
Modi gifts Thirukkural to Putin | రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు.. ‘తిరుక్కురళ్’ను బహుకరించినప్రధాని మోదీ
Modi gifts Thirukkural to Putin | రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు.. ‘తిరుక్కురళ్’ను బహుకరించిన ప్రధాని మోదీ
© 2026 nimisham.in

Modi gifts Thirukkural to Putin | రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు.. ‘తిరుక్కురళ్’ను బహుకరించిన ప్రధాని మోదీ

శ్రీకాకుళం(Srikakulam News) జిల్లాలో గుంజిలోవ గ్రామంలో కవిటి రామారావు (75) అనే వృద్ధుడు బుధవారం మధ్యాహ్నం ఏడేళ్ల అమాయక బాలికపై లైంగిక దాడికి ఒడిగట్టాడు.

PM Modi | ఢిల్లీ చేరుకున్న పుతిన్.. నేడు ప్రధాని మోదీతో భేటీ.. ద్వైపాక్షిక చర్చలు

PM Modi: 2035లో భారత్ కల నెరవేరుతుంది.. 2040లో మాత్రం చంద్రుడిపై జరిగేది ఇదే!

PM Modi | ఏడు రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం.. తెలంగాణకు ఒకటి.. ఏపీకి మరొకటి

PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ

PM Narendra Modi | ప్రధాని సభా ప్రాంగణంలో భద్రతా వైఫల్యం.. నకిలీ అధికారి అరెస్ట్, తుపాకీ స్వాధీనం..!

Modi-Putin: ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్న పుతిన్, మోదీ

PM Modi: స్వాతంత్ర సమరయోధుడిగా మోడీ ...! తీవ్ర విమర్శలు, ట్రోలింగ్స్..!

PM Modi: తొలిసారి ‘బుక్‌మైషో’లో మోడీ ఈవెంట్.. 30 నిమిషాల్లోనే హౌస్‌ఫుల్ బోర్డు

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Onion Rate Hike: కూరగాయలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు నిరంతరం పెరుగుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లోని సామాన్య, మధ్యతరగతి ప్రజలు, ముఖ్యంగా రోజువారీ కూలీలు తమ జీవితాలను కొనసాగించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంటిట్లో అత్యంత కీలకమైన వస్తువు ఉల్లిపాయ. ప్రతిరోజు వంటల్లో దీని వాడకం తప్పనిసరి. ఇది లేనిదే ఏ కూర కూడా వండటానికి కుదరదు. అలాంటి ఉల్లిపాయల ధరలు గత కొద్ది రోజులుగా గణనీయంగా పెరిగి సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు కిలో రూ.20కే లభించిన ఉల్లిపాయలు ఇప్పుడు ఏకంగా రెట్టింపయ్యాయి. అకాల వర్షాలు మరియు నిల్వ నష్టాల కారణంగా మార్కెట్లకు నాణ్యమైన ఉల్లి సరఫరా తగ్గడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల మార్కెట్లలో ధరలు.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కిలో ఉల్లి ధర రూ. 40 నుండి రూ. 50 వరకు పలుకుతోంది. సెప్టెంబర్ 2వ తేదీ నాటి రైతు బజార్లలోని ధరల వివరాలను గమనిస్తే.. హైదరాబాద్ (మెహిదీపట్నం రైతు బజార్): ఇక్కడ కిలో ఉల్లిపాయల ధర రూ. 40గా ఉంది. ఇతర కూరగాయలతో పోల్చితే టమాట రూ. 19, వంకాయ రూ. 35, బెండకాయ రూ. 35, పచ్చిమిర్చి రూ. 37, బీన్స్ రూ. 65, క్యారెట్ రూ. 37, దొండకాయ రూ. 23, ఆలుగడ్డ రూ. 16 వద్ద కొనసాగుతున్నాయి. విజయవాడ రైతు బజార్: విజయవాడలోని రైతు బజార్లలో చూస్తే కిలో ఉల్లిపాయల ధర రూ. 48

ఫారెన్ వెడ్డింగ్‌కు బ్రేక్.. గోల్డ్ కొనుగోళ్లకు చెక్! మోదీ సూచన వెనుక అసలు ఆర్థిక లెక్క ఇదే బంగారం, విదేశీ టూర్లకు డబ్బు తగ్గిస్తే రూపాయి బలపడుతుందా? మోదీ ‘స్వదేశీ’ పిలుపు వెనుక ఆర్థిక కారణాలేంటి? Narendra Modi Swadeshi : బంగారం కొనొద్దు.. విదేశాల్లో పెళ్లిళ్లు వద్దు.. ప్రధాని నరేంద్ర మోదీ గట్టిగా చెబుతున్న మాట.. అసలు మోదీ ఎందుకు ఇలా అంటున్నారు? ఇప్పుడు ఇదే దేశంలో ఆర్థిక చర్చకు దారితీస్తోంది. సాధారణంగా ఒక వ్యక్తి బంగారం కొనడం లేదా విదేశాల్లో పెళ్లి చేసుకోవడం అది వారి వ్యక్తిగత నిర్ణయంగానే కనిపిస్తుంది. కానీ, కోట్లాది మంది ఒకేసారి ఇలాంటి (Narendra Modi Swadeshi) ఖర్చులు చేస్తే.. ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా పడుతుందనేది అక్షర సత్యం.. మరి మోదీ చెప్పినట్టు ఈ ఖర్చులను తగ్గిస్తే నిజంగానే భారత్‌కు లాభమా? కాదో ఇప్పుడు తెలుసుకుందాం.. వాస్తవానికి, భారత్ భారీగా దిగుమతులపై ఆధారపడే దేశం. అందులో ముఖ్యంగా ముడి చమురు, బంగారం దిగుమతుల్లో కీలక వాటా మనదే. ఇందుకోసం విదేశాలకు డాలర్లు చెల్లించాలి. అలాగే, విదేశీ పర్యటనలు, డెస్టినేషన్ వెడ్డింగ్‌ల కోసం భారతీయులు ఖర్చు చేసే డబ్బు కూడా దేశం నుంచి బయటకు పోతోంది. రూపాయిపై ఒత్తిడికి కారణం ఇదే : ఇలాంటి విదేశీ చెల్లింపులు అలాగే పెరుగుతుంటే కరెంట్ అకౌంట్ లోటు (CAD)పై ఒత్తిడి పెరుగుతోంది. దిగుమతుల కోసం డాలర్లలో చెల్లించాల్సి వస్తుంది. తద్వారా డాలర్ డిమాండ్ పెరుగుతోంది. ఫలితంగా రూపాయిపై కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే అవసరం లేని విదేశీ ఖర్చులను తగ్గించుకుంటే డాలర్ డిమాండ్‌ను కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు అన్నదే ఈ వాదన వెనుక ఉన్న ఫైనాన్షియల్ లాజిక్. ప్రస్తుతం భారత్ విదేశీ మారక నిల్వలు సుమారు 691.11 బిలియన్ డాలర్లు ఉన్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరిగితే అప్పుడు ఈ పరిస్థితి వేగంగా

ప్రపంచంలో అత్యధికంగా బంగారం వినియోగించే దేశాల్లో భారత్ ఒకటి. కానీ మన దేశంలో బంగారం ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుంది. దీంతో దేశ అవసరాలకు కావాల్సిన బంగారంలో అధిక భాగాన్ని విదేశాల నుంచే దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. విదేశాల నుంచి బంగారం కొనుగోలు చేయాలంటే రూపాయల్లో కాకుండా ప్రధానంగా అమెరికన్ డాలర్లలో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. దేశంలో బంగారం డిమాండ్ పెరిగిన కొద్దీ విదేశాలకు ఎక్కువ డాలర్లు వెళ్లిపోతాయి. దీంతో దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే అవసరం లేని బంగారం కొనుగోళ్లు తగ్గితే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసుకునే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. భారత్ విదేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకునే వస్తువుల్లో ముడి చమురు తర్వాత బంగారం కూడా కీలక స్థానంలో ఉంటుంది. బంగారం కొనుగోలు కోసం ఎక్కువ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తే దేశ దిగుమతుల వ్యయం పెరుగుతుంది. దీని వల్ల ఎగుమతులు, దిగుమతుల మధ్య అంతరం పెరిగి వాణిజ్య లోటు అధికమయ్యే అవకాశం ఉంటుంది. విదేశీ కరెన్సీపై డిమాండ్ పెరిగినప్పుడు భారత రూపాయిపై కూడా ఒత్తిడి పడుతుంది. రూపాయి విలువ తగ్గితే మరో సమస్య ఎదురవుతుంది. ముడి చమురు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర విదేశీ ఉత్పత్తుల దిగుమతులు మరింత ఖరీదవుతాయి. చివరకు వాటి ప్రభావం దేశీయ ధరలపై పడి ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంటుంది. చాలా మంది బంగారాన్ని పెట్టుబడిగా భావించి నగలు, నాణేలు లేదా బిస్కెట్ల రూపంలో కొనుగోలు చేసి ఇంట్లో లేదా బ్యాంకు లాకర్లలో భద్రపరుస్తుంటారు. అయితే ఇలా పెద్ద మొత్తంలో డబ్బు బంగారం రూపంలో నిల్వ ఉండిపోతే అది నేరుగా ఉత్పాదక రంగాల్లోకి వెళ్లదు. ఉదాహరణకు అదే డబ్బును బ్యాంకు డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్లు, కంపెనీల షేర్లు లేదా కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే ఆ నిధులు ఆర్థిక కార్యకలాపాలకు ఉపయోగపడతాయి. బ్యాంకుల్లో డబ్బు

భారతదేశం సాధించిన 7.8 శాతం జీడీపీ వృద్ధి రేటుపై వస్తున్న విమర్శలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతలు, మాజీ ఉన్నతాధికారులను లక్ష్యం చేసుకుంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. గణాంకాల వాస్తవికతను ప్రశ్నించేవారికి సరైన ఉపాధి లేదని, అందుకే వారు టీవీ చర్చా వేదికలపై కూర్చుని కల్పిత వాదనలను తెరపైకి తెస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.ఇటీవల 2026 ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి భారత జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదైనట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. అయితే, ఈ గణాంకాలపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్, మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ వంటి ప్రముఖులు అనుమానాలు వ్యక్తం చేశారు. వృద్ధి రేటుకు అనుగుణంగా ఉద్యోగ కల్పన, పెట్టుబడులు ఎందుకు పెరగడం లేదని రాజన్ ప్రశ్నించగా, ప్రభుత్వం పాత జీడీపీ అంచనాలను సవరించి తగ్గించడం వల్లే ప్రస్తుత వృద్ధి రేటు అధికంగా కనిపిస్తోందని గార్గ్ విశ్లేషించారు.ఈ విమర్శలపై ఢిల్లీలో జరిగిన ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ వార్షిక సదస్సులో పీయూష్ గోయల్ స్పందించారు. విమర్శకులు పాత గణాంకాల సిరీస్‌ను ప్రస్తుత డేటాతో పోలుస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. "యాపిల్స్‌ను యాపిల్స్తోనే పోల్చాలన్న కనీస పరిజ్ఞానం కూడా వారికి లోపించింది" అని ఆయన చురకలంటించారు. తమ పదవీకాలాన్ని పూర్తి చేయలేకపోయిన వారే ఇప్పుడు విమర్శలకు దిగుతున్నారంటూ పరోక్షంగా కొందరు మాజీ అధికారులపై విమర్శలు గుప్పించారు.ప్రభుత్వం గణాంకాలను సృష్టించదని, వాస్తవాలను ఎప్పటికీ

జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 55వ జన్మదినం సందర్భంగా పార్టీ యువజన విభాగానికి అధికారిక రూపం లభించింది. కాకినాడ జిల్లా పిఠాపురంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ‘జై కొట్టు’ పేరుతో జనసేన యువజన విభాగం లోగో, థీమ్ సాంగ్‌ను నాదెండ్ల మనోహర్ గ్రాండ్‌గా లాంచ్ చేశారు. జనసేన యువతను అత్యంత సంఘటితంగా రాజకీయంలోకి తీసుకురావడానికి ఈ విభాగం ఎంతో కీలకమని పార్టీ భావిస్తోంది. సినీ నేపథ్యం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్‌కు యువతలో ఉన్న బలమైన కనెక్షన్‌ను ఇప్పుడు సంస్థాగత రూపంలోకి మార్చేందుకు ఈ అడుగు పడింది. కేరళలో వైద్య చికిత్స పొందుతున్న కారణంగా ఈ ముఖ్యమైన కార్యక్రమానికి స్వయంగా హాజరుకాని పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఒక ఆడియో సందేశాన్ని పంపారు. ఆ సందేశంలో ఆయన యువతకు రాజకీయ చైతన్యంతో పాటు బాధ్యతను గుర్తుచేస్తూ స్పష్టమైన పిలుపునిచ్చారు. ఇన్నాళ్లు కేవలం నాయకులు, రాజకీయ పార్టీల కోసం జిందాబాద్ కొట్టామని, ఇకపై యువత తమ భవిష్యత్తు కోసం, సమాజంలో మార్పు కోసం జై కొట్టాలని పవన్ కళ్యాణ్ ఉద్బోధించారు. దేహి అని ఇతరుల ముందుకు చేతులు చాపకుండా దేశం కోసం సేవ చేసే చేతులు కావాలని ఆయన తన ప్రసంగంలో ఆకాంక్షించారు. ఈ వేడుకల సందర్భంగా పిఠాపురం నుంచి చిత్రాడ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించగా, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సందడి చేశారు. దీంతో పాటు రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ సమాంతరంగా కార్యక్రమాలు జరిగాయి. ఇదిలా ఉండగా, కొన్ని ప్రధాన కేంద్రాల్లో పవన్ కళ్యాణ్ ఆడియో సందేశాన్ని వినేందుకు ప్రత్యేకంగా లైవ్ ప్రసారాలు కూడా ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా తెలంగాణ సహా ఇతర పొరుగు రాష్ట్రాల్లో కూడా ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించేందుకు పార్టీ వర్గాలు భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ యువజన విభాగం ద్వారా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) పుట్టినరోజు వేడుకల అదరహో అనే రేంజ్లో జరిగాయి. తెలుగునేలపైనే కాదు తెలుగువారున్న పలు ప్రాంతాల్లో పవన్ పుట్టినరోజు (HBDPawanKalyan)ను ఘనంగా జరుపుకున్నారు ఫ్యాన్స్. ఈ సందర్భంగా సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఈ సారి మరింత ఘనంగా జరిగిందని చెప్పవచ్చు. ఊరూరా, వాడవాడలా పవన్ బర్త్ డే సెలబ్రేషన్స్‌ను ఫ్యాన్స్ ఉత్సాహంగా జరుపుకున్నారు. తెలుగునేలపైనే కాదు ప్రపంచంలోని నలుమూలల ఉన్న తెలుగువారిలో చాలామంది పవన్ పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం విశేషం. పవన్‌కు దేశప్రధాని నరేంద్ర మోదీ, ఆయన అన్న మెగాస్టార్ చిరంజీవితో పాటు పవన్ భార్య అన్నా, ఆయన నిర్మాత బండ్ల గణేశ్ తదితరులు విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పలు స్పెషల్ వీడియోస్ కూడా క్రియేట్ చేశారు. సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ పవన్ పై ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేయడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మరికొందరు సినీజనం కూడా పవన్ పుట్టినరోజున స్పెషల్ వీడియోస్ రిలీజ్ చేయడం విశేషం. ఇక పవన్ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో సాయిధరమ్ పాల్గొని అభిమానులకు ఆనందం పంచారు... చిత్రసీమలోని పలువురు పవన్‌కు బర్త్ డే విషెస్ చెప్పారు. పవన్ కళ్యాణ్‌పై ‘ఓజీ’ నటి శ్రియా రెడ్డి ఎమోషనల్ పోస్ట్ 200 కోట్ల క్లబ్‌లోకి ‘ఇరుముడి’.. మణికంఠుడి పోస్టర్ వైరల్ ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. బండ్లన్న మళ్లీ స్టార్ట్ చేశాడ్రోయ్

షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సు గ్రూప్ ఫొటో నుంచి భారత ప్రధాని మోదీ చిత్రాన్ని పాకిస్థాన్ ప్రధాని కార్యాలయం ఎడిట్ చేసి తొలగించడంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కార్యాలయం చేసిన ఈ చిల్లర చేష్టలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఏక్ నాథ్ షిండే... పాకిస్థాన్ చేసిన పని అత్యంత దురదృష్టకరమని మండిపడ్డారు. వారు ఫొటో నుంచి మాత్రమే మోదీ చిత్రాన్ని తొలగించగలరని... కానీ మోదీ అనుకుంటే ప్రపంచపటం నుంచి పాకిస్థాన్‌ను లేకుండా చేయగలరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. గతంలో పహల్గామ్లో ఉగ్రవాదులు ఘోరానికి ఒడిగట్టినప్పుడు, మోదీ నాయకత్వంలో మన భారత సాయుధ బలగాలు పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను, 11 ఎయిర్‌బేస్ క్యాంపులను ధ్వంసం చేసి వారిని మోకాళ్లపై నిలబెట్టాయని గుర్తుచేశారు. ఇటువంటి చవకబారు ట్రిక్కులతో భారత్‌తో కానీ, ప్రధాని మోదీతో కానీ ఆడుకోవాలని చూడవద్దని పాకిస్థాన్‌కు ఆయన హితవు పలికారు. కేవలం ఫొటో నుంచి మోదీని కట్ చేసినంత మాత్రాన దేశంలోనూ, అంతర్జాతీయ వేదికలపైనా ఆయనకు ఉన్న గుర్తింపు, స్థాయి ఎంతమాత్రం తగ్గబోవని ఏక్ నాథ్ షిండే స్పష్టం చేశారు

ప్రకృతి కంటికి కనిపించని రౌద్రరూపం దాల్చితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో నేపాల్‌లో వచ్చిన వరదలే నిదర్శనంగా నిలిచాయి. వరదల ధాటికి అతలాకుతలమైన పొరుగు దేశం నేపాల్‌లో బాధితులను పరామర్శించేందుకు రియల్ హీరో, బాలీవుడ్ నటుడు సోనూసూద్ నేరుగా రంగంలోకి దిగారు. అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న త్రిశూలి బజార్ ప్రాంతాన్ని ఆయన పర్యటించి, క్షేత్రస్థాయిలో పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. బాధితులను కలిసిన ఆయన వారి కష్టాలను అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. కష్టకాలంలో పొరుగు దేశానికి అండగా నిలుస్తూ భారత్ అందిస్తున్న సహాయాన్ని సోనూసూద్ మనస్ఫూర్తిగా కొనియాడారు.మనసారా మెచ్చుకున్న సోనూసూద్నేపాల్లో విపత్తు తీవ్రత ఊహించని స్థాయిలో ఉందని, అక్కడి ప్రజలు మళ్లీ సాధారణ జీవితానికి రావడానికి చాలా సమయం పడుతుందని సోనూసూద్ ఆవేదన వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్‌కి అందిస్తున్న సహాయం నిజంగా అభినందనీయం. నేపాల్ మళ్లీ సొంత కాళ్లపై నిలబడాలంటే ఈ సహాయం ఇలాగే కొనసాగాలి. నేను స్వయంగా ఇక్కడి కుటుంబాలను కలిసిన తర్వాత అర్థమైంది ఏమిటంటే.. ఈ సమస్య కొద్ది వారాల్లోనో, నెలల్లోనో తీరేది కాదు. మనం నిరంతరం అండగా ఉంటేనే వాళ్లు కోలుకోగలరు అని మీడియా ముఖంగా వ్యాఖ్యానించారు. Nepal flash floods: దేవుడిలా వచ్చి 1,643 మంది పిల్లల్ని కాపాడి.. రియల్ హీరో1,127కు చేరిన మృతుల సంఖ్యనేపాల్లో సంభవించిన ఈ జలప్రళయంలో ప్రాణనష్టం ఊహించని రీతిలో ఉంది. నేపాల్ పోలీసుల సమాచారం ప్రకారం ఇప్పటివరకు మృతుల సంఖ్య ఏకంగా 1,127కు చేరింది. రసువా, నువాకోట్, ధాడింగ్, చిత్వాన్, గోర్ఖా, తనహున్, నావల్పరాసి ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మృతదేహాలను వెలికితీశారు. దొరికిన మృతదేహాల్లో ఇప్పటివరకు కేవలం 95 మృతదేహాలను మాత్రమే గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించగలిగారు. మరికొన్ని మృతదేహాలు సరిహద్దులు దాటి భారత్‌లో కూడా లభ్యమవడం విపత్తు తీవ్రతకు అద్దం పడుతోంది.మృత్యువుకు 30 సెకన్ల దూరం! ఒకే ఒక్క మెసేజ్ 8
దాయాది పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్దిని బయటపెట్టింది. షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో ప్రపంచ నేతలు దిగిన గ్రూప్ ఫోటో పాకిస్థాన్ ప్రధాన మంత్రి కార్యాలయం మంగళవారం షేర్ చేసింది. అయితే, ఇందులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లేకుండా క్రాప్ చేసి.. షెహబాజ్ షరీఫ్ మాత్రమే మధ్యలో ఉన్నట్లుగా చూపించింది. పాకిస్థాన్ ప్రధాని షేర్ చేసిన ఆ ఫోటోలో కేవలం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, కిర్గిజ్ అధ్యక్షుడు సదిర్ జపరోవ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, తజికిస్థాన్ అధ్యక్షుడు ఎమోమాలి రహ్మాన్, ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయేవ్, కిర్గిజ్ కల్నల్ ఉలార్బెక్ జార్లికోవిచ్ షార్షీవ్ మాత్రమే కనిపించారు. వారి మధ్యలో తాను నిలబడి ఉన్నట్టు షెహబాజ్ బిల్డప్ ఇచ్చారు.ఎస్సిఓ సమ్మిట్ సెషన్‌కు ముందు సభ్యదేశాల నాయకులందరూ కలిసిన సమయంలో ఈ ఫోటో తీశారు. అంతటితో ఆగకుండా ఎస్సీఓ నేతలు రౌండ్‌టేబుల్ సమావేశమైన ఒక వీడియోలోనూ మోదీ ఉన్న భాగాన్ని ఎడిట్ చేసి, తొలగించింది. ఆ వీడియోను షెహబాజ్ షరీఫ్ తన అధికారిక ఫేస్బుక్ అకౌంట్లో షేర్ చేశారు.అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఒరిజినల్ ఫోటోను షేర్ చేయడంతో అసలు విషయం బయటపడింది. వాస్తవానికి షెహబాజ్ కుడివైపు నుంచి నాలుగో స్థానంలో నిలబడి ఉండగా.. మరో ఐదుగురు నేతలను ఆ ఫోటో నుంచి క్రాప్ చేశారని స్పష్టమైంది.దీంతో పాకిస్థాన్ తీరుపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చలు, సహకారాన్ని పెంపొందించడానికి నిర్వహించిన ఈ 26వ ఎస్సీఓ లీడర్షిప్ సమ్మిట్‌లో 10 సభ్యదేశాలు, 15 భాగస్వామ్య దేశాలు, రెండు పరిశీలక దేశాలు పాల్గొన్నాయి.ఎస్సీఓ సమ్మిట్‌లో మోదీ ప్రసంగంకిర్గిజిస్థాన్లో జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించిన ప్రధాని మోదీ.. ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలను వివరించారు. ప్రపంచ ఇంధన సరఫరాలు, ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతున్న పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించడం కేంద్ర ప్రభుత్వ దుశ్చర్య అని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మత రాజకీయాలకు తెర లేపారని ధ్వజమెత్తారు. నాగర్ కర్నూల్ జిల్లా, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించడం కేంద్ర ప్రభుత్వ దుశ్చర్య అని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు (Telangana Minister Jupally Krishna Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మత రాజకీయాలకు తెర లేపారని ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి అవకాశాలు వచ్చిన సోనియాగాంధీ కుటుంబం తీసుకోలేదని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టినందుకు.. నిరసనగా ఈరోజు (మంగళవారం) నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం అంబేడ్కర్ చౌరస్తా వద్ద గంటసేపు రోడ్డుపై బైఠాయించి మంత్రి జూపల్లి కృష్ణారావు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడారు. రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర నిర్వహించి దేశ ప్రజలను చైతన్యం చేశారని మంత్రి జూపల్లి ప్రస్తావించారు. అలాంటి కుటుంబంపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయడం దుశ్చర్యగా భావిస్తున్నామని అన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ఉత్తరప్రదేశ్‌లోని అల్ది హల్ద్వానిలోని ర్యాలీ వేదికను ఎక్కారని.. శుద్ధి చేసిన వారిపై కేసు నమోదు చేయకుండా.. ఆ విషయాన్ని ప్రశ్నించిన రాహుల్ గాంధీపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడమేంటని ప్రశ్నించారు. ‘మోదీ హటావో దేశ్‌కి బచావో.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు తెలంగాణలో తొలిసారిగా కవచ్ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నాం: కిషన్‌రెడ్డి ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లోనే మేము ఓట్లు అడుగుతాం: మంత్రి పొంగులేటి ‘తెలంగాణ - జర్మనీ’ లాజిస్టిక్ కారిడార్ ఏర్పాటుకు సహకరించండి: మంత్రి శ్రీధర్‌బాబు

