
Nanded Road Accident: ఘోర రోడ్డుప్రమాదం.. 9 మంది మృతి.. మరో ముగ్గురికి సీరియస్
Nanded Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి.. మరో ముగ్గురికి సీరియస్
© 2026 nimisham.in

Nanded Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి.. మరో ముగ్గురికి సీరియస్

Road Accident | రోడ్డు ప్రమాదంలో ఇన్చార్జి ఏఈవో మృతి

Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది దుర్మరణం..

Fire Accident | పెళ్లి పార్టీలో అగ్నిప్రమాదం.. 22 మంది దుర్మరణం

కరీంనగర్ జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా, పెను ప్రమాదం తృటిలో తప్పింది. చిగురుమామిడి, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా, పెను ప్రమాదం తృటిలో తప్పింది. హుస్నాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బుధవారం హుస్నాబాద్ నుంచి 54 మంది ప్రయాణికులతో కరీంనగర్‌కు బయలుదేరింది. ఈ క్రమంలో చిగురుమామిడి మండలం సుందరగిరి శివారులో రోడ్డుపై ఉన్న గుంతలను తప్పించేందుకు డ్రైవర్ హరీశ్ ప్రయత్నించాడు. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావి వైపు దూసుకెళ్లింది. అయితే, బస్సు తక్కువ వేగంతో ఉండడం, డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు బావి అంచు వరకు వెళ్లి ఆగిపోయింది. వెంటనే ప్రయాణికులు అద్దాలు పగులగొట్టి బయటకు దూకారు. భట్టి భార్య వసూళ్లు.. పొంగులేటి దౌర్జన్యాలు కనిపిస్తలేవా? ఉద్వాసన ఖాయం!.. కొండా సురేఖను పట్టించుకోని అధిష్ఠానం
కరీంనగర్లో బావిలోకి దూసుకెళ్లిన RTC బస్సు.. బయటపడ్డ 54 మంది ప్రయాణికులు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ శివారులో ఘోర బస్సు ప్రమాదం త్రుటిలో తప్పింది. కరీంనగర్ నుండి హుస్నాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి, పక్కనే ఉన్న ఒక వ్యవసాయ బావిపైకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 54 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో ప్రయాణికులంతా స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మూడు రోజుల క్రితమే రిపేర్ చేయించినా ఇలా జరిగిందని డ్రైవర్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వార్తకు సంబంధించిన

పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బర్త్‌డేను పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు, జనసేన శ్రేణులు సంబరాలు చేసుకుంటున్న వేళ కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) పుట్టినరోజు (సెప్టెంబర్ 2) సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు, జనసేన శ్రేణులు సంబరాలు చేసుకుంటున్న వేళ కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అభిమాన హీరో జన్మదినాన్ని ఘనంగా నిర్వహించాలనే ఉత్సాహం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుని, ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. అమలాపురంలో పవన్ కళ్యాణ్ బర్త్‌డే ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై.. రోళ్ల ప్రేమ్ కుమార్ అనే యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ దుర్ఘటన పవన్ అభిమానులతో పాటు సినీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లవరం మండలం బెండమూర్లంక గ్రామానికి చెందిన రోళ్ల ప్రేమ్ కుమార్ (Prem Kumar) హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన అభిమానం ఉన్న ప్రేమ్ కుమార్, తన అభిమాన నాయకుడి పుట్టినరోజు వేడుకలను స్నేహితులతో కలిసి సొంత ఊర్లో ఘనంగా నిర్వహించాలని హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో అమలాపురంలోని ఓ ప్రైవేట్ కళాశాల సమీపంలో రోడ్డు పక్కన పవన్ కళ్యాణ్ భారీ ఫ్లెక్సీ బ్యానర్‌ను ఏర్పాటు చేసేందుకు స్నేహితులతో కలిసి సిద్ధమయ్యాడు. బ్యానర్ కడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు పైనున్న హైటెన్షన్ విద్యుత్ వైరు తగిలింది. దీంతో కరెంట్ షాక్ తగలడంతో ప్రేమ్ కుమార్ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న అమలాపురం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద వార్త తెలుసుకున్న

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Thailand Bar Hair-shaving Video: సాధారణంగా రెస్టారెంట్లతో పాటు బార్లలో కడుపునిండా తిని.. పీకల లోతు దాకా తాగి బిల్లు కట్టకుండా తప్పించుకున్నారన్న వార్తలు మనం తరచుగా వింటూ ఉంటాం. ఇలాంటి సందర్భాల్లో యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదా వారిచేత అంట్లు తోమించడం లాంటి పనులు చేయిస్తూ ఉంటారు. కానీ థాయిలాండ్‌లోని బ్యాంకాక్ లో జరిగిన ఒక ఘటన మాత్రం అందర్నీ ఆశ్చర్యపరిచేలా చేస్తుంది. విపరీతంగా ఖర్చు చేసి బిల్లు కట్టలేక పోయిన ఒక ఒక యువతికి పబ్బు యాజమాన్యం ఏకంగా గుండు కొట్టించింది.. ప్రస్తుతం ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్ గా మారింది.. దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.. అసలేమైందంటే.. ఆగస్టు 25వ తేదీన బ్యాంకాక్ లోని పినక్లావ్ (Pinklao) ప్రాంతంలో ఉన్న ఓ కాస్ట్లీ బార్లో 18 ఏళ్ల యువతి నకిలీ ఐడి కార్డుతో లోపలికి వెళ్ళింది.. అయితే, అక్కడ విపరీతంగా మందు తాగడంతో పాటు.. అక్కడికి డాన్సర్లకు కూడా ఖరీదైన డ్రింక్స్ ఇప్పించింది. అలా ఆ రాత్రి ఆమె చేసిన బిల్లు ఏకంగా భారత కరెన్సీలో 1.7 లక్షల రూపాయలు.. అంత భారీ మొత్తంలో వచ్చిన బిల్లును చూసి కంగు తిన్న ఆ యువతి.. డబ్బులు చెల్లించకుండా బార్ నుంచి మెల్లగా జారుకునే ప్రయత్నం చేసింది.. యువతి దొంగ చాటున పారిపోతుండగా గమనించిన భార సిబ్బంది.. ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.. పోలీసులకు అప్పగించాల్సిన యాజమాన్యం

అమలాపురంలో విద్యుత్ షాక్‌తో జన సైనికుడి మృతిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రేమ్ కుమార్ మృతి కలిచివేసిందన్నారు. అమరావతి, సెప్టెంబర్ 2: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ షాక్‌కు గురై ప్రేమ్‌కుమార్ మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఉపముఖ్యమంత్రి స్పందిస్తూ.. యువకుడి మృతిపై ఆవేదన వ్యక్తం చేశారు. అమలాపురంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై జనసైనికుడు ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. యువకుడి కుటుంబానికి అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. జీవితం ఎంతో అమూల్యమైనదని పవన్ అన్నారు. ఉత్సవాల సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే సమయంలో మన కోసం కుటుంబం ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. ఎత్తైన ప్రదేశాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసే సమయంలో, ర్యాలీల్లో స్వీయ భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచనలు చేశారు. జనసేన యువజన విభాగం ‘జై కొట్టు’.. పిఠాపురంలో లోగో ఆవిష్కరణ అన్నమయ్య ప్రాజెక్ట్ విపత్తు క్రెడిట్ జగన్‌కే దక్కుతుంది: పట్టాభి
మలేరియా మాత్రలు వికటించి చిన్నారి మృతి.. 57 మందికి అస్వస్థత మలేరియా మాత్రలు వికటించి ఓ చిన్నారి మృతి చెందగా మరో 57 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో.. మలేరియా నివారణ మాత్రలు అయిన క్లోరోక్విన్ మాత్రలు వికటించి ఒక చిన్నారి మృతి చెందడమే కాకుండా మరో 57 మంది తీవ్ర అస్వస్థతతకు గురయ్యారు. వీరిలో 41 మంది చిన్నారులు ఉండగా.. 16 మంది గ్రామస్తులు ఉన్నారు. ప్రస్తుతం వీరిందరికీ చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమంగా ఉన్నవారిని మెరుగైన చికిత్స నిమిత్తం భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. ఈ వార్తకు సంబంధించిన

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Narayanpet Dj Death: స్నేహితుడు పెళ్లి వేడుకల్లో ఆ యువకుడు అందరిలాగే ఉత్సాహంగా డాన్స్ చేస్తూ ఉన్నాడు.. చెవులు చిల్లుపడే డిజె సౌండ్స్ మధ్య స్నేహితులతో కలిసి సందడి చేస్తున్నాడు.. కానీ కాసేపట్లోనే ఆ ఆనందం ఆవిరి అయిపోయింది. డిజె సౌండ్ ల తీవ్రతకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. పోతిరెడ్డిపల్లి కి చెందిన దస్తయ్య, లక్ష్మీ దంపతుల కుమారుడు రవితేజ (17) అక్కడే ఉన్న ఓ కాలేజీలో ఇంటర్ చేస్తున్నాడు.. అయితే తనకు ఎంతో ఇష్టమైన స్నేహితుడు ఇంట్లో పెళ్లి వేడుక ఉండడంతో రాత్రి సమయంలో ఎంతో ఉత్సాహంగా అక్కడికి వెళ్లాడు.. వివాహ సంబరాల్లో భాగంగా భారీ శబ్దాలతో డీజేలను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అయితే స్నేహితులందరూ కలిసి ఆ డిజె సౌండ్స్ మధ్య అందరూ కలిసి బాగా డాన్స్ చేస్తున్నారు.. అయితే ఇంతలోనే.. డిజె సౌండ్స్ తాకిడికి ఆ యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు గమనించిన స్నేహితులు తీవ్రభయాందోళనకు గురయ్యారు.. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. అయితే ఆస్పత్రిలో పరీక్షించిన వైద్యులు.. రవితేజ అప్పటికే తీవ్ర గుండెపోటుతో మరణించినట్లు నిర్ధారణ చేశారు.. చేతికి అందించిన కొడుకు అకాల మరణంతో కానరాని లోకంలోకి వెళ్లడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. చదువుకొని ఉన్నత స్థాయికి ఎదుగుతాడు అనుకున్న కొడుకు ఇలా విగత జీవిగా మారడాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు

పోలవరం జిల్లాలోని గొల్లగుప్ప గ్రామంలో మలేరియా నివారణ మందుల (క్లోరోక్విన్) వికటన ఘటన తీవ్ర కలకలం రేపింది. సంఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెంటనే స్పందించి ఉన్నతాధికారులతో వేర్వేరుగా అత్యవసర సమీక్ష నిర్వహించారు. మందులు వికటించి ఒక బాలిక మృతి చెందిందనే సమాచారం అందుకోవడంతో సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితులను స్వయంగా సమీక్షించారు. బాధితులకు తక్షణమే అత్యుత్తమ వైద్యం అందించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని సీఎంతో పాటు మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.గ్రామంలో మొత్తం 71 మందికి మలేరియా నివారణ మందులు పంపిణీ చేయగా, వాటి ప్రభావంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే అధికారులు అప్రమత్తమై గ్రామంలో అత్యవసర మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అస్వస్థతకు గురైన వారిలో 47 మంది చిన్నారులతో సహా మొత్తం 52 మందికి తెలంగాణలోని భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. మరో 24 మందికి స్థానిక లక్ష్మీపురం పీహెచ్సీలో వైద్య సేవలు అందిస్తున్నారు. పొరుగు రాష్ట్రంలో ఉన్న భద్రాచలం ఆసుపత్రికి చింతూరు ఐటీడీఏ పీవో, ఏఎస్పీ సహా ఇతర అధికారులు స్వయంగా వెళ్లి బాధితుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. డయేరియా పంజా: ముగ్గురు మృతి, 76 మందికి అస్వస్థతఅసత్య ప్రచారాలు నమ్మొద్దు!భద్రాచలం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 52 మందికి మలేరియా ఆర్డీటీ పరీక్షలు నిర్వహించగా, వారిలో ఆరుగురికి మలేరియా పాజిటివ్‌గా తేలిందని వైద్యులు వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన వారందరికీ తగిన యాంటీ మలేరియా చికిత్సను ప్రారంభించినట్లు మంత్రి సత్యకుమార్‌కు అధికారులు నివేదించారు. ముందు జాగ్రత్త చర్యగానే బాధితులందరినీ మెరుగైన వైద్యం కోసం దగ్గర్లోని ఏరియా ఆసుపత్రికి తరలించామని, ప్రస్తుతం వారందరి ఆరోగ్య పరిస్థితి పూర్తి నిలకడగా ఉందని స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారంటూ వస్తున్న

పోలవరం జిల్లా, ఏటపాక మండలం గొల్లగుప్ప గ్రామంలో క్లోరోక్విన్ మాత్రలు వేసుకున్న అనంతరం ఏడేళ్ల బాలిక మృతి చెందడం, పలువురు అస్వస్థతకు గురికావడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. బాధితులందరికీ అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ఆయన స్పష్టం చేశారు.ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్‌తో ముఖ్యమంత్రి ఈ ఘటనపై సమీక్ష నిర్వహించారు. మలేరియా రాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామంలోని 71 మందికి క్లోరోక్విన్ మాత్రలు పంపిణీ చేయగా, వాటిని తీసుకున్న తర్వాత పలువురు అనారోగ్యం పాలయ్యారు. ఈ దురదృష్టకర ఘటనలో జమున అనే ఏడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.ప్రభుత్వ ఆదేశాలతో అధికార యంత్రాంగం తక్షణమే సహాయక చర్యలు చేపట్టింది. అస్వస్థతకు గురైన వారిలో 29 మందిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి, మరో 24 మందిని లక్ష్మీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామంలో అత్యవసర వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తొమ్మిది మంది సభ్యులతో కూడిన ప్రత్యేక వైద్య బృందం ఇప్పటికే గ్రామానికి చేరుకోగా, విజయవాడ, రాజమండ్రి నుంచి మరిన్ని బృందాలు బయలుదేరాయి.ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మరణించారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, కేవలం ఒక బాలిక మాత్రమే మృతి చెందిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం నిలకడగా ఉందని, జిల్లా యంత్రాంగం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని వారు వెల్లడించారు

మన దేశంలో చాలా రకాల పక్షులు ఉన్నాయి. పక్షులు ఒక్కో ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలసలు వెళుతూ ఉంటాయి.. వస్తూ ఉంటాయి. కానీ, కుప్పలు తెప్పలుగా ఒకే గ్రామంలో చనిపోవడం గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ సంఘటన అస్సాంలోని డిమా హసావో జిల్లాలోని జటింగాలో ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. పక్షులు ఇలా ఎందుకు చనిపోతున్నాయి? ఇక్కడ మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో చివరలో సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య అమావాస్య లేదా చీకటి రాత్రుల్లో ఈ వింత జరుగుతుంది. రాత్రి 7 గంటల నుంచి 10 గంటల సమయంలో దట్టమైన పొగమంచు, ఈదురుగాలులు, వర్షం ఉన్నప్పుడు పక్షులు ఉన్నట్లుండి.. గ్రామంలో వెలుగుతున్న దీపాల వైపు దూసుకొచ్చు కింద పడిపోతూ ఉంటాయి. పక్షులు నిజంగా ఆత్మహత్య చేసుకుంటాయా అంటే.. చేసుకోవు. జీవశాస్త్రం ప్రకారం పక్షులకు 'ఆత్మహత్య' చేసుకునే ఉద్దేశం లేదా ఆలోచనా శక్తి ఉండదు. అసలు కారణం దిశానిర్దేశం కోల్పోవడం వల్ల ఇలా జరుగుతుంది. భారీ గాలులు, దట్టమైన పొగమంచు ఉన్నప్పుడు పక్షులు ఎటు ఎగరాలో తెలియక అయోమయానికి గురవుతాయి. ఆ కారుచీకట్లో గ్రామంలోని దీపాలు లేదా గ్రామస్తులు వెలిగించిన మంటల వెలుతురు మాత్రమే వాటికి కనిపిస్తుంది. ఆ కాంతి వైపు అత్యంత వేగంగా దూసుకువచ్చే క్రమంలో.. వాతావరణంలో అస్పష్టంగా ఉండే చెట్లు, ఇళ్ల గోడలు, కరెంటు స్తంభాలను బలంగా ఢీకొడతాయి. ఆ దెబ్బకు గాయాలపాలై, స్పృహతప్పి నేలకూలుతాయి. చాలామంది ఇవి సుదూర ప్రాంతాల నుండి వచ్చే వలస పక్షులు అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. పాండ్ హెరాన్, కింగ్‌ఫిషర్, టైగర్ బిట్టర్న్ వంటి సుమారు 44 రకాల స్థానిక అటవీ పక్షులే ఈ ప్రమాదానికి గురవుతాయి. వీటిలో ఎక్కువ శాతం సరిగ్గా ఎగరడం తెలియని చిన్న పక్షులు ఉంటాయి. దశాబ్దాల క్రితం, రాత్రిపూట ఆకాశం నుంచి కిందపడుతున్న పక్షులను

హైదరాబాద్ రాయదుర్గంలో సోమవారం తెల్లవారుజామున ఒక ఘోరమైన హిట్ అండ్ రన్ ప్రమాదం చోటుచేసుకుంది. ఓఆర్ఆర్ రోటరీ నుంచి ఖాజాగూడ గ్రామం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన ఇన్నోవా కారు కాలినడకన వెళ్తున్న నందులాల్ అనే వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. ఈ తీవ్రమైన ఘటనలో నందులాల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ప్రమాదాన్ని చూసి సహాయం చేయడానికి పరుగెత్తుకు వచ్చిన జైద్ షా కాద్రి అనే విద్యార్థి కూడా అదే వాహనం తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి కారును నిలపకుండా అక్కడి నుండి వేగంగా పరారయ్యాడు. ఈ హిట్ అండ్ రన్ ఘటనపై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు వెంటనే దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రమాదానికి కారణమైన ఇన్నోవా వాహనాన్ని నడిపినది ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌గా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో పోలీసులు వేగంగా స్పందించి సందీప్‌ను అరెస్ట్ చేసి, ప్రమాదానికి వాడిన కారును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆనంద్ సాయి తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందడమే కాకుండా యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. 2024 లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ ట్రస్ట్ బోర్డులో జనసేన నామినీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రమాద సమయంలో వాహనం ఏ వేగంతో వెళ్తోంది, డ్రైవర్ మద్యం సేవించి ఉన్నారా లేదా అనే అంశాలపై పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా, గాయపడిన విద్యార్థి జైద్ షా కాద్రిని స్థానికులు తక్షణమే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, అతని ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెలువడాల్సి ఉంది. మరోవైపు ప్రాణాలు కోల్పోయిన నందులాల్ కుటుంబ నేపథ్యం, ఇతర వివరాలను సేకరించే పనిలో పోలీసులు

ఉదయం ఖాళీ పొట్టతో మనం తినే ఆహారం ఆ రోజంతా మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. చాలామందికి ఉదయం లేవగానే టీ, కాఫీ తాగనిదే రోజు మొదలవదు. కానీ పరగడుపున తాగితే కొందరిలో గుండెల్లో మంట, కడుపులో అసౌకర్యం వంటి సమస్యలు వస్తాయి. కాఫీలోని కెఫీన్ పొట్టలో యాసిడ్ ఉత్పత్తిని పెంచి, పేగుల్లో మంట పుట్టిస్తుంది. అసిడిటీ సమస్య ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అందుకే పరగడుపున కాఫీ, టీలు తాగకూడదు. ఉదయానే నిమ్మ, నారింజ వంటి సిట్రస్ వంటి పండ్లను తినకూడదు. వీటిని పరగడుపున తింటే గుండెల్లో మంటను కలిగిస్తాయి. బజ్జీ, బోండా, వడ వంటి నూనె, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలను ఉదయాన్నే పరగడుపున తినొద్దు. ఇవి జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది, కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. ఫ్యాటీ లేదా గ్రీసీ ఫుడ్స్ కొందరిలో డిస్పెప్సియా లక్షణాలను కలిగిస్తాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ (NIDDK) పేర్కొంది. అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నవారికి పెరుగు లేదా యోగర్ట్ అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అలాంటి వాళ్లు పరగడుపున తినకుండా, మధ్యాహ్న భోజనంతో పాటు తీసుకోవడం మంచిది. పరగడుపున అరటిపండు తింటే పెద్దగా నష్టమేమీ లేదు. కానీ, కొందరికి ఉదయాన్నే పరగడుపున అరటిపండు తింటే కడుపు ఉబ్బరం లేదా అసౌకర్యం కలగవచ్చు. బాగా పండిన అరటిపండు తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగే అవకాశం ఉంది. అరటిపండు పండేకొద్దీ దానిలోని పిండిపదార్థం చక్కెరగా మారుతుంది. కాబట్టి అరటిపండును తినకూడదు

రాయదుర్గంలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. హిట్ అండ్ రన్ కేసులో ఒకరు మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్, సెప్టెంబర్ 1: రాయదుర్గంలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. హిట్ అండ్ రన్ కేసులో ఒకరు మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓఆర్ఆర్ రోటరీ నుంచి ఖాజాగూడ గ్రామం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నడుచుకుంటూ వెళ్తున్న నందులాలను ఇన్నోవా కార్ బలంగా ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన వ్యక్తిని విద్యార్థి జైద్‌షా కద్రీ ఆస్పత్రికి తీసుకెళ్తుండా మరో ప్రమాదం జరిగింది. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్తున్న విద్యార్థిని మహేంద్ర కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో నందులాల అక్కడికక్కడే మృతిచెందగా.. విద్యార్థి జైద్‌షా కద్రీకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత కారు యాజమాని వాహనాన్ని ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెంటనే అక్కడకు చేరుకున్న స్థానికులు.. విద్యార్థిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు.. మహేంద్ర కార్ యాజమానిని గుర్తించారు. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్.. కారు నడిపి ఒకరి మృతికి కారణమైనట్లు విచారణలో తేలింది. దీంతో కారును సీజ్ చేసిన పోలీసులు.. సందీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలవరం నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. చంద్రబాబు చేతుల మీదుగా విడుదల మూడు పోలవరాలు కట్టేంత మొత్తాన్ని పెన్షన్లకు ఖర్చు చేశాం: సీఎం చంద్రబాబు

