
Farmers Protest | అప్రకటిత విద్యుత్ కోతలపై రైతుల ధర్నా.. సబ్‌స్టేషన్ ముట్టడి
Farmers Protest | అప్రకటిత విద్యుత్ కోతలపై రైతుల ధర్నా.. సబ్‌స్టేషన్ ముట్టడి
© 2026 nimisham.in

Farmers Protest | అప్రకటిత విద్యుత్ కోతలపై రైతుల ధర్నా.. సబ్‌స్టేషన్ ముట్టడి

Farmers Protest | నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని సబ్ స్టేషన్ ఎదుట రైతుల ధర్నా

Farmers Protest | రేవంత్‌రెడ్డి ఇలాకాలో కరెంట్ కోతలకు నిరసనగా రైతుల రాస్తారోకో..!

దశాబ్దాల కాలం నాటి కల సాకారమైంది. ఉత్తరాంధ్ర బీళ్లకు జీవం పోసేందుకు గోదారమ్మ పరవళ్లు తొక్కుతూ తరలివచ్చింది. ఈ చారిత్రక ఘట్టంతో పులకించిపోయిన ఉత్తరాంధ్ర రైతులు, ప్రజలు.. తమ ప్రాంతానికి గోదావరి జలాలు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు మనసారా కృతజ్ఞతలు తెలిపారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద పోలవరం ఎడమ ప్రధాన కాలువ నుంచి గోదావరి జలాలను విడుదల చేసిన ముఖ్యమంత్రి, ఈ అపూర్వ ఘట్టానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు.బుధవారం పాయకరావుపేట వద్ద క్రాస్ రెగ్యులేటర్ నుంచి ఉత్తరాంధ్ర భూముల్లోకి అడుగుపెట్టిన గోదావరి జలాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించి, జలహారతి ఇచ్చారు. అరుణ వర్ణంలో ప్రవహిస్తున్న పవిత్ర జలాలను శిరస్సున చల్లుకుని, భావోద్వేగంతో కాలువలో నిల్చుని పుష్పాలు, పసుపు కుంకుమ సమర్పించారు. అనంతరం గోదావరి తల్లికి సాష్టాంగ నమస్కారం చేసి తన ప్రణామం అర్పించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన స్థానిక రైతులు, మహిళలు హారతులు పడుతూ, పూలు చల్లుతూ గోదారమ్మకు స్వాగతం పలికారు.ఉత్తరాంధ్ర ఉన్నతాంధ్రగా మారుతుంది: సీఎంఅనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. "ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్లు వచ్చాయి. ఇక ఈ ప్రాంతంలోని బీళ్లన్నీ పంటలతో కళకళలాడతాయి. అన్నవరం సత్యదేవుడి ఆశీస్సులతో అనకాపల్లికి వచ్చిన గోదారమ్మను.. వచ్చే ఏడాదికి సింహాచలం అప్పన్న చెంతకు, ఆపై అరసవల్లి సూరీడి పాదాల వద్దకు తీసుకెళ్లి, వంశధార వరకు గోదావరి జలాలను తరలిస్తాం" అని స్పష్టం చేశారు.ఈ ప్రాజెక్టు ద్వారా తొలి దశలో తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో 2.87 లక్షల

మెట్పల్లి : జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట, నడికుడ గ్రామాల మధ్య సర్వేనెంబర్ 299/2/1 లో అక్రమంగా జారీ చేసిన పట్టాలను వెంటనే రద్దు చేయాలని ఆ రెండు గ్రామాలకు చెందిన రైతులు బుధవారం మెట్పల్లి రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. పశుగ్రాసం కోసం వదిలిన ఈ స్థలాన్ని నడికుడకు చెందిన నర్సారెడ్డి అనే వ్యక్తి డి వన్ పేరిట అక్రమంగా పట్టా పొందడమే కాకుండా అక్రమంగా భూ రీ సర్వే చేపిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అక్రమ పట్టాలను రద్దు చేయడంతో పాటు భూమి రీ సర్వేను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాఘవపేట, నడికుడ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు

రైతులను అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు నాటకాలు ఆడుతున్నారని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. రైతులకు సాగు, తాగు నీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయడానికి ప్రణాళికలు వేస్తున్నామని ఆయన తెలిపారు. వైసీపీ నేతల మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం, సెప్టెంబర్ 2: శ్రీశైలం జలాల కోసం వెలుగోడు రిజర్వాయర్ ముట్టడి పేరుతో మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, ఆయన కొడుకు రవి కిషోర్ రెడ్డి నాటకాలు ఆడుతున్నారని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఎల్ నినో ప్రభావం వల్ల నీరు వచ్చే పరిస్థితి లేదని, అందువల్ల ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని ఆరు నెలల క్రితమే స్పష్టం చేశామని ఆయన పేర్కొన్నారు. కానీ వైసీపీ నాయకులు రైతులను అడ్డం పెట్టుకుని శ్రీశైలం జలాల కోసం పోరాటాలు చేయడం రైతులను తప్పుదోవ పట్టించడమే అవుతుందని ఆయన అన్నారు. తమ ఉనికిని కాపాడుకోవడం కోసం రైతులను అడ్డుపెట్టుకుని డ్రామాలు చేయడం సమంజసం కాదని హితవు పలికారు. రైతుల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లయితే వైసీపీ హయాంలో రైతుల సంక్షేమం కోసం ఏం చేశారో చెప్పాలని రాజశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. శిల్పా చక్రపాణి రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు రైతులకు నీళ్లు ఇచ్చారో చెప్పాలని ఆయన నిలదీశారు. ‘వైసీపీ ప్రభుత్వ హయాంలో కర్నూలులో నీటి సమస్యలను పరిష్కరించాలని అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ దగ్గరికి వెళ్తే మీరేం చేశారు.. పోలీసులతో రైతులను అడ్డగించలేదా..? ఆనాడు ఏం అయింది మీ చిత్తశుద్ధి?’ అని ఎమ్మెల్యే నిలదీశారు. పిఠాపురం అభివృద్ధిపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్ సత్ఫలితాలిస్తున్న అక్షర ఆంధ్ర... సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నాం: మంత్రి లోకేశ్ ఏపీలో ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర కరువు పరిస్థితులు: మంత్రి ఆనం

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో సాగునీరు పుష్కలంగా అందుబాటులో ఉన్నప్పటికీ రాజకీయ కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోయడం లేదని ఆయన మీడియా ముందు తీవ్రంగా ఆరోపించారు. అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచినా ఒక్క కొత్త సాగునీటి డ్యామ్ లేదా బ్యారేజ్ కూడా ఈ ప్రభుత్వం నిర్మించలేదని కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికే నిరుపయోగంగా మారిన చెక్ డ్యామ్‌లను పేల్చివేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల కడుపు కొడుతోందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుల సాగునీటి అవసరాల కోసం అత్యంత ప్రధాన ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం నిర్మించడం జరిగింది. మేడిగడ్డ బ్యారేజీలో తలెత్తిన నిర్మాణ సమస్యల కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణను పూర్తిగా విస్మరించి పక్కన పెట్టిందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర సంస్థల నివేదికలు మరియు ఎన్డీఎస్ఏ అఫిడవిట్లు ఉన్నప్పటికీ కన్నెపల్లి వంటి కీలక పంప్‌హౌస్‌లను పూర్తి స్థాయిలో నడపడం లేదని ఆయన తెలిపారు. పంపింగ్ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టమైనప్పటికీ కావాలనే నీటిని ఎత్తిపోయకుండా రైతన్నలకు ప్రస్తుత పాలకులు తీరని అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా చిన్న కాఫర్ డ్యామ్ నిర్మించి నీటిని లిఫ్ట్ చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. నీటి సమస్యలపై లేఖలు రాసిన రిటైర్డ్ ఇంజినీర్లను బెదిరించడం అలాగే తెలంగాణ ఉద్యమకారులను అవమానించడం ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. దీంతో పెద్దవాగు ప్రాజెక్టు దెబ్బతినడం, సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలడం వంటి ఘటనలతో రాష్ట్రంలోని రైతులకు భారీ స్థాయిలో నష్టం జరుగుతోంది. ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినా మృతదేహాలు వెలికితీయకపోవడం ప్రభుత్వ అసమర్థతకు

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో ఉన్న ఆక్వా రంగానికి(Fisheries) మేత తయారీ కంపెనీలు భారీ షాక్ ఇచ్చాయి. ఏలూరు జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా రొయ్యల సాగు చేసే ఆక్వా రైతుల ఆమోదం లేకుండా, ప్రభుత్వం లేదా అప్సడా (APSADA) ముందస్తు అనుమతులు తీసుకోకుండానే ఫీడ్ కంపెనీలు ఏకపక్షంగా రొయ్యల మేత ధరలను భారీగా పెంచేశాయి. పెరిగిన ఈ నూతన ధరలు నిన్నటి నుంచే తక్షణమే అమల్లోకి వచ్చాయి. ఫీడ్ కంపెనీలు ప్రకటించిన కొత్త రేట్ల ప్రకారం.. అత్యధికంగా సాగు చేసే వెనామీ రొయ్యల మేతపై కిలోకు రూ.9 చొప్పున (టన్నుకు రూ.5,700 వరకు) పెంచారు. అలాగే బ్లాక్ టైగర్ రొయ్యల మేతపై కిలోకు ఏకంగా రూ.12 చొప్పున (టన్నుకు రూ.3,850 వరకు) భారాన్ని మోపారు. సోయాబీన్, ఫిష్‌మీల్ వంటి ముడిసరుకుల కొరత మరియు వాటి అంతర్గత రవాణా వ్యయాలు విపరీతంగా పెరగడం వల్లే తాము ధరలు పెంచాల్సి వచ్చిందని ఫీడ్ తయారీ కంపెనీలు సమర్థించుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల ధరలు పడిపోవడం, వైరస్ తెగుళ్లు ముంచెత్తడంతో ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆక్వా రైతులకు ఈ తాజా ధరల పెంపు ‘మూలిగే నక్కపై తాటిపండు’ పడ్డ చందంగా మారింది. ప్రభుత్వం ఇటీవల కాలంలో ధరల నియంత్రణ కోసం ప్రత్యేక మానిటరింగ్ కమిటీ వేసినప్పటికీ, ఫీడ్ కంపెనీలు దాన్ని బేఖాతరు చేస్తూ ఏకపక్షంగా ధరలు పెంచడంపై ఆక్వా రైతు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మేత కంపెనీల దోపిడీకి వ్యతిరేకంగా ఏలూరు జిల్లా సహా కోస్తా తీర ప్రాంతాల రైతులంతా కలిసి పెద్ద ఎత్తున నిరసనలకు సిద్ధమవుతున్నారు. ఈ ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో ఫీడ్ బ్రాండ్లను బహిష్కరిస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. ఈ వివాదంపై చర్చించి తదుపరి పోరాట పంథాను ఖరారు చేసేందుకు ఆక్వా రైతు సంఘం ఈరోజు అత్యవసర సమావేశం నిర్వహించి, భారీ ఉద్యమ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది
వృద్ధురాలికి తమిళనాడు సీఎం విజయ్ గిఫ్ట్.. ఆమె ఫుల్ ఖుషీ తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్.. సాలేమ్ జిల్లా పర్యటనలో భాగంగా ఒక గ్రామీణ ప్రాంతంలో పర్యటించారు. కావేరి డెల్టా సాగు నీటి కోసం మెట్టూరు జలశాయం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే అధికారిక కార్యక్రమం నిమిత్తం.. సీఎం విజయ్ సాలేమ్ వెళ్లారు. ఈ కార్యక్రమం అనంతరం సాలేమ్ విమానాశ్రయానికి తిరుగు పయనమవుతున్న సమయంలో.. మార్గమధ్యలో ఒక పొలం వద్ద.. కాన్వాయ్‌ను ఆపాలని సెక్యూరిటీకి సూచించారు. అలా దగ్గర్లోని పొలంలో పని చేసుకుంటున్న కొందరు మహిళల వద్దకు స్వయంగా కారు దిగి సీఎం విజయ్ వెళ్లారు. ఆ ప్రాంతానికి చెందిన చెల్లమ్ అనే వృద్ధురాలు ఆశ్చర్యంతో ముందుకు వచ్చి ఆయన చేయి పట్టుకున్నారు. "భోజనం చేశావా?" అని సీఎం విజయ్ ఆమెను ఆప్యాయంగా పలకరించగా.. మిమ్మల్ని చూడాలని అలాగే ఎదురుచూస్తున్నాను.. అందుకే ఇంకా తినలేదు అని ఆమె బదులిచ్చారు. ఈ వార్తకు సంబంధించిన

