
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Yadadri Bhuvanagiri News: సమాజంలో పేదలకు అండగా ఉండాల్సిన ఓ ప్రజా నాయకుడు కామాంధుడిగా మారిపోయాడు.. ప్రభుత్వ పథకాలను ఆసరాగా చేసుకుని.. ఓ అభాగ్యురాలిపై లైంగిక దాడికి పాల్పడిన అత్యంత అమానవీయ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం) మండలంలో చోటు చేసుకుంది.. ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని నమ్మించి.. ఆపై బ్లాక్ మెయిల్ చేస్తూ.. ఓ మహిళపై కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతూ వస్తోంది..
వివరాల్లోకి వెళితే.. ఆత్మకూరు (ఎం) మండలం పుల్లాయగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు కన్ను ఓ అమాయక మహిళపై పడిందట.. ఆమెకు ప్రభుత్వ పథకం కింద ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని చాలా రోజుల నుంచి నమ్మించిన్నట్లు సమాచారం.. ఇల్లు మంజూరైన తర్వాత.. ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంట్ బస్తాలు ఇస్తానని.. ఆశచూపి ఆమెను తన ఇంటికి పిలిపించుకున్నట్లు సమాచారం. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. ఆమెపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డారట.. ఈ దారుణం ఒక్క రోజుతో ఆగిపోలేదట.. జరిగిన విషయాన్ని బయటపెడితే.. పరువు పోతుందని బెదిరిస్తూ.. గత రెండు నెలలుగా ఆ మహిళపై అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది..
ఈ క్రమంలో భార్య తీవ్ర మానసిక క్షోభకు గురికావడంతో పాటు ఆమె ప్రవర్తనలో మార్పును గమనించిన భర్త అసలు విషయం ఆరా తీశాడట. ఆతను చేస్తున్న అఘాయిత్యాల గురించి.. భార్య కన్నీరుమున్నీరుగా విలపించడంతో బాధితురాలి భర్త ఈ విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లాడట.. దీంతో గ్రామంలో పంచాయితీ ఏర్పాటు చేసినట్లు కూడా సమాచారం.
పంచాయితీలో తన తప్పును అంగీకరించి.. సారీ చెప్పాల్సింది పోయి.. నిందితుడు తన పరపతిని వినియోగించి.. కేసును తొక్కేసే ప్రయత్నం చేశాడట.. పోలీస్ స్టేషన్లో కేసు పెడితే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని బాధితురాలికి.. ఆమె భర్తకు బెదిరింపులకు గురిచేసినట్లు కూడా సమాచారం. విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు.. కేసు పెట్టకుండా ఉంటే పరిహారంగా అర ఎకరం భూమి రాసిస్తానని గ్రామ పెద్దల ద్వారా రాయబారం నడిపాడట..
అంతేకాకుండా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన వాళ్లంతా నాతో పడుకున్నారంటూ.. శంకర్ రెడ్డి పచ్చి బూతులతో పాటు నోటి దురుసు మాటలు మాట్లాడటం అతని అహంకారానికి.. శాడిజానికి నిదర్శనమని చెప్పొచ్చు. ఇలాంటి బెదిరింపులకు, ప్రలోభాలకు తలొగ్గని బాధితురాలు.. ధైర్యంగా ఆత్మకూరు (ఎం) పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.




