
Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల అలర్ట్.. మూడు రోజులు జాగ్రత్త
Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల అలర్ట్.. మూడు రోజులు జాగ్రత్త
© 2026 nimisham.in

Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల అలర్ట్.. మూడు రోజులు జాగ్రత్త

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడటం, ఇళ్లు కూలిపోవడం, నదులు ఉప్పొంగడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడటం, ఇళ్లు కూలిపోవడం, నదులు ఉప్పొంగడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రాష్ట్రంలో మంగళవారం ఒక్కరోజే వర్ష సంబంధిత ఘటనల్లో 12 మంది మృతి చెందినట్లు స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (SEOC), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) వెల్లడించాయి (Uttarakhand heavy rain). భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) బుధవారం డెహ్రాడూన్, నైనిటాల్, బాగేశ్వర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు (Uttarakhand rain alert). భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి (12 dead Uttarakhand). అల్మోరాలోని ఒడ్యూదా గ్రామంలో తెల్లవారుజామున ఓ ఇంటి గోడ కూలడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ఘటనలో అల్మోరా పట్టణంలోని ధార్కితుని ప్రాంతంలో పాత ఇంటి గోడ కూలి ఇద్దరు నేపాలీ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. డెహ్రాడూన్‌లోని కండోలీ బ్రిడ్జి సమీపంలో భారీగా ప్రవహించిన నీటిలో ఓ కారు కొట్టుకుపోయింది. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మరో మహిళను రక్షించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ

సాక్షి, డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇప్పటివరకూ 12 మంది మృతిచెందినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. వేరు వేరు ఘటనల్లో ఈ మరణాలు సంభివించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో మరికొద్ది రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఈ రోజు బుధవారం డెహ్రాడూన్, నైనిటాల్, బాగేశ్వర్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు కూడా సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో, ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగిన వెంటనే చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండటంతో పాటు అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగాలకు ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షపాతం నమోదైంది. వాటిలో అత్యధికంగా నైనిటాల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. మై లిటిల్ ప్యారడైజ్.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్ (ఫోటోలు) ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్ తీసుకున్న యంగ్ హీరో (ఫోటోలు) పని.. ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు) 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే snake plant ఈ మొక్కలని కిచెన్‌లో పెట్టుకుంటే.. మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజాము వేళల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గంగా మైదాన ప్రాంతాల వైపు కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం బెంగాల్, జార్ఖండ్ పరిసర ప్రాంతాలపై దీని ప్రభావం కొనసాగుతోంది. రాబోయే 48 గంటల్లో ఈ వ్యవస్థ జార్ఖండ్ మీదుగా ఉత్తరప్రదేశ్ వైపు పశ్చిమ-వాయువ్య దిశలో కదిలే అవకాశం ఉందని అంచనా. దీనికి తోడు మధ్య బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు బలంగా కొనసాగుతుండటంతో తెలంగాణతో పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణలో ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే సాయంత్రం తర్వాత వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని పలుచోట్ల మేఘాలు కమ్ముకుంటున్నాయి. ముఖ్యంగా రాత్రి నుంచి తెల్లవారుజాము మధ్య ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. పగటిపూట ఏర్పడుతున్న అధిక వేడి కారణంగా వాతావరణంలో అస్థిరత పెరుగుతుండటం కూడా స్థానికంగా వర్షాలకు కారణమవుతోంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడనుండగా, మరికొన్ని చోట్ల ఒక్కసారిగా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. దక్షిణ, మధ్య, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అదేవిధంగా నారాయణపేట, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో కూడా వర్ష ప్రభావం కనిపించవచ్చని అంచనా. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతుండగా, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ

హిమాలయ దేశం నేపాల్‌ను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా ఉండటంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రధాన నదులు ఉధృతంగా ప్రవహిస్తూ ప్రమాదకర స్థాయికి చేరువయ్యాయి. ఈ నేపథ్యంలో, అధికారులు దేశంలోని మధ్య, పశ్చిమ, తూర్పు ప్రాంతాల ప్రజలకు వరద హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.నేపాల్ హైడ్రాలజీ అండ్ మెటియరాలజీ విభాగం ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ డివిజన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 6 గంటల నాటికి మూడు ప్రధాన నదుల్లో నీటిమట్టాలు హెచ్చరిక స్థాయిని దాటాయి. సింధూలి జిల్లాలోని సన్ కోశీ నది, గూర్ఖా జిల్లాలోని బుధి గండకి నది, దడెల్ధురా జిల్లాలోని మహాకాళి నదుల్లో నీటి ప్రవాహం ఆందోళనకరంగా ఉంది. ఈ నదుల్లో నీటిమట్టం మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.మరోవైపు, లమ్జంగ్ జిల్లాలోని మర్స్యంగ్ది నదిలో ప్రవాహం ఇప్పటికే ప్రమాదకర స్థాయిని దాటింది. నిన్న రాత్రి 11:15 గంటలకు భుకుందెబెసి వాటర్ లెవెల్ మానిటరింగ్ కేంద్రం వద్ద ఈ నది ప్రమాద స్థాయిని దాటినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ నదిలో నీటిమట్టం ఇంకా పెరుగుతూనే ఉందని, ఇది తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ డివిజన్ పేర్కొంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లో వరద ముప్పు ఎక్కువగా ఉందని హెచ్చరించింది.ఈ పరిణామాల నేపథ్యంలో, నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఆర్ఆర్ఎంఏ) ప్రజలకు కీలక సూచనలు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ వారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఎలా ఉండబోతోంది, వర్షాలు పడతాయా లేదా అనే విషయాలపై స్పష్టమైన సూచనలు విడుదల చేసింది. అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు ఈ మేరకు 7 రోజుల వెదర్ రిపోర్టును అధికారికంగా అందించాయి. ప్రస్తుతం ఉన్న రిపోర్టుల ప్రకారం ఈ వారం తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు సంబంధించి పెద్ద ప్రమాదకర హెచ్చరికలేవీ లేవు. అయితే, కొన్ని రోజులు ఉపరితల గాలులు తీవ్రంగా వీచే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం పరిసర ప్రాంతాల్లో వాతావరణం కాస్త భిన్నంగా ఉండబోతోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలతో పాటు యానాం ప్రాంతంలో ఆగస్టు 31 రాత్రి నుండి సెప్టెంబర్ 1 ఉదయం వరకు కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఆ తర్వాత సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 5 వరకు ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయి. ఈ రోజుల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో 40-50 kmph వేగంతో గాలులు వీస్తాయి. సెప్టెంబర్ 5 తర్వాత వర్షాలు ఉన్నప్పటికీ గాలుల హెచ్చరికలు ఏమీ ఉండవు. దక్షిణ కోస్తా ప్రాంతాలైన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లో ఈ వారం మొత్తంలో ఒక్కటి లేదా రెండు చోట్ల మాత్రమే తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాయలసీమ పరిధిలోని చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లా, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో

Heavy Rain Alert : తెలుగు ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. జూలై చివర్లో మాదిరిగానే ఆగస్ట్ ఎండింగ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నాయి. వర్షాల కోసం ఎదురుచూస్తున్న తెలుగు ప్రజలకు ఇవాళ్టి (ఆగస్ట్ 22, శనివారం) నుండి కాస్త ఊరట లభించనుంది... వానలు మొదలవుతాయని ప్రకటించాయి. ముఖ్యంగా ఆగస్ట్ 22 నుండి 26 వరకు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు కూడా చెబుతున్నారు. ప్రస్తుతం పసిఫిక్ మహా సముద్రంలో 2 తుపానులు కొనసాగుతున్నాయి... ఒకటి సాడెల్, ఇంకోటి లాలా. ఇక ఇదే పసిఫిక్ సముద్రంలో రెండు వాయుగుండాలు, 5 అల్పపీడనాలు కూడా ఏర్పడ్డాయని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావం నేరుగా ఇండియాపై లేకపోయినా పరోక్షంగా వర్షాలను ప్రభావితం చేస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో బంగాళాఖాతంలో ఆవర్తనాలు, అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వీటి ప్రభావం తెలుగు రాష్ట్రాలపై నేరుగా ఉంటుంది... వర్షాలు జోరందుకుంటాయి. ఇలా ఆగస్ట్ లాస్ట్ వీక్, సెప్టెంబర్ ఆరంభంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో మంచి వర్షాలే కురుస్తాయని వాతావరణ శాఖలు, నిపుణులు చెబుతున్నారు. ఇవాళ (ఆగస్ట్ 22, శనివారం) ఉదయం నుండి మధ్యాహ్నం వరకు తెలంగాణలో ఎండ, ఉక్కపోత కొనసాగుతుందని వెదర్ మ్యాన్ తెలిపారు. సాయంత్రం ఆకాశంలో మేఘాలు కమ్ముకుని వర్షాలు మొదలవుతాయని... మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో సాయంత్రం లేదా రాత్రి వేళలో వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. ఇక సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, కామారెడ్డి, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో రాత్రి సమయంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ ప్రకటించారు. హైదరాబాద్ విషయానికి

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది . ఆగస్టు 20 నాటికి తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయని ఐఎండీ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తాజా అల్పపీడన ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించిన సమాచారం ప్రకారం, రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి. ఒకవైపు కోస్తాంధ్రలో వర్షాల ప్రభావం కనిపిస్తుండగా, మరోవైపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలుల హెచ్చరికలు జారీ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం వేగంగా మారుతోంది. ఉత్తర, తూర్పు తెలంగాణలోని 13 జిల్లాలకు వాతావరణ శాఖ ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి ప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాల్లో గంటకు బలమైన గాలులు వీచే సూచనలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్, పరిసర ప్రాంతాలలో రోజంతా ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. పగటి సమయం ప్రశాంతంగా గడిచినా, సాయంత్రం లేదా రాత్రి వేళల్లో వాతావరణం చల్లబడే అవకాశం ఉంది. నగరంలోని పలు ప్రాంతాలలో తేలికపాటి వర్షం లేదా చెదురుమదురుగా జల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్‌గాను, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్‌గాను నమోదయ్యే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల రాబోయే రోజుల్లో ఏపీలోని పలు తీరప్రాంత జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌తో పాటు గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయి. రాజధాని అమరావతి - విజయవాడ ప్రాంతాల్లో ఆకాశం ఎక్కువగా మేఘావృతమై ఉండి, తేలికపాటి నుండి మోస్తరు జల్లులు కురిసే

వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తవాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉరుములు మెరుపులతో వర్షాలు కురస్తాయని వెల్లడించింది. ఈ మేరకు కీలక అప్డేట్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం ఉదయం 8 గంటల వరకు పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, భూపాలపల్లి, హనుమకొండ, కామారెడ్డి, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాలలో వర్షాలు భారీగా కురిసే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఈ మేరకు వెదర్ డిపార్ట్మెంట్ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఉత్తరాంధ్ర సహా పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్ష సూచనలు జారీ చేసింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కాగా.. వర్షంతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున చెట్లు, విద్యుత్ స్తంభాలు, బలహీన నిర్మాణాలకు సమీపంలో ఉండకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు సూచించారు

తెలంగాణలో ఆగస్టు 20 వరకు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ప్రత్యేక అప్రమత్తత అవసరం అని అధికారులు సూచించారు. ఈ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. వర్షంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున చెట్లు, విద్యుత్ స్తంభాలు, బలహీన నిర్మాణాలకు సమీపంలో ఉండకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆగస్టు 20 నుంచి 25 వరకు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలు కొనసాగనున్నాయి. అయితే ఈ వ్యవధిలో ప్రత్యేక వాతావరణ హెచ్చరికలు జారీ చేయలేదని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం తెలిపింది. అంటే రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల పరిస్థితి ఉంటుందని చెప్పలేము. ప్రాంతాన్ని బట్టి వర్షాల తీవ్రత మారే అవకాశం ఉంది. కొన్ని చోట్ల సాధారణ జల్లులు పడనుండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రత్యేకంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వాతావరణ మార్పులను గమనిస్తూ స్థానిక అధికారులు ఇచ్చే సూచనలను పాటించడం మంచిది. ఆంధ్రప్రదేశ్‌లోనూ రాబోయే రోజుల్లో వర్షాలు కొనసాగనున్నాయి. ఆగస్టు 18 రాత్రి నుంచి 20 ఉదయం వరకు ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అదే సమయంలో గంటకు 40

పశ్చిమ- మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఒడిశా తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. మరింత విస్తరిస్తోంది. దీని ప్రభావంతో అక్కడక్క నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని, తీర ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.తాజా సమాచారం ప్రకారం.. ఈ వాయుగుండం ప్రస్తుతం బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్‌లోని బాంకురాకు 132, ఒడిశాలోని బాలేశ్వర్‌కు 1590 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. క్రమంగా భూభాగం వైపు ప్రయాణించే కొద్దీ ఆయా రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చు. దీని ప్రభావం ఉత్తరాంధ్ర సరిహద్దు జిల్లాలపై స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర తీరంలో వాతావరణం వేగంగా మారుతోంది.ఈ మార్పుల వల్ల రానున్న రెండు రోజుల పాటు ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు ఉత్తరాంధ్ర జిల్లాల తీరం వెంబడి గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. సముద్రం అలజడికి గురయ్యే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలో వేటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.భారత్ ను చూసి నేర్చుకోండి- అర్జంట్ గా ఆ బిల్లు తీసుకురండిశ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ ఓ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షపాతం నమోదు కావొచ్చు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల వద్ద గానీ ఆశ్రయం పొందవద్దని పేర్కొంది.తిరుమలలో శరవేగంగా.. : టీటీడీ తక్షణ ఆదేశాలు జారీ