జర్మనీలో రద్దీగా ఉన్న ఓ రైల్లో భారత పర్యాటకులు పాటలు పాడుతూ హల్చల్ చేశారు. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంటర్నెట్ డెస్క్: జర్మనీలో రద్దీగా ఉన్న ఓ రైల్లో భారత పర్యాటకులు పాటలు పాడుతూ హల్చల్ చేశారు. భారతీయులు పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ సందడి చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో వారి ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ వీడియోలో కొందరు భారత పర్యాటకులు రైలు మధ్యలో నిల్చుని బిగ్గరగా పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ ఉన్నారు. మరికొందరు వారికి వంతపాడుతూ చేతులు ఊపుతూ, ఫోన్లలో ఆ దృశ్యాలను రికార్డ్ చేశారు. చుట్టూ ఉన్న ఇతర ప్రయాణికులు నిశ్శబ్దంగా కూర్చోగా, కొందరు మాత్రం అసంతృప్తిగా అలా చూస్తుండిపోయారు. ఈ వీడియోను Amit24TD అనే యూజర్ తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేయగా.. నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి ఘటనలు విదేశాల్లో భారతీయ పర్యాటకులపై ప్రతికూల ప్రభావం చూపుతాయని కొందరు వ్యాఖ్యానించారు. రద్దీగా ఉన్న ప్రజా రవాణాలో ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించడం సరికాదని మరికొందరు సూచించారు. వ్యక్తిగత వేడుకలు, సరదాలను బహిరంగ ప్రదేశాల్లో ఇతర ప్రయాణికులపై రుద్దకూడదని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ విషయమై రైల్వే సిబ్బంది, అధికారులు ఎందుకు జోక్యం చేసుకోలేదని మరికొందరు ప్రశ్నించారు. హెగ్సెత్‌పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.. 2028 రేసులో ఉన్నట్టా? విమాన ఇంధనానికి మళ్లీ మంట.. లీటరుకు రూ.6.28 పెరిగిన ఏటీఎఫ్ ధర

పల్నాడు: ‘ఒరేయ్ మీ నాన్న నాకు మంచి స్నేహితుడురా... నీకు కూల్‌డ్రింక్ ఇప్పిస్తా..రా’ అంటూ బాలుడికి మాయమాటలు చెప్పి సైకిల్‌తో ఉడాయించిన ఘటన గణపవరం గ్రామంలో చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆకునూరి నాగేశ్వరరావు కుమారుడు పవన్‌కుమార్ స్థానిక జెడ్పీహైస్కూలులో ఐదో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో స్నేహితులతో ఆడుకునేందుకు సైకిల్‌పై ఇంటి నుంచి బయలుదేరాడు. సినిమాహాల్ రోడ్డులో వెళ్తుండగా ఓ యువకుడి ఎదురై పవన్‌కుమార్‌ను ఆపాడు. మీ నాన్న నాకు తెలుసు.. బజారుకు వెళ్దాం రా అంటూ మాటలు కలిపాడు. పవన్‌కుమార్‌ను సైకిల్‌పై వెనుక కూర్చొబెట్టుకుని మెయిన్‌రోడ్డులోని ఓ బడ్డీ దుకాణం వద్దకు తీసుకెళ్లాడు. పవన్‌కుమార్‌కు కూల్‌డ్రింక్ ఇప్పించి, గ్లాసులు తీసుకొనివస్తా ఇక్కడే ఉండమని చెప్పి సైకిల్ తీసుకొని వెళ్లాడు. ఎంతసేపటికి తిరిగిరాకపోయేసరికి బాలుడు పవన్‌కుమార్ ఇంటికి వెళ్లి విషయాన్ని తండ్రికి వివరించాడు. అగంతక వ్యక్తి కోసం గ్రామంలో వెతికినా ఫలితం లేకపోవటంతో ఓ ఇంటి సీసీ కెమేరాల ఫుటేజీని పరిశీలించారు. బాలుడిని సైకిల్‌పై ఎక్కించుకుని వెళ్తున్న సంఘటన సీసీ కెమెరాలో రికార్డు అవటంతో బాలుడి తండ్రి నాగేశ్వరరావు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు) కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు) యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు) పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు) యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు) పోలీసుల తీరుపై కన్నీళ్లు పెట్టుకున్న పుష్ప శ్రీ వాణి పాపం ఆ లీడర్ పరిస్థితి సైలెంట్ గా సైడ్ కు నెట్టేసిన చంద్రబాబు

Sircilla: సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లిస్తే కఠిన చర్యలు బక్కి వెంకటయ్య! Sircilla: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి పడితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న అనంతరం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, భూ వివాదాలు, ఉద్యోగుల ప్రమోషన్లు, సివిల్ రైట్స్ డే తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి నెల చివరి వారంలో సివిల్ రైట్స్ డే నిర్వహించి, అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సూచించినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీల భూ వివాదాల పరిష్కారంలో అధికారులు మానవీయ కోణంలో ఆలోచించాలని, సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాలో నేరాల సంఖ్య తగ్గడంతో పాటు పోలీసుల పనితీరు బాగుందని బక్కి వెంకటయ్య పోలీస్ శాఖను అభినందించారు. ఇక నేరెళ్ల బాధితులు ఇచ్చిన దరఖాస్తుపై స్పందించిన కమిషన్ చైర్మన్... ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్, ఎస్పీలు నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి సమక్షంలో జరిగే రాష్ట్ర హైపర్ కమిటీ సమావేశంలో నేరెళ్ల బాధితులకు తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని బక్కి వెంకటయ్య వెల్లడించారు

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Eshwar Sai Missing: ఫోక్ డాన్సర్ 'భాసింగ బలాలు' ఫేమ్ ఈశ్వర్ సాయి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా వాడుకొని మోసం చేశాడని తోటి కళాకారిణి మాధురి రాథోడ్ ఫిర్యాదు చేశారు. దీంతో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆయన పరారయ్యారు. వేములవాడలోని ఒక హోటల్లో ఈశ్వర్ సాయి, మాధురి కలిసి ఉండగా, భార్య వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో ఆయన తప్పించుకున్నారు. అతని కోసం పోలీసులు రెండు బృందాలుగా గాలిస్తున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసులు అతని ఆచూకీ కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు. దీంతో నార్సింగి పోలీసులు రెండు ప్రత్యేక బృందాలుగా దర్యాప్తును వేగవంతం చేశారు. గత నెల 22న మాధురి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, తనపై, తన కుటుంబ సభ్యులతో కలిసి దాడి చేశారని పేర్కొన్నారు. అప్పటి నుండి ఈశ్వర్ సాయి పరారీలో ఉన్నట్లు సమాచారం. మాధురి, ఈశ్వర్ సాయికి చాలా కాలంగా సన్నిహితంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే, వేములవాడలోని ఒక హోటల్లో ఈశ్వర్ సాయి భార్య శరణ్య, వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రేమ పేరుతో తనను వంచించి మోసం చేశారని మాధురి ఫిర్యాదు చేశారు. దీంతో నార్సింగి పోలీసులు సెక్షన్ 69 BNS ప్రకారం, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకొని మోసం చేసినందుకు ఈ కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే, హోటల్ నుండి పరారైన ఈశ్వర్ సాయి ఇప్పటి వరకు ఎవరికీ అందుబాటులో లేడని పోలీసులు చెబుతున్నారు. ఈశ్వర్ సాయిని వెంటనే

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న కాలంలో.. వినూత్న ఆవిష్కరణలు, ప్రయోగాలు నిత్యకృత్యంగా మారాయి. అయితే కొత్తదనం ఎంత ఆసక్తికరంగా ఉన్నా.. భద్రత విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఊహించని పరిణామాలు తప్పవు. పాకిస్థాన్‌లో జరిగిన ఈ ఘటన అందుకు ఓ ఉదాహరణ. పాకిస్తాన్లో టెక్నాలజీ ప్రయోగం కాస్తా.. పోలీస్ వ్యాన్‌ను ఢీకొట్టే ఘటనగా మారింది. ఇంటర్నెట్ కనెక్షన్ ఒక్కసారిగా తెగిపోవడంతో రిమోట్ కంట్రోల్‌తో నడుస్తున్న ఓ ఆటోమేటిక్ కారు అదుపు తప్పి నేరుగా పోలీస్ వ్యాన్‌ను ఢీకొట్టింది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని డీ-చౌక్ వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయి నవ్వులు పూయిస్తోంది. ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెక్నాలజీని ప్రదర్శిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడి జర్నలిస్టు మహ్మద్ ఆలిజా కారులో ముందు సీట్లో కూర్చొని దాని ప్రత్యేకతలను వివరిస్తున్నారు. అబ్బొట్టాబాద్కు చెందిన టెక్నాలజీ ఔత్సాహికుడు ఇహ్సాన్ జాఫర్ రూపొందించిన ఈ ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెక్నాలజీపై రిపోర్టు చేసేందుకు తాను అక్కడికి వెళ్లినట్లు ఆలిజా వెల్లడించారు. కారు ముందుకు కదులుతుండగా.. ఒక్కసారిగా రిమోట్ ద్వారా నియంత్రించే స్టీరింగ్ స్పందించడం ఆపేసింది. పరిస్థితిని గమనించిన ఆలిజా వెంటనే హ్యాండ్‌బ్రేక్ వేసేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. కారు వేగంగా ముందుకు దూసుకెళ్లి అక్కడే ఉన్న పోలీస్ వ్యాన్‌ను ఢీకొట్టింది. కనెక్షన్ కట్.. కారు కంట్రోల్ ఔట్! ఈ కారును ఇంటర్నెట్, శాటిలైట్ కనెక్షన్ల సాయంతో రిమోట్‌గా నియంత్రిస్తున్నట్లు ఆలిజా తెలిపారు. అయితే ప్రయోగం జరుగుతున్న సమయంలో ఇంటర్నెట్ కనెక్షన్ తెగిపోవడంతో కారు నియంత్రణ కోల్పోయిందని చెప్పారు. అదృష్టవశాత్తూ ఘటన జరిగిన సమయంలో అక్కడ ట్రాఫిక్ తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. అదే కారు రద్దీగా ఉండే రోడ్డుపై అదుపు తప్పి ఉంటే పరిస్థితి తీవ్రంగా ఉండేదని ఆలిజా పేర్కొన్నారు. అయితే పోలీసులు ఎలా స్పందించారో అనేది మాత్రం ఆయన వివరించలేదు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్

ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్, సీఎన్జీ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం ఆజాగ్రత్తగా ఉన్నా.. ప్రాణాల మీదకు వస్తుంది. ఇంటర్నెట్ డెస్క్: ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్, సీఎన్జీ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం ఆజాగ్రత్తగా ఉన్నా.. ప్రాణాల మీదకు వస్తుంది. అందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. బంక్‌లో నిలిపి ఉంచిన కారులో.. సీఎన్జీని పైపు ద్వారా నింపుతున్నారు. కారుకు ఆ పైపును పెట్టి వదిలేశారు. బంకులోని వారంతా ఒక చోట చేరి మాట్లాడుకుంటున్నారు. ఒక్కసారిగా కారుకు పెట్టి ఉన్న సీఎస్జీ పైపు ఊడిపోయింది. అందులోని గ్యాస్ ఉద్ధృతికి ఆ పైప్ వాయువేగంతో కదిలింది. ఈ పరిణామాన్ని అక్కడ ఉన్న వారెవరూ అసలు ఊహించలేదు. అంతలో అక్కడే ఉన్న వ్యక్తిని ఆ గ్యాస్ పైప్ హ్యాండ్లర్ బలంగా తగిలింది. దీంతో అతడు కింద పడిపోయాడు. అక్కడి వారంతా భయంతో తలోదిక్కు పరుగులు తీశారు. ఓ వ్యక్తి మాత్రం ధైర్యం చేసి.. సీఎన్జీని ఆఫ్ చేశాడు. అనంతరం గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అతడు చికిత్స పొందుతూ మరణించాడు. అతడి పేరు తుషార్ ఖుమ్రీ. ఈ ఘటన ఆగస్ట్ 27వ తేదీన జార్ఖండ్‌లోని జంషెడుపూర్ జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. సహజ వాయువుతో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్న భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అంటున్నారు. సీఎన్జీ పైపు అలా వదిలివేయకుండా ఉండి ఉంటే.. ఈ ప్రమాదానికి ఆస్కారం ఉండేది కాదని అభిప్రాయపడుతున్నారు

Narsapur: నర్సాపూర్‌లో వింత ఘటన.. కుక్క పిల్లలకు పాలిస్తున్న వరాహం! ఈ వార్తకు సంబంధించిన

ఓ రోడ్డు ప్రమాదం కేసు విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. బైక్‌పై ప్రియురాలు వెనుక కూర్చుంటే, నడిపే ప్రియుడికి ఉత్సాహం రావడం సహజమేనని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కారణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని, ప్రమాదంలో మరణించిన యువకుడికి పాక్షిక బాధ్యత ఉందని నిర్ధారించింది.2018 మే 10న తేని జిల్లాకు చెందిన 19 ఏళ్ల గోపాల్, తన ప్రియురాలు రాజేశ్వరితో కలిసి బైక్‌పై ప్రయాణిస్తున్నాడు. వీరపాండి-వాయల్‌పట్టి మార్గంలో అర్ధరాత్రి సమయంలో వారి బైక్‌ను ఓ వ్యాన్ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో గోపాల్ అక్కడికక్కడే మృతి చెందగా, రాజేశ్వరి గాయపడ్డారు. దీంతో గోపాల్ తల్లిదండ్రులు పరిహారం కోసం తేని మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. విచారణ జరిపిన ట్రైబ్యునల్, 2021లో మృతుడి కుటుంబానికి రూ. 25.5 లక్షలు చెల్లించాలని వ్యాన్ బీమా సంస్థను ఆదేశించింది.ఈ తీర్పుపై బీమా సంస్థ హైకోర్టులో అప్పీల్ చేసింది. జస్టిస్ జి.ఆర్. స్వామినాథన్, జస్టిస్ ఎం.డి. సుమతిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన యువకుడికి 25 శాతం పాక్షిక నిర్లక్ష్యం ఉందని కోర్టు తేల్చింది. "మృతుడు 19 ఏళ్ల యువకుడు. అతడి ప్రియురాలు వెనుక కూర్చుని ఉన్నారు. ప్రియురాలు వెనుక కూర్చున్నప్పుడు ఏ రైడర్‌కైనా ఉత్సాహం రావడం సహజం" అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. దీనికి తోడు, మృతుడు రోడ్డుకు కుడివైపున బైక్ నడపడం, డ్రైవింగ్ లైసెన్స్ సమర్పించకపోవడం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని, ట్రైబ్యునల్ విధించిన

Kakinada: తునిలో ఘోర రోడ్డు ప్రమాదం: లారీని ఢీకొన్న ప్రైవేట్ బస్సు! ఈ వార్తకు సంబంధించిన

వెలిగొండ నుంచి వస్తున్న కృష్ణా జలాలు చూసేందుకు ముంపు గ్రామం కలనూతల వెళ్లి ఆ నీటి ప్రవాహంలో యువకులు చిక్కుకుపోయారు. వారిని జిల్లా అధికారులు రక్షించారు. మార్కాపురం,సెప్టెంబర్01: జిల్లాలోని పెద్దారవీడు మండలం కలనూతల సమీపంలోని వెలిగొండ నీటి ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది. కారులోని ముగ్గురు యువకులు సమీపంలోని చెట్టు ఎక్కి రక్షించాలంటూ బిగ్గరగా కేకలు వేశారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు.. వెంటనే జిల్లా అధికారులతోపాటు పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా కలెక్టర్ విజయ సునీత ఆధ్వర్యంలో దాదాపు ఏడు గంటల పాటు శ్రమించి.. ఆ యువకులను రెస్క్యూ టీం కాపాడింది. వెలిగొండ నుంచి వస్తున్న కృష్ణా జలాలు చూసేందుకు ముంపు గ్రామం కలనూతల వెళ్లి.. ఈ నీటి ప్రవాహంలో చిక్కుకున్నట్లు ఆ యువకులు వెల్లడించారు. వెలిగొండ ప్రాజెక్టును సోమవారం సీఎం చంద్రబాబు ప్రారంభించిన విషయం విదితమే

మహారాష్ట్రలో జీపు బోల్తా ప్రమాదం నిర్మల్ జిల్లా వాసులు నలుగురు మృతి శివయ్య దర్శనం ముగించుకుని వస్తుండగా విషాదం Maharashtra Jeep Accident: శ్రావణ సోమవారం నాడు దైవదర్శనానికి వెళ్లిన నిర్మల్ జిల్లా వాసుల ప్రయాణం విషాదాంతమైంది. మహారాష్ట్ర (Maharashtra Jeep Accident)సరిహద్దు ప్రాంతంలో జీపు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండల సరిహద్దులోని తొటాంబ గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శ్రావణ సోమవారాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని శివాలయానికి వెళ్లిన వీరంతా, తిరుగుప్రయాణంలో మహారాష్ట్రలోని సాసర్ కొండ జలపాతాన్ని సందర్శించి వస్తుండగా ఈ విషాదం జరిగింది. BC Dedicated Commission: ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. బీసీ డెడికేటెడ్ కమిషన్ గడువు పెంపు.. కొత్త డెడ్‌లైన్ ఎప్పుడంటే? భైంసా ఆసుపత్రికి క్షతగాత్రులు తరలింపు: ఈ ప్రమాదంలో ముగ్గురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. మృతులలో ముగ్గురిని కుబీర్ మండలం పార్డి (బి) గ్రామానికి చెందిన తులసీరామ్, గంగన్న, గంగాబాయిగా పోలీసులు గుర్తించారు. ప్రమాద వార్త తెలియగానే గ్రామంలో తీవ్ర శోకసంద్రం అలుముకుంది. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను వెంటనే భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు

హైదరాబాద్‌లోని చారిత్రక గోల్కొండ కోట సమీపంలో, 400 ఏళ్ల నాటి కుతుబ్ షాహీ సమాధుల ప్రాంగణంలో రహస్య తవ్వకాలు కలకలం రేపాయి. గుట్టుచప్పుడు కాకుండా సాగిన ఈ అక్రమ తవ్వకాల్లో 100 మీటర్ల పొడవైన రహస్య స్వరంగం బయటపడటంతో స్థానికంగా, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై ఎంపీ ఓవైసీ సీరియస్‌గా స్పందించగా, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ వెంటనే పురావస్తు శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. పాన్,ఆధార్ వాట్సాప్‌లో పంపుతున్నారా? క్షణాల్లో రంగంలోకి సైబర్ నేరగాళ్లు.. రెప్పపాటులో బ్యాంకు ఖాతాలు గుల్ల బయటకి ఆరోగ్యంగా కనిపిస్తున్నా.. కొన్ని విటమిన్ లోపాలు ఉండొచ్చు.. ఎలా చెక్ చేసుకోవాలి? వేగంగా వేడెక్కుతున్న భూమి.. ప్రమాదంలో పెద్దల ప్రాణాలు మేలుకోకుంటే మరణ మృదంగమే ! కుటుంబంలో ఆర్థిక, ఆరోగ్య సమస్యలా.. అయితే మళ్లీ పెళ్లి చేసుకోండి! అంతరిక్షంలో అగ్రికల్చర్.. తాజా ఆకుకూరలు పండించిన నాసా వ్యోమగామి

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనలో విషాదాంతం చోటుచేసుకుంది. గోదావరి నదిలో గల్లంతైన ఆయన భార్య మీనా (55) మృతదేహం శనివారం లభ్యమైంది. ఆరు రోజులుగా కొనసాగుతున్న గాలింపు చర్యలకు దీంతో ముగింపు పలికినట్లయింది.వివరాల్లోకి వెళితే, కాకినాడకు చెందిన రైఫిల్ షూటింగ్ శిక్షకుడు సాధిక్ ఖాన్ వేధింపులు తాళలేక ఈ నెల 16వ తేదీ అర్ధరాత్రి ఏఈ నూకరాజు తన కుటుంబంతో కలిసి రాజమహేంద్రవరంలోని రోడ్డు కం రైలు వంతెనపై నుంచి గోదావరిలోకి దూకారు. ఈ ఘటనలో మనవడు కార్తికేయ ఈదుకుంటూ ఒడ్డుకు చేరి ప్రాణాలతో బయటపడ్డాడు. నదిలో గల్లంతైన మిగతా ముగ్గురి కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా గాలింపు చేపట్టాయి.ఈ క్రమంలో ఈ నెల 17న నూకరాజు, 20న ఆయన కుమార్తె సౌజన్య మృతదేహాలను అధికారులు వెలికితీశారు. తాజాగా శనివారం ఉదయం ధవళేశ్వరం బ్యారేజ్‌కు సుమారు 30 కిలోమీటర్ల దిగువన, ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారం వద్ద మీనా మృతదేహాన్ని గాలింపు బృందాలు గుర్తించాయి. మీనా మృతదేహం కూడా లభ్యం కావడంతో నదిలో గల్లంతైన ముగ్గురి మృతదేహాలను వెలికితీసినట్లయింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఇలా జలసమాధి కావడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

హైదరాబాద్: 'ఇంత చిన్న వయసులో నా కూతురు ఎలా చనిపోయింది' అంటూ రోదిస్తోంది ఆనందిని ముఖి. జనసేన ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడు సంజూష్ కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భారతి ముఖి తల్లి ఆనందిని. కూతురి మరణవార్త తెలిసి ఆమె తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఒడిశాలో ఉంటున్న ఆమె మీడియాతో తన బాధను పంచుకుంది. నాలుగైదేళ్లుగా హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని తన కూతురే పోషిస్తోందని, తామంతా ఆమెపైనే ఆధారపడి జీవిస్తున్నామని కన్నీరుమున్నీరయింది ఆనందిని. తమ కుటుంబానికి ఇక దిక్కేవరని రోదిస్తూ వాపోయింది. తన కుమార్తె చావుకు కారణం ఎవరని దీనంగా ప్రశ్నించింది. ''నా కూతురిని ఎంతో కష్టపడి పెంచి, చదివించాను. డిప్లొమా పూర్తి చేసిన తర్వాత ఇంజినీరింగ్‌లో సీటు కూడా తెచ్చుకుంది. కోవిడ్ లాక్‌డౌన్‌తో బీటెక్ చేయలేకపోయింది. దీంతో ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లింది. మాదాపూర్‌లో ఇనార్బిట్‌మాల్‌లో పనిచేస్తూ మాకు నెలనెలా డబ్బులు పంపిస్తోంది. భారతి సంపాదన మీదే ఆధారపడి బతుకుతున్నాం. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి.. భారతికి యాక్సిడెంట్ జరిగిందని చెప్పింది. భారతితో మాట్లాడించమని అడిగితే.. చనిపోయిందని చెప్పింది. మాకేం చేయాలో అర్థం కాలేదు. హైదరాబాద్ ఎలా వెళ్లాలో కూడా మాకు తెలియదు. ఇంత చిన్న వయసులోనే నా కూతురు ఎలా చనిపోయింది?'' అంటూ ఆనందిని శోకసంద్రంలో ముగినిపోయారు. నెటిజన్ల స్పందన భారతి ముఖి కుటుంబానికి న్యాయం చేయాలని నెటిజన్లు కోరుతున్నారు. ఆనందిని ముఖి మీడియాతో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు స్పందించారు. 'ఈ కన్నతల్లి ఉసురు మీకు తగులుతుంది. ఖర్మ ఎవరినీ వదిలిపెట్టదు' అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. తమ పార్టీ ఎంపీ కొడుకు కారణంగా ఓ యువతి ప్రాణాలు కోల్పోతే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదని మరొకరు ప్రశ్నించారు. హైదరాబాద్‌లో వలస కార్మికులకు జరిగే ప్రమాదాలు/నేరాల విషయంలో బాధితుల పక్షాన నిలబడేవారు

Sullurpeta: చెంగాళమ్మ లేఅవుట్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం! సూళ్ళూరుపేట: సూళ్ళూరుపేటలోని చెంగాళమ్మ లేఅవుట్ వద్ద లభ్యమైన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని నాయుడుపేట డీఎస్పీ శ్రీ జి. చెంచుబాబు స్వయంగా పరిశీలించారు. ఘటనాస్థలాన్ని సందర్శించిన ఆయన, మృతదేహం లభ్యమైన పరిస్థితులు, పరిసరాలను పరిశీలించి, లభించిన ఆధారాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి దర్యాప్తు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. మురళీకృష్ణ పర్యవేక్షణలో, ఎస్సై జి. అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. మృతుడు సుమారు 30 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల వ్యక్తిగా గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా, గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై దాడి చేసి హత్య చేసి, అనంతరం మృతదేహాన్ని చెంగాళమ్మ లేఅవుట్ వద్ద పడేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, మృతుడి గుర్తింపు మరియు ఆచూకీకి సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయని పోలీసులు తెలిపారు. మృతుడిని ఎవరైనా గుర్తించినట్లయితే లేదా అతనికి సంబంధించిన ఏదైనా సమాచారం తెలిసినట్లయితే, వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా సూళ్ళూరుపేట పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు

తెలుగు చిత్ర పరిశ్రమలో 'మహానటి' సావిత్రి తర్వాత అంతటి గౌరవం, కీర్తి సంపాదించుకున్న నటి సౌందర్య. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున, రజనీకాంత్ వంటి అగ్ర హీరోలతో ఆమె నటించారు. తిరుగులేని స్టార్ హీరోయిన్గా ఎదిగారు. గ్లామర్ కి దూరంగా ఉంటూ చీరకట్టుతో కనిపించి ఆ చీరకే అందాన్ని తీసుకొచ్చారు. 2004లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆమె మరణం చిత్ర పరిశ్రమను శోకసంద్రంలో ముంచెత్తింది. సౌందర్య నటించిన చివరి సూపర్ హిట్ సినిమా వై.వి.ఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన 'సీతయ్య' (2003). ఈ సినిమాలో నందమూరి హరికృష్ణ హీరోగా నటించారు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్టయ్యింది. దురదృష్టవశాత్తు, ఈ సినిమా విడుదలైన కొద్ది నెలలకే సౌందర్య ప్రమాదంలో మరణించారు. విధి విచిత్రమో ఏమో గానీ, 'సీతయ్య' చిత్ర హీరో నందమూరి హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలోనే ప్రాణాలు విడిచారు. 2018లో నెల్లూరు జిల్లాలో ఒక పెళ్లికి వెళ్తుండగా, నల్గొండ జిల్లా సమీపంలో ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో హరికృష్ణ మరణించారు. ఒకే సినిమాలో జంటగా నటించిన హీరో, హీరోయిన్ ఇద్దరూ వేర్వేరు ప్రమాదాల్లో మరణించడం నిజంగా ఆశ్చర్యకరమైన, బాధాకరమైన విషయం. సౌందర్య, హరికృష్ణ ఇద్దరూ ఈ రోజు మన మధ్య లేరు. హరికృష్ణ.. జూ ఎన్టీఆర్, కళ్యాణ్‌లకు తండ్రి, సీనియర్ ఎన్టీఆర్ కొడుకు. అనే విషయం తెలిసిందే. భౌతికంగా మన మధ్య లేకపోయినా, వారి నటన, చిరునవ్వు, మంచి మనసుతో కోట్లాది అభిమానుల గుండెల్లో సౌందర్య, హరికృష్ణ ఎప్పటికీ జీవించే ఉంటారు. సౌందర్య `సీతయ్య` తర్వాత రెండు మూడు సినిమాలు చేసింది. అందులో `స్వేతనాగు`, ` ప్రేమ దొంగ` చిత్రాలు రిలీజ్ అయ్యాయి. కానీ ఆడలేదు. అదే సమయంలో మోహన్ బాబుతో `శివ శంకర్`, `నర్తనశాల` చిత్రాల్లో నటిస్తున్నారు. వీటి షూటింగ్ జరిగే సమయంలోనే ఆమె కన్నుమూయడం అత్యంత బాధాకరం

రహదారి పక్కన నిర్వహిస్తున్న ఆర్కెస్ట్రాపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బిహార్ పశ్చిమ చంపారన్ జిల్లాలోని బెట్టియా నగర సమీపంలో పరావ్ తోలా బంకట్వాలో జరిగింది. న్యూఢిల్లీ, ఆగస్టు 22: రహదారి పక్కన నిర్వహిస్తున్న ఆర్కెస్ట్రాపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బిహార్ పశ్చిమ చంపారన్ జిల్లాలోని బెట్టియా నగర సమీపంలో పరావ్ తోలా బంకట్వాలో జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ బస్సు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ నుంచి బెట్టియాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వివరించారు. చిన్న పాప జన్మదినం సందర్భంగా ఈ ఆర్కెస్ట్రా కార్యక్రమాన్ని ఆ కుటుంబం నిర్వహించిందని పోలీసులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ఆ పాప తండ్రి కూడా మరణించారని పోలీసులు చెప్పారు. మృతులందరిని గుర్తించామని పేర్కొన్నారు. అతి వేగంతో వెళ్తున్న బస్సు.. ఎదురుగా వస్తున్న ట్రక్కును తప్పించే క్రమంలో ఆర్కేస్ట్రా వైపు బస్సు దూసుకెళ్లిందని వివరించారు. ఈ కార్యక్రమం వద్ద ప్రజలు గుంపుగా ఉన్నారని పోలీసులు చెప్పారు. రామగుండం ఎరువుల కర్మాగారం మూసివేతపై కేంద్రం జోక్యం చేసుకోవాలి: మంత్రి తుమ్మల జాబ్ క్యాలెండర్‌తో యువతకు అండగా ప్రభుత్వం: మంత్రి పార్థసారథి

భూపాలపల్లి జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. హెచ్ఐవీతో బాధపడుతున్న మహిళను అడవిలో వదిలేశారు. అక్కడ ఒంటరిగా ఉన్న సదరు మహిళను స్థానికులు గమనించి 108కి సమాచారం ఇచ్చారు. భూపాలపల్లి, ఆగస్టు 22: మానవత్వాన్ని మంటగలుపుతూ కన్నవారే కసాయివారిలా మారారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళను కుటుంబ సభ్యులే అడవిలో వదిలేశారు. ఈ అమానుష ఘటన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వెలుగు చూసింది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన లలిత (35) హెచ్ఐవీతో బాధపడుతున్నారు. కరీంనగర్ ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకువెళ్తామని చెప్పి కుటుంబ సభ్యులు ఆమెను మేడారం-కాటారం రహదారిలోని పెద్దవాగు సమీప అడవిలో వదిలేశారు. ఒంటరిగా ఉన్న లలితను అటుగా వెళ్తున్న స్థానికులు గమనించారు. ఆ వెంటనే 108కి సమాచారం అందించడంతో సిబ్బంది మహదేవపూర్ సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణ ఘటనపై స్థానిక గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని ఆదుకోవాల్సిన కుటుంబమే అలా ఒంటరిగా వదిలేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడిన బాధితురాలి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. మరింత పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే

హైదరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్ సమీపంలో రోడ్డు దాటుతున్న ఓ యువతిని కారు ఢీకొట్టడంతో అమె ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికి తెలిసిందే. ప్రమాద సమయంలో ఏపీ రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజుష్ ఆ కారు నడుపుతున్నట్లు గుర్తించిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అయితే ఈ ప్రమాదంపై తాజాగా రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ స్పందించారు. ఈ ప్రమాదంలో ఓ యువతి మృతి చెందడం తీవ్ర విషాదకరమని పేర్కొంటూ, మృతురాలి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదం జరిగిన వెంటనే తన కుమారుడు సంజుష్ మానవతా దృక్పథంతో వ్యవహరించి, తీవ్రంగా గాయపడిన యువతిని వెంటనే ఆస్పత్రికి తరలించాడని ఎంపీ తెలిపారు. అనంతరం పోలీసులకు స్వయంగా ప్రమాదం గురించి సమాచారం అందించి, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వారికి వెల్లడించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి సంజుష్‌కు మూడు వేర్వేరు వైద్య పరీక్షలు నిర్వహించారని, ఆ పరీక్షలన్నింటిలోనూ ఫలితాలు నెగెటివ్‌గా వచ్చినట్లు ఎంపీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని, దర్యాప్తు అధికారులకు తన కుమారుడు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నాడని తెలిపారు. ఈ కేసులో తాము ఎలాంటి విషయాన్ని దాచడం లేదని, చట్టపరమైన ప్రక్రియల నుంచి తప్పించుకునే ఉద్దేశం గానీ ప్రయత్నం గానీ తమకు లేదని ఎంపీ లింగమనేని రమేష్ స్పష్టం చేశారు. పోలీసుల నిష్పక్షపాత దర్యాప్తు ద్వారా వాస్తవాలు పూర్తిగా వెలుగులోకి వస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఆగస్ట్ 16 మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఒడిశాకు చెందిన 26 ఏళ్ల భారతి ముఖి ఇనార్బిట్ మాల్లోని లైఫ్‌స్టైల్ స్టోర్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. అయితే భారతి తన ఫ్రెండ్‌తో కలిసి లంచ్ తెచ్చుకుని రోడ్డు దాటే క్రమంలో అటుగా వేగంగా వచ్చిన ఓ లగ్జరీ కారు ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా

హైదరాబాద్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన కారు ప్రమాదంలో తన పాత్రపై ఎట్టకేలకు జనసేన ఎంపీ లింగమనేని రమేశ్ (Lingamaneni Ramesh) కుమారుడు సంజూష్ (Lingamaneni Sanjush) తో పాటు ఆయన కూడా నోరు విప్పారు. అసలు ఆ రోజు ఏం జరిగిందో వివరిస్తూ సంజూష్ ఓ ప్రకటన విడుదల చేసారు. అలాగే లింగమనేని రమేశ్ కూడా జరిగిన ఘటన బాధాకరమని, ఇందులో తాము పోలీసులకు సహకరించేందుకు సిద్దంగా ఉన్నామని, అలాగే బాధితుల్ని ఆదుకునేందుకు కూడా సిద్దమనని ప్రకటించారు.ప్రమాదం జరిగిన వెంటనే తాను అక్కడి నుంచి పారిపోలేదని లింగమనేని సంజూష్ తెలిపారు. ప్రమాదంలో గాయపడిన భారతి ముఖికి వెంటనే సహాయం అందించేందుకు తన వాహనంలోనే ఆమెను ఆసుపత్రికి తరలించానన్నారు. వైద్య సాయం అందించేందుకు తన వంతు ప్రయత్నం చేశానన్నారు. దురదృష్టవశాత్తూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భారతి ముఖి మృతి చెందారని తెలిపారు. ప్రమాదం తర్వాత బాధితురాలిని ఆసుపత్రికి తరలించేందుకు తను చేసిన ప్రయత్నాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అలాగే ప్రమాదం జరిగిన తర్వాత తాను ఎక్కడికీ వెళ్లిపోకుండా స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లినట్లు వెల్లడించారు. దర్యాప్తులో పోలీసులకు పూర్తిగా సహకరించానన్నారు. పోలీసులు కూడా అన్ని వాస్తవాలను సమగ్రంగా పరిశీలించి, ప్రమాదానికి ముందు , తరువాత జరిగిన పరిణామాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విజయవాడపై కేశినేని, లింగమనేని పట్టుప్రమాదం జరిగిన సమయంలో తన శారీరక పరిస్థితిని నిర్ధారించేందుకు పోలీసులు బ్రీత్ అనలైజర్ టెస్ట్, యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేశారన్నారు. వీటిలో నెగెటివ్ ఫలితాలు వచ్చాయన్నారు. వైద్య పరీక్షల ఫలితాలను కూడా ఘటనకు సంబంధించిన ఇతర ఆధారాలతో పాటు దర్యాప్తులో పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. భారతి ముఖి మృతి పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తులో పోలీసులకు నా వంతు పూర్తి సహకారం అందిస్తానని సంజుష్ తెలిపారు. లింగమనేని కుమారుడి యాక్సిడెంట్ కేసు-షాకింగ్ వీడియో..!

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. గాజాకు మానవతా సహాయక సామాగ్రితో వెళ్తున్న నౌకలను ఇజ్రాయెల్ సైన్యం అడ్డుకోవడం దీనికి ప్రధాన కారణం. దీనిపై కొనసాగుతున్న విచారణలో భాగంగా టర్కీ ఈ నిర్ణయం తీసుకుంది. నెతన్యాహుతో పాటు పలువురు ఇజ్రాయెల్ ఉన్నతాధికారులను అరెస్ట్ చేసేందుకు వీలుగా ఇంటర్‌పోల్ ద్వారా రెడ్ నోటీస్ జారీ చేయాలని కూడా కోరింది.ఈ వివరాలను టర్కీ న్యాయశాఖ మంత్రి అకిన్ గుర్లెక్ వెల్లడించారు. గాజాపై ఇజ్రాయెల్ విధించిన నావికా దిగ్బంధనాన్ని ఉల్లంఘించేందుకు ప్రయత్నించిన వివిధ దేశాలకు చెందిన నౌకలను ఇజ్రాయెల్ రక్షణ దళాలు అడ్డుకోవడాన్ని టర్కీ తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. దీనిపై టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్.. అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ఇస్తాంబుల్ ప్రాసిక్యూటర్ కార్యాలయాన్ని రంగంలోకి దించారు.దీని ఆధారంగానే ఇజ్రాయెల్ ప్రధానితో పాటు ఆ నౌకల దిగ్బంధనానికి ప్రత్యక్షంగా ఆదేశాలు ఇచ్చిన, క్షేత్రస్థాయిలో ఆపరేషన్‌లో పాల్గొన్న ఇతర ఉన్నత స్థాయి సైనిక అధికారులను నిందితులుగా ఈ అరెస్ట్ వారెంట్లల్లో చేర్చింది. ఇజ్రాయెల్ సైన్యం మానవ హక్కుల ఉల్లంఘన, చట్టవిరుద్ధ నిర్బంధాలకు పాల్పడిందని టర్కీ ప్రాసిక్యూటర్లు తమ చార్జ్‌షీట్‌లో పొందుపరిచారు.వాస్తు ప్రకారం.. ఇంట్లో మూడు బర్నర్లు ఉన్న గ్యాస్ స్టవ్ వాడవచ్చా?ఇజ్రాయెల్ ప్రభుత్వం సామూహిక మారణహోమ యత్నాలకు ప్రయత్నించిందని, అంతర్జాతీయ శాంతి కార్యకర్తలను చట్టవిరుద్ధంగా నిర్బంధించడం, వారిని గాయపర్చడం వంటి హేయమైన చర్యలకు పాల్పడిందని టర్కీ కోర్టు పేర్కొంది. టర్కీతో పాటు ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రేలియా కూడా తమ న్యాయపరిధుల్లో స్వతంత్ర దర్యాప్తును ప్రారంభించాయి. ఇటువంటి అమానవీయ చర్యలకు పాల్పడిన వారందరినీ చట్టం ముందు నిలబెడతామని టర్కీ చెబుతోంది.అందుకే.. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతులు ఇవ్వలేదు: తేల్చి చెప్పిన కేంద్రంటర్కీ ప్రభుత్వం అధికారికంగా విజ్ఞప్తి చేసినప్పటికీ.. ఇంటర్‌పోల్ ద్వారా నెతన్యాహుపై రెడ్ నోటీస్ జారీ కావడం, దాని అమలు అనేది అంత తేలికైన విషయం కాదు. నిందితులను అరెస్ట్ చేసి అప్పగించడం అనేది ఆయా
iPhone EMI Family Tragedy : మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో కొండపైకి ఎక్కిన కొడుకు చనిపోతానంటూ రచ్చ చేయడంతో.. కాపాడేందుకు వెళ్లి తండ్రి సైతం కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. కళ్లముందే కొడుకు, భర్త చనిపోవడం చూడలేక మహిళ కూడా కొండ పైనుంచి దూకి చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ముగ్గురు మృతికి కారణం.. ఐఫోన్ ఈఎమ్ఐ కట్టే విషయంలో గొడవలు తలెత్తడమేనని తెలుస్తోంది. ఆ పూర్తి వివరాలు మీకోసం.అసలేం జరిగిందంటే..?పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్రపతి శంభాజీనగర్‌లోని తిస్గావ్ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల కునాల్ అనే యువకుడు ఇటీవల ఎంతో ఇష్టపడి ఓ ఐఫోన్ కొనుగోలు చేశాడు. అయితే ఆ ఫోన్‌కు సంబంధించిన ఈఎంఐ వాయిదాలు చెల్లించడానికి అతడి వద్ద డబ్బులు లేకపోవడంతో.. ఇంట్లో తండ్రి మురళీధర్ చాంద్గుడేను డబ్బులు ఇవ్వాలని కోరాడు. ఈ క్రమంలోనే ఈఎంఐ చెల్లింపుపై తండ్రీకొడుకుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. తండ్రి మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కునాల్.. శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో కోపంతో ఇంట్లోంచి బయటకు వచ్చి, వాలూజ్ ఎంఐడీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిస్గావ్ కొండపైకి ఎక్కాడు.కొడుకు కొండపైకి వెళ్లడం గమనించిన తల్లిదండ్రులు మురళీధర్, సంగీత వెంటనే అతడిని అనుసరిస్తూ అక్కడికి చేరుకున్నారు. స్థానిక మాజీ సర్పంచ్ సంజయ్ జాధవ్, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గ్రామస్థులు కూడా కొండ వద్దకు చేరుకుని యువకుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. "నీకు ఐఫోన్ 15 ప్రో కూడా కొనిస్తాం. నీకు మంచి భవిష్యత్తు ఉంది, నీ తల్లి కోసం అయినా కిందకు దిగి రా" అని దాదాపు మూడు గంటల పాటు అక్కడున్న వారంతా వేడుకున్నారు. అయినా కునాల్ మాత్రం "చావడమే నాకు ఉన్న ఏకైక మార్గం" అని భీష్మించుకూర్చున్నాడు.క్షణాల్లో తుడిచిపెట్టుకుపోయిన కుటుంబం..!మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో పరిస్థితి చేయిదాటిపోతుండటంతో.. తండ్రి మురళీధర్ ధైర్యం చేసి కునాల్ నిలబడి

మహారాష్ట్రలోని ఓ కొండపై చోటుచేసుకున్న విషాద ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తల్లిదండ్రుల మీద అలిగి కొండ మీద నుంచి దూకుతానంటూ కొడుకు.. ఆ కొడుకును కాపాడేందుకు వెళ్లిన తండ్రి, వాళ్లు చనిపోవడం చూసి తల్లి కూడా ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. అసలు ఈ ఘటనకు దారితీసిన కారణమేంటి?.. క్షణాల్లో మూడు ప్రాణాలను బలిగొన్న ఆ వివాదం వెనుక ఉన్న షాకింగ్ కారణాన్ని పోలీసులు వెల్లడించారు. ఛత్రపతి శంభాజీనగర్ (Chhatrapati Sambhajinagar) జిల్లా వాలూజ్‌లో ఘోరం జరిగింది. కొడుకును కాపాడేందుకు ప్రయత్నంలో.. కుటుంబం మొత్తం బలైంది. ఈ తీవ్ర విషాదం తిస్గావ్ ప్రాంతంలోని ఖవాడ్యా కొండపై జరిగింది. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలు చూసి అయ్యో పాపం అనుకుంటున్నారంతా. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. 19 ఏళ్ల కునాల్ చంద్రగూడే ఇంట్లో తెలియకుండా ఐఫోన్ కొన్నాడు. అయితే దాని ఈఎంఐ కట్టేందుకు ఇబ్బందులు పడ్డాడు. దీంతో తండ్రికి అసలు విషయం చెప్పి.. ఈఎంఐ కట్టమని బతిమాలాడు. ఈ క్రమంలో ఒప్పుకోని తండ్రి మురళీధర్.. కొడుకును మందలించాడు. ఇదే విషయమై ఇంట్లో శుక్రవారం పొద్దున గొడవ జరిగింది. పట్టరాని కోపంతో తిస్గావ్ ప్రాంతంలోని ఓ కొండపైకి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న తల్లీదండ్రులు, మాజీ సర్పంచ్ సహా కొందరు గ్రామస్తులు అక్కడికి చేరుకుని అతన్ని కిందకు దించే ప్రయత్నం చేశారు. మూడు గంటల పాటు కొనసాగిన బుజ్జగింపులు కునాల్ కొండ అంచున నిలబడి తీవ్ర నిర్ణయం తీసుకుంటానని బెదిరించడంతో అంతా బతిమాలడం మొదలుపెట్టారు. దాదాపు మూడు గంటల పాటు అతడిని కిందకు రావాలని నచ్చజెప్పారు. “నీ తండ్రి సంగతి వదిలేయ్.. నీ తల్లి కోసం అయినా బతుకు. నీకు మంచి భవిష్యత్తు ఉంది” అంటూ పలువురు వేడుకున్నా కునాల్ వినలేదు. అతడికి ఐఫోన్ 15 ప్రో ఇప్పిస్తామని కొందరు చెప్పినా ఫలితం లేకపోయింది. ఈలోపు కింద

ఒక్క ఫోన్ మోజు, అది తెచ్చిపెట్టిన అప్పుల భారం ఒక పచ్చని కుటుంబాన్ని నిలువునా బలితీసుకుంది. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా పరిధిలోని దేవలాయ్ ప్రాంతంలో ఒళ్లు గగుర్పొడిచే విషాద సంఘటన వెలుగు చూసింది. ఐఫోన్ ఈఎంఐ కిస్తీ డబ్బుల విషయంలో తండ్రితో గొడవపడి, ఆవేశంలో కొండపైకిక్కిన 18 ఏళ్ల కుర్రాడు.. అతడిని కాపాడుకోవడానికి వెళ్లిన తండ్రి, ఇద్దరినీ కళ్లముందే కోల్పోయి తట్టుకోలేకపోయిన తల్లి.. ముగ్గురూ కొండపై నుంచి కిందపడి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.పోలీసుల కథనం ప్రకారం.. 18 ఏళ్ల కునాల్ చందగూడే అనే యువకుడు ఇటీవలే ఖరీదైన ఐఫోన్ కొనుగోలు చేశాడు. అయితే, దానికి సంబంధించి నెలవారీ చెల్లించాల్సిన ఈఎంఐ కోసం ఇంట్లో నిత్యం గొడవపడుతున్నాడు. శుక్రవారం ఉదయం కూడా తండ్రి మురళీధర్‌తో ఈఎంఐ డబ్బుల విషయమై తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. తండ్రి మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కునాల్, ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయి సమీపంలోని తిస్గావ్ కొండపైకి ఎక్కాడు. కొండ అంచున నిలబడి కిందకి దూకేస్తానని బెదిరించడం ప్రారంభించాడు.మూడు గంటల నరకం.. అమ్మా నాన్నల కోసం బ్రతుకురా!విషయం తెలిసిన వెంటనే తల్లిదండ్రులు, స్థానిక సర్పాంచ్ సంజయ్ జాధవ్, గ్రామస్థులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు కునాల్‌ను కిందకు తీసుకురావడానికి సర్వవిధాలా ప్రయత్నించారు. నానా! నీకు ఏది కావాలంటే అది కొనిస్తాం, నీకు మంచి భవిష్యత్తు ఉంది, మీ అమ్మను చూసైనా కిందకి దిగి రారా అని సర్పాంచ్, పోలీసులు ఎంతో బతిమిలాడారు. నాకు చావే శరణ్యం, వేరే దారి లేదు అంటూ కునాల్ భీష్మించుకూర్చున్నాడు. కొండ కింద నిలబడి కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు కొండపైకి చేరుకుని కొడుకుని బతిమాలే ప్రయత్నం చేశారు.Viral Video: వికెట్ తీసి Gen-Z సెలబ్రేషన్స్.. రాత్రికి రాత్రే స్టార్!క్షణాల వ్యవధిలోనే ముగిసిన మూడు ప్రాణాలు!మధ్యాహ్నం 1 గంట సమయంలో కొండ అంచుకు

మహారాష్ట్రలో పెను విషాద చోటుచేసుకుంది. ఆత్మహత్యకు యత్నించిన కుమారుడిని కాపాడబోయి తల్లిదండ్రులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలోని ఖవ్దా కొండపై నుంచి లోయలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.దేవలాయ్ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల యువకుడు శుక్రవారం ఖవ్దా కొండ అంచుకు చేరుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. సుమారు మూడు గంటల పాటు కొండ అంచునే ఉండిపోయి, కిందకు దూకేస్తానంటూ హెచ్చరించాడు. సమాచారం అందుకున్న అతని తల్లిదండ్రులు, గ్రామస్థులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, అతడిని వారించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కుమారుడిని సురక్షితంగా వెనక్కి లాగే క్రమంలో తండ్రి కొండపైకి వెళ్లగా, ప్రమాదవశాత్తు ఇద్దరూ అదుపుతప్పి కిందపడిపోయారు. కళ్లెదుటే భర్త, కుమారుడు లోయలో పడిపోవడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన తల్లి కూడా క్షణాల్లోనే కొండపై నుంచి కిందకు పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు అక్కడ ఉన్నప్పటికీ ఈ దుర్ఘటనను అడ్డుకోలేకపోయారు. గంటల తరబడి సాగిన ఈ ఉదంతాన్ని కొందరు వ్యక్తులు తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Yadadri Bhuvanagiri News: సమాజంలో పేదలకు అండగా ఉండాల్సిన ఓ ప్రజా నాయకుడు కామాంధుడిగా మారిపోయాడు.. ప్రభుత్వ పథకాలను ఆసరాగా చేసుకుని.. ఓ అభాగ్యురాలిపై లైంగిక దాడికి పాల్పడిన అత్యంత అమానవీయ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం) మండలంలో చోటు చేసుకుంది.. ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని నమ్మించి.. ఆపై బ్లాక్ మెయిల్ చేస్తూ.. ఓ మహిళపై కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతూ వస్తోంది.. వివరాల్లోకి వెళితే.. ఆత్మకూరు (ఎం) మండలం పుల్లాయగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు కన్ను ఓ అమాయక మహిళపై పడిందట.. ఆమెకు ప్రభుత్వ పథకం కింద ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని చాలా రోజుల నుంచి నమ్మించిన్నట్లు సమాచారం.. ఇల్లు మంజూరైన తర్వాత.. ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంట్ బస్తాలు ఇస్తానని.. ఆశచూపి ఆమెను తన ఇంటికి పిలిపించుకున్నట్లు సమాచారం. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. ఆమెపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డారట.. ఈ దారుణం ఒక్క రోజుతో ఆగిపోలేదట.. జరిగిన విషయాన్ని బయటపెడితే.. పరువు పోతుందని బెదిరిస్తూ.. గత రెండు నెలలుగా ఆ మహిళపై అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.. ఈ క్రమంలో భార్య తీవ్ర మానసిక క్షోభకు గురికావడంతో పాటు ఆమె ప్రవర్తనలో మార్పును గమనించిన భర్త అసలు విషయం ఆరా తీశాడట. ఆతను చేస్తున్న అఘాయిత్యాల గురించి.. భార్య కన్నీరుమున్నీరుగా విలపించడంతో బాధితురాలి భర్త ఈ విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి

ఒక చిన్న మాట.. ఓ కుటుంబాన్ని తీరని విషాదంలోకి నెట్టింది. తండ్రి మందలించాడని కొడుకు కొండపై నుంచి దూకగా.. అతడిని కాపాడేందుకు వెళ్లిన తండ్రి కూడా లోయలో పడిపోయాడు. భర్త, కొడుకు ఇద్దరినీ కోల్పోయిన తల్లి.. మనస్తాపంతో తానూ దూకేయడంతో ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్ర శంభాజీనగర్‌లోని కావడియా కొండ సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన కుమారుడు కొండపై నుంచి దూకినట్లు సమాచారం. తనయుడు లోయలో పడిపోవడంతో అతడిని కాపాడేందుకు తండ్రి కూడా కొండపై నుంచి కిందకు వెళ్లేందుకు ప్రయత్నించి ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయాడు. ఈ ఘటనతో అక్కడ తీవ్ర కలకలం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకొడుకులు లోయలో పడిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. భర్త, కుమారుడు ఇద్దరూ లోయలో పడిపోయిన విషయం తెలుసుకున్న తల్లి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె కూడా కొండపై నుంచి దూకినట్లు సమాచారం. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కావడియా కొండ వద్ద జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, కుటుంబ సభ్యుల వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మమ్మల్ని అలా పిలవద్దు.. నెటిజన్లను కదిలిస్తున్న చిన్నారి ఆవేదన మృత్యువు అంచుల దాకా వెళ్లి తప్పించుకున్నాడు.. వీడియో వైరల్

బల్వంతపూర్‌కు చెందిన రాజు(35), భాగ్య(22) దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి గురువారం అర్ధరాత్రి కారులో ప్రయాణిస్తూ ప్రమాదావశాత్తు బావిలో పడి మరణించిన సంగతి తెలిసిందే. అయితే, ఇదే విషయంపై మృతుడు రాజు అన్న రవి బాధపడిన తీరు అక్కడి స్థానికులను కలిచివేసింది. ఈ హృదయ విధారక ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. వద్దు తమ్మి.. పొద్దున్నే పోదువు ‘సిద్దిపేటలో మా బావ దీశెట్టి మల్లేశం మృతి చెందాడు. 19న దశదిన కర్మ కావడంతో తమ్ముడు రాజు తన భార్య పిల్లలతో సిద్దిపేటకు వచ్చారు. అందరం కలిసి సంతోషంగా భోజనం చేశా’మని మృతుడు రాజు అన్న రవి తెలిపారు. సాయంత్రం కావడంతో ‘అన్నా.. ఇంటికి వెళ్తాం’ అని రాజు చెప్పడంతో.. ‘చీకటి అవుతుంది. వద్దు తమ్మి.. పొద్దున పోదువు’ అని చెప్పా. ‘అన్నా నీకాళ్లు మొక్కుతా’ అంటూ.. వినకుండా తన భార్య పిల్లలతో కారులో బయల్దేరారు. అంతలోనే ఈ ఘోరం చోటుచేసుకుందంటూ రోదిస్తూ రవి వెల్లడించారు. ‘ఇరుముడి’మూవీ ప్రెస్‌మీట్...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా? నలుపు చీరలో వితిక షేరు గ్లామర్ ఫోటోలు (ఫొటోలు) ‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు) హైదరాబాద్ : హైటెక్స్‌లో హిమ్టెక్స్ ప్రదర్శన (ఫొటోలు) స్టన్నింగ్ లుక్‌లో అందాల తార పూజా హెగ్డే (ఫొటోలు) భారత సైన్యం దెబ్బ.. మంచు కొండల్లో చైనాకు దిమ్మతిరిగే షాక్! ఇది సార్ మా బ్రాండ్.. రాకాలో హాలీవుడ్ నటుడు..? ఐయామ్ Gen-Z అంటూ ఆర్మీ పై రెచ్చిపోయిన యువతీ

అమెరికాలోని అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ అలాస్కాలోని మారుమూల ప్రాంతంలో ఓ చార్టర్ ప్లేన్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 8మంది మృతిచెందినట్లు అమెరికా సైన్యం వెల్లడించింది. న్యూఢిల్లీ: అమెరికాలోని అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ అలాస్కాలోని మారుమూల ప్రాంతంలో ఓ చార్టర్ ప్లేన్ కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 8మంది మృతిచెందినట్లు అమెరికా సైన్యం వెల్లడించింది. ప్రమాదానికి గురైన విమానంలో ఇద్దరు పైలట్లు, ఆరుగురు ప్రయాణికులు ఉన్నట్లు అమెరికా నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు (NTSB) అలాస్కా ప్రాంత అధికారి క్లింట్ జాన్సన్ తెలిపారు. గురువారం నాడు యాంకరేజ్ నుంచి విమానం బయలుదేరి కేప్ న్యూనెహామ్ ప్రాంతానికి చేరుకుంటుండగా ప్రమాదం జరిగింది. కేప్ న్యూనెహామ్ లాంగ్ రేంజ్ రాడార్ సైట్ సమీపంలోనే కూలిపోయింది. ఈ ప్రాంతం యాంకరేజ్‌కు సుమారు 450 మైళ్ల దూరంలోని మారుమూల ప్రాంతం కావడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. విమాన ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే అలాస్కా రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్.. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. తొలుత విమానంలో ఉన్నవారి పరిస్థితిపై స్పష్టమైన సమాచారం అందలేదు. అనంతరం అమెరికా సైన్యం 8 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ధ్రువీకరించింది. అయితే, విమానం ఎందుకు కుప్పకూలిందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రమాదానికి సంబంధించిన కారణాలను అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఎన్టీఎస్బీ ప్రాథమిక విచారణను ప్రారంభించింది. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరిగే కొద్దీ మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. భారత నావికులు ప్రయాణిస్తున్న నౌకపై ఇరాన్ దాడి.. బయటకొచ్చిన వీడియో.. పాక్ కాదు.. చైనానే.. భారత ఆర్మీ మాజీ చీఫ్ నరవణే కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని ప్రముఖ చారిత్రక నేపథ్యం కలిగిన గోల్కొండ కోట వెలుపలి ప్రాకారంలో ఓ రహస్య సొరంగం బయటపడిందన్న వార్త తీవ్ర ఉత్సాహాన్ని, సంచలనాన్ని రేకెత్తించింది. ఈ వార్త వెంటనే సోషల్ మీడియాలో వ్యాపించడంతో స్థానిక ప్రజలు, పర్యాటక ప్రేమికులు ఈ సొరంగాన్ని వీక్షించేందుకు గురువారం సాయంత్రం, శుక్రవారం ఉదయాల్లో కోట వద్దకు భారీ సంఖ్యలో తరలివచ్చారు.హంతకుడే సంతాపం తెలిపినట్లు..దోపిడీ గురించి హరీష్ రావ్ చెప్పాలి!గోల్కొండలోని 18 సీడీ (అథర సీడీ) ప్రాంతంలో ఉన్న 400 ఏళ్ల పురాతన కుతూబ్ షాహీ స్మశానవాటిక, క్రీడా మైదానం వద్ద భారత సైన్యానికి చెందిన అధికారులు అక్రమంగా తవ్వకాలు జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ తవ్వకాలం క్రమంలోనే ఓ సొరంగం వెలుగుచూసినట్లు కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ వెల్లడించారు. ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు ఈ సొరంగం బయటపడిన విషయం గురించి గురువారం రాత్రి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సూపరింటెండెంట్ దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.వివాదస్పద భూమి నేపథ్యం సొరంగం బయటపడిన 18 సీడీ లేదా అథర సీడీ ప్రాంతం చాలా కాలంగా వివాదాస్పదంగా ఉంది. ఆర్మీ అధికారులు ఆ స్థలాన్ని తమ ఆస్తిగా పేర్కొంటుండగా.. స్థానిక నివాసితులు దాన్ని స్మశానవాటికగా ఉపయోగిస్తూ ఖననాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా కాలా చబుత్ర నుంచి అథర సీడీ వరకు ఉన్న బహిరంగ ప్రాంగణాన్ని స్థానిక యువకులు క్రికెట్, గిల్లీ-దండా వంటి ఆటలు ఆడుకోవడానికి వినియోగిస్తుంటారు.ఇరాన్ - అమెరికా మధ్య ఒప్పందం.. భారత్ చేతిలోనే.. టెహ్రాన్ రాయబారి సంచలనంరహస్య మార్గాలు, చారిత్రక వదంతులు కాకతీయులు, కుతుబ్ షాహీల పాలన సాగిన గోల్కొండ కోట బహుళ అంతస్తుల నిర్మాణ ప్రాభవం కలిగి ఉంది. ఈ కోట నుంచి చార్మినార్, గోషామహల్, చౌమహల్లా ప్యాలెస్, నౌబత్ పహాడ్ వంటి నగరంలో కీలక ప్రాంతాలకు భూగర్భ రహస్య మార్గాలు, సొరంగాలు ఉన్నాయని శతాబ్ధాలుగా ప్రచారం జరుగుతోంది. వీటిలో కొన్నింటిలో

ముమ్మిడివరం : తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం కొమరగిరి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కొమరగిరి - గట్టువారిపేట మలుపు వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కాకినాడకు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. మృతులు ఐ.పోలవరం మండలం కొమరగిరి గ్రామానికి చెందిన ఈతకోట సూర్యకుమార్(39), జి.వేమవరం గ్రామానికి చెందిన ఆకుల సాయి(30)గా గుర్తించారు. మూడో వ్యక్తి నిచ్చినకొళ్ల రంగ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Vizag School Tragedy News: విశాఖపట్నంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నగరంలోని వన్ టౌన్ పరిధిలోని లిటిల్ గార్డెన్ స్కూల్ అనే ప్రైవేట్ పాఠశాలలో దారుణమైన ఘటన జరిగింది. టీచర్ దెబ్బలను తట్టుకోలేక ఆరేళ్ల బాలుడు మృతి చెందినట్లు సమాచారం. హోంవర్క్ చేయలేదనే కారణంతో ఉపాధ్యాయురాలు కొట్టడం వల్లే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అసలు కారణం ఇదే? చిన్నారి ప్రణయ్ గుండెపోటుతో చనిపోయినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఎన్టీఆర్ వర్సిటీకి చెందిన వైస్ ఛాన్స్లర్ చంద్రశేఖర్ మాట్లాడారు. తీవ్ర ఒత్తిడితో గుండె అకస్మాత్తుగా ఆగిపోతుందని..గతంలో ఎంసెట్ విద్యార్థులకు ఇలా జరిగిందని చెప్పారు. ప్రణయ్ తీవ్ర ఒత్తిడికి గురికావడం వల్ల గుండె ఎలక్ట్రికల్ షట్‌డౌన్ అయి చనిపోయి ఉండొచ్చని ఆయన వెల్లడించారు. టీచర్లు పిల్లలతో సున్నితంగా మాట్లాడాలని చంద్రశేఖర్ సూచించారు. ఏం జరిగిందంటే..? విశాఖపట్నం వన్ టౌన్ పరిధిలోని లిటిల్ గార్డెన్ స్కూల్ లో ప్రణయ్ తేజ అనే బాలుడు యూకేజీ చదువుతున్నాడు. అయితే క్లాస్ రూమ్ లో టీచర్ అందరి హోంవర్క్ ను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ప్రణయ్ తేజను హోంవర్క్ చేయలేదని ఉపాధ్యాయురాలు బెదిరించారు. దాంతో భయపడిపోయిన ప్రణయ్.. కొట్టొద్దు అంటూ విలపించాడు. అయినా ఆ ఉపాధ్యాయురాలు బాలుడి చెంపపై కొట్టింది. దాంతో బెదిరిపోయిన బాలుడు.. క్లాస్ రూమ్ లోనే స్పృహ కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డు అయ్యాయి. వెంటనే బాలుడ్ని కేజీహెచ్ కు తరలించారు

Nigeria Boat Accident : నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. వాయువ్య ప్రాంతమైన సోకోటో రాష్ట్రంలోని గొరౌ ప్రాంతంలో వ్యవసాయ పనుల నిమిత్తం పడవలో నది దాటుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. పడవలో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఉండటంతో ప్రయాణం ప్రారంభమైన నిమిషానికే అదుపుతప్పి పడవ నీటిలో మునిగిపోయింది. దీంతో 50మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం సమయంలో పడవలో 70మంది ప్రయాణికులు ఉన్నారని.. మృతుల్లో 40మంది వరకు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకిదిగి నీటిలో మునిగిపోయిన వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. అప్పటికే చాలా మంది మృత్యువాత పడ్డారు. నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ (NEMA), నేషనల్ ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ అధికారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఏరియా మేనేజర్ అబ్దుల్ ఖాదిర్ యూసుఫ్ ఈ ఘటనపై స్పందించారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ తో మాట్లాడుతూ.. ఈ దారుణమైన ఘటనలో ఇప్పటివరకూ దాదాపు 40 మందికిపైగా చిన్నారుల మృతదేహాలను వెలికి తీశామని తెలిపారు. మిగిలినవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. నైజీరియాలో నదులు, జలమార్గాల్లో పడవ ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. దేశంలో రోడ్లు సరిగ్గా లేని కారణంగా ఎక్కువగా నీటి మార్గం ద్వారానే ప్రయాణాలు చేస్తుంటారు. దీంతో ఇలాంటి ప్రమాదాలు ఆ దేశంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో పడవ ప్రమాదంలో 25మందికిపైగా మరణించారు. గతేడాది నవంబర్ నెలలో జరిగిన ప్రమాదంలో 27మంది మృతి చెందారు. పడవల నిర్వహణ సరిగా లేకపోవటం, భద్రతా నిబంధనలు అమలు లోపించడం వంటి కారణాలు ప్రమాదాలకు దారితీస్తున్నాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది