
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

అర్హులైన ఓటరు మిగలకూడదు.. అనర్హుడు ఓటరు జాబితాలో చేరకూడదని ఉన్నతాధికారులకు తెలంగాణ ఎన్నికల సంఘం సీఈవో సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఎన్నిక సంఘం కార్యాలయంలో ఎస్ఐఆర్(SIR)-2026పై ఆయన కీలక సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్, ఆగస్టు 19: అర్హులైన ఓటరు మిగలకూడదు.. అనర్హుడు ఓటరు జాబితాలో చేరకూడదని ఉన్నతాధికారులకు తెలంగాణ ఎన్నికల సంఘం సీఈవో సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఎన్నిక సంఘం కార్యాలయంలో ఎస్ఐఆర్(SIR)-2026పై ఆయన కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓలు, ఈఆర్ఓలతో సీఈవో సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని వారిని ఆదేశించారు. అనామలీస్, నో- మ్యాపింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. క్లెయిమ్స్, అభ్యంతరాలను సకాలంలో పరిష్కరించాలని సూచించారు. ఓటర్లకు నోటీసులు జారీ చేసి విచారణలు చేపట్టాలని తెలిపారు. ASDD జాబితాలోని కేసులను క్షుణ్ణంగా పరిశీలించాలని వారికి వివరించారు ఫారం 6, 6A, 7, 8పై క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారం చేయ్యాలన్నారు. ఓటర్లకు నోటీసుల వివరాలు బీఎల్వోలు స్పష్టంగా చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నో- మ్యాపింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని వారికి సీఈవో సుదర్శన్ రెడ్డి వివరించారు. కొండా సుస్మిత వ్యవహారంపై టీపీసీసీ సీరియస్ తివాచీని ఇలా కూడా ఉతుకుతారా? వీడియో వైరల్

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, ఉద్యమకారుడు, దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటు వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. నర్సంపేటలో ఉద్రిక్తతలకు కారణమైంది. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తర్వాత ఒక ప్రైవేటు భూమిలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విగ్రహ గద్దెను నిర్మించారు బిఆర్ఎస్ శ్రేణులు. అయితే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటే అనుమతి తీసుకోవాలని మున్సిపల్ అధికారులు ఆ గద్దెను కూల్చివేశారు.నర్సంపేటలో పొలిటికల్ హీట్ఆ తర్వాత మళ్లీ బిఆర్ఎస్ శ్రేణులు విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో, మున్సిపల్ అధికారులు మళ్ళీ విగ్రహాన్ని తొలగించారు. దీంతో నర్సంపేటలో పొలిటికల్ హీట్ పెరిగింది. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత నేతపెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించిన నేపథ్యంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దిష్టిబొమ్మను బిఆర్ఎస్ శ్రేణులు దగ్ధం చేశారు. భారీ ఎత్తున ధర్నాలు నిర్వహించారు.పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేత, బీఆర్ఎస్ రాస్తారోకో, నర్సంపేటలో ఉద్రిక్తత!నేడు నర్సంపేట బంద్మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కేటీఆర్, హరీష్ రావులు దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు చర్యను తీవ్రంగా ఖండించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని మున్సిపల్ అధికారులు తొలగించడంతో బిఆర్ఎస్ నేడు నర్సంపేట బంద్ కు పిలుపునిచ్చింది. ఈరోజు ఉదయం నుండి నర్సంపేటలోపెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపును నిరసిస్తూ బిఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీలు నిర్వహించడంతో నర్సంపేటలో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.నర్సంపేటలో 1500మంది పోలీసులతో భారీ బందోబస్తుఅవాంఛనీయ సంఘటనలు జరగకుండా నర్సంపేటలో 1500మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితిని వరంగల్ పోలీస్ కమిషనర్ పరిశీలిస్తున్నారు. నర్సంపేట కు తరలి వెళ్లడానికి ప్రయత్నం చేసిన బి ఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అయితే నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ శ్రేణులు దగ్ధం చేయడాన్ని కాంగ్రెస్

