయసులో విరాట్ కోహ్లి అసాధారణ ప్రతిభ కనబరుస్తున్నాడు. డిసెంబర్ 19న 40 పరుగులతో ఆడుతున్న సమయంలో తన తండ్రి మరణవార్త తెలిసినప్పటికీ కోహ్లి ఆ వార్తను దిగమింగి 90 పరుగులతో ఢిల్లీ జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు. 2) అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్ మలేషియాలోని కౌలాలంపూర్‌లోని వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన

రవీంద్ర జడేజా టెస్ట్ ఫార్మాట్లో 350 వికెట్లు సాధించి తన కెరీర్లో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. శ్రీలంకతో గాల్లో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో కుసాల్ నువాన్షాను అవుట్ చేయడం ద్వారా ఆయన ఈ మైలురాయిని చేరుకున్నారు. తన 90వ టెస్టులో జడేజా ఈ చారిత్రాత్మక మైలురాయిని నమోదు చేయడం విశేషం. 2012లో టెస్టు అరంగేట్రం చేసినప్పటి నుంచి జడేజా భారత జట్టుకు కీలక ఆల్‌రౌండర్‌గా సేవలు అందిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో సుదీర్ఘ అనుభవంతో ఆయన నిలకడగా రాణిస్తూ వస్తున్నారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఈ మైలురాయిని చేరుకున్న 5వ భారత బౌలర్‌గా జడేజా నిలిచారు. ఈ ఘనత సాధించిన భారత బౌలర్ల జాబితాలో అనిల్ కుంబ్లే 619 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా, రవిచంద్రన్ అశ్విన్ 537 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నారు. అలాగే కపిల్ దేవ్ 434 వికెట్లు, హర్భజన్ సింగ్ 417 వికెట్లతో వరుసగా తదుపరి స్థానాల్లో కొనసాగుతున్నారు. దీంతో భారత అత్యుత్తమ బౌలర్ల సరసన జడేజా చేరారు. మరోవైపు ప్రపంచ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే 4000 ప్లస్ పరుగులు మరియు 350 ప్లస్ వికెట్లు సాధించిన 4వ ప్లేయర్‌గా జడేజా రికార్డు సృష్టించారు. గతంలో కపిల్ దేవ్, డానియల్ వెట్టోరీ, ఇయాన్ బోథమ్ మాత్రమే ఈ అరుదైన మైలురాయిని అందుకోగలిగారు. పరుగుల పరంగానూ, వికెట్ల పరంగానూ జడేజా సాధించిన ఈ సమతుల్యత ఆయన అత్యుత్తమ ప్రతిభకు నిదర్శనం. ప్రస్తుతం జడేజా టెస్టుల్లో 4108 పరుగులు చేయడంతో పాటు 351 వికెట్లు తీసి తన ఆల్‌రౌండ్ విలువును మరోసారి నిరూపించుకున్నారు. శ్రీలంకపై సాధించిన ఈ విజయం భారత జట్టుకు కూడా ఎంతో ఊరటనిచ్చింది. రాబోయే మ్యాచ్‌లలోనూ ఆయన ఇదే ఫామ్‌ను కొనసాగించే అవకాశం ఉంది. ఈ చారిత్రాత్మక ప్రదర్శనతో జడేజా క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకరిగా స్థానం సుస్థిరం చేసుకున్నారు. మైదానంలో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ రాణిస్తూ

భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీకి అప్పట్లో జట్టులోని ప్లేయర్లు చుక్కలు చూపించారట! పాకిస్థాన్‌తో కీలక వన్డే సిరీస్‌కు ముందు డ్రెస్సింగ్ రూమ్‌లో దాదాపై చేసిన ఓ ప్రాంక్‌ను టీమిండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. ఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీకి అప్పట్లో జట్టులోని ప్లేయర్లు చుక్కలు చూపించారట! పాకిస్థాన్‌తో కీలక వన్డే సిరీస్‌కు ముందు డ్రెస్సింగ్ రూమ్‌లో దాదాపై చేసిన ఓ ప్రాంక్‌ను టీమిండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా గంగూలీని ప్రాంక్ చేయాలని యువరాజ్ సింగ్‌తో కలిసి ప్లాన్ చేసినట్లు వెల్లడించాడు. దాదాని ఏకంగా కెప్టెన్సీ నుంచి తప్పుకునేలా భయపెట్టామని చెప్పాడు. పాక్ సిరీస్‌కు ముందు జరిగిన ఈ విషయాన్ని భజ్జీ ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. ‘ఆ రోజు జట్టు మొత్తం డ్రెస్సింగ్ రూమ్‌లోనే ఉంది. ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా దాదాను ప్రాంక్ చేద్దామని యువరాజ్ ప్లాన్ వేశాడు. యువీ దాదా దగ్గరకు వెళ్లి ప్లాన్ అమలు చేశాడు.. ‘మీరు చేసిందేం బాలేదు. నన్ను పార్టీ యానిమల్ అన్నారు. హర్భజన్ గురించి కూడా తప్పుగా మాట్లాడారు. ఆశిష్ నెహ్రా, జహీర్ ఖాన్ కూడా మ్యాచ్‌లు ఆడటం కంటే ఎక్కువగా పార్టీలు చేసుకుంటారని మీడియా ముందు చెప్పారు. ఇలా చేయడం పద్ధతేనా?’ అని యువీ దాదాను ప్రశ్నించాడు. దీంతో గంగూలీ ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ‘నేనెప్పుడు అలా అన్నాను?’ అంటూ తిరిగి ప్రశ్నించాడు. మేం ముందే సిద్ధం చేసుకున్న తప్పుడు వార్తా క్లిప్పింగ్ అతడికి చూపించాం. దీంతో నిజంగానే అలా మాట్లాడానా? అని గంగూలీ ఆందోళన పడటం మొదలుపెట్టాడు’ అంటూ భజ్జీ వివరించాడు. ప్రాంక్‌ను మరింత రక్తి కట్టించేందుకు సీనియర్ ప్లేయర్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్‌లను కూడా రంగంలో దించినట్లు భజ్జీ వెల్లడించాడు. ‘ఈ విషయమంతా సచిన్ పాజీకి నేను ముందే చెప్పాను

ఐపీఎల్ 2027 సీజన్ ప్రారంభానికి ముందే లీగ్‌లో ఒక భారీ సంచలనం నమోదు కాబోతోంది. టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రాజస్థాన్ రాయల్స్ (RR) టీమ్‌ను వీడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జైస్వాల్‌ను వేరే టీమ్‌కు ట్రేడ్ చేయడానికి లేదా పూర్తిగా రిలీజ్ చేయడానికి రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నట్లు రిపోర్టులు బయటకు వచ్చాయి. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో జైస్వాల్‌ను ఎక్స్ఛేంజ్ చేసే దిశగా పెద్ద చర్చలు జరుగుతుండటం క్రికెట్ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. యశస్వి జైస్వాల్ ప్రవర్తన, ఆటిట్యూడ్ పట్ల రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం అస్సలు సంతృప్తిగా లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. మైదానంలో అతని ప్రదర్శన మాత్రమే కాకుండా, జట్టులోని అంతర్గత పరిస్థితులు కూడా ఈ నిర్ణయానికి కారణమయ్యాయి. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు సంజూ శాంసన్ సీఎస్కేకు ట్రేడ్ అయ్యాక, జైస్వాల్‌కు కప్టెన్సీ ఇస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఫ్రాంచైజీ రియాన్ పరాగ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. జైస్వాల్ వైస్ కెప్టెన్‌గా ఉన్నప్పటికీ, మే 2026లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాగ్ అందుబాటులో లేకపోవడంతో జైస్వాల్ జట్టును నడిపించాడు. అయితే మేనేజ్మెంట్తో ఏర్పడిన విభేదాలు అతని భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయి. బీహార్‌కు చెందిన 15 ఏళ్ల యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ అద్భుత ఫామ్‌తో దూసుకుపోవడం కూడా జైస్వాల్‌కు పెద్ద మైనస్‌గా మారింది. ఐపీఎల్ 2026 సీజన్లో వైభవ్ సూర్యవంశీ 16 మ్యాచుల్లో 237.30 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 776 రన్స్ సాధించాడు. ఆరెంజ్ క్యాప్, సూపర్ సిక్సెస్, సూపర్ స్ట్రైకర్ అవార్డులను కైవసం చేసుకుని రాజస్థాన్ రాయల్స్ పోస్టర్ బాయ్‌గా మారాడు. టాప్ ఆర్డర్లో నమ్మకమైన భారత ఓపెనర్‌గా వైభవ్ నిలదొక్కుకోవడంతో, జైస్వాల్‌ను పక్కన పెట్టడం రాజస్థాన్‌కు పెద్ద కష్టమేమీ కాదని ఫ్రాంచైజీ భావిస్తోంది. అదే సమయంలో జైస్వాల్ 2026 సీజన్ 16 మ్యాచుల్లో 30.50 సగటుతో 427