
అల్లవరం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మత్స్యకారుల బోటు గల్లంతైంది. అల్లవరం మండలం ఓడలరేవు గ్రామానికి చెందిన ఏడుగురు మత్స్యకారులు ఈ నెల 3న ఓడలరేవు తీరం నుంచి సముద్రంలో వేటకు వెళ్లారు. వేటకు వెళ్లిన మత్స్యకారులు గంట తర్వాత నుంచి స్థానికులకు అందుబాటులోకి రాలేదు. వేట ముగించుకుని పది రోజుల్లో రావాల్సిన వారు.. ఇప్పటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగుతోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