Narsampet: నర్సంపేట డివిజన్ బంద్ ప్రశాంతంగా ప్రైవేట్ స్కూళ్లు షాపులు బంద్ Narsampet: నర్సంపేటలో దివంగత మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ఏర్పాటు కోసం నిర్మించిన గద్దెను మున్సిపల్ అధికారులు తొలగించిన ఘటనపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు నిరసనగా బీఆర్ఎస్ నాయకుల పిలుపు మేరకు నర్సంపేట డివిజన్ బంద్‌కు వర్తక, వాణిజ్య, వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించాయి. దీంతో నర్సంపేటలో పలు దుకాణాలు, వ్యాపార, ప్రైవేటు స్కూలు,కాలేజీలు సంస్థలు మూసివేసి బంద్‌కు సంఘీభావం తెలిపారు
వరంగల్ జిల్లా నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. దివంగత మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని అధికారులు తొలగించడంతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నర్సంపేట మెడికల్ కాలేజీ సమీపంలో ఇటీవల ఏర్పాటు చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని మంగళవారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటల సమయంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య మున్సిపల్, రెవెన్యూ అధికారులు తొలగించినట్లు తెలుస్తోంది. విగ్రహాన్ని తొలగించడంతో పాటు గద్దెను కూడా నేలమట్టం చేశారు.విగ్రహం తొలగింపు నేపథ్యంలో నర్సంపేటలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. సుమారు 1500 మంది పోలీసులు నర్సంపేట పట్టణంలో బందోబస్తు నిర్వహించినట్లు స్థానికుల ద్వారా తెలుస్తోంది. ఇక విగ్రహం తొలగింపులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారని బీఆర్ఎస్ వర్గాలు ఆరోపించాయి. అక్కడికి ఎవరినీ అనుమతించకుండా పోలీసులు చర్యలు చేపట్టారని.. సంఘటన స్థలాన్ని పరిశీలించేందుకు మీడియాను కూడా పోలీసులు అనుమతించలేదని తెలుస్తోంది.నర్సంపేట మెడికల్ కాలేజీ ఎదురుగా ప్రభుత్వ అసైన్డ్ భూమిలో విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సంబంధిత అనుమతులు లేకుండా పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని అధికారులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మున్సిపల్, రెవెన్యూ అధికారులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించినట్లు సమాచారం. అయితే ఈ అంశంపై అధికారుల నుంచి పూర్తి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.విగ్రహం తొలగింపు విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు.. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి నర్సంపేటకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి ఎమ్మెల్సీ మధుసూదనాచారి నేతృత్వంలో నేతలు నర్సంపేటకు బయలుదేరగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అనంతరం ఎమ్మెల్సీ మధుసూదనాచారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.నర్సంపేటలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి విగ్రహాల రగడ తీవ్ర దుమారం రేపుతోంది. వరంగల్ జిల్లా నర్సంపేటలో రాత్రి వేళ ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే, దివంగత బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని పోలీసులు, మున్సిపల్ అధికారులు కలిసి తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తొలగించారు. ఈ క్రమంలో పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏకంగా 1,500 మందికి పైగా పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేయడంతో స్థానికంగా హైటెన్షన్ నెలకొంది. రాత్రి ఒంటిగంట దాటిన తర్వాత నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాల పరిసరాలు, పాకాల రోడ్డు వైపు పెద్ద ఎత్తున భద్రతా బలగాలు మోహరించాయి. విగ్రహ తొలగింపు ప్రక్రియను అత్యంత గోప్యంగా నిర్వహించారు. విగ్రహంతో పాటు దాన్ని ప్రతిష్ఠించిన సిమెంటు గద్దెను కూడా కూల్చివేసి, ఆ వ్యర్థాలను అక్కడి నుంచి దూరంగా తరలించారు. ఈ ఆపరేషన్ ఎంత సీక్రెట్‌గా జరిగిందంటే.. అక్కడే డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బందిని సైతం సెల్ ఫోన్లు ఉపయోగించవద్దని ఉన్నతాధికారులు కఠిన ఆంక్షలు విధించారని సమాచారం. ఈ సమాచారం తెలుసుకుని అక్కడకు చేరుకునేందుకు యత్నించిన బీఆర్ఎస్ శ్రేణులను దారిలోనే అడ్డుకున్నారు. విగ్రహ తొలగింపు వార్త బయటకు రావడంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నర్సంపేటకు తరలివచ్చే అవకాశం ఉందని భావించిన పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. నర్సంపేట పట్టణంతో పాటు నియోజకవర్గంలోని ఆరు మండల కేంద్రాల్లో కీలక బీఆర్ఎస్ నేతలను ఇళ్లలోనే అదుపులోకి తీసుకున్నారు. నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసం వద్ద సుమారు 400 మంది పోలీసులతో పహారా కాశారు. కాగా, నల్లబెల్లిలోని స్వగృహంలో ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ముందు ఆయన సతీమణి పెద్ది స్వప్న భావోద్వేగానికి గురై కన్నీటిపర్యంతమయ్యారు. జులై 31న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10న ఆయన దశ దిన కర్మ సందర్భంగా నర్సంపేట మెడికల్ కాలేజీ ఎదుట

