
తెలంగాణలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (సర్) 2026 ప్రక్రియలో భాగంగా, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి సోమవారం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ఇంటింటి సర్వే అనంతరం రూపొందించిన ఈ జాబితాలో, సుమారు 73 లక్షల మంది ఓటర్ల పేర్లు ఏఎస్‌డీడీ (అబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్ అండ్ డూప్లికేట్) జాబితాలో ఉన్నట్లు గుర్తించారు.ఓటర్లు తమ పేరు జాబితాలో ఉందో లేదో వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఓటర్లు తమ వివరాలను ceotelangana.nic.in వెబ్‌సైట్‌లోని 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-2026' విభాగంలో లేదా voters.eci.gov.in పోర్టల్‌లో తనిఖీ చేసుకోవచ్చు. జాబితాలో పేరు లేని వారు తగిన ధ్రువపత్రాలతో ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, నోటీసులు అందుకున్న వారు నిర్ణీత గడువులోగా స్పందించాలని అధికారులు సూచించారు.పోలింగ్ బూత్‌ను తెలుసుకోవడం...హైదరాబాద్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరగడంతో, చాలా మంది ఓటర్ల పాత బూత్ నంబర్లు మారాయి. ప్రస్తుత ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేరును వెతుక్కోవడానికి, ఓటర్లు ముందుగా తమకు కేటాయించిన కొత్త బూత్ సంఖ్యను తెలుసుకోవాలి. దీని కోసం ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లోని సెర్చ్ పోర్టల్‌ను వినియోగించుకోవచ్చు.ఓటర్లు తమ EPIC (ఓటర్ గుర్తింపు కార్డు) నంబర్‌ను నమోదు చేయడం ద్వారా లేదా తమ పేరు, బంధువుల పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను ఉపయోగించి పోలింగ్ బూత్ సంఖ్యను తెలుసుకోవచ్చు. అనంతరం ఈసీఐ వెబ్‌సైట్‌ను సందర్శించి, ఆ బూత్ నంబర్‌కు సంబంధించిన ఓటర్ల జాబితాను డౌన్లోడ్ చేసుకోవచ్చు.రాష్ట్రంలో మొత్తం 3.38 కోట్ల మంది





