
Sandeep Reddy Vanga | శేఖర్ కమ్ముల హీరోలంటే నాకు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా
Sandeep Reddy Vanga | శేఖర్ కమ్ముల హీరోలంటే నాకు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా
© 2026 nimisham.in

Sandeep Reddy Vanga | శేఖర్ కమ్ముల హీరోలంటే నాకు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా
Sandeep Reddy Vanga: ‘నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు’.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్ వైరల్

Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా

‘రోమాంచకం’ మూవీ రివ్యూ.. Romanchakam Movie Review 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' వంటి సంచలన చిత్రాలతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). తాను సమర్పకుడిగా వ్యవహరిస్తూ తమ భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్‌పై అన్నయ్య ప్రణవ్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం 'రోమాంచకం' (Romanchakam). ఈ మూవీతో వేణుగోపాల్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అయ్యారు. 'మేమ్ ఫేమస్'తో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న సుమంత్ ప్రభాస్ (Sumanth Prabhas), '8 వసంతాలు' ఫేమ్ అనంతిక (Ananthika) ఇందులో జంటగా నటించారు. సినిమా ప్రకటన నుంచే మంచి హైప్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ఆపై విడుదలైన పాటలతో యూత్‌కు కూడా చేరువయింది. అలాంటి ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్స్ బుధవారం రాత్రి వేయగా గురువారం థియేటర్లకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది, ఆడియన్స్‌ను మెప్పించిందా లేదా అన్నది రివ్యూలో చూద్దాం కథ విషయానికొస్తే.. అన్వేష్ (సుమంత్ ప్రభాస్) ఇంజినీరింగ్ పూర్తి చేసి తన నలుగురి ఫ్రెండ్స్‌తో కలిసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. అయితే ఎప్పటికైనా రోమాంచకం పేరుతో నేటి జెన్ జీ యూత్‌కు ఫ్లెక్సిబుల్‌గా ఉండే విధంగా డేటింగ్ యాప్ ని పెట్టాలని ఫ్రెండ్స్‌తో కలిసి ప్రయత్నాలు చేస్తాడు. అందు కోసం అమ్మాయిలను అర్ధం చేసుకోవాలని ఓ డేటింగ్ యాప్‌లో చెన్నైకి చెందిన అమ్మాయి మైథిలి (అనంతిక సనీల్ కుమార్)ని పరిచయం చేసుకొని ఆపై క్లోజ్ అవుతాడు. మైథిలీ పుట్టినరోజున ఆమెకు సర్ప్రైజ్ ఇవ్వాలని చెన్నై వెళ్లిన అన్వేష్‌కు ఊహించని షాక్ తగులుతుంది. మైథిలి అతడిని పూర్తిగా బ్లాక్ చేస్తుంది. అయితే కొంతకాలం తర్వాత మళ్లీ ఫోన్ చేసి హైదరాబాద్ వస్తానని చెబుతుంది. హైదరాబాద్ వచ్చిన మైథిలీని అన్వేష్ తన ఫ్రెండ్ ఫ్లాట్ తనది అని చెప్పి అందులో ఉంచి ఫ్రెండ్‌ను కలవడానికి వెళతాడు. అయితే.. కాసేపటి తర్వాత అన్వేష్ తిరిగి వచ్చేటప్పటికీ

Romanchakam Review : సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా తెరకెక్కిన సినిమా రోమాంచకం. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మాణంలో వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. రోమాంచకం సినిమా సెప్టెంబర్ 3న థియేటర్స్ లో రిలీజ్ అవుతుండగా ముందు రోజు రాత్రే ప్రీమియర్స్ వేశారు. కథ విషయానికొస్తే.. అన్వేష్(సుమంత్ ప్రభాస్) రోమాంచకం అనే డేటింగ్ యాప్ స్టార్టప్ కంపెనీ పెట్టాలని ఫ్రెండ్స్ తో కలిసి ప్రయత్నాలు చేస్తాడు. దాని కోసం అమ్మాయిలను అర్ధం చేసుకోవాలని ఇంకో డేటింగ్ యాప్ లో చెన్నై అమ్మాయి మైథిలి(అనంతిక సనీల్ కుమార్)ని పరిచయం చేసుకొని ఇద్దరూ ఫోన్స్ లో మాట్లాడుకొని ఫ్రెండ్స్ అయి బాగా దగ్గరవుతారు. మైథిలి పుట్టిన రోజు నాడు మొదటిసారి కలవాలని సర్ప్రైజ్ అని చెప్పి చెన్నై వెళ్తాడు అన్వేష్. తను ఒక హోటల్ దగ్గర ఉన్నానని చెప్పి రమ్మంటాడు. కానీ మైథిలి బ్లాక్ చేస్తుంది. దాంతో మైథిలి జ్ఞాపకాలతో, ఫ్రెండ్స్ తో గొడవలతో బాధపడుతుంటే సడెన్ గా ఓ రోజు మైథిలి ఫోన్ చేసి హైదరాబాద్ వస్తున్నాను నీతో ఓ రెండు రోజులు ఉంటాను అని చెప్తుంది. మైథిలిని అన్వేష్ తన ఫ్రెండ్ మామ ఫ్లాట్ కి తీసుకెళ్తాడు. కానీ అన్వేష్ బయటకు వెళ్లొచ్చేసరికి మైథిలి ఫ్లాట్ లో కనపడదు. దీంతో అన్వేష్ కంగారుపడతాడు. అసలు మైథిలి ఎందుకు హైదరాబాద్ వచ్చింది? మైథిలి ఏమైంది? మైథిలి కనపడకపోవడంతో అన్వేష్, అతని ఫ్రెండ్స్ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? అసలు మైథిలి - అన్వేష్ ప్రేమించుకున్నారా.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.. Also See : Sumanth Prabhas : ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్ సుమంత్ ప్రభాస్.. ఫొటోలు వైరల్.. సినిమా విశ్లేషణ.. సందీప్ రెడ్డి వంగ చిన్న సినిమా, అది కూడా లవ్ స్టోరీ నిర్మిస్తున్నాడు

'మేమ్ ఫేమస్' చిత్రంతో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటుడు సుమంత్ ప్రభాస్, ఇప్పుడు 'రోమాంచకం' అనే సరికొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పకుడిగా, ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి వేణుగోపాల్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అనంతిక సనిల్‌కుమార్ హీరోయిన్గా నటిస్తున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ రేపు (సెప్టెంబర్ 3) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో సుమంత్ ప్రభాస్ చిత్ర విశేషాలను పంచుకున్నాడు.రోమాంచకం సినిమా తన కెరీర్లో ఎంతో ప్రత్యేకమని సుమంత్ తెలిపాడు. తన పాత్ర కోసం దర్శకుడు వేణుగోపాల్ రెడ్డితో కలిసి దాదాపు ఆరు నెలల పాటు కసరత్తు చేశానని వెల్లడించాడు. "ఇంజనీరింగ్ పూర్తి చేసి స్టార్టప్ కంపెనీ పెట్టాలనుకునే అమాయకమైన, క్యూట్ యువకుడి పాత్ర నాది. ఆ పాత్రలో సహజంగా కనిపించడానికి చాలా హోంవర్క్ చేశాం. కొన్ని సన్నివేశాల కోసం నెలల తరబడి ప్రాక్టీస్ చేశాక, నా నటనలో ఎంతో మెరుగుదల కనిపించింది" అని సుమంత్ వివరించాడు. ఓ అవార్డు ఫంక్షన్లో సందీప్ రెడ్డి వంగా తనను కలిసి ఓ 'క్యూట్ స్టోరీ' ఉందని చెప్పారని, ఆ తర్వాత దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రెండున్నర గంటల పాటు కథ వినిపించగా తాను ఎంతో ఆస్వాదించానని గుర్తుచేసుకున్నాడు. పైకి గంభీరంగా కనిపించినా సందీప్, ప్రణయ్ రెడ్డి చాలా మంచి వారని పేర్కొన్నాడు.ఇండస్ట్రీ నుంచి ప్రముఖుల మద్దతు లభించడంపై సుమంత్ సంతోషం వ్యక్తం చేశాడు. పాన్

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పకుడిగా వ్యవహరిస్తున్న 'రోమాంచకం' చిత్రానికి ప్రీ రిలీజ్ దశలోనే అద్భుతమైన స్పందన లభిస్తోంది. నేటి నుంచి ఈ సినిమా ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, టికెట్ బుకింగ్స్ ప్లాట్‌ఫామ్‌లలో సినిమాకు విశేషమైన ఆదరణ కనిపిస్తోంది. ఈ చిత్రంలో సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటించారు.ప్రముఖ టికెటింగ్ పోర్టల్ బుక్‌మైషోలో 24 గంటల్లోనే 'రోమాంచకం' చిత్రానికి భారీ స్థాయిలో టికెట్లు అమ్ముడవడం విశేషం. ఈ సినిమా ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉండటం, దీనిపై నెలకొన్న అంచనాలకు నిదర్శనంగా నిలుస్తోంది. సందీప్ రెడ్డి వంగా బ్రాండ్ తోడవ్వడంతో ఈ చిన్న సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి ఏర్పడింది.వేణు గోపాల్ రెడ్డి ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు. సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా, భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు. "ప్రేమ, హాస్యం, ఉత్కంఠ" అనే ట్యాగ్‌లైన్‌తో వస్తుండటంతో ఇది ఒక విభిన్నమైన ఎంటర్టైనర్గా ఉండబోతుందని తెలుస్తోంది. సుమంత్ ప్రభాస్, అనంతిక ప్రధాన పాత్రలు పోషించారు.సాధారణంగా పెద్ద సినిమాలకు కనిపించే బుకింగ్స్ ట్రెండ్, 'రోమాంచకం' చిత్రానికి కూడా కనిపిస్తుండటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. సందీప్ వంగా సమర్పణ సినిమాకు అతిపెద్ద బలంగా మారిందని, ఈ పాజిటివ్ బజ్ ఓపెనింగ్స్‌కు ఎంతగానో దోహదపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. నేటి ప్రీమియర్లతో ఈ 'రోమాంచకం' ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో దూసుకెళ్తూనే, చిన్న సినిమాలకు, యంగ్ టాలెంట్‌కు తనవంతు మద్దతు అందిస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తుంటాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో దూసుకెళ్తూనే, చిన్న సినిమాలకు, యంగ్ టాలెంట్‌కు తనవంతు మద్దతు అందిస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ నిర్మిస్తున్న లేటెస్ట్ యూత్‌ఫుల్ మూవీ రోమాంచకం చిత్ర బృందానికి డార్లింగ్ ప్రభాస్ తన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశాడు. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సినిమా ప్రమోషన్లలో భాగంగా రోమాంచకం చిత్ర యూనిట్ ప్రభాస్‌ను ప్రత్యక్షంగా కలిసింది. ఈ సందర్భంగా మేకర్స్‌తో ఎంతో సరదాగా గడిపిన ప్రభాస్, సినిమా పోస్టర్లు, ప్రమోషనల్ కంటెంట్‌ను చూసి కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ స్పిరిట్ లో నటిస్తున్న ప్రభాస్, ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి. రోమాంచకం చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించి, తమ కాంబినేషన్లో రాబోతున్న స్పిరిట్ సినిమా కలెక్షన్లను కూడా దాటేయాలని ఆయన సరదాగా కామెంట్స్ చేశాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి ఊహించని రీతిలో వచ్చిన ఈ సపోర్ట్, బెస్ట్ విషెస్‌తో రోమాంచకం టీమ్ అమితానందం వ్యక్తం చేస్తోంది. యంగ్ క్రియేటర్లను ప్రోత్సహిస్తూ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను సమర్పిస్తుండటం, దానికి ప్రభాస్ ఆశీస్సులు కూడా తోడవ్వడంతో ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్పై ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకులలోనూ ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. నిజంగా ఇలా ప్రభాస్ ని కలవడం ఫ్యాన్స్ గా తమకు రోమాంచకమే అని చిత్రబృందం చెప్పుకొస్తున్నారు. సెప్టెంబర్ 3 న ఈ సినిమా ప్రేక్షకుల

పొరుగు దేశం నేపాల్‌లో హిమ సరస్సుల ఆకస్మిక ఉప్పెన (గ్లేసియల్ లేక్ ఔట్‌బరస్ట్ ఫ్లడ్) సృష్టించిన పెను విషాదం నేపథ్యంలో సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్న 40 హిమ సరస్సులను జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం గుర్తించింది. వీటిలో ఏడు సరస్సులను 'అత్యంత ప్రమాదకర' జాబితాలో చేర్చారు. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం హైఅలర్ట్ ప్రకటించి, ముందస్తు నివారణ చర్యలపై దృష్టి సారించింది.ఈ ప్రమాదకర సరస్సులలో కొన్ని సముద్ర మట్టానికి సుమారు 17,000 అడుగుల ఎత్తులో ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కటి గట్టు తెంచుకున్నా భారీ విపత్తు సంభవించే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ తాంబే మాట్లాడుతూ, కొన్ని సరస్సులపై ఇప్పటికే శాస్త్రీయ అధ్యయనం ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సరస్సుల లోతు, నీటి నిల్వ సామర్థ్యం, మంచు కురిసే విధానం, కొండచరియలు విరిగిపడే ముప్పు వంటి అంశాలను నిపుణులు అంచనా వేస్తున్నారని ఆయన వివరించారు.ఆగస్టు 26న నేపాల్‌లో హిమ సరస్సు విచ్ఛిన్నం కావడం వల్ల సంభవించిన వరదల్లో ఇప్పటికే 1,100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, దాదాపు 4,000 మంది గల్లంతయ్యారు. ఈ నేపథ్యంలో సిక్కింలో అటువంటి విపత్తు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం పటిష్ఠమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది

సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'రోమాంచకం'. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్ ఈ సినిమాలో జంటగా నటించారు. రేపు(సెప్టెంబర్ 3) థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ మూవీ, ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమా పూర్తిగా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో, ఇక్కడి యాసతో సాగే ఒక ఫ్రెష్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్. కథలో హీరో అన్వేష్ (సుమంత్ ప్రభాస్) తన ఫ్రెండ్స్‌తో సరదాగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఒక డేటింగ్ యాప్ స్టార్టప్‌ను ప్రారంభిస్తాడు. అయితే ఈ డేటింగ్ యాప్ బిజినెస్ ద్వారా చెన్నైకి చెందిన అమ్మాయి (అనంతిక)తో అతను ఎలా కనెక్ట్ అయ్యాడు? ఆన్లైన్ అండ్ ఆఫ్‌లైన్ రొమాన్స్‌లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? చివరకు తల్లిదండ్రులు మెచ్చేలా ఎలా నిలిచాడు అనేది ఈ సినిమా ప్రధాన కథాంశం. సెన్సార్ బోర్డు ఈ సినిమాకి UA16+ సర్టిఫికెట్ ఇచ్చింది. అంటే 16 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఈ సినిమాను హ్యాపీగా చూడొచ్చు.ఇక ఈ సినిమా రన్ టైమ్ విషయానికి వస్తే.. ప్రేక్షకులను ఎక్కడా బోర్ కొట్టించకుండా కథను ఎంతో గ్రిప్పింగ్‌గా 2 గంటల 22 నిమిషాలు (142 నిమిషాలు) రన్టైమ్తో ఫిక్స్ చేశారు. సుమంత్ ప్రభాస్ - అనంతిక మధ్య కెమిస్ట్రీ, వాసుకి వైభవ్ మ్యూజిక్, అద్భుతమైన కామెడీ టైమింగ్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్ కాబోతున్నాయి. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ వంటి అంశాలతో ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించారట. జెన్-జీ ఆడియెన్స్‌ను మాత్రమే కాకుండా ఫ్యామిలీస్‌ను కూడా మెప్పించేలా ఉన్న ఈ 'రోమాంచకం' థియేటర్లలో ఎలాంటి మ్యాజిక్ చేయబోతుందో చూడాలి. 'వండర్ వుమెన్' గాల్ గాడోట్ సరికొత్త క్రైమ్ థ్రిల్లర్.. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి!

రెబల్ స్టార్ ప్రభాస్‌ను రోమాంచకం సినిమా బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్న సుమంత్ ప్రభాస్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ప్రభాస్ ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభాస్ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేకంగా తన ఆశీర్వాదాలను అందించారు. యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ ధరించిన షర్ట్‌పై ప్రభాస్ స్వయంగా తన చేతులతో ఒక సందేశాన్ని రాసి చిత్ర బృందంలో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఈ సినిమా సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ప్రచారం వేగవంతం చేశారు. రొమాంటిక్, కామెడీ, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో సుమంత్ ప్రభాస్ సరసన అనంతిక సనీల్ కుమార్ కథానాయికగా నటించింది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పిస్తుండగా, భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ రెడ్డి వంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో ప్రభాస్ తన షర్ట్‌పై "లైవ్ విత్ ప్రభాస్" అని రాయడంతో సుమంత్ ప్రభాస్ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ఆల్ ది బెస్ట్, ఇరగదీసేయ్, ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ కావాలని ప్రభాస్ మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఇదిలా ఉండగా, భవిష్యత్తులో రాబోయే స్పిరిట్ సినిమా రికార్డులను కూడా ఈ రోమాంచకం చిత్రం దాటేయాలంటూ ప్రభాస్ సరదాగా వ్యాఖ్యానిస్తూ ఆశీర్వదించారు. ఈ ప్రత్యేక క్షణంలో ప్రభాస్ చూపించిన అభిమానానికి సుమంత్ ప్రభాస్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఫలితంగా ఈ కనువిందు చేసే సన్నివేశానికి సంబంధించిన వార్త ఇటు ఇండస్ట్రీలోనూ, అటు అభిమానుల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో రెబల్ స్టార్ ఇచ్చిన ప్రోత్సాహంతో చిత్ర యూనిట్ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో వస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే ప్రేక్షకులలో మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ ఇచ్చిన ఈ గ్రాండ్ సపోర్ట్ సినిమా ప్రచారానికి మరింత ప్లస్

హీరో సుమంత్ ప్రభాస్ చిన్నప్పట్నుంచి ప్రభాస్ ఫ్యాన్. తన పేరు వెనక కూడా ప్రభాస్ పెట్టుకున్నాడు. సుమంత్ ప్రభాస్ రోమాంచకం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన ఫేవరేట్ హీరో ప్రభాస్ ని కలిసాడు. దీంతో అతని ఆనందానికి అవధులు లేవు. సందీప్ రెడ్డి వంగ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కడంతో సందీప్ సుమంత్ ని ప్రభాస్ దగ్గరకు తీసుకెళ్లాడు. ప్రభాస్ సుమంత్ ప్రభాస్ షర్ట్ మీద ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. దీంతో ప్రభాస్ తన డై హార్డ్ ఫ్యాన్ సుమంత్ ప్రభాస్ ని కలిసిన ఫొటోలు వైరల్ గా మారాయి

భారతీయ సినీ పరిశ్రమలో ప్రేక్షకుల అభిరుచులు గణనీయంగా మారుతున్నాయని ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి పేర్కొన్నారు. భారతీయ సినీ పరిశ్రమలో ప్రేక్షకుల అభిరుచులు గణనీయంగా మారుతున్నాయని ప్రముఖ నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి (Rana Daggubati) పేర్కొన్నారు. ఒకప్పుడు స్టార్ హీరోల ఇమేజ్ను బట్టి సినిమాలు ఎంచుకునే ప్రేక్షకులు, ఇప్పుడు దర్శకుడి పేరు చూసి థియేటర్లకు వెళ్లే స్థాయికి చేరుకున్నారని అన్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన రానా.. నేటి ప్రేక్షకులు కేవలం హీరోల అభిమానులుగా కాకుండా, మంచి కథలు చెప్పే దర్శకుల అభిమానులుగా మారుతున్నారని చెప్పారు. రాజమౌళి, నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్ వంటి దర్శకుల సినిమాల కోసం ప్రేక్షకులు ప్రత్యేకంగా ఎదురుచూస్తున్నారని ఆయన వివరించారు. ప్రస్తుతం సినిమా విజయంలో హీరోతో పాటు దర్శకుడి విజన్ కూడా కీలక పాత్ర పోషిస్తోందని రానా అభిప్రాయపడ్డారు. ఒక దర్శకుడి గత చిత్రాల కంటెంట్‌ను నమ్మి ప్రేక్షకులు కొత్త సినిమాలకు వెళ్లడం పెరిగిందన్నారు. అందుకే దర్శకుల పేర్లు ఇప్పుడు బ్రాండ్లుగా మారుతున్నాయని చెప్పారు. పాన్ ఇండియా సినిమాల విజయాలు కూడా ఈ మార్పుకు ప్రధాన కారణమని అన్నారు. భాషల సరిహద్దులను దాటి ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే కొత్త కథలు, ప్రత్యేకమైన మేకింగ్ అవసరమనే అవగాహన పెరిగిందని చెప్పారు

స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ నుంచి వస్తున్న 'రోమాంచకం' విడుదలకి సర్వం సిద్ధమైంది. ‘మా నిర్మాణంలో వృథా ఖర్చులు ఉండవు. కథ ఏం డిమాండ్ చేస్తే అంత వరకే ఖర్చు పెడతాం. చిన్న, పెద్ద సినిమాలనే తేడా లేకుండా మేం పాటిస్తున్న నియమం అదే’ అని నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా (Pranay Reddy Vanga) తెలిపారు. భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ఆయన నిర్మించిన ‘రోమాంచకం’ (Romanchakam) ఈ గురువారం విడుదలకు సిద్దమైంది. సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) సమర్పకులు. సుమంత్ ప్రభాస్ (Sumanth Prabhas), అనంతిక సనీల్ కుమార్ (Ananthika Sanilkumar) జంటగా నటించారు. వేణుగోపాల్ రెడ్డి (T. Venugopal Reddy) దర్శకత్వం వహించారు. ఈ సినిమా గురించి ప్రణయ్ మాట్లాడుతూ ‘ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలగలిపిన ఇంట్రెస్టింగ్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇది. తెలంగాణలో, చెన్నైలో 10 రోజులు చిత్రీకరించాం. సుమంత్ ప్రభాస్ క్యారక్టర్ నేపథ్యంగా కథ సాగుతుంది. ఇంజినీరింగ్ కంప్లీట్ చేసి బయటకు వచ్చిన యువకుడు ఏం చేస్తాడు? అతని లైఫ్‌లో ఏం జరిగింది? అతని ప్రేమకథ ఎలా సాగింది? ఫ్రెండ్స్‌లో ఉన్న కన్ఫ్యూజన్ ఏంటి అనేవి ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఎక్కడా బోర్ కొట్టదు. మా సంస్థ నుంచి వచ్చిన అన్ని సినిమాల్లాగే ‘రోమాంచకం’ కూడా మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అవుతుంది. అయితే.. ఈ చిత్రం సెన్సార్ సర్టిఫికేట్ విషయంలో కాస్త రాద్దాంతం జరిగినప్పటికీ తాజాగా.. సెన్సార్ యు/ఎ రాగా సినిమా నిడివిని 142 నిమిషాలు (2 గంటల 22 నిమిషాలు) గా లాక్ చేశారు. అమెరికాలో సెన్సార్ ఇండస్ట్రీ సారథ్యంలో ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం చేతుల్లో ఉంది. సినిమా నిర్మించడానికి ముందే నిర్మాతలు సెన్సార్ రూల్స్ తెలుసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని అర్థమైందని ప్రణవ్ తెలిపాడు. సందీప్ ఈ కథ విని ఓకే చేసిన తర్వాతే పట్టాలెక్కించాం. సందీప్ ‘స్పిరిట్’ పనులతో బిజీగా

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒక చిన్న సినిమాకు తన మద్దతు తెలిపి ప్రమోషన్స్‌లో కొత్త జోష్ నింపారు. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో వస్తున్న ‘రోమాంచకం’ చిత్ర బృందానికి ఆయన తన శుభాకాంక్షలు అందజేశారు. సినిమా బ్లాక్‌బస్టర్ అవ్వాలని, తన ‘స్పిరిట్’ చిత్రాన్ని కూడా దాటిపోవాలని సరదాగా వ్యాఖ్యానించారు.సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్ కుమార్ జంటగా నటిస్తున్న ‘రోమాంచకం’ సినిమా రేపు (సెప్టెంబర్ 3న) థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా హీరో సుమంత్ ప్రభాస్, రెబల్ స్టార్ ప్రభాస్‌ను కలిశారు. ఈ సందర్భంగా ప్రభాస్, సుమంత్ షర్ట్‌పై సంతకం చేసి.. "ఆల్ ది బెస్ట్.. ఇరగదీసేయ్. 'రోమాంచకం' బ్లాక్ బస్టర్ అయిపోవాలి. ‘స్పిరిట్’ని కూడా దాటెయ్యాలి" అంటూ చిత్ర బృందానికి విషెస్ చెప్పారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పంచుకుంది.ప్రస్తుతం ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే భారీ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను టీ-సిరీస్‌తో కలిసి సందీప్ సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా తన భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పుడు అదే బ్యానర్లో, సందీప్ వంగా సమర్పణలో ‘రోమాంచకం’ వస్తుండటంతో ప్రభాస్ తన వంతు సపోర్ట్ అందిస్తున్నారు. గతంలో ఈ చిత్ర ట్రైలర్‌ను కూడా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసి ప్రశంసించారు.వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ ‘రోమాంచకం’ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. ప్రభాస్ వంటి స్టార్

'రౌడీ బాయ్' విజయ్ దేవరకొండ పేరు చెప్తే చాలు, అమ్మాయిల గుండెలు జారిపోతాయ్. 'అర్జున్ రెడ్డి'గా తెరపై ఫుల్లుగా తాగుతూ, రగడ్‌గా కనిపించిన ఈ హీరో, ఇప్పుడు నిజ జీవితంలో ఓ పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. అవును, విజయ్ దేవరకొండ పూర్తిగా మారిపోయాడు. తాజాగా `రోమాంచకం` మూవీ ఈవెంట్లో విజయ్ బయటపెట్టిన సీక్రెట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. `నేను తాగడం మానేశాను` అని చెప్పి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఒకప్పుడు జేబులో డబ్బులు ఉన్నా లేకపోయినా, బ్లెండర్స్ ప్రైడ్ నుంచి గ్లెన్ఫిడచ్ వరకు చాలా బ్రాండ్ల మందుని టేస్ట్ చేసిన విజయ్, ఇప్పుడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడన్నది పెద్ద ప్రశ్న. అర్జున్ రెడ్డి పాత్రతో తాగే కల్చర్‌కు క్రేజ్ తెచ్చిన హీరోనే ఇప్పుడు మందు మానేయడం నిజంగా పెద్ద మార్పే కదా? ఇదే ఈవెంట్లో విజయ్ చెప్పిన మరో మాట ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. "నేను ప్రేమించాను, బ్రేకప్ అయ్యింది, నా గుండె పగిలింది... ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను!" అని చెప్పాడు. తన ఫస్ట్ లవ్, బ్రేకప్ గురించి విజయ్ ఇంత ఓపెన్‌గా మాట్లాడటం విని అభిమానులు షాక్ అవుతున్నారు. అయితే, విజయ్ మొదటి లవ్-బ్రేకప్ గురించి, అలాగే రష్మిక మొదటి లవ్-బ్రేకప్ గురించి అందరికీ తెలిసిందే. కాబట్టి, విజయ్ ఈ విషయం గురించి ఓపెన్‌గా చెప్పడంలో తప్పేమీ లేదు. అది తన జీవితం, అతని మాటల్లో జీవితంలోని ఎత్తుపల్లాలను చూసిన అనుభవం స్పష్టంగా కనిపించింది. విజయ్ దేవరకొండ పేరు వస్తే అక్కడ 'నేషనల్ క్రష్' రష్మిక మందన్న పేరు రాకుండా ఉండదు. 'గీతా గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలతో మ్యాజిక్ చేసిన ఈ జంట, ఇప్పుడు 'రణబాలి' సినిమాతో హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అయ్యింది. అయితే, 'హ్యాట్రిక్ జోడీ' అవ్వకముందే ఈ జంట పెళ్లి కూడా చేసుకున్నారనేది విశేషం! విజయ్, రష్మిక జోడీని మళ్లీ స్క్రీన్‌పై చూడాలని ఎదురుచూస్తున్న

'అర్జున్ రెడ్డి', 'యానిమల్' చిత్రాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు సమర్పకుడిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన సమర్పిస్తున్న తాజా చిత్రం 'రోమాంచకం'. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ అనే ట్యాగ్‌లైన్‌తో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో, సినిమా విడుదలకు ముందే హైదరాబాద్ సినీ ప్రియుల కోసం ప్రత్యేక ప్రీమియర్ షోలను ఏర్పాటు చేశారు.సెప్టెంబర్ 2వ తేదీన హైదరాబాద్‌లోని పలు ప్రముఖ మల్టీప్లెక్స్‌లలో ఈ స్పెషల్ ప్రీమియర్లను ప్రదర్శించనున్నారు. ఏఎంబీ సినిమాస్, ఏఏఏ సినిమాస్, ఆర్ట్ సినిమాస్, ప్రసాద్ మల్టీప్లెక్స్, పీవీఆర్ ఐనాక్స్ (ఫోరమ్, ఇనార్బిట్ మాల్స్), బ్రహ్మరాంబ, అల్లు సినిమాస్ వంటి థియేటర్లలో ఈ ప్రత్యేక ప్రదర్శనలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభమైనట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.వేణు గోపాల్ రెడ్డి ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు. సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా, భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. సుమంత్ ప్రభాస్, అనంతిక ప్రధాన పాత్రలలో నటించారు. 'కమ్ ఇన్ యాజ్ ఏ గ్యాంగ్.. ఎగ్జిట్ విత్ ఏ బ్యాంగ్' అంటూ ప్రచార చిత్రాలలో ఇచ్చిన నినాదం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. సందీప్ వంగా లాంటి స్టార్ డైరెక్టర్ ఒక చిత్రాన్ని సమర్పిస్తుండటంతో 'రోమాంచకం' కంటెంట్ ఎలా ఉండబోతోందనే చర్చ సినీ వర్గాల్లో మొదలైంది

'అర్జున్ రెడ్డి' చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆయన సమర్పణలో, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి నిర్మించిన తాజా చిత్రం 'రోమాంచకం'. 'మేము ఫేమస్', 'గోదారి గట్టుపైన' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో సుమంత్ ప్రభాస్ ఈ సినిమాలో కథానాయకుడిగా నటిస్తుండగా, అనంతిక సనిల్‌కుమార్ హీరోయిన్గా నటిస్తోంది. వేణు గోపాల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యువతను లక్ష్యంగా చేసుకున్న లవ్-కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు సోషల్ మీడియాలో మంచి స్పందన లభించడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.సెప్టెంబరు 3న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో దూకుడు పెంచింది. ఇందులో భాగంగా ఇటీవలే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి 'రౌడీ హీరో' విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరు కావడంతో చిత్రంపై హైప్ భారీగా పెరిగింది. అంతేకాదు, చిత్రబృందం ప్రెస్ మీట్లు, కాలేజ్ ఫెస్ట్ లతో దూసుకెళుతోంది. విజయవాడలోనూ చిత్ర యూనిట్ సందడి చేసింది.ఇదిలా ఉండగా, 'రోమాంచకం' చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. చిత్ర నిడివిని 1 గంట 42 నిమిషాల 40 సెకన్లుగా ఖరారు చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు

హైదరాబాద్ రాయదుర్గంలో సోమవారం తెల్లవారుజామున ఒక ఘోరమైన హిట్ అండ్ రన్ ప్రమాదం చోటుచేసుకుంది. ఓఆర్ఆర్ రోటరీ నుంచి ఖాజాగూడ గ్రామం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన ఇన్నోవా కారు కాలినడకన వెళ్తున్న నందులాల్ అనే వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. ఈ తీవ్రమైన ఘటనలో నందులాల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ప్రమాదాన్ని చూసి సహాయం చేయడానికి పరుగెత్తుకు వచ్చిన జైద్ షా కాద్రి అనే విద్యార్థి కూడా అదే వాహనం తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి కారును నిలపకుండా అక్కడి నుండి వేగంగా పరారయ్యాడు. ఈ హిట్ అండ్ రన్ ఘటనపై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు వెంటనే దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రమాదానికి కారణమైన ఇన్నోవా వాహనాన్ని నడిపినది ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌గా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో పోలీసులు వేగంగా స్పందించి సందీప్‌ను అరెస్ట్ చేసి, ప్రమాదానికి వాడిన కారును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆనంద్ సాయి తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందడమే కాకుండా యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. 2024 లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ ట్రస్ట్ బోర్డులో జనసేన నామినీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రమాద సమయంలో వాహనం ఏ వేగంతో వెళ్తోంది, డ్రైవర్ మద్యం సేవించి ఉన్నారా లేదా అనే అంశాలపై పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా, గాయపడిన విద్యార్థి జైద్ షా కాద్రిని స్థానికులు తక్షణమే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, అతని ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెలువడాల్సి ఉంది. మరోవైపు ప్రాణాలు కోల్పోయిన నందులాల్ కుటుంబ నేపథ్యం, ఇతర వివరాలను సేకరించే పనిలో పోలీసులు

హైదరాబాద్‌లోని రాయదుర్గంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, టిటిడి (TTD) బోర్డు మెంబర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని రాయదుర్గంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, టిటిడి (TTD) బోర్డు మెంబర్ ఆనంద్ సాయి (Anand Sai) కుమారుడు సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆప్తమిత్రుడు ఆనంద్ సాయి, ప్రముఖ నటి వాసుకి (Vasuki) దంపతుల కుమారుడే ఈ సందీప్. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ హిట్ అండ్ రన్ కేసు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓఆర్ఆర్ రోటరీ నుంచి ఖాజాగూడ గ్రామం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై కాలినడకన వెళ్తున్న నందులాల్ అనే వ్యక్తిని మొదట ఒక ఇన్నోవా కార్ బలంగా ఢీకొట్టింది. ఆ గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించేందుకు జైద్‌షా కద్రీ అనే విద్యార్థి సహాయం చేస్తుండగా, సందీప్ నడుపుతున్న మహీంద్రా కారు అత్యంత వేగంగా వచ్చి వారిద్దరినీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నందులాల్ అక్కడికక్కడే మృతి చెందగా, విద్యార్థి జైద్‌షా కద్రీకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే వాహనాన్ని ఆపకుండా సందీప్ అక్కడి నుండి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేపట్టి, సిసిటివి ఫుటేజ్ ఆధారంగా వాహనాన్ని గుర్తించారు. కారును సీజ్ చేసిన పోలీసులు, ప్రమాదానికి కారణమైన ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి

రాయదుర్గంలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. హిట్ అండ్ రన్ కేసులో ఒకరు మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్, సెప్టెంబర్ 1: రాయదుర్గంలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. హిట్ అండ్ రన్ కేసులో ఒకరు మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓఆర్ఆర్ రోటరీ నుంచి ఖాజాగూడ గ్రామం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నడుచుకుంటూ వెళ్తున్న నందులాలను ఇన్నోవా కార్ బలంగా ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన వ్యక్తిని విద్యార్థి జైద్‌షా కద్రీ ఆస్పత్రికి తీసుకెళ్తుండా మరో ప్రమాదం జరిగింది. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్తున్న విద్యార్థిని మహేంద్ర కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో నందులాల అక్కడికక్కడే మృతిచెందగా.. విద్యార్థి జైద్‌షా కద్రీకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత కారు యాజమాని వాహనాన్ని ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెంటనే అక్కడకు చేరుకున్న స్థానికులు.. విద్యార్థిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు.. మహేంద్ర కార్ యాజమానిని గుర్తించారు. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్.. కారు నడిపి ఒకరి మృతికి కారణమైనట్లు విచారణలో తేలింది. దీంతో కారును సీజ్ చేసిన పోలీసులు.. సందీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలవరం నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. చంద్రబాబు చేతుల మీదుగా విడుదల మూడు పోలవరాలు కట్టేంత మొత్తాన్ని పెన్షన్లకు ఖర్చు చేశాం: సీఎం చంద్రబాబు

సాక్షి, హైదరాబాద్: రాయదుర్గంలో హిట్ అండ్ రన్ కేసులో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి కుమారుడు సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హిట్ అండ్ రన్ కేసులో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. ఓఆర్ఆర్ రోటరీ నుంచి ఖాజాగూడ గ్రామం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ఘటన జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న నందులాల్‌ను ఇన్నోవా కార్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. నందులాల్‌ను కారుతో ఢీకొట్టిన సందీప్.. ఆగకుండా వెళ్లిపోయాడు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి చికిత్స పొందుతున్నారు. అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు) కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు) యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు) పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు) యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు) పోలీసుల తీరుపై కన్నీళ్లు పెట్టుకున్న పుష్ప శ్రీ వాణి పాపం ఆ లీడర్ పరిస్థితి సైలెంట్ గా సైడ్ కు నెట్టేసిన చంద్రబాబు

యువ కథానాయకుడు సుమంత్ ప్రభాస్, అనంతిక సానిల్కుమార్ జంటగా నటించిన రోమాంచకం చిత్రం హైదరాబాద్ స్పెషల్ ప్రీమియర్స్ సెప్టెంబర్ 2న ప్రదర్శితం కానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కావడానికి ఒక్క రోజు ముందే ఈ ప్రత్యేక ప్రదర్శనలు ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఈ స్పెషల్ షోలకు సంబంధించి టికెట్ బుకింగ్స్ అధికారికంగా ప్రారంభమయ్యాయి. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలయికతో వినోదాత్మకంగా ఉంటుంది. విదేశాల్లో యూఎస్, యూకేలలో కూడా సెప్టెంబర్ 2నే ప్రీమియర్ షోలు ప్రదర్శితం అవుతున్నాయి. చిత్ర యూనిట్ సభ్యులు ప్రేక్షకులు తమ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి ఈ సినిమాను చూడాలని కోరారు. దీంతో హైదరాబాద్ నగరవ్యాప్తంగా థియేటర్ల దగ్గర ప్రీమియర్ షోలకు సంబంధించి బజ్ ఒక్కసారిగా పెరిగింది. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి వైవిధ్యమైన సంగీతాన్ని వాసుకి వైభవ్ సమకూర్చడం విశేషం. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెన్సార్ బోర్డు నుండి యు సర్టిఫికేట్ పొందింది. ఫలితంగా ప్రతి ఒక్కరూ కలిసి హాయిగా థియేటర్లలో చూడదగిన కుటుంబ వినోదాత్మక చిత్రంగా ఇది సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక వ్యాప్తంగా ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్ ఈ చిత్రం పంపిణీ బాధ్యతలను తీసుకున్నారు. భారత్‌లో సాధారణ థియేట్రికల్ షోలు సెప్టెంబర్ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఈ యంగ్ టీమ్ ప్రయోగాన్ని ఆదరిస్తారని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. స్నేహితుల బృందంతో కలిసి థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయడానికి రోమాంచకం సరైన చిత్రమని మేకర్స్ నొక్కి చెప్పారు. హైదరాబాద్ ప్రీమియర్స్ టికెట్ల విక్రయం వేగంగా సాగుతుండటంతో థియేటర్ల సంఖ్యను పెంచే దిశగా ఆలోచిస్తున్నారు. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్

'8 వసంతాలు' చిత్రం తర్వాత తెలుగు ప్రేక్షకుల్లో నాకు లభించిన గుర్తింపు ఎంతో ప్రత్యేకమైనది మరియు నా మనస్సుకు బాగా దగ్గరైంది. ఆ సినిమా తర్వాత నా దగ్గరకు అనేక కథలు వచ్చినప్పటికీ, అవి నన్ను పూర్తి స్థాయిలో ఉత్సాహపరచలేకపోయాయి. అయితే 'రోమాంచకం' కథ విన్న వెంటనే నేను తీవ్రంగా ఎక్సైట్ అయ్యాను మరియు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావాలని వెంటనే నిర్ణయించుకున్నాను. చాలా కాలంగా ఒక సరదా మరియు ఎనర్జిటిక్ బబ్లీ క్యారెక్టర్ చేయాలనేది నా కలగా ఉండేది, ఈ సినిమాతో ఆ నెరవేరుతోంది. నా సొంత స్వస్థలం కేరళలోని త్రిస్సూర్ కాగా, నా చిన్నతనం నుంచే భరతనాట్యం, మోహినియాట్టం, కూచిపూడి వంటి కళలతో పాటు కరాటేలో కూడా శిక్షణ తీసుకున్నాను. నా తల్లిదండ్రులు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని, అప్పులు చేసి మరీ నా కళల శిక్షణకు పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచారు. 2023లో ‘మ్యాడ్’, 2025లో ‘8 వసంతాలు’ సినిమాలతో తెలుగులో నాకు మంచి పేరు వచ్చింది. గతంలో నేను చేసిన ఇంటెన్స్ పాత్రలకు పూర్తి భిన్నంగా, ఈసారి 'రోమాంచకం'లో ఒక సరదా తమిళ అమ్మాయిగా ప్రేక్షకులను అలరించబోతున్నాను. ఈ సినిమాలో నా సహ నటుడు సుమంత్ ప్రభాస్ డేటింగ్ స్టార్టప్ నడుపుతున్న ఒక యువ ఎంట్రప్రెన్యూర్‌గా చాలా ఎనర్జిటిక్‌గా కనిపించనున్నారు. దీంతో ఆయన పాత్రకు పోటీగా ఉండేలా నా క్యారెక్టర్‌ను కూడా దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి గారు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇదిలా ఉండగా, షూటింగ్ సమయంలో సుమంత్ మరియు నా మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో నేచురల్‌గా, ఎలాంటి ల్యాగ్ లేకుండా రూపుదిద్దుకున్నాయి. కొన్ని సీన్స్ చేస్తున్నప్పుడే నాకు కలిగిన ఆనందం ఖచ్చితంగా థియేటర్లలో ప్రేక్షకులకు కూడా అందుతుందని నమ్ముతున్నాను. మా సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి 'యూ' సర్టిఫికెట్ లభించడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఫలితంగా, ఈ చిత్రాన్ని యూత్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులు
ఎస్ఆర్డి ప్రొడక్షన్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘వేట’. సందీప్ సరోజ్, సాత్విక జంటగా ఫణి అడపాక, జయలక్ష్మీ అడపాక నిర్మాణంలో అశోక్ కోటిపల్లి తెరకెక్కిస్తున్న ఈ మూవీని సోమవారం (ఆగస్ట్ 31) నాడు ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమాలకు కొణిదెల నాగబాబు, కేఎస్ రవి కుమార్, వీఎన్ ఆదిత్య, మెహర్ రమేష్, సాయి రాజేష్, ఎస్కేఎన్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముహూర్తపు సన్నివేశానికి నాగబాబు స్క్రిప్ట్ అందజేయగా.. కేఎస్ రవి కుమార్ క్లాప్ కొట్టారు. సాయి రాజేష్, ఎస్కేఎన్, వీఎన్ ఆదిత్య, ఫణి అడపాక కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో మెహర్ రమేష్, యదు వంశీ, అనుదీప్ దేవ్ పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో.. హీరో సందీప్ సరోజ్ మాట్లాడుతూ .. ‘‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో అందరికీ పరిచయం అయ్యాను. ఈ రోజు మా కొత్త సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చిన నాగబాబు గారికి, ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ‘వేట’ అనేది చిరంజీవి గారి టైటిల్. మాఈ కథకి ఈ టైటిల్ యాప్ట్‌గా ఉంటుంది. మా సినిమాని అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు. కేఎస్ రవి కుమార్ మాట్లాడుతూ .. ‘డైరెక్టర్ అశోక్ గారు ‘వేట’ కథని నాకు కాల్లో వివరించారు. కథ నాకు అద్బుతంగా అనిపించింది. అందరూ కొత్త వాళ్లు కలిసి పని చేస్తున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో ఊర్లో పెద రాయుడు టైపు పాత్ర నాది. నా కారెక్టర్ నాకు నచ్చింది. జెన్ జీ ఆడియెన్స్‌కి కూడా ఈ సినిమా నచ్చుతుంది. ఈ మూవీ బిగ్ సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు. దర్శకుడు అశోక్ కోటిపల్లి మాట్లాడుతూ .. ‘‘వేట’ మూవీ ప్రారంభోత్సవానికి వచ్చిన నాగబాబు గారికి, ఇతర అతిథులందరికీ ధన్యవాదాలు. ఇదే నా మొదటి సినిమా. కథ
రచయిత గురించిరాజశేఖర్. జిరాజశేఖర్ గుండాబత్తుని ‘సమయం తెలుగు’లో కాపీ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు కంటెంట్ రైటింగ్‌లో 7 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2025లో సమయంలో చేరిన రాజశేఖర్.. సినిమా రంగానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్లు, విశ్లేషణలు, స్పెషల్ స్టోరీలు రాస్తున్నారు. సినిమాల గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. సోషల్ మీడియా పోస్టులను ఆసక్తికర కథనాలుగా మలుస్తుంటారు. రాజశేఖర్ జేఎన్టీయూ-హైదరాబాద్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రముఖ పొలిటికల్ కన్సల్టెన్సీ ఐ-ప్యాక్ నుంచి ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్ పొందారు. తుపాకీ న్యూస్, ఏబీపీ దేశం, ఇండియా హెరాల్డ్ డాట్ కామ్ లాంటి మీడియా సంస్థల్లో సినిమా, ఎంటర్టైన్మెంట్ రంగాలకు సంబంధించిన వార్తలు రాశారు. 2019 ఎన్నికల టైంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం కూడా ఆయనకు ఉంది. ఖాళీ సమయంలో సినిమాలు చూడటం, పుస్తకాలు చదవడాన్ని ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి

అందరూ ఫౌజీ, విశ్వంభర, టాక్సిక్ అంటూ బడా సినిమాల గురించే మాట్లాడుకుంటున్నారు కానీ రాబోయే రెండు నెలల్లో చాలా క్యూట్ క్యూట్ లవ్ స్టోరీస్ బాక్సాఫీస్ దగ్గర సందడి చేయడానికి వచ్చేస్తున్నాయి. అందులో కొన్ని సినిమాల్లో మిడ్ రేంజ్ హీరోలుంటే.. మరికొన్నింట్లో చిన్న హీరోలే ఉన్నారు. కానీ ఆ సినిమాలన్ని పెద్ద బ్యానర్స్ నుంచే రాబోతున్నాయి. మరి ఆ ప్రేమకథలపై ఓ లుక్కేద్దామా..? ఎపిక్: ది ఫస్ట్ సెమిస్టర్.. సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి రాబోయే ఈ క్యూట్ లవ్ స్టోరీలో బేబీ జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్నారు. ఆదిత్య హాసన్ తెరకెక్కిస్తున్న ఎపిక్పై మంచి ఆసక్తే ఉంది. ఈ సినిమా సెప్టెంబర్ 11న రానుంది. అలాగే ఇదే బ్యానర్ నుంచి వస్తున్న మరో క్యూట్ ప్రేమకథ వీసా. గల్లా అశోక్, గౌరీ ప్రియా నటిస్తున్న ఈ సినిమాను ఉద్భవ్ తెరకెక్కిస్తున్నారు. వీసా అంటే వింటారా సరదాగా అని అర్థం.. అమెరికా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 17న విడుదల కానుంది వీసా. అలాగే ఇదే సీజన్లో రానున్న మరో క్యూట్ లవ్ స్టోరీ రోమాంచకం. సుమంత్ ప్రభాస్, అనంతిక జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. వేణు గోపాల్ రెడ్డి తెరకెక్కిస్తున్న రోమాంచకం సినిమా సెప్టెంబర్ 3న విడుదల కానుంది. కథ నచ్చి ఈ సినిమాను నిర్మిస్తున్నారు సందీప్ వంగా. కేవలం లవ్ స్టోరీస్ మాత్రమే కాదు.. అల్లరి నరేష్ కామెడీ ఎంటర్టైనర్ రంభ ఊర్వశి మేనక సెప్టెంబర్ 4న విడుదల కానుంది. దాంతో పాటే మహేంద్రగిరి వారాహి, సిగ్మా, డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ లాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ ఇదే సీజన్లో వస్తున్నాయి. పాన్,ఆధార్ వాట్సాప్‌లో పంపుతున్నారా? క్షణాల్లో రంగంలోకి సైబర్ నేరగాళ్లు.. రెప్పపాటులో బ్యాంకు ఖాతాలు గుల్ల బయటకి ఆరోగ్యంగా కనిపిస్తున్నా

సినిమా ఇండస్ట్రీలో రిస్క్‌తో కూడుకున్న స్టంట్ సీన్స్ లేదా భౌతికంగా కష్టమైన ఘట్టాల కోసం బాడీ డబుల్స్ (డూప్స్) వాడటం సాధారణమైన విషయమే. ఎక్కువగా బాడీ డబల్స్ ని బాలీవుడ్ లో వాడుతుంటారు. సినిమా ఇండస్ట్రీలో రిస్క్‌తో కూడుకున్న స్టంట్ సీన్స్ లేదా భౌతికంగా కష్టమైన ఘట్టాల కోసం బాడీ డబుల్స్ (డూప్స్) వాడటం సాధారణమైన విషయమే. ఎక్కువగా బాడీ డబల్స్ ని బాలీవుడ్ లో వాడుతుంటారు. ఈమధ్యనే ఈ ట్రెండ్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల ప్రభాస్ (Prabhas) నటించిన కొన్ని సినిమాల్లో కూడా ఆయన బాడీ డబుల్స్‌పై ఎక్కువగా ఆధారపడ్డారంటూ పలు వార్తలు, రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఈసారి మాత్రం ప్రభాస్ డూప్స్ కి పనిచెప్పలేదని సమాచారం. ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉన్న విషయం తెల్సిందే. అందులో ఒకటి స్పిరిట్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఈ భారీ చిత్రంలో మాత్రం ప్రభాస్ ఎలాంటి డూప్‌ను వాడటం లేదని నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా స్పష్టం చేశాడు. ఈ సినిమాలో ప్రభాస్‌కి బదులుగా ఒక్క షాట్లో కూడా బాడీ డబుల్ కనిపించరని ఆయన ఖచ్చితమైన క్లారిటీ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఒక ఇంటర్వ్యూలో ప్రణయ్ మాట్లాడుతూ.. సాధారణంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన సినిమాల్లో బాడీ డబుల్స్‌ను ఉపయోగించరని, స్పిరిట్ లోని ప్రతి సన్నివేశాన్ని, రిస్కీ యాక్షన్ సీక్వెన్సులను ప్రభాస్ స్వయంగా చేస్తున్నట్లు ప్రణయ్ రెడ్డి తెలిపాడు. ఈ ప్రాజెక్ట్ పట్ల ప్రభాస్ చూపిస్తున్న అంకితభావాన్ని ఆయన కొనియాడడమే కాకుండా అవసరమైనప్పుడు ప్రభాస్ ఏకంగా రోజుకు 18 గంటల పాటు షూటింగ్లో పాల్గొంటూ కష్టపడుతున్నాడని వెల్లడించాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 40 శాతానికి పైగా పూర్తయిందని, అనుకున్న ప్రణాళిక ప్రకారమే వచ్చే ఏడాది మార్చి 5 న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు

ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న స్పిరిట్ వివాదం మరోసారి చర్చకు దారితీసింది. చిత్రం నుంచి తప్పుకున్న దీపికా పదుకొణెపై నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా ఇటీవల పలు ఆరోపణలు చేశారు. వాటికి నేరుగా సమాధానం ఇవ్వని దీపికా, పాత్రికేయురాలు జాన్వి మంచందా పెట్టిన సామాజిక మాధ్యమ పోస్టును లైక్ చేశారు. మహిళా నటుల డిమాండ్లపై పరిశ్రమలో ద్వంద్వ ప్రమాణాలు ఉన్నాయంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. దీంతో దీపికా లైక్‌ను వంగా బ్రదర్స్ ఆరోపణలకు పరోక్ష కౌంటర్‌గా పలువురు భావిస్తున్నారు. అయితే దీనిని ఆమె అధికారిక స్పందనగా పరిగణించలేమన్న విషయం కూడా గమనించాలి. 2025లో దీపికా పదుకొణె స్పిరిట్ నుంచి తప్పుకోవడంతో పని గంటలు, పారితోషికంపై భిన్నమైన కథనాలు వెలుగులోకి వచ్చాయి. కొత్త తల్లిగా రోజుకు 8 గంటల పని షెడ్యూల్ కావాలని ఆమె కోరినట్లు అప్పట్లో నివేదికలు పేర్కొన్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అనంతరం పేరును ప్రస్తావించకుండా అసభ్య ప్రచార ఎత్తుగడలు, చెప్పని గోప్యతా ఒప్పందం అంటూ స్పందించారు. ఆ వ్యాఖ్యలు దీపికాను ఉద్దేశించినవేనని సినీ వర్గాల్లో విస్తృతంగా భావించారు. తరువాత ఆమె స్థానంలో త్రిప్తి డిమ్రీని కథానాయికగా ఎంపిక చేయడంతో స్పిరిట్ వివాదం కొంతకాలం సద్దుమణిగింది. తాజాగా ప్రణయ్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలతో పాత అంశాలు మరోసారి ముందుకొచ్చాయి. ప్రణయ్ రెడ్డి వంగా కథనం ప్రకారం పారితోషికం, చిత్రీకరణ సమయాలతోపాటు మరికొన్ని అంశాల్లో ఒప్పందం కుదరలేదు. ముఖ్యంగా సినిమా నికర లాభాల్లో దీపికా 10 శాతం వాటా కోరినట్లు ఆయన వెల్లడించారు. ఆమె ఏదైనా అడగవచ్చని, కానీ చిత్ర ఆర్థిక లెక్కలకు సరిపడితేనే ఇవ్వగలమని వివరించారు. దీంతో ఆ ప్రతిపాదన అనుకూలంగా లేదని భావించి ఇతర అవకాశాలను పరిశీలించినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా, సినిమా కథతోపాటు పాత్రకు సంబంధించిన అంతర్గత సమాచారం బయటకు వెళ్లిందని కూడా ఆరోపించారు. దీపికాతో ముందుకు వెళ్లకూడదనే నిర్ణయం దర్శకుడు సందీప్ రెడ్డి

ప్రభాస్ (Prabhas)పేరు.. కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాదు. పాన్ ఇండియా స్థాయిలో ఆయనకు గుర్తింపు పొందారు. ప్రభాస్ (Prabhas)పేరు.. కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాదు. పాన్ ఇండియా స్థాయిలో ఆయనకు గుర్తింపు పొందారు. ‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ వంటి సినిమాలతో మరింత బలపడింది. దేశవ్యాప్తంగా భారీ అభిమానగణాన్ని సంపాదించుకున్న ప్రభాస్‌కు ఇప్పుడు మరో కొత్త బిరుదు దక్కింది. అదే ‘ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్’ (Indias Biggest superstar). సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ ప్రమోషనల్ కంటెంట్‌లో ఈ ట్యాగ్‌ను ఉపయోగించడం ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్లో ఈ బిరుదుపై చర్చ మొదలైంది. కొందరు అభిమానులు, ముఖ్యంగా షారుఖ్ ఖాన్ అభిమానులు ఈ ట్యాగ్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో అసంతృప్తిని వ్యక్తం చేశారు. సందీప్ రెడ్డి వంగా, ‘స్పిరిట్’పై విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే ఈ విమర్శలతో చిత్రబృందం వెనక్కి తగ్గలేదు. తదుపరి విడుదల చేసిన పోస్టర్లలోనూ ‘ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్’ అనే ట్యాగ్‌ను కొనసాగించింది. దీంతో అసలు ఈ బిరుదును ప్రభాస్ ఎలా తీసుకున్నారు? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. తాజాగా ఈ విషయంపై ‘స్పిరిట్’ నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోదరుడైన ప్రణయ్.. ‘రొమాంచకం’ ప్రమోషనల్ ఈవెంట్లో ప్రభాస్ రియాక్షన్‌ను బయటపెట్టారు. “ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్” అనే ట్యాగ్ గురించి ప్రభాస్‌కు చెప్పినప్పుడు.. ‘మీ ఇష్టం డార్లింగ్’ అని ఆయన అన్నారు అని ప్రణయ్ రెడ్డి వంగా తెలిపారు. ప్రభాస్ స్పందించిన తీరు ఇప్పుడు వైరల్‌గా మారింది. తనకు ఇచ్చిన బిరుదుపై ప్రభాస్ ఎలాంటి హైప్ లేకుండా చాలా కూల్‌గా స్పందించారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. తనను తాను స్టార్‌గా చెప్పుకోవడం కంటే.. తన సినిమాలే తన స్థాయిని నిర్ణయిస్తాయన్నట్లుగా ప్రభాస్ రియాక్షన్ ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు
తెలుగు సినీ పరిశ్రమ ట్రెండ్‌ను పూర్తిగా తిరగరాసిన సినిమాల్లో 'అర్జున్ రెడ్డి' ఒకటి. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సాధించిన విజయం, సృష్టించిన సంచలనం చిన్నది కాదు. అయితే ఈ క్లాసిక్ బోల్డ్ మూవీ రూపొందడానికి ముందు దర్శకుడికి, చిత్ర బృందానికి ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోదరుడు, అలాగే 'అర్జున్ రెడ్డి' నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సినిమా కథను వివిధ ప్రొడ్యూసర్లకు వినిపించే సమయంలో ఎదురైన సవాళ్లను ఆయన గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా సినిమాలో తీవ్ర నిరాశలో ఉన్న హీరో తన కామ వాంఛను, కోపాన్ని అదుపు చేసుకోవడానికి ప్యాంటులో ఐస్ క్యూబ్స్ వేసుకునే ఒక అత్యంత బోల్డ్ సీన్ ఉంటుంది. కథా చర్చల్లో ఈ పాయింట్ రాగానే చాలామంది నిర్మాతలు తట్టుకోలేకపోయేవారట. వెంటనే నెరేషన్ ఆపేసి, "ఇక మేం ఏమీ వినాల్సిన అవసరం లేదు, కథ ఇక్కడితో ఆపేయండి" అని చెప్పి పంపించేసేవారని ప్రణయ్ వెల్లడించారు. అప్పటివరకు తెలుగు తెరపై ఇలాంటి రా & రియలిస్టిక్ అప్రోచ్ చూడకపోవడంతో రిస్క్ చేయడానికి ఏ ప్రొడ్యూసర్ ముందుకు రాలేదు. కానీ సందీప్ మాత్రం తన విజన్, క్యారెక్టరైజేషన్ పై గట్టి నమ్మకంతో ఉన్నారు. చివరికి బయటి నిర్మాతలు ఎవరూ నమ్మకపోవడంతో, తమ సొంత మామిడి తోటను అమ్మి భద్రాకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. విడుదలైన తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఏ దృశ్యం చూసి నిర్మాతలు వెనకడుగు వేశారో, అదే సీన్స్, బోల్డ్ కంటెంట్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి సందీప్ రెడ్డి వంగాను నేడు భారతీయ చిత్రసీమలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా నిలబెట్టాయి. ప్రస్తుతం సోషల్

‘ఇరుముడి’ సినిమా భక్తి భావన, భావోద్వేగాల అద్భుతమైన కలయికగా నిలిచిందని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రశంసించారు. ‘ఇరుముడి’ (Irumudi) సినిమా భక్తి భావన, భావోద్వేగాల అద్భుతమైన కలయికగా నిలిచిందని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ప్రశంసించారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని వీక్షించిన సందీప్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. మాస్ మహారాజా రవితేజ, బేబీ నక్షత్ర, దర్శకుడు శివ నిర్వాణ ప్రేక్షకులను మరిచిపోలేని భావోద్వేగ ప్రయాణంలోకి తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఈ తరం ప్రేక్షకులకు ‘ఇరుముడి’ ఒక ప్రత్యేకమైన చిత్రమని, సినిమా పూర్తయిన తర్వాత కూడా ఆ భావోద్వేగం మనసులో నిలిచిపోతుందని అన్నారు. ఈ చిత్రాన్ని తప్పకుండా చూడాలని ప్రేక్షకులను కోరిన సందీప్ రెడ్డి వంగా.. సినిమా సూపర్‌హిట్ కావడం పట్ల చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్ల వద్ద అభిమానుల సందడి కనిపిస్తోంది. ముఖ్యంగా సినిమాలో రవితేజ అయ్యప్ప మాలధారణలో కనిపించే సన్నివేశాలు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన భక్తి భావనను కలిగిస్తున్నాయి. అయ్యప్ప స్వామికి సంబంధించిన సన్నివేశాలు తెరపై కనిపించిన సమయంలో అభిమానులు స్క్రీన్లకు హారతులు ఇస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. మరికొందరు థియేటర్లోనే భజనలు చేస్తూ సందడి చేస్తున్నారు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.‘మల్లెపూల పల్లకి’ పాట మొదలైన సమయంలో థియేటర్లలో వాతావరణం మరింత ఉత్సాహంగా మారుతోంది. పాటకు అభిమానులు స్క్రీన్ ముందుకు వెళ్లి డ్యాన్స్‌లు చేస్తూ సందడి చేస్తున్నారు
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ 'స్పిరిట్'. ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ కాస్టింగ్, ప్రత్యేక పాత్రలపై అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాలో ఒక కీలక పాత్ర గురించి వస్తున్న వార్తలకు నిర్మాతల వైపు నుంచి స్పష్టమైన సమాధానం వచ్చింది. చిత్రంలో ప్రకాష్ రాజ్ నటించడం లేదని నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా స్పష్టం చేశారు. గతంలో వచ్చిన టీజర్లో ఆయన వాయిస్ ఓవర్ వినిపించడంతో, ఈ భారీ కాప్ యాక్షన్ డ్రామాలో ఆయన ఒక ముఖ్యమైన రోల్ చేస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే కథనంలో ఉన్న ఒక పవర్ ఫుల్ జైలర్ పాత్ర కోసం ముందుగా ప్రకాష్ రాజ్‌ను సంప్రదించిన మాట వాస్తవమే అని, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ కాంబినేషన్ సెట్ కాలేదని ప్రణయ్ వెల్లడించారు. దీంతో గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్టు నుంచి ఆయన తప్పుకున్నారంటూ వస్తున్న వార్తలకు అధికారికంగా బలం చేకూరినట్లయింది. ఇక ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ క్యామియో చేయనున్నారని సాగుతున్న ప్రచారానికి కూడా ప్రణయ్ ముగింపు పలికారు. 'స్పిరిట్' లో చిరంజీవి ఎలాంటి అతిథి పాత్ర చేయడం లేదని తేల్చి చెప్పారు. కాస్టింగ్ పరంగా క్లారిటీ రావడంతో ప్రస్తుతం ఈ వివరాలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' వంటి సంచలన విజయాల తర్వాత సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో 'స్పిరిట్' పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇందులో ప్రభాస్ తొలిసారిగా పూర్తిస్థాయి రోషకలిగిన పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతుండడం మెగా మాస్ ఎలిమెంట్స్‌ని పెంచేస్తోంది. నెటిజన్లు, ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ ప్రాజెక్ట్ నుండి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ను ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు

వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా ఇప్పటిది కాదు. లెక్కప్రకారం, ‘అర్జున్ రెడ్డి’ తర్వాతే ఉండాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఈ కాంబినేషన్ సెట్ అవ్వలేదు. అలా అని పూర్తిగా తలుపులు మూసుకుపోలేదు. మహేష్ బాబుతో సందీప్ రెడ్డి వంగ ఇప్పటికీ టచ్ లోనే ఉన్నాడు. ఇద్దరి మధ్య చర్చలు సాగుతూనే ఉన్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో రెండేళ్ల తర్వాతైనా ఈ కాంబినేషన్ కలిసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని స్వయంగా సందీప్ సోదరుడు, నిర్మాత ప్రణయ్ వెల్లడించాడు. ప్రస్తుతం ‘స్పిరిట్’ సినిమా చేస్తున్న వంగ, అది పూర్తయిన వెంటనే 6 నెలలు గ్యాప్ తీసుకొని ‘యానిమల్ పార్క్’ మొదలుపెడతాడు. ఆ తర్వాత మహేష్ బాబు సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉందంటున్నాడు. అయితే సందీప్ వంగ మనసులో ఏముందో తను అప్పుడే చెప్పలేనంటున్నాడు ప్రణయ్. రీసెంట్ గా మహేష్ బాబు పుట్టినరోజుకు సందీప్ రిలీజ్ చేసిన ఓ ఏఐ వీడియో సూపర్ హిట్టయింది. స్వయంగా మహేష్ ఆ వీడియోపై స్పందించి, వంగాకు థ్యాంక్స్ చెప్పాడు. అప్పట్నుంచి ఈ కాంబినేషన్ పై జోరుగా ప్రచారం సాగుతోంది. సందీప్ రెడ్డి వంగ ‘అర్జున్ రెడ్డి’ సినిమా తీస్తే, గతంలో ‘అర్జున్’ అనే సినిమాలో నటించాడు మహేష్ బాబు. సో, వీరిది ‘అర్జున్’ కాంబో అనుకోవాలి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'స్పిరిట్'. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచీ ప్రతీ చిన్న వార్త నెట్టింట సంచలనమే సృష్టిస్తోంది. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనే నటించాల్సి ఉన్న సంగతి తెలిసిందే. అసలు సందీప్, దీపికా మధ్య ఏం జరిగింది? ఆమెను ప్రాజెక్ట్ నుంచి ఎందుకు తప్పించారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతూ తాజాగా ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా సంచలన విషయాలు బయటపెట్టారు. 'స్పిరిట్' నుంచి దీపికా పదుకొనేను తీసేయడంపై ఇన్నాళ్లూ రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. కానీ, రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నిర్మాత, సందీప్ రెడ్డి సోదరుడు ప్రణయ్ రెడ్డి షాకింగ్ నిజాలు వెల్లడించారు. సందీప్ రెడ్డి వంగ ఏదైనా ఒక సినిమా అనుకున్నారంటే.. పాత్రల విషయంలో ఎంత పర్ఫెక్ట్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'స్పిరిట్' కథ రాసుకుంటున్న సమయంలో కూడా హీరోయిన్ క్యారెక్టర్ కోసం ఆయన మొదట అనుకున్నది దీపికా పదుకొనేనే. సుమారు సంవత్సరంన్నర పాటు సందీప్, దీపికా ఈ సినిమా స్టోరీ డిస్కషన్స్‌లో ట్రావెల్ చేశారు. ఆమె టాలెంట్‌పై ఉన్న నమ్మకంతోనే అంత సమయం కేటాయించారు. అయితే, ఆ సమయానికి దీపికా నటించిన రెండు భారీ బాలీవుడ్ చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద రికార్డు హిట్లుగా నిలిచాయి. దాంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆ హిట్ల తర్వాత దీపికా వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చిందని ప్రణయ్ రెడ్డి తెలిపారు. కేవలం భారీ రెమ్యునరేషన్ మాత్రమే కాకుండా.. సినిమా లాభాల్లో ఏకంగా 10 శాతం ప్రాఫిట్ షేర్ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేసిందట. దాంతో పాటు షూటింగ్ డేట్స్, రోజువారీ కాల్షీట్ టైమింగ్స్ విషయంలో కూడా ఎలాంటి కాంప్రమైజ్ కానని కండీషన్స్ పెట్టింది. సరే, ఒక స్టార్ హీరోయిన్ అంత డిమాండ్ చేసినా బిజినెస్ పరంగా ఓకే అనుకోవచ్చు

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాజా సాబ్ ప్రేక్షకులను ముఖ్యంగా ప్రభాస్ అభిమానులను నిరాశపరిచింది. దాంతో ఈసారి రెబల్ స్టార్ కు సాలిడ్ హిట్ కొట్టాలని ఆయన ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు స్పిరిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే వరుసగా సినిమాలను లైనప్ చేసిన ప్రభాస్ ఆయా షూటింగ్స్ లో యమా బిజీగా ఉన్నాడు. వాటిలో ముందుగా వచ్చేది మాత్రం స్పిరిట్ సినిమానే.. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఆడియన్స్ లో ఆసక్తి రెట్టింపైంది. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాను నెక్ట్స్ లెవల్ లో తెరకెక్కిస్తున్నారు. శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు.. నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు స్పిరిట్ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్ ఆడియన్స్ మైండ్ బ్లాక్ చేసింది. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి.. ఇప్పుడు ప్రభాస్ ను స్పిరిట్ లో ఎలా చూపించబోతున్నడో అంటూ ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని ఇప్పటికే హింట్ ఇచ్చాడు సందీప్.. స్పిరిట్ పోస్టర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది. Madhuri Rathod: అందుకే అలాంటి పాటల్ని సెలక్ట్ చేసుకున్నా.. వాటితోనే క్రేజ్ తెచ్చుకున్నా : మాధురి రాథోడ్ ఇక ఈ మూవీలో త్రిప్తి డిమ్రీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే స్పిరిట్ సినిమా నుంచి ఓ స్టార్ నటుడు తప్పుకుంటున్నాడని టాక్ వినిపిస్తుంది. ఆయన ఎవరో కాదు ప్రకాష్ రాజ్. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ రాజ్ కీలక పాత్రలో ఎంపిక చేశారట. అయితేఈ సినిమా నుంచి ప్రకాష్ రాజ్ తప్పుకున్నాడని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. ఓ సీన్ విషయంలో ఇద్దరి మధ్య డిఫరెన్స్ రావడంతో ప్రకాష్ రాజ్ సినిమా నుంచి తప్పుకున్నారని అంటున్నారు

ప్రభాస్ 'స్పిరిట్' మూవీ కాస్టింగ్‌పై బిగ్ అప్డేట్పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కలయికలో రూపుదిద్దుకుంటున్న స్పిరిట్ చిత్రంపై రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో ఈ సినిమా కాస్టింగ్‌కు సంబంధించి ఒక కీలకమైన ప్రచారంపై చిత్ర బృందం స్పందించింది. ఈ మూవీలో వర్సటైల్ నటుడు ప్రకాశ్ రాజ్ భాగం కావడం లేదని నిర్మాతలు స్పష్టం చేశారు. స్పిరిట్ టీజర్లో ప్రకాశ్ రాజ్ వాయిస్ ఓవర్ వినిపించడంతో ఆయన ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని అందరూ భావించారు. జైలర్ పాత్ర కోసం ముందుగా ఆయన పేరునే పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ కాంబినేషన్ కుదరలేదని వార్తలు వచ్చాయి. నిర్మాత ప్రణయ్ వంగా అధికారిక క్లారిటీఈ వ్యవహారంపై స్పిరిట్ చిత్ర నిర్మాత ప్రణయ్ వంగా స్వయంగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ప్రకాశ్ రాజ్ ఈ ప్రాజెక్ట్‌లో నటించడం లేదని ఆయన తేల్చి చెప్పారు. దీంతో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు పూర్తిగా తెరపడినట్లయింది. ఫలితంగా జైలర్ పాత్రలో వేరొక నటుడు కనిపించే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. చిరంజీవి క్యామియో రోల్‌పై స్పష్టత ఇదిలా ఉండగా, మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో ఒక ప్రత్యేక అతిథి పాత్రలో కనిపిస్తారంటూ నెట్టింట జోరుగా ప్రచారం సాగింది. ఈ ఊహాగానాలను కూడా నిర్మాత ప్రణయ్ వంగా ఖండించారు. ఈ నేపథ్యంలో సినిమాలో చిరంజీవి ఎలాంటి క్యామియో రోల్ చేయడం లేదని తేలిపోయింది. షూటింగ్ మరియు ఇతర నటీనటుల వివరాలు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. చిత్ర బృందం ఇతర కీలక పాత్రల కోసం నటీనటుల ఎంపికపై దృష్టి సారించింది. సందీప్ రెడ్డి వంగా మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రభాస్ అభిమానుల్లో పెరుగుతున్న ఉత్కంఠ

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’. ఈ మూవీ నుంచి దీపికను తీసేయడానికి గల అసలు కారణం నిర్మాత రివీల్ చేశారు. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) హీరోగా, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’ (Spirit). ఈ భారీ ప్రాజెక్ట్‌లో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నటించనుందంటూ గతంలో ప్రచారం సాగడం, ఆ తర్వాత ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుందంటూ వార్తలు రావడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ సినిమా విషయంలో దీపికా పదుకొణె (Deepika Padukone) చేసిన కామెంట్స్ ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ కాస్టింగ్ వివాదంపై సందీప్ రెడ్డి వంగా సోదరుడు, చిత్ర సహ నిర్మాత ప్రణయ్ రెడ్డి (Pranay Reddy Vanga) వంగా తాజాగా స్పందించి అసలు నిజాన్ని బయటపెట్టారు. దీపికాతో దాదాపు ఏడాదిన్నర పాటు చర్చలు జరిపినప్పటికీ ప్రాజెక్ట్ ఎందుకు వర్కవుట్ కాలేదో స్పష్టంగా వివరించారు. ప్రణయ్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. ‘‘సందీప్ దాదాపు ఏడాదిన్నర పాటు దీపికా పదుకొణెతో ‘స్పిరిట్’ కథ, ఆమె పాత్రకు సంబంధించి చర్చలు జరిపారు. ఆమెకు కథ విపరీతంగా నచ్చినప్పటికీ కొన్ని కఠినమైన వ్యాపార నిబంధనలు, షరతుల వల్లే ఆమెను ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకోలేకపోయాం. భారీ రెమ్యూనరేషన్ పెంపుతో పాటు సినిమా లాభాల్లో ఏకంగా 10 శాతం వాటా కావాలని ఆమె డిమాండ్ చేశారు. అంతేకాకుండా రోజువారీ షూటింగ్ పనివేళలకు సంబంధించి కూడా ఆమె పెట్టిన నిబంధనలు సినిమా మేకింగ్‌కు అనుకూలంగా అనిపించలేదు’’ అని తెలిపారు. భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతోన్న ఈ సినిమా నిర్మాణానికి ఈ రకమైన షరతులు సమంజసంగా అనిపించకపోవడంతోనే పరస్పర అంగీకారంతో ఆమె
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘స్పిరిట్’. బాలీవుడ్ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ తో కలిసి సందీప్ సోదరుడు ప్రణయ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ముందుగా దీపికా పదుకొనేని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ చివరకు త్రిప్తి డిమ్రీని తీసుకున్నారు. ప్రభాస్ మూవీ నుంచి దీపిక తప్పుకుందనే వార్త జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై తాజాగా నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా స్పందించారు.‘స్పిరిట్’ నుంచి దీపిక పదుకునే తప్పుకుందా? తప్పించారా? అని అప్పట్లో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. అదే సమయంలో ‘రోజుకు 8 పని గంటలు’ అంశం తెర మీదకు వచ్చింది. ఈ నియమ నిబంధనల కారణంగానే దీపిక ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని అందరూ అనుకున్నారు. అప్పుడే దీపికాను ఉద్దేశించి సందీప్ వంగా పరోక్షంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. అయితే కేవలం పని గంటలు మాత్రమే కాదు, రెమ్యూనరేషన్ విషయంలోనూ దీపిక పెట్టిన కండిషన్ వల్లే ఆమెను తప్పించినట్లు ప్రణయ్ రెడ్డి వెల్లడించారు.ప్రణయ్ వంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీపిక పదుకునే తప్పుకోవడం గురించి మాట్లాడారు. “వెబ్ సైట్లలో ఏమి రాశారో అదే రీజన్. ఒకటి రెమ్యునరేషన్, రెండు టైమింగ్. అవి కాకుండా వేరే రీజన్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఆమెను తీసేయాలనేది సందీప్ తీసుకున్న నిర్ణయమే. ఆమెతో సందీప్ ఒక ఏడాదిన్నరపాటు టచ్ లో ఉన్నాడు. ఆమె పర్ఫార్మెన్స్ నచ్చి, సినిమాలో ఉంటే బెటర్ గా ఉంటుందని ఆలోచించాము. ప్రాజెక్టులోకి తీసుకోవాలని అనుకున్నాం. కానీ ఆ ఏడాదిన్నరలో చాలా మారాయి. ఆమెవి ఓ రెండు సినిమాలు హిట్టయ్యాయి. దీంతో డిమాండ్ చేయడం స్టార్ట్ చేసింది”“నెట్ ఇన్ కమ్ నుంచి 10 శాతం కావాలని డిమాండ్ చేసింది. అంటే లాభాల్లో పది శాతం అడిగింది. అన్నీ హద్దులు దాటిపోయాయి

Spirit Release Date: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌కు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి మేకర్స్ నుంచి కీలక స్పష్టత వచ్చింది. ‘స్పిరిట్’ రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశం ఉందంటూ ఇటీవల సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని మేకర్స్ ఖండించారు. ఈ సినిమా రిలీజ్ డేట్లో ఎలాంటి మార్పు లేదని, ముందుగా ప్రకటించిన ప్రకారమే 2027 మార్చి 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి టీమ్ సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. షూటింగ్ కూడా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతున్నట్లు సమాచారం. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను అదే స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘స్పిరిట్’లో ప్రభాస్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటి వరకు డార్లింగ్ తన కెరీర్లో చేయని విధంగా తొలిసారి పోలీస్ పాత్రలో నటిస్తుండటంతో ఈ క్యారెక్టర్‌పై అభిమానుల్లో భారీ క్రేజ్ నెలకొంది. ఇప్పటికే ప్రభాస్ లుక్, మేకోవర్‌కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సందీప్ రెడ్డి వంగా తనదైన స్టైల్లో హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. యాక్షన్, ఎమోషన్, పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్‌తో సినిమా ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో భూషణ్ కుమార్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం రిలీజ్ డేట్‌పై వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ.. 2027 మార్చి 5న ‘స్పిరిట్’ థియేటర్లలోకి రానున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. దీంతో ప్రభాస్ అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి

ప్రభాస్ (Prabhas) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘స్పిరిట్’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై క్లారిటీ వచ్చేసింది ప్రభాస్ (Prabhas) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘స్పిరిట్’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి చిత్రాలతో తనదైన మార్క్ చూపించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga).. ప్రభాస్‌తో ఎలాంటి సినిమా తెరకెక్కించబోతున్నారనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. అయితే ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై క్లారిటీ వచ్చేసింది. ‘స్పిరిట్’ పూర్తయిన వెంటనే సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్ పార్క్’ (Animal Park) సినిమాను తెరకెక్కించనున్నట్లు ప్రణయ్ వంగా తెలిపారు. దీంతో ‘స్పిరిట్’ తర్వాత వంగా ఎవరితో సినిమా చేస్తారనే విషయంలో కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరపడింది. సందీప్ రెడ్డి వంగా తర్వాతి సినిమా అల్లు అర్జున్‌తో ఉంటుందని, మరికొందరు మహేశ్ బాబుతో సినిమా చేయబోతున్నారని గతంలో వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. ఆ ప్రాజెక్టుల కంటే ముందుగా ‘యానిమల్ పార్క్’నే ఆయన టేకప్ చేయనున్నారు. రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా రణ్విజయ్ సింగ్ బల్బీర్ పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటనకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. సినిమా ముగింపులో ‘యానిమల్ పార్క్’కు సంబంధించిన హింట్ ఇవ్వడంతో అప్పటి నుంచే సీక్వెల్‌పై భారీ ఆసక్తి ఏర్పడింది. ‘యానిమల్ పార్క్’లో రణ్‌బీర్ కపూర్ మరింత పవర్ఫుల్, డార్క్ అవతార్‌లో కనిపించనున్నాడనే అంచనాలు ఉన్నాయి. మొదటి భాగం కంటే సీక్వెల్ మరింత వైలెంట్‌గా, ఇంటెన్స్‌గా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ప్రభాస్ ‘స్పిరిట్’పై ఫోకస్ చేసిన సందీప్ రెడ్డి వంగా.. ఆ సినిమా తర్వాత ‘యానిమల్ పార్క్’ను పట్టాలెక్కించనున్నట్లు వస్తున్న ఈ క్లారిటీతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. రణ్‌బీర్ కపూర్ ప్రస్తుతం

పాన్-ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం చేతినిండా భారీ ప్రాజెక్ట్‌లతో వరుస సినిమాలు చేస్తూ అత్యంత బిజీగా ఉన్నాడు. ఆయన లైనప్‌లో ఉన్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో స్పిరిట్ (Spirit) ఒకటి. పాన్-ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం చేతినిండా భారీ ప్రాజెక్ట్‌లతో వరుస సినిమాలు చేస్తూ అత్యంత బిజీగా ఉన్నాడు. ఆయన లైనప్‌లో ఉన్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో స్పిరిట్ (Spirit) ఒకటి. ఇండియన్ సినిమాలో తనదైన బోల్డ్ అండ్ రా మార్క్‌తో సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో ఈ కాంబినేషన్ పై టాలీవుడ్‌తో పాటు మొత్తం ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే అద్భుతమైన అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్‌ను సందీప్ వంగా ఏ పవర్ఫుల్ పోలీస్ రోల్లో చూపించబోతున్నారా అని సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ చిత్రం విడుదలపై తాజాగా ఒక పుకారు వినిపిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 5 విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. కానీ, అందుతున్న సమాచారం ప్రకారం స్పిరిట్ వాయిదా పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని టాక్. ప్రభాస్ ప్రస్తుతం కమిట్ అయిన ఇతర చిత్రాల చిత్రీకరణల కారణంగా స్పిరిట్ ప్రధాన షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడమే దీనికి ప్రధాన కారణమని అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండటంతో స్పిరిట్ వర్క్ కొంత ఆలస్యమైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించి దాదాపు 60% షూటింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఇంకోపక్క అక్టోబర్ నెల నుంచి తదుపరి భారీ షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభించడానికి సందీప్ రెడ్డి వంగా అండ్ టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ప్రసిద్ధ నిర్మాణ సంస్థ టి-సిరీస్ ఒక కొత్త రిలీజ్ విండోను

రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతుంది. రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ ‘స్పిరిట్’ (Spirit). ఈ సినిమా ఆరంభం నుంచే ఆకాశాన్నంటే భారీ అంచనాలు ఉన్నాయి. యానిమల్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సందీప్ రెడ్డి వంగా తనదైన స్టైల్లో ప్రభాస్‌ను సరికొత్తగా చూపించబోతున్నారనే ప్రచారం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమా నుంచి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్‌తో పాటు సాధారణ సినీ లవర్స్ సైతం అత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు అంచనాలను మరింతగా రెట్టింపు చేయగా జాతీయ స్థాయిలో సామాజిక మాధ్యమాలు హోరెత్తిపోయాయి. ఇదిలాఉంటే.. ఇక ‘స్పిరిట్’ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే మూవీ షూటింగ్ 40 శాతానికి పైగా పూర్తయినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు జరిగిన చిత్రీకరణలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), కొరియన్ స్టార్ డాన్ లీ (Ma Dong-seok, Don Lee) పాత్రలకు సంబంధించిన సన్నివేశాలు లేవని టాక్ వినిపిస్తోంది. అయితే.. ‘స్పిరిట్’ చిత్రంలో చిరంజీవి, కొరియన్ స్టార్ డాన్ లీ కీ రోల్స్ చేస్తున్నారని గతంలో అనేక వార్తలు ఫుంఖాను ఫుంఖాలుగా వచ్చిన విషయం అందరికీ విధితమే. అంతేగాక ఈ వార్తలను మేకర్స్ ఇప్పటి వరకు అటు దృవీకరించక పోగా ఇటు ఖండించనూ లేదు. దీంతో ఈ సినిమాపై హైప్స్ ఓ రేంజ్లో పెరిగిపోయాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఈ చిత్రం షూటింగ్లో వీరిద్దరి పాత్రలకు సంబంధించిన ఎలాంటి సన్నివేశాలను చిత్రీకరించలేదని తెలుస్తోంది. దీంతో అసలు వీరిద్దరూ సినిమాలో ఉన్నారా? లేక తర్వాతి షెడ్యూల్లో అయిన వారి ఎంట్రీ ఉంటుందా? లేదా లేక ఇవన్నీ వ్యర్థ ప్రచారాలేనా అనే చర్చ

దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రూ.4,894 కోట్ల ఆదాయం వచ్చిందని జీఎం సందీప్ మాథుర్ వెల్లడించారు. 32 వేల మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసి రూ.3,300 కోట్ల ఆదాయం పొందిందని వివరించారు. విశాఖపట్నం, ఆగస్టు15: దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రూ.4,894 కోట్ల ఆదాయం వచ్చిందని జీఎం సందీప్ మాథుర్ వెల్లడించారు. 32 వేల మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసి రూ.3,300 కోట్ల ఆదాయం పొందిందని వివరించారు. శనివారం 80వ స్వాతంత్ర్య వేడుకలు సందర్భంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయంలో ఆయన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా జోన్ పరిధిలోని రైల్వే సిబ్బంది, అధికారులతోపాటు ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జీఎం సందీప్ మాథుర్ మాట్లాడుతూ.. భారతీయ రైల్వేలో18వ జోనల్ హెడ్ క్వార్టర్‌గా 2026 జూన్ 1వ తేదీన ప్రారంభమైందని గుర్తు చేశారు. దీంతో ఈ రైల్వే జోన్ ఆధ్వర్యంలో తొలిసారిగా ఈ స్వాతంత్ర వేడుకలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. జోన్ పరిధిలోని 1070 లోకోమోటివ్‌లలో ఇప్పటికే ప్రమాదాల నివారణకు 719 లోకోమోటివ్‌లకు కవచ్ ఏర్పాటు చేశామని అన్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో మౌలిక సదుపాయాలు కల్పనకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అందులోభాగంగా డబ్లింగ్, ట్రిప్లింగ్ ప్రాజెక్టులను రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. అందులో రూ.54,479 కోట్లు ఇప్పటికే వెచ్చించి పనులు చేపట్టామని ఆయన వివరించారు. విశాఖపట్నం యార్డ్ మోడలింగ్ ప్రాజెక్టుకు రూ.299 కోట్లు ఆమోదం లభించిందన్నారు. దీంతో 6 అదనపు లైన్లు, 6 అదనపు ప్లాట్‌ఫారాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. గుంతకల్- బళ్లారి డివిజన్లో నాలుగు లైన్లు నిర్మాణం కోసం రూ.1,205 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు జీఎం సందీప్ మాథుర్ వెల్లడించారు

Jangaon: బడుల్లో విద్యా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి కలెక్టర్ జనగామ: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్, విద్యా శాఖ అధికారి సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. మంగళవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్, విద్యా శాఖ అధికారి సందీప్ కుమార్ ఝా ఎంఈఓలు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రవేశాలు పెరిగిన పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు, విద్యార్థుల విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు, పాఠశాలల తనిఖీలు, తదితర అంశాలపై క్షుణ్ణంగా సమీక్షించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల కేటాయింపు ఉండేలా వర్క్ అడ్జస్ట్మెంట్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య అవసరానికి మించి ఉండగా, మరికొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉండే పరిస్థితి ఉండకూడదన్నారు. ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలను గుర్తించి, అవసరమైన మేరకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఏ పాఠశాల కూడా సింగిల్ టీచర్ పాఠశాలగా ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థి అభ్యసన స్థాయిని గుర్తించి, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శ్రద్ధతో బోధన అందించాలని, విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు ప్రణాళికాబద్ధంగా పని చేయాలన్నారు. “ఫోకస్‌తో పనిచేస్తే విద్యా రంగంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. ప్రతి చర్య చివరికి విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేలా ఉండాలి” అని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలలను అధికారులు క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఆదేశించారు. పాఠశాలలో ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల హాజరు, బోధనా ప్రక్రియ, విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, తదితర అంశాలను పరిశీలించాలని సూచించారు. "మిషన్ శిఖరం" కార్యక్రమం కింద జిల్లాలోని ప్రతి పాఠశాల

ప్రస్తుతం ప్రభాస్‌తో స్పిరిట్ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. క్రైమ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. అయితే స్పిరిట్ షూటింగ్ కొనసాగుతున్న సమయంలోనే సందీప్ రెడ్డి వంగా తదుపరి సినిమా గురించి పలు ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా సూపర్‌స్టార్ మహేష్ బాబుతో ఆయన సినిమా చేయబోతున్నారనే ప్రచారం కొంతకాలంగా వినిపిస్తోంది. తాజాగా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా వంగా షేర్ చేసిన ఒక ఏఐ వీడియో ఈ చర్చకు మరింత ఊతమిచ్చింది. మహేష్ బాబుకు బర్త్ డే విషెష్ చెబుతూ సోషల్ మీడియాని తగలబెట్టినంత పని చేశారు. మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ సందీప్ రెడ్డి వంగా ఒక ఏఐ రూపొందించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 1983లో విడుదలైన సూపర్‌స్టార్ కృష్ణ నటించిన కిరాయి కోటిగాడు సినిమాలోని ఓ సన్నివేశాన్ని ఈ వీడియో కోసం ఉపయోగించారు. అయితే అందులో కృష్ణ కనిపించాల్సిన స్థానంలో మహేష్ బాబు ముఖాన్ని ఏఐ సాంకేతికతతో ఉంచారు. సూపర్ స్టార్ కృష్ణ మాస్ గెటప్ లో పేరు కోటిగాడు అంటూ విలన్లకు తనని పరిచయం చేసుకుంటున్న డైలాగ్ ని మహేష్ బాబు చెబుతున్నట్లు ఏఐ ద్వారా రూపొందించారు. ఈ వీడియోపై మహేష్ బాబు కూడా స్పందించారు. సందీప్ రెడ్డి వంగా చేసిన పుట్టినరోజు శుభాకాంక్షలకు ప్రేమతో పాటు నవ్వుతున్న ఎమోజీలతో రిప్లై ఇచ్చారు. హహహా.. థ్యాంక్యూ సో మచ్ సందీప్. ఆల్ ద లవ్ టు యూ అంటూ మహేష్ బాబు స్పందించారు. దీనికి సందీప్ రెడ్డి వంగా కూడా స్పందిస్తూ ఐ లవ్ ద పోస్టర్ అండ్ డైలాగ్ అని పేర్కొన్నారు. ఇద్దరి మధ్య జరిగిన ఈ సరదా సోషల్ మీడియా సంభాషణ ఇప్పుడు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. మహేష్ బాబు ఇలాంటి తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ రెట్రో స్టైల్ లుక్ తో

Sandeep Reddy Vanga : నిన్న ఆగస్టు 9 మహేష్ బాబు పుట్టిన రోజు కావడంతో అందరూ రాజమౌళి వారణాసి సినిమా నుంచి అప్డేట్ ఆశించారు. కానీ రాజమౌళి సింపుల్ గా షూటింగ్ గ్యాప్ లో తీసిన రెండు ఫొటోలు రిలీజ్ చేసి పండగ చేసుకోండి అన్నట్టు బర్త్ డే పోస్ట్ పెట్టారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందుతున్నారు. కనీసం గ్లింప్స్ కాకపోయినా ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు అని ఆవేదన చెందారు. ఈ దెబ్బతో మహేష్ బర్త్ డే అన్న హైప్ లేకుండా పోయింది. కానీ ఒక్కసారిగా ఆ హైప్ ని సందీప్ రెడ్డి వంగ తీసుకొచ్చాడు. సందీప్ రెడ్డి వంగ కృష్ణ చెప్పిన ఓ డైలాగ్ ని AI వాడి మహేష్ బాబు చెప్పినట్టు వీడియో చేసి, ఆ వీడియోని షేర్ చేసి మహేష్ బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. దీంతో ఒక్కసారిగా ఆ మాస్ వీడియో వైరల్ అయింది. అది AI వీడియో అయినా ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలా ఉంది. దానికి తోడు మహేష్ బాబు సందీప్ పోస్ట్ కి రిప్లై ఇచ్చి థ్యాంక్స్ చెప్పాడు. దీంతో నిన్నంతా సందీప్ రెడ్డి వంగ షేర్ చేసిన వీడియో పోస్ట్ వైరల్ అయింది. మహేష్ ఫ్యాన్స్ కూడా రాజమౌళి షేర్ చేసిన సింపుల్ ఫోటోల కంటే కూడా సందీప్ షేర్ చేసిన మాస్ వీడియోనే ఇష్టపడ్డారు. అసలు ఈ మాస్ వీడియో సృష్టించిన హైప్ కి నిన్న వారణాసి సినిమా, రాజమౌళి షేర్ చేసిన మహేష్ ఫొటోలను పెద్దగా పట్టించుకోలేదు జనాలు. దీనికి తోడు గతంలో మహేష్ బాబుతో సందీప్ రెడ్డి వంగ సినిమా ఉందని, ఆల్రెడీ కథ చెప్పాడని, దానికి డెవిల్ అనే టైటిల్ కూడా పెట్టాలని ప్రచారం జరిగింది. ఇంకేముంది ఇప్పుడు సందీప్ బర్త్ డే విషెష్ చెప్తూ ఈ వీడియో పోస్ట్

సినీ ప్రపంచంలో అందరిలా ఆలోచిస్తే ఆయన సందీప్ రెడ్డి వంగా ఎందుకు అవుతాడు? అర్జున్ రెడ్డి నుంచి యానిమల్ వరకు ప్రతి సినిమాలోనూ, తన ప్రతి ఆలోచనలోనూ ఒక విలక్షణమైన ముద్ర వేసే ఈ ఫైర్‌బ్రాండ్ డైరెక్టర్, సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టినా అది ఒక సంచలనమే అవుతుంది. సినీ ప్రపంచంలో అందరిలా ఆలోచిస్తే ఆయన సందీప్ రెడ్డి వంగా ఎందుకు అవుతాడు? అర్జున్ రెడ్డి నుంచి యానిమల్ వరకు ప్రతి సినిమాలోనూ, తన ప్రతి ఆలోచనలోనూ ఒక విలక్షణమైన ముద్ర వేసే ఈ ఫైర్‌బ్రాండ్ డైరెక్టర్, సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టినా అది ఒక సంచలనమే అవుతుంది. గతంలో చిరంజీవి ఆరాధన పోస్టర్‌తో మెగా ఫ్యాన్స్‌ని ఫిదా చేసిన సందీప్, ఈసారి సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా చేసిన ఒక వినూత్న ప్రయోగం ఇప్పుడు టాలీవుడ్లో సరికొత్త చర్చకు తెరలేపింది. సాధారణంగా ఒక హీరో పుట్టినరోజు వస్తే డిజైనర్ పోస్టర్లతో శుభాకాంక్షలు చెప్పడం ఆనవాయితీ. కానీ సందీప్ వంగా ఏఐ సాంకేతికతను వాడుకుని మహేష్ కి శుభాకాంక్షలు చెప్పి షాక్ ఇచ్చాడు. మహేష్ తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ ఐకానిక్ మూవీ కిరాయి కోటిగాడులోని మాస్ సీన్‌ను రీ-క్రియేట్ చేశాడు. 'పేరు కోటిగాడు.. ఊరు తెనాలి. ఉద్యోగం కిరాయి తీసుకొని కాళ్లూ చేతులు విరగ్గొట్టడం' అంటూ కృష్ణ చెప్పే ఆల్-టైమ్ మాస్ డైలాగ్‌ను మహేష్ బాబు గొంతుతో, ఆయన బీడీ వెలిగిస్తున్న ఆల్ఫా యాటిట్యూడ్ అవతార్‌లో ప్రెజెంట్ చేసి ఏకంగా నెట్టింటిని షేక్ చేశాడు. ఇక దీంతో మహేష్ ఫ్యాన్స్ అందరూ సందీప్ - మహేష్ కాంబో ఫిక్స్ అయిన్నట్లే అని చెప్పుకొస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో రావాల్సిన సినిమా ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్పెషల్ విష్ చూసిన తర్వాత ఘట్టమనేని అభిమానుల్లో కొత్త ఆశలు చిగురించాయి. వారణాసి తరువాత మహేష్ .. సందీప్
రచయిత గురించిరాజశేఖర్. జిరాజశేఖర్ గుండాబత్తుని ‘సమయం తెలుగు’లో కాపీ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు కంటెంట్ రైటింగ్‌లో 7 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2025లో సమయంలో చేరిన రాజశేఖర్.. సినిమా రంగానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్లు, విశ్లేషణలు, స్పెషల్ స్టోరీలు రాస్తున్నారు. సినిమాల గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. సోషల్ మీడియా పోస్టులను ఆసక్తికర కథనాలుగా మలుస్తుంటారు. రాజశేఖర్ జేఎన్టీయూ-హైదరాబాద్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రముఖ పొలిటికల్ కన్సల్టెన్సీ ఐ-ప్యాక్ నుంచి ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్ పొందారు. తుపాకీ న్యూస్, ఏబీపీ దేశం, ఇండియా హెరాల్డ్ డాట్ కామ్ లాంటి మీడియా సంస్థల్లో సినిమా, ఎంటర్టైన్మెంట్ రంగాలకు సంబంధించిన వార్తలు రాశారు. 2019 ఎన్నికల టైంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం కూడా ఆయనకు ఉంది. ఖాళీ సమయంలో సినిమాలు చూడటం, పుస్తకాలు చదవడాన్ని ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి

బోనాల పండుగ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రముఖ లాల్‌దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. పండుగ వేళ అమ్మవారిని దర్శించుకునేందుకు సామాన్య భక్తులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆలయాలకు తరలివస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), ఆయన సోదరుడు, హీరో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) లాల్‌దర్వాజా మహంకాళి (Lal Darwaza Mahankali Temple) అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందించారు. విజయ్ దేవరకొండ ఆలయానికి వచ్చిన విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దర్శనం పూర్తి చేసుకుని ఆలయం నుంచి బయటకు వచ్చిన విజయ్ను చూసేందుకు యువత, అభిమానులు ఆసక్తి చూపించారు. ఆయనను తమ మొబైల్ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. విజయ్ కూడా అభిమానుల వైపు చేతులు ఊపుతూ వారిని పలకరించారు. దీంతో కొద్దిసేపు ఆలయ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. విజయ్ దేవరకొండతో పాటు ఆనంద్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా కనిపించడంతో అభిమానుల ఉత్సాహం మరింత పెరిగింది. వారిని చూసేందుకు వచ్చిన అభిమానులతో ఆలయం చుట్టుపక్కల సందడిగా మారింది