భారత్-పాకిస్థాన్ మధ్య సింధు జలాల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. సింధు జలాల ఒప్పందంపై హేగ్‌లోని కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇచ్చిన తీర్పును భారత్ తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఇంటర్నెట్ డెస్క్: భారత్-పాకిస్థాన్ మధ్య సింధు జలాల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. సింధు జలాల ఒప్పందం (Indus Waters Treaty)పై హేగ్‌లోని కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇచ్చిన తీర్పును భారత్ తిరస్కరించిన సంగతి తెలిసిందే. తాజాగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ అంశాన్ని షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో ప్రస్తావించారు. నీటిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని ఆయన అన్నారు (India Pakistan water dispute). ఎస్సీఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్ సమావేశంలో మాట్లాడిన షెహబాజ్ షరీఫ్.. నీరు లక్షలాది మంది జీవితాలకు ఆధారమని, వ్యవసాయానికి కీలకమని, భవిష్యత్ తరాల అవసరాలను తీర్చే వనరని అన్నారు. నీటిని ఆయుధంగా ఉపయోగించడానికి అనుమతించకూడదని షరీఫ్ వ్యాఖ్యానించారు. ఉమ్మడి జల వనరులను ఒక దేశంపై ఒత్తిడి తీసుకురావడానికి లేదా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని పేర్కొన్నారు (Shehbaz Sharif about Indus Waters Treaty). షెహబాజ్ షరీఫ్ జల వివాదాన్ని ప్రస్తావించడానికి కొద్దిసేపటి ముందు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎస్సీఓ సదస్సులో ప్రసంగించారు (Pakistan water dispute). ఆయన ప్రసంగంలో ఉగ్రవాదంపై ప్రధానంగా దృష్టి పెట్టారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో డబుల్ స్టాండర్డ్స్ ఉండకూడదని మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి నిధులు అందించడం, ఉగ్రవాదుల నియామకం, ఉగ్ర స్థావరాలు వంటి మొత్తం వ్యవస్థను నిర్మూలించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉగ్రవాదాన్ని తమ సాధనంగా ఉపయోగించే దేశాలకు గట్టి సందేశం ఇవ్వాలని కూడా ప్రధాని పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్‌కు పాకిస్థాన్ కోర్టు భారీ ఊరట.. ఇక ఏకాంత నిర్బంధం ఉండదు.. విజయ్ ఫర్ పీఎం.. టీవీకే-కాంగ్రెస్ మధ్య విభేదాలు ముదురుతున్నాయా
పీఎం మోదీ ఇన్‌స్టా వీడియో.. వారందరికీ అదిరిపోయే కౌంటర్! ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత్ 7.8% జీడీపీ వృద్ధిని నమోదుచేయడంతో.. అంచనాలకు మించి సాధించిన ఈ ఆర్థిక పనితీరును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రశంసించారు. ఈమేరకు ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియో విడుదల చేశారు. వృద్ధి కనిపిస్తున్నా కొందరు ఆర్థిక వ్యవస్థపై నిరాశావాదాన్ని వ్యాప్తి చేస్తున్నారని విమర్శకులపై విమర్శలు గుప్పించారు. ఈ విజయం భారతీయుల సంకల్పం, కఠోర శ్రమ ఫలితమేనన్నారు. క్లిష్టమైన ప్రపంచ పరిస్థితులు ఉన్నా, ఈ గణాంకాలు దేశ బలాన్ని చాటిచెప్పాయని పేర్కొన్నారు. ఈ వార్తకు సంబంధించిన

ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేసే ప్రక్రియను వేగవంతం చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేసే ప్రక్రియను వేగవంతం చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఈ ఏడాది జులై నెలలో ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోమని ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకుందని నడ్డా పేర్కొన్నారు. కేంద్రంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి, విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను రద్దు చేసే ప్రక్రియను వేగవంతం చేసినట్లు నడ్డా తెలిపారు. విద్యార్థులు, యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సానుకూల చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. దేశ యువత, విద్యార్థుల అభ్యున్నతి, వికాసమే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని నడ్డా చెప్పుకొచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సెప్టెంబర్ 5న నిర్వహించాల్సిన ర్యాలీని విరమించుకుంటున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ ప్రకటించడాన్నీ కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్వాగతించారు. కాగా, నీట్ పేపర్ లీక్‌తో దేశ రాజధాని సహా పలు రాష్ట్రాల్లో సీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. కొన్ని వారాలపాటు ఆందోళనలు కొనసాగగా.. జులై 20 నుంచి 25 మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీంతో ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో నిరసనకారులపై కేసులు నమోదయ్యాయి. అయితే, విద్యార్థులపై నమోదైన అన్ని కేసులను సుప్రీంకోర్టు నేడు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీజేపీ నిరసనలకు సంబంధించిన కేసులను ఉపసంహరించుకుంటామని, కొత్త ఎఫ్ఐఆర్లు నమోదు

షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సు వేదికగా భారత్-పాకిస్థాన్ మధ్య సింధు జలాల ఒప్పందం వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. మంగళవారం ఈ అంశాన్ని ప్రస్తావించిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ అస్త్రంగా మలుచుకోకూడదని భారత్‌ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ ఒప్పందాలను వాటి అసలు స్ఫూర్తికి అనుగుణంగా అమలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.హేగ్‌లోని శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానం సింధు జలాల ఒప్పందం చెల్లుబాటును సమర్థిస్తూ, వివాద పరిష్కార యంత్రాంగం కొనసాగుతుందని తీర్పు వెలువరించిన మరుసటి రోజే షెహబాజ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.అయితే, ఈ న్యాయస్థానం తీర్పును భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. అసలు, ఆ కోర్టు ఏర్పాటే చట్టవిరుద్ధమని, దాని పరిధిని తాము గుర్తించబోమని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. సదరు ట్రైబ్యునల్ విచారణలో భారత్ పాల్గొనలేదని, ఆ తీర్పులు తమ జలవిద్యుత్ ప్రాజెక్టులపై ఎలాంటి ప్రభావం చూపబోవని తేల్చిచెప్పింది.2025 ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. తాజా తీర్పు వెలువడినప్పటికీ, ఈ విషయంలో తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని భారత్ పునరుద్ఘాటించింది.ఇదే ఎస్సీఓ సదస్సులో ప్రసంగించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉగ్రవాదంపై పోరాటంలో ద్వంద్వ ప్రమాణాలు పాటించడం తగదని హెచ్చరించారు. ఉగ్రవాదానికి అందుతున్న నిధులు, నియామకాలు, సురక్షిత స్థావరాలను కూకటివేళ్లతో పెకిలించాలని పిలుపునిచ్చారు. ఈ పరిణామాలతో భారత్-పాకిస్థాన్ మధ్య ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్తతల మధ్య సింధు జలాల వివాదం మరోసారి కీలక

ఎస్సీఓ వేదికపై ఫొటోగ్రాఫ్ అనంతరం వెళ్లిపోతున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను పాక్ ప్రధాని పిలిచారు. అనంతరం ఆయనతో సంభాషించారు. ఇంటర్నెట్ డెస్క్: కిర్గిస్థాన్‌లో జరుగుతున్న షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) సదస్సులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈరోజు(మంగళవారం) సభ్యదేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రుల ఫొటోగ్రాఫ్ తరవాత అక్కడి నుంచి వెళ్లిపోతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌ను పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ వెనుక నుంచి తట్టారు. అనంతరం ఆయనతో సంభాషించారు. అయితే పాక్ ప్రధాని రష్యా అధ్యక్షుడికి ఏం చెప్పి ఉంటారనే విషయమై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. ఉక్రెయిన్‌తో యుద్ధానికి రష్యా ముగింపు చెప్పాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపిచ్చిన తరువాతి రోజే ఈ ఘటన జరిగింది. బీష్కెక్లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు, తనకు జరిగిన భేటీలో మోదీ ఈ సూచనలు చేశారు. ‘యుద్ధానికి కేటాయించే ప్రతి దినమూ మానవత్వాన్ని అంతం చేస్తుంది. శాంతి కోసం కేటాయించే ప్రతి ఒక్కరోజూ మావవత్వాన్ని బతికించి, కొత్త ఆశలు చిగురించేలా చేస్తుంది’ అని ఆయన చెప్పారు. అందుకే యుద్ధాన్ని వీడాలని సూచించారు. హెగ్సెత్‌పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.. 2028 రేసులో ఉన్నట్టా? విమాన ఇంధనానికి మళ్లీ మంట.. లీటరుకు రూ.6.28 పెరిగిన ఏటీఎఫ్ ధర

