
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మల్హార్ మండలం కొయ్యూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో తండ్రి, కొడుకు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది.
జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 14: జిల్లాలోని మల్హార్ మండలం కొయ్యూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో తండ్రి, కొడుకు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. కాటారం మండలంలోని మార్వాడిపల్లి గ్రామానికి చెందిన తండ్రి కొట్టేకోళ్ల బాపు(48), కొడుకు మనోజ్(20) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కొయ్యూరు శివారులో వ్యవసాయ భూమి ఉంది. ఈ క్రమంలో తమ వ్యవసాయ భూమి వద్ద బోరులోని మోటారు తీసేందుకు తండ్రీకొడుకు వెళ్లారు.
అయితే మోటారు తీస్తున్న సమయంలో విద్యుత్ షాక్కు గురై వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. తండ్రి, కొడుకుల మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబానికి చెందిన ఇద్దరు ఒకేసారి ప్రాణాలు కోల్పోడంతో బంధువులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘాటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఉత్తరాఖండ్ చమోలీలో ఘోర ప్రమాదం.. టన్నెల్లో ఏడుగురి మృతి
Read Latest Telangana News And Telugu News