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన పర్యటనలో ఒక రైతు కుటుంబానికి అనూహ్య రీతిలో ఆశ్చర్యాన్ని కలిగించారు. మంగళవారం సేలం జిల్లాలో పర్యటించిన ఆయన, ఒక గ్రామంలో ఆకస్మికంగా ఆగి స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఒక వృద్ధురాలు చూపిన ఆత్మీయతకు ముగ్ధుడైన ఆయన, తాను ధరించిన కళ్లజోడును ఆమెకు బహుమతిగా అందించి అందరినీ ఆశ్చర్యపరిచారు.సేలం జిల్లాలోని మెట్టూరు డ్యామ్ గేట్లను తెరిచి, సాగునీటిని విడుదల చేసే క్రమంలో ముఖ్యమంత్రి విజయ్ అక్కడికి చేరుకున్నారు. కార్యక్రమం ముగించుకుని చెన్నైకి తిరుగుప్రయాణమైన ఆయన, మార్గమధ్యలోని చిన్నకావూరు గ్రామం వద్ద తన కాన్వాయ్‌ను నిలిపివేశారు. నేరుగా రామస్వామి అనే రైతు నివాసానికి వెళ్లి ఆ కుటుంబ సభ్యులను పలకరించారు.ముఖ్యమంత్రి స్వయంగా తమ ఇంటికి రావడంతో ఆ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షాతిరేకలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఒక వృద్ధురాలు ముఖ్యమంత్రిని చూడగానే అమితానందానికి లోనయ్యారు. ఆత్మీయంగా ఆయన్ను ఆలింగనం చేసుకుని, చేతిని గట్టిగా పట్టుకుని తన అనురాగాన్ని చాటుకున్నారు. అనంతరం తన పెరట్లోని తోటను ఆయనకు చూపించారు. ఆమె అభిమానానికి చలించిన విజయ్, తక్షణమే తాను ధరించిన కళ్లజోడును తీసి ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఆ తర్వాత గ్రామంలోని వృద్ధులకు చీరలు, పంచెలు పంపిణీ చేసి అక్కడి నుంచి నిష్క్రమించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా, విజయ్ ఆ బామ్మకు బహూకరించిన సన్ గ్లాసులు వరల్డ్ క్లాస్ సంస్థ 'క్రిస్టియన్ డయోర్' తయారు చేసినవి. వీటి ధర రూ.50 వేలకు పైనే

అన్నదాతలకు గుడ్ న్యూస్.. అక్టోబర్‌లో ఖాతాల్లోకి రూ.6వేలు పీఎం కిసాన్ 24వ విడత, అన్నదాత సుఖీభవపై కీలక అప్డేట్ పీఎం కిసాన్ రూ.2వేలు, అన్నదాత సుఖీభవ రూ.4వేలు PM Kisan 24th Installment: రైతులకు నిజంగా పండగలాంటి వార్త.. పీఎం కిసాన్ 24వ విడత, అన్నదాత సుఖీభవకు సంబంధించి కీలక్ అప్డేట్ వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) 24వ విడత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు అతి త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. అక్టోబర్ తొలి వారంలోనే ఈ డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో పడే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.. అక్టోబర్‌లో PM Kisan 24వ విడత? దేశవ్యాప్తంగా అర్హులైన రైతులకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద ఏడాదికి రూ.6వేలు ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ మొత్తాన్ని ఏడాదిలో 3 విడతలుగా, ఒక్కో విడతకు రూ.2వేలు చొప్పున నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. ఇదివరకే 23వ విడత నిధులు రైతులకు అందాయి. ఇప్పుడు 24వ విడత కోసం అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. మొదట ఈ విడతను వినాయక చవితి సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. లేటెస్ట్ డేటా ప్రకారం.. అక్టోబర్ తొలి వారంలో పీఎం కిసాన్ 24వ విడత విడుదలకు కేంద్రం ప్లాన్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ రైతులకు డబుల్ బెనిఫిట్.. ఒకేసారి రూ.6వేలు? : ఆంధ్రప్రదేశ్ రైతులకు మాత్రం ఈసారి అదనపు బెనిఫిట్ లభించే ఛాన్స్ ఉంది. పీఎం కిసాన్ కింద కేంద్రం అందించే రూ.6వేలు వార్షిక సాయానికి రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ పథకం కింద మరో రూ.14వేలు కలిపి మొత్తం రూ.20వేలు వార్షిక పెట్టుబడి సాయం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా ఇప్పుడు ఆ నిధుల విడుదలపై కసరత్తు జరుగుతోంది

చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణం 21వ వార్డు చెర్లోపల్లి ప్రాంతంలో అక్రమంగా కొనసాగుతున్న క్వారీలు, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న బ్లాస్టింగ్ల కారణంగా రైతులు, స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. తరతరాలుగా వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న రైతుల పంట పొలాలకు సమీపంలో ఇష్టారాజ్యంగా క్వారీలు నిర్వహిస్తూ పేలుళ్లు జరపడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ పేలుళ్ల కారణంగా రాళ్లు ఎగిరిపడి భూములు కంపిస్తున్నాయని, ఇళ్లు, బోర్లు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రమాదం జరిగి ప్రాణాలు పోయిన తర్వాత ప్రభుత్వం స్పందిస్తుందా అని నిలదీశారు. కేంద్రానికి రోజా రిక్వెస్ట్.. హైవే సమస్యపై అలుపెరుగని పోరాటం!చెర్లోపల్లి రైతులు తమ ఆవేదనను పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని రోజా ఆరోపించారు. పోలీసు శాఖతో పాటు ఇతర అధికారులకు ఫిర్యాదు చేసినా, ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటూ కాలయాపన చేయడం సరికాదన్నారు. క్వారీలకు అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయా? పర్యావరణ, గనుల, రెవెన్యూ, పోలీసు శాఖల నిబంధనలు పాటిస్తున్నారా? అనే దానిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. క్వారీ యాజమాన్యాలకు రాజకీయ అండదండలు ఉన్నాయని, నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్‌పై వస్తున్న క్వారీ వసూళ్ల ఆరోపణలపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.ఆ పని చేయకుంటే కూటమి ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోమన్న రోజా ప్రమాదం జరిగే వరకు ఎదురుచూడొద్దు!ఒక ప్రాణం పోయిన తర్వాతో, రైతు భూమి నాశనమైన తర్వాతో పరిహారం ఇచ్చినా పోయిన జీవనాధారం తిరిగి రాదని రోజా స్పష్టం చేశారు. ప్రమాదాలు జరిగే వరకు ప్రభుత్వం నిద్రపోకుండా ఇప్పటికైనా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. చెర్లోపల్లి ప్రాంతంలోని అక్రమ క్వారీలను వెంటనే నిలిపివేసి, అనుమతులు లేకుండా జరుగుతున్న బ్లాస్టింగ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మేలు

Nirmal: ఆచరణాత్మక విద్యతోనే సృజనాత్మకత కేజీబీవీ తనిఖీలో కలెక్టర్ మిశ్రా ఈ వార్తకు సంబంధించిన

అన్నదాతలకు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఒకవైపు వర్షాలు, ఎల్ నినో కష్టాలు, మరోవైపు పండుగల సీజన్ స్టార్ట్ కావడంతో పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుడ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అవుతున్నాయి. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 24వ విడత నిధులతో పాటు ఏపీ ప్రభుత్వం అందించే 'అన్నదాత సుఖీభవ' సొమ్మును ఒకేసారి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేందుకు ముమ్మర కసరత్తు జరుగుతోంది. పీఎం కిసాన్ కింద అర్హులైన రైతులకు కేంద్రం ఏటా రూ.6,000 ఇస్తుందనే విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని ప్రతి నాలుగు నెలలకొకసారి రూ.2,000 చొప్పున మూడు విడతల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా జమ చేస్తారు. గతేడాది జూన్ నెలలో 23వ విడత నిధులు అందాయి. అయితే 24వ విడత నిధులను మొదట వినాయక చవితి పండుగ కానుకగా ఈ నెలలోనే విడుదల చేయాలని అనుకున్నప్పటికీ, లేటెస్ట్ సమాచారం ప్రకారం అక్టోబర్ మొదటి వారంలో విడుదల చేయడానికి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని రైతులకు ఇది రెట్టింపు సంతోషాన్నిచ్చే వార్త. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ రూ.6,000 కి అదనంగా ఏపీ ప్రభుత్వం 'అన్నదాత సుఖీభవ' పథకం ద్వారా మరో రూ.14,000 కలిపి మొత్తం రూ.20,000 వార్షిక సాయంగా అందిస్తోంది. కేంద్రం 24వ విడత కింద రూ.2,000 విడుదల చేసే సమయంలోనే, ఏపీ ప్రభుత్వం కూడా తన వంతు వాటాను కలిపి రూ.6,000 ఒకే విడతగా రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. దీనివల్ల పండుగల వేళ ఏపీ రైతులకు ఆర్థికంగా భారీ ఉపశమనం కలగనుంది. పథకంలో పేరు నమోదైనంత మాత్రాన డబ్బులు పడతాయని అనుకుంటే పొరపాటే. నిధులు అకౌంట్లో జమకావాలంటే కొన్ని నియమాలు పాటించడం తప్పనిసరి. • e-KYC పూర్తవ్వాలి: మీ ఆధార్ సీడింగ్, ఇ-కేవైసీ కంప్లీట్ కాకపోతే తదుపరి విడత డబ్బులు నిలిచిపోతాయి

PM Kisan- అన్నదాత సుఖీభవ నిధుల జమ పైన బిగ్ అప్డేట్. 24వ విడత నిధుల జమ పైన కసరత్తు జరుగుతోంది. వరుస పండుగలు.. ఎల్ నినో కష్టాల వేళ రైతుల ఖాతాల్లో నిధుల జమ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కేంద్రం విడుదల చేస్తున్న పీఎం కిసాన్ నిధులతో కలిపి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. మలి విడత నిధుల పైనా రైతులకు కీలక సమాచారం అందిస్తున్నారు.పీఎం కిసాన్ 24వ విడత నిధుల జమ పైన కేంద్రం సిద్దం అవుతోంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అర్హులైన రైతులకు ఏటా రూ.6,000 ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని మూడు విడతలలో పంపిణీ చేస్తున్నారు. ప్రతి విడత రూ.2,000 చొప్పున నేరుగా రైతు బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తారు. ఈ పథకం కింద విడతలు సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి విడుదలవుతాయి. చివరి విడత అయిన 23వ విడత జూన్‌లో విడుదలైంది. దీంతో.. 24వ విడత నిధుల జమ పైన చర్చ సాగుతోంది. ఈ నెలలోనే తొలుత విడదల చేయాలని భావించారు. వినాయక చవితి వేళ ఈ నిధులు జమ చేయాలని ఆలోచన చేసారు. అయితే, కేంద్రంలో ఈ మేరకు తాజాగా జరిగిన చర్చల్లో అక్టోబర్ తొలి వారంలో ఈ నిధులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ పథకంలో నిధులు పొందే రైతులు తమ కేవైసీ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.తిరుపతికి విమానాల రాకపోకల షెడ్యూల్ మార్పు, కొత్త టైమింగ్స్..!!రైతులకు కీలక సూచనలురైతులు ఇంకా తమ ఇ-కేవైసీని పూర్తి చేయకపోతే, వారి తదుపరి వాయిదా జమ నిలుపుదల చేసే అవకాశం ఉందని చబుతున్నారు. పీఎం కిసాన్ వాయిదా స్థితిని తెలుసుకోవాలనుకుంటే రైతులుఆన్లైన్లో సులభంగా తనిఖీ చేసుకోవచ్చు. అదే విధంగా పీఎం కిసాన్ నిధుల జమ సమయంలోనే ఏపీ ప్రభుత్వం

ఎల్‌నినో ప్రభావంతో సరైన వర్షాలు పడకపోవటంతో రాష్ట్రంలో ఖరీఫ్ పంటలు గట్టెక్కుతాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆగస్టు నెలలో వర్షపాతం గణనీయంగా పడిపోవటంతో పంటలు ఆశించినంతగా ఎదగలేదు. ప్రస్తుత వానాకాలం సీజన్లో మిగిలింది ఒకే నెల గత 3 నెలల్లో రాష్ట్రంలో 17శాతం లోటు వర్షపాతం పడిపోనున్న వరి, పత్తి, మొక్కజొన్న దిగుబడి ఇకపై వరి నాట్లు వేయొద్దని శాస్త్రవేత్తల సూచన ఎల్‌నినోతో దేశవ్యాప్తంగా వరిసాగులో తగ్గుదల హైదరాబాద్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో సరైన వర్షాలు పడకపోవటంతో రాష్ట్రంలో ఖరీఫ్ పంటలు గట్టెక్కుతాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆగస్టు నెలలో వర్షపాతం గణనీయంగా పడిపోవటంతో పంటలు ఆశించినంతగా ఎదగలేదు. చిరు జల్లులు ఊరిస్తున్నా జలాశయాల్లోకి వరదనీరు వచ్చే పరిస్థితులు కనిపించకపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆగస్టులో రాష్ట్రంలో 38 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మొత్తంగా ఈ వర్షాకాలంలో గడిచిన మూడు నెలల్లో 17 శాతం లోటు వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాలకు జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలలే కీలకం. సెప్టెంబరులో సాధారణ వర్షపాతం 167.1 మి.మీ. ఇప్పటికే లోటు ఉండటంతో సెప్టెంబరులో సాధారణానికి మించి వర్షపాతం నమోదుకావాలి. అప్పుడే పంటలు గట్టెక్కుతాయని రైతులతోపాటు వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు. గత 3 నెలల సాధారణ వర్షపాతం 740.6 మి.మీ కాగా... కురిసింది 473.8 మి.మీ మాత్రమే. ఆగస్టులో సాధారణ వర్షపాతం 215.8 మి.మీ కాగా... 134.5 మి.మీలు నమోదైంది. అంటే 38 శాతం లోటు. సెప్టెంబరులో కూడా వర్షాలు పడకపోతే భూగర్భ జలాలు మరింత పడిపోయి పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారుతాయని రైతులు అంటున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇకపై వరిపంట వేయవద్దని రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వేసినా పంట దిగుబడి ఆశించినంతగా రాదని చెబుతున్నారు. ఇప్పటికే సాగుచేసిన వరి పంటలో కూడా దిగుబడి తగ్గుతుందని అంటున్నారు. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 66

ఎల్ నినో ఎఫెక్ట్ తో తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడంలేదు... లోటు వర్షపాతం కొనసాగుతోంది. దీంతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రైతులు ముందుగా ప్లాన్ చేసుకున్న ఖరీఫ్ సాగు దెబ్బతినవచ్చు... ఇలా రైతులకు నష్టాలు తప్పేలా లేవు. కానీ ఒక పంట పోయినంత మాత్రాన సాగు అవకాశాలు పూర్తిగా మూసుకుపోయినట్లు కాదు... సెప్టెంబర్ నెలలో కురిసే వర్షాలు, భూమిలో ఉండే తేమ, నీటిపారుదల సౌకర్యాన్ని బట్టి తక్కువ కాలంలో కోతకు వచ్చే కొన్ని పంటలను ఎంచుకోవచ్చు. దీనివల్ల తక్కువ సమయంలోనే మంచి దిగుబడి సాధించి మంచి ఆదాయం పొందవచ్చు... ఖరీఫ్ పంటనష్టాన్ని పూడ్చుకోవచ్చు. ఖరీఫ్ సీజన్లో వేరుశనగ, పప్పుధాన్యాల వంటి కొన్ని పంటలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఇవి వర్షాధార పంటలే అయినప్పటికి ఆ ప్రాంత వాతావరణ పరిస్థితులు, నేల స్వభావాన్ని బట్టి రైతులు ఏది వేయాలో నిర్ణయించుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో సెప్టెంబర్ నెలలో వేరుశనగ సాగును పరిశీలించవచ్చు... కానీ అన్ని జిల్లాలకు ఒకే రకమైన విత్తే సమయం సరిపోదు. కొన్ని ప్రాంతాల్లో సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్య కాలాన్ని వేరుశనగకు అనువైనదిగా సిఫార్సు చేస్తారు. నేల స్వభావం, వర్షపాతం, నీటిపారుదల సౌకర్యాన్ని బట్టి సరైన రకాన్ని ఎంచుకోవాలి. కాబట్టి విత్తనాలు కొనే ముందు మీ జిల్లాకు సంబంధించిన వ్యవసాయ శాఖ సిఫార్సులను తెలుసుకోవడం చాలా ముఖ్యం. కేవలం సీజన్‌ను చూసి హడావుడిగా విత్తనాలు వేయడం కంటే పొలంలో తగినంత తేమ ఉందో లేదో నిర్ధారించుకోవాలి. పెసలు, మినుములు వంటి పప్పుధాన్యాల పంటలు కూడా కొన్ని ప్రాంతాల్లో స్వల్పకాలిక సాగుకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా నీరు నిలవని నేలల్లో, అవసరమైన తేమ లభించే ప్రాంతాల్లో వీటిని ఎంచుకోవచ్చు. పొలంలో విత్తనాలు వేయడానికి ముందు సరైన పద్ధతిలో విత్తన శుద్ధి చేయాలి. దీంతో మొలకశాతం బాగుంటుంది, పంట తొలిదశలో ఆరోగ్యంగా పెరుగుతుంది. నేల స్వభావాన్ని బట్టి వీటిని ఏకపంటగా లేదా కొన్ని

పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. 2026-27 మార్కెటింగ్ సీజన్‌కు పత్తి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8,667గా నిర్ణయించింది. సీసీఐ కొనుగోళ్లు చేపడితే రైతులకు ప్రయోజనం జమ్మికుంట(కరీంనగర్): పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. 2026-27 మార్కెటింగ్ సీజన్‌కు పత్తి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8,667గా నిర్ణయించింది. గత సీజన్లో రూ.8, 110గా ఉన్న మద్దతు ధరను ఈసారి రూ.557 పెంచింది. దీంతో పత్తి సాగు చేస్తున్న రైతుల్లో కొంతమేర హర్షం వ్యక్తమవుతోంది. గతేడాది 4.15లక్షల క్వింటాళ్ల క్రయవిక్రయాలు జరగ్గా, సీసీఐ 1.49లక్షల క్వింటాళ్ల పత్తిని మద్దతు ధర ప్రకారం సేకరించింది. మిగితా 2.69లక్షల పత్తిని ప్రైవేట్ వ్యాపారులు కొనుగోళ్లు చేపట్టారు. అయితే పెంచిన మద్దతు ధర తమకు దక్కాలంటే మొత్తం పంటను సీసీఐ కొనుగోలు చేయా లని రైతులు కోరుతున్నారు. పత్తి సాగులో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు ఏటా పెరుగుతున్నాయి. దీనికితోడు వాతావరణ పరిస్థితులు, చీడపీడలు, దిగుబడుల్లో హెచ్చుతగ్గులతో రైతులు నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో క్వింటా ల్కు రూ.557 మద్దతు ధర పెరుగడం కొంత ఊరట నిస్తుందని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వ మద్దతు ధర ప్రకటించినా.. పూర్తి స్థాయి లో సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగోళ్లు చేపట్టకపోతే ప్రయోజనం ఉండదని రైతులు అంటున్నారు. ప్రతియేటా ప్రైవేట్ వ్యాపారుల చేతుల్లో ధరల విషయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందంటున్నారు. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ పరిధిలో పత్తి ప్రధాన పంట. సీజన్లో సెప్టెంబర్ మాసం నుంచి పత్తి మార్కెట్‌కు వస్తుంది. కొనుగోళ్లలో తేమ, నాణ్యత ప్రమాణాలను పాటించినప్పటికీ రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. పత్తిని మార్కెట్‌కు తీసుకువచ్చిన రైతులకు పారదర్శకంగా ధర నిర్ణయించి, ఎలాంటి అనవసర కోతలు లేకుండా కొనుగోళ్లు చేప ట్టాలి. ప్రభుత్వం ప్రకటించిన రూ.8,667 మద్దతు ధర కాగితాలకే పరిమితం కాకుండా రైతులకు అందాలంటే సీసీఐ కొనుగోలు కేంద్రాలను

భూముల రీ సర్వే అనంతరం అర్హులైన రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు అందించేలా చర్యలు తీసుకుంటామని, నకిలీ పాస్ పుస్తకాలను గుర్తించి రద్దు చేస్తామని రెవె న్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నకిలీ పాస్ పుస్తకాలను రద్దు చేస్తాం: మంత్రి పొంగులేటి జగిత్యాల, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): భూముల రీ సర్వే అనంతరం అర్హులైన రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు అందించేలా చర్యలు తీసుకుంటామని, నకిలీ పాస్ పుస్తకాలను గుర్తించి రద్దు చేస్తామని రెవె న్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నకిలీ పాస్ పుస్తకాల ఆధారంగా అర్హతలేని వారంతా రైతుబంధు ప్రయోజనాలు పొందారని అన్నారు. భూ రీసర్వే అనంతరం నిజమైన రైతుల హక్కులను పరిరక్షిస్తూ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు. జగిత్యాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి భూమి పూజ చేశారు. జగిత్యాల నియోజకవర్గ ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులతో జరిగిన సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం జిల్లాకు 70 గ్రామాల్లో భూముల రీ సర్వే జరుగుతున్నదని, ఏడాదిన్నర కాలంలో రాష్ట్రవ్యాప్తంగా రీ సర్వేను పూర్తి చేస్తామన్నారు

రైతులకు ప్రభుత్వం నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఈ ఏడాది వాతావరణంలో వస్తున్న విపరీతమైన మార్పులు, ఎల్ నినో భయాల నేపథ్యంలో పంటలకు బీమా చేయించుకోవడం చాలా అవసరమని ప్రభుత్వం చెబుతోంది. వాస్తవానికి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద ప్రీమియం చెల్లించేందుకు ఆగస్టు 15వ తేదీతోనే గడువు ముగిసింది. కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలామంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయారు. అందుకే అన్నదాతల క్షేమం కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీమా నమోదు గడువును ఈ నెలాఖరు వరకు, అంటే ఆగస్టు 31వ తేదీ వరకు పొడిగించింది. ఈ సంవత్సరం ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ క్షణంలో వాతావరణం మారిపోతుందో, అకాల వర్షాలు ముంచెత్తుతాయో లేదా కరవు తాండవిస్తుందో చెప్పడం కష్టం. అసెంబ్లీలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రైతులెవరూ రిస్క్ తీసుకోవద్దని, వెంటనే బీమా ప్రక్రియ పూర్తి చేసుకోవాలని కోరారు. పంట చేతికి వచ్చే వరకు ఏ గ్యారెంటీ లేని ఈ రోజుల్లో పంటల బీమా అనేది రైతుకు ఒక సురక్షితమైన కవచంలా పనిచేస్తుందని స్పష్టం చేశారు. చాలామంది రైతులు ఇన్సూరెన్స్ అంటే వేలల్లో ఖర్చవుతుందని భయపడుతుంటారు. కానీ ఫసల్ బీమా యోజనలో రైతు చెల్లించాల్సిన ప్రీమియం చాలా చాలా తక్కువ. ఖరీఫ్ పంటలకు కేవలం 2 శాతం, రబీ పంటలకు 1.5 శాతం, వాణిజ్య పంటలకు 5 శాతం ప్రీమియం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఉదాహరణకు రైతు వాటా అత్యంత స్వల్పంగా ఉంటే, మిగిలిన ప్రధానమైన ప్రీమియం మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తాయి. రూపాయి ఖర్చు పెద్దగా లేకుండా వేల రూపాయల నష్టపరిహారం పొందే అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దని అధికారులు చెబుతున్నారు. రైతులు తమ సమీపంలోని సీఎస్ఈ (CSC) సెంటర్లు లేదా మీ సేవా