కిర్గిజ్ రాజధాని బిష్కెక్లో జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ సదస్సు వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ద్వైపాక్షిక భేటీ నిర్వహించారు. ఐదేళ్లు దాటుతున్న ఉక్రెయిన్ యుద్ధానికి తక్షణమే ముగింపు పలకాలంటూ పుతిన్ ముందే భారత్ తన శాంతి వైఖరిని అత్యంత స్పష్టంగా పునరుద్ఘాటించింది. అంతులేని యుద్ధం నుంచి యుద్ధం ముగింపు వైపు అడుగులు వేయడం మానవాళి శ్రేయస్సుకు అత్యవసరమని మోదీ తేల్చిచెప్పారు. గతంలో 2022 సమర్కాండ్ ఎస్సీఓ సదస్సులో ఇది యుద్ధాల యుగం కాదని చెప్పిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. 2025 డిసెంబర్లో ఢిల్లీలో జరిగిన వార్షిక సదస్సు తర్వాత 2026లో వీరిద్దరి మధ్య జరిగిన తొలి భేటీ ఇదే కావడం విశేషం. గాంధీ, బుద్ధుడు నడయాడిన భారత భూమి నుంచి ఎల్లప్పుడూ శాంతి సందేశమే ప్రపంచానికి వెళ్తుందని రష్యా అధ్యక్షుడికి ప్రధాని నేరుగా వివరించారు. శాంతి వైపు వేసే ప్రతి అడుగు మానవాళిలో కొత్త ఆశను నింపుతుందని మోదీ స్పష్టం చేశారు. దీంతో ఉక్రెయిన్ సంక్షోభంపై చర్చలకు మరియు శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లవేళలా మద్దతు ఇస్తుందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి వెల్లడించారు. ఇదిలా ఉండగా పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతాల్లోని సంఘర్షణల వల్ల అంతర్జాతీయ సముద్ర వాణిజ్యం మరియు భారతీయ నావికుల భద్రత తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని ఇరువురు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ భేటీలో మోదీ వ్యాఖ్యలపై స్పందించిన పుతిన్, భారత్ మరియు రష్యాల మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనియాడారు. ఫలితంగా 2026 మొదటి ఆరు నెలల్లో రెండు దేశాల మధ్య వాణిజ్యం గణనీయంగా పెరిగిందని రష్యా వెల్లడించింది. ఈ నేపథ్యంలో రక్షణ, ఇంధనం, ఎరువులు, అంతరిక్షం మరియు వినూత్న రంగాలు సహా ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై రెండు దేశాల అధినేతలు సుదీర్ఘంగా చర్చించారు. న్యూఢిల్లీలో సెప్టెంబర్ 12–13

కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్ లో ఆరంభమైన షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. 26వ సమ్మిట్ ఇది. సభ్య దేశాల అధినేతలు, ప్రధానులతో భేటీ అయ్యారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లను కలిశారు. రష్యా అధ్యక్షుడితో జరిగిన ప్రత్యేక ద్వైపాక్షిక చర్చల్లో పరస్పర సంబంధాల బలోపేతంతో పాటు అంతర్జాతీయ శాంతి స్థాపన ప్రాధాన్యత గురించి వివరించారు.ఎస్సీఓ రౌండ్ టేబుల్ ను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఆయా దేశాధినేతలతో పాటు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా ఇందులో పాల్గొన్నారు. ఉగ్రవాదంపై పోరు, సభ్యదేశాల సార్వభౌమాధికారం, రీజినల్ కనెక్టివిటీ వంటి అంశాలపై తన వైఖరిని స్పష్టం చేశారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని కాపాడుకుంటూనే యురేషియా ప్రాంతంలోని ఇతర దేశాలతో సహకారాన్ని పెంచుకుంటోందని పునరుద్ఘాటించారు. ఈ విషయంలో రాజీపడబోమని తేల్చి చెప్పారు.సరిహద్దు దేశాల ఉగ్రవాద విధానాల గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. పాకిస్తాన్, ఇతర ఉగ్రవాద దేశాలు అనుసరిస్తోన్న వైఖరిని ఎండగట్టారు. ఉగ్రవాదంపై ద్వంద్వనీతిని అనుసరించవద్దని హెచ్చరించారు. ఒకవైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూనే మరో వైపు దీన్ని అంతం చేస్తామంటూ మాట్లాడటం సరికాదని, ఇటువంటి వైఖరికి ఏ మాత్రం ఆస్కారం ఇవ్వకూడదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.నేటి నుంచి.. అరుణాచలం, తమిళనాడులోని ఇతర ఆలయాలకు వెళ్లే భక్తులకు ముఖ్య గమనికఉగ్రవాదాన్ని ఒక వ్యూహాత్మక ఆయుధంగా ఉపయోగించుకోవడం, తీవ్రవాదులకు ఆశ్రయం కల్పించే దేశాల విషయంలో ద్వంద్వ ప్రమాణాలను వీడాలని ప్రధాని మోదీ హితవు పలికారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం, వారిని పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేసుకోవడం, షెల్టర్ జోన్ లను ఏర్పాటు చేయడం వంటి విధానాలను ఏ దేశం కూడా ప్రోత్సహించబోదని, ఈ వ్యవస్థను సమూలంగా మట్టుబెట్టాల్సిందేనని చెప్పారు.మీరు నిత్యం ధ్వేషించే మొఘల్ చక్రవర్తి పుట్టిన గడ్డ అది: ప్రధాని మోదీకి ఒవైసీ

ఉగ్రవాదంపై భారత్ వైఖరిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని విధానంగా ఉపయోగించే దేశాలకు గట్టి సందేశం ఇవ్వాలని అన్నారు. ఉగ్రవాదం ఎవరికీ వ్యూహాత్మక ఆయుధం కారాదని తేల్చి చెప్పారు. కిర్గిజిస్థాన్లోని బిష్కెక్లో మంగళవారం జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) రౌండ్‌టేబుల్ చర్చలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ సమావేశానికి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సహా పలువురు దేశాధినేతలు హాజరయ్యారు.ఉగ్రవాదం విషయంలో ఎలాంటి ద్వంద్వ వైఖరికి అవకాశం ఉండకూడదని మోదీ అన్నారు. ఈ తీవ్రమైన అంశంపై అన్ని దేశాలు ఒకే గొంతుతో మాట్లాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని తమ విధానంలో భాగంగా ఉపయోగించే దేశాలతో పాటు ఉగ్రవాదులకు ఆశ్రయం, మద్దతు ఇచ్చే దేశాలకు కూడా గట్టి సందేశం ఇవ్వాలని అన్నారు.అంతకుముందు ఎస్సీఓ నేతలు అధికారిక గ్రూప్ ఫొటోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కొద్దిసేపు మాట్లాడారు. రెండు రోజుల సదస్సు సందర్భంగా మోదీ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. అయితే షీ జిన్‌పింగ్‌తో మోదీ భేటీ అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.26వ ఎస్సీఓ సదస్సులో 10 సభ్య దేశాలతో పాటు 15 భాగస్వామ్య దేశాలు, రెండు పరిశీలక దేశాలు పాల్గొంటున్నాయి. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తున్నారు

భారత దేశ జీడీపీ 7.8 శాతం మేర వృద్ధి సాధించిందన్న ప్రధాని మోదీపై రాజ్యసభ ఎంపీ జైరాం రమేశ్ విమర్శలు గుప్పించారు. ఇంటర్నెట్ డెస్క్: భారత దేశ జీడీపీ 7.8 శాతం మేర వృద్ధి సాధించిందన్న ప్రధాని మోదీపై రాజ్యసభ ఎంపీ జైరాం రమేశ్ విమర్శలు గుప్పించారు. అవన్నీ ప్రచారార్భాటమేనని కొట్టిపారేశారు. గణంకాల గారడీతో మోదీ ప్రభుత్వం ప్రజలను భ్రమల్లో ముంచెత్తుతోందని ఎంపీ జైరాం రమేశ్ ఆరోపించారు. దేశంలో పెట్టుబడులు, వినియోగం మందగించాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 'హై వోల్టేజ్' ధరల భారాన్ని సామాన్యులపై మోపుతోందని ఆరోపించారు. ముడిసరకుల ధరలు పెరగడంతో సామాన్యుల సొంతింటి కలలు కల్లలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధరాభారం కేవలం వంటింటికే పరిమితం కాలేదని అన్నారు. రాగి వైర్ ధర రూ. 850 నుంచి రూ. 1,700 కి, అల్యూమినియం ధర రూ. 350 నుంచి రూ. 650 కి చేరిందని వెల్లడించారు. 1,000 చదరపు అడుగుల ఇంటికి వైరింగ్ ఖర్చు రూ. 50 వేల నుంచి లక్ష రూపాయిలకు పెరిగిందని చెప్పారు. హోమ్ అప్లయన్సెస్, ఎల్ఈడీ లైట్లు, ఫ్యాన్లు, సోలార్ ప్యానెళ్ల ధరలు 10 నుంచి 20 శాతం వరకు పెరిగాయని అన్నారు. స్విచ్ సాకెట్లు, మెయిన్ లైన్ కేబుల్స్, టైల్స్, కార్మికులు ఖర్చు ఇలా అన్ని పెరిగాయని అన్నారు. ధరాభారం అన్ని వైపుల నుంచి ప్రజలకు షాకులిస్తోందని వ్యాఖ్యానించారు. ఇంత జరుగుతున్నా కూడా మోదీ ప్రభుత్వం మాత్రం వాస్తవాలను మరుగున పరిచి, గణాంకాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఉందని మండిపడ్డారు. త్రైమాసిక జీడీపీ గణాంకాలు దేశంలోని పరిస్థితుల్ని తప్పుగా చూపిస్తున్నాయని అన్నారు. వీక్ సెంటీమెంట్‌ను ప్రతిఫలించట్లేదని చెప్పారు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత జీడీపీ 7.8 శాతం వృద్ధి సాధించడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. భారత్ ప్రగతిబాటలో దూసుకుపోతుంటే నిరాశావాదులు మాత్రం అసత్యాలను ప్రతిధ్వనిస్తున్నారని విమర్శించారు. ఈ వృద్ధి రేటు భారతీయుల సమష్టి శక్తికి

