
Gold Prices: రాకెట్లా దూసుకెళ్తున్న బంగారం ధరలు.. మళ్లీ పేలిన బుడుగ.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
Gold Prices: రాకెట్లా దూసుకెళ్తున్న బంగారం ధరలు.. మళ్లీ పేలిన బుడుగ.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
© 2026 nimisham.in

Gold Prices: రాకెట్లా దూసుకెళ్తున్న బంగారం ధరలు.. మళ్లీ పేలిన బుడుగ.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

Gold Price Today: పెరిగిన బంగారం ధర.. ఈరోజు తులం గోల్డ్ ధర ఎంతంటే!

Gold Prices: బంగారం కొనాలనుకునేవారికి భారీ ఊరట.. ధరలు ఒక్కసారిగా పతనం.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ తులం ఎంతంటే..?

Gold Prices: గోల్డ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు.. ఇవాల్టీ రేట్లు ఇవే..

Gold Price: 4 గంటల్లో మారిన సీన్.. ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులంపై ఎంతంటే?

Gold Price Today: ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

Gold Price: రాబోయే రోజుల్లో బంగారం ధరలు తగ్గడానికి 5 కారణాలు.. అవేంటో తెలుసా..?

ఇంటర్నెట్ డెస్క్: బంగారం అక్రమ రవాణా (Gold Smuggling)కు స్మగ్లర్లు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. తాజాగా కేరళంలోని ఓ విమానాశ్రయంలో 8 నెలల చిన్నారిని స్మగ్లింగ్‌కు ఉపయోగించుకున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. శిశువు డైపర్‌లో దాదాపు రూ.50లక్షల విలువైన బంగారాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. ఆ ‘నవ్వే’.. పదేళ్లకు అతణ్ని కుటుంబంతో కలిపింది! యూఏఈలోని రస్ అల్ ఖైమా విమానాశ్రయం నుంచి మలప్పురం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మంగళవారం రాత్రి కరిపుర్ (కాలికట్) అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాడు. బంగారం స్మగ్లింగ్ జరుగుతోందని పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన డీఆర్ఐ అధికారులు.. ఎనిమిది నెలల శిశువు, మరో ఇద్దరు చిన్నారులతో వచ్చిన సదరు వ్యక్తిని అడ్డుకున్నారు. తనిఖీ చేయగా శిశువు డైపర్‌లో రూ.50లక్షల విలువైన బంగారంతోపాటు అతడి వద్ద మరింత బంగారం లభించింది. మొత్తం విలువ రూ.కోటి ఉంటుందని అంచనా వేశారు. బంగారం స్మగ్లింగ్ మూలాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు.. శిశువును ఉపయోగించి గతంలో ఇటువంటి చర్యలకు పాల్పడ్డాడా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. లఖ్‌నవూలో మాజీ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ నివాసం సమీపంలో ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలో రూన్ నదిలో చిక్కుకున్న ఇద్దరిని ఆర్మీ హెలికాప్టర్ రక్షించింది
Gold Price Fall : గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు ఒక్కసారిగా పతనమవుతున్నాయి. బులియన్ మార్కెట్లో వరుసగా 4 రోజుల్లో తులం బంగారం (24 క్యారెట్లు) ధర ఏకంగా రూ.9110 మేర పడిపోయింది. ఆగస్టు 29వ తేదీన దాదాపు రూ.3 వేలు దిగొచ్చిన బంగారం ధర ఆ తర్వాత వరుస సెషన్లలో భారీగా పడిపోతూ వస్తోంది. దేశంలో పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్న తరుణంలో బంగారం ధరలు ఇలా భారీగా తగ్గుతుండడం కొనుగోలుదారులకు ఊరటగా చెప్పవచ్చు. వెండి రేటు రూ.10 వేలు తగ్గి రూ.2.50 లక్షల స్థాయికి మళ్లీ దిగివచ్చింది. అయితే, బంగారం ధరలు భారీగా పడిపోయేందుకు గల కారణాలేంటి? ఇంకా తగ్గుతాయా? బులియన్ మార్కెట్ విశ్లేషకులు ఏం చెబుతున్నారు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.నేటి బంగారం ధరలు ఇలాదేశీయ మార్కెట్లో పసిడి ధరలు వరుసగా నాలుగో రోజూ తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం రేటు ఇవాళ ఒక్కరోజే రూ.2070 మేర తగ్గింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్‌లో తులం బంగారం ధర రూ.1,52,020 వద్దకు దిగివచ్చింది. ఇక 22 క్యారెట్ల నగల తయారీ బంగారం రేటు ఈరోజు రూ.1900 మేర పడిపోయింది. దీంతో తులం రేటు రూ.1,39,350 వద్దకు పడిపోయింది. ఇక కిలో వెండి ధర రూ.10 వేలు తగ్గడంతో రూ.2,50,000 వద్ద ట్రేడవుతోంది.ఆ ఒక్క కారణంతోనే భారీ పతనంఇరాన్పై అమెరికా భీకర దాడులు చేపడుతుండడంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. దీంతో మార్కెట్లు ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఒక వైపు ముడి చమురు ధరలు పెరుగుతుండగా బంగారం, వెండి వంటి విలువైన లోహాలకు డిమాండ్ తగ్గుతోంది. దీంతో పసిడి ధరలు భారీగా దిగివస్తున్నాయి. సాధారణంగా యుద్ధం జరిగితే బంగారం ధరలు పెరుగుతాయి. కానీ, పశ్చిమాసియా యుద్ధం విషయంలో క్రూడ్ ఆయిల్ ప్రధాన పాత్ర పోషించడంతో రివర్స్ జరుగుతోంది. బంగారం, వెండి వండి విలువైన ఖనిజాల ధరలు

Gold, Silver Prices: బంగారం, వెండి ధరల తగ్గింపు పర్వం కొనసాగుతోంది. గతంలో పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు రికార్డు స్థాయిలో దిగి వస్తున్నాయి. దీంతో మహిళలకు భారీ ఊటర కలిగిస్తున్నాయి. బంగారం, వెండి ధరలు తగ్గుముఖంపై వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ తగ్గింపు దోరణి ఇలాగే కొనసాగితే బాగుండని కోరుతున్నారు. ప్రస్తుతం సెస్టెంబర్ 2న భారీగా తగ్గింది. తులం బంగారంపై ఏకంగా 2,070 రూపాయలు తగ్గింది. వెండిపై 5 వేల రూపాయలు తగ్గింది. సెప్టెంబర్ ఆరంభంలో బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. ఆభరణాల వ్యాపారుల ప్రకారం.. సెప్టెంబర్ 2వ తేదీన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,52,020గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,39,350 వద్ద ట్రేడవుతోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. ఆగస్ట్ 24న 1,63,970 ఉండగా, ప్రస్తుతం 1,52,020 వద్ద కొనసాగుతోంది. అలాగే మొత్తంగా 11,950 వరకు తగ్గింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,400గా ఉండగా, సెప్టెంబర్ 2 నాటికి 10 గ్రాములకు అది రూ.1,39,350కు పడిపోయింది. అలాగే18 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.1,22,930 నుండి రూ.1,14,020కి పడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,070 తగ్గి రూ.1,52,020 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,900 తగ్గి రూ.1,39,350 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,550 తగ్గి రూ.1,14,020 గా నమోదైంది. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. ఆగస్టు 24న గ్రాము వెండి ధర రూ.260 ఉండగా, సెప్టెంబర్ 2 నాటికి అది గ్రాముకు రూ.245కు పడిపోయింది. అంటే, సుమారు వారం రోజుల్లో వెండి ధర గ్రాముకు రూ.15 మేర తగ్గిందని

బంగారం ధరల్లో వరుసగా రెండో రోజు కూడా భారీ తగ్గుదల నమోదైంది. గత కొద్దిరోజులుగా భారీగా పెరిగిన పసిడి రేట్లు ఒక్కసారిగా దిగిరావడంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,070 తగ్గి రూ.1,52,020కి చేరింది. కేవలం మూడు రోజుల్లోనే తులం ప్యూర్ గోల్డ్‌పై రూ.6,220 వరకు తగ్గింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా భారీగా తగ్గింది. 10 గ్రాములపై రూ.1,900 తగ్గడంతో ప్రస్తుతం రూ.1,39,350 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో మారుతున్న పరిస్థితులు, డాలర్ విలువలో హెచ్చుతగ్గులు, పెట్టుబడిదారుల సెంటిమెంట్ వంటి అంశాలు దేశీయ బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లకు సంబంధించిన అంచనాలు కూడా మార్కెట్ కదలికలకు కారణమవుతున్నాయి. అయితే బంగారం ధరలు ఇక్కడితోనే తగ్గుతాయా లేదా మళ్లీ పెరుగుతాయా అన్నదానిపై మార్కెట్ నిపుణులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వెండితో పోలిస్తే బంగారానికి ప్రస్తుతం బలమైన డిమాండ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు తమ నిల్వలను పెంచుకునేందుకు పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తుండటం పసిడికి ప్రధాన బలంగా మారింది. వెండి విషయంలో మాత్రం పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. వెండికి పారిశ్రామిక రంగం నుంచి వచ్చే డిమాండ్ కీలకం కావడంతో తయారీ కార్యకలాపాల్లో మందగమనం ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా చైనాలో సోలార్ మాడ్యూల్స్ వృద్ధి నెమ్మదిస్తే వెండి డిమాండ్‌పై ఒత్తిడి పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక 2026 చివరి నాటికి తులం బంగారం రూ.1.35 లక్షల నుంచి రూ.1.55 లక్షల పరిధిలో ఉంటుంందని అంచనా. అయితే అమెరికా లేబర్ మార్కెట్లో తీవ్ర బలహీనత ఏర్పడి, ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించడం, రియల్ ఈల్డ్స్ పడిపోవడం, సంస్థాగత పెట్టుబడులు మళ్లీ బంగారం వైపు మళ్లడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటే ధరలు మరింత పెరిగే అవకాశం

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Gold Rate Today: పసిడి ప్రియులకు భారీగా ఊరటనిచ్చే వార్త. బంగారం కొనాలనుకునేవారికి ఇది సరైన సమయం అని చెప్పాలి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు భారీగా దిగివస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పతనం అయ్యాయి. కిలో వెండిపై ఏకంగా 10,000 తగ్గింది. 24క్యారెట్ల పసిడిపై రూ. 2,680 మేర దిగివచ్చింది. తాజా ధరల మార్పుతో హైదరాబాద్ లో పది గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,54,090కి దిగి వచ్చింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,250కి చేరింది. అదే విధంగా కిలో వెండి ధర రూ.10,000 మేర తగ్గింది. కిలో వెండి ధర రూ. 2,50,000 వద్ద స్థిర పడింది. గత 3 రోజుల్లోనే 10 గ్రాముల బంగారం ధర రూ. 6,000 మేర పైగా తగ్గింది. ఇరాన్ పై అమెరికా మళ్లీ సైనిక దాడులు ప్రారంభించడమే ఈ భారీ తగ్గుదలకు కారణమని చెబుతున్నారు మార్కెట్ విశ్లేషకులు. ఈ దాడుల ప్రభావంతో ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో పెట్టుబడిదారులు బంగారం నుంచి తమ పెట్టుబడులను ఇతర మార్గాలకు మళ్లిస్తున్నట్లు బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లపై అంచనాలు తగ్గడం, డాలర్ కదలికలు కూడా ధరలపై ప్రభావం చూపాయని చెప్పాలి. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు కుప్పకూలాయి. స్పాట్ గోల్డ్ ఔన్సుపై ఏకంగా 106 డాలర్లు తగ్గింది. దీంతో 4,323 వద్ద ట్రేడ్ అవుతోంది. స్పాట్ సిల్వర్ కూైడా 3.20శాతం నష్టపోయింది. దీంతో ఔన్సు వెండి 64 డాలర్ల వద్ద కొనసాగుతోంది. Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన
Gold Rate Today: పసిడి ప్రియులు ఎగిరిగంతేసే శుభవార్త. బంగారం ధరలు వరుసగా పడిపోతున్నాయి. దేశీయంగా రెండు రోజుల్లోనే తులం బంగారం రేటు రూ.4300 మేర దిగివచ్చింది. ఇరాన్‌పై అగ్రరాజ్యం అమెరికా మెరుపుదాడులు చేయడంతో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అలాగే అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు, డాలర్ విలువ వంటివి బంగారం ధరలపై ప్రభావం చూపించాయి. దీంతో దేశీయ మార్కెట్లో పసిడి రేట్లు భారీగా దిగివస్తున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో బంగారం రేట్లు పడిపోతుండడం కొనుగోలుదారులకు ఊరట కల్పిస్తోందని చెప్పవచ్చు. మరి సెప్టెంబర్ 1వ తేదీన హైదరాబాద్, విజయవాడ బులియన్ మార్కెట్లలో పసిడి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.హైదరాబాద్‌లో బంగారం, వెండి రేట్లుహైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి రేట్లు వరుసగా రెండో సెషన్లోనూ భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు తులానికి రెండ్రోజుల్లో రూ.4360 మేర తగ్గింది. ఇవాళ ఒక్కరోజే రూ. 1470 మేర తగ్గడంతో తులం రేటు రూ.1,56,770 వద్దకు దిగివచ్చింది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటు ఈరోజు రూ.1350 తగ్గడంతో 10 గ్రాముల రేటు రూ.1,43,700 వద్దకు దిగివచ్చింది. ఇక వెండి రేటు మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం కిలో రేటు రూ.2,60,000 వద్ద ట్రేడవుతోంది.విజయవాడ, విశాఖలో బంగారం ధరలుఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన నగరాలు విజయవాడ, వైజాగ్ నగరాల్లోనూ ఈరోజు పసిడి రేట్లు దిగివచ్చాయి. 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.1470 తగ్గడంతో రూ.1,56,770 వద్దకు తగ్గింది. అలాగే 22 క్యారెట్ల పసిడి రేటు తులానికి రూ.1350 తగ్గడంతో రూ.1,43,700 పలుకుతోంది. ఇక కిలో వెండి రేటు ఏ మార్పు లేకుండా రూ.2,60,000 పలుకుతోంది.గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ రేటుఅంతర్జాతీయ మార్కెట్లలో మాత్రం పసిడి రేట్లు తగ్గినట్లే తగ్గి ఈరోజు స్వల్పంగా పెరిగాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 19 డాలర్లు పెరిగి 4449 డాలర్ల

బంగారం ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. గత వారం భారీ స్థాయిలో తగ్గిన పసిడి ధరలు.. ఇప్పుడు వరుసగా నాలుగైదు రోజులుగా క్రమంగా పుంజుకుంటున్నాయి. ఒక దశలో తులం బంగారం ధర రూ.1.70 లక్షలకు చేరడంతో భారీగా పెరిగిన పసిడి.. ఆ తర్వాత లాభాల స్వీకరణతో గణనీయంగా తగ్గింది. ఇప్పుడు మళ్లీ కొనుగోళ్లు పెరగడంతో ధరలు పైకి ఎగబాకుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.160 పెరిగి రూ.1,56,930కి చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర కూడా రూ.150 పెరిగి 10 గ్రాములకు రూ.1,43,850గా నమోదైంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.120 పెరిగి 10 గ్రాములకు రూ.1,17,700 వద్ద కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా ధరలు తగ్గిన సమయంలో కొనుగోళ్లకు కొంత ఊరట లభించినప్పటికీ.. ఇప్పుడు మళ్లీ రేట్లు పెరుగుతుండటంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వెండి ధరలు మాత్రం బంగారానికి భిన్నంగా భారీగా తగ్గుతున్నాయి. ఒక్కరోజే కిలో వెండిపై రూ.5,000 తగ్గుదల నమోదైంది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2.55 లక్షల వద్ద ఉంది. గత నెలలో కిలో వెండి ధర సుమారు రూ.2.75 లక్షల స్థాయిలో ఉండగా.. ప్రస్తుతం దాదాపు రూ.20 వేల మేర తగ్గింది. దీంతో వెండి కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి మాత్రం ఈ తగ్గుదల కొంత ఊరటనిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరల కదలికలు, డాలర్ విలువ, పెట్టుబడిదారుల కొనుగోళ్లు, లాభాల స్వీకరణ వంటి అంశాలు దేశీయ బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపుతుంటాయి. అందుకే బంగారం, వెండి ధరలు రోజురోజుకూ మారుతూ ఉంటాయి. ఆభరణాలు కొనుగోలు చేసే వారు మార్కెట్లోని తాజా రేటుతో పాటు మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ వంటి అదనపు ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి

Gold, Silver Rates: ప్రస్తుతం బంగారం, వెండి ధరలు పెరుగుతున్న తరుణంలో గత కొన్ని రోజులుగా భారీగా తగ్గినట్లే తగ్గి నాలుగైదు రోజుల నుంచి మళ్లీ పరుగులు పెడుతున్నాయి. గత వారంలో తులం బంగారం ధర రూ.1.70 లక్షల చేరువలో వెళ్లిగా క్రమంగా దిగి వచ్చింది. దీంతో వినియోగదారులకు కొంత ఊరటనిచ్చినట్లయ్యింది. కానీ మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో తులం బంగారంపై స్వల్పంగా అంటే రూ.160 వరకు పెరిగి ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,930 ఉండగా, అదే 22 క్యారెట్లపై రూ.150 పెరిగి రూ.1,43,850 వద్ద ట్రేడవుతోంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాములపై రూ.120 పెరిగి ప్రస్తుతం రూ.1,17,700 వద్ద కొనసాగుతోంది. ఇక బంగారం ధర పెరిగితే వెండి మాత్రం విరుద్దంగా పయనిస్తోంది. కిలో వెండిపై ఏకంగా 5000 రూపాయలు తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కిలో వ ఎండి ధర 1,50,000 రూపాయల వద్ద ట్రేడవుతోంది. గత వారంలో కిలో వెండి ధర రూ.1,60,000 వద్ద ఉండగా, ఇప్పుడు వారం రోజుల్లోనే 10 వేల రూపాయల వరకు దిగి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి రేట్లు తగ్గినట్లే తగ్గి మంగళవారం స్వల్పంగా పెరిగింది. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 19 డాలర్లు పెరిగి 4449 డాలర్ల వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 1.44 శాతం పెరిగి 66.62 డాలర్ల వద్ద కొనసాగుతోంది. పోయినవారం చివర్లో బంగారం ధర పతనం మొదలైంది. ఈ వారం కంటిన్యూ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో కొంతమంది ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించేందుకు అమ్మకాలకు దిగారు. దీంతో పసిడిపై మరింత ఒత్తిడి ఏర్పడింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర కూడా గణనీయంగా తగ్గింది. దాని ప్రభావం దేశీయ బులియన్ మార్కెట్లపైనా కనిపించింది. ఫలితంగా బంగారం ధరలు కొంతమేర చల్లబడ్డాయి. ఇదే సమయంలో

దేశంలో పసిడి, వెండి ధరల పతనానికి బ్రేకులు పడ్డాయి. గత కొంతకాలంగా భారీగా ఊరట కలిగిస్తూ వచ్చిన వీటి రేట్లు.. నేడు పుంజుకున్నాయి. స్వల్ప పెరుగుదల నమోదైంది. పండుగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ ధరల మార్పు కొనుగోలుదారులపై ప్రభావం చూపనుంది. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటోన్న పరిణామాలు, డాలర్ లో నమోదవుతున్న హెచ్చుతగ్గులు, ఫెడరల్ బ్యాంక్ నిర్ణయాలు దీనికి కారణం అయ్యాయి.సోమవారం నాటి ముగింపు సెషన్ తో పోల్చుకుంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో 160 రూపాయల నామమాత్రపు పెరుగుదల కనిపించింది. 22 క్యారెట్లు 150, 18 క్యారెట్లు 120 రూపాయల మేర పెరిగింది. ప్రస్తుతం దేశంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు 1,56,930 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,43,850 వద్ద ట్రేడ్ అయింది.ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు అలాగే సురక్షితమైన దీర్ఘకాలిక పెట్టుబడి సాధనంగా బంగారం ఎల్లప్పుడూ మొదటి వరుసలో ఉంటుంది. మార్కెట్లలో నెలకొన్న అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు, రూపాయి విలువలో వచ్చే హెచ్చుతగ్గుల కారణంగా పెట్టుబడిదారులు స్థిరమైన లాభాల కోసం పసిడి వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల మార్కెట్లో నిరంతరం డిమాండ్ పెరుగుతూ వస్తోంది.నేటి నుంచి.. అరుణాచలం, తమిళనాడులోని ఇతర ఆలయాలకు వెళ్లే భక్తులకు ముఖ్య గమనికహైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,56,930, 22 క్యారెట్లు రూ. 1,43,850 18 క్యారెట్లు రూ. 11,773 గా రికార్డయింది. బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1,56,930, 22 క్యారెట్లు రూ.1,43,850, 18 క్యారెట్లు రూ. 1,17,730 పలుకుతోంది. చెన్నైలో ఇవే రేట్లు వరుసగా 1,56,930, రూ. 1,43,850, 1,21,550 గా రికార్డయ్యాయి. ముంబైలో రూ. 1,56,930, రూ. 1,43,850 రూ. 11,770 వద్ద కొనసాగుతున్నాయి.వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Gold Rate: ప్రపంచ మార్కెట్లలో బంగారం మరోసారి దూసుకుపోతోంది. మూడు నెలల గరిష్ట స్థాయికి చేరిన బంగారం ధరలు వరుసగా మూడో వారంలోనూ లాభాలు నమోదు చేస్తున్నాయి. ఈ వారం మాత్రమే దాదాపు 5 శాతం పెరిగిన బంగారం పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ పెరుగుదల వెనుక ఒకే కారణం కాకుండా అనేక అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు కలిసి పనిచేస్తున్నాయి. డాలర్ బలహీనత ప్రధాన కారణం: బంగారం ధరల పెరుగుదలకు ప్రస్తుతం అతిపెద్ద కారణం అమెరికా డాలర్ బలహీనపడటం. డాలర్ విలువ తగ్గితే ఇతర దేశాల కరెన్సీలతో బంగారం కొనుగోలు చేయడం చౌకగా మారుతుంది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ పెరుగుతుంది. ఇటీవల అమెరికా ట్రెజరీ తీసుకున్న బాండ్ బైబ్యాక్ నిర్ణయాల తర్వాత డాలర్ మే నెల తర్వాత కనిష్ట స్థాయికి చేరుకోవడం బంగారానికి భారీ మద్దతు ఇచ్చింది. అమెరికా రుణభారం ఆందోళనలు: అమెరికా ప్రభుత్వ రుణభారం 40 ట్రిలియన్ డాలర్ల మార్క్ దాటడం కూడా పెట్టుబడిదారుల్లో ఆందోళనలు పెంచుతోంది. భవిష్యత్తులో డాలర్ విలువ మరింత తగ్గే అవకాశం ఉందనే భావనతో చాలామంది తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తున్నారు. అందుకే ప్రస్తుతం బంగారాన్ని "కరెన్సీ విలువ తగ్గుదలకు రక్షణ కవచం"గా చూస్తున్నారు. ఫెడ్ వడ్డీ రేట్లపై అనిశ్చితి: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందా లేదా అనే అంశంపై స్పష్టత లేకపోవడం కూడా బంగారానికి అనుకూలంగా మారింది. ఇటీవల వచ్చిన బలహీన ఆర్థిక గణాంకాలు, మందగించిన ఉద్యోగ వృద్ధి, తగ్గిన ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కారణంగా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపును వాయిదా వేయొచ్చనే అంచనాలు పెరిగాయి. వడ్డీ రేట్లు స్థిరంగా

