
Mahendragiri Varahi Movie Review: మహేంద్ర గిరి వారాహి మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Mahendragiri Varahi Movie Review: మహేంద్ర గిరి వారాహి మూవీ రివ్యూ అండ్ రేటింగ్
© 2026 nimisham.in

Mahendragiri Varahi Movie Review: మహేంద్ర గిరి వారాహి మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Epic Movie Review Telugu: ఎపిక్ మూవీ రివ్యూ

Epic Movie Review: ‘ఎపిక్’ సినిమా రివ్యూ.. ‘బేబీ’ జంట మళ్లీ హిట్ కొట్టిందా? లేదా..?

Epic Movie Review: ఎపిక్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Mandaadi Movie Review: సూరి vs సుహాస్.. ‘మండాడి’ సినిమా మెప్పించిందా?

Sardar 2 Movie Review: సర్దార్ 2 మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Sardar 2 Movie Review: సర్దార్ 2 మూవీ రివ్యూ.. సిల్లీ సీక్వెల్ ప్రో మ్యాక్స్!

Mandaadi Movie Review: మండాడి మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Maremma Movie Review: రవితేజ తమ్ముని కొడుకు హీరోగా మొదటి సినిమా.. ఫిట్టా.. ఫట్టా?

Maremma Movie Review: మారెమ్మ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Gandhari Movie Review: గాంధారి మూవీ రివ్యూ అండ్ రేటింగ్

నటీనటులు : సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్, వెంకటేష్ కాకుమాను, నరేంద్ర రవి, మణి ఏగుర్ల, సాయి సోహన్, ఉపేంద్ర లిమాయే తదితరులు దర్శకత్వం : వేణుగోపాల్ రెడ్డి సమర్పణ : సందీప్ రెడ్డి వంగా సంగీతం : వాసుకి వైభవ్ ఛాయాగ్రహణం : పవన్ పప్పుల కూర్పు : వేణుగోపాల్ రెడ్డి ‘మేమ్ ఫేమస్’ ఫేమ్ సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో వచ్చిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘రోమాంచకం’. నేడు థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు నవ్వించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం. అన్వేష్ (సుమంత్ ప్రభాస్) ఒక స్టార్టప్ నడుపుతుంటాడు. అతడు చెన్నైకి చెందిన మైథిలి (అనంతిక సనీల్‌కుమార్)తో ప్రేమలో పడతాడు. అన్వేష్‌ను కలిసేందుకు మైథిలి హైదరాబాద్ వచ్చిన క్రమంలో అనూహ్య సమస్యలు మొదలవుతాయి. ఆమె రాకతో అన్వేష్, అతని స్నేహితుల బృందం ఎలాంటి చిక్కుల్లో పడ్డారు? అసలు మైథిలికి ఏమైంది? ఆ సమస్యల వలయం నుంచి అన్వేష్ అండ్ గ్యాంగ్ ఎలా బయటపడ్డారు? అన్నదే ఈ సినిమా కథ. ‘రోమాంచకం’ సినిమా పెద్దగా కథాబలంపై కాకుండా, సిట్యువేషనల్, సిల్లీ కామెడీపైనే ఎక్కువగా ఆధారపడి సాగుతుంది. చాలావరకు ‘జాతిరత్నాలు’ జోన్‌ను తలపించేలా సాగే ఈ చిత్రంలో వినోదానికి లోటు లేకుండా చూసుకున్నారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫన్ ఎపిసోడ్స్ ఆడియన్స్‌ను బాగా నవ్విస్తాయి. క్లైమాక్స్ సీన్‌ను గందరగోళం (కన్ఫ్యూజన్) కామెడీతో డిజైన్ చేసిన విధానం సినిమాకు హైలైట్‌గా నిలిచింది. సుమంత్ ప్రభాస్ తన కేర్ఫ్రీ యువకుడి పాత్రలో ఎంతో ఈజ్‌తో నటించి మెప్పించాడు. ఫన్ సీన్లలో చలాకీగా కనిపిస్తూనే, హీరోయిన్ అనంతికతో మంచి కెమిస్ట్రీ పండించాడు. అనంతిక కూడా తన పాత్ర పరిధి మేరకు చక్కటి స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంది. ఇక హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్‌గా కనిపించిన వెంకటేష్ కాకుమాను, నరేంద్ర రవి, మణి ఏగుర్ల, సాయి సోహన్ పాత్రలు

Romanchakam Review : సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా తెరకెక్కిన సినిమా రోమాంచకం. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మాణంలో వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. రోమాంచకం సినిమా సెప్టెంబర్ 3న థియేటర్స్ లో రిలీజ్ అవుతుండగా ముందు రోజు రాత్రే ప్రీమియర్స్ వేశారు. కథ విషయానికొస్తే.. అన్వేష్(సుమంత్ ప్రభాస్) రోమాంచకం అనే డేటింగ్ యాప్ స్టార్టప్ కంపెనీ పెట్టాలని ఫ్రెండ్స్ తో కలిసి ప్రయత్నాలు చేస్తాడు. దాని కోసం అమ్మాయిలను అర్ధం చేసుకోవాలని ఇంకో డేటింగ్ యాప్ లో చెన్నై అమ్మాయి మైథిలి(అనంతిక సనీల్ కుమార్)ని పరిచయం చేసుకొని ఇద్దరూ ఫోన్స్ లో మాట్లాడుకొని ఫ్రెండ్స్ అయి బాగా దగ్గరవుతారు. మైథిలి పుట్టిన రోజు నాడు మొదటిసారి కలవాలని సర్ప్రైజ్ అని చెప్పి చెన్నై వెళ్తాడు అన్వేష్. తను ఒక హోటల్ దగ్గర ఉన్నానని చెప్పి రమ్మంటాడు. కానీ మైథిలి బ్లాక్ చేస్తుంది. దాంతో మైథిలి జ్ఞాపకాలతో, ఫ్రెండ్స్ తో గొడవలతో బాధపడుతుంటే సడెన్ గా ఓ రోజు మైథిలి ఫోన్ చేసి హైదరాబాద్ వస్తున్నాను నీతో ఓ రెండు రోజులు ఉంటాను అని చెప్తుంది. మైథిలిని అన్వేష్ తన ఫ్రెండ్ మామ ఫ్లాట్ కి తీసుకెళ్తాడు. కానీ అన్వేష్ బయటకు వెళ్లొచ్చేసరికి మైథిలి ఫ్లాట్ లో కనపడదు. దీంతో అన్వేష్ కంగారుపడతాడు. అసలు మైథిలి ఎందుకు హైదరాబాద్ వచ్చింది? మైథిలి ఏమైంది? మైథిలి కనపడకపోవడంతో అన్వేష్, అతని ఫ్రెండ్స్ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? అసలు మైథిలి - అన్వేష్ ప్రేమించుకున్నారా.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.. Also See : Sumanth Prabhas : ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్ సుమంత్ ప్రభాస్.. ఫొటోలు వైరల్.. సినిమా విశ్లేషణ.. సందీప్ రెడ్డి వంగ చిన్న సినిమా, అది కూడా లవ్ స్టోరీ నిర్మిస్తున్నాడు

ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమా "రోమాంచకం". సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందిస్తున్నారు. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలగలిపిన ఇంట్రెస్టింగ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఈ నెల 3న థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర విశేషాలను ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో తెలిపారు హీరో సుమంత్ ప్రభాస్. - మా మూవీ కోసం ప్రభాస్ గారిని కలవడం చాలా హ్యాపీగా అనిపించింది. నా గతం, నా జర్నీ అంతా ఒక్కసారిగా గుర్తుకువచ్చింది. ఆయనను కలిసే ముందు ఒక ఎక్స్ పెక్టేషన్ తో వెళ్లాం. ప్రభాస్ గారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మన ఫ్యాన్ బాయ్ అనే ప్రేమ ఆయనలో కనిపించింది. మా కుటుంబంలో ఎవరికీ సినిమా నేపథ్యం లేదు. సినిమాల గురించి తెలియదు. దాంతో వాళ్లు నన్ను పెద్దగా సపోర్ట్ చేయలేదు. అందరితో బాగుండు, పాజిటివ్ గా ఆలోచించు అని మాత్రం చెప్పారు. - తెలంగాణ నేపథ్యంతో మేమ్ ఫేమస్ అనే సినిమా చేశాను. ఇక్కడి ఆడియెన్స్ బాగా చూశారు. ఆంధ్ర నేపథ్యంతో గోదారిగట్టుపైన సినిమా చేశాను. ఆ సినిమాను ఏపీ వాళ్లు ఆదరించారు. ఈ రెండు చిత్రాలతో నటుడిగా వెర్సటాలిటీ చూపించే అవకాశం దక్కింది. రోమాంచకం సినిమా హైదరాబాద్ నేపథ్యంగా సాగుతుంది. - ఇంజినీరింగ్ కంప్లీట్ చేసి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాలని ప్రయత్నించే యువకుడిగా ఈ చిత్రంలో కనిపిస్తాను. ఆ క్యారెక్టర్ క్యూట్ గా, ఇన్నోసెంట్ గా ఉంటుంది. రియల్ లైఫ్ లో నేను ఎస్ఐ కావాలని మా నాన్నకు ఉండేది. డిగ్రీ చదువుతున్నప్పుడే మేమ్ ఫేమస్ మూవీలో అవకాశం వచ్చింది. - రోమాంచకం సినిమా ఆరేళ్ల నుంచి

అల్లరి నరేష్ కామెడీ సినిమాలకు కేరాఫ్. ఒకప్పుడు వరుసగా కామెడీ సినిమాలు చేసి మెప్పించారు. ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేశారు. కానీ ఇప్పుడు సెలక్టీవ్‌గా వెళ్తున్నాడు. ఏడాదికి ఒక్క మూవీ కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అదే సమయంలో ఆయన యాక్షన్, థ్రిల్లర్ చిత్రాలు చేస్తూ వచ్చాడు. యాక్షన్ థ్రిల్లర్స్ ప్రారంభంలో విజయం సాధించాయి. కానీ ఆ తర్వాత అవి కూడా వర్కౌట్ కావడం లేదు. ఈ క్రమంలో ఇప్పుడు జోనర్ మార్చాడు. మళ్లీ తన కామెడీ జోన్లోకి వచ్చాడు. అందులో భాగంగా `రంభ ఊర్వశి మేనక` చిత్రంలో నటించాడు. కామెడీ ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సురభి, రాశీ సింగ్, విష్ణు ప్రియా భీమనేని, ప్రిషా సింగ్ హీరోయిన్లుగా నటించారు. వెన్నెల కిశోర్, నరేష్ వీకే ఇతర పాత్రలు పోషిస్తున్నారు. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహించారు. హాస్య మూవీస్, అన్నపూర్ణ స్టూడియోస్ పతాకాలపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించారు. ఈ మూవీ ఈ నెల 4న విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లు ఆకట్టుకున్నాయి. కామెడీ ప్రధానంగా సాగాయి. దీంతో మూవీపై అంచనాలు పెరిగాయి. అయితే తాజాగా ఇది సెన్సార్ పూర్తి చేసుకుంది. అలాగే ఫస్ట్ రివ్యూ రిపోర్ట్ బయటకు వచ్చింది. దీని బట్టి చూస్తే మూవీ ఎలా ఉందంటే? సినిమా బేసిక్ లైన్ ఏంటనేది చూస్తే, వీకే నరేష్, అల్లరి నరేష్ తండ్రీకొడుకులు. వీరికి వంశ పారంపర్యంగా ఒక మ్యాజిక్ బుక్ ఉంటుంది. దానిపై సరైన విధంగా ముగ్గు వేస్తే రంభ, ఊర్వశి మేనకలు వస్తారు, కోరిన కోరికలు తీరుస్తారు అని నరేష్‌కి వీకే నరేష్ చెబుతారు. నరేష్‌కి హీరో కావాలనే కోరిక ఉంటుంది. అందుకోసం 25ఏళ్లుగా ముగ్గులు వేస్తూనే ఉంటాడు. కానీ రంభ(రాశి సింగ్), ఊర్వశి(విష్ణుప్రియ), మేనక(ప్రిషా సింగ్) రారు. ఎట్టకేలకు నరేష్ ప్రయత్నం ఫలిస్తుంది. ముగ్గురు దేవకన్యలు వస్తారు. మరి హీరో అవ్వాలనే

సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'రోమాంచకం'. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్ ఈ సినిమాలో జంటగా నటించారు. రేపు(సెప్టెంబర్ 3) థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ మూవీ, ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమా పూర్తిగా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో, ఇక్కడి యాసతో సాగే ఒక ఫ్రెష్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్. కథలో హీరో అన్వేష్ (సుమంత్ ప్రభాస్) తన ఫ్రెండ్స్‌తో సరదాగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఒక డేటింగ్ యాప్ స్టార్టప్‌ను ప్రారంభిస్తాడు. అయితే ఈ డేటింగ్ యాప్ బిజినెస్ ద్వారా చెన్నైకి చెందిన అమ్మాయి (అనంతిక)తో అతను ఎలా కనెక్ట్ అయ్యాడు? ఆన్లైన్ అండ్ ఆఫ్‌లైన్ రొమాన్స్‌లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? చివరకు తల్లిదండ్రులు మెచ్చేలా ఎలా నిలిచాడు అనేది ఈ సినిమా ప్రధాన కథాంశం. సెన్సార్ బోర్డు ఈ సినిమాకి UA16+ సర్టిఫికెట్ ఇచ్చింది. అంటే 16 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఈ సినిమాను హ్యాపీగా చూడొచ్చు.ఇక ఈ సినిమా రన్ టైమ్ విషయానికి వస్తే.. ప్రేక్షకులను ఎక్కడా బోర్ కొట్టించకుండా కథను ఎంతో గ్రిప్పింగ్‌గా 2 గంటల 22 నిమిషాలు (142 నిమిషాలు) రన్టైమ్తో ఫిక్స్ చేశారు. సుమంత్ ప్రభాస్ - అనంతిక మధ్య కెమిస్ట్రీ, వాసుకి వైభవ్ మ్యూజిక్, అద్భుతమైన కామెడీ టైమింగ్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్ కాబోతున్నాయి. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ వంటి అంశాలతో ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించారట. జెన్-జీ ఆడియెన్స్‌ను మాత్రమే కాకుండా ఫ్యామిలీస్‌ను కూడా మెప్పించేలా ఉన్న ఈ 'రోమాంచకం' థియేటర్లలో ఎలాంటి మ్యాజిక్ చేయబోతుందో చూడాలి. 'వండర్ వుమెన్' గాల్ గాడోట్ సరికొత్త క్రైమ్ థ్రిల్లర్.. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి!