Nallabelli: పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపుపై భార్య స్వప్న కన్నీళ్లు Nallabelli: పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు నేపథ్యంలో నల్లబెల్లి లోని స్వ గృహం లో ఉన్న సుదర్శన్ రెడ్డి విగ్రహం ముందు సతీమణి పెద్ది స్వప్న బావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. ఏడుస్తూ నువ్వు లేని రోజు చూడు ఎంత అరాచకామో అంటూ విలపించాంరు. 28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’

అనామలీస్ జాబితాలో 60.50 లక్షల మంది ఎన్యూమరేషన్ ఫారాల్లో పూర్తి వివరాలివ్వనివారు 32.36 లక్షలు వీరంతా సరైన ఆధారాలు సమర్పించేందుకు సెప్టెంబరు 16 వరకు గడువు సర్ ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం ఫారం సమర్పించని వారికి మరో అవకాశం అర్హులందరికీ ఓట్లు: సీఈవో సుదర్శన్‌రెడ్డి హైదరాబాద్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రక్రియలో 92.86 లక్షల మంది ఓటర్ల వివరాలు సరిగా లేవని గుర్తించినట్లు ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈవో) సుదర్శన్ రెడ్డి తెలిపారు. వారికి త్వరలో నోటీసులు జారీచేయనున్నటు చెప్పారు. సర్ ఓటరు ముసాయిదా జాబితాను సోమవారం ఆయన విడుదల చేశారు. ఓటరు జాబితాలో పేర్లు ఉన్నప్పటికీ గత రికార్డులతో అనుసంధానం (మ్యాపింగ్) చేసే క్రమంలో ఓటరు పేరు, తల్లి, తండ్రి పేర్లలో తేడాలు, చిరునామా సరిగా లేకపోవడం వంటి కారణాలతో 60,50,918 మందిని అనామలీస్ క్యాటగిరీలో చేర్చారు. వీరితోపాటు ఎన్యూమరేషన్ ఫారాల్లో మూడు కాలమ్స్ నింపకపోవడం, సమగ్రంగా వివరాలు నమోదు చేయని 32,36,659 మందికి నోటీసులు జారీచేయనున్నారు. వీరు సరైన ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే తుది ఓటరు జాబితాలో చేర్చుతారు. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లకు గాను 2,64,87,213 మంది ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించారు. ఈ నెల పదోతేదీ వరకు పూర్తిచేసిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రకారం.. మొత్తం ఓటర్లలో ఫారాలు సమర్పించని 73.39 లక్షల మందిని ఏఎ్‌సడీడీ క్యాటగిరీలో చేర్చారు. వీరిలో శాశ్వతంగా చిరునామా మారినవారు 45,18,963 మంది, మరణించిన వారు 9,22,229 మంది, రెండుచోట్ల ఓటరుగా నమోదైనవారు 6,70,203 మంది ఉన్నారు. మిగిలిన 11,25,546 మంది నమోదిత చిరునామాలో లేకపోవడం, బీఎల్వోలు వెళ్లినప్పుడు అందుబాటులో లేకపోవడంతో ఎన్యూమరేషన్ ఫారాలు పొందలేదు. వీరికి మరో అవకాశం ఇవ్వనున్నట్లు సీఈవో తెలిపారు. వీరితోపాటు ఇతర క్యాటగిరీల్లోని 1,02,294 మందికి కూడా ఫారం 6ఏ ద్వారా

తెలంగాణలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (సర్) 2026 ప్రక్రియలో భాగంగా, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి సోమవారం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ఇంటింటి సర్వే అనంతరం రూపొందించిన ఈ జాబితాలో, సుమారు 73 లక్షల మంది ఓటర్ల పేర్లు ఏఎస్‌డీడీ (అబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్ అండ్ డూప్లికేట్) జాబితాలో ఉన్నట్లు గుర్తించారు.ఓటర్లు తమ పేరు జాబితాలో ఉందో లేదో వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఓటర్లు తమ వివరాలను ceotelangana.nic.in వెబ్‌సైట్‌లోని 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-2026' విభాగంలో లేదా voters.eci.gov.in పోర్టల్‌లో తనిఖీ చేసుకోవచ్చు. జాబితాలో పేరు లేని వారు తగిన ధ్రువపత్రాలతో ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, నోటీసులు అందుకున్న వారు నిర్ణీత గడువులోగా స్పందించాలని అధికారులు సూచించారు.పోలింగ్ బూత్‌ను తెలుసుకోవడం...హైదరాబాద్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరగడంతో, చాలా మంది ఓటర్ల పాత బూత్ నంబర్లు మారాయి. ప్రస్తుత ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేరును వెతుక్కోవడానికి, ఓటర్లు ముందుగా తమకు కేటాయించిన కొత్త బూత్ సంఖ్యను తెలుసుకోవాలి. దీని కోసం ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లోని సెర్చ్ పోర్టల్‌ను వినియోగించుకోవచ్చు.ఓటర్లు తమ EPIC (ఓటర్ గుర్తింపు కార్డు) నంబర్‌ను నమోదు చేయడం ద్వారా లేదా తమ పేరు, బంధువుల పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను ఉపయోగించి పోలింగ్ బూత్ సంఖ్యను తెలుసుకోవచ్చు. అనంతరం ఈసీఐ వెబ్‌సైట్‌ను సందర్శించి, ఆ బూత్ నంబర్‌కు సంబంధించిన ఓటర్ల జాబితాను డౌన్లోడ్ చేసుకోవచ్చు.రాష్ట్రంలో మొత్తం 3.38 కోట్ల మంది