Duvvuru: కేసీ కెనాల్ కింద ఆరుతడి పంటలు సాగు చేయాలి! ఈ వార్తకు సంబంధించిన

Nirmal: కొండపేటలో రైతులతో అడిషనల్ కలెక్టర్ ప్రత్యేక అవగాహన సదస్సు! ఈ వార్తకు సంబంధించిన

Sullurpeta: మంత్రి నిమ్మలను కలిలిన ఎమ్మెల్యే విజయశ్రీ! Sullurpeta: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట నియోజకవర్గ పరిధిలోని కీలక సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధి పనులపై స్థానిక శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గ రైతాంగ ప్రయోజనాలే ధ్యేయంగా పనిచేస్తున్న ఆమె, రాష్ట్ర నీటిపారుదల (జలవనరుల) శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని కలిసి సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పలు ప్రధాన నీటిపారుదల పనులైన మీజూరు చెక్‌డ్యామ్ నిర్మాణానికి అవసరమైన నిధులను తక్షణమే మంజూరు చేసి భూగర్భ జలమట్టం పెరిగేలా చర్యలు తీసుకోవాలని, తీరప్రాంతం మరియు నదీ పరివాహక ప్రాంత రక్షణకు ఉద్దేశించిన వాటంబేడు గ్రాయిన్ పనులను త్వరితగతిన చేపట్టాలని, ఆయకట్టు రైతులకు సమృద్ధిగా సాగునీరు అందించేందుకు చెంబేడు రిజర్వాయర్ పనులను పునరుద్ధరించి అవసరమైన బడ్జెట్ విడుదల చేయాలని వినతిపత్రం సమర్పించారు. ఈ మూడింటికి సంబంధించిన నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేసి, పనులను సత్వరమే ప్రారంభించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని ఎమ్మెల్యే కోరగా, మంత్రి నిమ్మల రామానాయుడు సానుకూలంగా స్పందించారు. ఒక మహిళా ప్రజాప్రతినిధిగా నియోజకవర్గంలోని ప్రతి చిన్న సమస్యపైనా ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు. నీటిపారుదల శాఖతో పాటు అన్ని శాఖల ఉన్నతాధికారులతో నేరుగా మాట్లాడుతుండటంతో పాటు, క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలను తెలుసుకుని పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజా సమస్యల పట్ల ఆమె చూపుతున్న చొరవ, నియోజకవర్గ అభివృద్ధికి చేస్తున్న నిరంతర కృషిపై సూళ్ళూరుపేట నియోజకవర్గ ప్రజలు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు

Chittoor: నాసిరకం మేతతో కోళ్లు మృతి: చిత్తూరులో రైతుల ఆందోళన! ఈ వార్తకు సంబంధించిన

Devarkadra: దేవరకద్రలో రైతులకు ట్రాన్స్ఫార్మర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఈ వార్తకు సంబంధించిన

దేశంలో కొబ్బరి అంటే గుర్తొచ్చే పేరు కోనసీమ అని.. ఆ జిల్లాకు తాను ఇన్‌ఛార్జి మంత్రిగా వ్యవహరిస్తున్నానని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాలువల్లో తట్టమట్టి కూడా తీయకపోవడం వల్ల సముద్రం నీరు వెనెక్కి వచ్చి చెట్టు ఉన్నపళంగా కుంగిపోయిందని చెప్పుకొచ్చారు. అమరావతి, ఆగస్టు 18: దేశంలో కొబ్బరి అంటే గుర్తొచ్చే పేరు కోనసీమ అని.. ఆ జిల్లాకు తాను ఇన్‌ఛార్జి మంత్రిగా వ్యవహరిస్తున్నానని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఏపీ శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కొబ్బరి సాగుకు సంబంధించి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అడిగిన ప్రశ్నలకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చారు. కొబ్బరి సాగులో 10వేల హెక్టార్లలోని కొబ్బరితోటలు కాలం చెల్లినవి ఉన్నాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాలువల్లో తట్టమట్టి కూడా తీయకపోవడం వల్ల సముద్రం నీరు వెనెక్కి వచ్చి చెట్టు ఉన్నపళంగా కుంగిపోయిందని చెప్పుకొచ్చారు. ప్రతి చెడిపోయిన మొక్కకు వెయ్యి సాయం చేసి కొత్తమొక్కలు పెట్టించాలని ప్రతిపాదన ఉందన్నారు. డ్రెయిన్లు శుభ్రం చేయకపోతే ఎంత పెట్టుబడి పెట్టినా, కొత్త మొక్కలు నాటినా ఫలితాలు ఉండవని మంత్రి తెలిపారు. అందుకే మొదటి దశలో శంఖరగుప్తం కాలువ పూడిక తీస్తే రెండు, మూడు నియోజకవర్గాల్లో సమస్య పరిష్కారమవుతుందన్నారు. కొత్త ప్లాంటేషన్‌కు వీబీ రాంజీ పథకం కింద కేంద్రంలోని కోకో బోర్డు ద్వారా ఆర్థిక సాయం అందజేస్తున్నామని ప్రకటించారు. మొత్తం ఒక ప్రాజెక్ట్ రూపంలో తీసుకొని కోనసీమలో కొత్తమొక్కలు పెట్టిస్తామమని చెప్పారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చెప్పినట్లు అంతర పంటలు వేయాలని రైతులకు సూచించారు. కొబ్బరితోటల్లో కోకో, అరటి, అంతర పంటలు వేయొచ్చని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమాన్ని సక్రమంగా అమలు అయ్యేలా చూస్తున్నామని, రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఏపీ మండలిలో పోడియం వద్ద బల్లలు చరుస్తూ వైసీపీ ఆందోళన.. సభ వాయిదా స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు: మంత్రి మండిపల్లి రాంప్రసాద్

రుణమాఫీ పథకంపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని, రాజకీయ ప్రయోజనాల కోసమే వారు అర్థరహిత విమర్శలు చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. రుణమాఫీ అమలులో గత ప్రభుత్వం విఫలం: తుమ్మల హైదరాబాద్: రుణమాఫీ పథకంపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని, రాజకీయ ప్రయోజనాల కోసమే వారు అర్థరహిత విమర్శలు చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో రుణమాఫీ అమలు తీరు దారుణంగా సాగిందని, ఆ విషయాన్ని బీఆర్ఎస్ నేతలు విస్మరించినా.. రైతులు మాత్రం గుర్తుపెట్టుకున్నారని ఆయన ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రం మిగులు బడ్జెట్‌తో ఉందని, అయినప్పటికీ రూ. లక్ష వరకు రుణమాఫీని ఏకకాలంలో అమలు చేయకుండా.. వాయిదాల్లో నాలుగు సంవత్సరాల పాటు చెల్లించడం వల్ల రైతులపై రూ. 2,630 కోట్ల వడ్డీ భారం పడిందని అన్నారు. 2018లోనూ రూ. లక్ష వరకు రుణమాఫీ చేస్తామని నమ్మించి, చివరకు సగం మందికే అమలు చేసి.. రూ. 8,379 కోట్లు పూర్తిగా ఎగవేశారని ఆరోపించారు. పదేళ్ల పాటు రైతులను నిర్లక్ష్యం చేసిన బీఆర్ఎస్.. ఇప్పుడు వారిపై కపటప్రేమ చూపించడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి పంట కాలంలోనే ఒకేసారి రూ. 20,617కోట్లు మాఫీ చేసి.. 25,35,964 మంది రైతులకు నేరుగా లబ్ధి చేకూర్చిందని తుమ్మల స్పష్టం చేశారు. పూర్తి పారదర్శకతతో రూ. 2 లక్షలలోపు ఉన్న పంట రుణాలన్నింటిని మాఫీ చేసి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నామని మంత్రి తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ రైతులకు ఉన్న పంట రుణ బాకీలు అత్యల్పమని పార్లమెంట్లో కేంద్ర నివేదిక స్పష్టం చేసిందని పేర్కొన్నారు. బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే
అసెంబ్లీ సాక్షిగా సీఎం క్షమాపణలు.. మాజీ సీఎం ప్రస్తావనతో..! తమిళనాడు శాసనసభ వర్షాకాల సమావేశాల్లో ఆసక్తికర పరిణామాలు జరిగాయి. హెల్త్, రెవెన్యూ పద్దులపై చర్చ సందర్భంగా అటవీ శాఖ మంత్రి ఆర్వి రంజిత్ కుమార్ మాజీ సీఎం కరుణానిధి పేరును నేరుగా ప్రస్తావించడంపై డీఎంకే సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మాజీ సీఎం పన్నీర్‌సెల్వం కూడా జోక్యం చేసుకుని సభ సాంప్రదాయాలను గుర్తుచేశారు. దీనిపై తక్షణమే స్పందించిన సీఎం సి. జోసెఫ్ విజయ్ సభలోనే క్షమాపణలు తెలిపారు. అనంతరం రూల్ 110 కింద సీఎం సభలో ప్రకటన చేస్తూ.. రూ. 75 వేల వరకు ఉన్న పంట రుణాలను పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో మొత్తం రుణమాఫీ ప్యాకేజీ రూ. 6,220 కోట్లకు చేరగా, 13.34 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ వార్తకు సంబంధించిన

భోగాపురంలో సంబరాలు. విశాఖలో ఉద్వేగం. విమానాశ్రయాల వేదికగా చోటు చేసుకున్న ఎమోషన్స్. అయిదు దశాబ్దాలుగా సేవలు అందించిన విశాఖ విమానాశ్రయం మూసివేసారు. ఇక, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు అధికారికంగా ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ నుంచి బయలుదేరిన తొలి ఇండిగో షెడ్యూల్డ్ విమానం ఉదయం 6:45 గంటలకు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. ఈ విమానం లాండింగ్ సమయంలో.. పండుగ వాతావరణం నెలకొంది. హామీ ఇచ్చిన విధంగా రైతులకు ఉచిత విమానయానం కల్పించారు.భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సర్వీసులు ప్రారంభమయ్యాయి. తొలుత స్కూట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం రాత్రి ఇక్కడి నుంచి సింగపూర్ బయల్దేరింది. భోగాపురం విమానాశ్రయం నుంచి హైదరాబాద్, తిరుపతి, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, ముంబయి నగరాలకు సర్వీసులు తిరగనున్నాయి. హైదరాబాద్ నుంచి ఇండిగో సర్వీసు ఉదయం 6 గంటల 45 నిమిషాలకు భోగాపురం విమానశ్రయంలో ల్యాండింగ్ అయింది. దీనికి జీఎంఆర్ ప్రతినిధులతో పాటు జిల్లా అధికారులు, విమానాశ్రయ సిబ్బంది స్వాగతం పలికారు. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని ఎయిర్‌లైన్స్ సిబ్బంది ప్రయాణికులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అంతేకాకుండా, తొలి ప్రయాణంలో పాల్గొన్న వారికి జ్ఞాపకార్థంగా ఫస్ట్ ఫ్లైట్ సర్టిఫికెట్లు అందజేశారు. కాగా, విశాఖ కేంద్రంగా దాదాపు అయిదు దశాబ్దాల కాలంగా సేవలు అందించిన విమానాశ్రయం లో ఇక రాకపోకలు నిలిచిపోయాయి. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఆ ఇద్దరు- ఊహించని ఎంపిక, ఏరి కోరి ఆ మహిళకు..!!విశాఖ విమానాశ్రయంలో సెల్పీలతోవిశాఖ నుంచి చివరి విమానం బయల్దేరే సమయంలో ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. సిబ్బంది ఎమోషనల్ అయ్యారు. ఇక్కడి నుంచి రాకపోకలు సాగించిన ఎంతో మంది ఎయిర్పోర్ట్ ఆవరణలో సెల్ఫీలు దిగుతూ తమ జ్ఞాపకాలను కెమెరాల్లో బంధించారు. ఇక, ప్రయాణీకుల కోసం విశాఖ నుంచి భోగాపురం రావడానికి 20 విద్యుత్ బస్సులు నడవనున్నాయి. భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి 2,200 వేల మంది రైతులు తమ భూములను ఇవ్వగా వీరికి