తెలుగు సినిమా చరిత్రలో 90s టైమ్ అద్భుతమనే చెప్పాలి. అప్పుడే అదిరిపోయే సినిమాలెన్నో వచ్చాయి. ఎంటర్టైన్మెంగ్ తో పాటు సెంటిమెంట్, ఎమోషనల్, యాక్షన్ మూవీస్ సందడి చేశాయి. అలాంటి సినిమాల లిస్ట్ లో ‘హలో బ్రదర్’ కచ్చితంగా ముందువరుసలో ఉంటుంది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో, అక్కినేని నాగార్జున ద్విపాత్రాభినయంలో రూపొందిన ఈ చిత్రం 1994 ఏప్రిల్ 20న విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించింది. నాగార్జున మాస్, క్లాస్ లుక్స్‌తో పాటు రమ్యకృష్ణ, సౌందర్యల గ్లామర్, రాజ్-కోటి సంగీతం ఈ చిత్రాన్ని ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టాయి. మిసెస్ అండ్ మిస్టర్ చక్రవర్తి (శరత్ బాబు, సంగీత) దంపతులకు కవల పిల్లలు జన్మిస్తారు. జన్మతః వీరిద్దరికీ ఒక విచిత్రమైన కనెక్షన్ (రిఫ్లెక్స్ యాక్షన్) ఉంటుంది. ఒకరికి నొప్పి కలిగితే మరొకరికి స్పందన రావడం, ఒకరు కదిలితే మరొకరు కూడా అదే పనిచేయడం వీరి ప్రత్యేకత. అయితే, విశ్వనాథ్ ఉద్యోగరీత్యా ఒక ప్రమాదకరమైన క్రిమినల్ మిట్రా (నెపోలియన్)ని అరెస్ట్ చేసే క్రమంలో, మిట్రా ఈ కవలలలో ఒకరిని ఎత్తుకెళ్లి ఆసుపత్రి నుంచి తప్పించుకుంటాడు. ఈ క్రమంలో ఒక బాబు (దేవా) కూలిపనులు చేసుకునేవారికి దొరుకుతాడు. వారికి అప్పటికే ఓ ఆడపిల్ల కూడా ఉంటుంది. రోడ్డుపై రఫ్ అండ్ టఫ్ వాతావరణంలో దేవా (నాగార్జున) పెరిగి పెద్దవాడవుతాడు. మరో బాబు (రవి వర్మ) తన తల్లిదండ్రుల వద్దే పెరిగి విదేశాలలో చదువుకుని పెద్ద మ్యూజిషియన్‌గా ఇండియాకు తిరిగివస్తాడు. దేవా స్థానిక రౌడీలతో గొడవపడుతూ మాస్ క్యారెక్టర్‌గా మారితే, రవి వర్మ అత్యంత సాఫ్ట్ అండ్ క్లాస్ కుర్రాడిగా ఉంటాడు. దేవాను చక్రవర్తి ఫ్రెండ్ (గిరిబాబు) కూతురు మంగ (రమ్యకృష్ణ) ప్రేమిస్తుంది. రవి వర్మను తన ఈవెంట్ మేనేజర్ అక్కమాంబ( అన్నపూర్ణమ్మ) కూతురు ఊహ (సౌందర్య) ప్రేమిస్తుంది. విధి వశాత్తూ ఈ ఇద్దరు అన్నదమ్ములు ఒకే నగరంలో కలుసుకున్నప్పుడు వారి రిఫ్లెక్స్ చర్యల వల్ల ఎలాంటి అలజడి సృష్టింపబడింది?

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన భారీ చిత్రం 'టాక్సిక్' ప్రపంచవ్యాప్తంగా విడుదలై ప్రదర్శించబడుతోంది. అయితే, యశ్ నటనపై ప్రశంసలు వ్యక్తమవుతున్నప్పటికీ... మేకింగ్, స్క్రీన్‌ప్లేపై మిశ్రమ స్పందన, విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో సీనియర్ నటి, మాజీ ఎంపీ సుమలత అంబరీశ్ సోషల్ మీడియా వేదికగా యశ్‌కు మద్దతు తెలుపుతూ ఒక సుదీర్ఘమైన సందేశాన్ని పంచుకున్నారు. "యశ్, నువ్వు ఏ విషయానికీ భయపడకుండా ధైర్యంగా నీ సొంత బాటలో ఇక్కడి దాకా వచ్చావు. ఈ సినిమాలో నీ నటన నిజంగా అద్భుతం. నీ కెరీర్లో ఇది ఒక గొప్ప మైలురాయిగా నిలిచిపోతుంది. 'టాక్సిక్' బహుశా ఇప్పుడు రావాల్సిన చిత్రం కాదేమో, కాలంకంటే ముందే వచ్చిన సినిమా కావచ్చు. నీ ఎదుగుదలను చూసి తట్టుకోలేని వారు, లేదా ఈ చిత్రాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేని వారే నెగెటివ్‌గా ట్రోల్ చేస్తున్నారు. విజయం ఎప్పుడూ పక్కవారికి అసూయను కలిగిస్తుంది. ఇలాంటి విమర్శలను అస్సలు పట్టించుకోకు, భవిష్యత్తులో 'కేజీఎఫ్' కంటే పెద్ద హిట్ సాధించి మళ్లీ ఘనవిజయం సాధిస్తావని నాకు పూర్తి నమ్మకం ఉంది" అని రాసుకొచ్చారు. మరోవైపు కాంతార ఫేమ్, నటుడు-దర్శకుడు రిషబ్ శెట్టి కూడా యశ్‌కు అండగా నిలిచారు. 'టాక్సిక్' సినిమా ఒక సాహసోపేతమైన ప్రయోగమని... కన్నడ సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లాలనే యశ్ తపనను తాము ఎంతగానో గౌరవిస్తున్నామని స్పష్టం చేశారు. చిత్రపరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు యశ్ ప్రయత్నాన్ని సమర్థిస్తూ ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు

రుత్విక్ - విశాఖ ధీమాన్ జంటగా నటించిన సినిమానే 'రాజా ది రాజా'. ఈ ఇద్దరికీ ఇదే మొదటి సినిమా కావడం విశేషం. అనిల్ బోయిడపు దర్శకత్వం వహించిన ఈ సినిమా, జులై 17వ తేదీన థియేటర్లకు వచ్చింది. థియేటర్స్ వైపు నుంచి పెద్దగా మెప్పించలేకపోయిన ఈ సినిమా, ఆగస్టు 21వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.విశాఖపట్నంలో సత్యం (నరేశ్) ఒక డాక్టర్ గా చిన్న క్లినిక్ నడుపుతుంటాడు. భార్య .. కొడుకు 'రాజా' ( రుత్విక్) ఇదే అతని ఫ్యామిలీ. తన కొడుకు రాజా పెద్ద డాక్టర్ గా పేరు తెచ్చుకోవాలనేది ఆయన ఆశ. అయితే రుత్విక్ కి ఫ్యాషన్ డిజైనర్ కావాలనే కోరిక బలంగా ఉంటుంది. ఆ విషయాన్ని తండ్రికి చెబితే ఒప్పుకోడని భావించిన ఆయన, మెడికల్ కాలేజ్ కి వెళ్లి వస్తున్నట్టుగా నటిస్తుంటాడు. ఫ్యాషన్ డిజైనర్ గా జాబ్ సంపాదించి ఆ దిశగా ముందుకు వెళుతుంటాడు. తాను డిజైన్ చేసిన డ్రెస్ లతో ఫ్యాషన్ షోలో పాల్గొనే ఒక అందమైన అమ్మాయి కోసం ఆయన అన్వేషిస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ఆయనకి 'ఆద్య' అనే ఒక యువతి తారసపడుతుంది. తన సహాయకురాలైన కుమారితో కలిసి, కొత్తగా ఆమె వైజాగ్ వచ్చిందనే విషయం రాజాకి అర్థమవుతుంది. తాము వచ్చింది 'మహీగఢ్' అనే ప్రాంతం నుంచి అంటూ ఆమె ఒక యువరాణిలా మాట్లాడినప్పటికీ, రాజా పెద్దగా పట్టించుకోడు. 'ఆద్య'ను ఫ్యాషన్ షోకి ఒప్పించాలనే విషయంపైనే అతని దృష్టి ఉంటుంది. ఈ విషయంపై ఆద్యా చుట్టూ తిరుగుతూనే ఆమెపై రాజా మనసు పారేసుకుంటాడు. ఆమె కూడా అతని వ్యక్తిత్వం పట్ల ఆకర్షితురాలవుతుంది. ఇలాంటి పరిస్థితులలోనే రాజా తనని మోసం చేశాడనే విషయం సత్యానికి తెలుస్తుంది. అతనికి డాక్టర్ కావాలనే ఆలోచన లేదనీ, ఫ్యాషన్ డిజైనర్ గా

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలో సంచలనాలకు మారుపేరుగా నిలిచిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఎక్కువగా చిరంజీవి సినిమాలే కనిపిస్తుంటాయి. మాస్ డైలాగ్స్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్కు సరికొత్త నిర్వచనం చెప్పిన ఆల్‌టైమ్ క్లాసిక్ సినిమాల్లో ‘గ్యాంగ్ లీడర్’ ముందు వరుసలో ఉంటుంది. ఈసినిమా రిలీజ్ అయ్యి 35 ఏళ్లు పూర్తి అయ్యింది. 1991 మే 9న విడుదలైన గ్యాంగ్ లీడర్.. మెగాస్టార్ చిరంజీవిని తిరుగులేని "నంబర్ వన్" సింహాసనంపై కూర్చోబెట్టింది. దర్శకుడు విజయ బాపినీడు సృజనాత్మకత, పరుచూరి సోదరుల మాస్ డైలాగ్స్, బప్పీలహరి సంగీతం కలగలిసి ఈ చిత్రాన్ని ఇండస్ట్రీ హిట్‌గా నిలబెట్టాయి. చిరంజీవి, విజయశాంతి, రావు గోపాల్ రావు, ఆనందరాజ్, శరత్ కుమార్, మురళీ మోహన్, నిర్మలమ్మ లాంటి స్టార్ తారాగణం నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలవడానికి గల కారణాలేంటో చూద్దాం. రఘుపతి (మురళీ మోహన్), రాఘవ (శరత్ కుమార్), రాజారామ్ (చిరంజీవి) ముగ్గురు అన్నదమ్ములు. రఘుపతి బాధ్యతాయుతమైన అన్నగా కుటుంబాన్ని పోషిస్తుంటే, రాఘవ ఐఏఎస్ (IAS) కు సిద్ధమవుతుంటాడు. రాజారామ్ బాధ్యతారాహిత్యంగా నలుగురు స్నేహితుల గ్యాంగ్‌తో జాలీగా తిరుగుతుంటాడు. తమ్ముడి ఐఏఎస్ ప్రిపరేషన్ కోసం డబ్బు కావాల్సి వస్తే, రాజారామ్ జైలుకు వెళ్లడానికి కూడా వెనుకాడడు. అయితే, నగరంలో అరాచకాలు సాగించే ఏకాంబరం (రావు గోపాల్ రావు), కనకాంబరం (ఆనందరాజ్) చేతిలో రఘుపతి దారుణంగా హత్యకు గురవుతాడు. ప్రమాదవశాత్తు జరిగిందనుకున్న అన్న మరణం వెనుక ఉన్న కుట్రను రాజారామ్ ఎలా బయటపెట్టాడు? తన కుటుంబానికి దూరమైన పరిస్థితి నుండి, తన గ్యాంగ్, ప్రియురాలు కన్యాకుమారి (విజయశాంతి) సహాయంతో విలన్ల అంతం ఎలా చూశాడు? తమతోనే ఎంతో సరదాగా ఉంటూ.. హీరోకి లైన్ వేసే కన్యాకుమారి బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న విషాదం ఏంటి? అది ఎప్పుడు రివీల్ అవుతుంది? అనేదే మిగతా కథ. రాజారామ్ పాత్రలో చిరంజీవి నటన, ఆటిట్యూడ్, డ్యాన్సులు, ఫైట్లు ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా

నటీనటులు : హరి మున్నగి, శశిధర్, మనోజ్, విశ్వేందర్ రెడ్డి కొమ్మిడి, వేద జలంధర్, రావణ్ నిట్టూరు తదితరులు దర్శకత్వం : రమణ రెడ్డి సోమ సంగీతం : స్మరన్ సాయి నిర్మాణం : మాధవి రెడ్డి సోమ ఛాయాగ్రహణం : సలిగంటి విజయ్ కుమార్ కూర్పు: రోహిత్ పెనుమత్స ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో ఓ చిన్న యూత్ ఫుల్ డ్రామా చిత్రం ‘అమీర్ లోగ్’ కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉంది అనేది సమీక్షలో చూద్దాం రండి. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ముగ్గురు మాస్ కుర్రాళ్ళు శ్రీను (హరి మున్నగి), మల్లేష్ (శశిధర్) అలాగే రఫీఖ్ (మనోజ్) మంచి స్నేహితులు. అయితే ఎలాంటి భాద్యతలు లేకుండా తిరిగే వాళ్ళకి చాచా (విశ్వేందర్ రెడ్డి కొమ్మిడి) అంటే ఎంతో ఇష్టం, గౌరవం. ఓరోజు తమ చాచా చేసిన పక్కా హైదరాబాదీ బిర్యానీ తిని వాళ్లంతా ఫ్లాట్ అవుతారు. అయితే కొన్ని పరిణామాల తర్వాత తమ అక్క గీత (వేద జలంధర్) పని చేసే సాఫ్ట్వేర్ ఆఫీస్ కి చెందిన అడ్మిన్ రవి (రావణ్ నిట్టూరు) నుంచి ఆ బిర్యానీ విషయంలో ఓ బిజినెస్ ఆఫర్ వస్తుంది. ఇక అక్కడ నుంచి కొత్త టర్న్ తీసుకున్న ఈ ముగ్గురు స్నేహితుల లైఫ్ ఎలా మారింది. ఆ బిజినెస్ లో వీరు సక్సెస్ అయ్యారా లేదా? ఆ బిర్యానీ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేశారు? అది సజావుగా సాగిందా లేదా? ఈ ప్రయాణంలో వారు తెలుసుకుంది ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. టాలీవుడ్ లో ఇది వరకు ఫ్రెండ్షిప్ నేపథ్యంలో అది కూడా పక్కా హైదరాబాదీ నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో ఇది కూడా ఒకటని చెప్పొచ్చు. చాలా నాచురల్ గా అక్కడక్కడా మంచి మూమెంట్స్ తో ఈ సినిమాలో కథనం దాదాపు

మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇరుముడి’. ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుండే పాజిటివ్ బజ్ తెచుకున్న ఈ సినిమా మంచి అంచనాల మధ్య ఈ రోజు థియేటర్స్ లో అడుగుపెట్టింది. ఓవర్సీస్ నుండి వస్తున్న టాక్ ఎలా ఉందంటే.. ఫస్టాఫ్ చాలా నేచురల్‌గా, క్లీన్‌గా సాగుతుంది. భావోద్వేగాలు చక్కగా పండాయి. ఇంటర్వెల్ వైపు వెళ్తున్న కొద్దీ కథలో కాస్త టెంపో, ఇంటెన్సిటీతో పాటు థ్రిల్లర్ సన్నివేశాల్లో కొన్ని లాజిక్ లోపాలు అనిపించినప్పటికీ, సినిమా మాత్రం ప్రేక్షకుడిని ఆద్యంతం ఎంజాయ్ చేసేలా ఆకట్టుకుంటుంది. రవితేజ ఎక్కడ ఓవర్ ది బోర్డు వెళ్లకుండా త్రినాథ్ పాత్రలో సూపర్బ్ పర్ఫామెన్స్ చేసాడు. సెకండాఫ్ ఎమోషనల్ డ్రామాను మరియు ట్విస్ట్‌ను డీల్ చేయడంలో దర్శకుడు శివ నిర్వాణ సక్సెస్ అయ్యాడు. అయితే, ట్విస్ట్ వెల్లడైన తర్వాత వచ్చే ఎపిసోడ్ ఇంకాస్త మెరుగ్గా తీయచ్చు అనిపించినా కానీ దర్శకుడు సినిమాను చాలా ఎమోషనల్ క్లైమాక్స్‌తో కథకు తగ్గట్టుగా మలిచాడు. ఇక ‘మల్లెపూల పల్లకి’ పాటతో కూడిన యాక్షన్ ఎపిసోడ్, ప్రేక్షకుల కోలాహలంతో థియేటర్‌ను హోరెత్తించింది. ఇటీవలి కాలంలో ఒక స్టార్ హీరో తన కమర్షియల్ ఇమేజ్ను పక్కనపెట్టి కథకు మాత్రమే నమ్మి చేసిన సినిమా ఇది. ఎక్కడా కమర్షియల్ హంగులు లేకుండా కథకు తగ్గట్టుగా కథనం సాగుతుంది. థ్రిల్లర్ పోర్షన్స్, ఎమోషనల్ పాయింట్ చాలా బలంగా ఉంది. ముఖ్యంగా క్లైమాక్స్ ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తుంది. ఒక స్టార్ ఇమేజ్ను పక్కన పెట్టి కథను నమ్మి నటించిన మాస్ మహారాజా రవితేజకు, అంతే నిజాయితీతో సినిమాను తెరకెక్కించిన దర్శకుడు శివ నిర్వాణ మరియు మైత్రీ మూవీ మేకర్స్‌కు ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గ్యారెంటీ

‘ఇరుముడి’ సినిమా భక్తి భావన, భావోద్వేగాల అద్భుతమైన కలయికగా నిలిచిందని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రశంసించారు. ‘ఇరుముడి’ (Irumudi) సినిమా భక్తి భావన, భావోద్వేగాల అద్భుతమైన కలయికగా నిలిచిందని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ప్రశంసించారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని వీక్షించిన సందీప్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. మాస్ మహారాజా రవితేజ, బేబీ నక్షత్ర, దర్శకుడు శివ నిర్వాణ ప్రేక్షకులను మరిచిపోలేని భావోద్వేగ ప్రయాణంలోకి తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఈ తరం ప్రేక్షకులకు ‘ఇరుముడి’ ఒక ప్రత్యేకమైన చిత్రమని, సినిమా పూర్తయిన తర్వాత కూడా ఆ భావోద్వేగం మనసులో నిలిచిపోతుందని అన్నారు. ఈ చిత్రాన్ని తప్పకుండా చూడాలని ప్రేక్షకులను కోరిన సందీప్ రెడ్డి వంగా.. సినిమా సూపర్‌హిట్ కావడం పట్ల చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్ల వద్ద అభిమానుల సందడి కనిపిస్తోంది. ముఖ్యంగా సినిమాలో రవితేజ అయ్యప్ప మాలధారణలో కనిపించే సన్నివేశాలు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన భక్తి భావనను కలిగిస్తున్నాయి. అయ్యప్ప స్వామికి సంబంధించిన సన్నివేశాలు తెరపై కనిపించిన సమయంలో అభిమానులు స్క్రీన్లకు హారతులు ఇస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. మరికొందరు థియేటర్లోనే భజనలు చేస్తూ సందడి చేస్తున్నారు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.‘మల్లెపూల పల్లకి’ పాట మొదలైన సమయంలో థియేటర్లలో వాతావరణం మరింత ఉత్సాహంగా మారుతోంది. పాటకు అభిమానులు స్క్రీన్ ముందుకు వెళ్లి డ్యాన్స్‌లు చేస్తూ సందడి చేస్తున్నారు

నటీనటులు : రవితేజ, ప్రియా భవానీ శంకర్, స్వసికా విజయ్, సాయికుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్ తదితరులు. దర్శకత్వం : శివ నిర్వాణ సంగీతం : జీవీ ప్రకాశ్ కుమార్ నిర్మాతలు : నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఛాయాగ్రహణం : విష్ణు శర్మ కూర్పు : ప్రవీణ్ పూడి రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘ఇరుముడి’. దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను రూపొందించారు. కాగా మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్ళి చూద్దాం. త్రినాథ్ (రవితేజ) తన భార్య కావేరి (ప్రియా భవానీ శంకర్), కూతురు మణికంఠ (బేబీ నక్షత్ర)లతో ఎంతో సంతోషంగా లైఫ్ ను లీడ్ చేస్తుంటాడు. ఐతే, త్రినాథ్ మందు తాగకుండా ఉండలేడు. అయ్యప్ప మాల వేసుకున్న సమయంలో మాత్రమే తాగుడికి దూరంగా ఉంటాడు. మరోవైపు ఊరిలోని ప్రతి అమ్మాయిలో తన కూతుర్ని చూసుకుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో హైస్కూల్ లో చదివే ఓ అమ్మాయి హత్య జరుగుతుంది. అసలు ఆ అమ్మాయి ఎలా చనిపోయింది?, ఆమె ఫ్రెండ్ గాయత్రి పడిన ఇబ్బందులు మణికంఠ (బేబీ నక్షత్ర)కు ఎలా తెలిశాయి ?, అసలు మందుకు బానిసైన త్రినాథ్.. మళ్లీ తాగను అని తన కూతురికి ఎందుకు మాట ఇచ్చాడు ?, చివరకు స్కూల్ లో జరుగుతున్న సంఘటనలు ఏమిటి ?, ఆ అన్యాయాలను త్రినాథ్ ఎలా అడ్డుకున్నాడు ?, తన కూతురి కోసం ఒక తండ్రిగా త్రినాథ్ ఏం చేశాడు ? అనేది మిగిలిన కథ. రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించాడు. ఎమోషనల్ సీన్స్ లో తన అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. ‘యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్’ తో ఈ సినిమా సాగింది. ఇక వాటికి

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Irumudi Movie Review and Rating: మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమా నేడు థియేటర్లలో విడుదలైంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. మరి రవితేజ ఈ సినిమాతో ఎలా ఆకట్టుకున్నారు..? సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది..? ఈ పూర్తి రివ్యూలో చూద్దాం. త్రినాథ్ రామ కాసు (రవితేజ) అనే రైతు గ్రామంలో తన భార్య, కూతురితో కలిసి జీవిస్తుంటాడు. అతను అయ్యప్ప స్వామికి భక్తుడు. తాగుడుకు అలవాటు ఉన్నప్పటికీ కూతురంటే ఎంతో ప్రేమ. తన కూతురు రోజంతా ఏం జరిగిందో తనతో చెప్పాలని తండ్రిగా ప్రోత్సహిస్తాడు. గ్రామంలోని ప్రతి అమ్మాయిని కూడా తన కూతురిలాగే భావించే త్రినాథ్ వారికి అండగా నిలుస్తాడు. అయితే గ్రామంలో అమ్మాయిలకు ఎదురవుతున్న సమస్యలు, వేధింపులు, హత్యలు అతని కుటుంబాన్ని కూడా ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. ఈ సమస్యల వెనుక ఉన్నది ఎవరు? అమ్మాయిలను ఎవరు భయపెడుతున్నారు..? త్రినాథ్ వారిని ఎలా కాపాడాడు..? అనేదే సినిమా కథ. రవితేజ ఈ సినిమాలో చాలా సీరియస్‌గా, సహజంగా నటించారు. సాధారణంగా కనిపించే మాస్ హీరో ఇమేజ్ను పక్కన పెట్టి మంచి నటనను చూపించారు. తండ్రి పాత్రలో ఆయన నటన ఆకట్టుకుంటుంది. బేబీ నక్షత్ర సినిమాకు ప్రధాన బలం. కూతురు పాత్రలో ఆమె చాలా సహజంగా నటించింది. ప్రియా భవానీ శంకర్ కూడా భార్య పాత్రలో మెప్పించారు. ముఖ్యంగా ద్వితీయార్థంలోని కీలక సన్నివేశంలో ఆమె నటన బాగా

