మీ సోదరి రాశిని బట్టి ఎలాంటి బహుమతులివ్వాలి? 12 రాశుల వారికి గిఫ్ట్ ఐడియాలివే
మేష రాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు, కాబట్టి రక్షా బంధన్ రోజున మీ సోదరికి ఎరుపు రంగు దుస్తులను, అందమైన చెవిపోగులు (Ear rings) లేదా ఆకట్టుకునే పగడపు రాయితో అలంకరించబడిన లాకెట్‌ను బహుమతిగా ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల మీ సోదరి ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. రక్షాబంధన్ రోజున మీ శక్తి మేరకు మీ సోదరికి వెండి ఆభరణాలు లేదా నాణెలను ఇవ్వొచ్చు. దీని వల్ల మీ వ్యక్తిగత జీవితం మెరుగుపడుతుంది. మీ జీవితంలో సంతోషం, శ్రేయస్సు బాగా పెరుగుతాయి. మిథున రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి వీరికి రాఖీ పండుగ రోజున ఆకుపచ్చని రంగులో ఉండే గాజులను బహుమతి ఇవ్వాలి లేదా ఆకుపచ్చని రంగులో ఉండే దుస్తులను కూడా బహుమతిగా ఇవ్వొచ్చు. వీటిని ఇవ్వడం ద్వారా మీ బంధం మరింత బలోపేతం అవుతుంది. కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి మీ సోదరికి వెండి వస్తువులను లేదా తెల్లని వస్తువులను బహుమతిగా ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల మీకు, మీ సోదరి మధ్య ప్రేమ బంధం మరింత బలపడుతుంది. సింహ రాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి రక్షా బంధన్ రోజున మీ సోదరికి బంగారం ఆభరణాలు లేదా ఎరుపు రంగుకు సంబంధించిన వస్తువులను ఏవైనా ఇవ్వొచ్చు. దీని వల్ల మీ జీవితంలో ఎదుయ్యే అడ్డంకులన్నీ తొలగిపోయే అవకాశం ఉంది. కన్య రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. ఈ సమయంలో ఆకుపచ్చ రంగు వస్తువులను బహుమతిగా ఇవ్వొచ్చు. మీ శక్తి సామర్థ్యాల మేరకు పచ్చ ఉంగరం కూడా బహుమతిగా ఇవ్వొచ్చు. తులా రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. రక్షాబంధన్ వంటి పవిత్రమైన రోజున మీ సోదరికి వెండి ఆభరణాలు లేదా ఏదైనా విలువైన బహుమతిని లేదా కొత్త బట్టలను బహుమతిగా ఇవ్వొచ్చు
