
Gold Silver Rates Today : గోల్డ్ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర.. నేటి రేట్లు ఇవే…
Gold Silver Rates Today : బంగారం, వెండి ధరల్లో ఇవాళ (బుధవారం) కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.
© 2026 nimisham.in

Gold Silver Rates Today : బంగారం, వెండి ధరల్లో ఇవాళ (బుధవారం) కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.

Trump Dollar Ccoins : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో నిలిచారు. అమెరికా 250వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా టంకశాల ప్రత్యేక నాణేన్ని ముద్రించింది. ఒకవైపు అధ్యక్షుడు ట్రంప్ ముఖం కనిపించే ఈ ఒక డాలర్ నాణెంను యూఎస్ మింట్ విక్రయానికి ఉంచింది. దాదాపు 100 ఏళ్ల తర్వాత జీవించి ఉన్న అమెరికా అధ్యక్షుడి చిత్రం దేశ కరెన్సీపై కనిపించడం ఇదే తొలిసారి. కొత్త నాణెంపై ట్రంప్ ముఖచిత్రంతో పాటు లిబర్టీ, 1776 అని ముద్రించారు. మరోవైపు అమెరికా సంయుక్త రాష్ట్రాల అధికారిక ముద్ర ఉండేలా డిజైన్ చేశారు. దీనిని ఈ ఏడాది యూఎస్ కమిషన్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆమోదం తెలియజేసింది. ఈ కమిషన్ సభ్యులను డొనాల్డ్ ట్రంప్ స్వయంగా నియమించారు. గంటల్లోనే స్టాక్ ఖాళీ.. ఈ ఒక డాలర్ నాణేలు భారీ ధరకు విక్రయానికి ఉంచారు. 25 నాణేలున్న ఒక రోల్ ధర 61 అమెరికన్ డాలర్లు (సుమారు రూ.5,500)గా, 100 నాణేలున్న ఒక బ్యాగ్ ధర 154.50 అమెరికన్ డాలర్లు (సుమారు రూ.14,000)గా నిర్ణయించారు. అయితే అమ్మకాలు ప్రారంభమైన కొన్ని గంటల్లోనే యూఎస్ మింట్ వెబ్సైట్లో ఈ నాణేలు ప్రస్తుతం స్టాక్‌లో లేవు అని కనిపించింది. వాషింగ్టన్ డీసీలోని యూఎస్ మింట్ స్టోర్‌లో ఏర్పాటు చేసిన వెండింగ్ మెషీన్ల ద్వారా కూడా ఈ నాణేలను విక్రయిస్తున్నారు. నాణెంలో బంగారం లేదు.. ఇదిలాఉంటే.. ట్రంప్ చిత్రంతో ఉన్న ఈ నాణెం బంగారు రంగులో కనిపించినప్పటికీ ఇందులో అసలు బంగారం లేదని యూఎస్ మింట్ తెలిపింది. నాణెంలో 88.5 శాతం రాగి ఉండగా, మిగిలిన భాగంలో జింక్, మాంగనీస్, నికెల్ వంటి లోహాలను ఉపయోగించారు. ఇదిలా ఉండగా, ట్రంప్ చిత్రాన్ని అమెరికా నోటుపై ముద్రించే అంశం కూడా గతంలో చర్చకు వచ్చింది. మే నెలలో అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్.. ట్రంప్ చిత్రంతో కూడిన కొత్త 250డాలర్ల నోటును

చెట్ల కొమ్మల తొలగింపు, నిర్వహణ పనుల కారణంగా గ్రీన్‌పార్క్ ఫీడర్ పరిధిలోని కొన్ని ఏరియాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్: చెట్ల కొమ్మల తొలగింపు, నిర్వహణ పనుల కారణంగా గ్రీన్‌పార్క్ ఫీడర్ పరిధిలోని కాప్రా, శాంతివిహార్ కాలనీ, గ్రీన్‌పార్క్, అశోక్ కాలనీ, రామ్దాస్నగర్ పరిసర ప్రాంతాలలో గురువారం ఉదయం 10 నుంచి 12గంటల వరకు, లక్ష్మీపురం ఫీడర్ పరిధిలోని రుక్మిణీపురి, అయోధ్యనగర్, నయాక్రాంతినగర్, త్యాగరాయనగర్, లక్ష్మీపురం, బృందావన్ కాలనీ పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, జనప్రియ ఫీడర్ పరిధిలోని జనప్రియ టౌన్‌షి్‌ప పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని సైనిక్‌పురి సెక్షన్ ఏఈ సత్యనారాయణ తెలిపారు. కొనసాగుతున్న ధరల పతనం.. 3 రోజుల్లో రూ.6 వేల పైచిలుకు మేర తగ్గుదల

మీరు ఉదయం లేదా సాయంత్రం సమయంలో ఇంట్లోంచి బయటకు వెళితే చాలు స్కూల్ పిల్లలు కనిపిస్తారు. ఈ సమయంలో వాళ్ల యూనిఫామ్స్ గమనిస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి స్కూల్‌కు సొంత యూనిఫామ్ ఉంటుంది… ఆ డిజైన్లు చాలా విభిన్నంగా ఉంటాయి. ఒక స్కూల్లో షర్ట్-ప్యాంట్ ఉంటే, మరో స్కూల్లో కుర్తా లేదా బ్లేజర్ ఉండొచ్చు. మరి దేశమంతటికీ ఒకే యూనిఫామ్ ఎందుకు లేదు? దీనికి ఒకటి కాదు చాలా కారణాలున్నాయి. యూనిఫామ్ డిజైన్‌ను వాతావరణం బాగా ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు వేడి ప్రాంతాల్లోని స్కూళ్లు తేలికైన, గాలి ఆడే దుస్తులను ఎంచుకుంటాయి. అదే చల్లని ప్రాంతాల్లోని స్కూళ్లలో స్వెటర్లు, బ్లేజర్లు ధరిస్తారు. యూనిఫామ్ ఎంపికలో వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని NCF కూడా చెబుతోంది. స్కూళ్లలో యూనిఫామ్స్ పెట్టడానికి చాలా కారణాలున్నాయి. పరిశోధనల ప్రకారం, యూనిఫామ్ ధరించడం వల్ల విద్యార్థుల మధ్య బట్టల విషయంలో కనిపించే వ్యత్యాసాలు తగ్గుతాయి. పేద, ధనిక అనే తేడా కనిపించకుండా అందరూ సమానమనే భావన కలుగుతుంది. ప్రతి స్కూల్‌కు దాని సొంత చరిత్ర, సంప్రదాయాలు ఉంటాయి. ఇవి యూనిఫామ్ డిజైన్‌పై ప్రభావం చూపుతాయి. కొన్ని స్కూళ్లు ఏళ్ల తరబడి తమ పాత యూనిఫామ్ డిజైన్‌నే కొనసాగిస్తాయి. మరికొన్ని స్కూళ్లు కాలానుగుణంగా డిజైన్లను మారుస్తూ సంప్రదాయానికి, ఆధునికతకు మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తాయి. యూనిఫామ్ ఫ్యాబ్రిక్, డిజైన్ ఎంపికలో ప్రాక్టికాలిటీ కూడా ఒక ముఖ్యమైన అంశం. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆ యూనిఫామ్‌ను కొనుగోలు చేయగలగాలి. అలాగే విద్యార్థులు రోజంతా దాన్ని సౌకర్యవంతంగా ధరించగలగాలి
బాదం గింజల్లో విటమిన్ ఇ, హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. జ్ఞాపకశక్తిని పెంచి చదివింది బాగా గుర్తుండేందుకు సహాయపడతాయి. మెదడు ఆకారాన్ని పోలి ఉండే వాల్నట్స్ జ్ఞాపకశక్తిని పెంచేందుకు సహాయపడతాయి. పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యేవారు ఈ వాల్నట్స్ తింటే చదివింది బాగా గుర్తు ఉంటుంది. నెయ్యిలో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి నరాల పనితీరును బాగుచేస్తాయి. మెదడును చురుకుగా ఉంచి చదివింది బాగా గుర్తుండేందుకు సహాయపడతాయి. అయితే మితంగా తీసుకోవడం మంచిది. పల్లీల్లో నియాసిన్, రెస్వెరట్రాల్, హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే బెల్లంలో ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. ఈ రెండింటితో తయారుచేసే చిక్కీలు తినడం ద్వారా జ్ఞాపకశక్తి బాగుంటుంది. పాలకూర, తోటకూర, మునగాకు, మెంతి ఆకులు వంటి ఆకుకూరల్లో మెగ్నీషియం, ఫోలేట్, విటమిన్ కె వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. మఖానాలో విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. నెయ్యిలో తేలికగా వేయించిన ఈ మఖానా స్నాక్ రూపంలో తీసుకుంటే మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఉసిరిలో విటమిన్ సి ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్ నుంచి మెదడు కణాలను రక్షిస్తుంది. అందుకే ఉసిరిని డైట్లో చేర్చుకోవడం ద్వారా జ్ఞాపశక్తి బాగుంటుంది. నేరేడు పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరు చురుకుగా ఉంచేందుకు సహాయపడతాయి. తద్వారా చదివింది బాగా గుర్తుంటుంది. రాగాలు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, సామలు లాంటి చిరు ధాన్యాల్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి మీ శక్తిని ఎక్కువసేపు తగ్గకుండా కాపాడి మెదడును చురుకుగా ఉంచుతాయి
Gold Price Fall : గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు ఒక్కసారిగా పతనమవుతున్నాయి. బులియన్ మార్కెట్లో వరుసగా 4 రోజుల్లో తులం బంగారం (24 క్యారెట్లు) ధర ఏకంగా రూ.9110 మేర పడిపోయింది. ఆగస్టు 29వ తేదీన దాదాపు రూ.3 వేలు దిగొచ్చిన బంగారం ధర ఆ తర్వాత వరుస సెషన్లలో భారీగా పడిపోతూ వస్తోంది. దేశంలో పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్న తరుణంలో బంగారం ధరలు ఇలా భారీగా తగ్గుతుండడం కొనుగోలుదారులకు ఊరటగా చెప్పవచ్చు. వెండి రేటు రూ.10 వేలు తగ్గి రూ.2.50 లక్షల స్థాయికి మళ్లీ దిగివచ్చింది. అయితే, బంగారం ధరలు భారీగా పడిపోయేందుకు గల కారణాలేంటి? ఇంకా తగ్గుతాయా? బులియన్ మార్కెట్ విశ్లేషకులు ఏం చెబుతున్నారు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.నేటి బంగారం ధరలు ఇలాదేశీయ మార్కెట్లో పసిడి ధరలు వరుసగా నాలుగో రోజూ తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం రేటు ఇవాళ ఒక్కరోజే రూ.2070 మేర తగ్గింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్‌లో తులం బంగారం ధర రూ.1,52,020 వద్దకు దిగివచ్చింది. ఇక 22 క్యారెట్ల నగల తయారీ బంగారం రేటు ఈరోజు రూ.1900 మేర పడిపోయింది. దీంతో తులం రేటు రూ.1,39,350 వద్దకు పడిపోయింది. ఇక కిలో వెండి ధర రూ.10 వేలు తగ్గడంతో రూ.2,50,000 వద్ద ట్రేడవుతోంది.ఆ ఒక్క కారణంతోనే భారీ పతనంఇరాన్పై అమెరికా భీకర దాడులు చేపడుతుండడంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. దీంతో మార్కెట్లు ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఒక వైపు ముడి చమురు ధరలు పెరుగుతుండగా బంగారం, వెండి వంటి విలువైన లోహాలకు డిమాండ్ తగ్గుతోంది. దీంతో పసిడి ధరలు భారీగా దిగివస్తున్నాయి. సాధారణంగా యుద్ధం జరిగితే బంగారం ధరలు పెరుగుతాయి. కానీ, పశ్చిమాసియా యుద్ధం విషయంలో క్రూడ్ ఆయిల్ ప్రధాన పాత్ర పోషించడంతో రివర్స్ జరుగుతోంది. బంగారం, వెండి వండి విలువైన ఖనిజాల ధరలు
పాలకూర, కాలే వంటి ఆకుకూరల్లో అన్ని రకాల విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. రొమ్ము క్యాన్సర్ రిస్క్‌ను తగ్గిస్తాయి. బ్రోకలీ, క్యాబేజీ, బ్రసెల్స్ స్ప్రౌట్స్‌లో గ్లూకోసినోలేట్స్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రిస్తాయి. వెల్లుల్లి, ఉల్లిపాయల్లో సల్ఫర్ సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలను నిర్మూలిస్తాయి. నారింజ, నిమ్మ, గ్రేప్‌ఫ్రూట్‌లో విటమిన్ సి, ఫోలేట్‌తో పాటుగా, ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్‌ను తగ్గిస్తాయి. సాల్మన్, ట్యూనా, మాకెరెల్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వాపును తగ్గిస్తాయి. ఫ్యాటీ చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. బీన్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బీన్స్ తింటే హార్మోన్లు స్థిరంగా ఉంటాయి. బీన్స్ తింటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. బ్లూ బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, రాస్ప్ బెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. బెర్రీస్ తింటే క్యాన్సర్ కణాలు తగ్గుతాయి. టోపు, ఎడమామే, సోయా పాలలో ఐసోఫ్లేవోన్లు ఉంటాయి. ఇవి ఈస్ట్రోజన్ లెవెల్స్‌ను స్థిరంగా ఉంచుతాయి. సోయా ఫుడ్ తింటే బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. బ్రౌన్ రైస్, క్వినోవా, బార్లీ, ఓట్స్ వంటివి ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి

దేశంలో వాణిజ్య అవసరాలకు ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరలు మళ్లీ పెరిగాయి. పెంచిన రేట్లు ఈ తెల్లవారుజామున 6 గంటల నుంచి అమలులోకి వచ్చాయి. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 9.50 పైసల మేర పెరిగింది. గృహావసరాల కోసం వినియోగించే ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్లపై ఎలాంటి అదనపు భారం పడలేదు. వాటి రేట్లు యధాతథంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు చమురు మార్కెటింగ్ కంపెనీలు ఉత్తర్వులు ఇచ్చాయి.ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ విడుదల చేసిన తాజా ధరల వివరాల ప్రకారం, ఈ పెంపు వాణిజ్య పరమైన ఎల్పీజీ వినియోగానికి మాత్రమే పరిమితమైంది. అయిదు కిలోల నాన్-డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధర కూడా పెరిగింది. నిన్నటివరకు 762 రూపాయలు ఉన్న అయిదు కిలోల నాన్ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్ ధర ఇప్పుడు 764 రూపాయలకు చేరుకుంది. అయిదు కిలోల డొమెస్టిక్ సిలిండర్లు, ఎక్స్‌ట్రాలైట్ గ్యాస్ ధరల జోలికి వెళ్లలేదు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.ఈ పెంపుతో దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. దేశ రాజధానిలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ. 2,738 నుంచి రూ. 2,747.50కు చేరింది. ఆర్థిక రాజధాని ముంబైలో ఈ సిలిండర్ ధర రూ. 2,691.50 నుంచి రూ. 2,701కు పెరిగింది. చెన్నైలో దీని ధర రూ. 10.50 పైసల మేర పెరిగింది. ఇక్కడ వాణిజ్య సిలిండర్ ధర ఇప్పుడు రూ. 2,916.50కు చేరుకుంది.నేటి నుంచి.. అరుణాచలం, తమిళనాడులోని ఇతర ఆలయాలకు వెళ్లే భక్తులకు ముఖ్య గమనికహోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ వ్యాపారాలు, ఇతర చిరు క్యాంటీన్లు.. ఈ 19 కిలోల వాణిజ్య సిలిండర్లపైనే ఆధారపడతాయి. తాజా పెంపు పెద్ద వడ్డన కాకపోయినప్పటికీ.. ఇప్పటికే రేట్లు 2,800 రూపాయలను దాటిన నేపథ్యంలో అవి భారంగానే మారాయి. చిన్న చిన్న హోటళ్ల నిర్వహణ వ్యయంపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది

భారత్‌లో అమెరికా పెట్టుబడుల విలువ మరింత పెరిగింది. 2025 చివరి నాటికి భారత సెక్యూరిటీల్లో అమెరికా పెట్టుబడుల విలువ 390 బిలియన్ డాలర్లకు చేరింది. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.33 లక్షల కోట్లకు సమానం. అమెరికా ట్రెజరీ విభాగం తాజాగా విడుదల చేసిన ప్రాథమిక గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది.2024 చివరి నాటికి భారత్‌లో అమెరికా పెట్టుబడుల విలువ 383 బిలియన్ డాలర్లుగా ఉంది. ఏడాదిలో మరో 7 బిలియన్ డాలర్లు పెరిగింది. అంటే దాదాపు 1.8 శాతం వృద్ధి నమోదైంది. అమెరికా పెట్టుబడులను ఎక్కువగా భారత స్టాక్ మార్కెట్లోనే పెట్టింది. 2025 చివరికి భారత ఈక్విటీల్లో అమెరికా పెట్టుబడుల విలువ 380 బిలియన్ డాలర్లుగా ఉంది. 2024లో ఇది 373 బిలియన్ డాలర్లు.భారత దీర్ఘకాలిక రుణ పత్రాల్లో అమెరికా పెట్టుబడులు 11 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతకుముందు ఏడాది ఇవి 10 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. స్వల్పకాలిక రుణ పత్రాల్లో పెట్టుబడులు 500 మిలియన్ డాలర్ల కంటే తక్కువగా ఉన్నాయి.ఈ గణాంకాలు అమెరికా పెట్టుబడిదారుల వద్ద ఉన్న భారత సెక్యూరిటీల మార్కెట్ విలువను మాత్రమే సూచిస్తాయి. కర్మాగారాలు, మౌలిక వసతులు వంటి భౌతిక ఆస్తుల్లో చేసిన ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు ఇందులో ఉండవు.చైనాను వెనక్కి నెట్టిన భారత్అమెరికా పెట్టుబడులను ఆకర్షించడంలో భారత్ 12వ స్థానంలో నిలిచింది. గత ఏడాది కూడా ఇదే ర్యాంక్‌లో ఉంది. భారత్‌లో అమెరికా పెట్టుబడులు 390 బిలియన్ డాలర్లు కాగా.. చైనాలో 318 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంటే చైనాతో

పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. 2026-27 మార్కెటింగ్ సీజన్‌కు పత్తి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8,667గా నిర్ణయించింది. సీసీఐ కొనుగోళ్లు చేపడితే రైతులకు ప్రయోజనం జమ్మికుంట(కరీంనగర్): పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. 2026-27 మార్కెటింగ్ సీజన్‌కు పత్తి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8,667గా నిర్ణయించింది. గత సీజన్లో రూ.8, 110గా ఉన్న మద్దతు ధరను ఈసారి రూ.557 పెంచింది. దీంతో పత్తి సాగు చేస్తున్న రైతుల్లో కొంతమేర హర్షం వ్యక్తమవుతోంది. గతేడాది 4.15లక్షల క్వింటాళ్ల క్రయవిక్రయాలు జరగ్గా, సీసీఐ 1.49లక్షల క్వింటాళ్ల పత్తిని మద్దతు ధర ప్రకారం సేకరించింది. మిగితా 2.69లక్షల పత్తిని ప్రైవేట్ వ్యాపారులు కొనుగోళ్లు చేపట్టారు. అయితే పెంచిన మద్దతు ధర తమకు దక్కాలంటే మొత్తం పంటను సీసీఐ కొనుగోలు చేయా లని రైతులు కోరుతున్నారు. పత్తి సాగులో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు ఏటా పెరుగుతున్నాయి. దీనికితోడు వాతావరణ పరిస్థితులు, చీడపీడలు, దిగుబడుల్లో హెచ్చుతగ్గులతో రైతులు నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో క్వింటా ల్కు రూ.557 మద్దతు ధర పెరుగడం కొంత ఊరట నిస్తుందని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వ మద్దతు ధర ప్రకటించినా.. పూర్తి స్థాయి లో సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగోళ్లు చేపట్టకపోతే ప్రయోజనం ఉండదని రైతులు అంటున్నారు. ప్రతియేటా ప్రైవేట్ వ్యాపారుల చేతుల్లో ధరల విషయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందంటున్నారు. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ పరిధిలో పత్తి ప్రధాన పంట. సీజన్లో సెప్టెంబర్ మాసం నుంచి పత్తి మార్కెట్‌కు వస్తుంది. కొనుగోళ్లలో తేమ, నాణ్యత ప్రమాణాలను పాటించినప్పటికీ రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. పత్తిని మార్కెట్‌కు తీసుకువచ్చిన రైతులకు పారదర్శకంగా ధర నిర్ణయించి, ఎలాంటి అనవసర కోతలు లేకుండా కొనుగోళ్లు చేప ట్టాలి. ప్రభుత్వం ప్రకటించిన రూ.8,667 మద్దతు ధర కాగితాలకే పరిమితం కాకుండా రైతులకు అందాలంటే సీసీఐ కొనుగోలు కేంద్రాలను

శ్రావణ మాసం రాకతో దేశమంతటా పండుగల కోలాహలం మొదలైంది. వరలక్ష్మీ వ్రతం, వినాయక చవితి, దసరా వేడుకల కోసం పసిడి ఆభరణాలు కొనుగోలు చేసేందుకు మహిళలు, కుటుంబాలు సిద్ధమవుతున్న వేళ మార్కెట్లో పసిడి ధరలు షాకిస్తున్నాయి.పెళ్లిళ్ల సీజన్, పండుగల సెంటిమెంట్‌కు తోడు గ్లోబల్ మార్కెట్లో నెలకొన్న పరిణామాలతో బంగారం ధరలు ఒక్కసారిగా రాకెట్ స్పీడ్ అందుకున్నాయి. ఈ ఒక్క వారంలోనే పసిడి ఏకంగా 5 శాతం మేర ప్రియమైంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 4,620 డాలర్ల దాకా చేరగా, దేశీయంగా ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల తులానికి రూ. 1,60,780 దాటేసింది. గడిచిన రెండున్నర నెలల కాలంలో పసిడి ఈ స్థాయి గరిష్ఠ రేటును తాకడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.ధరలు ఒక్కసారిగా పెరగడానికి అసలు కారణాలేంటి?అంతర్జాతీయంగా మారిన ఆర్థిక సమీకరణాలే ఈ సడన్ ర్యాలీకి ప్రధాన కారణమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ తమ రుణాలు తగ్గించుకునేందుకు బాండ్ల బైబ్యాక్‌ను రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించడంతో డాలర్ విలువ, బాండ్ ఈల్డ్స్ ఒక్కసారిగా క్షీణించాయి.మరోవైపు అమెరికాపై 40 ట్రిలియన్ డాలర్లకు పైగా అప్పుల భారం పెరగడం, పెరుగుతున్న ద్రవ్యోల్బణ భయాలు గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. విదేశీ కరెన్సీల కంటే సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్గా భావించే పసిడి వైపే పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు మొగ్గు చూపడంతో ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి.వామ్మో.. పసిడి ధరలు చూసి నివ్వెరపోతున్న సామాన్యుడుమున్ముందు బంగారం బాట ఎటు?బులియన్ మార్కెట్ విశ్లేషకుల అంచనా ప్రకారం... బంగారం గతంలో ఉన్న రూ. 1,53,000 - 1,56,000 పరిధి నుంచి దాటుకుని ఇప్పటికే రూ. 1,58,500 మైలురాయిని దాటేసింది. ప్రస్తుత ట్రెండ్ ఇలాగే కొనసాగితే త్వరలోనే 10 గ్రాముల బంగారం రూ. 1,62,000 మార్కును తాకినా ఆశ్చర్యపోనక్కర్లేదని భావిస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్ల నిర్ణయాలు, అమెరికా డాలర్ కదలికలు , మధ్యప్రాచ్య

Madanapalle: రాయచోటిలో తగ్గించి.. మదనపల్లెలో పెంచిన ప్రభుత్వ హెచ్ఆర్ఏ! Madanapalle: అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో నివాసం ఉంటున్న ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆయా ఉద్యోగుల ఇంటి అద్దెను 12 నుంచి 16 శాతానికి పెంచుతూ ప్రభుత్వ కార్యదర్శి రోనాల్డ్ రాస్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు రాయచోటిలో నివసించే ఉద్యోగుల ఇంటి అద్దెను తగ్గించారు. జిల్లా కేంద్రం మార్పు నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు
శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి ఇల్లూ కళకళలాడిపోతుంది. పూజలు, వ్రతాలతో లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది.హిందువులకు శ్రావణ మాసం వచ్చిందంటే పండగ వాతావరణమే. మహిళలు తాము ముస్తాబవ్వడమే కాకుండా ఇంటిని కూడా చూడచక్కని విధంగా అలంకరిస్తారు. దాంతో ప్రతి శుభకార్యంలో తప్పక కావాల్సిన తమలపాకు ధరకు రెక్కలు వచ్చాయి. ప్రతీ తాంబూలంలోనూ తమలపాకే ముఖ్యం. తమలపాకు లేనిదే ఏ శుభకార్యం కూడా జరగదు. దాంతో తమలపాకుతో పాటు అరటిపళ్లు, కొబ్బరి కాయలు, పూల రేట్లకు రెక్కలు వచ్చాయి.రాష్ట్రంలో ఎక్కువగా ఉన్న చింతలపూడి, మాచవరం, ములుకుదురు ప్రాంతాల్లో తమలపాకు తోటలు ఉన్నాయి. రైతు వద్ద తక్కువకే కొనుగోలు చేస్తున్న వ్యాపారులు.. తమ కొట్లల్లో మాత్రం భారీగా అమ్మేస్తున్నారు. ఎందుకంటే పండగ సీజన్లో తమలపాకుకు ఉన్న డిమాండ్ అలాంటిది. రైతు వద్ద 150 ఆకుల కట్టను రూ. 16కు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు.. విడిగా ప్రజలకు మాత్రం ఒక్కొక్కటి రూపాయి చొప్పున విక్రయిస్తున్నారు. మంగళగిరి ప్రాంతంలో అయితే 30 ఆకులను రూ. 50 వరకు వసూలు చేస్తున్నారు.READ ALSO గోదావరి నది మధ్యలో క్యాండిల్ లైట్ డిన్నర్.. అందమైన బోటు, ఆ లోపల బెడ్డు.. పర్యాటకులకు స్వర్గమే, ఫుల్ డీటెయిల్స్ ఇవిగో!తమలపాకుతో పాటు కొబ్బరి కాయలు కూడా భారీగా పెరిగాయి. శ్రావణ మాసానికి ముందు కొబ్బరి కాయ సైజును బట్టి రూ. 15 నుంచి రూ. 35 మధ్య అమ్మేవారు. ప్రస్తుతం మీడియం సైజు కాయ ధరే రూ. 50 ఉంది. అరటి పళ్లు కూడా గతంలో డజను రూ. 40 నుంచి రూ. 60 వరకు అమ్మేవారు. ఇప్పుడు అదే అరటి కాయ ప్రాంతాన్ని బట్టి పెరిగిపోయింది. యావరేజ్‌గా రూ. 80 నుంచి రూ. 100 వరకు అమ్మేస్తున్నారు.వర్షాభావ పరిస్థితుల్లో పూలకు మంచి డిమాండ్ పెరిగింది. వర్షాలు సరిగా లేకపోవడంతో కాల్వల కింద, బోర్ల కింద పండిస్తూ భారీ లాభాలు ఆర్జిస్తున్నారు. గతంలో రూ. 200 లోపే
Tata Car Price Increase September 1: కొత్తగా కార్లు కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ షాకులు తగులుతున్నాయి. దిగ్గజ కార్ల తయారీ సంస్థలు వరుసగా కార్ల ధరల్ని పెంచుతుండటమే కారణం. ఇప్పటికే మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్ ఇండియా కార్ల ధరల పెంపుపై ప్రకటన చేయగా, తాజాగా టాటా గ్రూప్ దిగ్గజ సంస్థ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ కూడా ధరల్ని పెంచుతున్నట్లు ( Tata Motors Car Price Hike) ప్రకటన చేసింది. తమ కార్లు, SUV లపై ఎంపిక చేసిన మోడళ్లు, వేరియంట్లను బట్టి గరిష్ఠంగా రూ. 25 వేల వరకు పెంచుతామని స్పష్టం చేసింది. ఈ కొత్త సవరించిన ధరలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది.అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ అనిశ్చితి కారణంగా ముడి సరకులు, ఇతర కమొడిటీ ధరలు పెరుగుతున్న తరుణంలో ధరల్ని తప్పక పెంచాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని టాటా మోటార్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ధరల పెంపు తమ అన్ని రకాల వాహనాలపై (పోర్ట్‌ఫోలియో) వర్తిస్తుందని, అయితే మోడల్, వేరియంట్‌ను బట్టి ధరల పెంపులో తేడా ఉంటుందని వివరించింది. ఇది ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ICE), ఎలక్ట్రిక్ వెహికిల్స్ (EV) రెండింటిపైనా ఉంటుందని స్పష్టం చేసింది. ద్రవ్యోల్బణం పెరుగుతుండటం కూడా ఇక్కడ ధరల పెంపునకు ప్రధాన కారణంగా ఉందని చెబుతోంది.టాటా మోటార్స్ ఈ త్రైమాసికంలోనే ఏకంగా రెండు సార్లు ధరల పెంపును ప్రకటించడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే జూన్ నెలలో ఒకసారి తమ ప్యాసింజర్ వాహనాల ధరల్ని 1.5 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. అది జులై 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో కొంత కాలంగా ధరలు భారీగా పెరుగుతున్నాయని అర్థం చేసుకోవచ్చు. గతేడాది జీఎస్టీ సంస్కరణలతో కార్ల ధరలు భారీగా తగ్గగా, మళ్లీ ధరల పెంపుతో ఆ స్థాయికే చేరుతున్నట్లు తెలుస్తోంది.Read Also: జులైలో అత్యధికంగా అమ్ముడుబోయిన కార్లు ఇవే

