
పేదలకు ఆర్థిక భరోసాయే లక్ష్యం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ
P Gannavaram: పేదలకు ఆర్థిక భరోసాయే లక్ష్యం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ! ఈ వార్తకు సంబంధించిన

P Gannavaram: పేదలకు ఆర్థిక భరోసాయే లక్ష్యం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ! ఈ వార్తకు సంబంధించిన

సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మత్స్యకారుల ఆచూకీ తెలిసే వరకు అన్ని మార్గాల్లోనూ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని ఆయన తేల్చిచెప్పారు. స్పోర్ట్స్ డెస్క్: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడలరేవు నుంచి 'ముత్యాలమ్మ' (IND-AP-E8-MO-135) బోటులో ఆగస్టు 3న చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన సంగతి తెలిసిందే. ఒడిశాలోని పారాదీప్ తీరం వద్ద ఒక పసుపు రంగు బోటును అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై తాజాగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. మత్స్యకారులను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చే వరకు అన్ని మార్గాల్లోనూ సెర్చ్ ఆపరేషన్ ఆపే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. ఈ గాలింపు చర్యల కోసం ఏకంగా 5 నౌకలు, 2 డోర్నియర్ విమానాలు, ఒక ప్రత్యేక హెలికాప్టర్‌ను రంగంలోకి దించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గల్లంతైన బోటు వివరాలను మయన్మార్, పోర్ట్‌బ్లెయిర్, బంగ్లాదేశ్ కోస్ట్‌గార్డ్ అధికారులకు కూడా పంపించామని, సరిహద్దు తీరప్రాంతాల్లోనూ అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. కేంద్ర కోస్ట్‌గార్డ్, నేవీ అధికారులతో ప్రభుత్వం నిరంతరం సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తోందని తెలిపారు. ఈ నెల 24 తర్వాత కొత్త అధికారి బాధ్యతలు చేపట్టినప్పటికీ గాలింపు చర్యలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. మత్స్యకారుల కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం వారి రక్షణకు అన్ని విధాలుగా కట్టుబడి ఉందని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా కల్పించారు. అన్నవరం బస్టాండ్‌లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు.. అమరావతిలో SBI సిబ్బంది నివాస గృహ సముదాయానికి కీలక ముందడుగు

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఒక సంచలనాత్మక ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ఆలమూరులోని యూనియన్ బ్యాంక్ శాఖలో రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న గానుగపెంట సుప్రియ (28) ఆకస్మికంగా అదృశ్యమవ్వడం ఇప్పుడు తీవ్ర మిస్టరీగా మారింది. విధి నిర్వహణలో ఉన్న యువతి ఒక్కసారిగా మాయమవ్వడం, ఆమె వస్తువులు పంట కాలువ వద్ద లభించడంతో కోనసీమ వ్యాప్తంగా ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది.ఈనెల 17వ తేదీన ఎప్పటిలాగే విధులకు హాజరైన సుప్రియ, తన మొబైల్ ఫోన్‌ను బ్యాంక్‌లోనే వదిలిపెట్టి బయటకు వెళ్లిపోయింది. ఎంతసేపటికీ ఆమె తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన సిబ్బంది, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో ఆలమూరు మండలం చొప్పెల్ల లాకుల సమీపంలో సుప్రియకు చెందిన స్కూటీ, చెప్పులు, కళ్లజోడు పడి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. బ్యాంకులో విధుల్లో ఉన్న వ్యక్తి ఫోన్ కూడా తీసుకెళ్లకుండా, కేవలం తన వస్తువులను లాకుల వద్ద వదిలివెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. అమ్మాయిల అదృశ్యం వెనుక ఫ్రీ ఫైర్ గేమ్.. పేరెంట్స్ జాగ్రత్త!కాలువల్లో తీవ్రంగా గాలింపు.. రంగంలోకి ఎస్డీఆర్ఎఫ్ దళాలు!చొప్పెల్ల లాకుల వద్ద లభించిన ఆధారాల ఆధారంగా సుప్రియ పంట కాలువలో దూకి ఉంటే ఏమోనన్న ప్రాథమిక అనుమానంతో పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. మొదట స్థానిక గజ ఈతగాళ్లతో కాలువను జల్లెడ పట్టించినప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో ఘటన తీవ్రతను గుర్తించిన జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు ఎస్టీఆర్ఎఫ్ ప్రత్యేక బృందాలు రెస్క్యూ ఆపరేషన్లోకి దిగాయి. రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్. విద్యాసాగర్, ఆలమూరు ఎస్సై నరేష్ ల పర్యవేక్షణలో చొప్పెల్ల లాకులకు అనుసంధానంగా ఉన్న అన్ని పంట కాలువల్లో అత్యాధునిక పరికరాలతో గాలింపు ముమ్మరం చేశారు.జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో మరో ట్విస్ట్.. కారుపై మాట మార్చిన తాత! పోలీసులకు సవాల్‌గా మారిన

సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ఎప్పటికప్పుడు గాలింపు చర్యలకు సంబంధించిన వివరాలు తెలియచేస్తూ ఉండాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అమరావతి, ఆగస్టు 19: సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ఎప్పటికప్పుడు గాలింపు చర్యలకు సంబంధించిన వివరాలు తెలియచేస్తూ ఉండాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన కోనసీమ జిల్లాలోని మత్స్యకారుల గాలింపు చర్యలపై సీఎం చంద్రబాబు బుధవారం ఆరా తీశారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతోపాటు ఉన్నతాధికారులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు వర్చువల్‌గా సమావేశమయ్యారు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీని కనుగొనేందుకు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఈ సందర్భంగా వారిని ఆదేశించారు. గాలింపు చర్యలు ఏ మేరకు జరుగుతున్నాయని వారిని సీఎం అడిగి తెలుసుకున్నారు. మత్స్యకారుల ఆచూకీ కోసం కోస్ట్ గార్డ్స్, మెరైన్ పోలీసులు గాలిస్తున్నారని సీఎంకు వారు వివరించారు. జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు గాలింపు చర్యలను పర్యవేక్షిస్తోందని తెలిపారు. ఇప్పటికే రెండు డార్నియర్ విమానాలు, నేవీ బోట్లతో పాటు మరో ఏడు బోట్లతో గాలింపు చర్యలు చేపట్టామని ఉన్నతాధికారులు వివరించారు. పారాదీప్‌కు 14 నాటికల్ మైళ్ల దూరంలో కొన్ని పడవలను గుర్తించామని.. వాటి గురించి ఆరా తీస్తున్నామని చెప్పారు. కాకినాడ, భైరవపాలెం, విశాఖపట్నం, పారాదీప్ ప్రాంతాలకు చెందిన మత్స్యకారులను కూడా అప్రమత్తం చేసి గల్లంతైన బోటు ఆచూకీపై సమాచారం సేకరిస్తున్నట్లు సీఎం చంద్రబాబు దృష్టికి ఉన్నతాధికారులు తీసుకెళ్లారు. వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్-1 అక్రమాలపై కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు తివాచీని ఇలా కూడా ఉతుకుతారా? వీడియో వైరల్

Mamidikuduru: మామిడికుదురు మండలం నగరంలో ఘనంగా మాసుమే కుమ్ షహదత్! Mamidikuduru: అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరంలో ఎనిమిదవ ఇమామ్ హజరత్ ఇమామ్ రజా సోదరి మాసుమే కుమ్ షహదత్ (వర్ధంతి) సందర్భంగా భక్తిశ్రద్ధలతో సంతాప కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని మంజలే కర్బలా పంజా వద్ద మజిలిస్ నిర్వహించారు. కర్బలా చరిత్రలో హజరత్ ఇమామ్ హుస్సేన్ పవిత్ర పోరాటంలో ఉపయోగించిన గుర్రం ‘జుల్ జన’ను స్మరించుకుంటూ సంతాప కార్యక్రమం చేపట్టారు. మత ప్రబోధకులు హుసేని రిజ్వీ మజ్లిస్ నిర్వహించారు. అంజుమన్ ఏ పర్వానయే హుస్సేన్ భక్త బృందం ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నగరంలోని పెదపంజీషా వరకు భక్త బృందం మాతం నిర్వహించింది. గుమ్మటం అనంతరం కూడా మాతం కార్యక్రమం కొనసాగింది. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి హజరత్ ఇమామ్ హుస్సేన్ కుటుంబ సభ్యులకు శ్రద్ధాంజలి ఘటించారు