సినిమా పేరు: ఇరుముడి -నటీనటులు:రవితేజ, ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్ర, శ్వాసిక విజయ్, అజయ్ ఘోష్ తదితరులు -సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ -ఎడిటింగ్: ప్రవీణ్ పూడి -మ్యూజిక్: జివి ప్రకాష్ కుమార్ -నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి -బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్ -రచన,దర్శకత్వం: శివ నిర్వాణ -రిలీజ్ డేట్ : ఆగష్టు 21 ,2026 మాస్ మహారాజా రవితేజ ఈ రోజు ప్రియా భవాని శంకర్, బేబీ నక్షత్ర, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి 'ఇరుముడి' తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యాడు. అభిమానుల్లో, ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్రేషన్ ఉన్న ఇరుముడి ఎలా ఉందో చూద్దాం. త్రినాధ్( రవితేజ) ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలోని పచ్చని అటవీ ప్రాంతంలో ఉండే పొల్లూరు అనే విలేజ్ కి చెందిన వ్యక్తి. ట్రాలీ ఆటోలో తన పొలంలోనే పండించిన అరటిగెలలని తన ఊరు పక్కన ఉండే టౌన్ లో అమ్ముకుంటూ జీవనాన్ని కొనసాగిస్తుంటాడు. ఆల్కహాల్ తాగే అలవాటు ఉన్నా మంచి వ్యక్తి. అయ్యప్పస్వామి దీక్ష తీసుకునే టైంలో మాత్రం ఆల్కహాల్ జోలికి వెళ్ళడు. ఆడవాళ్ళ అందర్నీ తన కూతురుగా భావించడంతో పాటు చెడుని అంతం చేయడం త్రినాధ్ నైజం. భార్య పేరు కావేరి. కూతురుపేరు మణికంఠ. తొమ్మిదేళ్ల వయసు ఉన్న మణికంఠ ఐదవ క్లాస్ చదువుతుంటుంది. ఏవైనా చెడు సంఘటనలు, అసాంఘిక కార్యక్రమాలు చూసినా తండ్రికి చెప్పడం అలవాటు. ఆ విధంగా చెప్పడం చిన్నప్పట్నుంచి తండ్రి, కూతురు మధ్య ఉన్న ఒప్పందం కూడా. మరి ఆ ఒప్పందం తండ్రి కూతుళ్ళ జీవితంలో ఏమైనా మార్పులు తీసుకొచ్చిందా? వస్తే ఆ మార్పులు ఏంటి? పరిచయమైన కొత్త క్యారెక్టర్స్ ఎవరు? సమాజానికి ఏమైనా మంచి జరిగిందా అనేదే ఇరుముడి సీలేరు లాంటి ఏరియాలో కంప్లీట్ లైవ్ లొకేషన్స్ లో ప్రశాంతమైన వాతావరణంలో మూవీ ఫస్ట్ నుంచి చివరి వరకు బోర్ కొట్టకుండా సాగింది

Irumudi Movie Review: రవితేజ విశ్వరూపం.. బొమ్మ దద్దరిల్లింది! Irumudi Movie Review: వరస ప్లాపులతో కాస్త వెనుకబడ్డ మాస్ మహారాజ్ రవితేజ, ఈసారి తన రొటీన్ మాస్ ఆరాటాన్ని పక్కన పెట్టి, ఒక బలమైన ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆడియన్స్‌లో మంచి బజ్ క్రియేట్ చేసిన 'ఇరుముడి' సినిమా థియేటర్లలో ఎంతవరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం. కథ విషయానికొస్తే.. సీలేరు ప్రాంతంలోని ఒక చిన్న పల్లెటూర్లో అరటిపళ్ల వ్యాపారం చేసుకునే త్రినాథ్ అనే సగటు కుటుంబ పెద్దగా రవితేజ కనిపిస్తారు. ఆయనకు భార్య కావేరి, కూతురు మణికంఠ అంటే ఎనలేని ప్రాణం. తన వ్యాపారం చేసుకుంటూనే ప్రతి సంవత్సరం నియమంగా అయ్యప్ప మాల వేసుకుంటాడు త్రినాథ్. అంతా ప్రశాంతంగా సాగిపోతున్న వీరి జీవితంలోకి అనుకోకుండా ఒక పెద్ద సమస్య వచ్చిపడుతుంది. ఊరిలో అనుమానాస్పదంగా కొందరు అమ్మాయిలు వరసగా చనిపోతుంటారు. ప్రతీ అమ్మాయిలో తన కూతురినే చూసుకునే హీరో, ఈ మరణాల వెనుక ఉన్న అసలు మిస్టరీని ఛేదించాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఎదురైన నిజాలు ఏంటి? ఈ మిస్టరీని హీరో ఎలా ఛేదించాడు అనేది మిగతా కథ. మంచి స్క్రిప్ట్ ఉంటే రవితేజ ఏ రేంజ్ లో రేచ్చిపోతాడో ఈ సినిమాతో మరోసారి చూపించాడు.రవితేజ ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ నటనతో సినిమాను తన భుజాలపై మోశారు. చిన్న పాప నటన ఆకట్టుకుంటుంది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేర బాగానే చేశారు. దర్శకుడు శివ నిర్వాణ రాసుకున్న కథ ఆకట్టుకునే విధంగా ఉంది. ఓ ఊరులో జరిగే సాధారణ కథను తెర మీద అద్భుతంగా చూపించారు. ఇక జీవీ ప్రకాష్ తన నేపథ్య సంగీతంతో ఈ సినిమాకు ప్రాణం పోశారనే చెప్పాలి. దర్శకుడు అనుకున్న పాయింట్‌ను చాలా బలంగా చెప్పగలిగారు. ముఖ్యంగా ద్వితీయార్థాన్ని నడిపించిన తీరు బాగుంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ కథ మూడ్‌కి తగ్గట్టుగా కుదిరాయి

మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద రికార్డు బుకింగ్స్‌తో దూసుకుపోతోంది. బుక్‌మైషోలో గంటకి ఏకంగా 27 వేలకు పైగా టికెట్లు అమ్ముడవుతూ ట్రెండింగ్‌లో నిలిచింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో రవితేజ నటన, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం, ఎమోషనల్ కథాంశం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్ టైమ్‌లో ఒక పవర్ ఫుల్ ఎమోషనల్ కంటెంట్ ఉన్న సినిమాకి ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడం చూడలేదు. అసలు గంటకి 27.64K+ టికెట్స్ బుక్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఇది కేవలం ఒక బుకింగ్ నంబర్ మాత్రమే కాదు, ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఉన్న నమ్మకం, క్రేజ్. మొదటి షో సమయానికే ఈ రేంజ్ రెస్పాన్స్ ఉంది, పైగా సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. దీనిని బట్టి చుస్తే, 'ఇరుముడి' సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించబోతోందని స్పష్టంగా అర్థమవుతోంది. అసలు ఈ సినిమాకి ఇంతటి భారీ హైప్ రావడానికి పలు కారణాలు ఉన్నాయి. మొదటిది, మన మాస్ మహారాజా రవితేజ యాక్టింగ్. ఎక్కువగా మాస్ సినిమాలతో అలరించే రవితేజ, ఈసారి రూట్ మార్చారు. 'నిన్ను కోరి', 'మజిలీ' లాంటి ఎమోషనల్ బ్లాక్‌బస్టర్స్ అందించిన డైరెక్టర్ శివ నిర్వాణ డైరెక్షన్ అనగానే అందరిలోనూ ఒక రకమైన ఆసక్తి మొదలైంది. వీళ్ళిద్దరి కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచే పాజిటివ్ వైబ్స్ మొదలయ్యాయి. రవితేజను ఒక విభిన్నమైన, మనసుకి హత్తుకునే రోల్లో చూపించడంలో శివ నిర్వాణ వంద శాతం సక్సెస్ అయ్యారని సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అంటున్నారు. రెండోది, సినిమాలోని ఎమోషనల్ కంటెంట్, పెరెంటింగ్ కాన్సెప్ట్. తండ్రీకూతుళ్ల అనుబంధం, భక్తి, సొసైటీకి అవసరమైన ఒక పవర్ ఫుల్ మెసేజ్‌ని చాలా ఎంగేజింగ్‌గా చూపెట్టారు. త్రినాథ్ గా రవితేజ నటన, చిన్నారి బేబీ నక్షత్ర యాక్టింగ్ ప్రేక్షకులను ఎంతగానో

మాస్ మహారాజా రవితేజ నుంచి ఒక సాలిడ్ సినిమా వచ్చి చాలా రోజులైంది. ఆ లోటుని తీరుస్తూ నేడు గ్రాండ్‌గా థియేటర్లలోకి అడుగుపెట్టిన 'ఇరుముడి' సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ సునామీ సృష్టిస్తోంది. చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్న ఒకే ఒక్క మాట.. "ఇది రవితేజకు పర్ఫెక్ట్ కమ్‌బ్యాక్". సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకు ప్రతీ సీన్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే 'మల్లెపూల పల్లకి' పాట థియేటర్లలో పూనకాలు తెప్పిస్తోంది. ఆ పాట స్క్రీన్ మీద ప్లే అవుతుంటే ప్రేక్షకులు సీట్లలో అసలు కూర్చోలేకపోతున్నారు. థియేటర్లన్నీ ఒక్కసారిగా ఊగిపోతున్నాయి. కొందరైతే ఉత్సాహాన్ని ఆపుకోలేక స్క్రీన్ ముందుకు వెళ్ళి స్టెప్పులేస్తున్నారు. చాలారోజుల తర్వాత థియేటర్లు జాతరను తలపిస్తున్నాయి. ఒక మాస్ హీరో పవర్ఫుల్ కథతో, హై-వోల్టేజ్ ఎమోషన్‌తో వస్తే థియేటర్ల పరిస్థితి ఎలా ఉంటుందో 'ఇరుముడి' మరోసారి నిరూపించింది. రవితేజ యాక్టింగ్, ముఖ్యంగా 'మల్లెపూల పల్లకి' పాట ఇచ్చే గూస్బంప్స్ స్టఫ్.. ఖచ్చితంగా థియేటర్లో ఆస్వాదించాల్సిందే. రవితేజ 'ఇరుముడి' బుకింగ్స్ సునామీ: ఇదయ్యా నీ అసలు రూపం.!

మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన మూవీ `ఇరుముడి`. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటించింది. సాయికుమార్, బేబీ నక్షత్ర, రమేష్ ఇందిరా, స్వసికా విజయ్, మీసాలా లక్ష్మణ్, అజయ్ ఘోష్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మించారు. ఈ చిత్రం నేడు శుక్రవారం(ఆగస్ట్ 21) న విడుదలైంది. వరుస పరాజయాల్లో ఉన్న రవితేజకి హిట్ పడిందా? సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం. పొల్లూరు విలేజ్‌లో త్రినాథ్(రవితేజ), తన భార్య కావేరి(ప్రియా భవానీ శంకర్), కూతురు మణియమ్మ(బేబీ నక్షత్ర)తో హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేస్తుంటాడు. ఆయనకు ఆటో ఉంటుంది. అరటితోటని నిర్వహిస్తున్నారు. త్రినాథ్ ప్రతిఏడాది అయ్యప్ప మాల వేస్తుంటాడు. ఆ సమయంలో నిబద్ధతతో ఉంటాడు. మందుకు దూరంగా ఉంటాడు. కానీ మాల అయిపోయిందంటే వరుసగా తాగుతూనే ఉంటాడు. తనకు కూతురు అంటే ప్రాణం. ఆ దేవుడే కూతురు రూపంలో వచ్చాడని భావిస్తాడు. గారాభంగా పెంచుతాడు. తను ఊర్లో ఏం జరిగినా చూసింది చూసినట్టు చెబుతుంది. ఆ ఊరికి బస్ లేకపోవడంతో ఎమ్మెల్యే(రమేష్ ఇందిరా).. గురుస్వామి(సాయికుమార్) రిక్వెస్ట్ మేరకు బస్ వేయిస్తాడు. దీంతో ఊర్లో అమ్మాయిలు వేరే ఊరికి వెళ్లి హైస్కూల్ చదువుకుంటారు. అయితే సడెన్‌గా ఒక అమ్మాయి చనిపోతుంది. ఆ తర్వాత బస్‌లో అమ్మాయిలను కొందరు కుర్రాళ్ల వేధించడంతో మణియమ్మ చెబుతుంది. వారిని చితకబాదుతాడు త్రినాథ్. గురుస్వామి కూతురు గాయత్రి పదో క్లాస్ చదువుతుంది. ఆమెకి మెరిట్ స్టూడెంట్ అని టీచర్ స్పెషల్ క్లాస్‌లు చెబుతుంది. అంతకు ముందే ఆ టీచర్ ఒక అమ్మాయిని చితకబాదినందుకు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె మళ్లీ రావడంతో స్టూడెంట్స్ భయపడుతుంటారు. గాయత్రి కూడా భయపడుతుంది. ఎక్స్ ట్రా క్లాస్ లు అని గాయత్రిని ఇంటికి పిలిపించుకుంటుంది. మరి ఇంటికి పిలిపించి ఆ టీచర్ ఏం

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Toxic Movie Censor Review: 'కేజీఎఫ్ 1', 'కేజీఎఫ్ 2' చిత్రాల ద్వారా పాన్ ఇండియా రేంజ్ లో విపరీతమైన క్రేజ్, గుర్తింపు తెచ్చుకున్న హీరో యశ్. దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత యశ్ హీరోగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సరికొత్త చిత్రం 'టాక్సిక్'. ఇటీవల విడుదలైన ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ తో మూవీపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 26వ తేదీన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. కన్నడ, మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి ఒకే రోజున ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాలను కూడా అత్యంత వేగవంతం చేసింది. ఈ ప్రతిష్టాత్మక 'టాక్సిక్' చిత్రానికి ప్రతిభావంతురాలైన మహిళా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించడం విశేషం. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో యశ్ సరసన కియారా అద్వానీ, నయనతార, హ్యుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ హీరోయిన్లుగా నటించారు. ఇక 'టాక్సిక్' మూవీ ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ సినిమా రన్ టైమ్ భారత్ లో మొదట 3 గంటల 15 నిమిషాలుగా ఉంది. అయితే ప్రేక్షకులు బోర్ ఫీల్ కాకుండా మరింత గ్రిప్పింగ్ గా ఉంచేందుకు దానిని 2 గంటల
.webp)
మాస్ మహారాజ్ రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ 'ఇరుముడి'. ఈరోజే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమాపై ట్విట్టర్లో పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. "రవితేజ ఈజ్ బ్యాక్" అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినిమా మొదలవ్వడమే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా తండ్రీకూతుళ్ల మధ్య ఉండే ఎమోషనల్ బాండ్ చుట్టూ నేచురల్‌గా నడుస్తుంది. సాధారణంగా రవితేజ సినిమాల్లో కామెడీ, మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి, కానీ ఇందులో రవితేజ ఒక సిన్సియర్, పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో దుమ్మురేపారు. తండ్రిగా ఆయన పండించిన ఎమోషన్స్ థియేటర్లో ఉన్న ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తున్నాయి. ఆయన కూతురిగా నటించిన బేబీ నక్షత్ర యాక్టింగ్ అయితే ఈ సినిమాకే మెయిన్ హైలైట్ అని నెటిజన్లు పొగిడేస్తున్నారు. ఇక ఫస్ట్ హాఫ్ స్లో అండ్ స్టెడీగా సాగినప్పటికీ.. సెకండాఫ్‌లోకి ఎంటర్ అవ్వగానే కథ మలుపు తిరుగుతుంది. సెకండాఫ్‌లో వచ్చే ఆ కీలకమైన ట్విస్ట్ థియేటర్లలో ఆడియన్స్‌కి గూస్బంప్స్ తెప్పిస్తోంది. ముఖ్యంగా 'మల్లెపూల పల్లకి' సీక్వెన్స్ థియేటర్లను షేక్ చేస్తోందట. మాస్ ఆడియన్స్ కేరింతలు కొట్టేలా ఆ ఫైట్ బ్లాక్‌ను డిజైన్ చేశారు. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్‌ను వేరే లెవెల్‌కి తీసుకెళ్లిందట. డైలాగ్ కింగ్ సాయికుమార్ పవర్ఫుల్ డైలాగ్స్, ప్రియా భవానీ శంకర్, స్వసికా విజయ్ పాత్రలు కథకు మరింత బలాన్నిచ్చాయి. సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న ఒక ముఖ్యమైన సమస్యను ఎంచుకుని, దానికి ఎమోషనల్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ జోడించి శివ నిర్వాణ ఈ చిత్రాన్ని మలిచిన తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ట్విట్టర్లో రివ్యూవర్స్ మాటల్లో చెప్పాలంటే.. "ఇరుముడి ఒక పవర్ఫుల్ అండ్ హార్డ్ హిట్టింగ్ ఎమోషనల్ థ్రిల్లర్". కొన్ని చోట్ల రైటింగ్ కాస్త స్లో అయినప్పటికీ, క్లైమాక్స్ ఎమోషన్స్ మాత్రం ఆ లోపాలను పూర్తిగా మరిపించేలా ఉన్నాయి. చాలా మంది ట్విట్టర్

సినిమా పేరు: అమీర్ లోగ్ -నటీనటులు: వేద జలంధర్, హరి మున్నంగి, మనోజ్ ఆవుల, శశిధర్ కొచ్చర్ల కోట, రావణ్ నిట్టూరు, -విశ్వేందర్ రెడ్డి, పవన్ రమేష్ తదితరులు -సినిమాటోగ్రఫీ: సాలిగంటి విజయ్ కుమార్ -ఎడిటింగ్: రోహిత్ పెనుమత్స -మ్యూజిక్: స్మరన్ సాయి -నిర్మాత: మాధవి రెడ్డి సోమ -బ్యానర్ : అవాళ్ నెంబర్ ప్రొడక్షన్స్ -రచన,దర్శకత్వం: రమణా రెడ్డి సోమ -రిలీజ్ డేట్ : ఆగష్టు 21 ,2026 హైదరాబాద్ పోరగాళ్ల కథ అంటు 'అమీర్ లోగ్' థియేటర్స్ లోకి వచ్చేసింది. రిలీజ్ డేట్ ఇరవై ఒకటి అయినా, ప్రమోషన్స్ తో వచ్చిన క్రేజ్ తో ప్రీమియర్ కూడా ప్రదర్శించారు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. శ్రీను( హరి మున్నంగి), రఫీక్(మనోజ్ ఆవుల), మల్లేష్( శశిధర్ కొచ్చర్ల కోట) చిన్నప్పట్నుంచి ప్రాణ స్నేహితులు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని ఒక బస్తీ వాళ్ళ అడ్డా. ముగ్గురు మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళు. పెద్దగా చదువుకున్న వాళ్ళు కూడా కావడంతో పాటు పని పాట లేకుండా తిరుగుతుంటారు. కానీ అమాయకత్వం, మంచితనం ఆ ముగ్గురి సొంతం. సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేసే గీత(వేద జలంధర్) ఆ ముగ్గురికి ఆత్మీయురాలు లాంటిది. తమ బస్తీలోనే ఉండే గీతని అక్క అని పిలుస్తుండటంతో పాటు తమ కష్ట సుఖాలని పంచుకుంటూ ఉంటారు. గీత తన ఆఫీస్ లోనే పని చేసే టీం లీడర్ రవి(రావణ్ నిట్టూరు) ని ప్రేమిస్తూ ఉంటుంది. రవి వల్ల శ్రీను, రఫీక్, మల్లేష్ కి అన్యాయం జరుగుతుంది. దీంతో రవికి గీత బ్రేక్ అప్ చెప్తుంది. జులాయిగా తిరిగే శ్రీను, రఫీక్, మల్లేష్ కి రవి అన్యాయం చేయడం ఏంటి? అసలు ఆ ముగ్గురి స్నేహితుల కథ మొత్తం ఏంటి? వాళ్ళ జీవితంలో ఎవరెవరు ఉన్నారన్నదే అమీర్ లోగ్. ఎనాలసిస్ కథలో గొప్పతనం లేకపోయినా ఎక్కడ ఎలాంటి హడావిడి లేకుండా మంచి
మాస్ మహారాజా రవితేజ , విలక్షణ దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కిన సరికొత్త చిత్రం 'ఇరుముడి'. భక్తి, ఫ్యామిలీ ఎమోషన్స్, క్రైమ్ అంశాల మేళవింపుతో వచ్చిన ఈ సినిమాపై తొలి నుంచే పరిశ్రమ వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రవితేజను సరికొత్త ఆధ్యాత్మిక, కుటుంబ నేపథ్యంలో చూసేందుకు అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. ప్రేక్షకుల భారీ అంచనాల నడుమ ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం, ఇప్పటికే విదేశీ ప్రీమియర్లను పూర్తి చేసుకుని పాజిటివ్ బజ్‌తో దూసుకుపోతోంది.ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే.. మద్యం వ్యసనానికి బానిసై తన జీవితాన్ని నాశనం చేసుకునే ఒక సాధారణ గ్రామీణ తండ్రి చుట్టూ తిరుగుతుంది. తన కన్నకూతురి ప్రేమ, కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవడం కోసం అతడు పవిత్రమైన 41 రోజుల అయ్యప్ప స్వామి దీక్షను చేపడతాడు. అయితే అదే సమయంలో ఆ గ్రామానికి, అమాయకపు ఆడపిల్లలకు ఎదురయ్యే ఊహించని ప్రమాదం నుంచి దీక్షా నియమాలను పాటిస్తూనే అతడు తన కుటుంబాన్ని, ఊరిని ఎలా కాపాడాడనే అంశాన్ని దర్శకుడు క్రైమ్ థ్రిల్లర్ ఎమోషనల్ డ్రామాగా మలిచారు.ఆకట్టుకునే తండ్రీ కూతుళ్ల బంధంయూఎస్ ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తమ స్పందనను పంచుకుంటున్నారు. ఫస్టాఫ్ ఎక్కడా హడావుడి లేకుండా ఎంతో నిజాయితీగా, మలయాళ చిత్రాల తరహా సహజత్వంతో సాగుతుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. తండ్రీకూతుళ్ల అనుబంధం, పాఠశాల నేపథ్యంలో మొదలయ్యే సన్నివేశాలు, కథలోని అంతర్లీన ఉత్కంఠ ఫస్టాఫ్‌ను ఆసక్తికరంగా నడిపించాయి. అక్కడక్కడా కథనం కాస్త నెమ్మదించినప్పటికీ, ఇంటర్వెల్ సమయానికి వచ్చే సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని పెంచేశాయని నెటిజన్లు పేర్కొంటున్నారు.సెకండాఫ్‌లో ఊహించని ట్విస్టులుఇక సెకండాఫ్‌లో కథలోని ఎమోషన్స్ పీక్స్‌కి చేరుకుంటాయని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఊహించని ట్విస్టులు, దాని చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. 'మల్లెపూల పల్లకి' భక్తి గీతం నేపథ్యంలో వచ్చే మాస్ యాక్షన్ ఎపిసోడ్ థియేటర్లలో ప్రేక్షకులతో ఈలలు వేయిస్తూ గూస్బంప్స్ తెప్పిస్తుందని ప్రశంసిస్తున్నారు. ట్విస్ట్

Ameer Log Review: ఎంసీ హరి, మనోజ్, శశిధర్, వేద జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి.. పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘అమీర్ లోగ్’. అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్పి బ్యానర్ పై మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఆగస్ట్ 21న ఈ సినిమా రిలీజ్ అవుతుండగా ముందురోజే ప్రీమియర్స్ కూడా వేశారు. శ్రీను(హరి), ఫరూక్(మనోజ్), మల్లేష్(శశిధర్) ముగ్గురు హైదరాబాద్ లోని ఓ బస్తీలో ఉండే క్లోజ్ ఫ్రెండ్స్. ఏ పనిపాట లేకుండా ఖాళీగా తింటూ, తాగుతూ, తిరుగుతూ ఉంటారు. వీళ్ళని బాగుపడమని ఇంట్లో వాళ్ళు తిడుతూనే ఉంటారు. ఓ రోజు వాళ్ళ బస్తీలోనే ఉన్న నజీర్(సాయి యోగి)తో క్రికెట్ విషయంలో గొడవయి కొట్టుకోవడంతో బస్తీలో పెద్ద గొడవ అవుతుంది. అదే బస్తీలో ఉండే గీత(వేద జలంధర్) ఈ ముగ్గుర్ని తన తమ్ముల్లుగా భావించి మంచి చెప్పి, ఇంట్లో వాళ్ళ కష్టాలు చెప్పి మారమని చెప్తుంది. దీంతో శ్రీను గీత ఆఫీస్ లోనే ఆఫీస్ బాయ్ గా చేరుతాడు. ఓ రోజు ఆఫీస్ వాళ్ళతో క్రికెట్ ఆడిన శ్రీను మా బస్తి వాళ్ళు ఇంకా బాగా ఆడతారు అని చెప్పి ఆఫీస్ టీమ్ తో బెట్ కడతాడు. మరి ఆ మ్యాచ్ లో బస్తీ వాళ్ళు ఓడిపోతారా? గెలుస్తారా? ఈ కథలోకి బిర్యానీ ఎలా ఎంటర్ అయింది? ఈ ముగ్గురు కుర్రాళ్ళు తమకు క్లోజ్ గా ఉండే పెద్దాయన చాచా(విశ్వేందర్)ని ఏం అడుగుతారు? గీత లవర్ రవి(రావణ్) ఈ ముగ్గురి జీవితంలోకి రావడంతో వీళ్ళ జీవితం ఎలా మారుతుంది? ఈ ముగ్గురూ లైఫ్ లో సెటిల్ అవుతారా.. తెలియాలంటే తెరపై చూడాల్సిందే. అమీర్ లోగ్ ఇది చిన్న సినిమా అయినా ప్రమోషన్స్ బాగానే చేసారు. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్, ఓల్డ్ సిటీ బ్యాక్ డ్రాప్ అంటూ ఎక్కువగా హైదరాబాద్ లో

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం 'ఇరుముడి'. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ పొందడమే కాకుండా, ఫిలిం వర్గాలు, సెన్సార్ టీమ్ నుంచి కూడా పాజిటీవ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఊర మాస్ అభిమానులున్న రవితేజ.. భక్తి చిత్రంతో ఎలా మెప్పించగలడన్న డౌట్ చాలామందిలో ఉంది. కానీ ఈసినిమాతో ఆయన ఒక్కొక్కరికి పూనకాలు తెప్పించబోతునట్టు తెలుస్తోంది. పలు నివేదికల ఆధారంగా రూపొందించిన 'ఇరుముడి' ఫస్ట్ రివ్యూ / సెన్సార్ టాక్ వివరాలు చూస్తే. ఈ సినిమాలో రవితేజ ఒక సాధారణ గ్రామీణ ప్రాంతానికి చెందిన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్‌గా కనిపిస్తారు. కథ బిగినింగ్ లో ఆయన పక్కా నెగెటీవ్ పాత్రలో కనిపిస్తారట. మందుకు బాగా అలవాటుపడిన పాత్రలో కనిపించే ఆయన, తన కూతురి కోరిక మేరకు అయ్యప్ప మాల ధరిస్తారు. మాల వేసుకున్న తర్వాత ఆయన జీవితంలో, ఆయన ప్రవర్తనలో వచ్చే మార్పుల ఏంటి? ఆ ఊరిలో మహిళల చుట్టూ అల్లుకున్న క్రైమ్ సస్పెన్స్ డ్రామా ఆధారంగా సినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తోంది. గత సినిమాలకు పూర్తి భిన్నంగా రవితేజ చాలా కొత్త లుక్ లో కనిపించబోతున్న ఈసినిమాలో ఆయన సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో అలరించినట్టు తెలుస్తోంది. స్వామి మాల ధరించిన తర్వాత ఆయన నటనలోని పరిణతి అభిమానులను, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. తండ్రి - కూతుళ్ల సెంటిమెంట్ ఈ సినిమాకు ప్రధాన బలం. రవితేజ , ఆయన కూతురిగా నటించిన చిన్నారి (బేబీ నక్షత్ర) మధ్య ఉండే ఎమోషనల్ సీన్స్ కంటతడి పెట్టిస్తాయి. ముఖ్యంగా ద్వితీయార్థంలో (Second Half) వచ్చే సెంటిమెంట్ సీన్లకు ఫిదా అవ్వాల్సిందే. అంతే కాదు ఈ సినిమా డ్యూరేషన్ 2 గంటల 25 నిమిషాలు మాత్రమే ఉండటం పెద్ద ప్లస్ పాయింట్ అవ్వబోతోంది. ఎక్కడా అనవసర సన్నివేశాలు లేకుండా స్క్రీన్ ప్లే స్పీడ్

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Irumudi Movie First Review: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డివోషనల్ థ్రిల్లర్ 'ఇరుముడి' సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఈ చిత్రంపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. అయ్యప్ప స్వామి దీక్ష నేపథ్యంలో సాగే ఈ కథలో దర్శకుడు శివ నిర్వాణ ఒక సరికొత్త అమ్మాయిల మిస్టరీ డెత్స్ కాన్సెప్ట్‌ను జోడించి ఉత్కంఠభరితమైన థ్రిల్లర్‌గా మలిచారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి 'U/A' సర్టిఫికేట్ లభించింది. రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నిడివితో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవి ఈ చిత్రాన్ని నిర్మించగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఇందులో రవితేజ సరసన ప్రియ భవాని శంకర్ నటిస్తుండగా సాయి కుమార్, అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రివ్యూ ప్రదర్శించగా, సినీ వర్గాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. రవితేజ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పవర్ఫుల్ యాక్టింగ్, ఆయనలోని అసలైన ఎనర్జీ ఈ చిత్రంలో పూర్తిగా కనిపిస్తాయని టాక్ వినిపిస్తోంది. తండ్రీకూతుళ్ల మధ్య భావోద్వేగాలు, రవితేజ పాత్రలో వచ్చే ట్రాన్స్ఫర్మేషన్ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయని సమాచారం. తొలిభాగంలో కుటుంబ కథాంశం, ఇంటర్వెల్ ట్విస్ట్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయని, ఇక రెండో భాగంలో అసలు కథ ప్రారంభమై చివరి 25 నిమిషాలు సినిమాను వేరే లెవెల్‌కు తీసుకెళ్తుందని తెలుస్తోంది. మొత్తానికి, విభిన్న
తనకంటే దాదాపు 5 ఏళ్లు చిన్నవాడైన హీరోతో లేడీ సూపర్ స్టార్ నయనతార రొమాన్స్ చేసిన సినిమా హాయ్. రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ కామెడీ, ఫ్యామిలీ డ్రామా, రొమాంటిక్ సినిమాలో.. సీనియర్ నటులు రాధిక శరత్ కుమార్, ప్రభు, దర్శకులు కే భాగ్యరాజ్, అమృత శ్రీనివాసన్, వీటీవీ గణేష్, ఫెఫ్సీ విజయన్, సత్యన్, రెంజీ పనికేల్ తదితరులు నటించారు. రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియో, జీ స్టూడియో బ్యానర్లపై విఘ్నేష్ శివన్, నయనతార, జీ స్టూడియోస్ నిర్మించారు. విష్ణు ఎడవన్ ఈమూవీని డైరెక్ట్ చేశారు. హాయ్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈక్రమంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈసినిమాకు UA 13+ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. ఎలాంటి అభ్యంతరకర సీన్లు లేకుండా మోడరన్ రొమాన్స్, ఫ్యామిలీ వాల్యూస్‌తో ఫీల్ గుడ్ మూవీని రూపొందించారని సెన్సార్ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. అంతే కాదు ఈసినిమా నిడివి 2 గంటల 24 నిమిషాలు (144 నిమిషాలు)కాగా.. స్క్రీన్ ప్లే లో ఎలాంటి సాగదీత లేకుండా గ్రిప్పింగ్‌గా ఉండేలా రన్ టైమ్‌ను సెట్ చేశారు. చెన్నైలోని ఒకే బిల్డింగ్‌లో నివసించే సాధారణ యువతి (నయనతార). అదే బిల్డింగ్ లో ఉండే యంగ్ సాఫ్ట్వేర్ ఉద్యోగి( కెవిన్). వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది స్నేహంగా మారుతుంది. అది కాస్తా వన్ సైడ్ లవ్ గా మారుతుంది. మంచి జాబ్ చేస్తోన్న కెవిన్.. నయనతార లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశిస్తాడు. ముందు అతను ప్రేమించడం మొదలుపెడతాడు. ఇక వారిద్దరి మధ్య చిగురించిన ప్రేమ కారణంగా కథలో ఎలాంటి మలుపులు వస్తాయి? కెవిన్ తన ప్రేమను ఆమెకు చెపుతాడా? నయనతారతో కెవిన్ పెళ్లి జరుగుతుందా? అసలు ఈ విషయం వల్ల ఎదురైన సమస్యలు ఏంటి? చివరకు ఏమౌతుంది అనేది హాయ్ సినిమా కథ. ఈ సినిమా ఎమోషన్ ను

ఇటీవల విడుదలైన తెలుగు డ్రామెడీ 'పల్లెబురుసు' చిత్రంపై ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ప్రశంసల జల్లు కురిపించారు. గ్రామీణ తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సాధారణ కుటుంబ కథాచిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. భారీ యాక్షన్ సినిమాల హంగామాలో కూడా, ఈ సినిమా తన సహజమైన కథనంతో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని చూసిన అనురాగ్ కశ్యప్, తన అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటూ చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ చిత్రం తండ్రీ కొడుకుల మధ్య జరిగే ఒక చిన్న సంఘర్షణ చుట్టూ తిరుగుతుంది. తన కొడుకు టూత్ బ్రష్ కొనలేదనే చిన్న ఫిర్యాదుతో ఒక వృద్ధ తండ్రి పోలీసు స్టేషన్‌కు వెళ్తాడు. ఇది ఒక పెద్ద చట్టపరమైన, భావోద్వేగ పోరాటంగా మారి, వారి మధ్య దాగి ఉన్న ఏళ్ల నాటి అపార్థాలను బయటపెడుతుంది. దీంతో కథ తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తూ ప్రేక్షకులను సినిమాకు కట్టిపడేసేలా సాగుతుంది. ఈ చిత్రంలో తండ్రిగా సుధాకర్ రెడ్డి, కొడుకుగా మురళీధర్ గౌడ్ తమ పాత్రల్లో జీవించేశారని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ఫలితంగా, కథలోని సహజత్వం మరియు నటీనటుల అద్భుతమైన నటన ఈ సినిమాకు ప్రధాన బలంగా మారాయి. ఈ నేపథ్యంలో, అనురాగ్ కశ్యప్ ఈ చిత్రాన్ని 'అరుదైన డ్రామెడీ' అని అభివర్ణించడం గమనార్హం. ఆయన లెటర్ బాక్స్‌లో ఈ సినిమాకు 5కి 7 రేటింగ్ ఇవ్వడం విశేషం. ప్రస్తుత కమర్షియల్ యాక్షన్ సినిమాల కంటే ఇది చాలా భిన్నమైనదని, చాలా ఫన్నీగా ఉందని అనురాగ్ కశ్యప్ పేర్కొన్నారు. దర్శకుడు ఉదయ్ చౌహాన్ ప్రతిభను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. వెంకటేష్ మహా మాదిరిగానే ఉదయ్ చౌహాన్ కూడా భవిష్యత్తులో మరిన్ని బలమైన చిత్రాలను తెరకెక్కిస్తారని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని ప్రశంసలు అందుకోవడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలు వస్తున్న తరుణంలో 'పల్లెబురుసు'

ఇప్పుడు సౌత్ సినీ పరిశ్రమలో, అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఒకటే చర్చ.. విశ్వనాధ్ అండ్ సన్స్ మూవీ చాలా బాగుంది, సూర్య, మమితా భైజు, రాధికా శరత్ కుమార్ ఒక రేంజ్ లో నటించారు అని. రోజు వారి ఫ్యామిలీ డిస్కర్షన్ లో ఒకటిగా కూడా మారిందంటే విశ్వనాధ్ అండ్ సన్స్ ప్రభావాన్ని అర్ధం చేసుకోవచ్చు. ఈ చిత్ర కథని దర్శకుడు వెంకీ అట్లూరి మొదట ధనుష్, దుల్కర్ సల్మాన్ కి వినిపించాడు. ఆ తర్వాత టీం సలహాతో సూర్యకి వినిపించడం జరిగింది. ఆ విధంగా సూర్య వద్దకి చేరి ఇప్పుడు అభిమానులని, సినీ ప్రియులని విశేషంగా ఆకర్షిస్తుంది. మాస్ మహారాజా రవితేజతో పాటు పలువురు స్టార్ తెలుగు హీరోల పేర్లు కూడా వినిపించాయి. కానీ అవన్నీ ఒట్టి రూమర్స్. దుల్కర్, ధనుష్ మాత్రం నిజం. ఇక బాక్సాఫీస్ వద్ద విశ్వనాధ్ అండ్ సన్స్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే అద్భుతమైన వసూళ్లతో జోరు చూపిస్తూ కేవలం రెండు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో చేరింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 121 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, తమిళ చిత్రసీమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నిలిచింది. లాంగ్ రన్ లో పలు చిత్రాల రికార్డ్స్ బద్దలవ్వడం ఖాయం. దిల్ రాజు రియల్ లైఫ్ సీన్: 'విశ్వనాథ్ & సన్స్'కి ఇన్స్పిరేషన్ ఏంటో చెప్పిన వెంకీ అట్లూరి.! లక్ష రూపాయలతో తీసిన చెత్త సినిమా, 20 కోట్లు కలెక్ట్ చేసింది.. ఎలాగంటే?

మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో వస్తున్న ఎమోషనల్ ఫ్యామిలీ థ్రిల్లర్ 'ఇరుముడి'. తండ్రి-కూతుళ్ల అనుబంధం, అయ్యప్ప మాల ధారణ, క్రైమ్ సస్పెన్స్ కథాంశంతో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఆగస్టు 21న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అయిన రవితేజ, ఫీల్ గుడ్ ఎమోషనల్ కథలను అద్భుతంగా తెరకెక్కించే డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో వస్తున్న 'ఇరుముడి'పై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఆకట్టుకొని సినిమాపై అంచనాలను పెంచేశాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ల స్పీడ్ పెంచేసింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకి గ్రాండ్‌గా సిద్ధమైంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి 'U/A' సర్టిఫికేట్ జారీ చేసింది. ఇక ఈ సినిమా రన్‌టైమ్‌ని చూస్తే, 2 గంటల 25 నిమిషాలుగా లాక్ చేశారు. కథా కథనాల పరంగా ఎక్కడా బోర్ కొట్టకుండా, సీన్ టు సీన్ పక్కా గ్రిప్పింగ్‌గా నడిచేలా శివ నిర్వాణ పర్ఫెక్ట్ రన్‌టైమ్‌ని డిజైన్ చేశారు. రవితేజ అనగానే మనకి మొదట గుర్తొచ్చేది మాస్ యాక్షన్. కానీ ఈ సినిమాలో రవితేజను ఒక కొత్త కోణంలో చూడబోతున్నాం. కథలో తండ్రి-కూతుళ్ల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ గుండెలను పిండేసేలా ఉంటుందట. మద్యం అలవాటు ఉన్న ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్, తన కూతురి కోరిక మేరకు అయ్యప్ప మాల వేసుకున్న తర్వాత అతని జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయనేది ఈ కథలోని ప్రధానాంశం. అంతేకాదు, ఈ ఫ్యామిలీ డ్రామాకి తోడు గ్రామీణ నేపథ్యం ఆధారంగా సాగే ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్ ప్రేక్షకులకు షాకింగ్ ట్విస్టులు ఇవ్వబోతోంది. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి పెద్ద

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఇటీవల విడుదలైన తమిళ థ్రిల్లర్ 'డిసి' సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రాన్ని ఒక 'తమిళ క్లాసిక్'గా అభివర్ణిస్తూ, ప్రతీ సినిమా ప్రేమికుడు తప్పక చూడాల్సిన కళాఖండం అని సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆయన తాజా రివ్యూ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది."‘డిసి’ చూశాను! ఇదొక తమిళ క్లాసిక్. ప్రతీ సినిమా ప్రేమికుడు తప్పక చూడాలి. దీన్ని అర్థం చేసుకున్న వారికి ఇది ఒక కవిత్వం లాంటిది" అంటూ అల్లు అర్జున్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతూ, దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్కు తన అత్యున్నత గౌరవాన్ని తెలియజేశారు. రాకీ, సాని కాయిధమ్, కెప్టెన్ మిల్లర్ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అరుణ్ పనితనాన్ని ఆయన ప్రత్యేకంగా కొనియాడారు.సినిమాకు తన సంగీతంతో ప్రాణం పోసిన అనిరుధ్ రవిచందర్‌ను 'అబ్సొల్యూట్ మాస్టర్ బూస్టర్' అని పొగిడిన బన్నీ, సాంకేతికంగా సినిమా అత్యున్నత స్థాయిలో ఉందని అన్నారు. ఇక ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించిన ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌ను 'ప్రాజెక్ట్‌కు అతిపెద్ద ఆధారం' అని అభివర్ణించారు. ఆ పాత్రలో లోకేశ్ జీవించారని ప్రశంసించారు. కథానాయిక వామికా గబ్బితో పాటు ఇతర నటీనటులందరూ అద్భుతంగా నటించారని తెలిపారు.ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ఫామ్లో ట్రెండ్ అవుతున్న ఈ సినిమాకు అల్లు అర్జున్ రివ్యూ మరింత బూస్ట్ ఇచ్చింది. ఇప్పటికే ఈ సినిమాను సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా మెచ్చుకున్న సంగతి

లోకేష్ కనకరాజ్ హీరోగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ఇటీవల విడుదలైన సినిమా డీసీ. ఆగస్టు 7న రిలీజైన డీసీ సరికొత్త రస్టిక్, ఒరిజినల్ అండ్ మైండ్ బ్లోయింగ్ కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. రొటీన్ కథాంశాలకు భిన్నంగా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ కథానాయకుడిగా సూపర్ పర్ఫామెన్స్ తో, దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ మేకింగ్ శైలికి అనిరుధ్ మ్యూజిక్ తోడై ఈ సినిమాను వేరే స్థాయికి తీసుకెళ్లాయి. తాజాగా ఈ సినిమాపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పందించారు. ఇటీవల విడుదలైన ‘డీసీ’ చిత్రంపై సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుప్రశంసల వర్షం కురిపించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పై మహేష్ స్పందిస్తూ.. "డీసీ... ఒరిజినల్ మరియు అవుట్‌స్టాండింగ్ సినిమా. సినిమా చాలా కూల్‌గా అనిపించింది, ప్రతీ సీన్నూ ఎంతగానో ఆస్వాదించాను. చిత్ర యూనిట్ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు" అని ఎక్స్ వేదికగా కొనియాడారు. మహేశ్ బాబు చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఒక స్టార్ హీరో నుంచి వచ్చిన ఈ ప్రశంస 'డీసీ' చిత్ర బృందానికి పెద్ద బూస్ట్‌లా మారింది. మహేశ్ బాబు ట్వీట్ కు రిప్లై ఇస్తూ మీ ట్వీట్ కు ధన్యవాదాలు సార్ అని చెప్తూ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ కామెంట్ చేసారు

తమిళ వర్సటైల్ నటుడు సూర్య వరుస ప్లాప్స్ ఎదుర్కొన్నాడు. 2013లో వచ్చిన ‘సింగమ్ 2’ చిత్రం భారీ వసూళ్లను సాధించింది. ఆ తర్వాత నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆ రేంజ్ మ్యాజిక్ చేయలేకపోయాయి. అయితే ఇటీవల ‘వీరభద్రుడు’ (‘కరుప్పు’) చిత్రంతో ఆ రికార్డులను సూర్య బ్రేక్ చేశారు. కరుప్పు ఏకంగా రూ. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సంచలన విజయం సాధించింది. ‘సింగమ్ 2’ బాక్సాఫీస్ నెంబర్లను దాటడానికి సూర్యకు ఏకంగా 13 ఏళ్ల సమయం పట్టడం విశేషం. ‘కరుప్పు’ విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నుండి అపూర్వ ఆదరణ పొందిన ఈ సినిమా సూర్య కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘కరుప్పు’ విజయం అందించిన జోష్‌లోనే తాజాగా విడుదలైన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుంచే అద్భుతమైన పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కుటుంబ కథాంశంతో పాటు సూర్య నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో ఈ చిత్రం కూడా బ్లాక్‌బస్టర్ దిశగా వేగంగా దూసుకుపోతోంది. ఇలా కేవలం మూడు నెలల్లోనే రెండు భారీ హిట్లు కొట్టి తన పవర్ ఏంటో మరోసారి నిరూపించారు సూర్య. జస్ట్ రెండు రోజుల్లోనే ఈ సినిమా వందకోట్లకు అటు ఇటుగా వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకెళ్తుంది. తమిల్ కంటే కూడా తెలుగులో ఈ సినిమా అదరగోతుంది. శనివారం ఫస్ట్ షో, సెకండ్ షోస్ కు హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపించాయి. ఒకప్పడు వరుస ప్లాప్స్ చూసిన సూర్య ఇప్పుడు జస్ట్ 3 నెలల్లో 2 బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టేసాడు

తెలుగు సినిమా చరిత్రను 'మల్లీశ్వరి ముందు.. మల్లీశ్వరి తర్వాత' అని విభజించడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 1951లో విడుదలైన ఈ అద్భుత కావ్యం.. కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, వెండితెరపై ఆవిష్కృతమైన ఒక స్వచ్ఛమైన కావ్య రసగుళిక. విజయా పిక్చర్స్ పతాకంపై నాగిరెడ్డి-చక్రపాణిల నిర్మాణ సారథ్యంలో, దర్శక రత్న బి.ఎన్. రెడ్డి మలచిన ఈ సినిమా ఎందరో దర్శకులకు, కళాకారులకు ఇప్పటికీ ఒక మార్గదర్శిగా నిలిచిపోతుంది. సీనియర్ ఎన్.టి.రామారావు, భానుమతిల అద్భుతమైన అభినయం, డి.వి. నరసరాజు కథనం, దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యం, సాలూరి రాజేశ్వరరావు సంగీతం కలగలిసి ఈ చిత్రాన్ని చిరస్మరణీయం చేశాయి. విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలంలో జరిగే ఒక అందమైన ప్రేమకథే 'మల్లీశ్వరి'. కాకాని గ్రామానికి చెందిన నాగరాజు (ఎన్.టి.ఆర్), మల్లీశ్వరి (భానుమతి) చిన్ననాటి నుండి ఒకరంటే ఒకరు ప్రాణంగా పెరుగుతారు. బావమరదళ్లైన వీరిద్దరి నడుమ చిగురించిన అనురాగం, పెరిగి పెద్దదయ్యాక గాఢమైన ప్రేమగా మారుతుంది. అయితే, మల్లీశ్వరి మేనత్త నాగమ్మ(ఋష్యేంద్రమణి) ఆమెకు రాజ్యసభలో 'రాజకన్య' హోదా లభిస్తే వచ్చే సంపదపై ఆశపడుతుంది. అనుకోని పరిస్థితుల్లో రాయలవారి ఆస్థానానికి చెందిన అధికారులు మల్లీశ్వరిని విజయనగర రాజప్రసాదానికి 'రాజకన్య'గా ఎంపిక చేసి తీసుకెళ్తారు. ఆనాటి నిబంధనల ప్రకారం రాజకన్యగా ఎంపికైన స్త్రీ ఎవరినీ ప్రేమించకూడదు, వివాహం చేసుకోకూడదు. ఒకవేళ ఆ నిబంధన మీరితే మరణశిక్ష విధించబడుతుంది. తన మల్లీశ్వరిని దూరమైన నాగరాజు ఆమెను వెతుక్కుంటూ విజయనగరం చేరుకుంటాడు. శిల్పిగా మారి రాజప్రసాదంలోకి అడుగుపెడతాడు. అక్కడ వారిద్దరూ కలుసుకున్నారా? వారి ప్రేమ ఫలించిందా? శ్రీకృష్ణదేవరాయలు వారి ప్రేమను గుర్తించి ఏం చేశారు? అనేదే మిగిలిన కథ. ఎన్టీఆర్ కెరీర్ ప్రారంభంలో వచ్చిన అతిముఖ్యమైన చిత్రాల్లో మల్లీశ్వరి ఒకటి. అమాయకత్వం, ప్రేమ, విరహం, ఆవేదనల సమ్మేళనంగా నాగరాజు పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు అద్భుతం. ముఖ్యంగా భానుమతితో పోటీపడి నటించారు. ఆమెకంటే వయసులో రెండేళ్లు చిన్నవాడైనా.. ప్రేమ సన్నీవేశాలు, ఆర్ స్క్రీన్ రొమాన్స్

నటీనటులు : సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్, గోమతి, ఆశిక్ రెడ్డి తదితరులు దర్శకత్వం : ఉదయ్ చౌహన్ సంగీతం : పవన్ సి హెచ్ నిర్మాణం : అన్నపూర్ణ స్టూడియోస్, ఆదిత్య పిట్టి, వివేక్ కృష్ణాని ఛాయాగ్రహణం : వినోద్ కే బండారి కూర్పు : సృజన అడుసుమిల్లి ఈ వారం థియేటర్స్ లో అలరించేందుకు వచ్చిన పలు చిత్రాల్లో ఓ చిన్న చిత్రం ‘పళ్ళ బురుసు’ కూడా ఒకటి. బలగం ఫేమ్ సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రలో మురళీ గౌడ్ తదితరులు నటించిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. తెలంగాణలోని చిన్న కుగ్రామంకి చెందిన శంబో (సుధాకర్ రెడ్డి) తనకి పంటి నొప్పి ఉండడంతో తనకి ఓ మంచి పళ్ళ బురుసు (పంటి బ్రష్) వాడమని డాక్టర్ ఇచ్చిన సలహా మేరకు కొడుకు తిరుపతి (మురళీధర్ గౌడ్) కి ఆ పళ్ళ బురుసు, మందులు కొనమని చెప్తాడు. కానీ ఈ పంచాయితీ మరో రీతిలోకి వెళ్లేలా పరిస్థితులు మారుతాయి. దీనితో తన కొడుకు తనకి పళ్ళ బురుసు కొనివ్వలేదు, ఇంకా మరికొన్ని కారణాలు చెప్పి కేసు వేస్తాడు శంబో. ఇంకోపక్క తన తండ్రి పేరిట ఉన్న ఎకరా పొలాన్ని అమ్మి తన అప్పులు తీర్చుకోవాలని తిరుపతి ప్లాన్ చేస్తాడు. ఈ క్రమంలో ఇద్దరు తండ్రీ కొడుకులు తగాదాలో ఎవరు గెలిచారు ఎవరు ఓడారు? అసలు శంబో కేసు వేసింది కేవలం చిన్నపాటి పంటి బ్రష్ కొనివ్వలేదు అనేనా? లేక మరో కారణం ఉందా అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఒక వయసు వచ్చాక ఇంట్లో తల్లిదండ్రులు తమ పిల్లల నుంచి ఏం ఆశిస్తారో అనే పాయింట్ ని దర్శకుడు డీసెంట్ ఎమోషన్స్ తో ఇందులో ప్రెజెంట్ చేయడం బాగుంది. దీనితో పాటుగా ప్రస్తుతం నడుస్తున్న ఆధునిక కాలంలో టెక్నాలజీ పెరిగి మనిషికీ

మంచి కథలతో వచ్చే రచయితలను, దర్శకులను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ సంస్థ ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే! మంచి కథ అనిపిస్తే.. బడ్జెట్ లో సినిమా తీసి విడుదల చేయడం వంటివి కొంతకాలంగా చేస్తూ వస్తోంది. తాజాగా ఈ సంస్థ నుంచి వచ్చిన చిత్రం ‘పళ్ళ బురుసు’. సినిమా రివ్యూ: ‘పళ్ల బురుసు’ (Palla Burusu Review) మంచి కథలతో వచ్చే రచయితలను, దర్శకులను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ సంస్థ ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే! మంచి కథ అనిపిస్తే.. బడ్జెట్ లో సినిమా తీసి విడుదల చేయడం వంటివి కొంతకాలంగా చేస్తూ వస్తోంది. తాజాగా ఈ సంస్థ నుంచి వచ్చిన చిత్రం ‘పళ్ళ బురుసు’. బలగం సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మ, గోమతి, సూజాత కీలక పాత్రధారులు. ఉదయ్ చౌహాన్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ కలసి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ పల్లె కథను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తున్నారో చూద్దాం. కథ: తెలంగాణలోని పల్లెలో శంభ (సుధాకర్‌రెడ్డి) అనే వృద్థుడు ఒంటరిగా జీవిస్తుంటాడు. కొడుకు, కూతురు వేరే వేరే ఊర్లలో సెటిల్ అయి ఆయన బాగోగులు అంతగా పట్టించుకోరు. తను పంటి నొప్పితో ఆసుపత్రికి వెళ్లగా డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి వేపపుల్ల స్థానంలో టూత్ బ్రష్ ఉపయోగించమని సూచిస్తారు. కొడుకు తిరుపతి (మురళీధర్ గౌడ్)ని టూత్ బ్రష్ (పళ్ల బురుసు), మందులు తెచ్చివ్వమని అడుగుతాడు. సొంత సమస్యల్లో బిజీగా ఉన్న తిరుపతి తండ్రి మాటను అంతగా పట్టించుకోడు. కొద్ది రోజులకే కూతురు పెళ్లి ఖాయం చేసుకుని కనీసం తండ్రిని పిలవడు. ఇది గమనించిన శంభ లోలోపల కుమిలి పోలీసులను ఆశ్రయిస్తాయి. అక్కడ కూడా పరిష్కారం దొరక్కపోవడంతో కోర్టు మెట్లు ఎక్కుతాడు. అసలు తండ్రీకొడుకుల మధ్య గ్యాప్ రావడానికి కారణమేంటి? తనకున్న ఎకరం పొలంలో తన సమాధిని తానే ఎందుకు సిద్థం చేసుకున్నాడు? చివరకు ఏం

Awarapan 2 Review || చిత్రం: ఆవారాపన్ 2; నటీనటులు: ఇమ్రాన్ హష్మి, దిశా పటానీ, షబానా అజ్మీ, సువీందర్ విక్కీ, విజయంత్ కోహ్లీ తదితరులు; నిర్మాత: విశేష్ భట్; రచన: బిలాల్ సిద్ధిఖీ; దర్శకత్వం: నితిన్ కక్కర్ 2007లో విడుదలైన క్లాసిక్ యాక్షన్ డ్రామా ‘ఆవారపన్’. (Awarapan) బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా, టెలివిజన్, ఇతర ఛానళ్ల ద్వారా సినిమా చూసి సామాజిక మాధ్యమాల వేదికగా ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. దాదాపు 19ఏళ్ల తర్వాత ఇమ్రాన్ హష్మి, దిశా పటానీ జంటగా ‘ఆవారాపన్2’ వచ్చింది. ఈ సినిమా కథేంటి? ఎలా ఉంది? Awarapan 2 story || అలియా హమిద్ (శ్రియ) మరణం శివమ్ పండిట్‌ను (ఇమ్రాన్ హష్మి) బాధపెడుతూనే ఉంటుంది. పుట్టినరోజు సందర్భంగా నివాళి అర్పించేందుకు ఆమె సమాధి దగ్గరకు వెళ్లగా, అక్కడ పసికందు కనిపిస్తుంది. ఆ పాపకు అలియా అని పేరు పెట్టి అనాథాశ్రమంలో చేరుస్తాడు. ఆ పాపకు కావాల్సిన అన్ని అవసరాలు దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు. పాపకు దాదాపు పదేళ్ల వయసు వచ్చిన తర్వాత ఓ జంట దత్తత తీసుకుంటుంది. అయితే, గుర్తు తెలియని వ్యక్తులు ఆ జంటను హత్య చేసి, పాపను ఎత్తుకెళ్లిపోతారు. అలియాతో పాటు, మరి కొంతమంది పిల్లలను కూడా కిడ్నాప్ చేసి బ్యాంకాక్ తరలిస్తారు. ఆ గ్యాంగ్‌ను అధికారికంగా పట్టుకోలేమని అందుకు సాయం చేయమని శివమ్‌ను కోరతాడు ఇంటర్‌పోల్ ఆఫీసర్ సమ్రత్ (అతుల్ కుమార్). మరి బ్యాంకాక్ వెళ్లిన శివమ్‌కు ఎదురైన పరిస్థితులు ఏంటి? ఆ ముఠా నుంచి అలియా సహా చిన్నారులను శివమ్ విడిపించడానికి ఎలాంటి ప్లాన్ వేశాడు? ఈ క్రమంలో పరిచయమైన జారా (దిశా పటానీ) ఎవరు?మానవ అక్రమ రవాణా చేస్తున్న సికిందర్ (అనిరుధ్ రావల్)కు జారాకు ఉన్న సంబంధం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే! Awarapan 2 review Telugu || ఒక మూవీకి సీక్వెల్ వస్తుందంటే, దానిపై

అంతా కొత్తవారితో తెరకెక్కిన చిత్రం ‘హుషారు పిట్టలు’. అన్ష్, వాసవి గణేషన్ జంటగా బిక్షు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వెంకట్ యాదవ్ నిర్మించారు. టీజర్, ట్రైలర్‌తో విపరీతంగా బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. సినిమా రివ్యూ: హుషారు పిట్టలు (Husharu Pittalu Review) అంతా కొత్తవారితో తెరకెక్కిన చిత్రం ‘హుషారు పిట్టలు’. అన్ష్, వాసవి గణేషన్ జంటగా బిక్షు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వెంకట్ యాదవ్ నిర్మించారు. టీజర్, ట్రైలర్‌తో విపరీతంగా బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. యువతను టార్గెట్ చేసి తీసిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో చూద్దాం. మాసినపల్లి రవి (అన్ష్) చదువులో ఫస్ట్. పదో తరగతిలో స్కూల్ ఫస్ట్ ర్యాంక్ సాధిస్తాడు. అదే ఊళ్లో ఉండే చిట్టి (వాసవి గణేషన్) రవిపై ఇష్టం పెంచుకుంటుంది. అయితే రవికి ప్రేమ, ఎట్రాక్షన్ ఇవేమీ తెలీదు. అతని ప్రపంచం అంతా చదువే! అతని చుట్టూ ఉండే బ్యాచ్‌లో ఉండే బాలన్న రవిని ప్రభావితం చేసి తప్పుదారిలోకి తీసుకెళ్లాడు. అతని మాటలకు, చేష్టలకు ఎట్రాక్ట్ అయిన రవి చిట్టితల్లి ప్రేమలో పడతాడు. యుక్త వయసులో వచ్చే మార్పులు, అవగాహన లేమీ ఇద్దరిని దారి తప్పి, హద్దులు దాటే దాకా తీసుకెళ్తుంది. వీరిద్దరి వ్యవహారం తెలిసిన చిట్టి అక్క శైలు (ప్రణీ రెడ్డి)కి హెచ్చరించినా వినే పరిస్థితిలో రవి, చిట్టి ఉండరు. హద్దు దాటిన విషయం ఇరు కుటుంబాల్లో తెలియడంతో వీరిద్దరి పరిస్థితులు తారుమారవుతాయి. దీంతో ఇరు కుటుంబాలు ఎలా స్పందించాయి. చిన్న వయసులో తెలిసీతెలియక చేసిన తప్పు ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? రవి, చిట్టి జీవితాలు ఏమయ్యాయి? అన్నది కథ. స్కూలింగ్ పూర్తయిన ఓ యువకుడు

టాలీవుడ్ హిస్టరీనే .. "జగదేకవీరుడు అతిలోకసుందరి (JAGADEKA VEERUDU ATILOKA SUNDARI - )" ముందు, ఆ తర్వాత అని విభజించవచ్చు. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్విని దత్ నిర్మించిన ఈ సోషియో ఫాంటసీ దృశ్యకావ్యం 1990 మే 9న విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి, "అతిలోకసుందరి" శ్రీదేవి జంటగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు చిత్రసీమలో ఒక సరికొత్త చరిత్రను తిరగరాసింది. ఈసినిమా ఆల్‌టైమ్ క్లాసిక్ రికార్డులు, షూటింగ్ అనుభవాలు పూర్తి రివ్యూ మీకోసం... రాజు (చిరంజీవి) ఒక అనాథ. నలుగురు అనాథ పిల్లలను చేరదీసి సొంత పిల్లల్లా పెంచుతుంటాడు. అనుకోకుండా ఒక ప్రమాదంలో ఒక చిన్నారి కాలు విరగడంతో, వైద్యం కోసం మానససరోవరంలో మాత్రమే లభించే ఒక ప్రత్యేక మూలిక కోసం రాజు హిమాలయాలకు వెళ్తాడు. మరోవైపు, దేవలోకంలో దేవేంద్రుని కుమార్తె ఇంద్రజ (శ్రీదేవి) భూలోక అందాలను చూడటానికి వస్తుంది. అక్కడ ఆమె తన వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన "అమృత ఉంగరాన్ని" పోగొట్టుకుంటుంది. ఆ ఉంగరం రాజుకు దొరుకుతుంది. ఆ ఉంగరం లేకపోతే ఇంద్రజ తిరిగి దేవలోకానికి వెళ్లలేదు. ఉంగరం కోసం రాజు వెంట పడే ఇంద్రజ, మానవుడైన రాజుతో ప్రేమలో పడటం... మరోవైపు ఆ ఉంగరాన్ని దక్కించుకుని ప్రపంచాన్ని ఏలాలని చూసే మాంత్రికుడు మహాతాంత్రిక్ (అమ్రీష్ పురి) కుట్రలను రాజు ఎలా తిప్పికొట్టాడు? ఇంద్రజ దేవలోకానికి వెళ్లిపోయిందా లేక భూలోకంలో రాజుతోనే ఉండిపోయిందా? అనేదే జగదేకవీరుడు అతిలోకసుందరి కథ. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఇది ఒక అద్భుతమైన సినిమాగా చెప్పవచ్చు. రాజు పాత్రలో మాస్, కామెడీ, యాక్షన్, ఎమోషన్స్‌ను సమపాళ్లలో పండించారు చిరు. పసిపిల్లలతో ఆయన చేసిన కామెడీ సీన్లు, మాస్ డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇవే కాదు యాక్షన్ సీన్స్, డ్యాన్స్ అయితే ఇరగదీసి వదిలిపెట్టాడు చిరు. ఇక ఇంద్రజ పాత్రకు శ్రీదేవి తప్ప మరొకరిని ఊహించలేము