
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
శ్రావణ సోమవారం ప్రత్యేకత... శ్రావణ మాసంలో మంగళవారాలు, శుక్రవారాలే కాదు.. ఈ నెలలో వచ్చే సోమవారాలు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఈ నెలలో వచ్చే వ్రతాలను చేయలేకపోయినా ... శ్రావణమాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజున శివ ప్రీతిగా సోమవారం వ్రతాలను చేయడం వలన అన్ని మాసాలలో చేసిన శివపూజా ఫలితం వస్తుందని శివపురాణం చెబుతున్న మాట. కనుక భక్తులు శైవాలయాలను సందర్శించి 108 బిల్వపత్రాలతో శివ లింగాలను పూజించి రుద్రాభిషేకం చేయడం అత్యుత్తమ ఫలితాలను ఇస్తుందట. ఈరోజు పగలు అంతా కేవలం మంచినీరు త్రాగుతూ ఉపవాసం ఉండి, నక్త సమయంలో సూర్యాస్తమయము అయిన 72 నిమిషాల తర్వాత నక్షత్ర దర్శనం చేసుకొని పారణ చేయాలి. దీన్నే నక్తం అంటారు.
శ్రావణ సోమవారం , శ్రావణ సోమవార వ్రతాన్ని ఎలా పాటించాలి..
శ్రావణ సోమవార వ్రతంలో ఆది దంపతులైన శివపార్వతులను పూజిస్తారు. పురాణాలననుసరించి సోమవారపు వ్రతాలు మూడు రకాలుగా ఉన్నాయి. సోమవారం , పదహారు సోమవారాలు , సౌమ్య ప్రదోష. అన్ని వ్రతాలలాగే ఈ సోమవారపు వ్రతం పాటించాలి. శ్రావణమాసంలో ఈ సోమవారపు వ్రతాన్ని పాటిస్తే చాలా శుభాలు కలుగుతాయని పురాణాలు చెపుతున్నాయి.
శ్రావణ సోమవారపు వ్రతాన్ని సూర్యోదయానికి ముందు ప్రారంభించి సాయంత్రం వరకు పాటిస్తుంటారు. శివుని పూజ చేసిన తర్వాత సోమవారపు కథను వినడం తప్పనిసరి. వ్రతాన్ని పాటించేవారు రోజుకు ఒకపూట మాత్రమే భోజనం చేయాలి.
శ్రావణ సోమవారపు వ్రతాన్ని పాటించే వారు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానపానాదులు పూర్తి చేసుకోవాలి. ఇంటిని పరిశుభ్రంగా చేసుకుని గంగాజలాన్ని లేదా పవిత్రమైన నీటిని ఇంట్లో చల్లాలి. ఇంట్లోనే మీకు నచ్చిన చోట లేదా పూజగదిలో శివుని విగ్రహం లేదా లింగం లేదా శివుడి పటాన్ని ఏర్పాటు చేసుకోండి.
నిత్య పూజాది కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఈ మంత్రం పఠిస్తూ సంకల్పం చేసుకోండి.
*'మమ క్షేమస్థైర్యవిజయారోగ్యైశ్వర్యాభివృద్ధయర్థం.... సోమవ్రతం కరిష్యే '
ధ్యానం తర్వాత *"ఓం నమఃశివాయ"* తో శివునికి "ఓం నమఃశివాయై" తో పార్వతీదేవిని షోఢశోపచారాలతో పూజించాలి. పూజ పూర్తయిన తర్వాత వ్రతానికి సంబంధించి కథను వినాలి. ఆ తర్వాత భోజనం లేదా ఫలహారం సేవించడంతో ఈ వ్రతం పూర్తవుతుంది.
శ్రావణ సోమవారపు వ్రతాన్ని నియమానుసారం పాటిస్తే సృష్టి తొలి దంపతులైన పార్వతీ పరమేశ్వరులు కృపాకటాక్షాలు లభిస్తాయని పురాణ ప్రతీతి.అంతేకాదు వీరిని ధ్యానించడం వలన జీవితం ధన్యమవుతుంది. ఇల్లు ధనధాన్యాలతో తులతూగుతుంటాయి. భక్తుల కష్టాలు తొలిగిపోతయని పురాణాలు చెబుతున్నాయి.
శివ ముష్టి వ్రతం.. కొత్తగా పెళ్లి అయిన స్త్రీలు,వివాహం అయిన మొదటి అయిదేళ్లు.. శ్రావణమాసం లో వచ్చే అన్నీ సోమవారాలు ఈ వ్రతం ఆచరిస్తారు. శ్రావణ మాసంలో ప్రతి సోమవారం రోజున ఒంటి పూట భోజనం చేస్తూ, శివలింగాన్ని పూజించి, ఒక్కో సోమవారం రోజున ఒక్కో వంటకం నివేదన చేస్తుండాలి. మొదటి సోమవారం రోజు వరిధాన్యంతో చేసిన పదార్థాలను నివేదన చేస్తారు. ఇలా చేయడం వలన వారి వైవాహిక జీవితం, దాంపత్య జీవితం చక్కగా, ఆహ్లాదకరంగా సాగుతుందనేది పెద్దలు చెబుతున్న మాట. ఆనాదిగా వస్తున్న ఓ నమ్మకం.
Disclaimer(గమనిక): ఇక్కడ ఇవ్వబడిన సమాచారం పండితులు, మన ధర్మ శాస్త్ర గ్రంథాలు, పురాణాల్లో ప్రస్తావించబడిన అంశాలనే మేము ఇక్కడ చెప్పాము. జీ మీడియా న్యూస్ ఈ వార్తను ధృవీకరించడం లేదు. ఏదైనా వ్రతాన్ని లేదా నోమును ఆచరించే ముందు సంబంధింత రంగంలోని పండితులను సంప్రదించి తగిన నిర్ణయం తీసుకోండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