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పుంగనూరు ఆవులకు, గిత్తలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒంగోలు గిత్త తర్వాత అంతటి క్రేజ్ వీటి సొంతం. అతి చిన్న పరిమాణంలో ఉండే ఈ అరుదైన జాతి పశువులకు దేశవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది. తాజాగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఒక పుంగనూరు గిత్త భారీ ధరకు అమ్ముడై సరికొత్త రికార్డ్ సృష్టించింది. కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మాచవరం గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ డెయిరీ ఫారం నిర్వహిస్తున్నారు. ఆయన తన ఫారంలో ఎంతో అరుదైన పుంగనూరు జాతి గిత్తను అపురూపంగా పెంచుతున్నారు. ఈ క్రమంలోనే చెన్నైకి చెందిన నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు, డెయిరీ సర్వీసెస్ ప్రతినిధులు ఈ గిత్తపై కన్నేశారు. చెన్నైలో పుంగనూరు జాతి సంతతిని మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వారు నేరుగా అంబాజీపేటలోని మాచవరానికి వచ్చారు. ప్రేమ్ కుమార్ వద్ద ఉన్న ఆ గిత్తను పరిశీలించి, దాని ధరను రూ.3.75 లక్షలుగా నిర్ణయించి కొనుగోలు చేశారు. ఈ గిత్త కేవలం మూడున్నర సంవత్సరాల వయసు కలిగి ఉండి, సరిగ్గా 34 అంగుళాల ఎత్తుతో చాలా ఆకర్షణీయంగా ఉంది. పొట్టిగా, చూడముచ్చటగా ఉండే ఈ పుంగనూరు గిత్తను చెన్నైకి తరలించారు. అరె.. గిత్త పొట్టిదేకానీ.. ధరలో మాత్రం మహా గట్టది సుమా..అంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు. బర్త్‌డే కేక్‌లో చచ్చిన బల్లి.. 11 మంది ఆసుపత్రిపాలు! రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఒకేసారి 5 అదిరిపోయే పథకాలు! అది ఇల్లా.. బంగారు గనా..! రెనోవేషన్ చేస్తుండగా కుప్పలు తెప్పలుగా పడిన బంగారం మీ చెప్పులు పోయాయా.. అయితే చాట్ జీపీటీని అడగండి.. ఇట్టే దొరికేస్తాయ్

Amalapuram: అమలాపురంలో కలకలం బట్టల అలమరలోకి దూరిన గోధుమ తాచుపాము! అమలాపురం: అమలాపురం పట్టణంలోని గొల్లగూడెం, కృష్ణుడి గుడి పక్కన ఉన్న రోడ్డులో ఓ ఇంట్లోకి పాము ప్రవేశించడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. మందపాటి మూర్తి నివాసంలో అద్దెకు ఉంటున్న కుటుంబ సభ్యులు బట్టలు సర్దుకునేందుకు ఆలమర తెరవగా అందులో గోధుమ తాచుపాము కనిపించింది. ఒక్కసారిగా పాము కనిపించడంతో వారు భయంతో బయటకు పరుగులు తీశారు.వెంటనే స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న గణేష్ వర్మ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని,జాగ్రత్తగా పామును పట్టుకున్నారు.అనంతరం పామును సురక్షితంగా డబ్బాలో బంధించారు. ఈ సందర్భంగా స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ మాట్లాడుతూ కోనసీమ ప్రాంతంలో ప్రస్తుతం పాముల సంచారం ఎక్కువగా కనిపిస్తోందని తెలిపారు.ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని,బట్టలు,సామగ్రి కదిలించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఇళ్లలోకి పాములు ప్రవేశించినప్పుడు ప్రజలు భయపడి వాటిని చంపే ప్రయత్నం చేయకుండా,వెంటనే స్నేక్ క్యాచర్లకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని అక్కడ ఉన్న ప్రజలకు గణేష్ వర్మ కోరారు

Odalarevu: ఓడలరేవు వద్ద సముద్రంలో గల్లంతైన 7 గురు మత్స్యకారుల కోసం గాలింపు ఈ వార్తకు సంబంధించిన