బంగారం, వెండి ధరలు షాకిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అనుకూల పరిస్థితులు, డాలర్ బలహీనపడటం, పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు వంటి అంశాలు గోల్డ్, సిల్వర్ రేట్లపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో బంగారం ధరలు మరోసారి రికార్డు స్థాయిల దిశగా కదులుతున్నాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,63,090కి చేరింది. ఒక్కరోజులోనే రూ.1,520 పెరిగింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,49,500గా ఉండగా.. శనివారం రూ.1,400 మేర పెరిగింది. విజయవాడ, విశాఖపట్నంలోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం కిలో వెండి ధర సుమారు రూ.2.65 లక్షల వద్ద ట్రేడవుతోంది. ఒక్కరోజులోనే దాదాపు రూ.10 వేల పెరుగుదల నమోదైంది. గత రెండు రోజుల్లో వెండి ధర సుమారు రూ.15 వేల వరకు పెరగడం మార్కెట్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. అంతర్జాతీయ పరిణామాలు ప్రస్తుతం విలువైన లోహాలకు సపోర్టుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా డాలర్ బలహీనపడటం బంగారం ధరల పెరుగుదలకు ఒక కారణంగా మారింది. అమెరికా కరెన్సీపై ఒత్తిడి ఉన్న సమయంలో పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతారు. ఫలితంగా అంతర్జాతీయంగా గోల్డ్‌కు డిమాండ్ పెరుగుతుంది. మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కూడా మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఆంక్షలు, ప్రతిస్పందనలు, పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితిని పెంచుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు రిస్క్ ఉన్న ఆస్తుల కంటే సురక్షిత పెట్టుబడులపై ఆసక్తి చూపడం సాధారణం. దీంతో బంగారం, వెండి ధరలకు మరింత సపోర్ట్ దొరికింది. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే రానున్న రోజుల్లో కూడా గోల్డ్, సిల్వర్ రేట్లలో ఒడిదుడుకులు కొనసాగే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ కదలికలు, భౌగోళిక రాజకీయ పరిణామాలు, పెట్టుబడిదారుల డిమాండ్ వంటి అంశాలపై ధరల దిశ ఆధారపడి ఉంటుంది

ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలో తమిళనాడులో అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న తాయిమామన్ తంగ మోతిరం పథకం టెండర్ ప్రక్రియ పూర్తయింది. ప్రముఖ జ్యువెలరీ సంస్థలు జోయ్ ఆలుక్కాస్, కల్యాణ్ జ్యువెలరీస్ ఎంపిక అయ్యాయి. 755 కోట్ల రూపాయల విలువ చేసే టెండర్లు ఇవి. బంగారం ఉంగరాన్ని తయారు చేయడం, రవాణా, ఇతరత్రా ఖర్చులను ఆ సంస్థలే భరించాల్సి ఉంటుంది.ఈ పథకం కింద తమిళనాడులోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో జన్మించే సుమారు 4.42 లక్షల మంది నవజాతా శిశువులకు ఒక్కో గ్రాము చొప్పున బంగారు ఉంగరాలను బహూకరిస్తారు. ఈ పథకానికి సంబంధించిన బంగారపు వ్యయాన్ని మార్కెట్ ధరల ఆధారంగా ప్రభుత్వమే భరిస్తుంది. నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా, సామాజికంగా అండగా నిలిచేందుకు విజయ్ ఈ పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోన్నారు.దీనికోసం తమిళనాడు మెడికల్ సర్వీసెస్ జూలై 14న దేశవ్యాప్తంగా టెండర్లను ఆహ్వానించింది. అధికారిక టెండర్ల పోర్టల్ ద్వారా జోయ్ ఆలుక్కాస్, కల్యాణ్ జ్యవెలరీస్, జీఆర్టీ జ్యువెలర్స్, ఉమ్మిడి జ్యువెలర్స్ వంటి మొత్తం 11 జ్యువెలరీ సంస్థలు ఈ బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొన్నాయి. బిడ్డింగ్ దాఖలు చేశాయి. ఆయా సంస్థల్లో అన్నింటికంటే తక్కువ ధరను కోట్ చేశాయి.. జాయ్ అలుక్కాస్, కల్యాణ్ జ్యువెలర్స్.ఆనందం పట్టలేక.. నిండు సభలో విజయ్ పై పాట పాడిన మహిళా ఎమ్మెల్యే: సిగ్గుతో మెలికలు తిరిగిన సీఎందీంతో వీటిని ప్రభుత్వం ఎంపిక చేసింది. 70:30 నిష్పత్తిలో బంగారు ఉంగరాల తయారీ, సరఫరా బాధ్యతలను అప్పగిస్తూ పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. జాయ్ ఆలుక్కాస్ అతి తక్కువ బిడ్డింగ్ నమోదు చేసింది. ఒకే ఒక్క పైసా సర్వీస్ ఛార్జీని మాత్రమే కోట్ చేస్తూ ఈ టెండర్‌ను దక్కించుకుంది. బంగారం ధర తప్ప.. ఉంగరం మేకింగ్ ఛార్జీలు, రవాణా, ఇన్సూరెన్స్, హాల్ మార్కింగ్, సర్వీస్ ఛార్జీలు.. అన్నింటికీ కలిపి ఒకే ఒక్క పైసా కోట్ చేసి టెండర్ దక్కించుకుంది జాయ్ అలుక్కాస్.సీఎం విజయ్ బిగ్
Gold Silver Rate Today : బంగారం, వెండి ధరలు ఇంటర్నేషనల్ మార్కెట్లో మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. దీంతో దేశీయంగా కూడా మళ్లీ గోల్డ్, సిల్వర్ రేట్లు ఎగబాకుతున్నాయి. గత 10 రోజుల వ్యవధిలో కేవలం ఒక్క రోజు మాత్రమే బంగారం ధర తగ్గింది. మిగతా అన్ని రోజులు భారీగా పెరుగుతూ పోయింది. ఈ క్రమంలో దాదాపు రూ. 6-7 వేల వరకు రేటు పెరిగిందని చెప్పొచ్చు. ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రస్తుతం స్పాట్ పసిడి రేటు ఔన్సుకు 4600 డాలర్ల మార్కు దాటి ట్రేడవుతోంది. సిల్వర్ ధర 69 డాలర్ల మార్కు వద్ద ఉంది. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ. 95.73 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని దిల్లీలో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,47,250 వద్ద ఉండగా, 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 1,60,630 వద్ద ఉంది. చెన్నై, ముంబై, బెంగళూరు, కోల్‌కతాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల పసిడి ధర వరుసగా రూ. 147100, రూ. 160480 వద్ద ట్రేడవుతోంది.హైదరాబాద్ నగరంలో బంగారం, వెండి ధరలుఅంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయంగా కూడా గోల్డ్, సిల్వర్ రేట్లు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆగస్ట్ 22న ఉదయం 7.30 గంటల సమయంలో హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1100 పెరిగి తులం రూ. 1,47,100 వద్ద ఉంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1210 పెరగడంతో 10 గ్రాములకు రూ. 1,60,480 వద్ద ఉంది.మరోవైపు హైదరాబాద్ మార్కెట్లో సిల్వర్ రేటు ఆగస్ట్ 22న రూ. 5 వేలు పెరిగింది. దీంతో ప్రస్తుతం కేజీకి రూ. 2.65 లక్షల వద్ద ఉంది. ముందటి రోజు వెండి ధర ఏకంగా రూ. 10 వేలు పెరగ్గా, దానికి ముందు మాత్రం రూ. 5 వేలు పడిపోయింది. ఇక గత 2

బంగారం ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాల ప్రభావం పసిడి ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. శనివారం ఉదయం నాటికి దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పుంజుకోగా, వెండి కూడా అదే బాటలో పయనించింది. కిలో వెండి ధర సుమారు రూ.100 మేర పెరిగింది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,60,490గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,47,110గా నమోదైంది. ఇదే సమయంలో 18 క్యారెట్ల పసిడి ధర రూ.1,20,370 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ.2,65,100కి చేరింది.దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లోనూ పసిడి ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు చోటుచేసుకున్నాయి. చెన్నై, ముంబై, కోల్‌కతా, కేరళ రాష్ట్రాల్లో ధరలు దాదాపు హైదరాబాద్ తరహాలోనే ఉన్నాయి. అయితే ఢిల్లీలో మాత్రం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,60,640గా, 22 క్యారెట్ల ధర రూ.1,47,260గా కొంచెం అధికంగా నమోదైంది

శ్రావణ మాసం రాకతో దేశమంతటా పండుగల కోలాహలం మొదలైంది. వరలక్ష్మీ వ్రతం, వినాయక చవితి, దసరా వేడుకల కోసం పసిడి ఆభరణాలు కొనుగోలు చేసేందుకు మహిళలు, కుటుంబాలు సిద్ధమవుతున్న వేళ మార్కెట్లో పసిడి ధరలు షాకిస్తున్నాయి.పెళ్లిళ్ల సీజన్, పండుగల సెంటిమెంట్‌కు తోడు గ్లోబల్ మార్కెట్లో నెలకొన్న పరిణామాలతో బంగారం ధరలు ఒక్కసారిగా రాకెట్ స్పీడ్ అందుకున్నాయి. ఈ ఒక్క వారంలోనే పసిడి ఏకంగా 5 శాతం మేర ప్రియమైంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 4,620 డాలర్ల దాకా చేరగా, దేశీయంగా ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల తులానికి రూ. 1,60,780 దాటేసింది. గడిచిన రెండున్నర నెలల కాలంలో పసిడి ఈ స్థాయి గరిష్ఠ రేటును తాకడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.ధరలు ఒక్కసారిగా పెరగడానికి అసలు కారణాలేంటి?అంతర్జాతీయంగా మారిన ఆర్థిక సమీకరణాలే ఈ సడన్ ర్యాలీకి ప్రధాన కారణమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ తమ రుణాలు తగ్గించుకునేందుకు బాండ్ల బైబ్యాక్‌ను రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించడంతో డాలర్ విలువ, బాండ్ ఈల్డ్స్ ఒక్కసారిగా క్షీణించాయి.మరోవైపు అమెరికాపై 40 ట్రిలియన్ డాలర్లకు పైగా అప్పుల భారం పెరగడం, పెరుగుతున్న ద్రవ్యోల్బణ భయాలు గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. విదేశీ కరెన్సీల కంటే సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్గా భావించే పసిడి వైపే పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు మొగ్గు చూపడంతో ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి.వామ్మో.. పసిడి ధరలు చూసి నివ్వెరపోతున్న సామాన్యుడుమున్ముందు బంగారం బాట ఎటు?బులియన్ మార్కెట్ విశ్లేషకుల అంచనా ప్రకారం... బంగారం గతంలో ఉన్న రూ. 1,53,000 - 1,56,000 పరిధి నుంచి దాటుకుని ఇప్పటికే రూ. 1,58,500 మైలురాయిని దాటేసింది. ప్రస్తుత ట్రెండ్ ఇలాగే కొనసాగితే త్వరలోనే 10 గ్రాముల బంగారం రూ. 1,62,000 మార్కును తాకినా ఆశ్చర్యపోనక్కర్లేదని భావిస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్ల నిర్ణయాలు, అమెరికా డాలర్ కదలికలు , మధ్యప్రాచ్య

బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో గురువారం (ఆగస్టు 20) 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు ఏకంగా రూ.4,300 పెరిగి రూ.1,59,270కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.3,950 పెరిగి రూ.1,46,000 పలికింది.అంటే ఒక్కరోజులోనే 24 క్యారెట్ల బంగారం దాదాపు 2.8 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరల్లో ఇటీవల చోటుచేసుకున్న భారీ కదలికలు దేశీయ మార్కెట్‌పైనా ప్రభావం చూపుతున్నాయి. అమెరికా డాలర్ విలువ, ట్రెజరీ బాండ్ ఈల్డ్స్‌లో మార్పులు, ఫెడ్ వడ్డీ రేట్లపై అంచనాలు వంటి అంశాలు పసిడి ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. తాజాగా అమెరికా ట్రెజరీ దీర్ఘకాలిక బాండ్ల బైబ్యాక్‌ను పెంచుతుందన్న వార్తల నేపథ్యంలో డాలర్, బాండ్ ఈల్డ్స్ బలహీనపడటంతో అంతర్జాతీయంగా బంగారం ధర ఒక్క సెషన్లో 4 శాతానికి పైగా ఎగిసింది. దీనికి తోడు అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు, రష్యా–ఉక్రెయిన్ పరిణామాలు వంటి భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కూడా పెట్టుబడిదారులను బంగారం వైపు మళ్లిస్తున్నాయి. అనిశ్చితి పెరిగినప్పుడు సురక్షిత పెట్టుబడి సాధనంగా పరిగణించే బంగారానికి డిమాండ్ పెరగడం సహజం. ఇదీ చదవండి: స్టాక్మార్కెట్లో కొత్త ప్రయత్నం.. ‘డబుల్ ట్రేడింగ్’! స్టన్నింగ్ లుక్‌లో అందాల తార పూజా హెగ్డే (ఫొటోలు) చీరలో మరింత అందంగా కనిపిస్తున్న ప్రియాంకా అరుళ్ మోహన్ (ఫొటోలు) చీరకట్టులో సొగసుల విందు.. నివేదా థామస్ (ఫొటోలు) విజయవాడ : వరలక్ష్మీ వ్రతం... పూల మర్కెట్లో విపరీతమైన రద్దీ (ఫొటోలు) రజినీకాంత్ ‘ధర్మన్’ సినిమాలో విలన్‌గా నటించనున్న రామ్ పోతినేని? జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ కూటమిపై సంచలన వ్యాఖ్యలు యువతిని కారుతో ఢీ కొట్టి చంపిన జనసేన MP కొడుకు అసలేం జరిగింది? ప్రియాంక తల్లిదండ్రుల మాటలు విని జగన్ కళ్లలో కన్నీళ్లు తిరిగాయి.. రిలీజ్ తరువాత జగన్ ను కలిసిన సీదిరి కుటుంబం

ఇంటర్నెట్ డెస్క్: బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. పసిడి ధర ఒకేరోజు దాదాపు రూ.4300 పెరిగింది. దీంతో దేశ రాజధానిలో 10 గ్రాముల బంగారం ధర రూ.1.62 లక్షలకు చేరుకుంది. ఈ స్థాయిలో పెరగడం మూడు నెలల్లో ఇదే గరిష్ఠం. మార్కెట్లో నిన్న బంగారం ధర సుమారు రూ.1.58 లక్షలుగా ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు, వెండి సైతం కిలోకు రూ.10 వేలు పెరిగి రూ.2.45 లక్షలకు చేరింది. గత ఏడు వారాల్లో ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. గోల్డ్ లోన్ రంగంలోకి ఆదిత్య బిర్లా కంపెనీ అంతర్జాతీయంగా చమురు మంటలు కొనసాగుతున్న వేళ అమెరికా డాలర్ విలువ పడిపోవడం.. యూఎస్ బాండ్లపై రాబడి తగ్గుతుండడంతో మదుపరులు లోహాల వైపు మొగ్గు చూపుతున్నట్లు మార్కెట్‌రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీంతో డిమాండ్ పెరిగి, బంగారం ధరలు పైపైకి పోతున్నట్లు చెబుతున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) మరమనుషుల కేరింతలు.. అబ్బురపరుస్తున్న వింత రోబోలు! (ఫొటోలు) బేబీ బంప్‌తో సమంత.. భర్త రాజ్ నిడిమోరుతో హాలిడే ఫొటోలు వైరల్ కొండను తొలిచి కట్టిన అద్భుత గుహాలయం..ఎక్కడో తెలుసా? (ఫొటోలు) సాంప్రదాయ దుస్తులులో మెరిసిన ముద్దుగుమ్మ అదా శర్మ..(ఫోటోలు) సీఎం రేవంత్ పై కొండా సుస్మిత తీవ్ర విమర్శలు.. కాంగ్రెస్ లో అసమ్మతి గళం పెరుగుతోందా..? అనుపమతో బ్రేకప్ పై ధృవ్ విక్రమ్ రియాక్షన్ ఇదే

బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు షాకింగ్ న్యూస్. ధరలు ఒక్కరోజే రికార్డ్ స్థాయిలో పెరుగుదలను నమోదు చేశాయి. గురువారం ధరలు భారీగా పెరిగాయి. ఈ వారం ప్రారంభం నుంచి పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. శ్రావణ మాసం ప్రారంభం కావడంతో పెళ్లిళ్ల సీజన్ మొదలుకావడం, త్వరలో ముఖ్యమైన పండుగలు వస్తున్న క్రమంలో ధరలు అమాంతం పెరగడం కొనుగోలు చేయాలనుకునేవారిని నిరాశపరుస్తోంది. ఆగస్ట్ 20న దేశంలోని వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయనేది చూద్దాం. హైదరాబాద్‌లో 10 గ్రామలు 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ.1,59,270కి చేరుకుంది. ఒక్కరోజే రూ.4300 పెరిగింది. 22 క్యారెట్ల ధర రూ.1,46,000 పలుకుతుండగా.. ఇవాళ రూ.3950 హైక్ అయింది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో 24 గ్రాముల బంగారం ధర రూ.1,59,270 వద్ద ట్రేడవుతుండగా.. గురువారం రూ.2180 పెరిగింది. 22 క్యారెట్ల రేటు రూ.1,46,000గా ఉండగా.. నేడు రూ.2 వేలు పెరిగి నిరాశకు గురి చేసింది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,270 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,46,000 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,59,420గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,46,150 వద్ద కొనసాగుతున్నాయి. అటు సిల్వర్ ధరలు కూడా భారీగా పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2.55 లక్షలు ప్రస్తుతం పలుకుతోంది. నిన్న ఈ ధర రూ.2.45 లక్షలుగా ఉండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.10 వేలు పెరిగి షాకిచ్చింది. హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ ధర రూ.2.60 లక్షలుగా ఉండగా.. నిన్న రూ.2.50 లక్షల వద్ద స్థిరపడింది. గురువారం రోజే ఒకేసారి రూ.10 వేలు పెరిగింది. చెన్నైలో కిలో వెండి రూ.2.60 లక్షలు, బెంగళూరులో రూ.2.55 లక్షలుగా కొనసాగుతోంది

బంగారం భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు. తరతరాలుగా నమ్మకమైన పెట్టుబడిగా, కష్టకాలంలో ఆదుకునే భరోసాగా దీనిని భావిస్తారు. స్వాతంత్య్రం వచ్చిన 1947లో 10 గ్రాముల బంగారం ధర కేవలం రూ.88.62 పైసలు ఉండగా, నేడు లక్షన్నర రూపాయలకు పైగా ఉంది. అంటే దాదాపు 80 ఏళ్లలో బంగారం ధర ఏకంగా 1711 రెట్లు పెరిగింది.ఈ భారీ పెరుగుదలకు ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం, రూపాయి విలువ, అంతర్జాతీయ బంగారం ధరలు, వడ్డీ రేట్లు, యుద్ధాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి అనేక అంశాలు కారణం. ముఖ్యంగా రూపాయి విలువ ప్రభావం భారత్‌లో బంగారం ధరపై అధికంగా ఉంటుంది. 1970లలో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం, చమురు సంక్షోభాలు, ఆర్థిక అనిశ్చితి వంటివి బంగారం ధర పెరగడానికి కారణమయ్యాయి. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం, 2020లో కరోనా మహమ్మారి వంటి ఘటనలు బంగారానికి సేఫ్ హెవెన్ హోదాను పెంచాయి. ప్రస్తుతం కూడా ప్రపంచవ్యాప్త అనిశ్చితి, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు ధరలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ 80 ఏళ్ల ప్రయాణం భారత ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం, ప్రపంచ పరిణామాలను ప్రతిబింబిస్తుంది. గ్లోబల్ బిజినెస్ లెక్కలు మార్చేస్తున్న రామాయణ టీమ్ ఫరియా అబ్దుల్లాను ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు అజిత్ సినిమాలో గెస్ట్ రోల్స్‌లో వెంకటేష్, మోహన్‌లాల్