ఎయిర్పోర్ట్ నిర్మాణం ద్వారా స్థానికంగా గణనీయమైన పురోభివృద్ధి సాధించవచ్చని జీ.ఎమ్.ఆర్ గ్రూప్ పేర్కొంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో భోగాపురం విమానాశ్రయ గురించి పలు కీలక విషయాలు వెల్లడించింది. విజయనగరం, ఆగస్టు 16: విమానాశ్రయం నిర్మిస్తే ఏమొస్తుందని చాలామంది భావిస్తుంటారని, కానీ ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం ద్వారా సమాజంలో గణనీయమైన పురోభివృద్ధి సాధించవచ్చని జీ.ఎమ్.ఆర్ (GMR) గ్రూప్ పేర్కొంది. ఏబీఎన్ (ABN) ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో భోగాపురం విమానాశ్రయ నిర్మాణం, స్థానిక ప్రాంత అభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలపై పలు కీలక విషయాలను వెల్లడించింది. విమానాశ్రయాల ఏర్పాటుతో కేవలం ప్రయాణ సౌకర్యాలే కాకుండా, ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక రంగాలు వేగంగా వృద్ధి చెందుతాయని జీ.ఎమ్.ఆర్ ప్రతినిధులు తెలిపారు. హోటల్, రవాణా, పర్యాటక, రియల్ ఎస్టేట్, ఐటీ వంటి రంగాలు పుంజుకోవడంతో స్థానికంగా భారీగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు. భారతదేశంలో ప్రస్తుతం నైపుణ్యం కలిగిన మానవవనరుల లోటు (Skill Deficit) ఎక్కువగా ఉందని, దేశంలోని యువతకు వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉందని అభిప్రాయపడ్డారు. 'జీ.ఎం.ఆర్. వరలక్ష్మి ఫౌండేషన్' ద్వారా సామాజిక బాధ్యతగా ఇప్పటివరకు దాదాపు లక్ష మందికి పైగా యువతకు ఉచితంగా స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ అందించినట్లు తెలిపారు. భోగాపురం విమానాశ్రయం నిర్మాణం కోసం తమ భూములను ఇచ్చిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నామని సంస్థ స్పష్టం చేసింది. విమానాశ్రయానికి భూములిచ్చిన రైతుల కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇచ్చి, వారికి వివిధ రంగాల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపింది. కార్పొరేట్ రంగానికి మనం ఇచ్చే విలువలు, సామాజిక స్పృహే మనల్ని మరింత వృద్ధిలోకి తీసుకువస్తాయని ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది

చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండలం టీఎస్ అగ్రహారంలో ఏనుగుల గుంపు హల్చల్ చేశాయి. గ్రామంలోని పంట పొలాల్లోకి ప్రవేశించిన ఏనుగులు వరి, టమాటా పంటలను తొక్కి నాశనం చేశాయి. చిత్తూరు జిల్లా, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండలం టీఎస్ అగ్రహారంలో ఏనుగుల గుంపు హల్చల్ చేశాయి. గ్రామంలోని పంట పొలాల్లోకి ప్రవేశించిన ఏనుగులు వరి, టమాటా పంటలను తొక్కి నాశనం చేశాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట పొలాల్లోకి వచ్చిన ఏనుగులు బోరు పైపులను సైతం ధ్వంసం చేయడంతో సాగునీటి సౌకర్యానికి కూడా నష్టం వాటిల్లిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలను కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయిన ఏనుగుల గుంపు పంట పొలాల నుంచి వెళ్లడం లేదని అన్నదాతలు చెబుతున్నారు. ఏనుగులను పొలాల్లోకి రానివ్వకుండా కట్టడి చేయడంలో అటవీ శాఖ అధికారులు విఫలమవుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. బాణసంచా, టపాకాయలు పేల్చి ఏనుగులను తరిమేందుకు ప్రయత్నించినా అవి బెదరడం లేదని వాపోతున్నారు. ఏనుగుల దాడులతో పంటలు, బోరు పైపులు ధ్వంసమై తీవ్రంగా నష్టపోయామని.. తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఏనుగుల సంచారాన్ని అరికట్టేందుకు శాశ్వత పరిష్కారంగా సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలి: యరపతినేని ‘నిబంధనల ప్రకారమే జగన్‌ను ములాఖత్‌కు అనుమతించాం’ తిరుపతిలో ఆస్తి రిజిస్ట్రేషన్ వివాదం.. రైతు ఆత్మహత్యాయత్నం

రైతులకు ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఇప్పటి వరకు అమలు చేస్తున్న సన్న వడ్ల బోనస్ పథకంలో కీలక మార్పులు చేసింది. ప్రభుత్వం ఎంపిక చేసిన సన్న బియ్యం రకాలను సాగు చేసినవారికి మద్దతు ధరలతో పాటు క్వింటాకు రూ.500 బోనస్ చెల్లించాలని నిర్ణయించింది. ప్రస్తుతం రైతులు పండించిన సన్న రకం వడ్లకు మార్కెట్ ధరతో పాటు అదనంగా క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ అందిస్తున్నారు. డబ్బును నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. అయితే, ఇక నుంచి తాజా మార్పుల మేరకు కొత్త మార్గదర్శకాలను అమలు చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది.తెలంగాణ వ్యవసాయ శాఖ రైతులకు కీలక సమాచారం అందించింది. ప్రభుత్వం రైతులు విక్రయించిన సన్న వడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ జమ చేస్తోంది. వీటిని నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం వేస్తోంది. అయితే ఈ బోనస్ అందించేందుకు పలు విధివిధానాలు మార్చింది. ఇక నుంచి ప్రభుత్వం ప్రకటించిన 7 రకాల సన్న రకం విత్తనాలు వేసి పండించిన రైతులకు మాత్రం బోనస్ అందుతుంది. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన 7 ప్రత్యేక రకాల సన్న వరి విత్తనాలను వేసి పండించిన రైతులకు మాత్రమే క్వింటాకు రూ.500 బోనస్ సొమ్ము అందుతుంది. ఈ పథకానికి అర్హత సాధించాలంటే రైతులు కొనుగోలు చేసే విత్తనాల రికార్డులు ఆన్లైన్లో కచ్చితంగా నమోదు చేయటం కోసం ప్రత్యేక ఆన్లైన్ ప్రక్రియను అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు వెల్లడించారు. తిరుమలకు వచ్చే భక్తులకు TTD ఛైర్మన్ కీలక విజ్ఞప్తి - ఇలా ప్లాన్ చేసుకోండి..!!ఇక ఈ రకాలకే బోనస్ చెల్లింపుఇప్పటి వరకు ప్రభుత్వం రైతులకు ఈ పథకం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. కాగా, ఇక నుంచి ప్రభుత్వ అనుమతి పొందిన విత్తన డీలర్లు తాము రైతులకు విక్రయించే ప్రతి సన్న వరి విత్తన రకం వివరాలను వెబ్సైట్లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేసారు

ప్రభుత్వ ఆర్థిక విధాన నిర్ణయాలు, నిధులు కేటాయించడంలో ప్రభుత్వ ప్రాధాన్యాల విషయంలో న్యాయసమీక్షకు అవకాశం లేదని హైకోర్టు డివిజన్ బెంచ్ పేర్కొంది. హైదరాబాద్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆర్థిక విధాన నిర్ణయాలు, నిధులు కేటాయించడంలో ప్రభుత్వ ప్రాధాన్యాల విషయంలో న్యాయసమీక్షకు అవకాశం లేదని హైకోర్టు డివిజన్ బెంచ్ పేర్కొంది. కొవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం నిలిపేసిన 2019 యాసంగి, వానాకాలం రైతుబంధు డబ్బులు పిటిషనర్లకు విడుదల చేయాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసింది. కొవిడ్ ఇబ్బందుల వల్ల ప్రభుత్వం 2019 వానాకాలంలో పది ఎకరాల వరకు, యాసంగిలో ఆరు ఎకరాల వరకు ఉన్న రైతులకే రైతుబంధు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అయితే, తమకు రైతు బంధు అందకపోవడంపై ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కిష్టాపురానికి చెందిన తూము వెంకట నారాయణ తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. తగిన నిర్ణయం తీసుకోవాలని ఖమ్మం జిల్లా వ్యవసాయ అధికారికి ఆదేశాలు జారీ చేసింది. కానీ నిధులు ఇవ్వలేమని ప్రభుత్వం పేర్కొనగా.. పిటిషనర్లు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. ఎనిమిది వారాల్లోగా పిటిషనర్లకు 2019 రైతుబంధు నిధులు ఇచ్చేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాలపై వ్యవసాయశాఖ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం 2019కి సంబంధించి నిలిపేసిన రైతుబంధు డబ్బు ఇవ్వాలా ? వద్దా ? అనేది ప్రభుత్వ నిర్ణయమని పేర్కొంటూ సింగిల్ జడ్జి తీర్పును కొట్టేసింది

తెలంగాణను గత పదేళ్ల విధ్వంస పాలన నుంచి వికాసం వైపు నడిపిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దెబ్బతిన్న వ్యవస్థలన్నింటినీ.. దెబ్బతిన్న వ్యవస్థల్ని 32 నెలల్లో గాడిన పెట్టాం విద్య, వైద్యం, ఉద్యోగాలు, మౌలిక వసతులపై ప్రత్యేకంగా దృష్టి సారించాం సంక్షేమానికి పెద్ద పీట.. అభివృద్ధికి కొత్త దిశ కృష్ణా, గోదావరి జలాలపై రాజీ ప్రసక్తే లేదు ‘ప్రజావాణి’.. పంద్రాగస్టు వేడుకల్లో సీఎం రేవంత్ హైదరాబాద్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణను గత పదేళ్ల విధ్వంస పాలన నుంచి వికాసం వైపు నడిపిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దెబ్బతిన్న వ్యవస్థలన్నింటినీ.. తాము అధికారంలోకి వచ్చిన 32 నెలల్లో ఒక్కొక్కటిగా గాడిలో పెట్టామని, సంక్షేమాన్ని విస్తరించి.. అభివృద్థికి కొత్త దిశను నిర్దేశించామని ఆయన పేర్కొన్నారు. పేదల ఆత్మగౌరవం, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, సామాజిక న్యాయం, విద్య, వైద్యం, ఉద్యోగాలు, మౌలి క వసతులు, పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ రంగాలపై తమ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని.. ఈ పునాదులపైనే ‘తెలంగాణ రైజింగ్-2047’ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. శనివారం గోల్కొండ కోటలో నిర్వహించిన స్వాతంత్య్ర దిన వేడుకల్లో పాల్గొని, జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. సంక్షేమాన్ని ఖర్చు చేసిన రూపాయలతో లెక్కించే విధానం తమ ప్రభుత్వానికి లేదని.. పేదల జీవితాల్లో ఆనందం నింపాలన్న తపన, వారికి ఆరోగ్యకరమైన జీవితం, ఆత్మగౌరవంతో కూడిన జీవన విధానాన్ని అందించాలన్న సంకల్పంతో పథకాలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. 2025-26లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరిందని, దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే రాష్ట్ర తలసరి ఆదాయం దాదాపు 91 శాతం అధికంగా ఉందని పేర్కొన్నారు. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలాన్ని చాటుతోందన్నారు. అలాగే.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న నమ్మకంతో వ్యవసాయం, రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. 32 నెలల్లో వ్యవసాయం, రైతు సంక్షేమానికి దాదాపు రూ.1.7

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Harish Rao vs Revanth Reddy: స్వాతంత్య్ర దినోత్సవం రోజు అభివృద్ధి, సంక్షేమం గురించి మాట్లాడాల్సిన రేవంత్ రెడ్డి చిల్లర మాటలతో పచ్చి అబద్ధాలు ఆడడం సిగ్గుచేటు అని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'స్వాతంత్య్ర దినోత్సవం రోజున భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి రోత మాటలు మాట్లాడి ఉండరు. గాంధీ, పటేల్, నెహ్రూ లాంటి మహనీయులను తలచుకోవాల్సిన రోజున రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలకు తెరలేపాడు' అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సంగారెడ్డిలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 'కాంగ్రెస్ మేనిఫెస్టోలో 420 హామీలు ఇచ్చారు. సంగారెడ్డి సభలో రేవంత్ రెడ్డి కరెక్టుగా సాయంత్రం 4 గంటల 20 నిమిషాలకు ప్రసంగం ప్రారంభించి పూర్తిగా 420 మాటలే మాట్లాడారు' అని ఎద్దేవా చేశారు. ఆగస్టు 15వ తేదీ రోజున సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం గురించి కూడా మాట్లాడలేదు. సంగారెడ్డి జిల్లా సాగునీటి కోసం కేసీఆర్ ప్రారంభించిన సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం మూలకు పడేసిందని ఆరోపించారు. వాటి గురించి కనీసం ఒక్క ముక్క కూడా రేవంత్ రెడ్డి మాట్లాడలేదని మాజీ మంత్రి హరీశ్ రావు గుర్తుచేశారు. 'బీఆర్ఎస్ పార్టీ హయాంలో మంజూరైన మెడికల్, నర్సింగ్ కాలేజీలు, రోడ్లు తప్ప కాంగ్రెస్ వచ్చాక కొత్తగా ఒక్క కిలోమీటర్ రోడ్డు కూడా

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మేలు, బీఆర్ఎస్ హయాంలో జరిగిన అన్యాయాలపై చర్చించేందుకు అసెంబ్లీకి రావాలని అన్నారు. ఫామ్‌హౌస్‌లో ఉండి విమర్శలు చేయడం కాదని, ప్రజల ముందుకు వచ్చి మాట్లాడాలని అన్నారు. సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.గతంలో వరి వేస్తే ఉరి అన్న కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో మాత్రం వరి పండించారని రేవంత్ విమర్శించారు. ఇప్పుడు రైతులకు మేలు చేసే కార్యక్రమాలు చేపడుతుంటే బీఆర్ఎస్ విమర్శలు చేస్తోందన్నారు. రైతుల సంక్షేమంపై నిజమైన చర్చకు సిద్ధమైతే అసెంబ్లీ వేదికగా మాట్లాడుకుందామని సవాల్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై బీఆర్ఎస్, బీజేపీ ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని రేవంత్ అన్నారు. ఈ రెండు పార్టీలు ఒకే నాణేనికి బొమ్మా బొరుసులాంటివని వ్యాఖ్యానించారు. పదేళ్లు అధికారంలో ఉన్నా పేదలకు సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు.కాంగ్రెస్ వస్తే కరెంట్ కోతలు వస్తాయని గతంలో బీఆర్ఎస్ ప్రచారం చేసిందని, కానీ ఇప్పుడు రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవని రేవంత్ చెప్పారు. రైతు భరోసా పథకం కింద 32 నెలల్లో రూ.36 వేల కోట్లు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నివేదికల ప్రకారం దేశంలో తక్కువ అప్పులు ఉన్న రైతులు తెలంగాణలోనే ఉన్నారని అన్నారు. బీజేపీ నేతలు ఆ నివేదికలు చదివితే నిజాలు తెలుస్తాయని వ్యాఖ్యానించారు.స్మార్ట్ రేషన్ కార్డులు కేవలం

తెలంగాణ ప్రజల అవసరాలే పరమావధిగా ప్రజా ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పాలనలో మహిళలు, విద్యార్థులు, రైతులు సహా అన్ని వర్గాలకూ సంక్షేమం అందుతోందని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భట్టి పాల్గొన్నారు. ఖమ్మం: తెలంగాణ ప్రజల అవసరాలే పరమావధిగా ప్రజా ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పాలనలో మహిళలు, విద్యార్థులు, రైతులు సహా అన్ని వర్గాలకూ సంక్షేమం అందుతోందని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలో కాలయాపన చేసిందని విమర్శించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని భట్టి చెప్పుకొచ్చారు. విద్యా రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించేందుకు చర్యలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, అన్నదాతల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. రైతు భరోసాతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. రైతులకు అండగా నిలుస్తూ వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. తెలంగాణ ప్రజల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన

రాజీవ్ లింక్ కెనాల్‌కు గోదావరి జలాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విడుదల చేశారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సరిగ్గా లేక పంటల సాగుకు ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా గోదావరి జలాలు.. సాగర్ ఆయకట్టుకు భరోసాగా మారిందని మంత్రి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 15: రాజీవ్ లింక్ కెనాల్‌కు గోదావరి జలాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విడుదల చేశారు. ఈరోజు(శనివారం) అశ్వాపురం మండలం సీతారామ పంప్ హౌస్ వద్ద మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.. మోటార్ స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సరిగ్గా లేక పంటల సాగుకు ఇబ్బందులు ఏర్పడ్డాయని తెలిపారు. రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా గోదావరి జలాలు.. సాగర్ ఆయకట్టుకు భరోసాగా మారిందన్నారు. మారేళ్లపాడు ఎత్తిపోతల పథకాన్ని నెలాఖరులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నీళ్ల దగ్గర రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. రైతులు ఎవరూ కూడా దిగులు పడొద్దని.. మీ భూముల్లో పైప్‌లైన్ వేసిన మరలా పూడ్చి ఇస్తామని మంత్రి చెప్పారు. యధావిధిగా మళ్లీ వ్యవసాయం చేసుకోవచ్చని అన్నారు. పినపాకకి నీళ్లు ఇవ్వకుండా ఖమ్మంకి తీసుకెళ్లటం బాధగా ఉందన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ఎవరు ఎటువంటి రాజకీయాలు చేసినా నెలాఖరుకు మారేళ్లపాడు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. గోల్కొండ కోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ తెలంగాణలో సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

Telangana Govt : తెలంగాణలో రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న ప్రతిష్ఠాత్మక రైతు బీమా పథకంకు ఎండ్ కార్డ్ పడింది. పట్టాదారులైన రైతులు సహజంగా మరణించినా, ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయినా బాధిత కుటుంబానికి రూ.5లక్షల బీమా మొత్తం చెల్లిస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టు 14వ తేదీతో బీమా రెన్యువల్ కావాల్సి ఉండగా.. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ సర్కార్ ప్రీమియం చెల్లింపులు నిలిపివేసింది. దీంతో ఇక నుంచి రైతు బీమా పథకంకు ఎండ్ కార్డు పడినట్లయింది. రైతు బీమా పథకం కింద 18 నుంచి 59ఏళ్ల వయస్సు కలిగిన రైతులు సహజ మరణం, ప్రమాదవశాత్తూ మరణించినా ఆ రైతు కుటుంబానికి రూ.5లక్షలు చెల్లిస్తున్నారు. ఈ పథకంలో 42.16లక్షల మంది రైతులు లబ్ధిదారులుగా ఉన్నారు. వీరి తరఫున ప్రభుత్వం ప్రతి ఏడాది సగటున సుమారు రూ.1,400 కోట్ల వరకు ప్రీమియం చెల్లిస్తోంది. రైతుల నుంచి ప్రత్యేకంగా ప్రీమియం వసూలు చేయకుండా ప్రభుత్వం ఈ భారాన్ని భరిస్తోంది. అయితే, ప్రస్తుతం 2026-27 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం బీమా సొమ్మును చెల్లించలేదు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా.. రైతులకు మాత్రమే కాకుండా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ జీవిత బీమా సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకురావాలని భావిస్తుంది. ఈ మేరకు గత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించింది. 2026-27 వార్షిక బడ్జెట్ లో రూ.4వేల కోట్ల నిధులను కూడా కేటాయించింది. ఈ ఏడాది జూన్ 2వ తేదీ నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పేరుతో ఈ పథకంను అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ, పథకం మాత్రం ప్రారంభం కాలేదు. ఈ పథకం గురించి ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నవంబర్ 19వ తేదీ నుంచి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా బీమా పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. లబ్ధిదారుల ఎంపిక, వివరాల నమోదు కోసం ఇంటింటి సర్వే చేపడతామని అన్నారు

గోల్కొండ కోటలో జరిగిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ చరిత్రలోనే ఆయుధం లేని యుద్ధం భారత స్వాతంత్య్ర పోరాటమని అన్నారు. అహింసతోనూ విజయాన్ని సాధించవచ్చని మహాత్మాగాంధీ నిరూపించారని చెప్పారు. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అభివృద్ధికి బలమైన పునాదులు వేశారని పేర్కొన్నారు.స్వాతంత్య్రం జీవనానికి ఆధారమని, దానికి వెల కట్టలేమని గాంధీజీ చెప్పారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. హరిత విప్లవం, శ్వేత విప్లవం, నీలి విప్లవం ద్వారా దేశంలోని వివిధ రంగాల అభివృద్ధికి గత ప్రభుత్వాలు కృషి చేశాయని అన్నారు. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛను అందించడంతో పాటు విధ్వంసకర పాలన నుంచి రాష్ట్రాన్ని వికాసం వైపు తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. తెలంగాణ భవిష్యత్తుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేసుకుని ముందుకు సాగుతున్నామని వెల్లడించారు.ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 32 నెలలు పూర్తయ్యాయని సీఎం తెలిపారు. దెబ్బతిన్న వ్యవస్థలను ఒక్కొక్కటిగా గాడిలో పెడుతున్నామని చెప్పారు. తమ సంక్షేమ పథకాలను కేవలం ఆర్థిక లెక్కలతో చూడటం లేదని స్పష్టం చేశారు. సంక్షేమంలో మానవీయత ఉందని, పేదల పట్ల బాధ్యత ఉందని అన్నారు. వారి జీవితాల్లో ఆనందం నింపాలన్న తపనతో కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఓట్ల కోసం లేదా మొక్కుబడిగా సంక్షేమాన్ని అమలు చేయడం లేదని స్పష్టం చేశారు.32 నెలల్లో ప్రభుత్వం చేసిన కృషి ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ

సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం తమది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గోల్కొండ కోటపై సీఎం జాతీయ జెండాను ఆవిష్కరించారు. హైదరాబాద్, ఆగస్టు 15: సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం తమది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గోల్కొండ కోటపై సీఎం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ.. ఈ ప్రభుత్వ 32 నెలల కృషి ఇప్పుడిప్పుడే కనిపిస్తోందని.. తలసరి ఆదాయంలో టాప్‌లో ఉన్నామన్నారు. వ్యవసాయాన్ని పండగ చేయాలని నిర్ణయించామని తెలిపారు. రైతు బాగుంటేనే.. రాష్ట్రం బాగుంటుందన్న ముఖ్యమంత్రి.. రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు చేపట్టామన్నారు. రైతు భరోసా కింద రూ.36వేల కోట్లు పెట్టుబడి సాయం అందించామని చెప్పారు. అలాగే, రైతు సంక్షేమం కోసం రూ.లక్షా 70వేల కోట్లు, రూ.2లక్షల వరకు రైతు రుణమాఫీ చేశామని వివరించారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రికార్డులు సృష్టించిందని తెలిపారు. కృష్ణా-గోదావరి జలాల్లో రాజీపడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును సాధించి తీరుతామన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి రైతుల కళ్లల్లో ఆనందం చూస్తామన్నారు. త్వరలోనే పాలమూరు పూర్తి చేసి నీరందిస్తామని తెలిపారు. వ్యవసాయంతో పాటు ఇళ్లకు ఉచిత కరెంట్ ఇస్తున్నామని, కల్యాణలక్ష్మి కింద ఆడబిడ్డలకు రూ.4,790 కోట్లు అందజేశామని అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే సంకల్పంతో ఉన్నామని చెప్పుకొచ్చారు. 15 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని,2 విడతల్లో 5.50లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్లు నిర్మించి అందించనున్నామని తెలియజేశారు. దేశంలోనే తొలిసారి తెలంగాణలో కులగణన జరిగిందని.. తెలంగాణ ఒత్తిడి వల్లే కేంద్రం జనగణనలో కులగణన చేర్చిందని తెలిపారు. కొత్తగా 2.50లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేస్తున్నామన్నారు. సినీ కార్మికుల సంక్షేమం

రైతు భీమా పథకం ఆగిపోయినట్లేనా. రైతులకు విపత్కర పరిస్థితుల్లో అందుతున్న రూ 5 లక్షల భీమా పథకం రెన్యువల్ కాలేదు. ప్రభుత్వం ప్రీమియం చెల్లింపులు నిలిపివేసింది. దీంతో ఇక ఆ పథకం నిలిచిపోయినట్లేనని తెలుస్తోంది. ఈ స్థానంలో ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెడుతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం రైతులకు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకం ఇంకా అమల్లోకి రాలేదు. దీంతో... రైతుల్లో ఆందోళన కనిపిస్తోంది.తెలంగాణ ప్రభుత్వం రైతు భీమా పథకం దాదాపు నిలిపివేసినట్లే కనిపిస్తోంది. పట్టాదారులైన రైతులు సహజంగా మరణించినా, ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయినా బాధిత కుటుంబానికి రూ.5 లక్షల బీమా మొత్తం చెల్లిస్తున్నారు. కాగా, ఆగస్టు 14వ తేదీన బీమా రెన్యువల్ కావాల్సి ఉండగా.. ప్రభుత్వం ప్రీమియం చెల్లింపులు నిలిపివేసింది. దీంతో.. ఇక ఈ పథకం నిలిపివేసినట్లు అర్దం అవుతోంది. రాష్ట్రంలో రైతు బీమా పథకం ఎనిమిదేళ్లుగా అమలవుతోంది. ఏటా ఆగస్టు 14వ తేదీన రైతుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తోంది. ఎల్ఐసీ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. 18-59 ఏళ్ల వయసున్న రైతులు సహజ మరణం చెందినా, ప్రమాదవశాత్తు చనిపోయినా రైతు కుటుంబానికి రూ.5 లక్షలు చెల్లిస్తున్నారు. ఈ పథకంలో 42.16 లక్షల మంది రైతులు లబ్ధిదారులుగా ఉన్నారు. ఏటా సగటున రూ.1400 కోట్ల ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది.TTD: తిరుమలలో ఫిర్యాదుల పరిష్కారానికి కొత్తగా నందకం’ యాప్..!!ప్రభుత్వం తాజా ఆలోచనకాగా, 2026-27 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించలేదు. పథకం ప్రారంభం నుంచి అనేక కారణాలతో మరణించిన రైతులకు రూ 5 లక్షల చొప్పున రైతుబీమా ఆర్థిక సాయం లభించింది. అయితే, ప్రభుత్వం రైతు భీమా స్థానంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా బీమా సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

భారతీయ వ్యవసాయ రంగంలో రైతు కేవలం ఉత్పత్తిదారుడు మాత్రమే కాదు, ఒక ‘వ్యవసాయ పారిశ్రామికవేత్త’గా మారినప్పుడే నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యం లభిస్తుంది. సాంప్రదాయ పద్ధతుల్లో పంటలు పండించడంతో పాటు శాస్త్రీయ ఆర్థిక నిర్వహణ, పంటల వైవిధ్యం, ప్రభుత్వ పథకాల సద్వినియోగం ద్వారా మాత్రమే వ్యవసాయాన్ని లాభసాటి వ్యాపారంగా మలచవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రైతులు తమ పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకోవడానికి, భద్రత పొందడానికి కింది పథకాలను వినియోగించుకోవాలి. పీఎం-కిసాన్: భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.6,000 మూడు విడతల్లో పెట్టుబడి సహాయంగా నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. (రాష్ట్ర ప్రభుత్వాల ప్లాన్ల ద్వారా అదనపు సాయం అందుబాటులో ఉంటుంది). కిసాన్ క్రెడిట్ కార్డ్: బ్యాంకు ద్వారా తక్కువ వడ్డీకే (నగదు రహిత సబ్సిడీతో కలిపి 4 శాతానికే) పంట రుణాలు పొందే వెసులుబాటు. ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన: ప్రకృతి వైపరీత్యాలు, పురుగుల తాకిడి వల్ల పంట నష్టం వాటిల్లినప్పుడు కనీస ప్రీమియం (ఖరీఫ్ 2%, రబీ 1.5%) చెల్లించి పూర్తి ఆర్థిక రక్షణ పొందవచ్చు. పీఎం కుసుమ్: సోలార్ పంప్సెట్ల ఏర్పాటుకు 60 శాతం వరకు సబ్సిడీ పొందడం ద్వారా విద్యుత్తు ఖర్చులను పూర్తిగా తగ్గించుకోవచ్చు. రైతు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి సూత్రాలు వ్యవసాయం నష్టపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి.. ఎంత ఖర్చు పెడుతున్నామో, ఎక్కడ దారి మళ్లుతుందో లెక్క లేకపోవడం. సాధారణ డైరీ రాయడం కంటే ఫార్మ్చేంజ్, అగ్రీకాంబస్ లేదా ఉచిత ఖాతాబుక్/డిజిటల్ రిజిస్టర్ యాప్‌లను ఉపయోగించాలి. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ట్రాక్టర్ డీజిల్, రోజువారీ కూలీల ఖర్చులను ఎప్పటికప్పుడు యాప్‌లో నమోదు చేయాలి. పంట చివరిలో ఏ రసాయనం, ఏ పని వల్ల ఎంత లాభం వచ్చిందో స్పష్టత వస్తుంది. అనవసర పురుగుమందుల ఖర్చులను 20-30% వరకు తగ్గించుకోవచ్చు. వాతావరణ మార్పులు, అకాల వర్షాలు లేదా ధరల పతనం వంటి ఆకస్మిక నష్టాల నుంచి రైతును

రాష్ట్రంలో రైతు బీమా పథకం నిలిచిపోయింది. పట్టాదారులైన రైతులు సహజంగా మరణించినా, ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయినా బాధిత కుటుంబానికి రూ.5 లక్షల బీమా మొత్తం చెల్లిస్తున్న విషయం తెలిసిందే. నిన్నటితో ముగిసిన రెన్యువల్ గడువు.. ప్రీమియం చెల్లించని ప్రభుత్వం ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ నేపథ్యంలో నిర్ణయం నవంబరు 19 నుంచి ఇందిరమ్మ బీమా.. రైతులతోపాటు అన్ని కుటుంబాలకూ వర్తింపు! హైదరాబాద్: రాష్ట్రంలో రైతు బీమా పథకం నిలిచిపోయింది. పట్టాదారులైన రైతులు సహజంగా మరణించినా, ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయినా బాధిత కుటుంబానికి రూ.5 లక్షల బీమా మొత్తం చెల్లిస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టు 14వ తేదీన బీమా రెన్యువల్ కావాల్సి ఉండగా.. ప్రభుత్వం ప్రీమియం చెల్లింపులు నిలిపివేసింది. దీంతో ఇక ఆ పథకం నిలిచిపోయినట్లేనని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా రైతులతోపాటు అన్ని కుటుంబాలకు జీవితబీమాను అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. దీంట్లో భాగంగానే, రైతు బీమా పథకాన్ని నిలిపివేసినట్లు సమాచారం. రాష్ట్రంలో రైతు బీమా పథకం ఎనిమిదేళ్లుగా అమలవుతోంది. ఏటా ఆగస్టు 14వ తేదీన రైతుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తోంది. ఎల్ఐసీ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఎంతో కొంత వ్యవసాయ భూమి ఉండి పట్టాదారు పాసుపుస్తకం కలిగిన రైతులను ఈ పథకంలో చేర్చారు. 18-59 ఏళ్ల వయసున్న రైతులు సహజ మరణం చెందినా, ప్రమాదవశాత్తు చనిపోయినా రైతు కుటుంబానికి రూ.5 లక్షలు చెల్లిస్తున్నారు. ఈ పథకంలో 42.16 లక్షల మంది రైతులు లబ్ధిదారులుగా ఉన్నారు. ఏటా సగటున రూ.1400 కోట్ల ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. 2025-26 సంవత్సరానికి సంబంధించిన బీమా గడువు శుక్రవారంతో ముగిసింది. 2026-27 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించలేదు. 2018లో రైతుబీమా పథకం ప్రారంభం కాగా.. 2018-19లో 17,747 మంది, 2019-20లో 19,063 మంది, 2020-21లో 29,163 మంది, 2021-22లో 23,393 మంది, 2022-23లో
తెలంగాణ రైతులకు లాభదాయకమైన సన్న వరి రకాల సాగునుప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎంపిక చేసిన ఏడు సన్నవరి రకాల సాగుకే క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ అందించనుంది. మద్దతు ధరకు అదనంగా ఈ ప్రోత్సాహకం లభించనుండటంతో రైతులు నాణ్యమైన సన్నరకాల వైపు మళ్లే అవకాశం ఉంది. ఈ మేరకు సాగు, పంట నమోదు, కొనుగోళ్లు, క్రయవిక్రయాలకు సంబంధించిన సమగ్ర విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. మంత్రిమండలి ఆమోదం లభించడంతో ఈ విధానం తక్షణమే అమల్లోకి రానుంది.సన్న బియ్యానికి మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్, కేంద్ర ప్రభుత్వం సేకరణలోనూ సన్నరకాలకు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబులతో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేసింది. 2025లో రాష్ట్రంలో మొత్తం 69.89 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగగా.. అందులో 43.51 లక్షల ఎకరాల్లో సన్నాలు, 26.38 లక్షల ఎకరాల్లో ముతక రకాల సాగు జరిగింది. అంటే మొత్తం వరి విస్తీర్ణంలో సన్నాల వాటా 62 శాతంగా నమోదైంది.గతేడాది బోనస్ కోసం 33 సన్నరకాలను ప్రభుత్వం గుర్తించగా.. అవి 31.93 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. అయితే ఇందులో కేవలం ఏడు రకాలే 27.95 లక్షల ఎకరాల్లో అంటే 87.51 శాతం విస్తీర్ణంలో సాగైనట్లు ఉపసంఘం గుర్తించింది. ఈ రకాలకే కేంద్ర సేకరణతోపాటు మార్కెట్లోనూ మంచి డిమాండ్ ఉందని తేల్చింది. అనంతరం తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ రకాలపై పరిశీలన చేసి రైతులకు లాభదాయకమైనవిగా నిర్ధారించింది. ప్రభుత్వం ప్రాధాన్యం కల్పించిన ఏడు రకాలలో బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048, హెచ్ఎంటీ సోనా, జైశ్రీరామ్, కేఎన్ఎం 1638, డబ్ల్యూజీఎల్ 44, కేఎన్ఎం 7715 ఉన్నాయి. గింజ పొడవు 6 మిల్లీమీటర్లకు తక్కువగా, పొడవు-వెడల్పు నిష్పత్తి 2.5 కంటే ఎక్కువగా, గింజ వెడల్పు 2 మిల్లీమీటర్లకు మించకుండా