Narendra Modi: భారతదేశ ఆర్థిక పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రపంచవ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నప్పటికీ భారత్ మంచి వృద్ధిని సాధించిందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రజలు స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని, అవసరం లేని విదేశీ ఖర్చులను తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. భారత్ 7.8 శాతం ఆర్థిక వృద్ధిని నమోదు చేయడంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ వృద్ధి దేశ ప్రజలందరికీ గర్వకారణమని అన్నారు. ప్రపంచంలో యుద్ధాలు, అంతర్జాతీయ సమస్యలు, సరఫరా వ్యవస్థలో ఇబ్బందులు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగుతోందని చెప్పారు. ఈ సందర్భంగా విదేశీ పర్యటనల గురించి కూడా ప్రధాని మాట్లాడారు. కేవలం వినోదం కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని సూచించారు. అలాగే విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవడం కూడా తగ్గించాలని అన్నారు. అవసరం లేని సమయంలో బంగారం కొనుగోలు చేయవద్దని ప్రజలను కోరారు. దేశంలో తయారయ్యే వస్తువులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. స్వదేశీ వస్తువులను ఉపయోగించడం వల్ల దేశంలోని వ్యాపారాలు, పరిశ్రమలు, ఉద్యోగాలకు కూడా ప్రయోజనం ఉంటుందని చెప్పారు. భారత్ స్వయం సమృద్ధి సాధించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని మోదీ కోరారు. దేశ ప్రజలంతా కలిసి పనిచేస్తే భారత్ మరింత ఉన్నత స్థాయికి చేరుతుందని అన్నారు. ముఖ్యంగా యువత కలలను నెరవేర్చే బాధ్యత నేటి తరంపై ఉందని పేర్కొన్నారు. ఇదే సమయంలో దేశంలో నిరాశ వాతావరణం సృష్టిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కూడా ప్రధాని విమర్శలు చేశారు. భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమిస్తూ 7.8 శాతం వృద్ధిని సాధించిందని తెలిపారు. ప్రస్తుతం ప్రధాని మోదీ కిర్గిజిస్థాన్లోని బిష్కెక్లో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సులో పాల్గొంటున్నారు. ఈ సమావేశానికి పలు దేశాల నాయకులు హాజరయ్యారు. భారత్ అభివృద్ధి, స్వయం

కేంద్ర గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత వాస్తవ జీడీపీ 7.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆర్బీఐ వేసిన 7 శాతం అంచనాలను తలకిందులు చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థ బలమైన ప్రదర్శన కనబరిచింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు మరియు పశ్చిమాసియా ఉద్రిక్తతల నడుమ ఈ తరహా ప్రతిభ కనబరచడం విశేషం. పటిష్టమైన దేశీయ డిమాండ్, మూలధన పెట్టుబడులు మరియు సేవల రంగం సాధించిన ప్రగతి ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే తొలి త్రైమాసికంలో నమోదు అయిన 6.9 శాతం వృద్ధితో పోలిస్తే ప్రస్తుతం దేశ ఆర్థిక వేగం గణనీయంగా పుంజుకుంది. అయితే మునుపటి నాలుగో త్రైమాసికంలో నమోదు అయిన 8.6 శాతంతో పోలిస్తే వృద్ధి రేటు కొంత మందగించినట్లు స్పష్టమవుతోంది. స్థిర ధరల ఆధారంగా భారత వాస్తవ జీడీపీ రూ. 81.36 లక్షల కోట్లకు చేరగా, నామమాత్ర జీడీపీ 10.3 శాతంతో రూ. 88.27 లక్షల కోట్లుగా నమోదైంది. ఇదే సమయంలో వాస్తవ జీవీఏ వృద్ధి రేటు 8.2 శాతాన్ని తాకి నికర పన్నుల కంటే సబ్సిడీల ప్రభావం ఎక్కువగా ఉందని స్పష్టం చేసింది. ప్రాథమిక రంగంలో కొంత మందగమనం కనిపించినప్పటికీ ద్వితీయ మరియు తృతీయ రంగాలు ఆర్థిక వ్యవస్థను ముందుండి నడిపించాయి. దీంతో సేవల రంగం 10.0 శాతం వేగంతో వృద్ధి చెందగా, ఫైనాన్షియల్ మరియు ఐటీ రంగాలు 12.1 శాతంతో సత్తా చాటాయి. ఇదిలా ఉండగా తయారీ రంగం 9.2 శాతం సాధించగా, స్థిర మూలధన నిర్మాణం అనగా పెట్టుబడుల వృద్ధి 11.9 శాతానికి చేరుకుంది. అయితే వ్యవసాయ రంగం వృద్ధి 3.6 శాతానికి పరిమితం కాగా, గనుల త్రవ్వకం రంగం ప్రతికూల వృద్ధిని నమోదు చేసి కాస్త ఆందోళన కలిగించింది. భారత
రచయిత గురించిబండ తిరుపతిబండ తిరుపతి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2023లో సమయంలో చేరిన తిరుపతి.. బిజినెస్ రంగానికి సంబంధించి తాజా వార్తలతో పాటు పర్సనల్ ఫైనాన్స్, పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ న్యూస్, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్డేట్లు అందిస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్‌తో పాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం సైతం ఇస్తున్నారు. బండ తిరుపతి 2025 ఫిబ్రవరిలో టైమ్స్ ఇంటర్నెట్ నుంచి ఓవర్ అచీవర్ ఆఫ్ ది మంత్ అవార్డును అందుకున్నారు. తిరుపతి మండలస్థాయి న్యూస్ కంట్రిబ్యూటర్‌గా తన జర్నలిజం కెరీర్‌ను ప్రారంభించారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో మల్టీమీడియా జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు. అనంతరం ఈటీవీ భారత్, సాక్షి మీడియా సంస్థల్లో పని చేశారు. అక్కడ బిజినెస్, స్పోర్ట్స్, నేషనల్, ఇంటర్నేషనల్ న్యూస్ రాశారు. 2019 సాధారణ ఎన్నికల సమయంలో ప్రత్యేక కథనాలు అందించిన అనుభవం ఉంది. సినిమాలు, క్రికెట్ చూడటం, బిజినెస్ రంగానికి సంబంధించిన కొత్త విషయాలు నేర్చుకోవడం పట్ల ఆయన ఆసక్తి చూపుతారు.... ఇంకా చదవండి

ఇంటర్నెట్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్- జూన్)లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదు కావడంపై ప్రధాని మోదీ (PM Modi) హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు అభినందనలు తెలిపిన ఆయన.. గతంలో చేసిన విజ్ఞప్తినే మరోసారి గుర్తుచేశారు. స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేయాలని, విదేశీ ప్రయాణాలు వద్దని, అవసరం లేకుండా బంగారం కొనొద్దని మరోసారి కోరారు. ప్రస్తుతం కిర్గిస్థాన్ పర్యటనలో ఉన్న ఆయన ఈ మేరకు ఇన్‌స్టా వీడియో విడుదల చేశారు. ‘‘దేశ ప్రజలకు అభినందనలు. 7.8% వృద్ధి గొప్ప విషయం. ప్రజల సంకల్ప బలం, కృషికి ఇది నిదర్శనం. ప్రపంచం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో భారత్ ఈ అసాధారణ ఘనతను దక్కించుకుంది. ప్రపంచం యుద్ధంలో మునిగిపోయింది. ఎటుచూసినా యుద్ధ వార్తలే.. సంక్షోభాలే. సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతింది. 2020లో కొవిడ్ తర్వాత నుంచి నేటి వరకు ఎక్కడా స్థిరత్వం కనిపించడం లేదు. అయినా భారత్ పురోగమిస్తోంది’’ అని మోదీ తన వీడియోలో పేర్కొన్నారు. ‘‘పర్యటనల కోసం విదేశాలకు వెళ్లొద్దు. విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు దూరంగా ఉండండి. ‘భారత్‌లోనే వివాహం చేసుకోండి’ అనే మంత్రాన్నే మనం పాటిద్దాం. అవసరం లేకపోతే బంగారాన్ని కొనడం మానుకోండి. స్థానికంగా తయారైన వస్తువులు, సేవలు ఎంత ఎక్కువగా ఎంచుకుంటే.. దేశం అంత ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. మనం స్వావలంబనకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటే.. స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యేనాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతామనే విశ్వాసం నాకు ఉంది’’ అని మోదీ పేర్కొన్నారు. ‘‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అంచనా వేసిన 7 శాతం కంటే ప్రస్తుత వృద్ధి రేటు ఎక్కువ. అమెరికా- ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా అనిశ్చితులు, ఇంధన సరఫరాకు అవరోధాలు వంటి పరిస్థితులను తట్టుకొని భారత ఆర్థిక వ్యవస్థ రాణించడం విశేషం. ఈ వృద్ధిని దేశ

ప్రధాని నరేంద్ర మోదీ, కిర్గిజ్‌స్థాన్ రాజధాని బిష్కెక్లో జరుగుతున్న 26వ షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సులో చురుగ్గా పాల్గొన్నారు. ఈ ప్రాంతీయ కూటమి కీలక చర్చల్లో భాగంగా ఇతర దేశాధినేతలతో కలిసి ఆయన గ్రూప్ ఫొటోగ్రాఫ్‌లో పాల్గొన్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇతర దేశాల నేతలతో కలిసి ఒకే వేదికపై ఫొటోలకు పోజిచ్చారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, కిర్గిజ్‌స్థాన్ అధ్యక్షుడు సాదిర్ జపరోవ్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్-కిర్గిజ్‌స్థాన్ మధ్య సంబంధాల పురోగతిని ఇరువురు నేతలు సమీక్షించారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఈ చర్చల ద్వారా పరస్పర ప్రయోజనం ఉన్న రంగాల్లో రెండు దేశాల మధ్య సహకారానికి మరింత ఊపు లభిస్తుందని భావిస్తున్నారు.అంతకుముందు ఎస్సీఓ సదస్సులో పాల్గొనేందుకు బిష్కెక్కు చేరుకున్న ప్రధాని మోదీకి అక్కడి ప్రవాస భారతీయుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. 'భారత్ మాతా కీ జై', 'వందే మాతరం' నినాదాలతో వారు హోరెత్తించారు. ఈ సందర్భంగా ప్రవాసులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను, యోగా ప్రదర్శనలను మోదీ తిలకించి వారిని అభినందించారు. "భారత్ నుంచి బిష్కెక్కు.. ఈ సాయంత్రం భారత సమాజం నుంచి చాలా ప్రత్యేకమైన స్వాగతం లభించింది" అని ప్రధాని మోదీ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.బిష్కెక్లోని మానస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కిర్గిజ్ రిపబ్లిక్ క్యాబినెట్ మంత్రుల ఛైర్మన్ ఆదిల్బెక్ కాసిమలియేవ్

భారత్ సాధించిన వృద్ధి రేటు దేశ సమష్టి శక్తికి నిదర్శనమని భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అయినప్పటికీ నిరాశావాదులు మాత్రం తమ అసత్యాలను వ్యాప్తి చేస్తూనే ఉన్నారని విమర్శించారు. ఇంటర్నెట్ డెస్క్: భారత్ సాధించిన వృద్ధి రేటు దేశ సమష్టి శక్తికి నిదర్శనమని భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. నిరాశావాదులు మాత్రం తమ అసత్యాలను వ్యాప్తి చేస్తూనే ఉన్నారని విమర్శించారు. యుద్ధాలు, సరఫరా వ్యవస్థల్లో అడ్డంకుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా గడ్డు పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ మెరుగైన వృద్ధి రేటు సాధించిందని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత దేశ జీడీపీ ఏకంగా 7.8 శాతం మేర వృద్ధి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు అభినందనలు చెప్పారు. 7.8 శాతం వృద్ధి రేటు నమోదవడంతో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోందని అన్నారు. దేశ ప్రజల పట్టుదల, శక్తిసామర్థ్యాలు గొప్పవని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా గడ్డు పరిస్థితులు నెలకొన్నా భారత్ వృద్ధి పథంలో దూసుకుపోతోందని అన్నారు. భారత దేశ ప్రగతిని ఇలాగే కొనసాగించాల్సిన అవనరం ఉందని కూడా ప్రధాని చెప్పారు. ఆత్మనిర్భరత సాధించడం అవసరమని మరోసారి చెప్పారు. స్వదేశీ వస్తువులకు దేశ ప్రజలు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనవసర విదేశీ పర్యటనలు, బంగారం కొనుగోళ్లు వద్దని అన్నారు. విదేశీ మారకనిల్వల పొదుపు కోసం భారత్‌లోనే వివాహాది శుభకార్యాలు జరుపుకోవాలని సూచరించారు. రష్యా సైన్యంలోని 51 మంది భారతీయుల మృతి.. విదేశాంగ శాఖ సెక్రటరీ వెల్లడి రైల్వే అభివృద్ధిలో తెలంగాణకు పెద్దపీట కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

భారత్-రష్యాల మధ్య 'విశేష వ్యూహాత్మక భాగస్వామ్యం' నిరంతరం బలపడుతోందని, ఇందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కనబరుస్తున్న వ్యక్తిగత చొరవ, ఇరు నేతల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలే కారణమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. బిష్కెక్ వేదికగా జరుగుతున్న 26వ షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని మోదీతో నిర్వహించిన ద్వైపాక్షిక భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఉభయ దేశాల మధ్య సంబంధాల పురోగతి పట్ల పుతిన్ సంతృప్తి వ్యక్తం చేశారు. తమ మధ్య కేవలం వాణిజ్య పరమైన సంబంధాలే కాకుండా, దృఢమైన వ్యక్తిగత స్నేహబంధం ఉందని ఆయన స్పష్టం చేశారు. గ్లోబల్ సౌత్, తూర్పు దేశాల మధ్య సమన్వయాన్ని పెంపొందించే ఎస్సీఓ సదస్సుకు ముందుగా మోదీతో భేటీ కావడం సంతోషకరమన్నారు. ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మాస్కో పర్యటన సందర్భంగా ప్రస్తావించిన అంశాలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.ఇరు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక సహకారం ఆశాజనకంగా ఉందని పుతిన్ వివరించారు. గతేడాది స్వల్ప తగ్గుదల కనిపించినప్పటికీ, ఈ ఏడాది ప్రథమార్థంలో వాణిజ్య టర్నోవర్ 2.6 శాతం వృద్ధిని నమోదు చేసిందని తెలిపారు. విద్యా రంగంలోనూ ద్వైపాక్షిక సహకారం అద్భుతంగా ఉందని, గత దశాబ్ద కాలంలో రష్యాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఏడు రెట్లు పెరగడం గమనార్హమన్నారు. ప్రస్తుతం ఈ సంఖ్య సుమారు 40 వేలకు చేరుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.సెప్టెంబర్‌లో న్యూఢిల్లీ వేదికగా నిర్వహించనున్న బ్రిక్స్ సదస్సు కోసం రష్యా

భారత్- రష్యా మధ్య దశాబ్దాలుగా సత్సంబంధాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో కీలక భేటీ నిర్వహించారు. ఇరు దేశాధినేతలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు సమస్యలు, సవాళ్లపై చర్చించారు. అలాగే ఉక్రెయిన్- రష్యా మధ్య నిరంతరాయంగా కొనసాగుతున్న యుద్ధానికి ఇక ముగింపు పలకాలని ప్రధాని నరేంద్ర మోదీ కీలక సందేశం ఇచ్చారు. ప్రతిరోజూ యుద్ధం కారణంగా మానవత్వం నశిస్తుందని.. ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యల్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని హితవు పలికారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్ కేక్ లో నిర్వహించిన షాంగై కో ఆపరేషన్ సదస్సు(SCO) లో భాగంగా విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఈ మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీ అయ్యారు. శాంతి స్థాపన కోసం భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఈ మేరకు తన సహాయ సహకారాలను అందిస్తుందని అన్నారు. " ప్రతిరోజూ యుద్ధం కారణంగా మానవత్వం వెనక్కు వెళ్తుంది. శాంతి స్థాపన కోసం ముందుకు వేసే ఒక్కో అడుగు మానవత్వాన్ని పెంపొందిస్తుంది. కొత్త ఆశలను చిగురింపజేస్తుంది" అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మనమంతా ముగింపు లేని యుద్ధం నుంచి ముగింపు పలికే యుద్ధం దిశగా చేరుకోవాలని అన్నారు. మానవత్వం సంరక్షణకు ఇదే ముందడుగు.. వీలైనంత త్వరలో అన్ని సమస్యలు కొలిక్కి వస్తాయి" అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. శాంతి సందేశం విషయంలో భారత్ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. గాంధీ, బుద్ధుడు నడయాడిన భారత్ నుంచి ప్రపంచ దేశాలకు ఇచ్చే సందేశం ఇదేనని ప్రధాని మోదీ.. పుతిన్ తో జరిగిన భేటీలో స్పష్టం చేశారు. ఈ మేరకు ఇరు దేశాధినేతలు ఉక్రెయిన్ తో యుద్ధంపై చర్చలు నిర్వహించారు. గతంలోనూ పుతిన్ తో జరిగిన భేటీల్లో ఉక్రెయిన్ అంశాన్ని ఆయన ప్రధానంగా లేవనెత్తుతున్న సంగతి తెలిసిందే. " ఎక్సెలెన్సీ.. ఉక్రెయిన్ గురించి మేము

Burning Topic: సెంట్రల్ ఏషియాతో భారత్ భారీ ఒప్పందాలు! ఈ వార్తకు సంబంధించిన

కిర్గిస్థాన్‌లోని బిష్కెక్ వేదికగా జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ తన దౌత్యపరమైన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. "అంతులేని యుద్ధం నుంచి యుద్ధానికి స్వస్తి పలికే దిశగా అడుగులు వేయాలి" అని ఈ సందర్భంగా పుతిన్‌కు మోదీ సూచించారు.ఈ యుద్ధం వీలైనంత త్వరగా ముగియాలని యావత్ మానవాళి కోరుకుంటోందని ప్రధాని పేర్కొన్నారు. ఈ సంక్షోభ పరిష్కారానికి ఉద్దేశించిన ప్రతి శాంతియుత ప్రయత్నానికి భారత్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. "ఏ సమస్యనైనా శాంతియుత మార్గాల్లోనే పరిష్కరించుకోవాలన్నదే భారత్ నిశ్చితాభిప్రాయం. ఇది సకల మానవాళి శ్రేయస్సుకు అత్యవసరం. యుద్ధం కొనసాగే ప్రతి రోజూ మానవ ప్రగతిని వెనక్కి నెడుతుంది. కాబట్టి దీనికి తక్షణమే ముగింపు పలకాలి" అని మోదీ వివరించారు. గాంధీ, బుద్ధుడు నడయాడిన భారత గడ్డ ఎల్లప్పుడూ శాంతి మార్గాన్నే బోధిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.2022లో జరిగిన ఎస్సీఓ సదస్సులో "ఇది యుద్ధాల యుగం కాదు" అని పుతిన్‌తో మోదీ చేసిన చారిత్రాత్మక వ్యాఖ్యలకు కొనసాగింపుగానే తాజా సందేశం సాగింది. అటు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోనూ, ఇటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతోనూ జరిపిన ప్రతి సంభాషణలోనూ చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కారం సాధ్యమని భారత్ నొక్కి చెబుతూ వస్తోంది

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన నూతన జాతీయ కార్యవర్గం తొలి సమావేశం ప్రారంభమైంది. సంస్థాగత నిర్మాణం, పార్టీ విస్తరణ, భవిష్యత్ కార్యాచరణపై నూతన కార్యవర్గం చర్చించనుంది. ఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన నూతన జాతీయ కార్యవర్గం తొలి సమావేశం ప్రారంభమైంది. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సంస్థాగత నిర్మాణం, పార్టీ విస్తరణ, భవిష్యత్ కార్యాచరణపై నూతన కార్యవర్గం చర్చించనుంది. ఈ సమావేశానికి ముందు వందేమాతరం గీతంలోని ఆరు చరణాలనూ నేతలంతా ఆలపించారు. అనంతరం రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలపై చర్చ ప్రారంభమైంది. ప్రజా జీవితంలో ప్రధాని మోదీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ కార్యాచరణపైనా చర్చ జరగనుంది. అక్టోబర్ 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ప్రధానమంత్రిగా ఆయన పదవీకాలం వరకు సాగిన ప్రయాణాన్ని ప్రజలకు వివరించడంపై చర్చించనున్నారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. కాగా, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తెలుగు రాష్ట్రాల నుంచి పురందేశ్వరి, విష్ణువర్ధన్ రెడ్డి, డీకే అరుణ, లక్ష్మణ్ పాల్గొన్నారు. మరోవైపు, నితిన్ నబీన్ కొత్త టీమ్‌లో అనుభవం, యువ నాయకత్వం, ప్రాంతీయ, సామాజిక సమీకరణాల ఆధారంగా ప్రాతినిధ్యం కల్పించారు. దీంతో స్మృతి ఇరానీ, రామ్ మాధవ్, బిప్లబ్ దేవ్, సునీల్ బన్సల్ తదితరులకు కీలక బాధ్యతలు దక్కాయి. నా భర్త ఏడుస్తున్నారు.. ఆయనను విడిపించండి..: కెప్టెన్ అజయ్ పంత్ భార్య ఆవేదన.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌కు రూ.5 కోట్లు తిరిగి ఇచ్చేయండి.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

రాజస్థాన్‌లోని జైపూర్‌లో సర్కార్ బడి తనిఖీ చేయడానికి వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) బృందంపై శుక్రవారం తీవ్రస్థాయిలో దాడి జరిగింది. రాజస్థాన్‌లోని రాంపురా కన్వార్పురాలో ఘటన జైపూర్, ఆగస్టు 21: రాజస్థాన్‌లోని జైపూర్‌లో సర్కార్ బడి తనిఖీ చేయడానికి వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) బృందంపై శుక్రవారం తీవ్రస్థాయిలో దాడి జరిగింది. ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమంలో భాగంగా సీజేపీ కో-కన్వీనర్ అశుతోష్ రంకా నేతృత్వంలోని ప్రతినిధుల బృందం.. రాంపురా కన్వార్పురా గ్రామంలో బడుల స్థితిగతులను పరిశీలించేందుకు వెళ్లింది. సీజేపీ ప్రతినిధులు గ్రామానికి చేరుకోగానే.. స్థానికులు, బీజేపీ కార్యకర్తలు చుట్టుముట్టి రాళ్లతో, కర్రలతో విరుచుకు పడ్డారని అశుతోష్ ఆరోపించారు. పాఠశాల భవనం ప్రమాదకరంగా ఉందనే కారణంతో, గత కొన్నేళ్లుగా విద్యార్థులకు సమీపంలోని ఓ పశువుల కొట్టంలో తరగతులు నిర్వహిస్తున్నారని.. దీనిని ప్రశ్నించినందుకు తమపై దాడి చేయించారని ధ్వజమెత్తారు. తమ సభ్యులపై దాడి చేసి చొక్కాలు చింపేశారని, వాహనాల అద్దాలు, మొబైల్ ఫోన్లు ధ్వంసం చేశారని.. మహిళా ప్రతినిధులపై బురద చల్లి దుర్భాషలాడారని వాపోయారు. ఈ ఘర్షణల్లో పలువురు సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయని, ఒకరి చెయ్యి కూడా విరిగిందని పేర్కొన్నారు. రాజస్థాన్ విద్యాశాఖమంత్రి మదన్ దిలావర్ ఆదేశాల మేరకే.. బీజేపీ గుండాలు తమపై దాడి చేశారని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. పశువుల పాకలో నడుస్తున్న బడిని బాగుచేయాలని కోరడమే తమ ప్రతినిధులు చేసిన నేరమా? అని నిలదీశారు. బాధ్యులైన వారిని 48గంటల్లో అరెస్ట్ చేయాలని లేదంటే తమ నిరసనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు

శ్రావణ మాసం రాకతో దేశమంతటా పండుగల కోలాహలం మొదలైంది. వరలక్ష్మీ వ్రతం, వినాయక చవితి, దసరా వేడుకల కోసం పసిడి ఆభరణాలు కొనుగోలు చేసేందుకు మహిళలు, కుటుంబాలు సిద్ధమవుతున్న వేళ మార్కెట్లో పసిడి ధరలు షాకిస్తున్నాయి.పెళ్లిళ్ల సీజన్, పండుగల సెంటిమెంట్‌కు తోడు గ్లోబల్ మార్కెట్లో నెలకొన్న పరిణామాలతో బంగారం ధరలు ఒక్కసారిగా రాకెట్ స్పీడ్ అందుకున్నాయి. ఈ ఒక్క వారంలోనే పసిడి ఏకంగా 5 శాతం మేర ప్రియమైంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 4,620 డాలర్ల దాకా చేరగా, దేశీయంగా ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల తులానికి రూ. 1,60,780 దాటేసింది. గడిచిన రెండున్నర నెలల కాలంలో పసిడి ఈ స్థాయి గరిష్ఠ రేటును తాకడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.ధరలు ఒక్కసారిగా పెరగడానికి అసలు కారణాలేంటి?అంతర్జాతీయంగా మారిన ఆర్థిక సమీకరణాలే ఈ సడన్ ర్యాలీకి ప్రధాన కారణమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ తమ రుణాలు తగ్గించుకునేందుకు బాండ్ల బైబ్యాక్‌ను రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించడంతో డాలర్ విలువ, బాండ్ ఈల్డ్స్ ఒక్కసారిగా క్షీణించాయి.మరోవైపు అమెరికాపై 40 ట్రిలియన్ డాలర్లకు పైగా అప్పుల భారం పెరగడం, పెరుగుతున్న ద్రవ్యోల్బణ భయాలు గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. విదేశీ కరెన్సీల కంటే సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్గా భావించే పసిడి వైపే పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు మొగ్గు చూపడంతో ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి.వామ్మో.. పసిడి ధరలు చూసి నివ్వెరపోతున్న సామాన్యుడుమున్ముందు బంగారం బాట ఎటు?బులియన్ మార్కెట్ విశ్లేషకుల అంచనా ప్రకారం... బంగారం గతంలో ఉన్న రూ. 1,53,000 - 1,56,000 పరిధి నుంచి దాటుకుని ఇప్పటికే రూ. 1,58,500 మైలురాయిని దాటేసింది. ప్రస్తుత ట్రెండ్ ఇలాగే కొనసాగితే త్వరలోనే 10 గ్రాముల బంగారం రూ. 1,62,000 మార్కును తాకినా ఆశ్చర్యపోనక్కర్లేదని భావిస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్ల నిర్ణయాలు, అమెరికా డాలర్ కదలికలు , మధ్యప్రాచ్య

జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త సమీకరణాలు తెర మీద కు వస్తున్నాయి. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్లు.. డీలిమిటేషన్ పైన మరో సారి కేంద్రం వేగంగా పావులు కదుపుతోంది. ఎలాగైనా ఈ బిల్లులను ఆమోదించుకోవాలని కొత్త ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా తాజాగా కొత్త లెక్కలు కలిసి వస్తున్నాయి. దీంతో, ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి బిల్లుల ఆమోదానికి కసరత్తు మొదలైంది.కేంద్రం మరోసారి మహిళా రిజర్వేషన్లు.. డీలిమిటేషన్ బిల్లు ఆమోదం కోసం కసరత్తు వేగవంతం చేసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లుల ఆమోదం కోసం ప్రయత్నాలు జరిగాయి. అయితే, జంతర్ మంతర్ వద్ద జెన్ జీ నిరసనలు.. ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ గెలుపు.. విపక్ష పార్టీలు తమ డిమాండ్ల కోసం పట్టుబడటంతో సాధ్యం కాలేదు. శివసేన (థాకరే), టీఎంసీ, ఆప్ నుంచి చీలిక వర్గం ఎంపీ ల మద్దతుతో బిల్లును ఆమోదించేలా బీజేపీ ముఖ్య నేతలు ప్రణాళికలతో సిద్దమయ్యారు. ఇండి కూటమి కీలక నేత శరద్‌పవార్‌తో ప్రధాని మోదీ ఇటీవల భేటీ కావటం వంటి పరిణామాలు.. ఈ బిల్లుల ఆమోదానికి అవసరమైన బలాన్ని ఎన్డీఏ సమకూర్చుకుంటుందన్న వాతావరణాన్ని సృష్టించాయి. అయితే, అనూహ్యంగా ఆవిర్భవించిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సారథ్యంలో జరిగిన జెన్‌జీ ఉద్యమం, కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామాతో కేంద్రం అంచనాలు తప్పాయి.మారుతున్న పవన్ స్థానిక రాజకీయం - పొత్తుల లెక్కల్లో కొత్త ఫార్ములా..!!ప్రత్యేక సమావేశాల నిర్వహణ దిశగాకాగా.. మారుతున్న రాజకీయ లెక్కల వేళ కేంద్రం ఆలోచన మారినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను ముందుకు తీసుకెళ్లటం కోసం దక్షిణాది పార్టీల పైన ఫోకస్ చేసింది. డీఎంకే మద్దతు ఇస్తే బిల్లు పాస్ చేసుకోవటం సులభంగా మారుతుందని భావిస్తోంది. దీంతో.. దక్షిణాదికి ఎలాంటి నష్టం లేకుండా బిల్లులో స్పష్టత ఇస్తామని డీఎంకే కు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది

ప్రధాని నరేంద్ర మోదీని దేవుడిగా చిత్రీకరిస్తూ ఢిల్లీలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో నిర్వహించిన 'మోదీ చాలీసా' కార్యక్రమం పెను దుమారం రేపింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. బీహార్ రాష్ట్ర ట్రాన్స్‌జెండర్ సంక్షేమ బోర్డు సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని మోదీ శ్రీరాముడి రూపంలో చిత్రీకరించిన భారీ కటౌట్‌ను దేవుడి రూపంలో నిలబెట్టి, 'జై జై మోదీ, హర్ హర్ మోదీ' అంటూ నినాదాలు చేస్తూ హారతులు ఇచ్చారు.ఈ ఘటనపై తీవ్ర వ్యతిరేకత రావడంతో 'ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా' (పీసీఐ) వెంటనే స్పందించి వివరణ ఇచ్చింది. ఈ కార్యక్రమంతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం నిర్వాహకులు హాల్‌ను అద్దెకు తీసుకున్నారని, కానీ వారు నిబంధనలను ఉల్లంఘించి మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించారని పీసీఐ 'ఎక్స్' వేదికగా తెలిపింది. విషయం తెలియగానే తమ అధికారులు జోక్యం చేసుకుని కార్యక్రమాన్ని మధ్యలోనే నిలిపివేశారని పేర్కొంది.అయితే, ఈ కార్యక్రమాన్ని బీహార్ ట్రాన్స్‌జెండర్ సంక్షేమ బోర్డు వైస్-ప్రెసిడెంట్ రాజన్ సింగ్ గట్టిగా సమర్థించుకున్నారు. మోదీ ప్రభుత్వం వల్లే తమ కమ్యూనిటీకి తొలిసారిగా హక్కులు, ఉపాధి అవకాశాలు లభించాయని ఆయన అన్నారు. అందుకే తాము ఆయన్ను దైవంగా భావిస్తున్నామని తెలిపారు. కేవలం చాలీసా పఠించడమే కాదని, బీహార్‌లో ఐదు ఎకరాల స్థలంలో రూ.112 కోట్ల వ్యయంతో "శ్రీ నరేంద్ర మోదీ భగవానుడికి" ఆలయాన్ని నిర్మించాలని కూడా తాము ప్రణాళికలు రచిస్తున్నామని ఆయన సంచలన

న్యూఢిల్లీ: విధాన రూపకల్పనలో నూతన అంశాలను జోడించడానికి ప్రభుత్వ శాఖలు, విశ్వవిద్యాలయాలు, యువత మధ్య మరింత సమన్వయం ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యదర్శులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కృత్రిమ మేధ(ఏఐ)ను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని చెప్పారు. అదే సమయంలో మానవ మేధస్సు, విచక్షణను విస్మరించకూడదని అన్నారు. దేశ భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దాలనే దానిపై దీర్ఘకాలిక దృక్పథంతో ఆలోచించాలని కార్యదర్శులను కోరారు. డేటాను జాతీయ సంపదగా అభివర్ణించారు. వివిధ ప్రయోజనాల కోసం డేటాను సేకరించి, నిర్వహించే విధానాలలో తేడాలు ఉన్నాయని తెలిపారు. అలాగే, డేటా మధ్య మరింత అనుసంధానతను, దాని సమర్థవంతమైన వినియోగాన్ని సాధ్యం చేసే పరిష్కారాలను కనుగొనాలని సూచించారు. విడివిడిగా పనిచేయడం అనేది కేవలం సంస్థాగత సమస్య మాత్రమే కాదని, అది ఒక ఆలోచనా విధాన సమస్య అని అన్నారు. అధికారులు ఐకమత్య స్ఫూర్తితో పనిచేయాలని ప్రధాని స్పష్టం చేశారు. జట్టు స్ఫూర్తిని పెంపొందించుకోవడం వెనుక ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేయాల్సిన, ప్రపంచ స్థాయిలో దానిని మరింత పోటీతత్వంతో కూడినదిగా తీర్చిదిద్దాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. స్టన్నింగ్ లుక్‌లో అందాల తార పూజా హెగ్డే (ఫొటోలు) చీరలో మరింత అందంగా కనిపిస్తున్న ప్రియాంకా అరుళ్ మోహన్ (ఫొటోలు) చీరకట్టులో సొగసుల విందు.. నివేదా థామస్ (ఫొటోలు) విజయవాడ : వరలక్ష్మీ వ్రతం... పూల మర్కెట్లో విపరీతమైన రద్దీ (ఫొటోలు) రజినీకాంత్ ‘ధర్మన్’ సినిమాలో విలన్‌గా నటించనున్న రామ్ పోతినేని? జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ కూటమిపై సంచలన వ్యాఖ్యలు యువతిని కారుతో ఢీ కొట్టి చంపిన జనసేన MP కొడుకు అసలేం జరిగింది? ప్రియాంక తల్లిదండ్రుల మాటలు విని జగన్ కళ్లలో కన్నీళ్లు తిరిగాయి.. రిలీజ్ తరువాత జగన్ ను కలిసిన సీదిరి కుటుంబం
దేశ రాజధాని ఢిల్లీలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా (పీసీఐ)లో గురువారం జరిగిన ఓ కార్యక్రమం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని శ్రీరాముడి రూపంలో చిత్రీకరించిన కటౌట్ ముందు కొందరు వ్యక్తులు హారతి ఇవ్వడం తీవ్ర దుమారం రేపుతోంది. ‘ మోదీ చాలీసా ’ పఠించడంతో ఈ వ్యవహారం వైరల్‌గా మారింది. “జై జై మోదీ.. హర హర మోదీ” అంటూ నినాదాలు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ప్రధాని మోదీ.. కిరీటం, ఆభరణాలు ధరించిన శ్రీరాముడి తరహా రూపంలో చూపించిన కటౌట్ వైరల్ అవుతోంది.ఆ మోదీ కటౌట్ చేతిలో విల్లు, బాణం ఉండగా.. చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు హారతి ఇస్తూ నినాదాలు చేశారు. ఆ వీడియోలో ఉన్న పోస్టర్‌పై “శ్రీ నరేంద్ర మోదీ చాలీసా” అని పేర్కొన్నట్లు వీడియోల్లో కనిపిస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ ఘటనపై ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా స్పందించింది. ఈ కార్యక్రమాన్ని తాము నిర్వహించలేదని స్పష్టం చేసింది. గురువారం ఉదయం తమ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయని పేర్కొంటూ పీసీఐ వివరణ ఇచ్చింది. ఓ సంస్థ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు క్లబ్‌లోని హాల్‌ను అద్దెకు తీసుకుందని తెలిపింది. అయితే హాల్‌ను అద్దెకు తీసుకునే సమయంలో అంగీకరించిన నిబంధనలను సంబంధిత సంస్థ ఉల్లంఘించిందని పేర్కొంది. విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే క్లబ్ అధికారులు జోక్యం చేసుకుని కార్యక్రమాన్ని నిలిపివేసినట్లు వెల్లడించింది.‘మోదీ చాలీసా’ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరు ఈ కార్యక్రమాన్ని విమర్శిస్తుండగా.. మరికొందరు మోదీ ఫ్యాన్స్ అభిమానాన్ని చూపించారని పేర్కొంటున్నారు. రాజకీయాల్లో వ్యక్తి ఆరాధన ఎంతవరకు సమంజసం అనే అంశంపై కూడా నెటిజన్లు విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌కు ప్రయోజనం చేకూర్చే కీలకమైన రైల్వే ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. గూడూరు-గుమ్మిడిపూండి మధ్య 90 కిలోమీటర్ల మేర మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA) బుధవారం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,229 కోట్లుగా నిర్ణయించారు.కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం డబుల్ లైన్‌గా ఉన్న ఈ మార్గాన్ని నాలుగు లైన్లుగా అప్‌గ్రేడ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ మార్గంలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గి, మరిన్ని ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడిపేందుకు వీలవుతుందని వివరించారు. దేశంలో అత్యంత రద్దీగా ఉండే చెన్నై-కోల్‌కతా, ఢిల్లీ-చెన్నై మార్గాలతో పాటు వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌లో ఈ ప్రాజెక్టు ఎంతో కీలకం కానుంది.ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించడంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తిరుపతి ఎంపీ గురుమూర్తి హర్షం వ్యక్తం చేశారు. ఈ అదనపు ట్రాక్‌లు ప్రాంతీయ అభివృద్ధికి, ప్రగతికి బాటలు వేస్తాయని పవన్ కల్యాణ్ పేర్కొంటూ కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపినందుకు రైల్వే మంత్రికి ఎంపీ గురుమూర్తి కృతజ్ఞతలు తెలిపారు.ప్రాజెక్టుతో చేకూరే ప్రయోజనాలుఈ ప్రాజెక్టు పూర్తయితే గూడూరు జంక్షన్లో ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుంది. చెన్నై, విజయవాడ, తిరుపతి వైపు వెళ్లే రైళ్ల రాకపోకలు సులభతరం అవుతాయి. ముఖ్యంగా పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రం, శ్రీహరికోటలోని సతీశ్

కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని మంత్రివర్గంలో మార్పులు జరగనున్నాయని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఈ మార్పుల్లో భాగంగా మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మళ్లీ ప్రభుత్వంలోకి తిరిగి రాబోతున్నట్లు సమాచారం. నీట్ పేపర్ లీక్ వివాదం, కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల కారణంగా ఆయన గతంలో విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ ప్రధాని మోదీ ప్రభుత్వంలో ఆయన ప్రాధాన్యత తగ్గలేదని, త్వరలోనే ఆయనకు కీలక పోర్ట్‌ఫోలియో అప్పగించేందుకు స్క్రిప్ట్ సిద్ధమైందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే బీజేపీ సంస్థాగత స్థాయిలో అనేక మార్పులు చేసింది. పార్టీ అధ్యక్షుడు నితిన్ నవీన్ నేతృత్వంలో కొత్త బృందాన్ని ప్రకటించారు.కాశ్మీర్ పై భారత్ కు అమెరికా గుడ్ న్యూస్.. పాకిస్తాన్ కు బిగ్ షాక్..!అయితే ఆగస్టు నెలాఖరు నాటికి మంత్రివర్గ విస్తరణపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. విద్యాశాఖకు రాజీనామా చేసినప్పటికీ.. పార్లమెంట్ భవనంలో మంత్రుల విభాగం వద్దనే ఆయనకు ప్రత్యేక గదిని కేటాయించడం ధర్మేంద్ర ప్రధాన్ రీ-ఎంట్రీని బలపరుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ వద్ద ఆయనకున్న నమ్మకం కారణంగా ఆయనకు ప్రాధాన్యత కలిగిన శాఖ దక్కవచ్చని భావిస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్‌తో పాటు మరికొందరు మంత్రుల పోర్ట్‌ఫోలియోలను మార్చడం, కొత్త ముఖాలకు చోటు కల్పించడంపై కూడా చర్చలు జరుగుతున్నాయి.కీలక మంత్రుల స్థానాలపై అంచనాలు పీయూష్ గోయల్ ప్రధాని మోదీ కేబినెట్లో వాణిజ్య శాఖ మంత్రిగా కొనసాగుతారని వార్తలు వస్తున్నాయి. ఆయన పనితీరు పట్ల ప్రధాని మోదీ సంతృప్తిగా ఉన్నారు. అమెరికాతో చర్చలు నిరంతరం మారుతున్న తరుణంలో వాణిజ్య మంత్రిత్వ శాఖను మరెవరికీ అప్పగించి ప్రభుత్వం రిస్క్ తీసుకోదు. కేవలం రెండు రోజుల క్రితమే ఆయన పార్టీ కోశాధికారిగా కూడా నియమితులయ్యారు. అయితే పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ పూరీ విషయంలో పరిస్థితి అస్పష్టంగా ఉంది. పూరీ రాజ్యసభ పదవీకాలం నవంబర్ 25తో ముగుస్తుంది, ఆయన తిరిగి ఎన్నికయ్యే విషయంపై ఇంకా

Union Cabinet | ఇంటర్నెట్ డెస్క్: దేశంలో నాలుగు నూతన రైల్వే మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం రూ.9,450 కోట్ల అంచనా వ్యయంతో 410 కి.మీ మేర అదనపు రైల్వే లైన్ల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లోని ఎనిమిది జిల్లాలను కవర్ చేస్తూ ఈ నెట్వర్క్ విస్తరించనున్నారు. 2030-31 నాటికి ఈ కొత్త రైల్వే లైన్ల నిర్మాణాన్ని పూర్తి చేసి.. ప్రయాణికులకు వేగవంతమైన, సురక్షితమైన సేవలందించడమే లక్ష్యమని రైల్వే శాఖ (Indian Railways) ఓ ప్రకటనలో పేర్కొంది. కొత్తగా ఆమోదం పొందిన ఈ ప్రాజెక్టులలో పశ్చిమబెంగాల్లోని ఖరగ్‌పూర్, ఒడిశాలోని భద్రక్ (రానితాల్) మధ్య 173 కి.మీ మేర నాలుగో రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే, ఒడిశాలోని భద్రక్, హరిదాస్పూర్ మధ్య 75 కిలోమీటర్ల మేర నాలుగో లైన్; వీటితో పాటు ఏపీలోని గూడూరు - తమిళనాడులోని గుమ్మిడిపూండి మధ్య 90 కి.మీ; ఒడిశాలోని కటక్, పారాదీప్ మధ్య 72 కి.మీ మేర మూడు, నాలుగో రైల్వే లైన్లను నిర్మించనున్నారు. రైల్వే నెట్‌వర్క్‌ను మరో 410 కి.మీ మేర విస్తరించే ఈ నూతన ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.9,450 కోట్లుగా నిర్ణయించారు. ఈ కొత్త రైల్వే లైన్లు ఎనిమిది జిల్లాల్లోని 6,448 గ్రామాలకు రవాణా అనుసంధానాన్ని మెరుగుపరుస్తాయని రైల్వేశాఖ తెలిపింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు

బీజేపీకి రాజీనామా చేసిన ఆ పార్టీ మాజీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా తన నిర్ణయానికి గల కారణాలను వెల్లడించారు. బీజేపీని వీడటం వెనుక రాజకీయ విభేదాలు లేవని, ఆర్థిక, వ్యక్తిగత పరిస్థితుల కారణంగానే పార్టీ నుంచి తప్పుకున్నానని ఆయన స్పష్టం చేశారు. ఇంటర్నెట్ డెస్క్: బీజేపీకి రాజీనామా చేసిన ఆ పార్టీ మాజీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా తన నిర్ణయానికి గల కారణాలను వెల్లడించారు. బీజేపీని వీడటం వెనుక రాజకీయ విభేదాలు లేవని, ఆర్థిక, వ్యక్తిగత పరిస్థితుల కారణంగానే పార్టీ నుంచి తప్పుకున్నానని ఆయన స్పష్టం చేశారు. రాజీనామా అనంతరం తొలిసారి ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన పరిస్థితులను వివరించారు (Shehzad Poonawalla Quits BJP). పూర్తికాలం రాజకీయాల్లో కొనసాగడం వల్ల తన వ్యక్తిగత ఖర్చులను నిర్వహించడం కష్టంగా మారిందని పూనావాలా తెలిపారు. రాజకీయ పార్టీలు తమ అధికార ప్రతినిధులకు లేదా కార్యకర్తలకు జీతాలు చెల్లించవని చెప్పారు. దీంతో ఇంటి అద్దె వంటి సాధారణ ఖర్చులను కూడా భరించడం కష్టంగా మారిందని వివరించారు. 'నేను నా ఇంటి అద్దె చెల్లించాలి. రోజువారీ ఖర్చులు చూసుకోవాలి' అని ఆయన తన పరిస్థితిని వివరించారు. పార్టీపై అసంతృప్తితో తాను ఈ నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు (BJP Spokesperson). బీజేపీని వీడాలనే ఆలోచన తనకు అకస్మాత్తుగా రాలేదని పూనావాలా తెలిపారు. పార్టీకి రాజీనామా చేసి ప్రైవేటు రంగంలోకి తిరిగి వెళ్లడం గురించి 2024 నుంచి ఆలోచిస్తున్నానని చెప్పారు (BJP Resignation Shehzad). కొన్ని వారాల క్రితం తాను మొదటిసారి రాజీనామా చేయాలనుకుంటున్నట్లు పార్టీ నాయకత్వానికి తెలియజేశానని, ఆ సమయంలో పార్టీ పెద్దలు తనతో మాట్లాడారని వెల్లడించారు. అయితే ఈసారి మాత్రం తన నిర్ణయం తుది నిర్ణయమని స్పష్టం చేస్తూ బీజేపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులన్నింటికీ రాజీనామా చేసినట్టు తెలిపారు. నీట్ పేపర్ లీక్‌పై