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’. ఈ మూవీ నుంచి దీపికను తీసేయడానికి గల అసలు కారణం నిర్మాత రివీల్ చేశారు. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) హీరోగా, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’ (Spirit). ఈ భారీ ప్రాజెక్ట్‌లో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నటించనుందంటూ గతంలో ప్రచారం సాగడం, ఆ తర్వాత ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుందంటూ వార్తలు రావడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ సినిమా విషయంలో దీపికా పదుకొణె (Deepika Padukone) చేసిన కామెంట్స్ ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ కాస్టింగ్ వివాదంపై సందీప్ రెడ్డి వంగా సోదరుడు, చిత్ర సహ నిర్మాత ప్రణయ్ రెడ్డి (Pranay Reddy Vanga) వంగా తాజాగా స్పందించి అసలు నిజాన్ని బయటపెట్టారు. దీపికాతో దాదాపు ఏడాదిన్నర పాటు చర్చలు జరిపినప్పటికీ ప్రాజెక్ట్ ఎందుకు వర్కవుట్ కాలేదో స్పష్టంగా వివరించారు. ప్రణయ్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. ‘‘సందీప్ దాదాపు ఏడాదిన్నర పాటు దీపికా పదుకొణెతో ‘స్పిరిట్’ కథ, ఆమె పాత్రకు సంబంధించి చర్చలు జరిపారు. ఆమెకు కథ విపరీతంగా నచ్చినప్పటికీ కొన్ని కఠినమైన వ్యాపార నిబంధనలు, షరతుల వల్లే ఆమెను ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకోలేకపోయాం. భారీ రెమ్యూనరేషన్ పెంపుతో పాటు సినిమా లాభాల్లో ఏకంగా 10 శాతం వాటా కావాలని ఆమె డిమాండ్ చేశారు. అంతేకాకుండా రోజువారీ షూటింగ్ పనివేళలకు సంబంధించి కూడా ఆమె పెట్టిన నిబంధనలు సినిమా మేకింగ్‌కు అనుకూలంగా అనిపించలేదు’’ అని తెలిపారు. భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతోన్న ఈ సినిమా నిర్మాణానికి ఈ రకమైన షరతులు సమంజసంగా అనిపించకపోవడంతోనే పరస్పర అంగీకారంతో ఆమె

ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా, స్వర్ణముఖి నది ఒడ్డున వెలసిన పవిత్ర శైవ క్షేత్రం శ్రీకాళహస్తి. మన దేశంలో ఉన్న అత్యంత ప్రాచీన, మహిమాన్వితమైన ఆలయాల్లో ఇది ఒకటి. ఈ క్షేత్రాన్ని "దక్షిణ కైలాసం" లేదా "దక్షిణ కాశీ" అని ఎంతో భక్తితో పిలుస్తారు. పంచభూత క్షేత్రాలలో ఇది వాయులింగ క్షేత్రంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ పవిత్ర క్షేత్రం వెనుక ఉన్న ఆసక్తికరమైన చరిత్ర, ఆధ్యాత్మిక విశేషాలు, శాస్త్రీయ రహస్యాలు మిమ్మల్ని షాక్ కు గురిచేస్తాయి. ఈ ఆలయానికి ఆ పేరు రావడం వెనుక ఒక అద్భుతమైన పురాణ కథ ఉంది. 'శ్రీ', 'కాళ', 'హస్తి' అనే మూడు పదాల కలయికతో శ్రీకాళహస్తి ఏర్పడింది. ఈ మూడు జీవులు తమ తమ రీతుల్లో శివలింగాన్ని పూజించి మోక్షాన్ని పొందాయి. సాలీడు తన నూలు గూడుతో, పాము రత్నాలతో, ఏనుగు స్వర్ణముఖి నది నీరు, పూలతో పరమశివుడిని ఆరాధించాయి. వీరి నిష్కల్మషమైన భక్తికి మెచ్చి పరమేశ్వరుడు మోక్షాన్ని ప్రసాదించాడు. అందుకే ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. శ్రీకాళహస్తి ఆలయం పంచభూత స్థలాలలో వాయు తత్వానికి ప్రతీక. గర్భగుడిలో ఉండే శివలింగం స్వయంభూ, చతురస్రాకారంలో తెల్లని వర్ణంలో ఉంటుంది. ఇక్కడి అత్యంత విచిత్రమైన విషయం ఏమిటంటే, గర్భగుడిలో గాలి వీచడానికి ఎలాంటి మార్గాలు లేకపోయినా, శివలింగానికి ఇరువైపులా ఉండే అఖండ జ్యోతుల జ్వాలలు నిరంతరం రెపరెపలాడుతూ ఊగుతుంటాయి. ఇది స్వామివారి వాయు స్వరూపానికి, ఉచ్ఛ్వాస నిశ్వాసలకు ప్రత్యక్ష నిదర్శనమని భక్తులు బలంగా నమ్ముతారు. అంతేకాకుండా ఇక్కడి మూలవిరాట్టును పూజారులు కూడా నేరుగా చేతులతో తాకరు. సాధారణంగా సూర్య గ్రహణం లేదా చంద్ర గ్రహణ సమయాల్లో దేశంలో ఉన్న అన్ని చిన్న, పెద్ద ఆలయాలను మూసివేస్తారు. కానీ శ్రీకాళహస్తి ఆలయం మాత్రం గ్రహణ సమయాల్లో కూడా తెరిచే ఉంటుంది. ఆ సమయంలో స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. గ్రహణ ప్రభావం పడని

దేశంలో స్మార్ట్ఫోన్ల ధరలు మరింత ప్రియమవుతున్నాయి. ప్రముఖ మొబైల్ బ్రాండ్లు రియల్మీ, ఒప్పో, వివో, సామ్సంగ్, వన్‌ప్ల్‌స ఎంపిక చేసిన మోడళ్ల ధరలను పెంచేశాయి. ఫోన్ల తయారీలో... ధరలు పెంచిన రియల్మీ, ఒప్పో, వివో, సామ్సంగ్, వన్‌ప్ల్‌స చిప్‌ల రేట్లు పెరగడమే ప్రధాన కారణమంటున్న కంపెనీలు న్యూఢిల్లీ: దేశంలో స్మార్ట్ఫోన్ల ధరలు మరింత ప్రియమవుతున్నాయి. ప్రముఖ మొబైల్ బ్రాండ్లు రియల్మీ, ఒప్పో, వివో, సామ్సంగ్, వన్‌ప్ల్‌స ఎంపిక చేసిన మోడళ్ల ధరలను పెంచేశాయి. ఫోన్ల తయారీలో కీలకమైన మెమొరీ, చిప్సెట్ల ధరలు పెరగడమే ఇందుకు కారణమని కంపెనీలంటున్నాయి. పశ్చిమాసియా సంక్షోభంతో పెరిగిన ధరాఘాతం కారణంగా వినియోగదారులు ఆచితూచి ఖర్చు చేస్తున్న నేపథ్యంలోనూ మొబైల్ కంపెనీలు రేట్లు పెంచడం గమనార్హం. దేశంలో స్మార్ట్ఫోన్ల విక్రయాలు ఇప్పటికే మందగించాయని.. ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసిక సేల్స్ క్రితం సంవత్సరంలో ఇదే కాలంతో పోలిస్తే బాగా తగ్గాయని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తాజా నోట్లో వెల్లడించింది. ఈ నెల 18 నుంచి రియల్మీ పలు మోడళ్ల రేట్లను రూ.1,000 నుంచి రూ.4,000 వరకు పెంచింది. ఒప్పోకు చెందిన రెనో, ఏ సిరీ్‌సలో ఎంపిక చేసిన మోడళ్ల ధరలు రూ.5,000 వరకు ఎగబాకాయి. కొన్ని ప్రాంతాల్లో వివోకు చెందిన పలు మోడళ్లు రూ.500 నుంచి రూ.4,000 వరకు ప్రియమయ్యాయి. సామ్సంగ్ తన ఎస్, ఎం, ఎఫ్ సిరీ్‌సలోని ఎంపిక చేసిన ఫోన్ల ధరలను మరింత పెంచేసింది. గెలాక్సీ ఎస్25లో ఒక వేరియంట్ రేటు రూ.12,000 మేర పెరిగింది. వన్ ప్లస్ కూడా ఎంపిక చేసిన ఫోన్ల ధరలను రూ.2,000-4,000 శ్రేణిలో పెంచింది. మెమొరీ, చిప్సెట్ల ధరల పెరుగుదల కారణంగా ఈ ఏడాది జూన్ నాటికి భారత్‌లో స్మార్ట్ఫోన్ల సగటు ధరలు దాదాపు 15 శాతం వరకు పెరిగాయని ఐడీసీ ఏషియా పసిఫిక్ సీనియర్ రీసెర్చ్ మేనేజర్ ఉపాసన జోషి అన్నారు. చిప్లతోపాటు మొబైల్ విడిభాగాల ధరలు పెరుగుతూనే పోతున్నాయని.. ఈ నేపథ్యంలో స్మార్ట్ఫోన్ల
Judge Ravi Kumar Diwakar : ఉత్తరప్రదేశ్ న్యాయశాఖలో ఎవరూ ఊహించని ఓ కీలక పరిణామ చోటు చేసుకుంది. ముజఫ్ఫర్ నగర్‌లోని ఫాస్ట్‌ట్రాక్ కోర్టు అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి రవికుమార్ దివాకర్ విచారిస్తున్న దాదాపు 100 హత్య కేసులను ఇతర న్యాయమూర్తికి బదిలీ చేశారు. అయితే ఈయన గడిచిన నాలుగు నెలల వ్యవధిలోనే ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 22 మంది నిందితులకు మరణశిక్ష విధిస్తూ ఆయన సంచలన తీర్పులు ఇచ్చారు. ఈక్రమంలోనే 100 కేసులు బదిలీ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా న్యాయవాదులు, వ్యాజ్యదార్లలో వ్యక్తమవుతున్న తీవ్ర ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.కేసులు బదిలీకి కారణమిదే..!ఉరిశిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉన్న తీవ్రమైన కేసులను జడ్జి రవికుమార్ దివాకర్ బెంచ్ నుంచి జిల్లా మరియు సెషన్స్ జడ్జి వీరేంద్ర కుమార్ సింగ్ కోర్టుకు మారుస్తున్నట్లు ప్రభుత్వ న్యాయవాది ధృవీకరించారు. వరుసగా మరణశిక్షలు విధిస్తుండటంతో.. న్యాయవాదులతో పాటు కేసులతో సంబంధం ఉన్న వ్యక్తుల్లో కూడా తీవ్రమైన భయాందోళనలు నెలకొన్నాయని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకునే కేసుల బదిలీ నిర్ణయం జరిగిందని జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రమోద్ త్యాగి స్పష్టం చేశారు.అసలెవరీ జడ్జి రవికుమార్ దివాకర్?లక్నోకు చెందిన 46 ఏళ్ల రవి కుమార్ దివాకర్ 2009లో ఆజంగఢ్‌లో అదనపు సివిల్ జడ్జిగా తన కెరియర్ ప్రారంభించారు. 2015లో సుల్తాన్‌పూర్‌లో సివిల్ జడ్జిగా, ఆ తర్వాత జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌గా పదోన్నతి పొందారు. బీకామ్, ఎల్ఎల్ఎమ్ చదివిన ఆయన.. నవంబర్ 2025 నుంచి ముజఫ్ఫర్ నగర్లో అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో 2022లో వారణాసిలోని గ్యాన్వాపి కాంప్లెక్స్‌లో వీడియోగ్రఫీ సర్వేకు ఆదేశాలు ఇచ్చి దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు.ఏయే కేసుల్లో దోషులకు ఉరిశిక్ష వేశారంటే..? ఆగస్టు 13వ తేదీన ఇచ్చిన తీర్పు.. షామ్లీ జిల్లాలో 2014 జులై 14న తేదీ జరిగిన