Telangana Election Commission : తెలంగాణలో రాష్ట్ర ఎన్నికల సంఘం సర్ (SIR) ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా 78.30 శాతం ఎన్యుమరేషన్ పత్రాలు అందించినట్లు తెలిపారు. 2.73శాతం మంది చనిపోయిన వారిగా గుర్తించినట్లు చెప్పారు. మరోవైపు సుమారు 60లక్షల మంది అనామలీస్ ఓటర్లు ఉన్నారని.. అలాగే 32లక్షల మంది ఓటర్లు మ్యాపింగ్ చేసుకోలేదని గుర్తించండం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో సుమారు 92లక్షల మందికి నోటీసులు జారీ చేయనున్నట్లు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల సంఘం నోటీసులు అందుకున్న వ్యక్తులు సెప్టెంబర్ 16వ తేదీ వరకు గడువు ఉంటుందని.. ఆలోపు సమాధానం ఇవ్వాలని చెప్పారు. ఎవరి ఓట్లు అయినా లేకపోతే ఫారం -6ఏ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు. ముసాయిదా జాబితాను ఎన్నికల అధికారులు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. ముసాయిదా జాబితాకోసం ఇక్కడ క్లిక్ చేయండి

నరేశ్ అగస్త్య వరుసగా సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. క్రైమ్ కామెడీ నేపథ్యంలో ఆయన చేసిన సినిమాలు ఓటీటీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. అలాంటి నరేశ్ అగస్త్య నుంచి వచ్చిన మరో సినిమానే 'ఎమ్ఆర్ పీ'. 'నీకెంత నాకెంత' అనేది క్యాప్షన్. డార్క్ క్రైమ్ కామెడీ జోనర్లో నిర్మితమైన ఈ సినిమాకి శ్రవణ్ జేష్ఠ దర్శకత్వం వహించాడు. జులై 17వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, నెల తిరక్కముందే ఓటీటీకి వచ్చేసింది.మనోహర్ (నరేశ్ అగస్త్య) పరమేశ్వర్ ( సుదర్శన్) రవి ( కసిరెడ్డి రాజ్ కుమార్) ముగ్గురూ మంచి స్నేహితులు. హైదరాబాద్ లో ఒకే రూమ్ లో కలిసి ఉంటూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. మనోహర్ ను అదే ఆఫీసులో పనిచేసే అమృత ప్రేమిస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్లు తనకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తొందర చేస్తూ ఉంటుంది. చాలా తక్కువ జీతాన్ని సంపాదిస్తున్న మనోహర్, బిజినెస్ చేసి తన స్థాయిని మార్చుకోవాలనుకుంటాడు. అందుకు పెద్దమొత్తంలో డబ్బు అవసరమవుతుంది. ముగ్గురు స్నేహితులు తమ సొంత ఊరుకి వెళ్లి, డబ్బు కోసం ప్రయత్నిస్తారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది. అదే సమయంలో కామేశ్వర రావు హత్య జరుగుతుంది. కామేశ్వరరావుకి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు 'దైవాజీ' (నంద గోపాల్) పెద్ద రౌడీ. వడ్డీలకు డబ్బులు తిప్పుతూ, వడ్డీ ఇవ్వనివారిని హింసిస్తూ ఉంటాడు. తన తల్లి చనిపోతే తండ్రి మళ్లీ పెళ్లి చేసుకున్నాడనే ఒక కోపం అతనికి ఉంటుంది. చిన్న కొడుకు 'భాను' మాత్రం తండ్రిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. పెద్ద కొడుకు కారణంగా చనిపోయిన కామేశ్వర రావు బాడీ హాస్పిటల్లో ఉంటుంది. 'దైవాజీ' దగ్గర మనోహర్ మిత్ర బృందం అప్పు తీసుకుంటుంది. అయితే గడువులోగా వడ్డీ చెల్లించలేకపోతారు. దాంతో మొత్తం బాకీ తీర్చమని అతను రెండు రోజులు గడువు పెడతాడు. దాంతో వాళ్లు కామేశ్వరరావు బాడీని హాస్పిటల్ నుంచి

