
Mamata Banerjee | నందిగ్రామ్ ఉప ఎన్నికలో మమతా పోటీ చేస్తే.. అభ్యర్థిని బరిలోకి దించబోం: రిటాబ్రత
Mamata Banerjee | నందిగ్రామ్ ఉప ఎన్నికలో మమతా పోటీ చేస్తే.. అభ్యర్థిని బరిలోకి దించబోం: రిటాబ్రత
© 2026 nimisham.in

Mamata Banerjee | నందిగ్రామ్ ఉప ఎన్నికలో మమతా పోటీ చేస్తే.. అభ్యర్థిని బరిలోకి దించబోం: రిటాబ్రత

Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!

Mamata Banerjee: అసెంబ్లీకి మమత ? ఉప ఎన్నికలకు ముహుర్తం ఫిక్స్..!

పశ్చిమ బెంగాల్లో అత్యంత వ్యూహాత్మక ప్రాంతమైన సిలిగురి కారిడార్ రక్షణను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నూతన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సిలిగురిలో దాదాపు 80 ఎకరాల విస్తీర్ణంలో సశస్త్ర సీమ బల్ ఫ్రాంటియర్ ప్రధాన కార్యాలయ పరిపాలనా భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి సువేందు అధికారితో కలిసి కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా నిర్వహించిన సభలో అమిత్ షా మాట్లాడారు. దేశ సరిహద్దులు బలోపేతం కానంత వరకూ భారత్ ఎంత మాత్రం సురక్షితంగా కాదని తేల్చి చెప్పారు. నలుమూలలా వ్యాపించి ఉన్న సరిహద్దులను మరింత పటిష్ట పర్చుకోవాల్సి ఉందని అన్నారు. సిలిగురి కారిడార్‌ను దేశంలో అత్యంత సున్నితమైన, భౌగోళిక వ్యూహాత్మక ప్రతిపత్తి కలిగిన ప్రాంతమని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు దీనికి తగిన ప్రాధాన్యత దక్కలేదని పేర్కొన్నారు.దేశంలోని ఈశాన్య రాష్ట్రాలను ప్రధాన భూభాగంతో అనుసంధానించే ఈ చికెన్స్ నెక్ ప్రాంత భద్రత దేశ సార్వభౌమాధికారానికి ఎంతో కీలకమని అమిత్ షా అన్నారు. ఇక్కడ కొత్తగా నిర్మించనున్న భారీ ఎస్ఎస్బీ పరిపాలనా భవనం సరిహద్దు రక్షణ చర్యలను నిరంతరం పర్యవేక్షించడానికి, పెద్ద ఎత్తున బలగాలను మోహరింపజేయడానికి ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. జాతీయ భద్రత విషయంలో కేంద్రం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.వరలక్ష్మీ వ్రతం వేళ.. బంగారం ప్రియులకు బిగ్ షాక్దేశంలో శాంతిభద్రతలు వర్ధిల్లాలన్నా, పశ్చిమ బెంగాల్‌తో పాటు దేశమంతటా సురక్షిత వాతావరణం నెలకొనాలన్నా సరిహద్దు వెంబడి శత్రువుల కదలికలను పూర్తిగా అరికట్టడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ దిశగా భద్రతా బలగాలకు అవసరమైన అన్ని వసతులను కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా గత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై అమిత్ షా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల వెంబడి చొరబాట్లను నిరోధించేందుకు కంచె వేయాలని కేంద్రం భావించినప్పటికీ.. దీనికి కావలసిన భూమిని కేటాయించడంలో గత మమత బెనర్జీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. సరిహద్దుల
టీఎంసీ సీనియర్ నాయకుడు, తనకు అత్యంత సన్నిహితుడైన మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీ మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వేధింపులు, తీవ్రమైన మానసిక ఒత్తిడే ఆయన మరణానికి కారణమని ఆమె ఆరోపించారు. ‘‘క్రూరమైన రాజకీయ శత్రుత్వానికి బలయ్యే మనుషుల ప్రాణాల విలువేంటో మనందరినీ ఒక్కసారి ఆగి, ఆలోచించేలా ఈ ఘటన చేస్తోంది’’ అని దీదీ ఆవేదనకు గురయ్యారు. ఆశిష్ బెనర్జీని ‘‘పదే పదే అవమానించి, అబద్ధపు ఆరోపణలు మోపి, తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేశారు’’ మమతా బెనర్జీ వాపోయారు. పార్టీ కార్యాలయంలో ఆశిష్ బెనర్జీ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.‘‘తన చివరి రోజుల్లో ఆయన పడిన తీవ్ర మానసిక ఒత్తిడి ఈ విషాదాన్ని మరింత వేదనకు గురిచేస్తోంది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మాజీ డిప్యూటీ స్పీకర్‌గా, చైర్మన్‌గా ఆశిష్ దా రాంపూర్ హట్ ప్రాంత అభివృద్ధికి తనను తాను అంకితం చేసుకుని, ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేశారు.. ప్రజలకు ఆయన అంత సేవ చేసినప్పటికీ, ఆయనను పదే పదే అవమానించారు, నిందలు వేశారు, తట్టుకోలేని ఒత్తిడికి గురిచేశారు’’ అని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మమతా బెనర్జీ రాసుకొచ్చారు.‘‘సుదీర్ఘకాలం ప్రజలకు సేవ చేసినప్పటికీ ఆయన ఎదుర్కొన్న వేధింపులు, మానసిక ఒత్తిడి.. కక్షపూరిత రాజకీయాల వల్ల ఎంతటి తీవ్రమైన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో ఈ ఘటన అందర్నీ ఆలోచించేలా చేస్తోంది. ఆయన కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు, పాత విద్యార్థులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన లేని లోటు ఎప్పటికీ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది’’ అని ఆమె పేర్కొన్నారు.అటు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి, దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ సైతం ఆశిష్ బెనర్జీ మృతికి సంతాపం తెలిపారు. ఆయన విషాదకర మరణానికి దారితీసిన పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్స్‌లో నివాళులర్పించిన అభిషేక్.. ‘జీవితాంతం ఉపాధ్యాయుడిగా, ప్రజాసేవకుడిగా’ ఉంటూ బీర్భూమ్ ప్రజలకు గౌరవం, నిజాయితీతో

ఇంటర్నెట్ డెస్క్: బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సన్నిహితుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీ (Asish Banerjee) ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున బీర్భూమ్ జిల్లాలోని పార్టీ కార్యాలయం (Trinamool office)లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయన ఇంటికి సమీపంలోనే పార్టీ కార్యాలయం ఉంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపి ఘటనపై దర్యాప్తు చేపట్టారు. తృణమూల్ నేత మృతి విషయం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తన పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఆశిష్ బెనర్జీ రాంపూర్హాట్ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2001 నుంచి 2026 వరకు 25 ఏళ్లపాటు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. బెంగాల్ విద్యా, వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేశారు. 2021లో రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా విధులు నిర్వర్తించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా నేత ధ్రువ్ సాహా చేతిలో ఓటమి పాలయ్యారు. ఇదీ చదవండి: కాంగ్రెస్ కార్యాలయంలో పూర్తి వందేమాతరంపై వివాదం గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

పశ్చిమ బెంగాల్ లో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తొలిసారి అధికారంలోకి వచ్చిన సువేందు అధికారి (Suvendu Adhikari) ప్రభుత్వం.. నిత్యం ఏదో ఒక సంచలన నిర్ణయం తీసుకుంటూనే ఉంది. తద్వారా నిత్యం వార్తల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా సీఎం సువేందు అధికారి తన సొంత పార్టీ బీజేపీకి చెందిన ఓ ఎంపీకి గత ప్రభుత్వం ఇచ్చిన ఓ అవార్డును వెనక్కి తీసుకోవాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ పరిణామం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.డీలిమిటేషన్ బిల్లు వేళ కేంద్రానికి ఝలక్..! టీఎంసీ రెబెల్స్ యూటర్న్..!ఇంతకీ ఏం జరిగిందంటే.. బెంగాలీయులకు ఆరాధ్యుడైన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను యుద్ద నేరస్తుడని అభివర్ణిస్తూ బీజేపీ ఎంపీ నాగేంద్ర రే (Nagendra ray) సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనతో పాటు సువేందు ప్రభుత్వం కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో గతంలో ఎంపీ నాగేంద్ర రాయ్ కు ఆయన చేసిన సేవలకు గానూ మమతా బెనర్జీ ప్రభుత్వం ఇచ్చిన బంగ విభూషణ్ (Banga Bibhushan) అవార్డును వెనక్కి తీసుకోవాలని సువేందు ప్రభుత్వం నిర్ణయించింది. అంతకు ముందు సోషల్ మీడియాలో నేతాజీపై అగౌరవకరమైన వ్యాఖ్యలు చేసేవారిపై అరెస్టులతో సహా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం సువేందు అధికారి పోలీసుల్ని ఆదేశించారు. అది ఎమ్మెల్యే అయినా, ఎంపీ, అయినా, ప్రభుత్వ అధికారి అయినా అంటూ తేల్చిచెప్పారు. చిమ్మ చీకట్లో బంగ్లాదేశ్..! షాపుల మూసివేత..! భారత్ వైపు చూపు..!సువేందు ఈ ట్వీట్ చేసిన 24 గంటల లోపే అనంత మహరాజ్ (Ananta Maharaj)గా కూడా పిలుచుకునే ఎంపీ నాగేంద్ర రేకు ఇచ్చిన అవార్డు వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా ఎంపీ నాగేంద్ర రే .. నేతాజీని యుద్ధ నేరస్థుడుడిగా అభివర్ణించడం, భారత స్వాతంత్ర్య పోరాటంలో ఆయన నాయకత్వం, ఆజాద్ హింద్ ఫౌజ్ పాత్రను ప్రశ్నించడం వంటి వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రభుత్వం అవార్డు వెనక్కి