అమెరికా జాతీయ రుణం చరిత్రలో తొలిసారిగా 40 ట్రిలియన్ డాలర్ల నూతన గరిష్ట స్థాయికి చేరుకుంది. కేవలం ఐదు నెలల్లోనే ఈ రుణం 1 ట్రిలియన్ డాలర్లు పెరగడంతో, సామాన్యులకు వడ్డీ ఖర్చులు, ఆర్థిక ఆందోళనలు పెరిగాయి. డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ల హయాంలో ఈ రుణం రెట్టింపు అయి ఈ చారిత్రాత్మక స్థాయికి చేరుకుందని బుధవారం విడుదలైన గణాంకాలు చూపిస్తున్నాయి. అమెరికా ప్రభుత్వ వ్యయంలో ఎక్కువగా రక్షణ, సామాజిక భద్రత, మెడికేర్ వంటి కార్యక్రమాలకు కేటాయిస్తున్న తరుణంలో ఈ రుణం భారీగా పెరిగిపోయింది. ప్రభుత్వ వ్యయంలో రుణాలపై వడ్డీ కూడా ఒక కీలక భాగంగా మారింది. ముఖ్యంగా అమెరికా రుణం ప్రతి ఐదు నెలలకు 1 ట్రిలియన్ డాలర్ల చొప్పున పెరుగుతోంది.కిమ్‌కు దండం పెట్టేసిన ట్రంప్. అమెరికా సైనిక విన్యాసాలకు బ్రేక్..గత కొన్ని నెలలుగా అమెరికా జాతీయ రుణ పెరుగుదల వేగం స్పష్టంగా కనిపిస్తోంది. అక్టోబర్‌లో ఇది 38 ట్రిలియన్ డాలర్లను దాటింది. సుమారు ఐదు నెలల తర్వాత మార్చిలో ఈ సంఖ్య 39 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇప్పుడు ఆగస్టులో ఈ రుణం 40 ట్రిలియన్ డాలర్లను మించిపోయింది. అంటే సుమారు 10 నెలల్లో అమెరికా జాతీయ రుణం 2 ట్రిలియన్ డాలర్లు పెరిగింది. ఈ సంఖ్య ప్రభుత్వ రుణాన్ని ప్రతిబింబించడమే కాకుండా, భవిష్యత్తులో అమెరికా బడ్జెట్ ఎదుర్కోబోయే ఒత్తిడిని కూడా సూచిస్తోంది.యూఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన కొత్త సమాచారం ప్రకారం, మంగళవారం నాటికి మొత్తం ప్రభుత్వ రుణం 40.047 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఇందులో ప్రజల వద్ద ఉన్న 32.266 ట్రిలియన్ డాలర్ల ప్రభుత్వ సెక్యూరిటీలు, 7.782 ట్రిలియన్ డాలర్ల అంతర్-ప్రభుత్వ రుణం ఉన్నాయి. పెరుగుతున్న సామాజిక భద్రతా ఖర్చులు, రుణ వడ్డీ చెల్లింపులు ఇప్పటికే పన్ను రాబడిని మించిపోయాయి.రక్షణ రంగం నుంచి సామాజిక పథకాల వరకు భారీ వ్యయంఈ 40 ట్రిలియన్ డాలర్ల అంకెకు వివిధ ప్రభుత్వ
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. మూడు ప్రధాన డిమాండ్లతో ఏపీలో జూడాల సమ్మె కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జూనియర్ల డాకర్ల నిరసనను విరమింపజేసేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూనియర్ డాక్టర్లకు స్టైపండ్ పెంచాలని నిర్ణయించింది. జూనియర్ డాక్టర్ల స్టైపండ్‌ను ప్రస్తుతం రెండేళ్లకు ఓసారి సవరణ చేస్తుండగా.. ఇకపై ప్రతి సంవత్సరం సవరించే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. తాజా ప్రతిపాదన ప్రకారం.. ఇంటర్న్‌షిప్ చేసేవారికి 2026 జనవరి ఒకటో తేదీ నుంచి స్టైపండ్ ఐదు శాతం మేరకు పెంచనున్నారు. తర్వాతి సంవత్సరం నుంచి ఏటా 3 శాతం చొప్పున పెంచుతామని ప్రభుత్వం తెలిపింది. పీజీ, సూపర్ స్పెషాలిటీ విద్యార్థుల స్టైపండ్ ప్రతి ఏడాది 3 శాతం చొప్పున పెంచుతామని ప్రభుత్వం ప్రతిపాదించింది.మరోవైపు ఇంటర్న్‌షిప్ చేసే వైద్య విద్యార్థులతో పాటుగా, పీజీ, సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యార్థులకు స్టైపండ్‌ను పెంచాలని ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ కోరుతోంది. స్టైపండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ వారం రోజులకు పైగా జూనియర్ డాక్టర్లు నిరసనలు చేపడుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవటంతో ఆగస్ట్ 17 నుంచి అత్యవసర సేవలను కూడా నిలిపివేశారు. దీంతో ప్రభుత్వాసుపత్రులలో రోగులకు ఇబ్బంది లేకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే జూడాలో సమ్మె విరమింపజేసేందుకు.. వారికి స్టైపండ్ పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తక్షణం విధుల్లోకి చేరాలని సూచించింది.వెనక్కి తగ్గని జూడాలు..మరోవైపు ఐదు శాతం స్టైపండ్ పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయంపై జూనియర్ డాక్టర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కొత్త ప్రకటనేమీ చేయలేదని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే తమ నిరసనలను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన ధరల ప్రకారం ఐదు శాతం స్టైపండ్ పెంపు సరిపోదని చెప్తున్నారు. తాము స్టైపండ్ 30 శాతం పెంచాలని కోరుతుంటే.. కేవలం ఐదు శాతం మాత్రమే పెంచుతామని అనడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Yuzvendra Chahal: యుజువేంద్ర చాహల్, ధనశ్రీ వర్మకు 2020లో వివాహం జరిగింది. అంతకుముందు వీరిద్దరికీ పరిచయం ఏర్పడి, ఆ తర్వాత ప్రేమగా మారింది. కొంతకాలం తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత కూడా ఇద్దరూ సోషల్ మీడియాలో కలిసి ఉన్న ఫొటోలను పంచుకున్నారు. దీంతో వారి దాంపత్య జీవితం సంతోషంగానే ఉందని చాలామంది భావించారు. అయితే కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. 2025లో వీరిద్దరూ విడాకులు తీసుకోవడంతో అసలు ఏం జరిగిందనే ప్రశ్నలు మొదలయ్యాయి. దీనిపై అప్పట్లో ఎన్నో రకాల వార్తలు, ఊహాగానాలు వినిపించాయి. కానీ ఇద్దరూ తమ వ్యక్తిగత విషయాల గురించి ఎక్కువగా మాట్లాడలేదు. తాజాగా చాహల్ తన విడాకులకు సంబంధించిన కారణాలపై మాట్లాడినట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత కొన్ని సంవత్సరాలు తాము సంతోషంగానే ఉన్నామని ఆయన చెప్పారు. అయితే విడాకులకు ముందు దాదాపు రెండేళ్ల నుంచి తమ మధ్య అభిప్రాయ భేదాలు మొదలయ్యాయని వెల్లడించారు. కొన్ని విషయాల్లో తమ ఆలోచనలు కలవకపోవడంతో సమస్యలు పెరిగాయని తెలిపారు. తాను క్రికెట్ మ్యాచ్‌లు, ఇతర ప్రొఫెషనల్ పనులతో చాలా బిజీగా ఉండేవాడినని చాహల్ పేర్కొన్నారు. అందువల్ల భార్యకు తగినంత సమయం ఇవ్వలేకపోయానని చెప్పారు. మరోవైపు ధనశ్రీ కూడా తన కెరీర్, ఇతర పనుల్లో బిజీగా ఉండేవారు. దీంతో ఇద్దరి మధ్య సమయం తగ్గిపోయిందని వివరించారు. తమ మధ్య మానసికంగా, వ్యక్తిగతంగా దూరం పెరిగిందని చాహల్ తెలిపారు. భార్యాభర్తలు కలిసి జీవించాలంటే ఇద్దరి ఆలోచనలు
అరటి పండ్లలో విటమిన్ బి6, బ్రోమలైన్ అనే ఎంజైమ్ ఉటాయి. ఇవి టెస్టోస్టిరాన్ లెవెల్స్ పెంచుతాయి. వీర్య కణాల సంఖ్యను రెట్టింపు చేస్తాయి. అందుకు పురుషులు అరటి పండు తినడం చాలా మంచిది. దానిమ్మలో పాలిఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి టెస్టోస్టిరాన్ లెవెల్స్ పెంచి జననాంగాలకు రక్త ప్రసరణ మెరుగుపరుస్తాయి. దీంతో వీర్య కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఉసిరికాయల్లో విటమిన్ సి ఉంటుంది. ఇది ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి డీఎన్ఏ కణాలను కాపాడుతుంది. తద్వారా వీర్య కణాల ఉత్పత్తి పెరుగుతంది. స్పెర్మ్ ఆరోగ్యంగా ఉంటుంది. జామకాయల్లో విటమిన్ సి, ఫోలేట్ ఎక్కువగా ఉంటాయి. ఇవి స్పెర్మ్ కౌంట్, నాణ్యత పెంచడంలో సహాయపడతాయి. తద్వారా సంతానోత్పత్తి మెరుగుపర్చుకోవచ్చు. నారింజ పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్ నుంచి వీర్య కణాలు డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. తద్వారా సంతానోత్పత్తి మెరుగుపరుస్తుంది. సపోటాలో డైటరీ ఫైబర్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి వీర్య కణాల సంఖ్య, నాణ్యతను మెరుగుపరుస్తాయి. సీతాఫలంలో విటమిన్ బి6, మెగ్నీషియం, కెరోటినాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి హార్మోన్ బ్యాలెన్స్ మెరుగుపర్చి వీర్య కణాల సంఖ్యను పెంచుతాయి. బొప్పాయిలో బీటా కెరోటీ్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. ఇవి వీర్య కణాల సంఖ్య పెంచి సంతానోత్పత్తి సమస్యలు రాకుండా చూస్తాయి. మామిడి పండ్లలో విటమిన్ ఎ, సి ఉంటాయి. ఇవి శరీర కణాలను ఆరోగ్యంగా ఉంచి వీర్య కణాల సంఖ్య పెంచడంలో దోహదపడతాయి

ఇల్లు బాగు చేయించుకుందామని తవ్వకాలు జరిపితే ఏకంగా వంద కోట్ల రూపాయల నిధి బయటపడితే ఎలా ఉంటుంది? బెల్జియంలో సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది. ఈస్ట్ ఫ్లాండర్స్‌లో ఓ పురాతన భవనం రెనోవేషన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా డ్రైనేజీ సిస్టమ్ మార్పు కోసం ఇంటి పునాదుల వద్ద కార్మికులు డ్రిల్లింగ్ చేపట్టారు. ఆ సమయంలో డ్రిల్లింగ్ మిషన్‌కు ఏదో పసుపు రంగు అంటుకోవడం గమనించిన కార్మికులు ఆశ్చర్యపోయారు. మరింత లోతుగా తవ్వి చూడగా కుప్పలు కుప్పలుగా బంగారు నాణేలు, బిస్కెట్లు బయటపడ్డాయి. సుమారు 9 మిలియన్ల యూరోలు, అనగా భారత కరెన్సీలో దాదాపు రూ. 100 కోట్ల విలువైన ఈ భారీ నిధిని చూసి వారంతా ఖంగుతిన్నారు. సైట్ మేనేజర్ మారియోకు ఈ విషయం తెలపగా.. ఆయన ఏమాత్రం ఆశపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుని భద్రపరిచారు. బెల్జియం చట్టాల ప్రకారం ఈ నిధిని క్లెయిమ్ చేయడానికి ఐదేళ్ల సమయం ఉంటుందని, ఆ నిధికి సంబంధించి ఎవరైనా అసలు ఓనర్ ఉంటే వచ్చి ఐదేళ్లలోపు క్లెయిమ్ చేసుకోవాలని, లేనిచో అది ఆ స్థలం యజమానికి, కార్మికులకు చెందుతుందని అధికారులు తెలిపారు. ఈ అపారమైన సంపద ఇక్కడకు ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. మీ చెప్పులు పోయాయా.. అయితే చాట్ జీపీటీని అడగండి.. ఇట్టే దొరికేస్తాయ్

Nellore: నెల్లూరు మెడికవర్ హాస్పిటల్స్‌లో నూతన వైద్య విధానం నెల్లూరు: బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సలో మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఆసుపత్రికి చెందిన ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ నెరెల్ల కృష్ణ తేజ ఆధ్వర్యంలో ‘ఇమేజ్-గైడెడ్ ఇంట్రాలెషనల్ బ్రెస్ట్ ట్యూమర్-మార్కర్ క్లిప్ ప్లేస్మెంట్’ విధానాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఖచ్చితమైన గుర్తింపు: శస్త్రచికిత్సకు ముందు ఇచ్చే కీమోథెరపీ వల్ల ట్యూమర్ సైజ్ తగ్గిపోయినా లేదా పూర్తిగా కనిపించకుండా పోయినా, క్లిప్ సహాయంతో ట్యూమర్ ఉన్న అసలు స్థానాన్ని ఖచ్చితంగా గుర్తించవచ్చు. మెరుగైన సర్జరీ ఇది శస్త్రచికిత్సను మరింత సులభతరం చేయడమే కాకుండా, బ్రెస్ట్-కన్సర్వింగ్ సర్జరీ (రొమ్మును కాపాడే శస్త్రచికిత్స)కి ఎంతో దోహదపడుతుంది. మెరుగైన సమన్వయం: రేడియాలజిస్ట్, ఆంకాలజిస్ట్, బ్రెస్ట్ సర్జన్ల మధ్య సమర్థవంతమైన సమన్వయానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణ తేజ మాట్లాడుతూ, ఈ చిన్న క్లిప్ ప్లేస్మెంట్ చికిత్స ప్రణాళికలో ఖచ్చితత్వాన్ని పెంచుతుందని తెలిపారు. ఈ ఆధునిక సాంకేతికత అందుబాటులోకి రావడం వల్ల నెల్లూరు మరియు పరిసర ప్రాంతాల క్యాన్సర్ రోగులకు ఎంతో మేలు జరుగుతుందని ఆసుపత్రి యాజమాన్యం పేర్కొంది
Defective Notice ITR: 2025-26 ఆర్థిక సంవత్సరం లేదా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ ఫైల్ చేసిన టాక్స్ పేయర్స్ తమ రిజిస్టర్డ్ మెయిల్, ఇన్‌కంటాక్స్ ఇ- ఫైలింగ్ పోర్టల్‌ను క్రమం తప్పకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి. రిటర్న్స్‌లో సరైన వివరాలు లేకపోయినా, ఇంకా మీరు ఇచ్చిన సమాచారం అసంపూర్తిగా ఉన్నా ఇన్‌కంటాక్స్ డిపార్ట్మెంట్ నుంచి సెక్షన్ 139(9) కింద డిఫెక్టివ్ ఐటీఆర్ నోటీసులు రావొచ్చు. అయితే ఈ నోటీసులు వచ్చినప్పుడు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉండకుండా, దాంట్లో పేర్కొన్న లోపాన్ని గుర్తించి నిర్ణీత సమయంలోగా సరిచేయడం ముఖ్యం.ఐటీఆర్‌లో అవసరమైన సమాచారం పూర్తిగా ఇవ్వకపోయినా, ఇచ్చిన వివరాల మధ్య తేడాలు ఉన్నా లేదా ఐటీ రిటర్న్స్ ఫారాలకు సంబంధించిన నిబంధనల్ని సరిగ్గా పాటించకపోయినా దాన్ని డిఫెక్టివ్ రిటర్న్‌గా పరిగణించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఒక టాక్స్ పేయర్ టీడీఎస్ క్రెడిట్‌ను క్లెయిమ్ చేసి, దానికి సంబంధించిన ఆదాయాన్ని ఐటీఆర్‌లో చూపించకపోతే సమస్య రావొచ్చు. అలాగే బిజినెస్ లేదా ప్రొఫెషన్ ద్వారా ఆదాయం ఉన్న అవసరమైన ఆర్థిక వివరాల్ని పూర్తిగా ఇవ్వకపోయినా నోటీసులు వస్తాయి.ఇన్‌కంటాక్స్ విభాగం ప్రధానంగా 3 మార్గాల్లో డిఫెక్టివ్ రిటర్న్ గురించి సమాచారం ఇవ్వొచ్చు. ముందుగా రిజిస్టర్డ్ ఇ- మెయిల్‌కు నోటీసు పంపుతుంది. ఎక్కువ శాతం ఇదే చేస్తుంది. లేదా పోస్ట్ ద్వారా కమ్యూనికేట్ చేస్తుంది. లేదా ఇ- ఫైలింగ్ పోర్టల్‌లో నోటీసును అందుబాటులో ఉంచొచ్చు. అందుకే వీటిని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఆ నోటీసులో సాధారణంగా ఐటీఆర్‌లో ఏ లోపం ఉంది? దాన్ని ఎలా సరిచేయాలో వివరాలు ఉంటాయి.Read Also: అసలు యూపీఐ లావాదేవీలు ఉచితమా.. ఛార్జీలు పడతాయా? ఆర్థిక మంత్రి నిర్మలమ్మ కీలక ప్రకటన15 రోజుల్లోగా స్పందించాలిసెక్షన్ 139(9) కింద డిఫెక్టివ్ ఐటీఆర్ నోటీసులు అందుకున్నప్పుడు సాధారణంగా నోటీసు అందుకున్న తేదీ నుంచి 15 రోజుల్లో అందులో ఉన్న లోపాన్ని లేదా తప్పుల్ని సరిచేసి పంపించాల్సి ఉంటుంది. నోటీసులో ప్రత్యేకంగా