వరంగల్ జిల్లా నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభ అత్యంత భావోద్వేగ వాతావరణంలో జరిగింది. భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మరియు హరీష్ రావు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నర్సంపేట ప్రజల కోసం పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన సేవలను ఈ సందర్భంగా నాయకులు గుర్తు చేసుకున్నారు. సంతాప సభలో కేటీఆర్ మాట్లాడుతూ మనిషి ఎంతకాలం బతికామన్నది ముఖ్యం కాదని, సమాజం కోసం ఎలా బతికామన్నదే అసలైన విషయమని అన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి చివరి యాత్రకు లక్ష మందికి పైగా ప్రజలు తరలిరావడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమని చెప్పారు. వర్షం పడుతున్నా సరే దాదాపు 12 గంటల పాటు జనం అక్కడే వేచి ఉండటం వారి మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తోందని తెలిపారు. దీంతో ఈ ప్రాంతంలో పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రజల నుండి లభించిన ఆదరణ స్పష్టంగా కనిపిస్తోందని నాయకులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పార్టీకి మరియు నియోజకవర్గానికి ఆయన అందించిన సేవలు ఎప్పటికీ మరచిపోలేనివని సభలో పలువురు వ్యాఖ్యానించారు. నర్సంపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి సుదర్శన్ రెడ్డి తన జీవితాన్ని అంకితం చేశారని నాయకులు వివరించారు. ఫలితంగా రాబోయే రెండు సంవత్సరాలలో తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చివరి కోరికను నెరవేర్చేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నర్సంపేటలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెడతామని సభముఖంగా స్పష్టం చేశారు

నర్సంపేట : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నాకు ఉద్యమ సహచరుడు మాత్రమే కాదు.. ఆత్మీయ సోదరుడు అని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.పెద్ది సంస్మరణ సభకు సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ డిప్యూటీ లీడర్ హరీశ్ రావుతో కలిసి పల్లా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ సహచరుడిగా, ప్రజా నాయకుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డితో తనకున్న ఆత్మీయ అనుబంధాన్ని పల్లా రాజేశ్వర్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. నర్సంపేట ప్రజల కోసం పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన సేవలు, తెలంగాణ కోసం ఆయన సాగించిన పోరాటం చిరస్మరణీయమని అన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ ప్రజల మనసుల్లో నిలిచిపోతుందని తెలిపారు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో సోమవారం నిర్వహించిన సంస్మరణ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్సంపేటలో నిర్మించనున్న మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టనున్నట్లు కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమాన్ని అగ్రభాగాన నిలిచి నడిపించిన గొప్ప నాయకుడు పెద్ది అని ఆయన కొనియాడారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, "ఎంతకాలం జీవించామన్నది ముఖ్యం కాదు, ఎలా జీవించామన్నదే ప్రధానం. పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక్క పర్యాయం ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ, ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసేలా పనిచేశారు" అని వ్యాఖ్యానించారు. ఆయన అంత్యక్రియలకు పోటెత్తిన అశేష జనవాహిని, ప్రజల్లో ఆయనకు ఉన్న గౌరవానికి నిదర్శనమని పేర్కొన్నారు. సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకునే బాధ్యతను బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందని ఈ సందర్భంగా కేటీఆర్ భరోసా ఇచ్చారు.పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న సుదర్శన్ రెడ్డి, జులై 31న గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన గతంలో జడ్పీటీసీ సభ్యుడిగా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సేవలందించడంతో పాటు, 2018-2023 మధ్య కాలంలో నర్సంపేట ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించారు.కాగా, నిన్న ఆదివారం నాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ క్రమంలో పార్టీ తరఫున ప్రకటించిన రూ. 2.25 కోట్ల ఆర్థిక