న్యూఢిల్లీ: మమతా బెనర్జీ మేనల్లుడికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కంటి చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీకి సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. పదహారు కేసులున్న కారణంగా అతడు తిరిగి రాడేమో అన్న కలకత్తా హైకోర్టు అభ్యంతరాలను తోసిపుచ్చింది. విదేశీ టూర్‌కు అనుమతి నిరాకరిస్తూ ఆగస్టు 5న ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జోయ్‌మాల్య బాగ్చి, వి. మోహనలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. తనకు నచ్చిన వైద్యం చేయించుకునే హక్కు ప్రతిఒక్కరికీ ఉందని వ్యాఖ్యానించిన బెంచ్ పర్యటన వివరాలతోపాటు ఎక్కడెక్కడ బస చేసేదీ వివరంగా దర్యాప్తు సంస్థలకు తెలపాలని ఆదేశించింది. ఈ వివరాలను గోప్యంగా ఉంచాలని స్పష్టం చేసింది. అభిషేక్ బెనర్జీ విదేశాలకు వెళ్లిన తరువాత తిరిగి రాకపోవచ్చు అని బెంగాల్ ప్రభుత్వం తరఫున అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు వాదనను బెనర్జీ తరఫు న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ ఖండించారు. చదవండి: 'మొయిత్రాకు ఏమైనా జరిగితే ఆ జడ్జిదే బాధ్యత' మమత వర్గం నిరసనలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో అంతర్గత విభేదాలు మరో ఆసక్తికరమైన మలుపు తిరిగాయి. మమతా బెనర్జీకి చెందిన వర్గం అసెంబ్లీ ఆవరణలో సోమవారం చేపట్టిన నిరసనలో తిరుగుబాటు రితబ్రత వర్గానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు పాలుపంచుకున్నారు. ఆదివారం మమత కంచ్రాపారలో పోలీస్ కస్టడీలో చనిపోయిన టీఎంసీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లగా రాళ్లు, కర్రలతో కొందరు ఆమెపైకి దాడికి యత్నించడం తెల్సిందే. ఈ ఘటనను నిరసిస్తూ మమత వర్గం ఎమ్మెల్యేలు చేపట్టిన ఆందోళనలో రితబ్రత వర్గంలోని ఎమ్మెల్యేలు అబ్దుల్ ఖలేక్ మొల్లా, తౌసిఫుర్ రహ్మాన్, బిభాస్ సర్దార్ పాల్గొన్నారు. తాము రితబ్రత వర్గంలో కొనసాగుతున్నామంటూనే, మమతపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు. మమత సారథ్యంలోని టీఎంసీ గెలుచుకున్న 80 సీట్లకు గాను 65 మంది అనంతరం

టీఎంసీ రెబల్ ఎంపీలు చేరిన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో అభిప్రాయభేదాలు వెలుగు చూశాయి. ఇంటర్నెట్ డెస్క్: టీఎంసీ రెబల్ ఎంపీలు చేరిన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో (ఎన్సీపీఐ) అభిప్రాయభేదాలు వెలుగు చూశాయి. బీజేపీకి మద్దతుపలకడంపై ముగ్గురు ఎసీపీఐ ఎంపీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన 20 మంది ఎంపీలు ఇటీవల ఎసీపీఐలో చేరిన విషయం తెలిసిందే. ఎన్సీపీఐ బీజేపీకి మద్దతుగా ఉండటంపై ఎంపీలు అబూ తాహెర్ ఖాన్, ఖలీలుర్ రెహ్మాన్, యూసుఫ్ పఠాన్ అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో వారు పార్టీ సమావేశాలకు కూడా హాజరుకావట్లేదని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. బీజేపీకి దగ్గరైనట్టు కనిపిస్తే తమకు ఎంతో కాలంగా అండగా ఉంటున్న ఓటర్లు దూరమయ్యే అవకాశం ఉందని వారు భావిస్తున్నట్టు సమాచారం. బీజేపీ విషయంలో అభిప్రాయాలు ఉన్నప్పటికీ ముగ్గురు ఎంపీలు ఇటీవల బిర్భూమ్ ఎంపీ శతాబ్దీ రాయ్‌తో కలిసి ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. అంతేకాకుండా, ప్రధాని నివాసంలో అల్పాహార విందుకు కూడా హాజరయ్యారు. అయితే, బీజేపీ విధానాలతో తాము ఏకీభవించలేమని ముగ్గురు ఎంపీలు తెలిపారు. కానీ, వివిధ సంక్షేమ పథకాల ఫలాలు తమ నియోజకవర్గ ప్రజలకు చేరేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సహకరిస్తామని అన్నారు. గత వారం ఎన్డీయే ఎంపీల మంగళ్ మిలన్ సమావేశంలో ఎన్సీపీఐ తరఫున 17 మంది ఎంపీలే హాజరయ్యారు. ఖాన్, రెహ్మాన్, పఠాన్ మాత్రం ఈ సమావేశంలో పాల్గొనలేదు. ఇక శనివారం ఎంపీలు ఖాన్, రెహ్మాన్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని కలిసి సర్‌తో ముర్షిదాబాద్ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చర్చించారు. ‘ఎన్డీయేతో మేము కలిసేది లేదని ముందే చెప్పాము. కానీ ముస్లిం వర్గం, ముఖ్యంగా వెనకబడ్డ వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఈ దిశగా చర్యలు తీసుకునేందుకు సీఎం అంగీకరించారు’ అని
పశ్చిమ బెంగాల్లో మరోసారి తీవ్ర రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ కాన్వాయ్‌ను ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హలిశహర్‌లో నిరసనకారులు అడ్డుకున్నారు. పోలీసు కస్టడీలో మృతి చెందిన టీఎంసీ కార్యకర్త బిర్జు కియోట్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆమె అక్కడికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నిరసనకారులు మమతా బెనర్జీ వాహనాన్ని చుట్టుముట్టి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత వాహనంపై బురద, రాళ్లు, చెప్పులు వంటి వస్తువులు విసిరినట్లు మమతా బెనర్జీ ఆరోపించారు.పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మమతా బెనర్జీ కాన్వాయ్‌ను అక్కడి నుంచి సురక్షితంగా తరలించారు. ఈ ఘటనతో హలిశహర్‌లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తన వాహనంపై పెద్ద రాళ్లు విసిరారని మమతా బెనర్జీ ఆరోపించారు. కారు అద్దాలు తెరిచి ఉంటే తీవ్రంగా గాయపడే అవకాశం ఉండేదని ఆమె వ్యాఖ్యానించారు. తన పర్యటన గురించి పోలీసులకు ముందుగానే సమాచారం ఉన్నప్పటికీ తగిన భద్రత కల్పించలేదని ఆరోపించారు.ఈ ఘటన వెనుక కుట్ర ఉందని దీదీ అనుమానం వ్యక్తం చేశారు. బెంగాల్లో శాంతిభద్రతల పరిస్థితిపై కూడా మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. ఇక.. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. మమతా బెనర్జీని లక్ష్యంగా చేసుకుని రాళ్లు విసరడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. ఈ దాడిని హత్యాయత్నంగా పరిగణించాలని ఆయన డిమాండ్ చేశారు.మాకేం సంబంధం లేదు.. ఖండించిన బీజేపీమమతా బెనర్జీ కాన్వాయ్‌పై జరిగిన దాడిపై బీజేపీ స్పందించింది. ఈ ఘటనను ఖండిస్తూ.. రాళ్లు, బురద, చెప్పులు విసరడాన్ని తమ పార్టీ సమర్థించదని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య తెలిపారు. ఇలాంటి చర్యలు రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. బీజేపీ నేత, మంత్రి అగ్నిమిత్ర పాల్ కూడా ఈ దాడిని ఖండించారు. రాజకీయ