గత కొన్ని రోజులుగా ఆగకుండా పరుగులు తీసిన పసిడి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.920 తగ్గి రూ.1,54,970కి చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.850 తగ్గడంతో రూ.1,42,050 వద్ద నమోదైంది. విజయవాడలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,54,970, 22 క్యారెట్ల పసిడి రూ.1,42,050, 18 క్యారెట్ల బంగారం రూ.1,16,920గా నమోదైంది. అయితే బంగారం ధరలు తగ్గాయన్న కారణంతో వెంటనే కొనుగోలు నిర్ణయం తీసుకోవడం కంటే.. మీ నగరంలోని రిటైల్ మార్కెట్ ధరలు, నగలపై మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ వంటి అంశాలను కూడా పరిశీలించడం మంచిది. ఇక పసిడి ధరలపై అంతర్జాతీయ పరిణామాల ప్రభావం మాత్రం కొనసాగుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ఇరాన్-అమెరికా మధ్య పెరుగుతున్న విభేదాలు మార్కెట్లలో ఆందోళన పెంచుతున్నాయి. ఇలాంటి సమయంలో పెట్టుబడిదారులు సాధారణంగా రిస్క్ ఉన్న ఆస్తుల కంటే బంగారం వంటి సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతారు. అందుకే పసిడి ధరల్లో భారీ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. మరోవైపు హర్మూజ్ జలసంధి అంశం కూడా మార్కెట్లను కలవరపెడుతోంది. ఇరాన్‌తో చర్చలకు ప్రస్తుతం ఆసక్తి లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. హర్మూజ్‌లో పరిమిత స్థాయిలో నౌకల రాకపోకలు కొనసాగుతున్నాయని, జలసంధి పూర్తిగా మూసుకుపోలేదని ఆయన పేర్కొన్నారు. అయితే ఇరాన్ మాత్రం అమెరికా వాదనలను ఖండిస్తోంది. తమ డిమాండ్లు నెరవేరే వరకు హర్మూజ్‌పై ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఒమన్ విషయంలోనూ అమెరికా వైఖరి తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇరాన్‌తో సంప్రదింపుల్లో ఒమన్ వ్యవహరిస్తున్న తీరుపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. మరోవైపు సౌదీ అరేబియాలోని చమురు శుద్ధి కేంద్రంపై డ్రోన్ దాడి చేసినట్లు ఇరాన్ సపోర్ట్ ఉన్న హూతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. ఈ పరిణామాలతో ముడిచమురు మార్కెట్లలోనూ ఆందోళన కొనసాగుతోంది

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) సాంప్రదాయ దుస్తులులో మెరిసిన ముద్దుగుమ్మ అదా శర్మ..(ఫోటోలు) కేబీఆర్ ట్రాఫిక్ ‘ట్రాప్’.. ఎటు వెళ్లాలో తెలియక జనం పరేషాన్!(చిత్రాలు) చీరకట్టులో మంత్రముగ్ధం చేస్తున్న శ్రీలీల అందం ...(ఫొటోలు) అదితి రావు స్టన్నింగ్ లుక్స్.. సిద్ధార్థ్‌తో స్పెషల్ మూమెంట్స్! (ఫొటోలు) దొంగల మాట దేవుడెరుగు...? పోలీస్ కారులో గంజాయి.. హోమ్ మినిస్ట్ ర్ పై తాటిపర్తి సెటైర్లు ఒక అవిటి తల్లికి భయపడే చేతకాని చెత్త ప్రభుత్వం

అంతర్జాతీయ మార్కెట్ లో నెలకొన్న సంక్లిష్ట పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఆందోళనల నేపథ్యంలో పసిడి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటూ వస్తోన్నాయి. స్థిరత్వాన్ని కోల్పోయాయి. హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. మొన్నటిదాకా పెరుగుతూ వచ్చిన రేట్లు నేడు భారీగా తగ్గాయి. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్తు వడ్డీ రేట్లపై ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతుందనే విషయంపై మార్కెట్ వర్గాలు ఎదురుచూస్తోన్నాయి.మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో మంగళవారం నాటి క్లోజింగ్ సెషన్స్ తో పోల్చుకుంటే నేడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో 920 రూపాయల మేర తగ్గుదల కనిపించింది. 22 క్యారెట్లల్లో 850, 18 క్యారెట్లల్లో 690 రూపాయల వరకు క్షీణత నమోదైంది. పండగ సీజన్ లో బంగారాన్ని కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఉపశమనాన్ని కల్పించినప్పటికీ.. దీర్ఘకాల పెట్టుబడులు పెట్టిన వారికి శరఘాతంగా పరిణమించింది.అటు అంతర్జాతీయ కొమెక్స్ మార్కెట్లో కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. డిసెంబర్ బంగారం ఫ్యూచర్స్ 0.28 శాతం నష్టపోయి ఔన్స్‌కు 4,450.80 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. స్పాట్ వెండి ధర కూడా భారీగా పతనమైంది. 1.38 శాతం తగ్గి ఔన్స్ వెండి ధర 63.15 డాలర్ల వద్ద నిలిచింది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక అవగాహన ఒప్పందం (MOU) గడువు ముగియడం, దాని పొడిగింపుపై ఎలాంటి చర్చలు జరగకపోవడం మార్కెట్ వర్గాల్లో ఆందోళనలను మరింత పెంచింది.బంగారం ధరల్లో అంచనాలు తలకిందులువివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.చెన్నై..24 క్యారెట్లు- రూ. 15,497, 22 క్యారెట్లు - రూ. 14,205, 18 క్యారెట్లు - రూ. 11,985ముంబై..24 క్యారెట్లు - రూ. 15,497, 22 క్యారెట్లు- రూ. 14,205, 18 క్యారెట్లు - రూ. 11,623బెంగళూరు..24 క్యారెట్లు - రూ. 15,497, 22 క్యారెట్లు- రూ. 14,205, 18 క్యారెట్లు - రూ. 11,623హైదరాబాద్..24 క్యారెట్లు - రూ
Latest Gold Silver Rates : భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టం. ఏదైనా పండగ వచ్చినా, ఇంట్లో పెళ్లి, ఇతర శుభకార్యం ఏది ఉన్నా కచ్చితంగా బంగారం కొనాల్సిందే. ధరించాల్సిందే. ఎక్కువగా మహిళలే బంగారు ఆభరణాల్ని కొని ధరించేందుకు ఇష్టపడుతుంటారు. ఇందుకోసం ఎప్పటినుంచో డబ్బులు పొదుపు చేసే వారు కూడా ఉంటారు. పైసాపైసా కూడబెట్టి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు లేదా ధర తగ్గినప్పుడు కొందామని చూస్తుంటారు. ఇంకా ఆడపిల్లలకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపించే సమయంలో కూడా వారికి తల్లిదండ్రులు ఎంతో కొంత బంగారం చేయించి పంపిస్తుంటారు. ఇది భారత సంస్కృతి, సంప్రదాయాల్లో భాగంగా వస్తోంది. అంతలా బంగారం అనేది భారతీయ సంప్రదాయాలతో ముడిపడి ఉంది. ఇంకా బంగారం అంటే కేవలం అలంకరణ సామగ్రి మాత్రమే కాదు పెట్టుబడికి కూడా మంచి సాధనం. దీంట్లో ఇన్వెస్ట్ చేసేవారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుంది.బంగారంతో పాటు కొంత కాలంగా వెండికి కూడా విపరీతంగా డిమాండ్ పెరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇది గతేడాది రికార్డు స్థాయిలో 150 శాతం పెరిగింది. అక్కడి నుంచి మళ్లీ తగ్గినప్పటికీ దీర్ఘకాలంలో పెట్టుబడికి మంచి సాధనంగా దీనిని భావిస్తుంటారు. ఇక గతేడాది ఏకంగా 70 శాతానికిపైగా పెరిగిన పసిడి ధర ఈ ఏడాది మాత్రం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుంది. ముఖ్యంగా పశ్చిమాసియా ఉద్రిక్తతలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, క్రూడాయిల్ ధరలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. సాధారణంగా క్రూడాయిల్ ధరలు అధిక స్థాయిల్లో ఉంటే బంగారం ధర తగ్గుతుంది. ఈ ఏడాది మార్చి నుంచి జూన్ వరకు దాదాపు అదే జరిగింది. కానీ ఇటీవల మాత్రం ఫెడ్ వడ్డీ రేట్లపై అనిశ్చితి పరిస్థితిని మారుస్తోంది.క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నా ఇదే సమయంలో బంగారం ధర గత కొద్ది సెషన్లుగా వరుసగా పెరుగుతూనే వచ్చింది. పండగ, పెళ్లిళ్ల సీజన్లో డిమాండ్ ఉండటం ప్రధాన కారణం. అయితే ఇప్పుడు ఎట్టకేలకు అంతర్జాతీయ మార్కెటలో బంగారం, వెండి ధరలు

Gold Price Today: భారతీయ కుటుంబాల్లో బంగారం కొనుగోలుకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో పసిడి ధరలు పెరగడం సగటు కొనుగోలుదారులను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. గత వారం రోజుల్లోనే తులం బంగారంపై రూ.3,500 కంటే ఎక్కువ పెరుగుదల నమోదైంది. మంగళవారం ధర కాస్త పెరగ్గా, బుధవారం నాటికి కూడా అదే ధోరణి కొనసాగుతూ స్వల్పంగా రేట్లు పైకి కదిలాయి. ప్రస్తుతం స్థానిక మార్కెట్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,910 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరల్లో ఈ ఊహించని మార్పులకు అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న ఉద్రిక్తతలే ప్రధాన కారణమని బులియన్ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణ పూరిత వాతావరణం ఉండటం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ తీవ్ర రూపం దాల్చడంతో ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రపంచ దేశాల మధ్య సైనిక, ఆర్థిక అనిశ్చితి నెలకొన్న ప్రతిసారీ పసిడికి డిమాండ్ పెరిగి, మార్కెట్లో ధరలు ఉన్నపళంగా పైకి లేవడం సాధారణంగా మారిన పరిణామం. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఒకే రీతిలో పయనిస్తున్నాయి. ఈ నగరాల్లో 24 క్యారెట్ల బిస్కట్ బంగారం 10 గ్రాముల రేటు రూ.1,55,900 వద్ద విక్రయమవుతోంది. ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,910 వద్ద నిలిచింది. వెండి కూడా బంగారం తోటి పోటీపడుతూ దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.2,54,900 మార్కును తాకింది. చెన్నైలో కూడా వెండి ఇదే స్థాయిలో ఉండగా, ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రూ.2,49,900 వద్ద లభ్యమవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో స్థానిక పన్నుల ప్రభావంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,56,050 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,43,060 గా ఉంది. ముంబై, బెంగళూరు నగరాల్లో

దేశీయంగా శ్రావణ మాసం ప్రారంభం కావడంతో పెళ్లిళ్లు, పండుగల సీజన్ ఊపందుకుంది. దీంతో బంగారం కొనుగోళ్లకు డిమాండ్ పెరగడం కూడా ధరలపై ప్రభావం చూపుతోంది. ఆగస్టు 18న దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర సుమారు రూ.1,55,590 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,900 స్థాయిలో ఉంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,890గా నమోదైంది. సోమవారంతో పోలిస్తే సుమారు రూ.230 పెరిగింది. 22 క్యారెట్ల ధర రూ.1,42,900గా ఉండగా.. దాదాపు రూ.200 మేర పెరుగుదల కనిపించింది. నగరాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు. అయితే బంగారం ధరల పెరుగుదలకు కేవలం దేశీయ డిమాండ్ మాత్రమే కారణం కాదు. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు కూడా కీలకంగా మారాయి. ముఖ్యంగా అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఇరు దేశాల మధ్య తాత్కాలిక అవగాహన గడువు ముగిసినా శాశ్వత శాంతి ఒప్పందం కుదరకపోవడం ఇన్వెస్టర్లలో ఆందోళన పెంచుతోంది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి పరిస్థితి ఇప్పుడు కీలకంగా మారింది. ప్రపంచ చమురు రవాణాలో ఈ మార్గానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఇక్కడ రవాణాకు అంతరాయం ఏర్పడితే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెరుగుతోంది. చమురు ధరలు పెరిగితే రవాణా, ఉత్పత్తి ఖర్చులు పెరిగి ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలు మళ్లీ పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతారు. ఇక అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు కూడా బంగారం ధరలకు కీలకమే. వడ్డీ రేట్లపై అంచనాలు మారడం, అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ పెరగడం, డాలర్ కదలికలు.. ఇవన్నీ అంతర్జాతీయ గోల్డ్ మార్కెట్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయి. దేశీయంగా

అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గుల మధ్య బంగారం ధరలు మళ్లీ ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లో భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు, బాండ్ ఈల్డ్స్‌లో మార్పులు రావడం వల్ల ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడి మార్గంగా భావించి పసిడి వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు డాలర్ మారకం విలువలో కదలికలు కూడా బంగారం పెరుగుదలకు ప్రధాన కారణమయ్యాయి. రానున్న రోజుల్లో వివాహాల సీజన్ కూడా ప్రారంభం కానుండటంతో ధరలు మరింత భేతాళుడిలా పైకి లేచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.పెరిగిన రేట్లు.. తులం ఎంత ఉందంటే?ఆగస్టు 17 సోమవారం నాటి రేట్లను పరిశీలిస్తే.. దేశీయంగా బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 24 క్యారట్ల మేలిమి బంగారం గ్రాముపై రూ.53 పెరిగి రూ.15,566 వద్దకు చేరింది. సాధారణంగా ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారట్ల ఆభరణాల బంగారం గ్రాముకు రూ.50 పెరిగి రూ.14,270 వద్ద నమోదుకాగా, 18 క్యారట్ల బంగారం గ్రాముకు రూ.41 పెరిగి రూ.11,676 గా ఉంది. దీని ప్రకారం 100 గ్రాముల 24 క్యారట్ల బంగారంపై ఏకంగా రూ.5,300 పెరిగి రూ.15,56,600 టచ్ చేసింది. ఇక వెండి ధర కూడా భారీగా పెరిగింది. గ్రాముపై రూ.255 పెరగుదల నమోదవ్వగా.. ప్రస్తుతం కిలో రూ.2,55,000 గా ఉంది. వెండి వెలిగిపోతుంది. రూల్స్ మార్చినా సేల్స్ తగ్గేదేలే తెలుగు రాష్ట్రాల నగరాల్లో నేటి ధరలు!మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో బంగారం ధరలు ఒకే రీతిగా నమోదయ్యాయి.24 క్యారట్ల పసిడి (10 గ్రాములు): రూ.530 పెరిగి రూ.1,55,660 వద్ద ట్రేడ్ అవుతోంది.22 క్యారట్ల పసిడి (10 గ్రాములు): రూ.500 పెరిగి రూ.1,42,700 నమోదు కాగా..18 క్యారట్ల పసిడి (10 గ్రాములు): రూ.410 పెరిగి రూ.1,16,760 వద్దకు చేరింది.18 ఏళ్ల కుర్రాడికి దొరికిన రూ.98 కోట్ల లంకె బిందెలు!దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో ఇలా..ఇక దేశవ్యాప్తంగా ప్రధాన మెట్రో

బంగారం కొనుగోలు చేసేవారికి భారీ షాక్ తగిలింది. గోల్డ్ రేట్లు ఆమాంతం ఒక్కసారిగా పెరిగాయి. వారం ప్రారంభంలోనే ఆకాశాన్నంటి నిరాశపర్చాయి. గత వారంలో రూ.3 వేలపైగా గోల్డ్ రేట్లు పెరగ్గా.. వెండి ధర కూడా అదే బాటలో నడిచింది. సోమవారం ధరలు పెరగడంతో ఈ వారంలో కూడా ఇదే విధంగా కొనసాగే అవకాశముందనే అంచనాలు వ్యాపార వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఆగస్ట్ 17న బంగారం, వెండి ధరలు వివిధ నగరాల్లో ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,660కి చేరుకోగా.. నేడు ఒక్కరోజే రూ.530 పెరిగింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,42,700 వద్ద కొనసాగుతుండగా.. ఇవాళ రూ.500 మేర పెరుగుదలను నమోదు చేసింది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,55,120కి చేరుకోగా.. 22 క్యారెట్ల ధర రూ.1,42,190గా ట్రేడవుతోంది. ఇక బెంగళూరులో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,55,660 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,700గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,810గా ఉండగా.. సోమవారం ఒక్కరోజే రూ.530 మేర పెరిగింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,42,850గా ఉండగా.. ఇవాళ రూ.500 పెరిగింది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,660గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,700గా ఉంది. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కిలో వెండి ధర ముంబైలో రూ.2.50 లక్షలుగా ఉంది. ఇక ఢిల్లీలో కూడా ఇదే ధర పలుకుతుండగా.. హైదరాబాద్‌లో కేజీ వెండి రూ.2,54,900గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి రూ.2,54,900గా ట్రేడవుతోంది

బంగారం ధరలు గత వారంలో భారీగా పెరిగాయి. అంతర్జాతీయంగా అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటం, రష్యా-ఉక్రెయిన్ మధ్య ఘర్షణలు మళ్లీ మొదలుకావడంతో గోల్డ్ రేట్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇక అమెరికా ఆర్ధిక గణాంకాలు బలహీనపడటం, యూఎస్ ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు స్థిరంగా ఉంటాయనే అంచనాలు వెలువడంతో గోల్డ్ రేట్లలో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. గత వారంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. ఆగస్ట్ 10వ తేదీ నుంచి శనివారం వరకు హైదరాబాద్ బులియన్ మార్కె్ట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.3160 పెరిగింది. ప్రస్తుతం ధరలు రూ.1,55,130 వద్ద కొనసాగుతున్నాయి. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.2900 పెరగ్గా.. రూ.1,42,200కి చేరుకుంది. ఇక కిలో వెండి గత వారంలో రూ.5 వేల మేర పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.2.55 లక్షలుగా కొనసాగుతోంది. గత వారంలో ఏకంగా 0.86 శాతం గోల్డ్ రేట్లు పెరిగాయి. మధ్యప్రాచర్యంలో ఉద్రిక్తతలు, హర్ముజ్ జలసంధి చుట్టూ నెలకొన్న పరిణామాలతో ముడి చమురు ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. దీంతో పాటు భౌగోళిక ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చిత, వివిధ దేశాల కరెన్సీ విలువల్లో మార్పులతో ధరలు పెరుగుతున్నాయి. శుక్రవారం ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ (అక్టోబర్) 0.73 శాతం లాభపడి రూ.1,54,590 వద్ద నిలిచాయి. ఇక ఎంసీఎక్స్ సిల్వర్ ఫ్యూచర్స్ (సెప్టెంబర్) 0.15 శాతం పెరిగి కిలోకు రూ. 2,36,272 వద్ద ట్రేడయ్యాయి. మధ్యప్రాచ్యర్యంలో ఉద్రిక్తతలతో పాటు ట్రెజరీ ఈల్డ్స్ తగ్గడం, అమెరికా డాలర్ బలహీనపడటం వంటి కారణాల వల్ల బంగారం, వెండి ధరలు పెరిగినట్లు ఆర్ధిక విశ్లేషకులు చెబుతున్నారు. రెండు నెలల తర్వాత బంగారం ధరలు మళ్లీ గరిష్ట స్థాయిని అందుకున్నాయి. హోర్ముజ్ జలసంధికి సంబంధించి అమెరికా-ఇరాన్‌లు పరిష్కారం చూపుతాయనే ఆశలు సన్నగిల్లాయి. దీంతో గత వారం అమ్మకాల ఒత్తిడి నుంచి ముడి చమురు ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. ముడి
Gold Rate Today : భారతీయులకు బంగారంపై చాలా ఇష్టం ఉంటుంది. పండగలు, పర్వదినాలు, పెళ్లిళ్లు అంటూ ప్రత్యేక సందర్భాల్లో ఎక్కువగా బంగారం కొంటుంటారు. ప్రస్తుతం ఆషాఢ మాసం ముగిసి శ్రావణ మాసం ప్రారంభమైంది. దీంతో పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. ఇక బంగారం కొనుగోళ్లు భారీగా జరగనున్నాయి. ఇలాంటి సమయంలో బంగారం ధరలు భారీగా పెరగడం కొనుగోలుదారులనుఆందోళనకు గురి చేస్తేంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండడం, ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు చేయడం, అమెరికా డాలర్ విలువ, ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాల వంటివి బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. అయితే, గత రెండు రోజులుగా భారీగా పెరిగిన పసిడి ధరలు ఇవాళ స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మన స్థానిక మార్కెట్లు హైదరాబాద్, విజయవాడల్లో ఆగస్టు 16వ తేదీన బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ రేట్లుఅంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు (Global Market Gold Rate) భారీగానే పెరుగుతున్నాయి. ఇవాళ మాత్రం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 13 డాలర్లు పెరిగి 4376 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అయితే, స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 0.16 శాతం మేర తగ్గి 64.70 డాలర్ల వద్ద అమ్ముడవుతోంది.హైదరాబాద్‌లో బంగారం ధరలుహైదరాబాద్ మార్కెట్లో వరుసగా 2 రోజులు పెరిగిన బంగారం ధరలు (Gold Rates In Hyderabad) ఇవాళ స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రెండు రోజుల్లో రూ.1500 పైన పెరిగింది. ఇవాళ స్థిరంగా తులం బంగారం రేటు రూ.1,55,130 వద్ద ట్రేడవుతోంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు 10 గ్రాములకు రూ.1,42,200 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.విజయవాడలో బంగారం ధరలుఆంధ్రప్రదేశ్లోని విజయవాడ బులియన్ మార్కెట్లోనూ ఈరోజు పసిడి రేట్లు (Gold Price In Vijayawada) మారకుండా స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు తులానికి రూ.1,55,130

బంగారం ధరలు భారీగా పెరిగాయి. మూడ్రోజులుగా పడిపోతూ వస్తోండగా.. శనివారం తగ్గుదలకు బ్రేక్ పడింది. గంటల్లోనే ధరలన్నీ తారుమారు అయ్యాయి. దీంతో బంగారం కొనాలనుకునేవారికి షాక్ తగిలిందని చెప్పవచ్చు. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. ఈ పెంపు తర్వాత దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,130 వద్ద కొనసాగుతుండగా.. నిన్నటితో పోలిస్తే రూ.710 పెరిగాయి. 22 క్యారెట్ల రేటు రూ.1,42,200 పలుకుతుండగా.. శుక్రవారంతో పోలిస్తే ఇవాళ ఒక్కరోజే రూ.650 పెరిగింది. ఇక విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,54,910 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ. 1,42,000 వద్ద పలుకుతున్నాయి. బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,55,130గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,42,200 వద్ద ట్రేడవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,280 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,350 పలుకుతున్నాయి. అటు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.2.50 లక్షల వద్ద కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2.55 లక్షలుగా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.2.55 లక్షలుగా కొనసాగుతోంది. బెంగళూరులో కేజీ సిల్వర్ ధర రూ.2.50 లక్షలు పలుకుతోంది

మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. అయితే ఇది కేవలం దేశీయ మార్కెట్లో డిమాండ్ పెరగడం వల్ల వచ్చిన పెరుగుదల కాదు. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. బంగారం ధర వెనుక ఒకేసారి చాలా కారణాలు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య పరిస్థితులు మళ్లీ కీలకంగా మారాయి. హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు గణనీయంగా తగ్గిపోయాయి. ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి పెంచుతుండగా.. మరోవైపు హోర్ముజ్ మార్గంలో నౌకలపై దాడుల వార్తలు వస్తున్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదో వంతు ఈ మార్గంపైనే ఆధారపడి ఉండటంతో మార్కెట్లలో ఆందోళన పెరుగుతోంది. దీని ప్రభావం నేరుగా ముడి చమురు ధరలపై పడుతోంది. ఆగస్టు 14న బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 88 డాలర్లకు పైగా చేరగా.. వారంలోనే దాదాపు 6 శాతం పెరిగింది. చమురు ధరలు ఎక్కువకాలం ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే అవకాశం ఉందన్న భయం మార్కెట్లను వెంటాడుతోంది. ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం, ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం లేదా మార్కెట్లో భారీ ఒడిదుడుకులు కనిపిస్తే.. పెట్టుబడిదారులు సాధారణంగా సురక్షిత ఆస్తుల వైపు చూస్తారు. బంగారం అలాంటి ప్రధాన Safe Haven Asset. అందుకే భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారీ పసిడికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంలో మార్కెట్ అంచనాలు మారుతున్నాయి. తాజాగా వచ్చిన అమెరికా ద్రవ్యోల్బణం, ఉద్యోగాలకు సంబంధించిన డేటా కారణంగా సెప్టెంబర్‌లో వెంటనే రేటు పెంపు ఉండకపోవచ్చన్న అంచనాలు బలపడ్డాయి. డాలర్ కూడా కొంత బలహీనపడటంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి డిమాండ్ లభించింది. అంతేకాదు.. సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నాయి. రాయిటర్స్ విశ్లేషణ ప్రకారం 2026 రెండో త్రైమాసికంలో సెంట్రల్ బ్యాంకుల గోల్డ్ కొనుగోళ్లు 289 టన్నులకు చేరాయి. వచ్చే ఏడాదిలో తమ గోల్డ్ నిల్వలను పెంచాలని దాదాపు
22k Gold Price Today: అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరగడం, ఇదే సమయంలో క్రూడాయిల్ ధరలు కూడా పెరగడంతో గత వారం 10 రోజులుగా బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరుగుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక్కడ ప్రధానంగా అమెరికా- ఇరాన్ మధ్య శాంతి చర్చలు కొలిక్కి రాకపోవడం సహా రష్యా- ఉక్రెయిన్ మధ్య మళ్లీ భీకర దాడులు జరుగుతుండటం, హర్ముజ్ జలసంధి పూర్తి స్థాయిలో తెరుచుకోవడంపై అనిశ్చితి నేపథ్యంలో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. మరోవైపు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కూడా వడ్డీ రేట్లను పెంచుతుందన్న అంచనాలతో బంగారం ధరలు వరుసగా పెరిగాయి. అయితే ఒక్కసారిగా గరిష్ఠాల నుంచి ధరలు దిగొస్తున్నాయి. వరుసగా రెండో రోజు కూడా దేశీయంగా బంగారం, వెండి ధరలు పతనం అయ్యాయి.ఇప్పుడు 2 నెలల గరిష్ఠ స్థాయి నుంచి ధరలు దిగొస్తుండటంతో కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ గరిష్ఠ స్థాయిల వద్ద ప్రాఫిట్ బుకింగ్ జరిగిందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో రేట్లు పెద్దగా తగ్గకపోయినా, దేశీయంగా మాత్రం దిగొస్తున్నాయి. ప్రస్తుతం దేశీయంగా హైదరాబాద్ నగరంలో అదే విధంగా అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు ఆగస్ట్ 15న ఉదయం ఎలా ఉన్నాయో చూద్దాం.ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్లకు చెందిన బంగారు ఆభరణాల ధర రూ. 650 పతనంతో తులానికి రూ. 1,40,150 కి దిగొచ్చింది. కిందటి రోజు కూడా (ఆగస్ట్ 14) ఇది రూ. 1150 మేర తగ్గింది. దానికి ముందు చూస్తే వారం రోజుల్లోనే రూ. 7 వేలకుపైగా ఎగబాకింది. మరోవైపు 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర రూ. 710 తగ్గడంతో తులం రూ. 1,52,890 కి పడిపోయింది. ఇక్కడ కిందటి రోజు రూ. 1260 పతనమైంది.Read Also: బంగారాన్ని నిషేధించిన భారత్.. చివరికి అదే పసిడి దేశాన్ని ఎలా ఆదుకుంది? 22 ఏళ్లలో ఏం

బంగారం కొనాలనుకునే వారికి ఎట్టకేలకు కాస్త ఊరటనిచ్చే వార్త వచ్చింది. వరుసగా పెరుగుతూ ఆల్‌టైమ్ గరిష్ఠాలకు చేరువైన పసిడి ధరలు ఇప్పుడు ఒక్కసారిగా కూల్ అయ్యాయి. దేశీయ మార్కెట్లో బంగారం రేట్లు భారీగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాలతో పాటు అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా పసిడి ధరపై ప్రభావం చూపించాయి. గత మూడు రోజులుగా బంగారం ధరలు వరుసగా పెరుగుతూ వచ్చాయి. దీంతో ఇన్వెస్టర్లు భారీగా లాభాలను ఆర్జించారు. అయితే అమెరికా ద్రవ్యోల్బణం అంచనాల కంటే తక్కువగా నమోదవడంతో మార్కెట్లో కీలక మార్పులు కనిపించాయి. మరోవైపు డాలర్ విలువ బలపడటంతో బంగారంపై ఒత్తిడి పెరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో కొంతమంది ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించేందుకు బంగారాన్ని విక్రయించారు. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు దిగొచ్చాయి. హైదరాబాద్, విజయవాడ బులియన్ మార్కెట్లలో ఆగస్టు 13 సాయంత్రం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,260 తగ్గి రూ.1,53,600కు చేరింది. 22 క్యారెట్ల బంగారం కూడా రూ.1,150 తగ్గి రూ.1,40,800 వద్దకు వచ్చింది. అయితే తగ్గుదల ఇక్కడితో ఆగలేదు. ఇవాళ ఉదయం మరోసారి పసిడి రేట్లు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.710 తగ్గడంతో రూ.1,52,890కి చేరింది. 22 క్యారెట్ల ధర కూడా రూ.650 తగ్గి రూ.1,40,150 వద్ద స్థిరపడింది. వెండి విషయానికి వస్తే.. కిలో వెండి ధర రూ.5,000 తగ్గింది. దీంతో కిలో వెండి ప్రస్తుతం రూ.2.55 లక్షల వద్ద కొనసాగుతోంది. ఇక అంతర్జాతీయ పరిణామాలు కూడా బంగారం ధరలకు కీలకంగా మారాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల పరిస్థితి, అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న విభేదాలు, హార్ముజ్ జలసంధిపై నెలకొన్న టెన్షన్ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ మధ్య దాడులు మళ్లీ తీవ్రం కావడంతో క్రూడ్ ఆయిల్ ధరల్లో కూడా కదలికలు కనిపిస్తున్నాయి. మరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో మార్కెట్లలో అనిశ్చితి మాత్రం పూర్తిగా తొలగిపోలేదు

Gold Price Today News: బంగారం, వెండి కొనాలనుకునే వారికి శుభవార్త. శ్రావణ మాసం పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైన క్రమంలో బంగారం ధరలు గత మూడు రోజులుగా పెరుగుతూ వచ్చాయి. అయితే శ్రావణ మాసం ప్రారంభమైన మొదటి రోజే బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. 24 క్యారెట్ల బంగారంపై దాదాపుగా రూ.1,260 (10 గ్రాములకు) తగ్గింపు అందుబాటులోకి వచ్చింది. వెండి ధరకు గ్రాముకు రూ.260 వద్ద పరిమితమయ్యాయి. ఈ వారంలో జరగనున్న అమెరికా ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగినా.. అమెరికాకు చెందిన సెంటర్ కీలక శాంతి ఒప్పందం.. ఇప్పుడు మార్కెట్ పై సానుకూల ప్రభావం చూపింది. అలాగే అమెరికా సెంట్రల్ బ్యాంక్ (యూఎస్ ఫెడ్) వడ్డీ రేటులో ఎలాంటి మార్పులు చేయకుండా స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించడంతో బంగారం ధరలు దిగొచ్చాయి. ఈ వారం ఒడిదుడుకులను ఎదుర్కొంటూ బంగారం భారీగా తగ్గుముఖం పట్టింది. నిన్నటి రోజు ఉన్న ధరలతో పోలిస్తే ఆగస్టు 13వ తేదీన 24 క్యారెట్ల విలువైన 10 గ్రాముల బంగారం ఏకంగా రూ.1,260 తగ్గి.. రూ.1,53,600 ధరకు చేరుకుంది. మరోవైపు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,150 తగ్గుముఖం పట్టి రూ.1,40,800 ధరకు చేరింది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.940 తగ్గిపోయి రూ.1,15,200 వద్దకు చేరింది. బంగారంతో పాటుగా వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నారు. ఈ వారం ప్రారంభం నుంచి క్రమంగా పెరుగుతున్న వెండి ధర నేడు అనగా ఆగస్టు 13 నాటికి రూ.2,60,000 వద్దకు చేరింది. భారీగా ధరలో పతనమైన తర్వాత ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి నిన్నటితో పోలిస్తే నేడు బంగారం ధరల్లో భారీ మార్పు కనిపిస్తోంది. మరోవైపు వెండి ధరల్లో కూడా నిన్నటితో పోలిస్తే మార్పులు లేదు

ఆగస్టు 13న హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,130గా కొనసాగుతోంది. బుధవారంతో పోలిస్తే రూ.270 పెరిగింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,42,200 వద్ద ఉంది. ఇందులోనూ రూ.250 పెరుగుదల నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇదే స్థాయిలో ధరలు కొనసాగుతున్నాయి. వెండి ధర కిలోకు సుమారు రూ.2.60 లక్షల స్థాయిలో ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒక్కటే. దేశీయంగా ధరలు స్వల్పంగా పెరిగినా.. అంతర్జాతీయ మార్కెట్లో జరుగుతున్న పరిణామాలే బంగారం తదుపరి దిశను నిర్ణయించే అవకాశం ఉంది. సాధారణంగా డాలర్ బలపడటం, అమెరికా ట్రెజరీ బాండ్ల రాబడులు పెరగడం బంగారానికి ప్రతికూలంగా పనిచేస్తాయి. ఎందుకంటే బంగారం ఎలాంటి వడ్డీ ఆదాయం ఇవ్వదు. మరోవైపు బాండ్లపై రాబడులు పెరిగితే పెట్టుబడిదారులకు ప్రత్యామ్నాయంగా అమెరికా బాండ్లు ఆకర్షణీయంగా మారతాయి. అలాగే డాలర్ బలపడితే ఇతర కరెన్సీల్లో బంగారం ఖరీదుగా మారుతుంది. దీంతో గోల్డ్‌పై ఒత్తిడి రావచ్చు. కానీ ప్రస్తుతం మార్కెట్లో మరో అంశం ఈ ప్రభావాన్ని బ్యాలెన్స్ చేస్తోంది. అదే అమెరికా ద్రవ్యోల్బణం, ఫెడరల్ రిజర్వ్ తదుపరి నిర్ణయాలపై ఉన్న అంచనాలు. అమెరికాలో జూలై CPI డేటా మార్కెట్ అంచనాలకు అనుగుణంగా వచ్చింది. హెడ్లైన్ ద్రవ్యోల్బణం ఏడాది ప్రాతిపదికన 3.4 శాతంగా, కోర్ CPI 2.5 శాతంగా నమోదైంది. ఈ డేటా ఊహించినంత వేడిగా లేకపోవడంతో వెంటనే సెప్టెంబర్‌లో ఫెడ్ వడ్డీ రేట్లు పెంచుతుందనే భయం కొంత తగ్గింది. అంటే ఇక్కడ ఒక ఆసక్తికరమైన పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు డాలర్, బాండ్ యీల్డ్స్ బంగారంపై ఒత్తిడి పెంచుతున్నాయి. మరోవైపు ఫెడ్ పాలసీపై మారుతున్న అంచనాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక, భౌగోళిక రాజకీయ అనిశ్చితి బంగారాన్ని సేఫ్-హేవెన్ ఆస్తిగా నిలబెడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ తాజాగా 4,400 డాలర్ల స్థాయిని దాటినట్లు మార్కెట్ రిపోర్టులు సూచిస్తున్నాయి. జూలై అమెరికా CPI డేటా తర్వాత సెప్టెంబర్ ఫెడ్ రేటు పెంపు భయాలు తగ్గాయి

దేశీయ మార్కెట్లో పసిడి ప్రియులకు ఊరట లభించట్లేదు. బంగారం ధరలు నేడు కూడా పెరిగాయి. బుధవారం నాటితో పోల్చుకుంటే స్వల్పంగా పెరుగుదలను నమోదు చేశాయి. రానున్న పండుగలు, వివాహాల సీజన్ తరుణంలో ఈ ధరల పెరుగుదల కొనుగోలుదారులకు మరింత భారంగా మారినట్టయింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ఆర్థిక పరిణామాలు, డాలర్ ఇండెక్స్ ఒడిదొడుకులు పసిడి ధరలపై నేరుగా ప్రభావం చూపాయి.అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిస్థితులు, దేశీయంగా పెరుగుతున్న స్పాట్ డిమాండ్ కారణంగా వరుసగా నాలుగు రోజులుగా బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పైకి ఎగబాకుతున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో బుధవారం నాటి క్లోజింగ్ సెషన్స్ తో పోల్చి చూస్తే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో స్వల్పంగా పెరుగుదల నమోదైంది. 270 రూపాయల మేర పెరిగింది. 22 క్యారెట్లల్లో రూ. 250, 18 క్యారెట్లల్లో 210 రూపాయల మేర పెరుగుదల చోటు చేసుకుంది.ఇది స్వల్పమే అయినప్పటికీ.. కిందటి వారం నుంచి స్థిరంగా పెరుగుతూ వస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. మున్ముందు వీటి ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదనే సంకేతాలను ఇచ్చినట్టయింది. ఇప్పటికే ఎంసీఎక్స్ అక్టోబర్ ఫ్యూచర్ గోల్డ్ కాంట్రాక్టులు 1,58,000 రూపాయల మార్క్ ను దాటవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. దీనికి అనుగుణంగా నేడు కూడా ధరలు పెరగడం చర్చనీయాంశమౌతోంది.కర్ణాటక బంద్ ఎఫెక్ట్: బెంగళూరులో నామమాత్రం- ఆ 5 జిల్లాల్లో ఉధృతంహైదరాబాద్ లో 24 క్యారెట్లు బంగారం ధర 10 గ్రాములకు రూ.1,55,530, 22 క్యారెట్లు రూ.1,42,200 వద్ద నిలిచింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,55,130, 22 క్యారెట్లు రూ.1,42,200 వద్ద స్థిరపడింది. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,55,130 కాగా 22 క్యారెట్లు రూ.1,42,220 వద్ద నమోదైంది. చెన్నైలో ఇవే రేట్లు రూ.1,55,630, 22 క్యారెట్లు రూ.1,44,210 వద్ద కొనసాగుతోంది.డొనాల్డ్ ట్రంప్ టీమ్ లో బిగ్ వికెట్

శ్రావణ మాసం ఎఫెక్ట్.. బంగారం ప్రియులకు బిగ్‌షాక్.. అసలు కారణమిదే.. నేటి ధరలు ఇలా.. Gold Silver Price Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాక్. ఇవాళ కూడా గోల్డ్ రేటు పెరిగింది. ఈ వార్తకు సంబంధించిన

బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో ధరల్లో భారీ పెరుగుదల నమోదవుతోంది. అమెరికన్ డాలర్ విలువ పెరగడంతో పాటు 10 సంవత్సరాల బాండ్ల రాబడులు పెరిగాయి. దీంతో పాటు జూలైకి సంబంధించిన అమెరికా ద్రవ్యోల్బణం, సెప్టెంబర్‌లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాలు గోల్డ్ ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. దేశంలో వివిధ నగరాల్లో ఆగస్ట్ 13న ధరలు ఎలా ఉన్నాయనేది పరిశీలిద్దాం. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,55,130 వద్ద కొనసాగుతుండగా.. నిన్నటితో పోలిస్తే రూ.270 పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,42,200గా ఉండగా.. నేడు రూ.250 పెరుగుదల నమోదైంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు ఉన్నాయి. ఇక చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,55,130గా ఉండగా.. గురువారం రూ.220 మేర పెరిగాయి. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,42,200 వద్ద ట్రేడవుతుండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.200 పెరిగాయి. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,130గా ఉండగా.. 22 క్యారెట్లు రూ.1,42,200 పలుకుతోంది. అటు దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,55,280 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,42,350 పలుకుతోంది. అటు వెండి ధరలు మాత్రం స్దిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2.55 లక్షలు పలుకుతోంది. ఇక హైదరాబాద్‌లో కిలో సిల్వర్ రేటు రూ.2.60 లక్షల వద్ద ఉంది. అటు ఉదయం 9:10 గంటల ప్రాంతంలో మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ (MCX)లో గోల్డ్ అక్టోబర్ ఫ్యూచర్స్ 0.05 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.1,54,960 వద్ద ఉండగా.. MCX సిల్వర్ సెప్టెంబర్ కాంట్రాక్టులు 0.16 శాతం తగ్గి కిలోకు రూ.2,37,450 వద్ద ఉన్నాయి

అంతర్జాతీయ మార్కెట్లలో కనిపిస్తున్న సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా పెరుగుతున్న స్పాట్ డిమాండ్ కూడా పసిడి ధరలకు సపోర్ట్ గా నిలుస్తోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ అంటే MCXలో గోల్డ్, సిల్వర్ ధరలు దాదాపు ఒక శాతం మేర పెరిగాయి. దీంతో బులియన్ మార్కెట్లో మరోసారి కొనుగోళ్ల సందడి కనిపిస్తోంది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలపై మార్కెట్ వర్గాల్లో అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,040 పెరిగి రూ.1,54,860కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల పసిడి ధర కూడా పెరిగింది. 10 గ్రాములపై రూ.950 పెరుగుదలతో రూ.1,41,196 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధర విషయానికి వస్తే.. కిలో రూ.2.60 లక్షల స్థాయిలో కొనసాగుతోంది. ఇక అంతర్జాతీయ పరిణామాలను పరిశీలిస్తే.. మళ్లీ ఉద్రిక్తతలు పెరగడం కూడా పసిడి ధరలకు కలిసొస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ అనిశ్చితి పెరిగిన సమయంలో పెట్టుబడిదారులు సాధారణంగా బంగారాన్ని సురక్షిత పెట్టుబడి సాధనంగా భావిస్తారు. దీంతో గోల్డ్‌కు డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు అమెరికా డాలర్ కదలికలు, ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లపై కొనసాగుతున్న అనిశ్చితి కూడా పసిడి మార్కెట్‌పై ప్రభావం చూపుతోంది. దీనికి పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు కూడా తోడవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో MCXలో అక్టోబర్ ఫ్యూచర్స్ గోల్డ్ కాంట్రాక్టులు రూ.1,58,000 మార్క్‌ను దాటే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ విలువ, కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు, భౌగోళిక రాజకీయ పరిణామాలను బట్టి ధరల్లో మార్పులు రావచ్చు

గోల్డ్ ప్రియులకు భారీ షాక్. బంగారం ధరలు వరుసగా రెండో రోజు భారీగా పెరిగాయి. మంగళవారం రూ.3 వేలకుపైగా పెరగ్గా.. ఇవాళ కూడా రూ.వెయ్యి పెరుగుదలను నమోదు చేసింది. దీంతో రాబోయే రోజుల్లో గోల్డ్ రేట్లు మరింత పెరగవచ్చనే వార్తలకు ఇది బలం చేకూరుస్తోంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య దాడులు ప్రారంభం కావడం, డాలర్ విలువ, ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లపై అస్పష్టత వంటివి పసిడి ధరలపై ప్రభావితం చూపిస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కూడా వీటికి తోడయ్యాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,54,860 వద్ద కొనసాగుతోడగా.. బుధవారం ఒక్కరోజే రూ.1040 పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,41,950గా ఉండగా.. ఇవాళ రూ.950 మేర పెరుగుదలను నమోదు చేశాయి. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. త్వరలో శ్రావణ మాసం ప్రారంభం కానుండటం, పెళ్లిళ్ల సీజన్ క్రమంలో ధరలు పెరగడం చేదువార్తగా చెప్పవచ్చు. ఇక చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ.1,54,380 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,41,358గా ఉంది. అటు బెంగళూరులో 24 క్యారెట్ల ధర చూస్తే రూ.1,54,860గా ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,41,950 వద్ద కొనసాగుతోంది. అటు దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,010 వద్ద ఉండగా.. ఇవాళ రూ.1040 పెరిగింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,42,100 వద్ద కొనసాగుతుండగా.. నేడు రూ.950 పెరిగింది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,860 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,41,950గా ఉంది. వెండి ధరలు స్ధిరంగా కొనసాగుతున్నాయి. ముంబైలో కిలో వెండి ధర రూ.2.55 లక్షలుగా ఉంది. హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ రేటు రూ.2.60 లక్షలుగా ఉంది. చెన్నైలో కూడా కిలో సిల్వర్ ధర రూ.2.60 లక్షల వద్ద కొనసాగుతోంది

బంగారం ధరలు మరోసారి ఆకాశాన్నంటాయి. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పసిడికి డిమాండ్ పెరగడంతో ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. బుధవారం నాటి బులియన్ మార్కెట్లో బంగారం ధరలు గత రెండు నెలల గరిష్ఠస్థాయికి చేరుకున్నాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,850గా నమోదైంది.అంతర్జాతీయంగా చైనా సెంట్రల్ బ్యాంకుతో పాటు ఇతర సంస్థాగత ఇన్వెస్టర్లు బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తుండటంతో, పెరిగిన డిమాండ్ ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ కారణంగానే దేశీయ మార్కెట్లోనూ పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.తెలుగు రాష్ట్రాలు, ప్రధాన నగరాల్లో ధరల వివరాలు..హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,850 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,41,010గా, 18 క్యారెట్ల ధర రూ.1,15,380గా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, తిరుపతి వంటి ప్రాంతాల్లో కూడా దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే చెన్నైలో బంగారం ధర అత్యధికంగా ఉంది. అక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,380గా ఉండగా, న్యూఢిల్లీలో రూ.1,53,980, ముంబైలో రూ.1,53,830గా నమోదైంది. అయితే, ఈ ధరలకు జీఎస్టీ, తయారీ ఛార్జీలు అదనంగా ఉంటాయని బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి