
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.
పాకిస్థాన్లోని అతిపెద్ద ప్రాంతమైన బలూచిస్థాన్ . ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోకపోవడంతో బలూచ్ ప్రజల్లో ఎప్పటి నుంచో స్వతంత్ర ఆకాంక్ష ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే బలూచిస్థాన్ వేర్పాటువాదులు తమ ప్రాంతాన్ని ‘రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్థాన్’ పేరిట స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. ఆగస్టు 11న స్వాతంత్య్ర దినోత్సవం జరుపుతామని ప్రకటించారు.బలూచిస్థాన్ స్వతంత్ర దేశంగా మారడానికి ఏమేం నిబంధనలు పాటించాల్సి ఉంటుంది? ఈ విషయంలో బలూచ్కు ఏ మేరకు భారత్ సాయం చేయగలదు. ఇప్పటి వరకూ బలూచిస్థాన్ విషయంలో భారత ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించడానికి కారణాలేంటి? అనేది ఇప్పుడు చూద్దాం.ఏ ప్రాంతమైనా సరే స్వతంత్ర దేశంగా అవతరించడానికి మోంటెవీడియో కన్వెన్షన్లోని నాలుగు కీలక నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. 1933 డిసెంబర్ 26న ఉరుగ్వే రాజధాని మోంటివీడియోలో కుదిరిన అంతర్జాతీయ ఒప్పందమే ఈ మోంటివీడియో తీర్మానం.మోంటివీడియో కన్వెన్షన్.. 4 నిబంధనలు..ఈ ఒప్పందంలోని ఆర్టికల్ 1 ప్రకారం ఓ ప్రాంతాన్ని దేశం లేదా రాజ్యంగా గుర్తించడానికి నాలుగు అంశాలు కీలకం. అందులో ఒకటి శాశ్వత జనాభా. స్వతంత్ర దేశంగా అవతరించాలని భావిస్తున్న ప్రాంతంలో ప్రజలు తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా నివాసం ఉండాలి.రెండోది.. ఆ ప్రాంతానికి నిర్దిష్ట భౌగోళిక సరిహద్దులు ఉండాలి. మూడోది ఆ ప్రాంతాన్ని పరిపాలించడానికి, చట్టాలను అమలు చేయడానికి ఒక ప్రభుత్వం ఉండాలి. నాలుగోది.. ఆ ప్రభుత్వానికి ఇతర దేశాలతో దౌత్య పరమైన, వాణిజ్య, చట్టపరమైన ఒప్పందాలు ఒప్పందాలు చేసుకునే అధికారం ఉండాలి.ఒక ప్రాంతానికి ఈ నాలుగు లక్షణాలు ఉంటే గనుక.. మోంటివీడియో కన్వెన్షన్లోని ఆర్టికల్ 3 ప్రకారం ఇతర దేశాలు దాన్ని గుర్తించినా, గుర్తించకపోయినా సరే, దాని విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఆ ప్రాంతానికి దేశంగా ఉండే అర్హత లభిస్తుంది.బలూచిస్థాన్ విషయానికి వస్తే.. ఈ ప్రాంతంలో ప్రజలు శాశ్వత నివాసం ఉంటున్నారు. ఇది ప్రస్తుతం పాకిస్థాన్ నియంత్రణలో ఉన్నప్పటికీ, నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంగా గుర్తించే వీలుంది. బలూచిస్థాన్ వేర్పాటువాద నాయకులు తమ భూభాగంపై సార్వభౌమాధికారం సాధిస్తేనే