రాజధాని అమరావతి కోసం భూసమీకరణలో అక్రమాలు జరిగాయంటూ నమోదైన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా పిటిషనర్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీరుపై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని.. ఏ రైతూ కోర్టుకు ఎందుకు రాలేదు?.. పరిహారం కోసం వారు పిటిషన్ వేశారా? ఓ పార్టీ వ్యక్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు.. సమీకరణ అంటే సివిల్ కేసు కదా క్రిమినల్ కుట్రగా మార్చడం రాజ్యాంగ విరుద్ధం.. దురుద్దేశంతోనే ‘అమరావతి’పై కేసు నిజమైన బాధితులు వస్తే న్యాయం చేస్తాం.. అమరావతి భూసమీకరణ కేసు కొట్టివేత చంద్రబాబు, నారాయణలకు ఊరట.. హైకోర్టు తీర్పును సమర్థించిన సీజేఐ బెంచ్ ‘‘రాజకీయ ప్రయోజనాల కోసం కోర్టులను వాడుకోవద్దు. నిజమైన బాధితులు (రైతులు) కోర్టుకు వస్తే చట్టం ప్రకారం న్యాయం జరుగుతుంది. కానీ రాజకీయ నేతలు ప్రజా ప్రయోజనం పేరుతో తమ రాజకీయ కక్షలను తీర్చుకోవడానికి కోర్టు సమయాన్ని దుర్వినియోగం చేయడం తప్పు.’’ ‘‘ఒక్క రైతు అయినా నేరుగా ముందుకు వచ్చి నష్టపరిహారం కావాలని కోర్టులో పిటిషన్ వేశారా? ఫిర్యాదు చేశారా? ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తే ఎస్సీ/ఎస్టీ రైతుల పేరుతో ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు తప్ప, ఒక్క రైతుగానీ, సామాజిక వర్గం వ్యక్తిగానీ నేరుగా ముందుకు రాలేదు.’’ న్యూఢిల్లీ, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి కోసం భూసమీకరణలో అక్రమాలు జరిగాయంటూ నమోదైన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా పిటిషనర్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీరుపై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కోర్టులను రాజకీయ యుద్ధ క్షేత్రాలుగా మార్చవద్దని వ్యాఖ్యానించింది. రాజకీయ ప్రత్యర్థుల మధ్య జరిగే పోరాటాలకు న్యాయస్థానాలను వాడుకోవడం సరికాదని హితబోధ చేసింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ‘‘అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన ప్రధాన కేసును హైకోర్టు ఇప్పటికే కొట్టివేసింది. ఆ తీర్పును సుప్రీంకోర్టు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మల్హార్ మండలం కొయ్యూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌తో తండ్రి, కొడుకు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 14: జిల్లాలోని మల్హార్ మండలం కొయ్యూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌తో తండ్రి, కొడుకు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. కాటారం మండలంలోని మార్వాడిపల్లి గ్రామానికి చెందిన తండ్రి కొట్టేకోళ్ల బాపు(48), కొడుకు మనోజ్(20) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కొయ్యూరు శివారులో వ్యవసాయ భూమి ఉంది. ఈ క్రమంలో తమ వ్యవసాయ భూమి వద్ద బోరులోని మోటారు తీసేందుకు తండ్రీకొడుకు వెళ్లారు. అయితే మోటారు తీస్తున్న సమయంలో విద్యుత్ షాక్‌కు గురై వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. తండ్రి, కొడుకుల మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబానికి చెందిన ఇద్దరు ఒకేసారి ప్రాణాలు కోల్పోడంతో బంధువులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘాటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఉత్తరాఖండ్ చమోలీలో ఘోర ప్రమాదం.. టన్నెల్లో ఏడుగురి మృతి

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ధాన్యానికి క్వింటాకు రాష్ట్రస్థాయిలో అధిక ధర నమోదైంది. అతి సన్న రకాలైన జైశ్రీరాం పాత ధాన్యంకి రూ.4,355 ధర పలకడం విశేషం. కేసముద్రం, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ధాన్యానికి క్వింటాకు రాష్ట్రస్థాయిలో అధిక ధర నమోదైంది. అతి సన్న రకాలైన జైశ్రీరాం పాత ధాన్యంకి రూ.4,355 ధర పలకడం విశేషం. ఈ మార్కెట్‌కు గురువారం 48 మంది రైతులు 1,106 బస్తాల్లో ధాన్యం తీసుకురాగా ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఈ-నామ్) విధానంలోని ‘ఈ-వేలం’లో ధాన్యానికి క్వింటాకు గరిష్ఠంగా రూ.4,355, కనిష్ఠంగా రూ.2,029, సగటున రూ.3,549 ధరలతో వ్యాపారులు ఖరీదు చేశారు. జైశ్రీరాం పాతరకం ధాన్యానికి ఓ వ్యాపారి క్వింటాకు గరిష్ఠంగా రూ.4,355 ధర నమోదు చేసి దక్కించుకున్నాడు. దీంతో మార్కెట్ ఏర్పడిన నాటి నుంచి ధాన్యానికి క్వింటాకు ఈ ధర దక్కడం ఇక్కడ ఒక రికార్డుగా నిలుస్తోంది. జూలై 21న తొలిసారి ఈ రకం ధాన్యానికి క్వింటాకు రూ.4 వేల మార్కు దాటి రూ.4,013 ధర రాగా, అదే నెల 28న రూ.4,036, ఈ నెల 3న రూ.4,135, 4న రూ.4,141 ధరలు నమోదయ్యాయి. ఇదే రకం ధాన్యం గత ఏడాది ఇదే సమయానికి రూ.3,600 నుంచి రూ.3,700 వరకు గరిష్ఠ ధరలతో కొనుగోలు చేశారు. ఈసారి ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులతో అన్ని రకాల ధాన్యం ధరలు సాధారణం కంటే క్వింటాకు రూ.500 నుంచి రూ.700 అధికంగా ఉన్నాయి. అసాధారణ రీతిలో ధాన్యం ధర పెరగడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తుండగా, బియ్యం వినియోగదారులు మాత్రం రేట్లు పెరుగుతాయని ఆందోళనతో ఉన్నారు

Karnataka : కర్ణాటక రాష్ట్రంలో గత కొన్ని నెలల క్రితం జరిగిన ఆసక్తికర ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బ్యాంకు అధికారులకు ఓ రైతు దిమ్మతిరిగే షాకిచ్చాడు. సదరు రైతు డిమాండ్‌కు అధికారులు దిగొచ్చారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైతు నిర్ణయం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లా సకలేశ్పుర ప్రాంతానికి చెందిన చొక్కన గౌడ అనే రైతు ఓ బ్యాంకు నుంచి రూ.50వేలు అప్పుగా తీసుకున్నాడు. అయితే, ఆ రుణాన్ని బ్యాంక్ నిబంధనల ప్రకారం సమయానికి చెల్లించాడు. బ్యాంకులో తన అప్పు పూర్తయిందని రైతు భావించాడు. కొన్ని రోజులకు ఆ రైతుకు బ్యాంక్ నుంచి నోటీసు వచ్చింది. బ్యాంక్ రుణం పూర్తి స్థాయిలో చెల్లించినప్పటికీ తనకు నోటీసు ఎందుకొచ్చిందని రైతు తొలుత కాస్త కంగారు పడ్డాడు. తరువాత తేరుకొని బ్యాంక్ నుంచి వచ్చిన నోటీసును చూడగా.. రైతు షాక్‌కు గురయ్యాడు. మీ పేరుమీద ఇంకో రూ.9.34 పైసలు బకాయి ఉంది. వాటిని చెల్లించాలంటూ ఆ నోటీసులో పేర్కొన్నారు. నోటీసు పట్టుకొని రైతు చొక్కన గౌడ బ్యాంక్ వద్దకు వెళ్లారు. ఇదేంటి నేను మొత్తం సొమ్ము చెల్లించా.. మళ్లీ నోటీసు ఎందుకిచ్చారు అంటూ బ్యాంక్ అధికారులను ప్రశ్నించారు. వాళ్లు వివరాలేమీ చెప్పకుండా మీ పేరుపై ఉన్న రూ.9.34 రుణాన్ని చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పారు. దీంతో సదరు రైతు రూ. 10 బ్యాంకుకు చెల్లించాండు. బ్యాంక్ అధికారులు అందుకు సంబంధించిన రిసిప్ట్ ఇచ్చారు. దీంతో రైతు నాకు రావాల్సిన బాకీ ఇవ్వరా అంటూ బ్యాంక్ అధికారులను ప్రశ్నించారు. నేను బ్యాంక్ కు చెల్లించాల్సింది రూ. 9.34 పైసలు.. నేను చెల్లించింది రూ.10. మిగిలిన 66 పైసలు ఇవ్వాలంటూ రైతు చొక్కన గౌడ బ్యాంక్ అధికారులను డిమాండ్ చేశాడు. దీంతో కంగుతిన్న బ్యాంక్ అధికారులు చేసేది లేక 66 పైసలు తన బ్యాంక్ ఖాతాలో జమ

Minister Narayana: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంపై మంత్రి పి.నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా ఏర్పడిందని ఆయన అన్నారు. రాష్ట్రానికి మంచి రాజధాని నిర్మించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు సాగారని తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబై నగరాలకు దీటుగా అమరావతిని నిర్మించాలన్నది చంద్రబాబు విజన్ అని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి కేవలం పరిపాలనా రాజధానిగా కాకుండా రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా కూడా అభివృద్ధి చెందాలన్న ఆలోచనతో ప్రణాళికలు రూపొందించారని చెప్పారు. అమరావతిని ప్రపంచంలోని టాప్-5 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలన్నదే సీఎం చంద్రబాబు విజన్ అని మంత్రి నారాయణ తెలిపారు. రహదారులు, మౌలిక వసతులు, ఆధునిక నిర్మాణాలతో రాజధానిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. అమరావతి అభివృద్ధిలో రైతులు, ప్రభుత్వం కలిసి ముందుకు సాగుతాయని మంత్రి పేర్కొన్నారు. చంద్రబాబుపై నమ్మకంతో రైతుల భూములు రాజధాని నిర్మాణానికి ఎలాంటి కట్టడాలైనా భూమి అవసరమని మంత్రి నారాయణ అన్నారు. చంద్రబాబుపై నమ్మకంతో రాజధాని రైతులు తమ భూములను సమీకరణకు ఇచ్చారని తెలిపారు. పెద్ద మొత్తంలో పెట్టుబడి లేకుండానే రైతులు రాజధాని నిర్మాణంలో భాగస్వాములయ్యారని పేర్కొన్నారు. కృష్ణా నది ఒడ్డున అమరావతిని ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సమన్యాయం జరుగుతుందనే ఆలోచనతో చంద్రబాబు అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారని మంత్రి వివరించారు. సింగపూర్ మాస్టర్ ప్లాన్ చంద్రబాబు నాయకత్వంపై నమ్మకంతో సింగపూర్ ప్రభుత్వం అమరావతికి మాస్టర్ ప్లాన్ అందించిందని నారాయణ పేర్కొన్నారు. అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో అప్పట్లో ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. అయితే, 2019 నుంచి 2024 వరకు ఐదేళ్ల కాలంలో అమరావతి రాజధాని పనులన్నీ నిలిచిపోయాయని మంత్రి నారాయణ ఆరోపించారు. అప్పటి ప్రభుత్వం రాజధాని విషయంలో మూడు రాజధానుల విధానాన్ని తీసుకురావడంతో అమరావతి అభివృద్ధి ఆగిపోయిందని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా రాజధాని అమరావతిలోనే ఉంటుందని చెప్పిన