దేశంలో కొబ్బరి అంటే గుర్తొచ్చే పేరు కోనసీమ అని.. ఆ జిల్లాకు తాను ఇన్‌ఛార్జి మంత్రిగా వ్యవహరిస్తున్నానని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాలువల్లో తట్టమట్టి కూడా తీయకపోవడం వల్ల సముద్రం నీరు వెనెక్కి వచ్చి చెట్టు ఉన్నపళంగా కుంగిపోయిందని చెప్పుకొచ్చారు. అమరావతి, ఆగస్టు 18: దేశంలో కొబ్బరి అంటే గుర్తొచ్చే పేరు కోనసీమ అని.. ఆ జిల్లాకు తాను ఇన్‌ఛార్జి మంత్రిగా వ్యవహరిస్తున్నానని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఏపీ శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కొబ్బరి సాగుకు సంబంధించి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అడిగిన ప్రశ్నలకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చారు. కొబ్బరి సాగులో 10వేల హెక్టార్లలోని కొబ్బరితోటలు కాలం చెల్లినవి ఉన్నాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాలువల్లో తట్టమట్టి కూడా తీయకపోవడం వల్ల సముద్రం నీరు వెనెక్కి వచ్చి చెట్టు ఉన్నపళంగా కుంగిపోయిందని చెప్పుకొచ్చారు. ప్రతి చెడిపోయిన మొక్కకు వెయ్యి సాయం చేసి కొత్తమొక్కలు పెట్టించాలని ప్రతిపాదన ఉందన్నారు. డ్రెయిన్లు శుభ్రం చేయకపోతే ఎంత పెట్టుబడి పెట్టినా, కొత్త మొక్కలు నాటినా ఫలితాలు ఉండవని మంత్రి తెలిపారు. అందుకే మొదటి దశలో శంఖరగుప్తం కాలువ పూడిక తీస్తే రెండు, మూడు నియోజకవర్గాల్లో సమస్య పరిష్కారమవుతుందన్నారు. కొత్త ప్లాంటేషన్‌కు వీబీ రాంజీ పథకం కింద కేంద్రంలోని కోకో బోర్డు ద్వారా ఆర్థిక సాయం అందజేస్తున్నామని ప్రకటించారు. మొత్తం ఒక ప్రాజెక్ట్ రూపంలో తీసుకొని కోనసీమలో కొత్తమొక్కలు పెట్టిస్తామమని చెప్పారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చెప్పినట్లు అంతర పంటలు వేయాలని రైతులకు సూచించారు. కొబ్బరితోటల్లో కోకో, అరటి, అంతర పంటలు వేయొచ్చని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమాన్ని సక్రమంగా అమలు అయ్యేలా చూస్తున్నామని, రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఏపీ మండలిలో పోడియం వద్ద బల్లలు చరుస్తూ వైసీపీ ఆందోళన.. సభ వాయిదా స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు: మంత్రి మండిపల్లి రాంప్రసాద్

కోనసీమ జిల్లాలో మత్స్యకారుల గల్లంతు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అమరావతి, ఆగస్టు 18: బీ.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని ఓడలరేవు, దుమ్మలపేట, వాసలతిప్ప గ్రామానికి చెందిన మత్స్యకారుల బోటు సముద్రంలో గల్లంతైన ఘటనపై సీఎంఓ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబానాయుడు సమీక్ష జరిపారు. బోటులో ఉన్న ఎనిమిది మంది మత్స్యకారుల ఆచూకీ కోసం చేపడుతున్న గాలింపు చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గల్లంతైన బోటు, మత్స్యకారుల ఆచూకీ లభించే వరకూ గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఆగస్టు 3న ఉదయం 10 గంటల సమయంలో ఓడలరేవు జెట్టి నుంచి మత్య్సకారుల బోటు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిందని అధికారులు వివరించారు. ఉదయం 11 గంటల వరకు కుటుంబసభ్యులతో ఫోన్ ద్వారా సంబంధాలు కొనసాగగా, ఆ తర్వాత ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు. బోటులో వీఎచ్ఎఫ్ సెట్‌తో పాటు మత్స్యకారుల వద్ద మొబైల్ ఫోన్లు కూడా ఉన్నట్లు వివరించారు. అదే రోజు సుమారు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో బోటు చేపల వేట ప్రాంతానికి చేరుకుని ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 12వ తేదీ నాటికి బోటు తిరిగి రావాల్సి ఉన్నా రాలేదని... దీంతో వెంటనే ఆచూకీ కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టామని అధికారులు చెప్పారు. కోస్ట్‌గార్డ్ నౌకలను అప్రమత్తం చేసి గాలింపు చేపడుతున్నట్లు కోస్ట్‌గార్డ్ కమాండెంట్ తెలిపినట్లు వివరించారు. బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. రెండో రోజుకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

Amaravati: సముద్రంలో 8 మంది మత్స్యకారుల గల్లంతు సీఎం చంద్రబాబు సమీక్ష! Amaravati: సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన ఎనిమిది మంది మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరమయ్యాయి. బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని ఓడలరేవు, దుమ్మలపేట, వాసలతిప్ప గ్రామాలకు చెందిన మత్స్యకారులు ప్రయాణిస్తున్న బోటు ఆగస్టు 3 నుంచి కనిపించకుండా పోవడంతో వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎంఓ అధికారులతో సమీక్ష నిర్వహించి, మత్స్యకారుల సురక్షిత ఆచూకీ కోసం అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను వినియోగించాలని ఆదేశించారు. ఆగస్టు 3న ఉదయం 10 గంటల సమయంలో మత్స్యకారుల బోటు ఓడలరేవు జెట్టి నుంచి చేపల వేట కోసం సముద్రంలోకి బయలుదేరింది. బోటు సముద్రంలోకి వెళ్లిన తర్వాత ఉదయం 11 గంటల వరకు కుటుంబ సభ్యులతో ఫోన్ ద్వారా సంబంధాలు కొనసాగాయి. ఆ తర్వాత ఒక్కసారిగా వారి నుంచి ఎలాంటి సమాచారం అందకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. బోటులో వీఎచ్ఎఫ్ సెట్‌తో పాటు మత్స్యకారుల వద్ద మొబైల్ ఫోన్లు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అదే రోజు సాయంత్రం 6 గంటల సమయంలో బోటు నిర్దేశిత చేపల వేట ప్రాంతానికి చేరుకుని ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. సాధారణంగా చేపల వేట ముగించుకుని ఆగస్టు 12 నాటికి బోటు తిరిగి రావాల్సి ఉంది. అయితే నిర్ణీత సమయం దాటినా బోటు తిరిగి రాకపోవడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. మత్స్యకారుల ఆచూకీ కోసం ప్రత్యేక గాలింపు చర్యలు ప్రారంభించారు. గల్లంతైన బోటు కోసం కోస్ట్‌గార్డ్ నౌకలను రంగంలోకి దించారు. సముద్రంలో విస్తృతంగా గాలింపు చేపడుతున్నారు. మరోవైపు కాకినాడ, భైరవపాలెం, విశాఖపట్నం, పారాదీప్ ప్రాంతాలకు చెందిన మత్స్యకారుల బోట్లను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లే ఇతర బోట్ల నుంచి గల్లంతైన బోటుకు సంబంధించి ఏమైనా సమాచారం లభిస్తుందా

అల్లవరం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మత్స్యకారుల బోటు గల్లంతైంది. అల్లవరం మండలం ఓడలరేవు గ్రామానికి చెందిన ఏడుగురు మత్స్యకారులు ఈ నెల 3న ఓడలరేవు తీరం నుంచి సముద్రంలో వేటకు వెళ్లారు. వేటకు వెళ్లిన మత్స్యకారులు గంట తర్వాత నుంచి స్థానికులకు అందుబాటులోకి రాలేదు. వేట ముగించుకుని పది రోజుల్లో రావాల్సిన వారు.. ఇప్పటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగుతోంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

Amalapuram: అమలాపురం కలెక్టరేట్లో ఘనంగా గౌతు లచ్చన్న జయంతి! Amalapuram: అణగారిన, బడుగు వర్గాల ఆశాజ్యోతి, స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక ఉద్యమకారుడు సర్దార్ గౌతు లచ్చన్న సేవలు చిరస్మరణీయమని ఏపీ శెట్టిబలిజ సంఘం అధ్యక్షుడు బొంతు గంగాధర్ రావు అన్నారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం అమలాపురం కలెక్టరేట్లోని వివేకానంద సమావేశ మందిరంలో గౌతు లచ్చన్న జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో బొంతు గంగాధర్ రావు మాట్లాడుతూ.. స్వాతంత్ర్యోద్యమంలో గౌతు లచ్చన్న కీలక పాత్ర పోషించారని, బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన మహనీయుడని కొనియాడారు. సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. జిల్లా పరిపాలన అధికారి నాగలక్ష్మమ్మ మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలు, రైతులు, కార్మికులు, పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం గౌతు లచ్చన్న చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చూపిన మార్గాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సమాజ అభ్యున్నతి కోసం గౌతు లచ్చన్న చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి పి. భగవాన్, రామచంద్రాపురం బీసీ వెల్ఫేర్ అసిస్టెంట్ కేఎన్ దొర, శెట్టిబలిజ సంఘం సభ్యులు కడలి వెంకటేశ్వరరావు, గొల్లపల్లి ధర్మారావు, కట్ట జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు

ప్రతిసారీ వీకెండ్ వస్తే చాలు.. రొటీన్ మాల్స్, సినిమా థియేటర్లు, ట్రాఫిక్ గొడవలతో చిరాకు వస్తోందా? కొద్దిరోజులు ల్యాప్‌టాప్‌లు, ఆఫీస్ డెడ్‌లైన్స్ పక్కనపెట్టి ప్రశాంతమైన ప్రదేశంలో ఫ్రెష్ ఎయిర్ పీల్చాలని ఉందా? అయితే వేల రూపాయలు ఖర్చు పెట్టి కేరళ కోవలం లేదా విదేశాల్లోని మాల్దీవ్స్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ గుండెకాయ లాంటి దిండిబ్యాక్వాటర్స్, అలాగే విజయవాడలోని 'భవానీ ఐలాండ్' సందర్శిస్తే చాలు.. మీకు కచ్చితంగా విదేశీ రిజార్టులో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. చుట్టూ కొబ్బరితోటలు, పచ్చని కొండలు, నీటిపై తేలియాడే హౌస్బోట్లు.. ఒకే ఒక్క ట్రిప్‌తో మీ వారమంతా ఉన్న స్ట్రెస్ దూదిపింజలా ఎగిరిపోతుంది. కోనసీమ ప్రాంతంలోని దిండి వద్ద రాజమండ్రి/అమలాపురం పరిసరాల్లో ప్రవహించే గోదావరి పాయలు, నీలిరంగు బ్యాక్‌వాటర్స్ అచ్చం కేరళ ఆలేప్పి తరహాలోనే ఉంటాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, ప్రైవేట్ రిసార్టులు నడిపే హౌస్‌బోట్ ప్రయాణం ఈ ట్రిప్ సూపర్ ఉంటుంది. గంటల తరబడి నీటిపై ప్రయాణిస్తూ, ఏకాంతంగా డెక్ మీద కూర్చుని చల్లటి గాలిని ఆస్వాదిస్తుంటే వచ్చే కిక్కే వేరబ్బా. బోట్లోనే ఏపీ స్పెషల్ ఘుమఘుమలాడే వెజ్ అండ్ నాన్ వెజ్ భోజనం ఆస్వాదించవచ్చు. ఫ్యామిలీతో లేదా లైఫ్‌పార్ట్‌నర్‌తో కలిసి నైట్ స్టే చేయడానికి కూడా ఈ హౌస్బోట్లు అందుబాటులో ఉంటాయి. ఒకవేళ మీరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉంటే, ప్రకాశం బ్యారేజీ బ్యాక్‌వాటర్స్‌లోని భవానీ ఐలాండ్ మీకు రివర్ ఐలాండ్ అనుభూతిని ఇస్తుంది. భారతదేశంలోనే అతిపెద్ద నదీ ద్వీపాల్లో ఒకటైన ఈ ఐలాండ్‌కు వెళ్లాలంటే పున్నమి ఘాట్ నుంచి 6 నిమిషాల బోట్ జర్నీ చేయాలి. కృష్ణానది నీటి నడుమ పచ్చని చెట్లు, మడ అడవుల మధ్య ఉండే ఈ ద్వీపం ఒక మినీ వాటర్ పార్క్‌లా ఉంటుంది. కుటుంబంతో కలిసి వీకెండ్ స్పెండ్ చేయడానికి రిసార్టులు, సైక్లింగ్ ట్రాక్‌లు, రివర్ వాటర్ స్పోర్ట్స్, కయాకింగ్ వంటి అనేక అడ్వెంచర్ రిక్రియేషన్స్

Razole: తాళం వేసిన ఇంట్లో దొంగల హల్చల్ రాజోలులో కేసు నమోదు! ఈ వార్తకు సంబంధించిన