నర్సంపేటలో విగ్రహ గద్దె కూల్చివేత బీఆర్ఎస్ నేతల భారీ ధర్నా స్తంభించిన ప్రధాన రహదారుల ట్రాఫిక్ BRS Protest Narsampet: వరంగల్ జిల్లా నర్సంపేటలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు చేపట్టిన ఆందోళనతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రైవేటు స్థలంలో నిలబెట్టిన మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ప్రతిష్ఠాపన గద్దెను మున్సిపల్ అధికారులు రాత్రికి రాత్రే కూల్చివేయడం స్థానికంగా పెద్ద దుమారాన్నే రేపింది. అధికారుల ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ (BRS Protest Narsampet)పార్టీ ముఖ్య నేతలు, స్థానిక ప్రతినిధులు నడిరోడ్డుపై బైఠాయించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించడంతో నర్సంపేట పట్టణంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. Balineni-Damacharla: ఒంగోలులో వేడెక్కిన రాజకీయం.. జైల్లో వేసేంత మగాడివా? దామచర్లకు బాలినేని సవాల్ బీఆర్ఎస్ నేతల నిరసన – మున్సిపల్ కమిషనర్ సస్పెన్షన్‌కు డిమాండ్: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ నేతృత్వంలో ఈ బృహత్ ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ ఆందోళనలో మున్సిపల్ మాజీ ఛైర్మన్, మాజీ కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడిన నేతలు, ప్రైవేటు స్థలంలో నిర్మించిన గద్దెను కూల్చివేసిన మున్సిపల్ కమిషనర్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని గట్టిగా డిమాండ్ చేశారు. నిలిచిపోయిన రాకపోకలు – స్తంభించిన ట్రాఫిక్: మెడికల్ కళాశాల ప్రధాన రహదారిపై నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బైఠాయించడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ధర్నా ప్రభావంతో నర్సంపేట-మహబూబాబాద్, నర్సంపేట-కొత్తగూడ, నర్సంపేట-ములుగు ప్రధాన మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శాంతిభద్రతలను పర్యవేక్షిస్తూ, నిరసనకారులను సర్దిచెప్పి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. High tension at narsampet amid peddi sudarshan statue pedestal demolish: దివంగత బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహంను ఏర్పాటు చేసేందుకు నర్సంపేట్ లో ప్రభుత్వ మెడికల్ కాలేజీకిఎదురుగా ఉన్న ప్రైవేటు స్థలంలో గద్దెను నిర్మించారు. అయితే.. అధికారులు దీన్ని రాత్రికి రాత్రి పూట కూల్చివేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. అసలు ప్రైవేటు స్థలంలో విగ్రహం ఏర్పాటు చేస్తే మీకు వచ్చిన నష్టంఏంటని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం రాజకీయంగా కక్ష సాధింపులకు దిగడం అంటూ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అధికారులు గద్దెను కూల్చివేయడంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇతర బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగారు. దీంతో..ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. అక్కడ పోలీసులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. మరోవైపు గద్దె కూల్చిన స్థలం వద్ద ఆందోళనకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నారు. ఇక మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్ నల్లబెల్లిలో జరిగే దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభలో పాల్గొనేందుకు బయలు దేరారు. ఈ గద్దె కూల్చివేత పరిణామంతో నర్సంపేట్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు భారీగా బలగాల్ని మోహరించారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళులర్పించి.. కుటుంబసభ్యులను ఓదార్చిన కేసీఆర్.. ! ఇటీవల అనారోగ్య కారణాలతో అకాల మరణం చెందిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి నివాసానికి వెళ్లిన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దివంగత నాయకుని కుటుంబసభ్యులను ప్రత్యక్షంగా కలిసి పరామర్శించారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి దశదినకర్మ సందర్భంగా వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సుదర్శన్‌రెడ్డి తల్లి, భార్య, పిల్లలతో సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని వారికి కొండంత భరోసా ఇచ్చారు. కేసీఆర్ రాకతో నల్లబెల్లి ప్రాంతంలో ఉద్విగ్న వాతావరణం కనిపించగా, గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. తమ అధినేతను చూసేందుకు కార్యకర్తలు మరియు నాయకులు ఒక్కసారిగా ముందుకు రావడంతో నివాసం వద్ద తీవ్ర రద్దీ ఏర్పడి స్వల్ప తోపులాట జరిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పరిస్థితులను చక్కదిద్ది కేసీఆర్ కాన్వాయ్‌ను సురక్షితంగా లోపలికి పంపించారు. దివంగత సుదర్శన్‌రెడ్డి కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ పార్టీ తరఫున రూ. 2.25 కోట్ల భారీ ఆర్థిక సాయాన్ని అందించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సుదర్శన్‌రెడ్డి ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం చెరో కోటి రూపాయలు, అలాగే ఆయన తల్లి అమృతమ్మ సంరక్షణ నిమిత్తం మరొక రూ. 25 లక్షలను బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయనున్నారు. నర్సంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడిన నాయకునిగా సుదర్శన్‌రెడ్డికి మంచి పేరుంది. ఆయన అకాల మరణం పార్టీకి తీరని లోటని, నమ్ముకున్న నేతను కోల్పోవడం వల్ల స్థానిక కార్యకర్తల్లో తీవ్ర విషాదం నెలకొందని పలువురు గులాబీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల చదువులు, ఇతర సంక్షేమ బాధ్యతలను నిరంతరం పర్యవేక్షిస్తామని బీఆర్ఎస్

పెద్ది కుటుంబానికి కేసీఆర్ పరామర్శ భరోసా ఇచ్చిన మాజీ సీఎం కేసీఆర్ పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి నివాళులు KCR : తెలంగాణ ఉద్యమ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఆదివారం (ఆగస్టు 9) వరంగల్ జిల్లా నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్‌రెడ్డి నివాసానికి రోడ్డు మార్గంలో చేరుకున్న కేసీఆర్.. ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. కుటుంబాన్ని ఆదుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ (KCR) ప్రకటించిన రూ.2.25 కోట్ల ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కులను కూడా స్వయంగా సంతకం చేసి ఆయన అందించారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి కుమారుడు, కుమార్తెకు చెరో రూ.కోటి చొప్పున ఆయన తల్లిదండ్రులకు రూ.25 లక్షల చొప్పున చెక్కులు అందించారు. Read Also : CJI Nalsar Students : నల్సార్ స్నాతకోత్సవానికి సీజేఐ వద్దు.. 450 మంది విద్యార్థుల తీవ్ర అభ్యంతరం! కేసీఆర్ పార్టీ స్థాపించిన నాటి నుంచి పెద్ది సుదర్శన్‌రెడ్డి బీఆర్ఎస్ కోసం ఎంతో శ్రమించారు. వరంగల్‌లో కేసీఆర్ ముఖ్య అనుచరుడిగా కూడా కొనసాగారు. ఆయన మృతితో కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. అయితే, కేసీఆర్ పర్యటన సందర్భంగా నర్సంపేట నియోజకవర్గ పార్టీ నేతలు, కార్యకర్తలు, పెద్ది అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. నర్సంపేటకు వెళ్తున్న సమయంలో దారి పొడవునా కేసీఆర్‌కు అభిమానులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేలా కేసీఆర్ వ్యవహరించారు

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లా నల్లబెల్లిలో పర్యటించారు. ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి దశదినకర్మ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించి, వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ ప్రకటించిన రూ.2.25 కోట్ల ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కులను కేసీఆర్ స్వయంగా సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు అందజేశారు.నల్లబెల్లిలోని నివాసానికి చేరుకున్న కేసీఆర్, తొలుత సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సుదర్శన్‌రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కేసీఆర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సుదర్శన్‌రెడ్డి అత్యంత సాదాసీదా జీవితం గడిపారని, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మంచి నేత అని కొనియాడారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు.బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రకటించిన ఆర్థిక సాయంలో భాగంగా సుదర్శన్‌రెడ్డి ఇద్దరు పిల్లల పేరున చెరో రూ.1 కోటి, ఆయన తల్లి అమృతమ్మ సంరక్షణ కోసం రూ.25 లక్షల చెక్కులను కేసీఆర్ అందించారు. పిల్లల చదువులు, భవిష్యత్తుతో పాటు కుటుంబ సంక్షేమ బాధ్యతలను పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తుందని స్పష్టం చేశారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.కేసీఆర్ రాక సందర్భంగా నల్లబెల్లికి బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి నివాసం వద్ద జనం కిక్కిరిసిపోవడంతో స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి, పరిస్థితిని అదుపులోకి తెచ్చి కేసీఆర్ కాన్వాయ్‌కు దారి కల్పించారు