భారతీయులు ఎక్కువగా కొత్త ఫోన్ ఏ కారణంతో కొంటున్నారో తెలుసా? ఈ వార్తకు సంబంధించిన

బెల్జియంలో డ్రైనేజీ పనులు చేస్తున్న కార్మికులకు ఊహించని జాక్‌పాట్ తగిలింది. బ్రస్సెల్స్కు సుమారు 30 కిలోమీటర్ల దూరంలోని సింట్-గిలిస్-డెండర్‌మాండేలో మురుగునీటి పైపులైన్ల స్థానంలో కొత్తవి వేస్తుండగా, వారికి భారీ బంగారు నిధి లభించింది. దీని విలువ సుమారు 9 మిలియన్ యూరోలు (దాదాపు రూ.98 కోట్లు) ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నిధిలో బంగారు నాణేలు, ముద్దలు, నంబర్లు వేసిన బంగారు కడ్డీలు ఉన్నాయి.గత మంగళవారం ఈ నిధిని 18 ఏళ్ల సమ్మర్ వర్కర్ కోబే మొదటిసారి గుర్తించాడు. "మేము తవ్వుతుండగా అక్కడ ఏదో మెరుస్తూ కనిపించింది. మొదట అవి యూరో నాణేలు అనుకున్నాను. కానీ, తీరా చూస్తే ఒక బంగారు కడ్డీ కనిపించింది. మేము అనుకున్న దానికంటే చాలా పెద్ద నిధే దొరికింది. సాధారణంగా ఓ మంగళవారం ఉదయం ఇలాంటిది జరుగుతుందని ఎవరూ ఊహించరు" అని కోబే స్థానిక మీడియాకు తెలిపాడు.ఈ నిధిని ఒక పాత విల్లాలోని సెల్లార్ గోడలో ఇటుకలతో కట్టిన ఒక అరలో బ్యాగులో పెట్టి జాగ్రత్తగా దాచిపెట్టారు. 19వ శతాబ్దం చివరలో బ్రూవరీ యజమాని థియోఫిలస్ వాన్ అషే ఈ భవనాన్ని నిర్మించారు. 1899 నుంచి 1970 వరకు ఇక్కడ బ్రూవరీ నడిచింది. ప్రస్తుతం ఈ భవనాన్ని ఒక సంక్షేమ సంస్థ కార్యాలయాలు, నివాసాల కోసం పునరుద్ధరిస్తోంది.నిధి దొరికిన వెంటనే అధికారులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, బంగారాన్ని బ్రస్సెల్స్‌లోని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ప్రస్తుతం దీని అసలు యజమానులు ఎవరనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ బంగారం

డ్రెయినేజీ గుంతలో అరుదైన నిధి రూ.98 కోట్ల విలువైన బంగారం ఒక్కసారిగా మారిన కుర్రాడి తలరాత Gold Treasure: ఒక్కోసారి అదృష్టం ఏ రూపంలో తలుపు తడుతుందో ఎవరూ ఊహించలేరు. సాధారణ రోజువారీ కూలీ పనిచేసుకునే ఒక 18 ఏళ్ల యువకుడికి డ్రెయినేజీ పనులు చేస్తుండగా ఏకంగా రూ.98 కోట్ల విలువైన పురాతన బంగారు నిధి (Gold Treasure)దొరికిన సంచలన సంఘటన బెల్జియంలో వెలుగుచూసింది. బ్రస్సెల్స్ ప్రాంతంలో మురుగు కాల్వ పైపుల కోసం భూమిని తవ్వుతున్న సమయంలో పారకు ఒక లోహపు పెట్టె తగలడంతో ఈ అరుదైన నిధి బయటపడింది. Tarapith Fire Accedent: తారాపీఠ్ హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవదహనం.. బెంగాల్లో విషాదం పెట్టెలో శతాబ్దాల నాటి అరుదైన ఆభరణాలు: ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో శతాబ్దాల క్రితం నాటి పురాతన బంగారు నాణేలు, అత్యంత అరుదైన ఆభరణాలు లభ్యమయ్యాయి. సమాచారం అందుకున్న పురావస్తు శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అంతర్జాతీయ మార్కెట్లో వీటి విలువ దాదాపు రూ.98 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. చట్టప్రకారం దక్కనున్న వాటా: ఈ ఊహించని ఘటనతో ఆ యువకుడి జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. బెల్జియం స్థానిక చట్టాల ప్రకారం లభించిన ఈ నిధిలో తవ్వకాలు జరిపిన యువకుడికి, ఆ స్థల యజమానికి తగినంత వాటా దక్కనుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది

పశ్చిమాసియాలో సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో.. దేశీయంగా వంటగ్యాస్ (ఎల్పీజీ) ఉత్పత్తి పెంపునకు కేంద్ర ప్రభుత్వం కీలక వ్యూహాన్ని రూపొందించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని.. న్యూఢిల్లీ, ఆగస్ట్ 16: పశ్చిమాసియాలో సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో.. దేశీయంగా వంటగ్యాస్ (ఎల్పీజీ) ఉత్పత్తి పెంపునకు కేంద్ర ప్రభుత్వం కీలక వ్యూహాన్ని రూపొందించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని 21 ఆయిల్ రిఫైనరీ కంపెనీలు, చమురు/గ్యాస్ ఉత్పత్తి సంస్థలకు ఎల్పీజీ ఉత్పత్తి పరంగా మొదటిసారి లక్ష్యాలను విధించింది. ఇకపై అవి రోజువారీ 63,180 టన్నులను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఇది ఇంతకుముందు రోజువారీ ఉత్పత్తితో పోల్చితే రెట్టింపు కావడం గమనార్హం. తద్వారా దేశీయ అవసరాలకు సరిపడా సామర్థ్యాన్ని స్థానికంగానే సమకూర్చుకోవాలన్నది కేంద్రం వ్యూహంగా కనిపిస్తోంది. తాజా ఉత్పత్తి పెంపులో రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక పాత్ర పోషించనుంది. 18,000 టన్నుల మేర లక్ష్యాన్ని రిలయన్స్‌కు కేంద్రం విధించింది. ప్రైవేటు రంగంలోని మరో రిఫైనరీ నయారాకు 4,480 టన్నుల లక్ష్యాన్ని ప్రకటించింది. ప్రభుత్వరంగ ఆయిల్ రిఫైనరీలు 31,470 టన్నుల ఎల్పీజీని పెట్రోల్ శుద్ధి ద్వారా ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. జీఆర్ఎంబీ అజెండా నుంచి తెలంగాణ వ్యతిరేక అంశాలు తొలగించాలి: హరీశ్‌రావు నేరాల స్వరూపం ఎప్పటికప్పుడు మారుతోంది: డీజీపీ ఆనంద్ నకిలీ ట్రేడింగ్ యాప్‌తో బురిడీ.. సీఏను మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు

బెల్జియంలోని సింట్-గిల్లిస్-డెండర్‌మొండే ప్రాంతంలో మురుగునీటి పైపులను మార్చే పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాంతం రాజధాని బ్రస్సెల్స్కు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిర్మాణ పనుల్లో భాగంగా కార్మికులు భూమిని తవ్వుతుండగా అనుకోకుండా ఓ భారీ నిధి బయటపడింది. ఈ సంపదలో బంగారు నాణేలు, బంగారు ముక్కలు, నంబర్లు ఉన్న బంగారు బార్లు ఉన్నాయి. వీటి మొత్తం విలువ సుమారు 9 మిలియన్ యూరోలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ సంపద బయటపడటంలో ప్రధాన పాత్ర పోషించింది 18 ఏళ్ల కోబే అనే యువకుడు. సెలవుల్లో తాత్కాలికంగా నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న అతడు.. మంగళవారం తవ్వకాలు జరుగుతున్న సమయంలో ఈ నిధిని గుర్తించాడు. భూమిలో ఏదో వస్తువు కనిపించడంతో కోబే తొలుత వాటిని సాధారణ నాణేలుగా భావించాడు. దగ్గరగా పరిశీలించిన తర్వాత అక్కడ బంగారు బార్ కూడా ఉన్నట్లు గుర్తించాడు. అప్పుడే అక్కడ బయటపడింది సాధారణ వస్తువు కాదని అతడికి అర్థమైంది. ఈ విషయాన్ని అతడు బెల్జియం మీడియాతో పంచుకున్నాడు. మొదట కనిపించినప్పుడు అవి ఒక యూరో నాణేలేమో అనుకున్నానని.. ఆ తర్వాత బంగారు బార్ కనిపించడంతో విషయం చాలా పెద్దదని తెలిసిందని చెప్పాడు. కోబే తన సహచరులతో కలిసి అక్కడ పనిచేస్తున్నాడు. ఇంత భారీ సంపద తమ కళ్ల ముందుకు రావడం వారికి కూడా ఊహించని అనుభవంగా మారింది. బయటపడిన నిధి ఓ పురాతన భవనంతో సంబంధం కలిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో 19వ శతాబ్దం చివర్లో బీరు తయారీ వ్యాపారి థియోఫిలస్ వాన్ అస్చే కోసం ఓ భారీ భవనం నిర్మించారు. ఆ భవనంలోని ఓ గోడలో ఇటుకలతో మూసివేసిన నేలమాళిగ ప్రాంతంలో ఈ సంపద దొరికింది. ఓ సంచిలో భద్రపరిచి, గోడలో దాచినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఎవరైనా కావాలనే ఈ బంగారాన్ని అక్కడ రహస్యంగా ఉంచి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాంతంలో

బెల్జియంకు చెందిన ఓ 18 ఏళ్ల కుర్రాడికి ఇటీవల ఊహించని అనుభవం ఎదురైంది. మురుగు నీటిపైపు లైన్ ఏర్పాటు కోసం నేలను తవ్వుతుండగా రూ.98 కోట్ల విలువైన బంగారు బిస్కెట్స్, నాణేలు బయటపడ్డాయి. ఇంటర్నెట్ డెస్క్: బెల్జియంకు చెందిన ఓ 18 ఏళ్ల కుర్రాడికి ఇటీవల ఊహించని అనుభవం ఎదురైంది. మురుగు నీటిపైపు లైన్ ఏర్పాటు కోసం నేలను తవ్వుతుండగా రూ.98 కోట్ల విలువైన బంగారు బిస్కెట్స్, నాణేలు బయటపడ్డాయి. బ్రసెల్స్‌కు 18 మేళ్ల దూరంలోని డెండెర్‌మోండే అనే ప్రాంతంలోగల ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన ప్రాంగణంలో వెలుగు చూసింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మురుగు నీటి పైపు లైన్ ఏర్పాటు చేసేందుకు కొందరు వర్కర్లు అక్కడ భూమిని తవ్వుతున్నారు. వారితో పనిచేస్తున్న ఓ 18 ఏళ్ల కుర్రాడికి మొదట కొన్ని నాణేలు కనిపించాయి. మొదట అవి యూరో కరెన్సీనేమో అని యువకుడు అనుకున్నాడు. నేలను మరింత తవ్వగా మరిన్ని నాణేలు, బంగారు బిస్కెట్లు బయటపడటంతో ఒక్కసారిగా షాకైపోయాడు. ‘ఆ నాణేలు, బిస్కెట్లను చూడగానే ఆశ్చర్యపోయాము. అస్సలు నమ్మశక్యం కాలేదు. అసలు అక్కడ బంగారం దొరుకుతుందని ఎవ్వరమూ ఊహించలేదు’ అని యువకుడు చెప్పాడు. విషయం తెలియగానే పట్టరాని ఆశ్చర్యం వేసిందని ఆ వర్కర్ల సూపర్వైజర్ తెలిపారు. ‘33 ఏళ్లుగా నిర్మాణ రంగంలో ఉన్నా. కానీ ఇలాంటిది చూడటం ఇదే తొలిసారి’ అని అన్నారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇంతటి బంగారం ఎవరిదో? ఎందురు దాచారో? తెలుసుకునేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. బంగారం లభించిన భవనం ఓ ఛారిటీ సంస్థదని అధికారులు తెలిపారు. ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన వారికి ఈ సంస్థ సాయం అందిస్తుంటుంది. భవన ప్రాంగణంలో నాణేలు బయటపడిన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గుప్త నిధులపై ఆశతో భవనం ప్రాంగణంలోకి చొరబడే ప్రయత్నం చేయొద్దని ప్రజలను హెచ్చరించారు
భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనుల కోసం తవ్వకాలు జరుపుతుండగా.. ఊహించని విధంగా భారీ మొత్తంలో బంగారు బిస్కెట్లు, అరుదైన నాణేలు బయటపడ్డాయి. వీటి విలువ దాదాపు 9 మిలియన్ యూరోలు (భారత కరెన్సీల్లో రూ.98 కోట్లు) ఉంటాయని అంచనా. ఈ ఘటన బెల్జియం రాజధాని బ్రెస్సెల్స్కు సమీపంలోని సింటి-గిల్లిస్-డెండర్మొండె ప్రాంతంలో వెలుగుచూసినట్టు ది గార్డియన్ పత్రిక నివేదించింది. సమ్మర్ జాబ్ చేస్తోన్న కోబే అనే 18 ఏళ్ల యువకుడు ఈ నిధిని గత మంగళవారం మొదటిసారి గుర్తించాడు.అతడు స్థానిక నెట్వర్క్ వీటీఎంతో మాట్లాడుతూ.. ‘‘మాకు ఒక్కసారిగా కింద ఏదో మెరుస్తున్నట్టు కనిపించింది..దానిని మేము యూరో నాణేలు అనుకున్నాం.. కానీ, తవ్వుతుంటే బంగారం బిస్కెట్లు బయటపడ్డాయి.. మేము అనుకున్న దానికంటే అక్కడ పెద్ద నిధి ఉందని తర్వాత అర్థమైంది’’ అని తెలిపాడు. తన సహచర కార్మికులతో కలిసి పనులు చేస్తున్న సమయంలో నిధి బయటపడింది.19వ శతాబ్దం చివరలో మద్యం తయారీ కేంద్రం యజమాని థియోఫిలస్ వాన్ అస్చే కోసం నిర్మించిన విల్లా కింద ఇటుకలతో కట్టిన గోడలోపల భద్రపరిచిన ఒక బ్యాగులో ఈ నిధిని దాచారు. ఈ నిధిలో బంగారు నాణేలు, బంగారు ముక్కలు, నెంబర్లు వేసిన కడ్డీలు ఉన్నాయి. ‘‘సాధారణ మంగళవారం ఉదయం ఇలాంటిది జరుగుతుందని ఎవరూ ఊహించరు’’ అని కోబ్ అన్నాడు. ఈ నిధిని కావాలనే ఎవరైనా దాచిపెట్టినట్లు కనిపిస్తోందని అతడు అభిప్రాయపడ్డాడు.నిధి బయటపడిన ప్రదేశంలో 1899లో ప్రారంభమైన బీరు తయారీ కేంద్రం 1970 వరకు నడించింది. ఇప్పటికీ భవనం ఇనుప గేట్లపై ‘VA’ అనే అక్షరాలు కనిపిస్తాయి. ప్రస్తుతం CAW ఓస్ట్-వ్లాండరెన్ అనే సామాజిక సంస్థ దీనిని కొత్త కార్యాలయాలు, నివాసాలను ఏర్పాటు చేయడానికి పునరుద్ధరిస్తోంది. ‘‘బ్రూవర్స్హౌస్ ఒక అందమైన భవనం, కానీ దానిని పూర్తిగా కూల్చివేస్తున్నారు. చివరికి, కేవలం గోడలు మాత్రమే మిగిలి ఉంటాయి’’ అని CAW ప్రతినిధిన గీర్ట్ హిల్లార్ట్ చెప్పారు. వెంటనే ఆ ప్రదేశాన్ని తమ ఆధీనంలోకి