బంగాళాఖాతంలో వెదర్ సీన్ సడెన్‌గా మారిపోయింది. వాయవ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా - పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం మరింత బలంగా మారి తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది. ఇది రాబోయే 24 గంటల్లో వాయవ్య దిశగా పయనిస్తూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) స్పష్టం చేసింది. తుపానులు వచ్చే అవకాశాలను కూడా ప్రస్తావించింది. ఈ ప్రభావంతో తూర్పు, మధ్య భారతంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ వాతావరణం పూర్తిగా కూల్ అయింది. ఈ తీవ్ర వాయుగుండం ప్రభావం ఉత్తర కోస్తాంధ్రపై స్పష్టంగా కనిపిస్తోంది. రానున్న నాలుగైదు రోజుల పాటు ఉత్తరాంధ్ర తీరం వెంట గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో భయంకరమైన ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారి పెద్ద ఎత్తున అలలు ఎగసిపడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే వేటకు వెళ్లిన జాలర్లు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సురక్షిత ప్రాంతాలకు, తీరానికి తిరిగి రావాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. అల్పపీడనం, రుతుపవన ద్రోణి కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పోలవరం, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది. అలాగే, మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. అలాగే మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, మార్కాపురం, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉంది. ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్ దాకా నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణలోనూ వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. వాయవ్య బంగాళాఖాతం నుంచి విస్తరించిన రుతుపవన

వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఇది రాబోయే 24 గంటల్లో వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో బంగాళాఖాతంలోని వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. దీని ప్రభావం ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలపై ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. పలు చోట్ల ఆకాశం మేఘావృతమై వర్షాలు కురిసే పరిస్థితులు ఏర్పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో వాతావరణం మరింత చురుగ్గా మారనుంది. వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంతో పాటు ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సముద్రంలో అలలు ఉధృతంగా ఎగసిపడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు. వాతావరణ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు సముద్ర కార్యకలాపాల విషయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వానలు పడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పోలవరం, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశం, మార్కాపురం, చిత్తూరు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం కూడా వాతావరణ వ్యవస్థ ప్రభావం కొనసాగనుంది. ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదే సమయంలో లోతట్టు ప్రాంతాల

వర్షాల పై బిగ్ అప్డేట్. ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకున్న వేళ వర్షాల పైన కీలక సమాచారం అందుతోంది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ శాఖ అలర్ట్స్ జారీ చేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.తెలుగు రాష్ట్రాలకు వర్షాల పై విపత్తుల నిర్వహణ శాఖ కీలక సమాచారం అందిస్తోంది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ - ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది రాబోయే 24 గంటల్లో వాయువ్య దిశగా కదులుతూ బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదే సమయంలో తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంటుందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. తిరుమలకు వచ్చే భక్తులకు TTD ఛైర్మన్ కీలక విజ్ఞప్తి - ఇలా ప్లాన్ చేసుకోండి..!!పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీకాగా, పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలతోపాటు.. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు చెట్ల కింద నిలబడవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అదే విధంగా తెలంగాణలో ని పలు జిల్లాలకు వర్షాల పైన అప్డేట్ వచ్చింది. సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ, జనగామ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతోపాటు పలు ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గాలుల వేగం బాగా పుంజుకుంటోంది. ఏపీ, తెలంగాణ ప్రజలు ఈ వాతావరణ మార్పుల పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అకస్మాత్తుగా వర్షాలు వుంటాయని తెలిపింది. ఆదివారంతో పాటు రాబోయే వారంలో ఏపీ, తెలంగాణలలో వెదర్ ఎలా వుంటుందో ఇక్కడ తెలుసుకుందాం. బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం, అల్పపీడన పరిస్థితులు ఉన్నప్పటికీ మన రాష్ట్రాలపై దాని ప్రభావం చాలా తక్కువగా ఉండబోతోంది. ఈ అల్పపీడనం ఇవాళ బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దుల వైపు తీరం దాటే అవకాశం ఉండటంతో, భయంకరమైన వర్షాలన్నీ అక్కడే కురుస్తాయి. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష ముప్పు లేదు. కానీ, దీని ప్రభావం వల్ల రెండు రాష్ట్రాల్లో చల్లటి బలమైన గాలులు వీస్తాయి. అక్కడక్కడ వర్షాలే పడతాయి. కాబట్టి సండే ప్రయాణాలు చేసేవారికి, టూరిస్ట్ ప్లేసులను విజిట్ చేసేవారికి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. రుతుపవనాల కాలం అయినప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడానికి ప్రధాన కారణం 'ఎల్‌నినో' బలం పెరగడమే. దీనివల్ల నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో తీవ్రంగా బలహీనపడ్డాయని అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు స్పష్టం చేశాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 16 నుంచి 21 వరకు కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, యానాం, తెలంగాణలో ఒకటి రెండు చోట్ల మాత్రమే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. వాయువ్య బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 5.8 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో భారీ వర్షాలు కురుసే అవకాశాలు కూడా లేకపోలేదు. వివిధ శాటిలైట్ డేటాని గమనిస్తే, ఏపీ, తెలంగాణ ఆకాశంలో రోజంతా మేఘాలు పరుగులు తీస్తూ కనిపిస్తాయి. తెలంగాణ వాతావరణం: ఉత్తర తెలంగాణలో

భారీ వర్షాలతో ఇగ్వాజు జలపాతం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. సముద్రపు అలలను తలపించేలా నీరు దూసుకొస్తున్నా.. కొందరు పర్యాటకులు మాత్రం వంతెనపై నిలబడి ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. ఈ భయానక దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ఇగ్వాజు జలపాతం వద్ద ప్రకృతి ఎంత శక్తివంతంగా మారుతుందో కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. భారీ వర్షాల అనంతరం ఇగ్వాజు జలపాతంలో నీటి ప్రవాహం ఒక్కసారిగా ఉధృతంగా మారింది. సాధారణంగా అందమైన పర్యాటక ప్రాంతంగా కనిపించే జలపాతం.. ఈసారి భారీ వరద ప్రవాహంతో భయానకంగా దర్శనమిచ్చింది. నీరు గోధుమ, తెలుపు రంగుల్లో అత్యంత వేగంగా కిందకు దూసుకెళ్తుండగా.. చుట్టూ ఎటుచూసినా భారీ నీటి ప్రవాహమే కనిపిస్తోంది. ఇంతటి ప్రమాదకర పరిస్థితుల్లోనూ కొంతమంది పర్యాటకులు వంతెనపై నిలబడి ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ కనిపించడం వీక్షకులను మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. అర్జెంటీనా-బ్రెజిల్ సరిహద్దులో ఉన్న ఇగ్వాజు జలపాతం ప్రపంచంలోని ప్రసిద్ధ జలపాత వ్యవస్థల్లో ఒకటి. ఇది ఒకే జలపాతం కాకుండా సుమారు 2.7 కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన 275కు పైగా చిన్న, పెద్ద జలపాతాల సమాహారం. ఇందులో అత్యంత ప్రసిద్ధమైన భాగం ‘గార్గాంటా డెల్ డియాబ్లో’ లేదా ‘డెవిల్స్ థ్రోట్’. వర్షాకాలంలో ఇక్కడ నీటి ప్రవాహం భారీగా పెరుగుతుంది. భారీ వర్షాలు కురిసినప్పుడు ప్రశాంతంగా కనిపించే జలపాతం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చుతుంది. ఈ వైరల్ వీడియోలోనూ నీటి ప్రవాహం సాధారణం కంటే అనేక రెట్లు బలంగా కనిపిస్తోంది. ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిని చూస్తేనే ప్రకృతి శక్తి ఎంతటి ప్రమాదకర స్థాయికి చేరగలదో అర్థమవుతోంది. ఈ వీడియో @FLCons అనే సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేశారు. వీడియోలో.. జలపాతం ఉగ్రరూపంలో ఉన్నప్పటికీ కొంతమంది పర్యాటకులు వంతెనలు, నడకదారుల వద్ద నిలబడి ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్న దృశ్యాలు నెటిజన్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నీటి ప్రవాహం అంత బలంగా

Heavy Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో నేడు (ఆగస్ట్ 15, శనివారం) భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అంతకంతకు బలపడుతూ వాయుగుండంగా మారిందని ప్రకటించింది. ఇది ఇప్పటికే తీరం దాటి దేశవ్యాప్తంగా భారీ వర్షాలను కురిపిస్తోంది... ఇలా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా స్వాతంత్య్ర దినోత్సవం రోజున భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగాలు ప్రకటించాయి. వాయుగుండం ప్రభావంతో రుతుపవనాలు కూడా చురుగ్గా మారాయి... ఇలా వాతావరణం అనుకూలంగా మారడంతో గత కొన్నిరోజులుగా నిర్మలంగా ఉన్న ఆకాశం నేడు నల్లని మబ్బులతో నిండిపోతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆగస్ట్ 15న పలు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తోంది... ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు ఉంటాయంటోంది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్ర ప్రదేశ్ పై వాయుగుండం ప్రభావం ఉంటుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అంటే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించింది. ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిస అవకాశాలుంటాయి కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని APSDMA సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఎఫెక్ట్ ఒడిశా, చత్తీస్ ఘడ్ తో పాటు గంగానది పరివాహక రాష్ట్రాల్లో గట్టిగా ఉంటుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కేరళలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఇక ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయలో కూడా వర్షతీవ్రత పెరుగుతుందని IMD హెచ్చరించింది. ఉత్తర ప్రదేశ్ లోని తూర్పు ప్రాంతంలో భారీ వర్షాలుంటాయని... గుజరాత్, గోవా, రాజస్థాన్ లో ఇదే పరిస్థితి ఉంటుందట. హిమాచల్ ప్రదేశ్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన వ్యవస్థ వేగంగా బలపడుతుండటంతో దేశంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ అల్పపీడన ప్రభావంతో తూర్పు, మిడిల్, ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో మోస్తరు నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) స్పష్టం చేసింది. ప్రస్తుతానికైతే ఈ వాతావరణ వ్యవస్థ వాయువ్య దిశగా పయనిస్తూ పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంతో పాటు దానికి ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ వైపు కదిలింది. రాబోయే గంటల్లో ఇది గంగా మైదాన ప్రాంతాలు, జార్ఖండ్ వైపు విస్తరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అల్పపీడనం తీవ్రరూపం దాల్చుతుండటంతో వాతావరణ శాఖ పలు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. పరిస్థితి తీవ్రంగా మారే అవకాశం ఉన్న పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, జార్ఖండ్‌కు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో కొన్ని చోట్ల ఏకంగా 204.5 మిల్లీమీటర్లకు పైగా అత్యంత భారీ వర్షపాతం నమోదు కావచ్చు. ఇక జార్ఖండ్‌లో 115.6 మిల్లీమీటర్ల నుంచి 204.4 మిల్లీమీటర్ల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, రహదారులు మునిగిపోయి రవాణాకు ఆటంకం కలగడం, నదులలో నీటిమట్టం ప్రమాదకరంగా పెరగడం వంటి ముప్పులు పొంచి ఉన్నాయి. కేవలం తూర్పు ప్రాంతాలే కాకుండా దేశంలోని మరో 15కు పైగా రాష్ట్రాలు ప్రస్తుతం ఎల్లో అలర్ట్ పరిధిలో ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, తూర్పు ఉత్తరప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లడఖ్, కేరళ, కొంకణ్-గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్‌లోని కొన్ని భాగాలు, కర్ణాటక, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ ఎంపీలలో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని తెలుస్తోంది. రుతుపవన ద్రోణి చురుకుగా ఉండటంతో పాటు పశ్చిమ అవాంతరం కూడా తోడవడంతో గాలుల వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల

విపత్తుల నిర్వహణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. వాయువ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతం, దానికి ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. ఇది పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య దిశగా జార్ఖండ్ వైపు కదులుతూ ఈరోజు సాయంత్రం లోపు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని.. ఈ ప్రభావంతో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.ఇప్పటికే ఎల్ నినో ప్రభావంతో వానలు రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు సక్రమంగా కురవడం లేదు. ఇక అల్పపీడనం, వాయుగుండం వంటివి బంగాళాఖాతంలో ఏర్పడినప్పుడే వాటి ప్రభావంతో మోస్తరు వానలు పడుతున్నాయి. ఈ సమయంలోనే విపత్తుల నిర్వహణ శాఖ కీలక సమాచారం వెల్లడించింది. బంగాళాఖాతంలో వాయుగుండం బలపడుతోందని.. దీని ప్రభావంతో ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెప్పింది. దీనితో పాటు కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో వర్షం పడే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. కొన్ని జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు వీచే సూచన ఉంది. విశాఖ నుంచి తిరుపతికి కొత్తగా మరో రైలు - రూట్, టైమింగ్స్..!!వాతావరణం పై తాజా అలర్ట్స్రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాలలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని వివరించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలలో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల నుంచి 33 డిగ్రీల వరకు, కనిష్ట ఉష్ణోగ్రతలు 24డిగ్రీల నుంచి 26 డిగ్రీల వరకు నమోదవుతాయని చెప్పింది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. తెలంగాణ వాతావరణం రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం మేఘాలతో కూడి ఉంటుంది. ఉక్కపోత ఉంటుందని చెప్పింది. కొన్నిచోట్ల వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాలలో భారీ వానలు కురిసే ఛాన్స్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి, ఆపై వాయుగుండంగా పరిణామం చెందింది. ఇది రాత్రి సమయంలో బెంగాల్ వద్ద తీరాన్ని దాటింది. తీరం దాటిన ఈ వాయుగుండం ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాయుగుండం సుడి ప్రభావం కొద్దిగా ఏపీ, తెలంగాణ సరిహద్దుల వరకు విస్తరించి ఉంది. అయితే తెలుగు రాష్ట్రాలపై ఈ వాయుగుండం ప్రభావం నేరుగా ఉండదని అధికారులు తెలిపారు. అయినప్పటికీ, దీని వల్ల ఆగస్టు 13న ఇరు రాష్ట్రాల్లోనూ సుడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే, వర్షాలు కురుస్తాయని తెలిపారు. భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించిన సమాచారం ప్రకారం, ఆగస్టు 13 నుండి 18 వరకు తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. అయితే, కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. కోస్తా ఆంధ్ర, యానాం, రాయలసీమ: ఆగస్టు 13, 14 తేదీల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది. అలాగే ఆగస్టు 15, 16 తేదీల్లో గంటకు 30 నుండి 40 కిమీ వేగంతో గాలులు వీస్తాయి. తెలంగాణ: ఆగస్టు 13 నుండి 16 మధ్య కాలంలో రాష్ట్రవ్యాప్తంగా గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆగస్టు 12 నుండి 16 వరకు రెండు రాష్ట్రాల్లో ఉపరితల గాలులు చాలా బలంగా వీచే అవకాశం ఉందని ఇదివరకు హెచ్చరించింది. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు కొనసాగుతుండటంతో చాలా జిల్లాల్లో వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంది. హైదరాబాద్ లో కనిష్ఠ

అవనిగడ్డ: కృష్ణా జిల్లా దివిసీమలో గురువారం తెల్లవారుజామున ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ఎండిపోతున్న నారుముడులకు ఊపిరిపోసినట్లయింది. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో వర్షం కురవడంతో ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
Noida Airport Waterlogging : ఇటీవలే ప్రారంభమై కార్యకలాపాలు సాగిస్తున్న ప్రతిష్టాత్మక నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (జెవార్ ఎయిర్పోర్ట్) వద్ద కురిసిన భారీ వర్షం తీవ్ర కలకలం రేపింది. మంగళవారం కురిసిన వర్షానికి విమానాశ్రయ ఆవరణలో పెద్ద ఎత్తున నీరు నిలిచిపోవడంపై రాజకీయ దుమారం రేగింది. ఈ పరిణామంపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అధికార బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముఖ్యంగా ఇక్కడ విమానాలు నడుస్తాయా లేక పడవలు నడుస్తాయా అంటూ ప్రశ్నించారు.అసలేమైందంటే?టర్మినల్‌ను పార్కింగ్ ప్రాంతంతో అనుసంధానించే మార్గంలో వర్షపు నీరు భారీగా నిలిచిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. విమానాశ్రయ సిబ్బంది నిలిచిన నీటిని తొలగించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న 28 సెకన్ల వీడియో క్లిప్‌ను అఖిలేష్ యాదవ్ తన అధికారిక ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ముఖ్యంగా ఈ వీడియో కింద "ఇప్పుడు ఈ విమానాశ్రయంలో విమానాలకు బదులు పడవలు నడుపుతారా?" అంటూ అఖిలేష్ యాదవ్ ఘాటుగా ప్రశ్నించారు.స్పందించిన విమానాశ్రయ అధికారులు..!ఈ ఉదంతంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ఎయిర్పోర్ట్ అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి వివరణ ఇచ్చాయి. ఊహించని రీతిలో అత్యంత భారీ వర్షం కురవడం వల్లే తాత్కాలికంగా నీరు నిలిచిపోయిందని అధికారులు స్పష్టం చేశారు. ఘటన జరిగిన వెంటనే స్పందించిన విమానాశ్రయ బృందాలు కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే నిలిచిన నీటిని పూర్తిగా తొలగించాయని.. ఆ మార్గంలో రాకపోకలు వెంటనే సాధారణ స్థితికి వచ్చాయని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. విమాన సర్వీసులు, ప్రయాణికుల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదని.. వాతావరణ పరిణామాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని స్పష్టం చేశారు.మార్చి 28న ప్రారంభోత్సవం జరుపుకుని.. జూన్ 15వ తేదీ నుంచి సేవలు అందిస్తున్న ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం కింద నిర్మించారు. అంతర్జాతీయ టెర్మినల్ నిర్మాణ పనులు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నాటికి పూర్తి చేసి.. ఈ

Weather Updates : వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు వర్షాలు దంచికొట్టనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఉపరితల ఆవర్తన ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో బుధవారం ఏపీలోని మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, అనకాపల్లి, కోనసీమ, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉరుములు, ఈదురుగాలులు వీచే సమయంలో ప్రజలు చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల వద్ద, భారీ హోర్డింగ్స్ వద్దగానీ నిలబడకూడదని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించింది. తెలంగాణలోకూడా ఇవాళ (బుధవారం) తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిద్ధపేట, సిరిసిల్ల, కరీంనగర్, జనగాం, మహబూబాబాద్, నల్గొండ, నాగకర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాలతోపాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది

AP Weather Alert : వర్షాలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాబోయే 3 గంటల్లో రాష్ట్రంలోని 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా విజయనగరం, మన్యం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. వర్షాలతో పాటు గంటకు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, ప్రత్యేకించి సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని సూచిస్తున్నారు. Read Also : Telangana New Pensions 2026 : తెలంగాణలో కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్.. వీరే అప్లయ్ చేయాలి.. వీరికి మళ్లీ అక్కర్లేదు! ఏలమంచిలి, నర్సీపట్నం, తల్లపాలెం పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రాంతాల ప్రజలు చెట్లు, విద్యుత్ స్తంభాలు, బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. హైదరాబాద్‌లోనూ వర్షాలు : తెలుగు రాష్ట్రాలపై అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ పరిస్థితులు అనుకులంగా లేనప్పుడు ప్రజలెవరకూ బయటకు రావొద్దని అధికారుల సూచనలు చేస్తున్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావవరణ శాఖ సూచించింది

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Lady teacher swept away in flood water in ap: రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం భారీ నుంచి అతి భారీగా వానలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలుచోట్ల వాగులు , వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని చోట్ల ఎల్ నినో ప్రభావంతో ఇప్పటికి కూడా వానలు కురవక పోవడంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ కొన్ని చోట్ల మాత్రం వరుణుడు కుండపోతగా వానలు కురిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో విధి నిర్వహణ కోసం బయలుదేరిన ఒక ఉపాధ్యాయురాలు ఆకస్మికంగా వరదలో చిక్కుకుంది. ఈ ఘటన వార్తలలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా కర్లపొద గ్రామం వద్ద ఈ భయంకర ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలలో టీచర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఎం. మణి ఎప్పటిలాగే స్కూల్ కు వెళ్లేందుకు బయలు దేరింది. ఇంతలో ఆమె మార్గంలో వాగును దాటుతుండగా వరద ప్రవాహం విపరీతంగా పెరిగిపోయింది.దీంతో ఆమె వరదలో కొంత దూరం కొట్టుకుని పోయింది. ఆ తర్వాత ఆమె ఒక చెట్టు కొమ్మను పట్టుకుంది. అక్కడ అరవడంతో చుట్టుపక్కల ప్రజలు అప్రమత్తమై వెంటనే ఆమెను కాపాడారు. Read more: Tirupati: తిరుపతి అటవీ ప్రాంతంలో 22 ఏనుగుల సంచారం.!. హైఅలర్ట్ జారీచేసిన ఫారెస్ట్ సిబ్బంది... వీడియో వైరల్.. అనంతరం హుటాహుటిన సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. పెద్ద ప్రమాదం నుంచి బైటపడటంతో లేడీ టీచర్ ఊపిరిపీల్చుకుంది. దీనిపై ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి ఆ వాగుపై వెంటనే బ్రిడ్జి నిర్మించాలని స్థానిక ప్రజలు

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో పాటు తీవ్రమైన ఈదురుగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. వాయువ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బుధవారానికి బలమైన అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. దీని ప్రభావంతో రాబోయే మూడు నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు విడుదల చేసిన సమాచారం ప్రకారం, ఆగస్టు 10 నుంచి 17 వరకు రెండు రాష్ట్రాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయి. ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి నుంచే పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ప్రారంభమయ్యాయి. నంద్యాల, తిరుపతి, అన్నమయ్య, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు పడటంతో లోతట్టు ప్రాంతాలు, కాలనీలు జలమయమయ్యాయి. మంగళవారం రోజున విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశముంది. ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని నగరి, అగ్రం, పిచ్చాటూరు, విజయపురం, కన్నవరం, సత్యవేడు, పుత్తూరు, నిండ్ర ప్రాంతాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) రాబోయే కొన్ని గంటల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. రాయలసీమలో మాత్రం వర్షపాతం ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ బలమైన ఈదురుగాలులు వీస్తాయి. తెలంగాణ వ్యాప్తంగా ఆగస్టు 10 రాత్రి నుంచే అనేక జిల్లాల్లో వాతావరణం మారిపోయింది. సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో సంగారెడ్డి జిల్లా నాగలగిద్దలో 2.35 సెం.మీ, కరీంనగర్ జిల్లా హూజూరాబాద్‌లో 2.11 సెం.మీ, మెదక్ జిల్లా నర్సింగిలో 2.03 సెం.మీ వర్షపాతం నమోదైంది

రెండు రోజులు భారీ వర్షాలు తీరప్రాంతాల్లో బలమైన గాలులు అనేక జిల్లాలకు హెచ్చరికలు జారీ Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో రానున్న రెండు రోజులు వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారడంతో పాటు ఈశాన్య, ఈశాన్య-మధ్యప్రదేశ్ ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో గాలి ఒత్తిడి ఏర్పడింది. దీని కారణంగా రాబోయే 48 గంటల్లో ఉపరితల ఈదురుగాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గాలిలో తేమ శాతం పెరగడం వల్ల అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన చినుకులు పడే సంకేతాలు ఉన్నాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు సంయుక్తంగా వెల్లడించాయి. Balineni-Damacharla: ఒంగోలులో వేడెక్కిన రాజకీయం.. జైల్లో వేసేంత మగాడివా? దామచర్లకు బాలినేని సవాల్ ఆంధ్రప్రదేశ్ వాతావరణం, జిల్లాల హెచ్చరికలు: ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాలతో పాటు రాయలసీమ వ్యాప్తంగా రాగల రెండు రోజులలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు (Rain Alert)పడే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, పిడుగులతో కూడిన వర్షపాతం నమోదుకావచ్చు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో తీరం వెంట బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని సూచించారు. రాయలసీమ పరిధిలోని వైఎస్ఆర్ కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు వాతావరణ శాఖ పసుపు రంగు (యెల్లో) హెచ్చరికలను జారీ చేసింది. తెలంగాణ వాతావరణ సూచన, వాతావరణ శాఖ జాగ్రత్తలు: తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా రాబోయే రెండు రోజులు ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెదపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. School Holiday Tomorrow August 11th: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ జలమయమై రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఈ నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాయి అక్కడి ప్రభుత్వాలు. కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు గత వారం రోజులుగా పలు జిల్లాల్లో పాఠశాలలు మూసి ఉన్నాయి. అయితే రేపు ఆగస్టు 11న పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో స్కూళ్లకు సెలవు ఉంటుందా లేదా అనే సందేహం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొంది. IMD వెల్లడించిన తాజా వివరాలు.. పాఠశాలల సెలవుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. భారీ వర్షాలు .. కన్వర్ యాత్ర కారణంగా ఆగస్టు 11, 2026, మంగళవారం నాడు పాఠశాలలు మూసి ఉంటాయా లేదా అనేది కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెక్ చేస్తున్నారు. అయితే రేపటికి ప్రస్తుతం ఎలాంటి పాఠశాల సెలవు ప్రకటించలేదు. అయినప్పటికీ స్థానిక పరిపాలనా ఉత్తర్వులు, వాతావరణ పరిస్థితులు , మతపరమైన కార్యక్రమాల కారణంగా కొన్ని జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించాయి. తాజా సమాచారం ప్రకారం, కన్వర్ యాత్ర కారణంగా హరిద్వార్‌లోని పాఠశాలలు, కళాశాలలు ఆగస్టు 11 వరకు మూసివేసి ఉంటాయి. ఉత్తరప్రదేశ్‌లోని అనేక జిల్లాలు కూడా సెలవులను ప్రకటించాయి. ఉత్తరాఖండ్‌లో, భారీ నుండి అతి భారీ వర్షాల కారణంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో, బాగేశ్వర్‌లోని 12వ తరగతి వరకు ఉన్న పాఠశాలలను ఆగస్టు 10న మూసివేయాలని ఆదేశించారు. అయితే ఆగస్టు 11వ తేదీన పాఠశాలల బంద్ గురించి ఎలాంటి ఉత్తర్వు జారీ

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ప్రయాణిస్తున్న మినీ వ్యాన్.. అదుపుతప్పి పొంగిపొర్లుతున్న కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. మరో ఇద్దరి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. భారీ వర్షాలతో కాల్వలో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. ఇదే సమయంలో వేగంగా వెళ్తున్న మినీ వ్యాన్ అదుపుతప్పి నేరుగా వరద ప్రవాహంలోకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. క్షణాల్లోనే వాహనం నీటిలో మునిగి కొట్టుకుపోయింది. వాహనంలో ఉన్న ప్రయాణికులు బయటపడేందుకు ప్రయత్నించినప్పటికీ.. ఉధృతమైన నీటి ప్రవాహం కారణంగా అది సాధ్యపడలేదు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. వరద ప్రవాహం తీవ్రంగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురైనా.. సిబ్బంది ముమ్మరంగా గాలింపు చేపట్టారు. నీటి ప్రవాహానికి వ్యాన్ కొంతదూరం కొట్టుకుపోవడంతో మృతదేహాలను వెలికితీయడం సవాల్‌గా మారింది. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమా.. రోడ్డుపై పరిస్థితులా.. లేక వరద ప్రవాహాన్ని అంచనా వేయడంలో జరిగిన పొరపాటా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు అధికారులు సానుభూతి తెలిపారు. భారీ వర్షాల సమయంలో కాల్వలు, వాగులు, బ్రిడ్జిలపై వరద నీరు ప్రవహిస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని.. ప్రమాదకర ప్రవాహాలను దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు ప్రజలకు సూచించారు. మావోయిస్టుల కంచుకోట కర్రెగుట్టలో డీజీపీ పర్యటన..! నీటిలోనే రోజుల తరబడి.. బెంగాల్ బాలుడి వింత పరిస్థితి..!

సాక్షి, అమరావతి: వాతావరణ శాఖ రాష్ట్రానికి వర్ష హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడుగంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, మన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని చెట్లకింద, హోర్డింగుల వద్ద నిల్చోవద్దని వాతావరణ శాఖ సూచించింది. 'హుషారు పిట్టలు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు) ఆషిక బర్త్ డే సెలబ్రేషన్స్.. అక్క-బావ సర్ప్రైజ్ గిఫ్ట్ (ఫొటోలు) హీరోయిన్ హన్సిక బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు) ఉత్తర కుమారుడి ఛాలెంజ్ లు ఎందుకు? నీకు దమ్మూ, ధైర్యం ఉంటే లోకేష్‌కు కొడాలి నాని మాస్ వార్నింగ్ నారా లోకేష్‌పై YSRCP దావులూరి దొరబాబు సంచలన వ్యాఖ్యలు జగన్ హయాంలోనే ఆరోగ్యభాగ్యం ప్రపంచ బ్యాంకు ప్రశంసలు మెగా DSCపై నారా లోకేష్‌పై ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కామెంట్స్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Priest performs puja rituals to crocodile in jogulamba gadwal: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈసారి ఎల్ నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యమయ్యాయి. కొన్ని చోట్ల వర్షాలు కురుస్తుండగా మరికొన్నిచోట్ల వానలు ముఖం చాటేశాయి. ఇప్పటికి పలుచోట్ల వానలు కురవక రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వర్షాలు కురవాలని తెలంగాణ వ్యాప్తంగా పలు ఆలయాల్లో పూజలు, వరుణ యాగాలు నిర్వహించాలని ఇప్పటికే దేవాదాయ మంత్రి కొండా సురేఖ సూచించిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి సైతం వరుణయాగాలు నిర్వహించాలన్నారు. ఈ నేపథ్యంలో గద్వాల జిల్లాలోని బీచుపల్లిలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లిలో ఒక భారీ మొసలి కృష్ణానది నుంచి ఒడ్డుకు కొట్టుకుని వచ్చింది. దీంతో జాలర్లు దాన్ని పట్టుకుని బంధించారు. ఆ తర్వాత అక్కడి పండితుడికి సమాచారం ఇచ్చారు. అనంతరం మొసలిని వరుణదేవుడి వాహనంగా భావించి పండితులు గుడికి తీసుకొని రమ్మని చెప్పాడు. అందరు చూస్తుండగానే పండితుడు అనిల్ శర్మ వర్షాలు బాగా కురవాలని నిజమైన మొసలికి గుడిలోనే పసుపు, కుంకుమ, మొదలైన ద్రవ్యాలతో ప్రత్యేకంగా పూజలు నిర్వహించాడు. Read more: Video Viral: ఇదేక్కడి మాస్ రా మావా.. ఏకంగా కొబ్బరి చెట్లును పీకి తీసుకెళ్తున్న ఏనుగు.. వీడియో వైరల్.. అనిత్ శర్మ దానికి పూజలు చేస్తున్న అది కొంచెం కూడా కదల్లేదు. దాన్ని తాకుతూ వర్షాలు పడాలని పండితులు పూజలు నిర్వహించాడు. పూజలు ముగిసిన తర్వాత ఆ మొసలిని జాలర్లు తిరిగి నదిలో వదిలేశారు. ఈ ఘటనకు చెందిన

తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మరో వారం రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. హైదరాబాద్ బేగంపేట, అమరావతి వాతావరణ కేంద్రాలు ఈ మేరకు స్పష్టమైన సూచనలు జారీ చేశాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వానలు పడుతుండగా, రానున్న రోజుల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఆకాశం మేఘావృతమై ఉండి అడపాదడపా జల్లులు పడతాయి. ఇదివరకే ఏర్పడిన ఉత్తర ఒడిశా, జార్ఖండ్ ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం ప్రస్తుతం ఈశాన్య మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వైపు కదిలింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి ఏకంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీనివల్ల తెలంగాణ వ్యాప్తంగా ఆగస్టు 9 నుంచి 16 వరకు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ తెలిపింది. ఆగస్టు 9 నుంచి 12 మధ్య గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని పేర్కొంది. హైదరాబాద్‌తో పాటు జగిత్యాల, జనగామ, కామారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, మంచిర్యాల, మెదక్, నల్లగొండ, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో ఇప్పటికే జల్లులు పడ్డాయి. ఆగస్టు 12 తర్వాత వర్షాలు ఉన్నా పెద్దగా ప్రమాదకర హెచ్చరికలేవీ లేవు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, గురువారం రోజున ఉత్తర బంగాళాఖాతం, పశ్చిమబెంగాల్ తీరప్రాంతంలో మరో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీనివల్ల సోమవారం నుంచి శనివారం వరకు కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలు పడొచ్చు. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో చాలా చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ అల్పపీడనాలు పెద్దగా ప్రభావం చూపడం లేదని, అందుకే రాష్ట్రంలో అక్కడక్కడ మాత్రమే వానలు పడుతున్నాయని అధికారులు

శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం భారీ వర్షాలతో కూడిన పిడుగులు బీభత్సం సృష్టించాయి. మందస ఏజెన్సీ ప్రాంతంలోని పాతకోటలో పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతిచెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీకాకుళం: జిల్లాలో ఇవాళ (ఆదివారం) భారీ వర్షాలతో కూడిన పిడుగులు బీభత్సం సృష్టించాయి. మందస ఏజెన్సీ ప్రాంతంలోని పాతకోటలో పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతిచెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను కట్ట సుమిద్రి, సవర జోరాగా గుర్తించారు. బాధితులంతా వ్యవసాయ పనులు చేస్తుండగా.. ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను స్థానికులు వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో పాతకోటలో విషాద ఛాయలు అలుముకోగా.. మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో వాతావరణం మారింది. శ్రీకాకుళం జిల్లాతో పాటు పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల కింద ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచిస్తున్నారు. ఎల్‌నినో వేళ పంటలకు పట్టిసీమ నీరే జీవాధారం: సీఎం చంద్రబాబు రాజమహేంద్రవరం వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Tomorrow Varuna Yagam: వర్షాభావం ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. వర్షాలు భారీగా కురిసి పాడి పంటలు పండాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం వరుణ యాగం నిర్వహించనుంది. నాగార్జునసాగర్‌లోని విజయవిహార్‌లో రేపు నిర్వహించనున్న వరుణ యాగం కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, జలాశయాలు, ప్రాజెక్టులు నిండాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో వరుణ యాగానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయవిహార్‌లో రేపు తెలంగాణ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఈ యాగాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి.. సాగునీటి ప్రాజెక్టులు, జలాశయాలు నిండాలని.. రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ వరుణ దేవుడికి ప్రత్యేక పూజలు, యాగ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. యాగం కోసం విజయవిహార్‌లో ప్రత్యేకంగా యాగశాలను ఏర్పాటు చేశారు. పూజా కార్యక్రమాలకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు, అర్చకులు పూర్తి చేశారు. కార్యక్రమానికి హాజరయ్యే ముఖ్యమంత్రి, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్లను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. విజయవిహార్ పరిసరాల్లో ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, వాహనాల రాకపోకలకు సంబంధించి ప్రత్యేక చర్యలు చేపట్టారు. వరుణ యాగం జరిగే ప్రాంతంలో భద్రతా పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రాజెక్టులు, జలాశయాలు నిండాలని ఆకాంక్షిస్తూ నాగార్జునసాగర్‌లో రేపు

ఎల్‌నినో దెబ్బతో ఈసారి వర్షాలు తగ్గుముఖం పడతాయేమోనన్న ఆందోళనల్లో ఉన్న దేశ ప్రజలకు, రైతాంగానికి వాతావరణ శాఖ అత్యంత తీపి కబురుందించింది. వేల కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో వేడెక్కుతున్న ఉష్ణోగ్రతలు రుతుపవనాలను బలహీనపరుస్తున్నప్పటికీ, భారతీయ వాతావరణంలో ఏర్పడిన రెండు శక్తివంతమైన అల్పపీడనాలు వర్షాలకు సరికొత్త ఊపిరిని ఊదాయ్. ఈ జంట అల్పపీడనాల ప్రభావంతో రానున్న కొద్దిరోజుల పాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లో వర్షభారీగా దంచికొట్టే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.అల్పపీడనాల జోడు గుర్రాల స్వారీదక్షిణ పశ్చిమ ఉత్తరప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలలో ఒక అల్పపీడనం స్థిరపడగా, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్ , ఉత్తర ఒడిశా తీరంలో మరొక అల్పపీడనం బలంగా రూపుదిద్దుకుంది. ఈ రెండు వ్యవస్థలు ఒకదానికొకటి తోడై వాతావరణంలోకి భారీగా తేమను లాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశా వైపు నుంచి ఝార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా పయనిస్తున్న ఈ అల్పపీడనాల ప్రభావంతో మధ్య, తూర్పు భారత దేశంలో వర్షాల విస్తృతి భారీగా పెరగనుంది.El Nino: వర్షాల రాజధానికే వానలు కరువు! కరుణించని మేఘమాలికలుఏ ఏ రాష్ట్రాల్లో వర్షాల ఉద్ధృతి?వాతావరణ శాఖ (IMD) ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వీటి ప్రభావం కేవలం తూర్పు రాష్ట్రాలకే పరిమితం కాకుండా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మీదుగా ఉత్తరాదికి కూడా విస్తరించనుంది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ తో పాటు తూర్పు రాజస్థాన్‌లో వానలు విపరీతంగా పడతాయని అంచనా వేస్తున్నారు. ఇక దక్షిణాది విషయానికి వస్తే, తీరప్రాంత కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో ముసురు పట్టి జోరుగా వర్షాలు కురిసే వాతావరణం నెలకొంది.Super El Nino : ఎల్‌నినోను ఢీకొడుతున్న ఇండియన్ ఓషన్ డిపోల్ఒకవైపు పసిఫిక్ సముద్రంలో ఉద్భవిస్తున్న ఎల్‌నినో ప్రభావంతో రుతుపవనాల మందగమనం జరుగుతున్నప్పటికీ, హిందూ మహాసముద్రంలో ఏర్పడుతున్న సానుకూల ఇండియన్ ఓషన్ డిపోల్ (Positive IOD)

బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. దీనికి పసిఫిక్ మహాసముద్రంలో కదిలిన 'డాల్ఫిన్ టైఫూన్' ప్రభావం తోడవ్వడంతో రుతుపవనాలు మరింత యాక్టివ్ అయ్యాయి. ఈ అల్పపీడన వ్యవస్థ క్రమంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ దిశగా పయనిస్తూ మహారాష్ట్ర, గుజరాత్ వైపు వెళ్లే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ, తెలంగాణల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి, పలు చోట్ల విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రానున్న మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. వానలతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది. మేడ్చల్-మల్కాజిగిరి, మెదక్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని ఐఎండీ తెలిపింది. రాజధాని హైదరాబాద్‌లో ఇప్పటికే పటాన్చెరు, మియాపూర్, కొండాపూర్, ఎల్బీనగర్, బాచుపల్లి వంటి ప్రాంతాల్లో రాత్రి వర్షం దంచికొట్టింది. రాబోయే గంటల్లోనూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపిన వివరాల ప్రకారం, ఈ అల్పపీడన ప్రభావం ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై తీవ్రంగా ఉండనుంది. రుతుపవనాలు చురుకుగా మారడంతో కోస్తా, రాయలసీమలోనూ పలుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడ్డాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే

వర్షంలో కారు నడిపే ముందు తెలుసుకోవాల్సిన జాగ్రత్తలివే వర్షంలో కారు స్కిడ్ అవ్వడానికి ప్రధాన కారణాలివే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈ తప్పులు చేస్తే ప్రమాదమే Monsoon Driving Tips : అసలే వర్షాకాలం.. జోరుగా వర్షాలు పడుతున్నాయి. బయటకు అడుగుపెట్టడమే కష్టం.. ఇలాంటి జోరువానలో మీ కారు బయటకు తీస్తున్నారా? జర జాగ్రత్త.. అందులోనూ కొండ ప్రాంతాల నుంచి నగరాల వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈ వర్షం కురిసే సమయంలో వాహనదారులు కొంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. వర్షం కారణంగా రోడ్లు తడిసి, అనేక ప్రాంతాలు జలమయమవుతాయి. ఇటువంటి పరిస్థితులలో, వాహనం నడిపేటప్పుడు చేసే చిన్నపాటి అజాగ్రత్త కూడా తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. అందువల్ల, వర్షాకాలంలో వాహనం నడిపేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. కారును అధిక వేగంతో నడపడం : వర్షం పడినప్పుడు రోడ్లు తడిగా ఉంటాయి. తద్వారా మీ కారు టైర్ల పట్టు తగ్గుతుంది. అధిక వేగంతో వెళ్లేటప్పుడు అకస్మాత్తుగా బ్రేకులు వేయడం వల్ల కారు జారిపోయే రిస్క్ పెరుగుతుంది. అందుకే వర్షంలో ఎల్లప్పుడూ నెమ్మదిగా జాగ్రత్తగా వాహనం నడపండి. అలాగే, అవసరమైతే సమయానికి బ్రేకులు వేసేలా వీలుగా ముందున్న వాహనానికి తగినంత దూరం పాటించండి. వరదతో పొంగే రహదారిపై కారు నడపడం : వర్షాకాలంలో చాలా ప్రాంతాలు నీటితో నిండిపోతాయి. నీటి లోతు తెలుసుకోకుండా ఈ ప్రాంతాల్లోకి మీ కారును నడపడం అత్యంత ప్రమాదకరం. నీరు ఇంజిన్లోకి చేరి, కారు పాడయ్యే ప్రమాదం ఉంటుంది. భారీగా నీరు ఉన్న రోడ్లకు దూరంగా ఉండండి. Read Also : Aadhaar App PIN : మీ ఆధార్ యాప్ PIN మర్చిపోయారా? మీ ఇంట్లోనే జస్ట్ 5 నిమిషాల్లో కొత్త పిన్ రీసెట్ చేయొచ్చు! లైట్లు, ఇండికేషన్లను వాడకపోవడం : వర్షం పడుతున్నప్పుడు ఆకాశం చీకటిగా మారి కనిపించేది తగ్గిపోతుంది. ఇలాంటి పరిస్థితిలో మీ కారు