వరంగల్ జిల్లా నల్లబెల్లిలో పర్యటించారు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మకు కేసీఆర్ స్వయంగా హాజరయ్యారు. పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసిన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించి ధైర్యం చెప్పారు. వారిని ఆప్యాయంగా పలకరించి.. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. పెద్ది సుదర్శన్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. ఒకానొక దశలో కళ్లలో నీళ్లు తిరుగుతున్నా కేసీఆర్ ఆ దుఃఖాన్ని దిగమింగుతూ.. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి భరోసా కల్పించారు.కొత్త పింఛన్లపై కొత్త అప్డేట్..మొదట ఇచ్చేది వారికే,మొదలైన దరఖాస్తుల ప్రక్రియ!కేసీఆర్ నల్లబెల్లి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు భారీగా తరవచ్చారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటి వద్ద కార్యకర్తలు భారీగా తరలిరావడంతో స్వల్ప తోపులాట జరగగా.. పోలీసులు కేసీఆర్ కాన్వాయ్ ను సుదర్శన్ రెడ్డి నివాసంలోకి తీసుకెళ్లారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే కుటుంబానికి అండగా నిలవాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. పార్టీ తరఫున రూ.2.25 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ క్రమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి రూ.2.25 కోట్ల చెక్కును కేసీఆర్ అందజేశారు. రష్యా నుంచి భారత్‌కు నేరుగా రైలు? ఇక హార్ముజ్ ఇబ్బందులకు చెక్!పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో రూ.కోటి, ఆయన తల్లి అమృతమ్మ బాగోగుల కోసం మరో రూ.25 లక్షల చెక్ రాసి వారికి అందజేశారు. అనంతరం నల్లవెల్లి నుంచి ఎర్రవెల్లకి తిరుగు ప్రయాణం అయ్యారు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Brs kcr reached consoles late peddi Sudarshan reddy family: తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి దశదినకర్మ కార్యక్రమం కోసం కేసీఆర్ తరలి వెళ్లారు. ఈ క్రమంలో ఎర్రవెల్లి నుంచి ప్రత్యేకంగా తన వాహనాల్లో .. భువనగిరి, ఆలేరు, బహుపేట మార్గం గుండా కదలి వెళ్లారు. ఈ నేపథ్యంలో దారి పొడవున మాజీ సీఎం కేసీఆర్ కు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. దారి పొడవునా నిలబడి కేసీఆర్ గారికి అభివాదం చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. కేసీఆర్ పాటుగా పలువురు బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు నల్లబెల్లికి చేరుకున్నారు. మరోవైపు భారీగా కార్యకర్తలు చేరుకొవడం వల్ల కేసీఆర్ కు నల్లబెల్లి చేరుకొవడంలో కొంత ఇబ్బందులు తలెత్తాయి. ఆ తర్వాత.. కేసీఆర్ నల్లబెల్లికి చేరుకున్నారు. ముందుగా దివంగత నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయనతో ఉన్న తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. వారి కుటుంబాన్ని ఓదార్చారు. పెద్ది సుదర్శన్ రెడ్డి లేని లోటును ఎవరు తీర్చలేరని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబంకు అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. Read more: Ktr: కేసీఆర్ చేసిన యాగాలు ఎవరు చేయలేదు.!. మీడియా చిట్ చాట్‌లో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇప్పటికే కేసీఆర్ పెద్ది పిల్లలకు చెరో రూ. కోటి ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన తల్లికి కూడా భారీ సాయం చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ తో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ది

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులకు తాను అండగా ఉంటానని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భరోసా కల్పించారు. ఆదివారం వరంగల్ జిల్లాలోని నల్లబెల్లిలో పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబసభ్యులను కేసీఆర్ పరామర్శించారు. వరంగల్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి (Peddi Sudarshan Reddy) కుటుంబ సభ్యులకు తాను అండగా ఉంటానని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భరోసా కల్పించారు. ఈరోజు (ఆదివారం) వరంగల్ జిల్లాలోని నల్లబెల్లిలో పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబసభ్యులను కేసీఆర్ పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతిచెందిన విషయం తెలిసిందే. పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం వారితో కేసీఆర్ మాట్లాడి ధైర్యం చెప్పారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. ఈ క్రమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి రూ.2.5 కోట్ల చెక్కును అందజేశారు. వారికి పార్టీ, తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు. అనంతరం నల్లబెల్లి నుంచి కేసీఆర్ సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫాంహౌస్‌కు బయలుదేరారు. అమ్మాయిలూ.. రెంటల్ బాయ్‌ఫ్రెండ్స్‌తో జాగ్రత్త: సీపీ సజ్జనార్ సాగునీటి ప్రాజెక్టులకు రూ.5 వేల కోట్ల నిధులు: ఉత్తమ్

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం వరంగల్ జిల్లా నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని నల్లబెల్లికి రానున్నారు. దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సోమవారం పెద్ది సుదర్శన్‌రెడ్డి దశదినకర్మ సందర్భంగా నల్లబెల్లిలో నిర్వహించే సంతాప సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరుకానున్నారు. తెలంగాణ ఉద్యమానికి పెద్ది చేసిన సేవలను నేతలు ఈ సందర్భంగా స్మరించుకోనున్నారు