సాధారణంగా ఏదైనా కన్స్ట్రక్షన్ సైట్లో పనిచేసే కూలీలు, పార్ట్‌టైమ్ జాబ్ చేసుకునే కుర్రాళ్లు అనుకోకుండా డ్రైనేజీ తవ్వకాల్లో దిగితే ఏముంటుంది? మహా అయితే మట్టి, పాత ఇనుప సామాన్లు లేదా ప్లాస్టిక్ వ్యర్థాలు మాత్రమే ఎదురవుతాయి. కానీ బెల్జియం దేశంలో మాత్రం ఏకంగా లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. మురికినీటి కాలువ పనులు చేస్తుండగా ఒక 18 ఏళ్ల కుర్రాడికి ఊహించని రీతిలో కోట్లాది రూపాయల విలువైన బంగారం లభించింది. ఈ అరుదైన ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది.కాలువ తవ్వుతుంటే బంగారం మెరిసింది!బెల్జియం దేశంలోని బ్రస్సెల్స్ సమీపంలో ఉన్న సింట్-గిల్లిస్-డెండెర్‌మోండే ప్రాంతంలో ఈ విచిత్రం చోటుచేసుకుంది. వేసవి సెలవుల్లో జేబు ఖర్చుల కోసం కోబ్ అనే 18 ఏళ్ల విద్యార్థి డ్రైనేజీ పైప్లైన్ల మార్పిడి పనుల్లో చేరాడు. తన తోటి కూలీలతో కలిసి మట్టి తవ్వుతుండగా ఉన్నట్టుండి భూమి అడుగున ఏదో లోహపు వస్తువు మెరుస్తూ కనిపించింది. మొదటి చూపులో అవి సాధారణ నాణేలు అనుకున్నప్పటికీ, మరింత లోతుగా తవ్వేసరికి అక్కడ ఒక పురాతన సంచి దొరికింది. దానిని తెరిచి చూడగా భారీ మొత్తంలో రాశిగా పోసిన బంగారు బిస్కట్లు, అరుదైన పురాతన నాణేలు ప్రత్యక్షమయ్యాయి.వందల ఏళ్ల నాటి బంగ్లా రహస్యం!ఈ పురాతన నిధి స్థానిక వ్యాపారవేత్త దియోఫిలస్ వాన్ అస్షే నిర్మించిన దాదాపు 19వ శతాబ్దపు బంగ్లా కింద దాగి ఉందని తేలింది. 1899 కాలంలో ప్రారంభమై 1970ల వరకు నడిచిన ఒక మద్యం తయారీ సంస్థ యజమానికి ఈ ఆస్తి చెందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ పురాతన కట్టడాన్ని ఒక సామాజిక సేవా సంస్థ ఆఫీసుల కోసం పునరుద్ధరిస్తోంది. ఈ క్రమంలోనే పాత నేలమాళిగ గోడల మధ్య శతాబ్దాలుగా ఎవరికీ తెలియకుండా దాచిపెట్టిన నిధి బయటపడింది. దీని విలువ దాదాపు 9 మిలియన్ యూరోలు, అంటే మన భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.98 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు.బయటపడ్డ 1200 ఏళ్ల

బెల్జియంలోని ఈస్ట్ ఫ్లాండర్స్ పరిధిలోని సెంట్ గిలిస్ డెండర్మోండే అనే ప్రాంతంలో ఒక పాత భవనంలో డ్రైనేజీ పనులు జరుగుతున్నాయి. అక్కడ సీవేజ్ పైపులు వేసేందుకు మట్టిని తవ్వుతున్నారు. ఆ భవనం పునాదులను డ్రిల్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా గోడల నుంచి ఏదో పసుపు రంగు వస్తువు మెరుస్తూ బయటపడింది. రోజూలాగే పనులు చేస్తుండగా ఈ దృశ్యం చూసి అక్కడున్న కార్మికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ సమయంలో పార్ట్ టైమ్ వర్క్ కోసం వచ్చిన 18 ఏళ్ల విద్యార్థి కోబే, సైట్ మేనేజర్ వారియో పనుల్లో ఉన్నారు. మొదట నేలపై మెరుస్తున్నవి చూసి వారు సాధారణ 1 యూరో నాణాలు అనుకున్నారు. కానీ దగ్గరకు వెళ్లి మట్టిని తొలగించి చూసేసరికి వారి మైండ్ బ్లాక్ అయింది. అవి సాధారణ నాణాలు కావు, బంగారు నాణాలు, బంగారు బిస్కెట్లు. సుమారు 9 మిలియన్ యూరోలు, అంటే భారతీయ కరెన్సీలో రూ.85 కోట్ల నుంచి రూ.100 కోట్ల విలువైన బంగారం అక్కడ లభించింది. 33 ఏళ్లుగా కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న సైట్ మేనేజర్ వారియో, తన జీవితంలో ఇంతటి ఆశ్చర్యకరమైన విషయాన్ని ఎప్పుడూ చూడలేదని చెప్పారు. అంత పెద్ద మొత్తంలో బంగారం లభించినప్పటికీ, కార్మికులు దానిని దాచుకునే ప్రయత్నం చేయలేదు. దానిని దాచడం చట్టరీత్యా నేరం అని, దొంగతనంతో సమానమని భావించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్వాధీనం చేసుకున్న ఆ నిధిని అధికారులు సురక్షితమైన ప్రభుత్వ ఖజానాకు తరలించారు. ఈ వార్త తెలియగానే ఆ ప్రాంతానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఇంకేమైనా బంగారం దొరుకుతుందేమో అని జనాలు తవ్వకాలు జరపడానికి ప్రయత్నించడంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని సీల్ చేశారు. ఈ బంగారం ఎక్కడిది అనే దానిపై నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. 19వ శతాబ్దంలో అక్కడ నడిచిన ఒక పాత బీర్ ఫ్యాక్టరీ యజమాని థియోఫిలస్ వాన్ ఆషే కుటుంబానికి ఇది చెంది ఉండవచ్చని భావిస్తున్నారు
తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల జాబితాలో ప్రైవేటు ఆస్తులు, హక్కులు ఉన్నపట్టా భూములు చేరడం వల్ల వేలాది మంది భూ యజమానులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తమ పేర్లతో స్పష్టమైన చట్టబద్ధమైన హక్కులు, పత్రాలు ఉన్నప్పటికీ, అత్యవసర సమయాల్లో భూములను అమ్మాలన్నా లేదా బ్యాంకు రుణాలు పొందేందుకు తాకట్టు పెట్టాలన్నా రిజిస్ట్రేషన్లు జరగకపోవడంతో యజమానులు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ సరిహద్దు జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, యాదాద్రి భువనగిరి ప్రాంతాల్లో ఈ రకమైన భూములు పెద్ద ఎత్తున వెలుగులోకి వస్తున్నాయి.గతంలో ప్రభుత్వ భూములు అక్రమంగా ఆక్రమణలకు గురై లావాదేవీలు జరిగిన ఘటనలను పరిశీలించిన హైకోర్టు, 2015, 2024లలో నిషేధిత భూముల జాబితాను సమగ్రంగా నవీకరించాలని రవాణా, రెవెన్యూ శాఖలను ఆదేశించింది. దీని ప్రకారం 2025 చివర్లో రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయి రికార్డులను సమకూర్చి కొత్త జాబితాలను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ ప్రక్రియలో ప్రాథమిక మూల సర్వే నంబర్ల ఆధారంగా డేటాను సేకరించడం వల్ల సమస్య జటిలంగా మారింది. ప్రభుత్వ వేలం ద్వారా, జీవోల ద్వారా క్రమబద్ధీకరణ పొందిన స్థలాలు, ప్లాట్లు రికార్డుల్లో ప్రైవేటు ఆస్తులుగా ఉన్నప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో వాటి మూల సర్వే నంబర్లు ఇప్పటికీ ప్రభుత్వ భూములుగానే కొనసాగుతున్నాయి. ఫలితంగా మూల సర్వే నంబర్‌ను 22ఏలో చేర్చగానే అందులో ఉన్న సబ్-డివిజన్లు, లేఅవుట్లు, ప్రైవేటు ప్లాట్లు కూడా ఆటోమేటిక్‌గా నిషేధిత పరిధిలోకి వెళ్లిపోతున్నాయి.దీనికితోడు అర్బన్ ల్యాండ్ సీలింగ్ , ఇనాం, అసైన్డ్, భూదాన్ భూములు, చెరువు శిఖం, బఫర్ జోన్లకు సంబంధించిన సర్వే నంబర్లలో ప్రైవేటు పట్టా భూములు కలిసిపోవడం మరొక కారణం. కోర్టు ఉత్తర్వులతో రిజిస్ట్రేషన్లు పొందిన ఆస్తులు సైతం రెవెన్యూ రికార్డుల్లో సవరణలు జరగకపోవడం వల్ల ఇప్పటికీ నిషేధిత జాబితాలోనే దర్శనమిస్తున్నాయి. ప్రైవేటు ఆస్తుల యజమానులకు ఊరట కలిగించేందుకు జిల్లాల వారీగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖలు సంయుక్తంగా గ్రామాల స్థాయిలో జాబితాలను సరూర్‌నగర్, ఉప్పల్

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Gold Discovery In Belgium: ఇంటికి సాధారణ మరమ్మతులు చేస్తుండగా కూలీలకు అనుకోకుండా కోట్ల రూపాయల విలువైన బంగారు నిధి లభించింది. బెల్జియంలో వెలుగు చూసిన ఈ అరుదైన ఘటన ప్రస్తుతం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. గోడ వెనుక దాగిన నిధి.. అసలేం జరిగింది? బెల్జియంలోని తూర్పు ఫ్లాండర్స్ ప్రాంతంలో ఓ పాత ఇంట్లో మురుగునీటి పైపులు మార్చే పనులు చేపట్టారు. ఈ పనుల్లో భాగంగా కార్మికులు ఇంటి పునాది వద్ద గోడకు డ్రిల్లింగ్ చేస్తుండగా.. లోపలి నుంచి పసుపు రంగు వస్తువులు బయటపడ్డాయి. మొదట అయోమయానికి గురైన కూలీలు మరింత లోతుగా తవ్వగా, గుట్టలు గుట్టలుగా బంగారు ఆభరణాలు, నాణేలు, గోల్డ్ బిస్కెట్లు దర్శనమిచ్చాయి. రూ. 100 కోట్ల విలువైన బంగారం! ఈ పనులలో వేసవి సెలవుల్లో పనిచేయడానికి వచ్చిన 18 ఏళ్ల కోబీ అనే యువకుడు కూడా ఉన్నాడు. మొదట అతను ఆ నాణేలను సాధారణ 1 యూరో నాణేలుగా భావించాడు. కానీ కొద్దిసేపటికి అక్కడ బంగారు కడ్డీలు కనిపించడంతో అది కోట్ల విలువైన నిధి అని అందరూ గ్రహించారు. కార్మికులు కనుగొన్న ఈ నిధి మొత్తం విలువ సుమారు 9 మిలియన్ యూరోలు, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.100 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ అద్భుత ఆవిష్కరణ అందరినీ విస్మయానికి గురిచేసింది. బంగారం యజమాని ఎవరు? చట్టం ఏం చెబుతోంది? బంగారం లభించిన ఆ భవనం స్థానికంగా సేవలందిస్తున్న 'CAW ఊస్ట్ - వ్లాండరెన్' సంస్థకు చెందినదిగా తేలింది

2029 లోక్‌సభ ఎన్నికల సమయానికి దేశంలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తిగా పూర్తికావడంపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం 2027 జనాభా గణన అధికారిక డేటా వచ్చిన తర్వాత మాత్రమే కొత్త సరిహద్దుల ఏర్పాటు సాధ్యమవుతుంది. ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే రాబోయే 2029 సాధారణ ఎన్నికలు పాత నియోజకవర్గాల పరిమితులతోనే జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దేశంలో 1971 జనాభా లెక్కల ప్రాతిపదికన కేటాయించిన లోక్‌సభ సీట్ల సంఖ్యను 1976 లో మొదటిసారిగా ఫ్రీజ్ చేశారు. ఆ తర్వాత 2001 లో చేసిన 84 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పరిమితిని 2026 తర్వాత జరిగే మొదటి జనాభా గణన వరకు పొడిగించారు. ప్రస్తుతం కుల గణనతో కలిపి చేపడుతున్న 2027 సెన్సస్ పూర్తయి డేటా వెలువడిన తర్వాతే ఆర్టికల్ 81 మరియు 82 ప్రకారం డెలిమిటేషన్ ప్రక్రియ మొదలవుతుంది. ఇదిలా ఉండగా ప్రభుత్వం లోక్‌సభ సీట్లను 543 నుంచి 850 వరకు పెంచి 2011 సెన్సస్ ఆధారంగానే పునర్విభజన చేయాలని భావించింది. ఏప్రిల్ 2026 లో పార్లమెంటులో ప్రతిపాదించిన సవరణ బిల్లులకు అవసరమైన 2/3 వంతు మెజారిటీ లభించకపోవడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. దీంతో 2029 నాటికి మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయడంపై కూడా తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ ప్రయోజనం జరిగి దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గిపోతుందని నాయకులు భావిస్తున్నారు. ఫలితంగా అన్ని రాష్ట్రాలకు న్యాయమైన రీతిలో సీట్లను పెంచేందుకు వీలుగా ప్రభుత్వం కొత్త ఫార్ములాలపై రాజకీయ పార్టీల ఆమోదం కోసం ప్రయత్నిస్తోంది. సాధారణంగా డెలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ప్రక్రియ పూర్తి చేయడానికి కనీసం 1.5 నుండి 3 సంవత్సరాల సమయం

గోల్డ్ ప్రియులకు భారీ షాక్. బంగారం ధరలు వరుసగా రెండో రోజు భారీగా పెరిగాయి. మంగళవారం రూ.3 వేలకుపైగా పెరగ్గా.. ఇవాళ కూడా రూ.వెయ్యి పెరుగుదలను నమోదు చేసింది. దీంతో రాబోయే రోజుల్లో గోల్డ్ రేట్లు మరింత పెరగవచ్చనే వార్తలకు ఇది బలం చేకూరుస్తోంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య దాడులు ప్రారంభం కావడం, డాలర్ విలువ, ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లపై అస్పష్టత వంటివి పసిడి ధరలపై ప్రభావితం చూపిస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కూడా వీటికి తోడయ్యాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,54,860 వద్ద కొనసాగుతోడగా.. బుధవారం ఒక్కరోజే రూ.1040 పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,41,950గా ఉండగా.. ఇవాళ రూ.950 మేర పెరుగుదలను నమోదు చేశాయి. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. త్వరలో శ్రావణ మాసం ప్రారంభం కానుండటం, పెళ్లిళ్ల సీజన్ క్రమంలో ధరలు పెరగడం చేదువార్తగా చెప్పవచ్చు. ఇక చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ.1,54,380 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,41,358గా ఉంది. అటు బెంగళూరులో 24 క్యారెట్ల ధర చూస్తే రూ.1,54,860గా ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,41,950 వద్ద కొనసాగుతోంది. అటు దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,010 వద్ద ఉండగా.. ఇవాళ రూ.1040 పెరిగింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,42,100 వద్ద కొనసాగుతుండగా.. నేడు రూ.950 పెరిగింది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,860 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,41,950గా ఉంది. వెండి ధరలు స్ధిరంగా కొనసాగుతున్నాయి. ముంబైలో కిలో వెండి ధర రూ.2.55 లక్షలుగా ఉంది. హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ రేటు రూ.2.60 లక్షలుగా ఉంది. చెన్నైలో కూడా కిలో సిల్వర్ ధర రూ.2.60 లక్షల వద్ద కొనసాగుతోంది
వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల ప్రమాదం ఎక్కువగా పెరుగుతుంది. ముఖ్యంగా డెంగ్యూకి సకాలంలో చికిత్స చేయకుండా, దాని లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే.. ప్రాణాల మీదికి వస్తుంది. డెంగ్యూ వల్ల ప్లేట్లెట్ కౌంట్ వేగంగా తగ్గిపోతుంది, కొన్నిసార్లు ఇది ప్రాణాంతకం కాగలంత తీవ్రంగా ఉంటుంది. డెంగ్యూ లేదా ఇతర వ్యాధుల వల్ల ప్లేట్లెట్ల సంఖ్య పడిపోయినప్పుడు బొప్పాయి ఆకు గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. కొన్ని చిన్న పరిశోధనల ప్రకారం, బొప్పాయి ఆకు సారం (Papaya Leaf Extract) డెంగ్యూ రోగుల్లో ప్లేట్లెట్ల సంఖ్య పెరగడానికి సహాయపడుతుందని తేలింది. అయితే దీనిపై ఉన్న ఆధారాలు పరిమితం. కాబట్టి దీనిని ఖచ్చితమైన లేదా ప్రధానమైన చికిత్సగా భావించలేము. ఇది నిజమా? అపోహనా? అన్న పూర్తి వివరాల్ని డాక్టర్ దిలీప్ గుడె (సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్) అందించారు.ఇది నిజమా? అపోహనా? ఇది పూర్తిగా అబద్ధం కాదు, అలా అని ఒక అద్భుతమైన నివారణ కూడా కాదు! బొప్పాయి ఆకు రసం కొన్ని కేసుల్లో ప్లేట్లెట్లకు సహాయక పాత్ర వహిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ దీనిని అసలైన వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయంగా చూడకూడదు.సాధారణంగా వ్యాధి తగ్గుతున్న కొద్దీ ప్లేట్లెట్ల సంఖ్య సహజంగానే పెరుగుతుంది. కాబట్టి ఈ పెరుగుదల బొప్పాయి ఆకు రసం వల్ల జరిగిందా లేదా శరీరం స్వయంచాలకంగా కోలుకోవడం వల్ల జరిగిందా అనేది ఖచ్చితంగా చెప్పడం కష్టం.ఇది కేవలం ఇంటి చిట్కా మాత్రమేనా? అవును. డాక్టర్ సలహా మేరకు మాత్రమే బొప్పాయి ఆకును ఒక అదనపు ఉపశమనంగా వాడాలి. డెంగ్యూ వంటి సమస్యలు ఉన్నప్పుడు సరిపడా నీరు/ద్రవ పదార్థాలు తాగడం (Hydration), ప్లేట్లెట్లను ఎప్పటికప్పుడు పరీక్షించడం, రక్తస్రావం కాకుండా చూసుకోవడం, సరైన వైద్య చికిత్స పొందడమే అత్యంత ముఖ్యమైనవి.ముఖ్య హెచ్చరిక: ఒకవేళ ప్లేట్లెట్స్ వేగంగా పడిపోతున్నా, శరీరంలో ఎక్కడైనా రక్తస్రావం కనిపిస్తున్నా, తీవ్రమైన బలహీనత, కడుపునొప్పి లేదా శ్వాస

ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి ఏ పని చేయాలి అనిపించకపోవడం, ఇష్టమైన పనులపై కూడా ఆసక్తి లేకపోవడం, చిన్న పని చేయాలన్నా బద్ధకంగా అనిపించడం చాలామందికి అప్పుడప్పుడు ఎదురయ్యే అనుభవమే. అయితే ఇది ప్రతిసారీ బద్ధకం అని అనుకోవడం సరైంది కాదు. దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయని చెబుతున్నారు సైకాలజీ నిపుణులు. అవేంటో చూద్దాం. సైకాలజీ నిపుణుల ప్రకారం మనకు ఏ పని చేయాలనిపించకపోవడానికి ముఖ్యమైన కారణం మానసిక అలసట. రోజంతా పని, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు, సంబంధాల్లో ఒత్తిడి, భవిష్యత్తుపై ఆందోళన వంటి అంశాల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటే మెదడుకు తగిన విశ్రాంతి ఉండదు. బయటకు పెద్దగా శారీరక పని చేయకపోయినా మనసు మాత్రం నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. ఇలాంటి సమయంలో సాధారణ పనులు కూడా పెద్ద భారంగా అనిపించవచ్చు. ముఖ్యంగా ఒకేసారి ఎన్నో పనులు చేయాల్సి వస్తున్నప్పుడు “ముందు ఏం చేయాలి?” అనే ఆలోచన కూడా ఒత్తిడిని పెంచి పనిని ప్రారంభించే ఉత్సాహాన్ని తగ్గించవచ్చు. రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవడం, తరచూ నిద్ర లేవడం లేదా ఎక్కువసేపు నిద్రపోయినా విశ్రాంతిగా అనిపించకపోవడం వల్ల మరుసటి రోజు శక్తి తగ్గిపోవచ్చు. అలసటతో పాటు ఏకాగ్రత, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా తగ్గిపోవచ్చు. డిప్రెషన్లో కూడా నిద్రలో మార్పులు, శక్తి తగ్గడం, ఆసక్తి కోల్పోవడం, ప్రేరణ లేకపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ పని పూర్తి చేయాలి, ఈ టైం లోపు అయిపోవాలి, నేను తప్పకుండా విజయం సాధించాలి.. అనే ఒత్తిడి ఎక్కువైతే పని చేయడం హ్యాపిగా కాకుండా భారంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఒక పెద్ద పనిని మొత్తం ఒకేసారి పూర్తి చేయాలని ప్రయత్నిస్తే మెదడుకు చాలా కష్టమైన లక్ష్యంగా కనిపించవచ్చు. దానివల్ల పని ప్రారంభించడానికే మనసు వెనుకాడుతుంది. అందుకే పెద్ద పనిని చిన్న చిన్న భాగాలుగా విభజించి.. ముందుగా చేయాల్సిన ముఖ్యమైన పనిని ఎంచుకోవడం మంచి పద్ధతి

ప్రయాణం మొదలైన కొద్దిసేపటికే చాలా మందికి నిద్ర వస్తుంటుంది. అసలు ప్రయాణంలో ఎందుకు అంత త్వరగా నిద్ర వస్తుందో తెలుసుకుందాం.. ఇంటర్నెట్ డెస్క్: కారు, బస్సు లేదా రైలులో ప్రయాణిస్తున్నప్పుడు కొద్దిసేపటికే నిద్రలోకి జారుకుంటున్నారా? చాలా మందికి ప్రయాణం మొదలైన 10–15 నిమిషాల్లోనే నిద్రమత్తు వస్తుంది. ముఖ్యంగా మధ్యాహ్న భోజనం తర్వాత ప్రయాణిస్తే ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంటుంది. అసలు ప్రయాణంలో ఎందుకు నిద్ర వస్తుంది? దానికి గల కారణాలేంటో చూద్దాం.. ప్రయాణిస్తున్నప్పుడు వాహనం స్వల్పంగా కదులుతూ ఉంటుంది. ఈ కదలికలు ఊయలలో ఊగుతున్న అనుభూతిని కలిగిస్తాయి. దీంతో శరీరం, మెదడు క్రమంగా రిలాక్స్ అవుతాయి. ఫలితంగా నిద్రమత్తు రావచ్చు. కారు, బస్సు లేదా రైలు వంటి మూసివున్న ప్రదేశాల్లో బయటితో పోలిస్తే సహజ కాంతి తక్కువగా ఉంటుంది. కాంతి తగ్గినప్పుడు శరీరంలోని నిద్ర–మేల్కొలుపు చక్రం ప్రభావితమై నిద్రమత్తు పెరగవచ్చు. ప్రయాణంలో ఎక్కువసేపు ఒకే చోట కూర్చుని ఉండాల్సి వస్తుంది. శారీరక శ్రమ లేకపోవడం, పెద్దగా ఎలాంటి పని లేకపోవడం వల్ల మెదడు ప్రశాంతంగా మారుతుంది. దీంతో నిద్ర వచ్చే అవకాశం పెరుగుతుంది. కారు, బస్సు లేదా రైలు ఇంజిన్, టైర్ల నుంచి నిరంతరం ఒకే రకమైన మృదువైన శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఈ శబ్దం కొంతమందికి ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించి నిద్రమత్తును పెంచుతుంది. సాధారణంగా పెద్దలకు రోజుకు సుమారు 7–9 గంటల నిద్ర అవసరం. సరైన నిద్ర లేకపోవడం లేదా ఎక్కువగా అలసిపోయి ఉండటం వల్ల ప్రయాణంలో ప్రశాంతమైన వాతావరణం, వాహనం కదలికలు నిద్రను మరింత ప్రేరేపించవచ్చు. కారు, బస్సు లేదా రైలు ఒకే వేగంతో సాఫీగా ప్రయాణిస్తుంటే శరీరం క్రమంగా విశ్రాంతి స్థితిలోకి వెళ్తుంది. ఒత్తిడి తగ్గి శరీరం, మనసు ప్రశాంతంగా మారడంతో నిద్ర సులభంగా రావచ్చు. ప్రయాణంలో కిటికీ బయట రోడ్లు, చెట్లు, పొలాలు, భవనాలు వంటి దృశ్యాలను చూస్తూ ఉండటం వల్ల కొంతమందికి మానసిక ఒత్తిడి తగ్గుతుంది

అంతర్జాతీయంగా చోటుచేసుకుంటోన్న తాజా పరిణామాల నేపథ్యంలో దేశంలో బంగారం, వెండి ధరలు శరవేగంగా పుంజుకున్నాయి. నేడు భారీగా పెరిగాయి. దేశవ్యాప్తంగా పసిడి, వెండి ధరలు అమాంతం ఆకాశానికి ఎగబాకాయి. అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇందుకు ప్రధాన కారణం. సురక్షితమైన పెట్టుబడిగా భావించే పసిడి వైపు మదుపరులు మొగ్గు చూపడం దేశీయ కొనుగోలుదారులపై తక్షణ ప్రభావం చూపింది.నేడు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో పసిడి ధరలు గణనీయంగా పెరిగాయి. సోమవారం నాటి క్లోజింగ్ సెషన్స్ తో పోల్చుకుంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో 3,160 రూపాయల పెరుగుదల కనిపించింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 2,900, 18 క్యారెట్లు 2,370 రూపాయల వరకు పెరిగింది. 1.22 శాతం పెరుగుదల నమోదు చేసుకుంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,210 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ఫ్యూచర్స్ ధర కూడా భారీగా లాభపడింది. కేజీకి 1.05 శాతం లాభంతో రూ.2,40,340 వద్ద కొనసాగుతోంది.హైదరాబాద్ లో 24 క్యారెట్లు బంగారం ధర 10 గ్రాములకు రూ.1,55,160, 22 క్యారెట్లు రూ.1,42,230 వద్ద నిలిచింది. కిలో వెండి రూ.2,40,010 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,54,930, 22 క్యారెట్లు రూ.1,42,019 వద్ద స్థిరపడింది. ఇక్కడ వెండి కిలో ధర రూ.2,39,910 వద్ద ట్రేడ్ అవుతోంది. బెంగళూరులో 24 క్యారెట్ల 20 గ్రాముల బంగారం రూ.1,55,050 కాగా 22 క్యారెట్లు రూ.1,42,129. వెండి కిలో రూ.2,40,100 గా నమోదైంది. చెన్నైలో ఇవే రేట్లు రూ.1,55,370, 22 క్యారెట్లు రూ.1,42,423, వెండి రూ.2,40,330 వద్ద కొనసాగుతోంది.తెలంగాణలో 4 రోజుల ముందే ఎగిరిన త్రివర్ణ పతాకం: 50 ఏళ్ల తర్వాత: ఆ కంచుకోట ఇకపై..!!వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.చెన్నై..24 క్యారెట్లు- రూ
Gold Price: మన దేశంలో బంగారం కొనుగోళ్లు ఏడాది పొడవునా సాగుతాయి. అయితే, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలతో భారత్ విదేశీ మారక నిల్వలను భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో బంగారం, వెండి కొనుగోళ్లను నియంత్రించేందుకు ఈ విలువైన లోహాలపై దిగుమతి సుంకాలను భారీగా పెంచింది. ఇలా సుంకాలు పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చింది. మే 13వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు చూసుకుంటే బంగారం, వెండి, ప్లాటినమ్ వంటి లోహాలపై విధించిన కస్టమ్స్ డ్యూటీ రూపంలో రూ.10,463 కోట్ల మేర ఆదాయం వచ్చిందని పార్లమెంటుకు తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంతిర పంకజ్ చౌదరి ఓ ప్రశ్నకు సమాధానంగా లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, హార్మూజ్ జల సంధి మూసివేయడం వంటి కారణాలతో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఆహారం, ఎరువుల ధరలకూ రెక్కలొచ్చాయి. దీంతో విదేశీ మారకం నిల్వలు కాపాడేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంది. అందులో బంగారం, వెండి వంటి వాటిపై కస్టమ్స్ సుంకాల పెంపు ఒకటి. ఆయా లోహాలపై దిగుమతి సుంకాలు పెంచడం ద్వారా కొనుగోళ్లు తగ్గించాలన్నది ప్రభుత్వ వ్యూహం. ఇందులో భాగంగో బంగారం, వెండిపై 6 శాతంగా ఉన్నకస్టమ్స్ సుంకాన్ని మే 13వ తేదీన 15 శాతానికి పెంచింది. ఇక ప్లాటినంపై ఉన్న 6.4 శాతం సుంకాలను 15.4 శాతానికి చేర్చారు.ఇలా బంగారం, వెండి దిగుమతులపై సుంకాలు పెంచడంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చింది. మే 13వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ మధ్య చూసుకుంటే బంగారంపై సుంకాల రూపంలో రూ.10,040 కోట్లు వసూలైంది. ఇక వెండిపై రూ.328 కోట్ల మేర ఆదాయం రాగా, ప్లాటినమ్ పై రూ.95 కోట్ల చొప్పున ఆదాయం వచ్చింది. ఈ 3 లోహాలపై కలిపి మొత్తంగా రూ.10,463 కోట్ల ఆదాయం వచ్చినట్లు

అన్నదాతలకు ఆర్థికంగా మరింత చేయూతనందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రైతులకు అందించే రుణ పరిమితిని భారీగా పెంచింది. లోక్‌సభలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిస్తూ ఈ వివరాలను వెల్లడించారు.వ్యవసాయ పెట్టుబడి ఖర్చులు పెరిగిన నేపథ్యంలో రైతులకు అదనపు ఆర్థిక సౌలభ్యం కల్పించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సవరించిన వడ్డీ రాయితీ పథకం కింద కిసాన్ క్రెడిట్ కార్డుల రుణ పరిమితిని రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో పంట సాగు, ఇతర వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు రైతులకు సరిపడా రుణాలు సులభంగా అందనున్నాయి.సకాలంలో చెల్లిస్తే మరిన్ని ప్రోత్సాహకాలురుణాలు సకాలంలో తిరిగి చెల్లించే నిబద్ధత గల రైతులకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు (PRI) అందిస్తోంది. అందులో భాగంగా గత ఐదేళ్లలో వడ్డీ రాయితీ, ప్రోత్సాహకాల కింద ఏకంగా రూ. 89,905.25 కోట్లను పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. కేవలం 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే రూ. 18,366.80 కోట్ల నిధులను కేటాయించి రైతులకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచింది. Kisan Credit Card కొత్త రూల్స్.. రైతన్నలకు ఆర్బీఐ గుడ్ న్యూస్నిధుల పంపిణీ వివరాలుఆర్థిక సంవత్సరం పంపిణీ చేసిన నిధులు (రూ. కోట్లలో)2021-22 రూ. 21,476.93 కోట్లు2022-23 రూ. 17,997.88 కోట్లు2023-24 రూ. 14,251.92 కోట్లు2024-25 రూ. 17,811.72 కోట్లు2025-26 రూ. 18,366.80 కోట్లుమొత్తం (2021-22 నుంచి 2025-26 వరకు): రూ. 89,905.25 కోట్లుKisan Mitra Chhadi: రైతన్నలకు కేంద్రం సూపర్ గిఫ్ట్:డిజిటల్ పద్ధతిలో జన్ సమర్థ్ ద్వారా కేసీసీల జారీరైతులకు కేసీసీ కార్డుల జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు జన్ సమర్థ్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ డిజిటల్ సేవలు పూర్తి స్థాయిలో
Mutual Fund SIP Investments: చాలా మంది దీర్ఘకాలంలో మంచి రాబడి కోసం మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. చిన్న మొత్తంతోనూ పెట్టుబడులు ప్రారంభించి క్రమంగా దాన్ని పెంచుకుంటూ పోతే సంపద మరింత పెరుగుతుంది. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్లలో సిప్ ద్వారా పెట్టుబడులు పెట్టే వారికి ప్రతి ఏటా జీతం పెరుగుతున్న కొద్దీ సిప్ మొత్తాన్ని కొద్ది మొత్తం పెంచుతూ పోవడం ద్వారా మరింత మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. ఇలా సిప్ మొత్తాన్ని ఏటా పెంచడాన్ని స్టెప్ అప్ సిప్ లేదా సిప్ టాప్ అప్‌గా వ్యవహరిస్తుంటారు. వైట్ఓక్ క్యాపిటల్ విశ్లేషణ ప్రకారం మనం ఇప్పుడు ఈ సిప్ లెక్కల్ని ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం.ఇక్కడ నెలకు రూ. 10 వేల చొప్పున సిప్ పెట్టుబడిని ప్రారంభించి, ఇంకా ప్రతి ఏటా నెలవారీ పెట్టుబడిని రూ. 1000 చొప్పున పెంచుకుంటూ వెళ్తే 25 ఏళ్లలో దాదాపు రూ. 3.49 కోట్ల కార్పస్‌ను సాధించే అవకాశం ఉంది. అదే సమయంలో నెలకు రూ. 10 వేల చొప్పున ఎలాంటి పెంపు లేకుండా చూస్తే 25 ఏళ్లలో రూ. 2.30 కోట్ల కార్పస్ సమకూరుతుంది. అంటే ఇక్కడ ఏడాదికి రూ. 1000 చొప్పున పెంచితే అదనంగా 25 ఏళ్లలో ఏకంగా రూ. 1.19 కోట్ల మేర కార్పస్ సమకూరిందన్నమాట. ఇలా కచ్చితంగా రూ. 1000 పెంపు అని మాత్రమే కాదు. ఎంతైనా ఎవరి స్థోమతకు తగ్గట్లుగా వారు సిప్ మొత్తాన్ని పెంచుకోవచ్చు. ఇక్కడ కాంపౌండింగ్ ప్రభావం కారణంగానే సంపద వేగంగా పెరుగుతుంది.స్టెప్ అప్ సిప్ ఎలా చేయాలి?ఉదాహరణకు పెట్టుబడిదారు తొలి ఏడాది నెలకు రూ. 10 వేల చొప్పున సిప్ చేస్తే రెండో ఏడాది దీనిని రూ. 1000 పెంచుతారు. అప్పుడు సిప్ పెట్టుబడి రూ. 11 వేలు అవుతుంది. మూడో ఏడాదికి ఇది రూ. 12 వేలుగా మారుతుంది. ఇలా ఏటా రూ

మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత చాలా మందికి నిద్ర ముంచుకు రావడం జరుగుతూనే ఉంటుంది. ఏ పనీ చేయాలనిపించదు. ఆవలింతలు వరుసగా వస్తూనే ఉంటాయి. ఆఫీసులో ఉంటే చైర్లో కూర్చున్న కాసేపటికి కళ్లు మూసుకుపోతాయి. కొందరు కునుకు తీసేస్తారు కూడా. ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. భోజనం తర్వాత నిద్రమత్తుగా అనిపించడాన్ని 'పోస్ట్-మీల్ డ్రౌజీనెస్' అంటారు. ఇదేమీ అనారోగ్యం కాదు. మన శరీర సహజ గడియారం, తిన్న ఆహారం, తిన్న పరిమాణం దీనికి కారణాలుగా చెప్పుకుంటారు. మధ్యాహ్న సమయంలో మన శరీరంలోని 24-గంటల సహజ గడియారం కొద్దిగా నెమ్మదిస్తుంది. అందుకే చాలామంది భోజనం చేయకపోయినా కాస్త మత్తుగా, బద్ధకంగా ఫీల్ అవుతూ ఉంటారు. పొట్ట నిండా తింటే నిద్రగా అనిపించడం, బద్ధకంగా అనిపించడం జరుగుతుంది. పొట్ట నిండా తిన్నాక పండ్లు, లస్సీ, జ్యూస్‌లు కూడా తాగితే నిద్ర ముంచుకొస్తుంది. ముఖ్యంగా ఎక్కువ కేలరీలు, వేపుళ్లు, స్వీట్లు తిన్నప్పుడు నిద్ర మత్తు ఎక్కువగా అనిపిస్తుంది. మధ్యాహ్న భోజనం తర్వాత శరీరంలో జీర్ణక్రియకు సంబంధించిన మార్పులు చాలా జరుగుతాయి. రక్తంలో గ్లూకోజ్, ఇతర పోషకాల స్థాయిలలో మార్పులు వస్తాయి. రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోయినా కూడా మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్ర ముంచుకొస్తుంది. రాత్రి ఆలస్యంగా నిద్రపోయే అలవాటు ఉంటే పగటిపూట నిద్ర వస్తుంది. అందుకే రాత్రిపూట తగినంత నిద్రపోవడం చాలా అవసరం. మధ్యాహ్నం భోజనం చేశాక నిద్ర మత్తు మరీ ఎక్కువగా ఉండి ఆఫీసు పనిచేయడానికి కష్టంగా మారితే చిన్న చిట్కాలు పాటించడి. మధ్యాహ్నం అతిగా కాకుండా మితంగా తినండి. తిన్న తర్వాత కాసేపు అటూ ఇటూ నడవండి. ఎక్కువగా నీళ్లు తాగండి. రాత్రిపూట సరిపడా నిద్రపోండి. ఒకవేళ ఈ సమస్య రోజూ వస్తుంటే, తల తిరగడం, నీరసం వంటివి కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి. ఎందుకంటే కొన్నిసార్లు రక్తహీనత , థైరాయిడ్, బ్లడ్ షుగర్ సమస్యల వల్ల కూడా

ఒక కప్పు కాఫీ.. ఆ క్యాన్సర్‌ను మాయం చేస్తోందని తెలుసా?ఒక కప్పు కాఫీ.. ఆ క్యాన్సర్‌ను మాయం చేస్తోందని తెలుసా? Samatha 10 August 2026 కాఫీ అంటే చాలా మంది ఇష్టం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఉదయం లేచిందంటే చాలు కప్పు కాఫీ తాగుతుంటారు. కానీ కొంత మందికి కాఫీ తాగడం అస్సలే ఇష్టం ఉండదు. కానీ ప్రతి రోజూ స్త్రీలు ఒక కప్పు కాఫీ తాగడ ం వలన క్యాన్సర్ నుంచి బయటపడవచ్చునంట. కాఫీ క్యాన్సర్‌ను తగ్గించడం ఏంటి అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ అద్భుతమై సమాచారం. కాఫీ తాగడం వలన రొమ్ము క్యాన్సర్ తగ్గుతుందం ట. ఈ మధ్య కాలంలో చాలా మంది రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 694,000 మంది మహిళలు రొమ్ముక్యాన్సర్‌తో మరణించడం జరుగుతుందంట. అయితే దీనిని నుంచి బయటపడాలి అంటే తీసుకునే ఆహారం, జీవనశైలి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా అవసరం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో విటమిన్ బి, విటమిన్ డి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ సి, వంటివి కీలక పాత్ర పోషిస్తాయి. కానీ బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురించిన దాని ప్రకారం.. యాంటీ ఆక్సిడెంట్ గుణాలకు ప్రసిద్ధి చెందిన పాలీఫెనాల్ అనే సహజ మొక్కల సమ్మేళనం రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పూర్తిగా తగ్గిస్తుందంట. దీనిని తీసుకోవడం వలన చాలా మంది ఈ క్యాన్సర్ నుంచి బయటపడ్డారంట. అయితే ఈ సమ్మేళనం ఎక్కువగా కాఫీలో ఉంటుందంట. అంతే కాకుండా కోకూ, బెర్రీలు, మూలికలు, సుగంధ ద్రవ్యాలు, చిక్కుళ్ల వంటి వాటిలో ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కాఫీలో పుష్కలంగా ఉంటుందంట. మరిన్ని వెబ్ స్టోరీస్ రంగు రంగుల మందారాలు.. ఇంటి ముందు ఏ రంగు మొక్క ఉండాలో తెలుసా? పదే పదే స్వీట్ తినాలనిపిస్తుందా? మీ ఇంటిలో నెమలి