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కాన్వాయ్‌పై హాలిషహర్‌లో దాడి జరిగిన విషయం తెలిసిందే. మృతి చెందిన పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై మమతా బెనర్జీ స్పందిస్తూ బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇటుకలు, రాళ్లతో తన కారుపై దాడి చేశారని, ఈ ఘటనలో తాను ప్రాణాలు కూడా కోల్పోయి ఉండేదాన్నని మమతా బెనర్జీ అన్నారు. తర్వాత మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ.. రాళ్లు, ఇటుకలు తనను తాకి ఉంటే ప్రాణాపాయం జరిగేదని అన్నారు. “బయటి ప్రాంతాల నుంచి వచ్చిన సంఘ వ్యతిరేక శక్తులు పోలీసుల ఎదుటే నా కారుపై రాళ్లు విసిరాయి. కారు అద్దాలు మూసి లేకపోతే నా తల పగిలిపోయేది. నేను చనిపోయి ఉండేదాన్ని. ఇలాంటి దాడిని నేను ఎప్పుడూ ఎదుర్కోలేదు. మమ్మల్ని రక్షించేందుకు పోలీసులు ఏమీ చేయలేదు. వారు బీజేపీకే రక్షణ ఇస్తున్నారు” అని ఆమె అన్నారు. మమతా బెనర్జీతో పాటు ఉన్న లోక్‌సభ సభ్యుడు కల్యాణ్ బెనర్జీ, రాజ్యసభ సభ్యురాలు డోలా సేన్ కూడా బీజేపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “పోలీసులను ఉపయోగించి ముఖ్యమంత్రి సువేందు అధికారి పాలన నడుపుతున్నారు” అని కల్యాణ్ బెనర్జీ అన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య ఈ దాడిని ఖండించారు. ఈ ఘటనతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని అన్నారు. కొన్ని నెలల క్రితం పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తమ పార్టీ ఘోర ఓటమి తర్వాత, మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ తన నియోజకవర్గంలో దాడిని ఎదుర్కొన్నారు. ఇప్పుడు మమతా బెనర్జీకి కూడా అటువంటి అనుభవమే ఎదురైంది. Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 09- 16) గచ్చిబౌలి స్టేడియంలో

Mamata Banerjee : పశ్చిమ బెంగాల్లో మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి ఊహించని పరిణామం ఎదురైంది. ఉత్తర 24 పరగణాల జిల్లాలో మృతిచెందిన ఓ టీఎంసీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆమె వెళ్తున్న సమయంలో ప్రయాణిస్తున్న వాహనాన్ని నిరసనకారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మమతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘చోర్’ అంటూ విమర్శలు చేసినట్లు సమాచారం. అనంతరం ఆమె కారుపై బురద, చెప్పులు, రాళ్లు, ఇటుకలు విసిరినట్లు తెలుస్తోంది. బిర్జూ అనే టీఎంసీ కార్యకర్తను ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు కస్టడీలో ఉన్న సమయంలోనే అతడు మృతి చెందాడు. తన భర్తను లాకప్‌లో పోలీసులు కొట్టడం వల్లే మరణించారని బిర్జూ భార్య ఆరోపించారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు మమతా బెనర్జీ అక్కడికి బయలుదేరారు. ఆమె వెంట టీఎంసీ ఎంపీలు కల్యాణ్ బెనర్జీ, డోలా సేన్ కూడా ఉన్నారు. Read Also : Moto G06 Power Price : ఇది కదా డిస్కౌంట్.. ఈ మోటోరోలా G06 పవర్ ఫోన్ జస్ట్ రూ. 14వేలకే.. ఘటనపై మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. తన కారుపై రాళ్లు, ఇటుకలతో దాడి చేశారని, చెప్పులు, బురద కూడా విసిరారని ఆరోపించారు. రాయి తలకు తగిలి ఉంటే తన ప్రాణాలకు ప్రమాదం జరిగేదని ఆందోళన వ్యక్తం చేశారు. తాను వస్తున్న విషయం పోలీసులకు ముందుగానే తెలిసినా తగిన భద్రత కల్పించలేదని ఆరోపించారు. తనను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని, దీని వెనుక కుట్ర ఉందని ఆమె ఆరోపించారు. మరోవైపు బీజేపీ మాత్రం మమతా బెనర్జీ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఉద్రిక్తతలను పెంచేందుకే ఆమె అక్కడికి వెళ్లారని విమర్శించింది. ఆమె రాకను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారని పేర్కొంది. దీంతో టీఎంసీ కార్యకర్త మృతి వ్యవహారం మరోసారి పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది