
Michael Jackson కట్టిన మాయాప్రపంచం.. ఏకంగా 2,700 ఎకరాలు కొనేశాడు!
Michael Jackson కట్టిన మాయా ప్రపంచం.. ఏకంగా 2,700 ఎకరాలు కొనేశాడు!
© 2026 nimisham.in

Michael Jackson కట్టిన మాయా ప్రపంచం.. ఏకంగా 2,700 ఎకరాలు కొనేశాడు!

ఇరాన్, సౌదీలో భారీ పేలుళ్లు- యురేనియం అంశంపై IAEA కీలక నివేదిక

సిరియాలో అణు రియాక్టర్ పై IAEA నివేదిక

Iran-Israel War: ఒకేసారి నాలుగు వైపుల నుంచి ఇజ్రాయెల్‌పై దాడి? ఇరాన్ భారీ వ్యూహం

అనుముల ప్రొడక్షన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ బ్యానర్లపై అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మిస్తున్న చిత్రం ‘మా రాముడు అందరివాడు’. యద్దనపూడి మైకిల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీరామ్, స్వాతి మందాడి జంటగా నటించారు. సుమన్, సమ్మెట గాంధీ, నాగ మహేష్, బాహుబలి ప్రభాకర్ కీలక పాత్రల్లో నటించారు. ఆనంద భారతి, గడ్డం నవీన్, చిట్టిబాబు, గోల్డ్ రెడ్డి ఇతర పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరైన నిర్మాత వెంకట్ దుగ్గిరెడ్డి, దర్శకుడు శ్రీనివాస తేజ ఈ చిత్రం ఘన విజయం సాధించి మూవీ టీమ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుతూ టీమ్‌కు బెస్ట్ విషెస్ అందించారు. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు సుమన్ మాట్లాడుతూ ..‘‘సినీ ఇండస్ట్రీలో గ్లామర్ కంటే టాలెంట్ ముఖ్యమని ఇప్పటికే చాలామంది నిరూపించారు. ఈ సినిమా హీరో శ్రీరామ్‌లో కూడా మంచి టాలెంట్ ఉంది. డ్యూయెల్ రోల్లో ఆయన పెర్ఫార్మెన్స్ బాగా చేశారు. ఇందులో నా పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ముఖ్యమంత్రిగా మంచి మెసేజ్ ఇచ్చే పాత్రలో కనిపిస్తాను. దర్శకుడు మైకిల్ చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. నిర్మాత లక్ష్మణ్ గారు ఇందులో విలన్‌గా కూడా నటించారు. ఆయన యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఇది చాలా మంచి కథ. ట్విస్టులు ఇంటరెస్టింగ్‌గా ఉంటాయి. కచ్చితంగా అందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది. ఇలాంటి సినిమాలను ఆదరిస్తే మరింతమంది కొత్త నటీనటులు, కొత్త నిర్మాతలు ఇండస్ట్రీకి వస్తారు”అని అన్నారు. నిర్మాత అనుముల లక్ష్మణరావు మాట్లాడుతూ..‘‘మా సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. ఈ చిత్రాన్ని నిర్మిస్తూనే, ఇందులో విలన్ పాత్ర పోషించా. ఫస్టాఫ్‌లో వైల్డ్ విలన్‌గా కనిపిస్తా. 20 ఏళ్లు

నేపాల్‌లోని త్రిశూలి నదీ లోయలో సంభవించిన వరద ప్రళయం ఊహాతీతమైన విధ్వంసాన్ని సృష్టించింది. కొన్ని రోజుల క్రితం వరకు జనసమ్మర్దంతో కళకళలాడిన పట్టణాలు ఇప్పుడు పూర్తిగా కనుమరుగై, అంతులేని బురద మైదానాలుగా దర్శనమిస్తున్నాయి. ఒక జాతీయ ఛానల్ బృందం నిర్వహించిన ఏరియల్ సర్వే ద్వారా ఈ ఘోర విపత్తు తాలూకు భీకర దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.సదరు బృందం హెలికాప్టర్లో త్రిశూలి నదీ లోయ మీదుగా చైనా సరిహద్దు వరకు ప్రయాణించి వరద నష్టాన్ని అంచనా వేసింది. క్షేత్రస్థాయి పరిశీలన కంటే వైమానిక సర్వే ద్వారానే విధ్వంసం యొక్క తీవ్రత స్పష్టంగా అర్థమవుతోంది. వారం రోజుల క్రితం వరకు భవనాలు, రహదారులు, వంతెనలతో ఉన్న ప్రాంతాలు ఇప్పుడు ఆనవాళ్లు కూడా లేకుండా తుడిచిపెట్టుకుపోయాయి. పైలట్ స్వయంగా చూపిస్తే తప్ప అవి ఒకప్పుడు గ్రామాలు అంటే నమ్మలేని పరిస్థితి నెలకొందని, ఆ ప్రదేశాలన్నీ నదీ గర్భంలా మారిపోయాయని ఆ బృందం వెల్లడించింది. వరద ఉద్ధృతి ఏకంగా మూడు అంతస్తుల ఎత్తుకు చేరి భవనాలను పూర్తిగా ముంచెత్తింది.ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల లోయ పొడవునా ఉన్న డజనుకు పైగా జలవిద్యుత్ ప్రాజెక్టులు ధ్వంసమవడంతో నేపాల్‌లో తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొంది. త్రిశూలి 3ఏ టన్నెల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నప్పటికీ, అక్కడ టన్నుల కొద్దీ పేరుకుపోయిన బురదను తొలగించడం సహాయక సిబ్బందికి పెను సవాలుగా మారింది.ఈ భీకర విపత్తులో ఇప్పటికే 1,100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వేల సంఖ్యలో గల్లంతయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే

ఇంటర్నెట్‌డెస్క్: పశ్చిమాసియా ఉద్రిక్తతలు మొదలైన దగ్గరి నుంచి అక్కడి సముద్ర జలాల్లో మోహరించి ఉన్న అమెరికా విమాన వాహకనౌక యూఎస్ఎస్ అబ్రహాం లింకన్ ఇప్పుడు తిరుగుపయనమైంది. అందులో 5000 మందివరకు యూఎస్ నావికులు, మెరైనర్లు విధులు నిర్వర్తిస్తున్నారు (US sailors Thailand). 200 రోజులకు పైగా వారు జలాల్లోనే ఉండటంతో కనీస సదుపాయాలు లేక తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. కొందరు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లూ ఇటీవల కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఆ నౌక థాయ్‌లాండ్‌లోని పట్టాయాకు చేరనుంది. ఇలాంటి సమయంలో నగరంలోని సెక్స్‌వర్కర్లను (Pattaya sex workers) లక్ష్యంగా చేసుకుని అక్కడి పోలీసులు దాడులు చేయడం చర్చనీయాంశంగా మారింది. థాయ్ రాజధాని బ్యాంకాక్‌కు 150 కిలోమీటర్ల దూరంలో పట్టాయా నగరం ఉంటుంది. ఈ సిటీ నైట్‌లైఫ్, బీచ్‌లకు ఫేమస్. ఇప్పుడు దానికి కొన్ని కిలోమీటర్ల దూరంలోని లేమ్ చాబాంగ్ పోర్టు వద్ద యూఎస్ఎస్ అబ్రహాం లింకన్ లంగరు వేయనుంది. ఇంతకాలం గల్ఫ్జలాల్లో విధులు నిర్వర్తించడం ఆ నౌక చరిత్రలో ఇదే తొలిసారి. ఇప్పుడు అది వెనక్కి వచ్చిన తర్వాత నావికులు, మెరైనర్లు విశ్రాంతి తీసుకోవడానికి సమయం ఇవ్వనున్నారు (US Navy Thailand visit). దీంతో ఈ నగరంలో వ్యభిచార కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే బీచ్‌ల సమీపంలో, నైట్ లైఫ్ ఏరియాల్లో పెట్రోలింగ్‌ను పెంచారు. గత వారాంతంలో జరిపిన సోదాల్లో దాదాపు 50 మంది అనుమానిత సెక్స్‌వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే, నౌక వచ్చిన తర్వాత ఇక్కడి పరిస్థితి పూర్తిగా తమ నియంత్రణలోనే ఉంటుందని చెప్పడం కష్టమని పోలీసులు వెల్లడించారు (Pattaya crackdown). ఇలాంటి నౌకల రాకతో ఇదొక ప్రతికూల అంశమే అయినా.. ఆర్థికంగా పట్టాయాకు కలిసొస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఆ నగరం ప్రధానంగా పర్యాటకం, వినోదరంగంపైనే ఆధారపడింది. అలాగే హోటళ్లు, రెస్టారంట్లు, బార్లు, దుకాణాలు, ఇతర వ్యాపారాలు మరింత లాభసాటిగా మారతాయని వ్యాపారవర్గాలు భావిస్తున్నాయి. వ్యభిచారం థాయ్‌లాండ్‌లో చట్టవిరుద్ధం. కానీ

మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా ఇరాన్‌పై తాజా దాడులకు దిగింది. ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కు చెందిన లక్ష్యాలపై విరుచుకుపడింది. ఒమన్ గల్ఫ్‌లో అమెరికా యుద్ధనౌకలపై ఇరాన్ క్షిపణులను ప్రయోగించడమే దీనికి కారణం. దీనికి ప్రతిగా ఇరాన్ సైతం వైమానిక దాడులతో బెంబేలెత్తిస్తోంది. జోర్డాన్, బహ్రెయిన్.. ఇతర గల్ఫ్ దేశాల్లో అమెరికాకు చెందిన బేస్ క్యాంప్ లపై బాంబుల వర్షాన్ని కురిపించింది.ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. నిన్నటి వరకు చల్లారినట్టే కనిపించిన ఈ యుద్ధం.. మళ్లీ మొదటికొచ్చినట్టయింది. మున్ముందు మరింత తీవ్రంగా దాడులు చేపడతామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ప్రకటించడం.. అక్కడి తీవ్రతకు అద్దం పట్టినట్టయింది. ఈ దాడులను అటు అమెరికా, ఇటు ఇరాన్.. ఆత్మరక్షణలో భాగమని చెప్పుకొన్నాయి.ఈస్టర్న్ టైమ్ జోన్ ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు ఇరాన్‌లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ లక్ష్యాలపై దాడులు ప్రారంభించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. దీనిపై తన అధికారిక ఎక్స్ ప్లాట్ ఫామ్ పై పోస్ట్ పెట్టింది. హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలు, ఆ ప్రాంతంలో మోహరించిన అమెరికన్ సైనికులపైనా ఐఆర్జీసీ దాడుల ప్రయత్నాలకు ప్రతీకారానికి దిగామని తెలిపింది.ఇకపై తిరుమలలో ఎయిర్ పోర్ట్ తరహా స్మార్ట్ లగేజీ సిస్టమ్: జీఎంఆర్ ఎంట్రీఇరాన్లోని ఖేష్మ్ ఐలాండ్, జాస్క్, సిరిక్ రీజియన్, జిరోఫ్ట్ ఎయిర్ పోర్ట్ సమీపంలో కూడా పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ తెలిపింది. అంతే ఘాటుగా స్పందించింది. తన భూభాగం నుంచి అమెరికా సైనిక స్థావరాల లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ దీన్ని ధృవీకరించింది. జోర్డాన్‌లోని ప్రిన్స్ హసన్ ఎయిర్ బేస్, బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై తాము భారీగా బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేశామని ప్రకటించింది.బంగారం ధరల పతనానికి సడన్ బ్రేక్- షార్ప్ రీబౌండ్అమెరికాకు చెందిన అత్యాధునిక ఆర్క్యూ-4
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. జాబ్ మేళాలు నిర్వహించడంతో పాటుగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నైపుణ్య శిక్షణ కూడా ఇస్తున్నారు. అంతేకాదు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అవసరమైన శిక్షణను ఉచితంగా అందిస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో ఎస్సీ యువతకు స్వయం ఉపాధి కింద నైపుణ్య శిక్షణ అందించనుంది. ఇజ్రాయెల్‌లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు.. రాష్ట్రవ్యాప్తంగా 14 కేంద్రాలను ఏర్పాటు చేసి ఒక్కోచోట 50 మంది చొప్పున శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. తొలి విడత 100 రోజుల పాటు శిక్షణ అందించనుండగా.. త్వరలోనే ట్రైనింగ్ ప్రారంభం కానుంది.ఇజ్రాయెల్‌లో హోమ్ బేస్డ్ కేర్గివింగ్కు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అందుకే అక్కడ ఉద్యోగాల కోసం ఏఎన్ఎం/జీఎన్ఎం,బీఎస్సీ నర్సింగ్ చేసిన మహిళలు మాత్రమే అర్హులు. ఇజ్రాయెల్‌లో ఉద్యోగాలకు సంబంధించి అవసరమైన శిక్షణ అందిస్తారు. వీరికి కనీసం మూడేళ్ల కాలపరిమితి ఉన్న పాస్‌పోర్ట్ ఉండాలి. అంతేకాదు గతంలో ఇజ్రాయెల్‌లో పనిచేసి ఉండకూడదు. అభ్యర్థుల జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, పిల్లలు ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో నివాసం, ఉద్యోగం చేస్తుండకూడదు.రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు శిక్షణ తీసుకునేలా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలులో ఈ శిక్షణా కేంద్రాలు ప్లాన్ చేశారు. శ్రీకాకుళం, విశాఖ, కాకినాడ, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, కడప, అనంతపురంలలో ఇతర వృత్తులకు సంబంధించి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన శిక్షణా కేంద్రాల కోసం ఎంపిక చేశారు. ఈ శిక్షణా కేంద్రాల్లో ఎస్సీ మహిళలతో పాటు పురుషులకు అవసరమైన శిక్షణ అందిస్తారు. ఇజ్రాయెల్ మాత్రమే కాదు జర్మనీలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే.ఏపీలో ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ యువత కోసం ఇతర నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోంది. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పాస్ లేదా ఫెయిల్ అయిన 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు మూడు నెలల పాటూ శిక్షణ ఇస్తారు. అనంతరం వారికి సర్టిఫికెట్ కూడా అందించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. అంతేకాదు వారు

వీసాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని యూఏఈలోని భారతీయులను అక్కడి ఇండియన్ ఎంబసీ అప్రమత్తం చేసింది. వీసాల విషయాల్లో సాయం చేస్తామని వచ్చే అనధికారిక ఏజెంట్లు, వ్యక్తులకు బయోమెట్రిక్ వివరాలు ఇవ్వవద్దని సూచించింది. ఇంటర్నెట్ డెస్క్: వీసాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని యూఏఈలోని భారతీయులను అక్కడి ఇండియన్ ఎంబసీ అప్రమత్తం చేసింది. వీసాల విషయాల్లో సాయం చేస్తామని వచ్చే అనధికారిక ఏజెంట్లు, వ్యక్తులకు బయోమెట్రిక్ వివరాలు ఇవ్వవద్దని సూచించింది. వీసా రెగ్యులరైజేషన్, ఎమర్జెన్సీ సర్టిఫికేట్స్ జారీ, ఎగ్జిట్ పర్మిట్లు, ఎమిరేట్ ఐడీలు, ఉపాధి విషయాల్లో అవగాహనతో ఉండాలని సూచించింది. యూఏఈలో వెలుగు చూస్తున్న స్కామ్స్‌లో పలువురు బ్లూకాలర్ ఉద్యోగులు బాధితులుగా మారుతున్న విషయం తమ దృష్టికి వచ్చినట్టు ఎంబసీ వెల్లడించింది. మోసపూరితంగా బయోమెట్రిక్ వివరాలు సేకరిస్తున్న నిందితులు వాటితో ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పింది. బాధితులకు తెలియకుండానే వారి పేరిట బ్యాంకు ఖాతాలు తెరవడం, లోన్లు, క్రెడిట్ కార్డులు తీసుకోవడం వంటివి చేస్తున్నారని చెప్పింది. ఈ స్కామ్ బారిన పడితే అప్పులు మిగిలడంతో పాటు నిషేధానికి గురయ్యే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. ఈ స్కామ్స్ బారిన పడకుండా ఉండేందుకు భారతీయులు తమ బయోమెట్రిక్, పాస్‌పోర్టు వివరాలను అనధికారిక ఏజెంట్లు, వ్యక్తులతో పంచుకోవద్దని సూచించింది. యూఏఈ ప్రభుత్వ కేంద్రాలు, కౌంటర్లలోనే ఈ వివరాలను ఇవ్వాలని సూచించింది. భారతీయ పాస్‌పోర్టులు, ఎమర్జెన్సీ సర్టిఫికేట్ల జారీ కోసం భారతీయ కాన్సులేట్లు, లేదా ఎంబసీ బయోమెట్రిక్ వివరాలను కోరవని కూడా స్పష్టం చేసింది. బయోమెట్రిక్ వివరాలను ఎవరైనా అడిగితే వెంటనే ఎంబసీకి సమాచారం ఇవ్వాలని కూడా అధికారులు చెప్పారు. రష్యా సైన్యంలోని 51 మంది భారతీయుల మృతి.. విదేశాంగ శాఖ సెక్రటరీ వెల్లడి రైల్వే అభివృద్ధిలో తెలంగాణకు పెద్దపీట కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Donald Trump New New Decisions: డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న ఒక్కో నిర్ణయం మనలాంటి వర్ధమాన దేశాలకు బాధ కలిగిస్తున్న ఆ దేశ పౌరులకు మాత్రం ఆయనలో ఓ దేవుడుని చూస్తున్నారు. ప్రపంచంలోని పలు దేశాలు పొలో మంటూ అమెరికాకు క్యూ కట్టకుండా కట్టడి చేస్తున్నాడని అనుకుంటున్నారు. మొత్తంగా అమెరికా ప్రపంచ దేశాల్లో సంపన్న దేశంగా విరాజిల్లుతుంది. ఆదేశానికి అధ్యక్షుడు కావడంతో అగ్రరాజ్యానికి అధినేతగా రాణిస్తున్నాడు ట్రంప్. చేతిలో అధికారం ఉందని ఆయన ఏంచేయాలనుకుంటే అదే చేస్తాడు. ఎవడిమాటా వినడు డొనాల్డ్ ట్రంప్. ప్రపంచ అగ్రరాజ్యధినేతకు ఆ మాత్రం ఉండాల్సిందే అంటున్నారు ఆయనను సపోర్ట్ చేసేవారు. H-1B వీసా ఫీజులు రికార్డు స్థాయికి.. అమెరికా అధ్యక్షుడిగా తొలిసారిగా ఎన్నికైనపుడు… కామెడీ పీస్ అనుకున్నారు. తొలిదశలో ఆయన ఇతర దేశాలను ఇబ్బంది పెట్టే చర్యలకు దూరంగా ఉన్నారు. 2017లో పదవిలోకి వచ్చిన వెంటనే కొన్ని ముస్లిం మెజారిటీ దేశాల పౌరులు అమెరికాలోకి రాకుండా ప్రయాణ నిషేధాలు విధించారు. ఐటీ నిపుణులకు ముఖ్యంగా భారతీయులకు గట్టి షాక్ ఇస్తూ, H-1B వీసా ఫీజులను రికార్డు స్థాయికి పెంచాలని ప్రతిపాదించారు. అక్రమ వలసదారులను అమెరికానుంచి పంపించి వేయడానికి, సరిహద్దుల వద్ద కఠిన చర్యల కోసం భారీ నిధులను కేటాయించారు. రిపబ్లికన్ పార్టీ నేతగా ప్రజా మద్ధతుతో రెండోసారి అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ చరిత్రను సృష్టించారు. రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ప్రపంచ దేశాలకు పట్టపగలే చుక్కలు చూపించారు. వలస విధానంపై సంచలన నిర్ణయం

హైదరాబాద్‌లోని చారిత్రక గోల్కొండ కోట సమీపంలో, 400 ఏళ్ల నాటి కుతుబ్ షాహీ సమాధుల ప్రాంగణంలో రహస్య తవ్వకాలు కలకలం రేపాయి. గుట్టుచప్పుడు కాకుండా సాగిన ఈ అక్రమ తవ్వకాల్లో 100 మీటర్ల పొడవైన రహస్య స్వరంగం బయటపడటంతో స్థానికంగా, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై ఎంపీ ఓవైసీ సీరియస్‌గా స్పందించగా, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ వెంటనే పురావస్తు శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. పాన్,ఆధార్ వాట్సాప్‌లో పంపుతున్నారా? క్షణాల్లో రంగంలోకి సైబర్ నేరగాళ్లు.. రెప్పపాటులో బ్యాంకు ఖాతాలు గుల్ల బయటకి ఆరోగ్యంగా కనిపిస్తున్నా.. కొన్ని విటమిన్ లోపాలు ఉండొచ్చు.. ఎలా చెక్ చేసుకోవాలి? వేగంగా వేడెక్కుతున్న భూమి.. ప్రమాదంలో పెద్దల ప్రాణాలు మేలుకోకుంటే మరణ మృదంగమే ! కుటుంబంలో ఆర్థిక, ఆరోగ్య సమస్యలా.. అయితే మళ్లీ పెళ్లి చేసుకోండి! అంతరిక్షంలో అగ్రికల్చర్.. తాజా ఆకుకూరలు పండించిన నాసా వ్యోమగామి

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనలో విషాదాంతం చోటుచేసుకుంది. గోదావరి నదిలో గల్లంతైన ఆయన భార్య మీనా (55) మృతదేహం శనివారం లభ్యమైంది. ఆరు రోజులుగా కొనసాగుతున్న గాలింపు చర్యలకు దీంతో ముగింపు పలికినట్లయింది.వివరాల్లోకి వెళితే, కాకినాడకు చెందిన రైఫిల్ షూటింగ్ శిక్షకుడు సాధిక్ ఖాన్ వేధింపులు తాళలేక ఈ నెల 16వ తేదీ అర్ధరాత్రి ఏఈ నూకరాజు తన కుటుంబంతో కలిసి రాజమహేంద్రవరంలోని రోడ్డు కం రైలు వంతెనపై నుంచి గోదావరిలోకి దూకారు. ఈ ఘటనలో మనవడు కార్తికేయ ఈదుకుంటూ ఒడ్డుకు చేరి ప్రాణాలతో బయటపడ్డాడు. నదిలో గల్లంతైన మిగతా ముగ్గురి కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా గాలింపు చేపట్టాయి.ఈ క్రమంలో ఈ నెల 17న నూకరాజు, 20న ఆయన కుమార్తె సౌజన్య మృతదేహాలను అధికారులు వెలికితీశారు. తాజాగా శనివారం ఉదయం ధవళేశ్వరం బ్యారేజ్‌కు సుమారు 30 కిలోమీటర్ల దిగువన, ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారం వద్ద మీనా మృతదేహాన్ని గాలింపు బృందాలు గుర్తించాయి. మీనా మృతదేహం కూడా లభ్యం కావడంతో నదిలో గల్లంతైన ముగ్గురి మృతదేహాలను వెలికితీసినట్లయింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఇలా జలసమాధి కావడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. గాజాకు మానవతా సహాయక సామాగ్రితో వెళ్తున్న నౌకలను ఇజ్రాయెల్ సైన్యం అడ్డుకోవడం దీనికి ప్రధాన కారణం. దీనిపై కొనసాగుతున్న విచారణలో భాగంగా టర్కీ ఈ నిర్ణయం తీసుకుంది. నెతన్యాహుతో పాటు పలువురు ఇజ్రాయెల్ ఉన్నతాధికారులను అరెస్ట్ చేసేందుకు వీలుగా ఇంటర్‌పోల్ ద్వారా రెడ్ నోటీస్ జారీ చేయాలని కూడా కోరింది.ఈ వివరాలను టర్కీ న్యాయశాఖ మంత్రి అకిన్ గుర్లెక్ వెల్లడించారు. గాజాపై ఇజ్రాయెల్ విధించిన నావికా దిగ్బంధనాన్ని ఉల్లంఘించేందుకు ప్రయత్నించిన వివిధ దేశాలకు చెందిన నౌకలను ఇజ్రాయెల్ రక్షణ దళాలు అడ్డుకోవడాన్ని టర్కీ తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. దీనిపై టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్.. అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ఇస్తాంబుల్ ప్రాసిక్యూటర్ కార్యాలయాన్ని రంగంలోకి దించారు.దీని ఆధారంగానే ఇజ్రాయెల్ ప్రధానితో పాటు ఆ నౌకల దిగ్బంధనానికి ప్రత్యక్షంగా ఆదేశాలు ఇచ్చిన, క్షేత్రస్థాయిలో ఆపరేషన్‌లో పాల్గొన్న ఇతర ఉన్నత స్థాయి సైనిక అధికారులను నిందితులుగా ఈ అరెస్ట్ వారెంట్లల్లో చేర్చింది. ఇజ్రాయెల్ సైన్యం మానవ హక్కుల ఉల్లంఘన, చట్టవిరుద్ధ నిర్బంధాలకు పాల్పడిందని టర్కీ ప్రాసిక్యూటర్లు తమ చార్జ్‌షీట్‌లో పొందుపరిచారు.వాస్తు ప్రకారం.. ఇంట్లో మూడు బర్నర్లు ఉన్న గ్యాస్ స్టవ్ వాడవచ్చా?ఇజ్రాయెల్ ప్రభుత్వం సామూహిక మారణహోమ యత్నాలకు ప్రయత్నించిందని, అంతర్జాతీయ శాంతి కార్యకర్తలను చట్టవిరుద్ధంగా నిర్బంధించడం, వారిని గాయపర్చడం వంటి హేయమైన చర్యలకు పాల్పడిందని టర్కీ కోర్టు పేర్కొంది. టర్కీతో పాటు ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రేలియా కూడా తమ న్యాయపరిధుల్లో స్వతంత్ర దర్యాప్తును ప్రారంభించాయి. ఇటువంటి అమానవీయ చర్యలకు పాల్పడిన వారందరినీ చట్టం ముందు నిలబెడతామని టర్కీ చెబుతోంది.అందుకే.. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతులు ఇవ్వలేదు: తేల్చి చెప్పిన కేంద్రంటర్కీ ప్రభుత్వం అధికారికంగా విజ్ఞప్తి చేసినప్పటికీ.. ఇంటర్‌పోల్ ద్వారా నెతన్యాహుపై రెడ్ నోటీస్ జారీ కావడం, దాని అమలు అనేది అంత తేలికైన విషయం కాదు. నిందితులను అరెస్ట్ చేసి అప్పగించడం అనేది ఆయా
విజయనగరం జిల్లా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు ప్రారంభంకావడంతో ప్రయాణికులతో సందడి వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా విశాఖపట్నం నుంచి భోగాపురానికి ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది.. వీరి కోసం ఆర్టీసీ ఏరో ఎక్స్‌ప్రెస్ వే బస్సుల్ని నడుపుతోంది. విశాఖ నుంచి భోగాపురానికి ప్రతి అరగంటకు ఒక బస్సును నడిపేలా ప్లాన్ చేశారు.. అయితే విశాఖపట్నంలో ప్రయాణికుల కోసం సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ వినిపిస్తోంది. ఈ అంశంపై రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు.విశాఖపట్నంలో ఎనిమిది ప్రాంతాల్లో బస్ బేలు నిర్మించబోతున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోయే బస్ బేలలో ఏసీ సౌకర్యం, మొబైల్ ఛార్జింగ్ సదుపాయం ఉండేలా చూస్తామన్నారు. మంత్రి విశాఖపట్నం హుడా పార్క్ నుంచి ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులో భోగాపురం విమానాశ్రయం వరకు ఆర్టీసీ అధికారులతో కలిసి ప్రయాణం చేశారు. ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు నిర్ణీత సమయం ప్రకారం నడుస్తున్నాయన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి.ఈ బస్సుల్లో ప్రస్తుతం ప్రయాణ సమయం 1.40 గంటలు పడుతోందని.. రాబోయే రోజుల్లో ప్రయాణ సమయం తగ్గుతుందన్నారు మంత్రి. ఈ బస్సుల్లో ప్రస్తుతం 30శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయని.. రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతందన్నారు. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే ప్రయాణికులకు లగేజీకి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయని.. త్వరలోనే వాటిని పరిష్కరిస్తామన్నారు. పర్యావరణహిత, ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థలో భాగంగా ఎలక్ట్రిక్ బస్సుల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని.. ప్రయాణికులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన రవాణా అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.విశాఖపట్నం నుంచి ఎలక్ట్రిక్ బస్సులో విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. అక్కడ ఏర్పాటు చేసిన బస్‌స్టాండ్, చార్జింగ్ స్టేషన్‌ను పరిశీలించారు. ప్రయాణికులతో మాట్లాడి విశాఖపట్నం నుంచి విమానాశ్రయానికి కల్పించిన ఆర్టీసీ రవాణా సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి అరగంటకు ఒక ఎలక్ట్రిక్ బస్సును నడుపుతున్నట్లు

ఇరాన్‌కు చెందిన కీలక జలమార్గాలపై అమెరికా ఇప్పటికే గణనీయమైన నియంత్రణ సాధించిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. త్వరలో పూర్తి నియంత్రణ తమ చేతికి వస్తుందని అన్నారు. అదే సమయంలో ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేయనివ్వబోమని మరోసారి స్పష్టం చేశారు.మాజీ వ్యక్తిగత న్యాయవాది మైఖేల్ కోహెన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏ జలమార్గాల గురించి మాట్లాడుతున్నారన్నది మాత్రం ఆయన స్పష్టంగా చెప్పలేదు.ఇరాన్‌పై సైనిక చర్యల కారణంగా అమెరికన్లకు పెట్రోల్, ఇంధన ధరలు కొంత పెరగవచ్చని కూడా అంగీకరించారు. అయినా ఇరాన్‌ను అణ్వాయుధం తయారు చేయకుండా అడ్డుకోవడం మరింత ముఖ్యమని చెప్పారు.ఇరాన్ నౌకాదళం, వైమానిక దళం తీవ్రంగా బలహీనపడ్డాయని ట్రంప్ పేర్కొన్నారు. అక్కడి కీలక నాయకులు కూడా లేకపోవడంతో చర్చల ద్వారా ఒప్పందం కుదుర్చుకోవడం కష్టంగా మారిందన్నారు.ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల తయారీ సామర్థ్యం భారీగా దెబ్బతిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ఒత్తిడి ఉందన్నారు. ద్రవ్యోల్బణం పెరగడం, కరెన్సీ విలువ పడిపోవడం వంటి అంశాలను ప్రస్తావించారు.ఇరాన్ అణ్వాయుధం తయారుచేసే దశకు కేవలం రెండు వారాల దూరంలో ఉందని తమకు సమాచారం ఉందని ట్రంప్ చెప్పారు. అందుకే ఇరాన్ అణు కేంద్రాలపై బీ-2 బాంబర్లతో దాడి చేశామని తెలిపారు. ప్రతి బాంబు లక్ష్యాన్ని ఛేదించిందని పేర్కొన్నారు.ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉంటే ఇజ్రాయెల్‌తో పాటు పశ్చిమాసియా దేశాలకు భారీ ముప్పు ఉండేదని ట్రంప్ అన్నారు. ఇజ్రాయెల్ భద్రతలో తన పాత్ర కీలకమని కూడా వ్యాఖ్యానించారు

అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ పరపతి ఏంటో చెప్పేందుకు ఈ ఘటన చాలు అనే చర్చ మొదలైంది. సొంతంగా ఆ దేశ ఎంపీ చేసిన ఆరోపణలే ఇప్పుడు పాక్ ఇమేజ్‌పై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. విమానం రద్దైన తర్వాత హోటల్ వసతి కోసం వెళ్లిన పాకిస్థానీ ప్రయాణికులకు ఎదురైన అనుభవం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.పాకిస్థాన్ మాజీ నేషనల్ అసెంబ్లీ స్పీకర్, ఎంపీ అసద్ ఖైసర్ కూడా ఈ ఘటనలో ఉన్నారు. యూఏఈలో తన విమానం రద్దు కావడంతో హోటల్లో బస కోసం ప్రయత్నించామని చెప్పారు. అయితే భారతీయులు, అమెరికా పాస్‌పోర్టు ఉన్నవారికి మాత్రమే వసతి కల్పిస్తామని హోటల్ వారు ప్రకటించారని ఆరోపించారు. పాకిస్థానీ ప్రయాణికుల పట్ల మాత్రం హోటల్ సిబ్బంది తీరు సరిగా లేదని పాక్ పార్లమెంట్‌లోనే ఆవేదన వ్యక్తం చేశారు.యూఏఈ తమకు సన్నిహిత ఇస్లామిక్ దేశమని చెబుతూనే.. అక్కడ ఇలాంటి అనుభవం ఎదురవడంపై ఖైసర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని దౌత్య మార్గాల ద్వారా యూఏఈ ప్రభుత్వంతో చర్చించాలని పాక్ విదేశాంగ శాఖకు విజ్ఞప్తి చేశారు. యూఏఈ అభివృద్ధిలో పాకిస్థానీయుల పాత్ర కూడా ఉందని గుర్తుచేశారు.ఇదే తరహా అనుభవాలు ఎదురయ్యాయని కొందరు తనను కలిసి ఫిర్యాదు చేశారని ఖైసర్ వెల్లడించారు. యూఏఈలో 15 లక్షల మందికిపైగా పాకిస్థానీయులు నివసిస్తున్నారని అంచనా. అయినప్పటికీ భారతీయులు, అమెరికన్లకు వసతి కల్పించి పాకిస్థానీయులను పక్కన పెట్టారన్న పాక్ ఎంపీ ఆరోపణ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది

Jagamae Sangeetham : చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల నిర్మాతగా వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తా గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సిరీస్ లు, సినిమాలు నిర్మిస్తుంది. ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లు తీయగా తాజాగా మరో కొత్త సిరీస్ ని ప్రకటించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ హిందీ సిరీస్ ‘బందిష్ బాండిట్స్’ స్ఫూర్తితో ‘జగమే సంగీతం’ అనే వెబ్ సిరీస్ ని తెరకెక్కించారు. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో సుష్మిత కొణిదెల నిర్మాణంలో మ్యూజికల్ డ్రామాగా ఈ సిరీస్ తెరకెక్కింది. కర్ణాటక సంగీత సంప్రదాయాలను సమకాలీన శబ్దంతో అందంగా మేళవించిన హృద్యమైన స్వరకల్పనల ద్వారా విశాల్ చంద్రశేఖర్ ఈ సిరీస్‌కి ప్రాణం పోశారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మధుబాల, అక్షయ్ లగుసాని, సుస్మితా శెట్టి.. కీలక పాత్రల్ని పోషించారు. సుమన్, సిజ్జు మీనన్, షఫీ, ఝాన్సీ, రఘు బాబు యెర్రా, రాకెట్ రాఘవ, నాగి జబర్దస్త్, మిర్చి నాకిరణ్, ప్రకావ్ కిరణ్, ప్రకావ్ కిరణ్, ప్రకావ్ కిరణ్, కేస్కావ్ రెడ్డి, రూప లక్ష్మి.. పలువురు ఈ సిరీస్ లో నటించారు. Also See : Supritha : పెంపుడు కుక్క పుట్టిన రోజు సెలబ్రేట్ చేసిన సుప్రీత.. ఫొటోలు… ‘జగమే సంగీతం’ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ్ భాషల్లో సెప్టెంబర్ 4 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్టు నేడు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా 240 దేశాల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. కర్ణాటక సంగీతం చుట్టూ తాత, మనవడి కథాంశంతో ఈ సిరీస్ తెరకెక్కింది. రిలీజ్ డేట్ అనౌన్స్ సందర్భంగా ప్రైమ్ వీడియో ఇండియా, SVOD ఒరిజినల్స్ డైరెక్టర్, హెడ్ మాట్లాడుతూ.. కుటుంబం, వారసత్వం, ఆత్మశోధన వంటి ఇతివృత్తాలను అన్వేషిస్తూనే, సంగీతంలోని భావోద్వేగ శక్తిని ఈ జగమే సంగీతం కథ చెప్తుంది. హత్తుకునే సంగీతం ఈ సిరీస్ లో ఉంది అని అన్నారు. నిర్మాత

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌పై సైనిక దాడులు కొనసాగిస్తోన్న అమెరికా.. ఇప్పుడు ఆ దేశ ఆర్థిక జీవనాధారంపై దెబ్బకొట్టేందుకు సిద్ధమైంది. టెహ్రాన్‌ను ఏకాకిని చేయడమే లక్ష్యంగా మరో కొత్త ఎత్తుగడతో (US-Iran War) రంగంలోకి దిగింది. ఇరాన్‌కు సాయం చేసే దేశాలు ఆర్థికంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) హెచ్చరించారు. మరి ఈ బెదిరింపుల ప్రభావం భారత్‌పై ఏ మేర ఉంటుంది..? ఇరాన్‌తో మన వాణిజ్యం ఎలా ఉంది..? ఏ దేశంపైనా ఇప్పటివరకు చేపట్టని అత్యంత తీవ్రమైన ఆర్థిక చర్యను తాను ఈ రోజు ఇరాన్ (Iran)పై ప్రకటిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ‘‘ఒప్పందం విషయంలో ఇరాన్‌కు నేనిచ్చినంత గొప్ప అవకాశం ఎవరూ ఇవ్వలేదు. కానీ, డీల్ చేసుకోవడంలో వారు విఫలమయ్యారు. అందుకే, ఈ రోజు నేను ఆ దేశంపై ఆర్థిక యుద్ధం ప్రకటిస్తున్నా. ఇరాన్‌ను ఒంటరిని చేయడమే మా లక్ష్యం. ఇప్పటికే ఆ దేశ నౌకాదళం నాశనమైంది, వాయుసేన ధ్వంసమైంది. సైనిక కర్మాగారాలు శిథిలమయ్యాయి. వారి కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. ఇక, ఇప్పుడు వారికి ఆర్థికంగానూ ఇబ్బందులు తప్పవు. ఏ దేశమైనా తమ ఆర్థిక సంస్థలు, వ్యాపారాలు, విమానాశ్రయాలు, ప్రభుత్వ సంస్థల ద్వారా ఇరాన్‌కు జీవనాధారాన్ని అందిస్తే గనుక.. ఆ దేశం తీవ్రమైన ఆర్థిక పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చమురు స్మగ్లింగ్, నగదు బదిలీలు, ఎక్స్ఛేంజ్ హౌస్‌లు, షిప్ రిజిస్ట్రీలు, ఫ్రంట్ కంపెనీలు.. ఇవన్నీ ఇప్పుడే ఆగిపోవాలి. అవన్ని ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసు. ఇరాన్ ముప్పును ఎదుర్కోడానికి, దాన్ని ఏకాకిని చేసి, ఓడించడానికి అమెరికా మిత్రదేశాలన్నీ మాతో కలిసి నిలబడాలి. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధం కలిగి ఉండకూడదు’’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో రాసుకొచ్చారు. ఇరాన్‌తో వ్యాపార సంబంధాలు సాగించే దేశాలన్నింటికీ ట్రంప్ ఈ హెచ్చరికలు చేశారు. టెహ్రాన్‌కు భారత్ కీలకమైన వాణిజ్య భాగస్వామిగా (India-Iran Trade) ఉంది. ఇరాన్‌తో మనది మిగులు

ఇంటర్నెట్ డెస్క్: హర్మూజ్ జలసంధి.. పశ్చిమాసియా యుద్ధానికి ఇప్పుడు మరింత ఆజ్యం పోస్తోన్న అంశం ఇది. ఈ జలమార్గంపై నియంత్రణ తమకే ఉందంటూ ఇరాన్, అమెరికా గత కొన్ని రోజులుగా వాదోపవాదాలు చేసుకుంటూనే ఉన్నాయి. అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ ఒక అడుగు ముందుకేసి.. ‘హర్మూజ్ (Strait of Hormuz) ఇక మా భూభాగమే’ అని ప్రకటించుకున్నారు. దీన్ని ఇరాన్ ఖండిస్తున్నప్పటికీ.. తాజా పరిణామాలు చూస్తుంటే ఈ కీలక జలసంధి టెహ్రాన్ చేయి దాటిపోతున్నట్లే కన్పిస్తోంది. హర్మూజ్‌పై ఇరాన్ (Iran) 80శాతం పట్టు కోల్పోయినట్లేనని అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. (US-Iran War) హర్మూజ్ జలసంధిలో ఇప్పుడు రెండు మార్గాల్లో నౌకల రాకపోకలు సాగుతున్నాయి. ఒకటి ఇరాన్ సూచించిన మార్గం కాగా.. రెండోది ఒమన్ ఉత్తర తీరం మీదుగా వెళ్లే షిప్పింగ్ ఛానెల్. ఇది అమెరికా సూచించిన ఐరాస అధీకృత రవాణా మార్గం. అయితే, హర్మూజ్ తమ నియంత్రణలోనే ఉందని చెబుతోన్న ఇరాన్.. ఒమన్ రూట్లో వెళ్తోన్న నౌకలపై పదే పదే దాడులు చేస్తోంది. అయినప్పటికీ.. చాలా నౌకలు ఇదే మార్గాన్ని ఎంచుకోవడం గమనార్హం. గత రెండు వారాలుగా ఒమన్ మార్గంలోనే 80శాతానికి పైగా నౌకలు హర్మూజ్‌ను దాటినట్లు షిప్ ట్రాకింగ్ సంస్థ కెప్లెర్ డేటా చెబుతోంది. ఇరాన్ దాడులు కొనసాగుతున్నప్పటికీ.. అమెరికా నౌకాదళాలు కల్పిస్తోన్న భద్రతతో ఈ నౌకలు ఒమన్ తీరం నుంచి ప్రయాణిస్తున్నాయని సదరు డేటా పేర్కొంది. దీన్ని బట్టి చూస్తుంటే హర్మూజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ కోల్పోతున్నట్లు స్పష్టమవుతోందని కెప్లెర్ క్రూడాయిల్ అనాలిసిస్ హెడ్ హోమాయూన్ అభిప్రాయపడ్డారు. నెల క్రితం వరకు ఒమన్ మార్గంలో ఎలాంటి నౌకల ట్రాఫిక్‌ను కెప్లెర్ గుర్తించలేదు. కానీ, రెండు వారాల నుంచి ఈ రూట్లో రాకపోకలు గణనీయంగా పెరుగుతుండటం గమనార్హం. కువైట్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ దేశాలు హర్మూజ్ మీదుగా పర్షియన్ గల్ఫ్‌ను దాటడానికి అతిపెద్ద క్రూడాయిల్ ట్యాంకర్లను వినియోగిస్తున్నాయి. తర్వాత గల్ఫ్ ఆఫ్

కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న తిల్లపూడి నూకరాజు కుటుంబం గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణానికి కాకినాడకు చెందిన రైఫిల్ షూటింగ్ కోచ్ షేక్ సాధిక్ ఖాన్ వేధింపులే ప్రధాన కారణమని తేలింది. ప్రాణాలతో బయటపడిన ఏఈ మనవడు కార్తికేయ ఇచ్చిన సమాచారంతో సర్పవరం పోలీస్ స్టేషన్లో సాధిక్‌ఖాన్‌పై హత్యాయత్నం, ఆత్మహత్యకు ప్రేరేపించడం సహా మరో ఐదు కఠిన సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.ఉప్పు అనుకుని సర్ఫ్ పౌడర్ వడ్డింపు.. 40 మంది పిల్లలకు అస్వస్థత!మభ్యపెట్టి కుటుంబాన్ని బందీగా చేసుకున్న వైనం షూటింగ్ అకాడమీ నడుపుతున్నషేక్ సాధిక్ ఖాన్.. తన వద్దకు షూటింగ్ నేర్చుకోవడానికి వచ్చిన బాలుడిని అడ్డుపెట్టుకుని అతడి తల్లి సౌజన్యతో(నూకరాజు కూతురు) సన్నిహితంగా మెలిగాడు. మాటలతో మభ్యపెట్టి ఆ ఇంట్లోని వ్యవహారాలన్నీ తన గుప్పెట్లోకి తీసుకున్నాడు. వారి వద్ద ఉన్న విలువైన బంగారం, నగదు, బ్యాంక్ ఏటీఎం కార్డులతో పాటు ఆస్తి పత్రాలను కూడా లాక్కున్నాడు. ఆ కుటుంబం బయటకు చెప్పలేని విధంగా తీవ్ర మానసిక హింసకు గురిచేస్తూ నరకం చూపించాడు.వెలుగులోకి వచ్చిన లేఖ.. భర్తను విషమిచ్చి చంపాడంటూ ఆవేదన నూకరాజు ఫ్యామిలీ సూసైడ్ చేసుకునే ముందు అందుకు గల కారణాలను లేఖలో రాసి వాట్సాప్ గ్రూపులలో పోస్ట్ చేయగా.. కూతురు సౌజన్య మరో లేఖ రాసి స్కూటర్ డిక్కీలో ఉంచింది. పోలీసులకు లభ్యమైన సౌజన్య లేఖలోని విషయాలు అధికారులను తీవ్రంగా కలిచివేశాయి. జులై 2న తన భర్త జగదీశ్వరరెడ్డి చనిపోవడం వెనుక సాధిక్ ఖాన్ హస్తం ఉందని.. అతడే విష పదార్థమిచ్చి చంపేశాడని ఆమె ఆ లేఖలో పేర్కొంది. అంతేకాకుండా తన ప్రైవేట్ ఫోటోలను అడ్డుపెట్టుకుని బెదిరించాడని, మతం మారాలని తీవ్రంగా ఒత్తిడి చేశాడని ఆమె తన ఆవేదనను వెళ్లగక్కింది. నిలకడలేని బంగారం ధరలతో రిస్క్ రెట్టింపు: నేడు మళ్లీ.. !!గాలింపు చేపట్టిన

ఇరాన్‌తో అన్ని వాణిజ్య, ఆర్థిక లావాదేవీలను నిలిపివేసినట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రకటించింది. ఈ మేరకు యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ అఫ్రా అల్ హమెలీ ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రజ్యోతి, ఆగస్టు 19: ఇరాన్‌తో అన్ని వాణిజ్య, ఆర్థిక లావాదేవీలను నిలిపివేసినట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రకటించింది. ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో యూఏఈ ఈ చర్య తీసుకుంది. ప్రాంతీయ ఉద్రిక్తతల దృష్ట్యా... ఇరాన్‌తో అన్ని వాణిజ్య, వ్యాపార వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలను తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు నిలిపివేశామని యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ అఫ్రా అల్ హమెలీ తెలిపారు. మరో క్షిపణి ముప్పు గురించి దేశ ప్రజల్ని హెచ్చరిస్తూ ఫోన్ అలర్ట్ జారీ చేసిన దాదాపు రెండు గంటల తర్వాత యూఏఈ ఈ ప్రకటన చేసింది. 'ప్రస్తుత పరిస్థితి, క్షిపణి ముప్పు కారణంగా, వెంటనే ప్రజలు సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని యూఏఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సదరు ఫోన్ అలర్ట్‌లో పేర్కొంది. అయితే, ఆ అలర్ట్‌ను కొద్దిసేపటికే ఉపసంహరించారు. ఫిబ్రవరి 28న పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి, ఇరాన్ దాడుల తీవ్రతను యూఏఈ ఎక్కువగా ఎదుర్కొంది. ఈ ప్రాంతంలోని మరే ఇతర దేశం కంటే ఎక్కువగా, దాదాపు 3,000 క్షిపణులు, డ్రోన్లు ఆ దేశంపై ఇరాన్ ప్రయోగించింది. గల్ఫ్‌లోని నౌకా రవాణాపై ఇరాన్ రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆరోపించగా, ఈ ఆరోపణను ఇరాన్ ఖండించింది. ఇరాన్ తమ దేశం వైపు క్షిపణిని ప్రయోగించిందన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాదనను ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఖాయీ ఖండించారు. ఈ వాదన ప్రాంతీయ విశ్వాసానికి, భద్రతా ప్రయత్నాలకు హానికరమని ఆయన పేర్కొన్నారు. హోర్ముజ్ మాదే.. కొత్త మ్యాప్ షేర్ చేసిన ట్రంప్ మీరు గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి: వైట్ హౌస్‌లో విలేకరిపై ట్రంప్ ఆగ్రహం

పాక్‌లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓ మతబోధకుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పంజాబ్ ప్రావిన్స్‌లోని బహావల్నగర్లోజరిగిన సమావేశంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన నసీర్ మాద్నీ కశ్మీర్ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంటర్నెట్ డెస్క్: పాక్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓ మతబోధకుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పంజాబ్ ప్రావిన్స్‌లోని బహావల్‌నగర్‌లో ఆగస్టు 14న జరిగిన సమావేశంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన నసీర్ మాద్నీ కశ్మీర్ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఉగ్రసంస్థ ఎల్ఈటీ చీఫ్ హఫీజ్ సయీద్ కశ్మీర్లోకి 10 వేల మంది ఉగ్రవాదులను పంపించినట్టు చెప్పాడు. దీంతో, కశ్మీర్లో ఉగ్ర నెట్వర్క్ వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం అవుతోంది. హఫీజ్ సయీద్ సారథ్యంలోని లష్కరే తొయిబా భారత్‌లో అనేక దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి హఫీజ్‌పై పలు కేసులు నమోదయ్యాయి. 26/11 దాడుల్లో మంది పాక్ ఉగ్రవాదులు సముద్రమార్గంలో ముంబైలోకి ప్రవేశించి నాలుగు రోజుల పాటు మారణ హోమం సృష్టించారు. ఈ ఉగ్రవాద దాడిలో 166 మంది మరణించగా 300 మంది గాయపడ్డారు. ఇక గతేడాది పహల్గాం దాడిలో 26 మంది సాధారణ పౌరులు కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి జమ్మూలోని కోర్టు హఫీజ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఐక్యరాజ్య సమితి, అమెరికా కూడా ఎల్ఈటీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి. హోర్ముజ్ మాదే.. కొత్త మ్యాప్ షేర్ చేసిన ట్రంప్ మీరు గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి: వైట్ హౌస్‌లో విలేకరిపై ట్రంప్ ఆగ్రహం

పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టిల్లపూడి నూకరాజు ఆత్మహత్య, కుటుంబసభ్యులు గల్లంతైన కేసులో విస్మయపరిచే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రైఫిల్ షూటర్ సాదిక్ ఖాన్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆస్తుల కోసం నరకం.. ఇస్లాంలోకి మారాలని నా కోడలిపై ఒత్తిడి మానసికంగా తీవ్ర వేధింపులు.. నా కుమారుడి మృతిలోనూ అతడి పాత్ర! షూటర్ సాదిక్ ఖాన్‌పై పోలీసులకు ఏఈ నూకరాజు వియ్యంకుడి ఫిర్యాదు కేసు నమోదు.. నూకరాజు భార్య, కుమార్తె కోసం గాలింపు ముమ్మరం కాకినాడ, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టిల్లపూడి నూకరాజు ఆత్మహత్య, కుటుంబసభ్యులు గల్లంతైన కేసులో విస్మయపరిచే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రైఫిల్ షూటర్ సాదిక్ ఖాన్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నూకరాజు తన భార్య మీనా, కుమార్తె కొవ్వూరి సౌజన్య, మనవడు కార్తికేయరెడ్డితోసహా ఆదివారం రాత్రి గోదావరిలో దూకిన విషయం తెలిసిందే. నూకరాజు అల్లుడు జగదీశ్వర్‌రెడ్డి గత నెల రెండో తేదీన మరణించారు. అయితే, తన కుమారుడి మరణానికి సాదిక్ ఖానే కారణమని ఆరోపిస్తూ జగదీశ్వర్‌రెడ్డి తండ్రి, నూకరాజు వియ్యంకుడు భాస్కర్‌రెడ్డి కాకినాడ సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సర్పవరం పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. తన మనవడు కార్తికేయరెడ్డితో మాట్లాడగా, ఈ విషయం తెలిసిందని ఆయన పేర్కొన్నారు. సాధిక్‌తోపాటు మరో వ్యక్తి పాత్ర ఉన్నట్టు అనుమానం వ్యక్తంచేశారు. నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి, అల్లుడి మరణానికీ సాధికే కారణం అనే కోణంలో అతడి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.మరోవైపు గోదావరిలోకి దూకేందుకు ముందు నూకరాజు కుమార్తె సౌజన్య బండిలో ఉంచిన మూడు కవర్లను పోలీసులు గుర్తించారు. సాదిక్ తనను, తన కుటుంబ సభ్యులను ఎలా వేధిస్తున్నాడనే విషయాలను వాటిలో ప్రస్తావిస్తూ లెటర్ రాసినట్టుగా భాస్కర్‌రెడ్డి తెలిపారు. అంతేకాదు తన కుమారుడు జగదీశ్వర్ రెడ్డిని ఏదో మందు ఇచ్చి సాదిక్‌ఖాన్ చంపినట్టు సౌజన్య ఆ లెటర్లో రాసిందని పోలీసులకు చెప్పారు. సౌజన్య ప్రైవేటు విషయాలను

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల గడువు దగ్గరపడుతోంది. సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు తిరుమలలో అత్యంత వైభవంగా, కన్నుల పండువగా ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. లక్షలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకోనున్నారు. వీటిని విజయవంతం చేయడంపై తిరుమల తిరుపతి దేవస్థానం దృష్టి సారించింది. వరుస సమీక్షలను నిర్వహిస్తోంది. విభాగాధిపతులకు అవసరమైన ఆదేశాలను ఇస్తూ వస్తోంది.ఈ క్రమంలో టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి.. అన్న ప్రసాదాల తయారీకి కూరగాయలను విరాళంగా అందిస్తున్నదాతలతో సమావేశం అయ్యారు. బ్రహ్మోత్సవాల సమయంలో కూరగాయల సరఫరా, రవాణా, నిల్వ, వినియోగం, నాణ్యత, భవిష్యత్ అవసరాలు తదితర అంశాలపై దాతలతో చర్చించారు. లక్షలాదిమంది భక్తులు తిరుమలకు రాబోతోన్నందున కూరగాయల సరఫరా విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.శ్రీవారి అన్న ప్రసాద వితరణలో కూరగాయల దాతల సేవలు అత్యంత కీలకమైనవని సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. గత నాలుగైదు నెలలుగా తిరుమలలో రోజుకు సుమారు నాలుగు లక్షల మందికి అన్నప్రసాదం అందిస్తున్నామని, ఇందుకోసం సగటున 13 నుంచి 14 టన్నుల బియ్యం, ఎనిమిది టన్నులకు పైగా కూరగాయలు వినియోగిస్తున్నామని చెప్పారు. ఇంత భారీ స్థాయిలో కూరగాయలను నిరంతరం దాతల ద్వారా సమకూరడం గొప్ప విషయమని అన్నారు.Tirumala: తిరుమలలో శరవేగంగా.. : టీటీడీ తక్షణ ఆదేశాలు జారీగత 25 నుంచి 30 సంవత్సరాలుగా ఏపీ, తమిళనాడు, కర్ణాటకల్లోని పలు ప్రాంతాల నుంచి 30 మంది దాతలు 33 రకాల కూరగాయలను సమకూరుస్తున్నారని వివరించారు. అన్నప్రసాదం అవసరాలకు అనుగుణంగా ఏ సమయంలో ఏ కూరగాయ ఎంత అవసరమో ముందుగానే ప్రణాళిక రూపొందించి, దాతలతో సమన్వయం చేసుకుని కూరగాయలను స్వీకరిస్తున్నామని, నాణ్యత, ప్యాకింగ్, రవాణా తదితర అంశాల్లో దాతలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని అభినందించారు.తిరుమలలో ముమ్మరంగా ట్రైన్ ది ట్రైనర్స్కూరగాయలు త్వరగా పాడయ్యే స్వభావం కలిగినవి కావడం వల్ల వాటిని నిల్వ ఉంచడంలో కోల్డ్ స్టోరేజీ సౌకర్యాన్ని వినియోగించుకుంటోన్నట్లు వెంకయ్య చౌదరి వివరించారు. మూడేళ్ల కిందటి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఇరాన్- అమెరికా మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో యూఏఈ తమ దేశ పౌరులను అలర్ట్ చేసింది. మిసైల్ దాడులకు అవకాశం ఉందని స్పష్టం చేసింది. అందువల్ల ప్రజలంతా సురక్షితమైన ప్రదేశాల్లో ఉండాలని పేర్కొంది. ఈ మేరకు యూఏఈ కు చెందిన ది నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ(NCEMA) ఓ ప్రకటన జారీ చేసింది. ఈ విషయాన్ని తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. తమ దేశానికి చెందిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఓ క్షిపణి యూఏఈ టార్గెట్ గా వచ్చిందని పేర్కొంది.60 రోజుల పాటు ఇరాన్- అమెరికా మధ్య ఉన్న అవగాహన ఒప్పందం ముగిసిన నేపథ్యంలో యూఏఈ పై క్షిపణి బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ మేరకు యూఏఈ ఇంటీరియర్ మినిస్ట్రీ ఫోన్ అలెర్ట్ ద్వారా హెచ్చరికలు జారీ చేసింది. సురక్షిత ప్రాంతంలో ఉండండి.. అంటూ తమ పౌరులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. సోషల్ మీడియా వేదికగా ట్రూత్ సోషల్ లో పోస్టు పెట్టారు. అందులో అమెరికా కొత్త భూభాగం హార్మూజ్ జలసంధి అని పోస్టు చేశారు. హార్మూజ్ జలసంధిపై పూర్తిగా నియంత్రణ తమకే ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. జూన్ లో ఇరాన్ తో కుదిరిన 60 రోజుల అవగాహన ఒప్పందం గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో యుద్ధాన్ని నివారించాలంటే వెంటనే ఇరాన్ తెల్ల జెండా ఎగరేసి లొంగిపోవాలని ట్రంప్ అన్నారు.ఇరాన్- అమెరికా మధ్య ఉన్న అవగాహన ఒప్పందం ఆగస్టు 17 తో ముగిసింది. ఈ నేపథ్యంలోనే క్షిపణి దాడులు జరిగే అవకాశం ఉందని అమెరికా అంచనా వేస్తోంది. ఈ క్రమంలో గల్ఫ్ దేశాల్లో ఉంటున్న అమెరికా స్థావరాలను అప్రమత్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది

ఇంటర్నెట్ డెస్క్: హర్మూజ్ జలసంధిపై పూర్తిగా నియంత్రణ తమకే ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ‘ట్రూత్ సోషల్’ వేదికగా కీలక పోస్టు పెట్టారు. ‘హర్మూజ్.. అమెరికా కొత్త ప్రదేశం’ అని ఆ జలసంధి మ్యాప్‌పై రాసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. ప్రస్తుతం హర్మూజ్‌ను దిగ్బంధనం చేసిన అమెరికా.. ఇరాన్ నౌకలను అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. భారత ఎన్నికల వ్యవస్థపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు మరోవైపు.. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు హర్మూజ్‌పై పట్టును కొనసాగిస్తామని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ మంగళవారం స్పష్టం చేశారు. ‘‘ఒప్పందం ప్రకారం దిగ్బంధనాన్ని ఎత్తేయాలి. స్తంభింపజేసిన ఆస్తులను విడుదల చేయాలి. చమురుపై ఆంక్షలను తొలగించాలి. అదేవిధంగా సైనిక చర్యలకు ముగింపు పలకాలి. అప్పటివరకు హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవబోం’’ అని స్పష్టంచేశారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

Imran Khan Hospital : జైలులో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్‌కు పాక్ సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. 73 ఏళ్ల ఇమ్రాన్ ఆరోగ్యం క్షీణించడంతో పాటు కంటిచూపు మందగిస్తోంది. ఆరోగ్య పరిస్థితి రోజురోజుకీ క్షీణించడంతో ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఆయన్ను తక్షణమే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని ఆదేశించింది. పాక్ సుప్రీంకోర్టు నిర్ణయంతో గత కొన్ని నెలలుగా ఇమ్రాన్ విడుదలపై పోరాటం చేస్తున్న పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్, ఆయన కుటుంబానికి ఊరట లభించింది. ఇమ్రాన్‌ను 48 గంటల్లోగా షిఫా ఆసుపత్రికి తరలించాల్సిందిగా సూచించింది. పీటీఐ అధికార ప్రతినిధి ప్రకారం.. రాబోయే 48 గంటల్లోగా ఇమ్రాన్ ఖాన్‌ను షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్లో చేర్పించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం.. ఇమ్రాన్ ఖాన్ సెప్టెంబర్ 16 వరకు వైద్యుల పర్యవేక్షణలో ఈ ఆస్పత్రిలోనే ఉండనున్నారు. ఆస్పత్రికి ఎందుకంటే? : ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి జైలులో ఉన్నారు. కొంతకాలంగా ఆయన కుటుంబం ఆయన ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. జైలులో చికిత్స ఆలస్యం కావడం వల్ల ఇమ్రాన్ ఖాన్ కుడి కంటి చూపు బాగా తగ్గిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ క్రికెటర్లు ఇమ్రాన్ ఖాన్ జైలు పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. Read Also : Samsung Galaxy S26 Ultra : ఇది కదా డిస్కౌంట్.. ఈ శాంసంగ్ అల్ట్రా ఫోన్ మరి ఇంత తక్కువా.. ఏకంగా రూ. 26,500 తగ్గింపు..! పీటీఐ అధికార ప్రతినిధి జుల్ఫికర్ బుఖారీ మాట్లాడుతూ.. “ఈ నిర్ణయం మాకు ఊరటనిచ్చింది. ఈ ఉత్తర్వు ముందే వచ్చి ఉంటే ఆయన కళ్లకు, ఆరోగ్యానికి ఇంత నష్టం జరిగి ఉండేది కాదు. ఆయన ఆరోగ్యం పూర్తిగా కోలుకునేవరకు ఆస్పత్రిలోనే ఉంచాలి” అని డిమాండ్ చేశారు

దేశంలో ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా పాలన అందించాల్సిన ప్రజాప్రతినిధులపై కేసులు ఏ స్థాయిలో పేరుకుపోయాయో తెలిపే ఒక సంచలన నివేదిక దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న నేరపూరిత కేసుల విచారణను వేగవంతం చేయాలంటూ గత దశాబ్దకాలంగా సాగుతున్న కేసు విచారణలో భాగంగా.. సీనియర్ న్యాయవాది, అమిస్క్యూరీ విజయ్ హన్సారియా ఆందోళనకరమైన గణాంకాలను న్యాయస్థానానికి సమర్పించారు. దేశంలోని మొత్తం 28 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఏకంగా 14 మంది తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారనే నిజం ఈ నివేదిక ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఏకంగా 89 కేసులతో జాబితాలో అగ్రస్థానంలో నిలవడం గమనార్హం.రాష్ట్రాల్లో పాలకుల కేసుల చిట్టా!ఈ నివేదిక ప్రకారం టాప్ ప్లేస్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 89 కేసులతో అగ్రస్థానంలో ఉండగా.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సువేందు అధికారిపై 29 కేసులతో రెండో స్థానంలో ఉన్నారు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై చెరో 19 కేసులు నమోదు కాగా, కేరళకు చెందిన వీడీ సతీశన్‌పై 18 కేసులు ఉన్నాయి. ఇక జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, మహారాష్ట్ర నేత దేవేంద్ర ఫడ్నవీస్, హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్, తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్, బీహార్ సీఎం సమ్రాట్ చౌదరిలతో పాటు సిక్కిం, పంజాబ్, ఒడిశా, రాజస్థాన్ ముఖ్యమంత్రులు కూడా కేసుల జాబితాలో ఉన్నారు. అసెంబ్లీ ప్రజాప్రతినిధుల పరంగా చూస్తే బెంగాల్లో అత్యధికంగా 58 శాతం మంది సభ్యులపై తీవ్రమైన కేసులు ఉండగా.. కేరళలో 57 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 56 శాతం, తెలంగాణలో 49 శాతం మంది శాసనసభ్యులు క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. 22 ఏళ్ల నరకం.. సుప్రీం కోర్టు తీర్పు చూసి కన్నీళ్లు..పార్లమెంట్‌లోనూ అదే తీరు!కేవలం శాసనసభలకే పరిమితం కాకుండా పార్లమెంట్ సభ్యులపై కూడా భారీ స్థాయిలో కేసులు పెండింగ్‌లో

కాకినాడ: పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కీకల పరిణామం చోటుచేసుకుంది. నూకరాజు వియ్యంకుడు భాస్కర్‌రెడ్డి ఫిర్యాదుతో సాధిక్‌ఖాన్‌పై మరో కేసు నమోదైంది. జులై 2న తన కుమారుడు జగదీశ్‌రెడ్డికి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి సాధిక్ హత్య చేశాడని భాస్కర్‌రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. హత్య కేసులో సాధిక్తో పాటు మరో వ్యక్తి పాత్ర ఉన్నట్టు అనుమానం వ్యక్తంచేశారు. సాధిక్ కారణంగానే నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకుందని ఇప్పటికే కేసు నమోదైంది. నిన్న మనవడు కార్తికేయరెడ్డితో మాట్లాడగా విషయం తెలిసిందని భాస్కర్‌రెడ్డి పోలీసులకు తెలిపారు. నూకరాజు కుమార్తె సౌజన్య బండిలో మూడు కవర్లను పోలీసులు గుర్తించారు. జగదీశ్‌రెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సౌజన్య రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘‘సాధిక్ ఖాన్ నన్ను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేశాడు. నా భర్తను సాధిక్ హత్య చేశాడు. నా ఆస్తి, ఫోన్, ఎస్బీఐ లాకర్ వివరాలు తీసుకున్నాడు. మతం మారాలని ఒత్తిడి చేశాడు. నా కుటుంబాన్ని చంపుతానని బెదిరించాడు. సాధిక్ వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నాం’’ అని లేఖలో పేర్కొన్నట్టు సమాచారం. కేసు నమోదు చేసిన సర్పవరం పోలీసులు సాధిక్‌ఖాన్ కోసం ఇప్పటికే గాలిస్తున్నారు. మరోవైపు.. నిన్న గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఏఈ నూకరాజు భార్య మీనా, కుమార్తె సౌజన్య కోసం ఎస్డీఎఆర్ఎఫ్ బృందం, పోలీసులు, గజ ఈతగాళ్లు గాలింపు కొనసాగిస్తున్నారు. కాకినాడ అశోకనగర్లో నివాసముంటున్న తిల్లపూడి నూకరాజు (61) పిఠాపురం మండలంలో పంచాయతీరాజ్ ఏఈగా గత పదేళ్లుగా విధులు నిర్వరిస్తున్నారు. వచ్చే జనవరిలో ఆయన ఉద్యోగ విరమణ చేయాల్సిఉంది. ఆదివారం అర్ధరాత్రి భార్య మీనా (58), కుమార్తె కోవూరి సౌజన్య (38), మనుమడు రియాన్ష్ కార్తికేయరెడ్డి(10)తో కలిసి కారులో రాజమహేంద్రవరం వచ్చారు. రోడ్డు కం రైలు వంతెనపై కారు నిలిపి నలుగురూ గోదావరిలో దూకేశారు. స్థానికులు పోలీసులకు సమాచారమివ్వడంతో వారు వెంటనే సమీప లంకల్లోని మత్స్యకారులను రప్పించి గాలింపు చర్యలు

భారతదేశంలోని మధ్యతరగతి ప్రజలు భవిష్యత్తులో తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందంటూ ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ 'మిరే అసెట్ మేనేజ్ మెంట్ మేనేజర్స్' సీఈవో స్వరూప్ మొహంతి హెచ్చరించారు. పెరుగుతున్న వైద్య ఖర్చులు, దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలు లేకపోవడం వల్ల దేశంలో 'రిటైర్మెంట్ టైమ్ బాంబ్' పేలే పరిస్థితి కనిపిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జీవిత చరమాంకంలో సరైన ఆర్థిక భద్రత లేకపోతే మధ్యతరగతి కుటుంబాలు కోలుకోలేని దెబ్బతింటాయని ఆయన పేర్కొన్నారు. మధ్యతరగతి ప్రజలు చేసే అతిపెద్ద పొరపాటు తగినంత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోవడమేనని స్వరూప్ మొహంతి స్పష్టం చేశారు. మారుతున్న కాలంతో పాటు మానవ ఆయుర్దాయం పెరుగుతున్నప్పటికీ, దానికి తగినట్లుగా విశ్రాంతి నిధిని సమకూర్చుకోవడంలో ప్రజలు తీవ్రంగా వెనుకబడుతున్నారని వివరించారు. వయసు పెరిగే కొద్దీ ఆకస్మికంగా వచ్చే వైద్య ఖర్చులు, జీవితకాలం దాచుకున్న పొదుపు మొత్తాన్ని ఒక్కసారిగా కరిగించేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల నుంచి బయటపడటానికి కేవలం సంప్రదాయ పద్ధతుల్లో పొదుపు చేయడం లేదా షేర్ మార్కెట్లపై మాత్రమే ఆధారపడటం సరిపోదని ఆయన సూచించారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవనశైలి ఖర్చులను తట్టుకోవాలంటే చిన్న వయస్సు నుంచే మ్యూచువల్ ఫండ్స్, బంగారం వంటి విభిన్న సాధనాల్లో క్రమశిక్షణతో కూడిన పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. సరైన ప్లానింగ్ లేకపోతే రిటైర్మెంట్ జీవితం భారంగా మారుతుందని హెచ్చరించారు

ఇంటర్నెట్ డెస్క్: ఇరాక్‌లోని కుర్దిస్థాన్(Kurdistan) ప్రాంతీయ ప్రభుత్వ ప్రధాని మస్రూర్ బర్జానీ (PM Barzani) కార్యాలయంపై సోమవారం రాత్రి డ్రోన్ల దాడి జరిగింది. ఈ దాడులకు ఇరానే కారణమని కుర్దిస్థాన్ భద్రతా సంస్థ ఆరోపించింది. ప్రధాని కార్యాలయంతో పాటు కుర్దిస్థాన్ భద్రత, నిఘా సంస్థ ‘పరాస్తిన్’ అధిపతి నివాసాన్ని కూడా డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయని తెలిపింది. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొంది. కీలక ప్రభుత్వ, భద్రతా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగించే పరిణామమని తెలిపింది. కుర్దిస్థాన్ ప్రధాని మస్రూర్ బర్జానీ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, చట్టవిరుద్ధమైన చర్య అని పేర్కొన్నారు. ఈ తరహా చర్యలు ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచుతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కుర్దిస్థాన్ ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీసేందుకు ఇరాన్ చేసిన తీవ్రమైన చర్య అని ఆరోపించారు. కుర్దిస్థాన్ ఆరోపణలను ఇరాన్(iran) ఖండించింది. ఈ దాడులు తాము చేయలేదని స్పష్టం చేసింది. ఇరాన్‌పై నిందలు మోపేందుకు ఇతర శక్తులు కావాలనే ఇలాంటి చర్యలకు పాల్పడి ఉండొచ్చని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ (Abbas Araghchi) అనుమానం వ్యక్తం చేశారు. ఇరాక్(Iraq)లోని కుర్దిస్థాన్ ప్రాంతం ఇరాన్‌కు సమీపంలో ఉండటంతో గత కొంతకాలంగా ఇరు పక్షాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న సంస్థలు, బలగాలకు కుర్దిస్థాన్‌లో స్థావరాలు ఉన్నాయన్న ఆరోపణలూ ఉన్నాయి. తాజా ఘటనతో కుర్దిస్థాన్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ

గోదావరిలో దూకిన ఏఈ, భార్య, కుమార్తె, మనుమడు మనుమడిని రక్షించిన జాలర్లు ∙ఏఈ మృతదేహం లభ్యం.. భార్య, కుమార్తె గల్లంతు షేక్ సాధిక్ ఖాన్ అనే వ్యక్తి వేధింపులే కారణమని సూసైడ్ నోట్లో ఏఈ వెల్లడి కంబాలచెరువు (రాజమహేంద్రవరం): చక్కగా సాగిపోయే కుటుంబంలో అల్లుడి మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ తర్వాత ఓ వ్యక్తి ఆ కుటుంబం వ్యవహారాల్లోకి ప్రవేశించడంతో కల్లోలమే రేగింది. ఆ కుటుంబాన్ని బలి తీసుకుంది. ఈ ఘటనలో పంచాయతీరాజ్ శాఖలో ఏఈ, ఆయన భార్య, కుమార్తె, మనుమడు ఆదివారం అర్ధరాత్రి రాజమహేంద్రవరం రైల్ కం రోడ్డు బ్రిడ్జి పైనుంచి గోదావరిలో దూకేశారు. ఏఈ తెల్లపూడి నాగరాజు (60) మృతదేహం సోమవారం సాయంత్రం లభ్యమైంది. ఆయన భార్య మీనా (58), కుమార్తె సౌజన్య (32) గల్లంతవగా, ఆయన మనుమడు కార్తికేయ రెడ్డి సురక్షితంగా బయటపడ్డాడు. చనిపోయే ముందు ఆ ఏఈ రాసిన మరణ వాంగ్మూలం (లేఖ) పోలీసులకు లభ్యమైంది. షేక్ సాధిక్ ఖాన్ వేధింపులు తాళలేకే.. ఏఈ రాసిన లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం.. కాకినాడకు చెందిన తెల్లపూడి నాగరాజు (60) పిఠాపురంలో పంచాయతీరాజ్ శాఖ ఏఈగా పనిచేస్తున్నారు. ఆయన కుమార్తె సౌజన్యకు జగదీశ్వరరావుతో వివాహమైంది. దీంతో వీరి కుటుంబం కాకినాడలో ఉంటున్నారు. సౌజన్య తన కుమారుడు కార్తికేయ రెడ్డిని కాకినాడలో రైఫిల్ షూటింగ్ అకాడెమీ నడుపుతున్న షేక్ సాధిక్ ఖాన్ వద్ద రైఫిల్ షూటింగ్ శిక్షణలో చేర్పించింది. కాకినాడలోని ఒక ప్రైవేట్ స్కూలులో ఐదో తరగతి చదువుతున్న ఆ బాలుడు ఈత కూడా నేర్చుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జగదీశ్వరరావు అనారోగ్యంతో మరణించడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగింది. అప్పటి నుంచి సౌజన్యకు అండగా ఉంటానని షేక్ సాధిక్ ఖాన్ చెప్పుకొస్తున్నాడు. దీనికి ఏఈ నాగరాజు ఒప్పుకోలేదు. దీంతో సౌజన్యను సాధిక్ ఖాన్ వేధించడం ప్రారంభించాడు. నాగరాజును, కార్తికేయ రెడ్డిని చంపుతానని బెదిరించి ఆమెను లొంగదీసుకున్నాడు. తర్వాత ఆమె

Pithapuram Tragedy: రాజమహేంద్రవరంలో ఆదివారం అర్ధరాత్రి తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పిఠాపురానికి చెందిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు (60), ఆయన భార్య మీనా (58), కుమార్తె సౌజన్య (34) కుటుంబసమేతంగా రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిపై నుంచి గోదావరి నదిలోకి దూకేశారు. ఈ ఘటనలో ముగ్గురూ నీటిలో గల్లంతవ్వగా, ఈత రావడంతో నూకరాజు మనవడు కార్తీక్ రెడ్డి ప్రాణాలతో బయటపడ్డాడు. మత్స్యకారులు బాలుడిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చి ఆసుపత్రికి తరలించారు. షేక్ షాదీ ఖాన్ అనే వ్యక్తి వేధింపులు, మోసాల వల్లే తాము ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంటున్నట్లు నూకరాజు డెత్ నోట్లో పేర్కొన్నారు. తన కుమార్తెకు సహాయం చేస్తానని నమ్మించి డబ్బులు, బ్యాంకు ఖాతాలు, విలువైన వస్తువులను షాదీ ఖాన్ తన ఆధీనంలోకి తీసుకున్నాడని ఆరోపించారు. జూలైలోనే సౌజన్య భర్త మరణించిన విషయాన్ని కూడా లేఖలో ప్రస్తావిస్తూ, షాదీ ఖాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. సమాచారం అందుకున్న రాజమహేంద్రవరం(Pithapuram Tragedy) టూ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. గోదావరిలో గల్లంతైన నూకరాజు, మీనా, సౌజన్యా ఆచూకీ కోసం ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది మరియు గజ ఈతగాళ్లతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నారు

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పిఠాపురానికి చెందిన పంచాయతీ రాజ్ ఏఈ నూకరాజు తన కుటుంబం సహా గోదావరి నదిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు గల్లంతు కాగా, ఒక బాలుడిని స్థానికులు రక్షించారు.వివరాల్లోకి వెళితే.. పిఠాపురంలో ఏఈగా పనిచేస్తున్న నూకరాజు (60), ఆయన భార్య మీనా (58), కుమార్తె సౌజన్య (34), మనవడు కలిసి నిన్న అర్ధరాత్రి రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకారు. ఇది గమనించిన స్థానిక మత్స్యకారులు వెంటనే స్పందించి, నీటిలో కొట్టుకుపోతున్న బాలుడిని కాపాడారు. అయితే, నూకరాజు, మీనా, సౌజన్య నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు.త్వరలో ఉద్యోగ విరమణ చేయనున్న నూకరాజు, కుటుంబంతో కలిసి ఇంత తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. గల్లంతైన ముగ్గురి ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక అధికారులు గోదావరిలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పిఠాపురానికి చెందిన పంచాయతీ రాజ్ ఏఈ కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. అయితే, ఈ ప్రమాదంలో కుటుంబంలోని నలుగురు గోదావరిలో దూకగా.. స్థానికంగా ఉండే మత్స్యకారులు ఒక్కర్ని మాత్రమే కాపడగా, మిగతా ముగ్గురు గల్లంతయ్యారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. పిఠాపురానికి చెందిన పంచాయతీ రాజ్ ఏఈ నూకరాజు కుటుంబ సభ్యులు రాజమండ్రి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకారు. నూకరాలు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు కలిసి గోదావరిలో దూకినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఘటనలో 60 ఏళ్ల నూకరాజు, 58 సంవత్సరాల ఆయన భార్య మీనా, 34 సంవత్సరాల కుమార్తె సౌజన్య గోదావరిలో గల్లంతయ్యారు. నూకరాజు మనవడిని స్థానికంగా ఉండే మత్స్యకారులు గుర్తించి ప్రాణాలతో కాపాడారు.READ ALSO టాస్క్‌లు పూర్తి చేసి రోజుకు రూ.వేలల్లో సంపాదిస్తున్నారా? అయితే మీరు సైబర్ స్కామ్‌లో చిక్కుకున్నట్లే! బీ అలెర్ట్.. అస్సలు నమ్మొద్దురిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న పంచాయతీ రాజ్ ఏఈ నూకరాజు 60 సంవత్సరాల వయస్సులో కుటుంబంతో సహా ఇలా చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు ఈ ఘటన జరగడానికి కారణాలు ఏంటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం గల్లంతయిన ఈ ముగ్గురి కోసం గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు. పెళ్లికి వెళ్లొస్తూ నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు..పెళ్లి వేడుకకు వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థులు తిరుగు ప్రయాణంలో గోదావరిలో గల్లంతయ్యారు. ఆచంట మండలం వల్లూరుతోటకు చెందిన మట్టా సంతోష్, అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం మోరి, మోరిపోడు, శృంగవరప్పాడుకు చెందిన పోతుల లక్ష్మీభాను వికాస్ (18), నాగిరెడ్డి దుస్వంత్ సాయి (18), నాగబత్తుల తేజసాయి సూర్య (19), చెరుకూరి రాజా రాంచరణ్ (16), వీరమల్లు సాయి వెంకట కిరణ్ (18), మట్టా సంతోష్ శనివారం రాత్రి పెరవలిలో జరిగిన స్నేహితుడి

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో ఉన్న ప్రత్యేక స్నేహం కోసం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన అడుగు వేశారు. దక్షిణ కొరియాతో కలసి అమెరికా నిర్వహించాల్సిన సంయుక్త సైనిక విన్యాసాలను భారీగా కుదించాలని తన యుద్ధ కార్యదర్శి పీట్ హెగ్సెత్ను ఆదేశించారు. ఆగస్టు 17 నుంచి 27 వరకు పది రోజుల పాటు ఉల్చీ ఫ్రీడమ్ షీల్డ్ పేరిట ఈ డ్రోన్, సైబర్, జీపీఎస్ విరుద్ధ విన్యాసాలు జరగాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో ఈ విన్యాసాలను రద్దు చేయడం సాధ్యం కాదు కాబట్టి, వాటి పరిమాణాన్ని, విస్తృతిని గణనీయంగా తగ్గించాలని స్పష్టం చేశారు. దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడి భార్యకు ఏడేళ్ల జైలు శిక్ష!అది దండగ మారీ ఖర్చు.. కిమ్‌కు కోపం తెప్పించడమే!తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు. దక్షిణ కొరియాతో కలసి భారీ సైనిక విన్యాసాలు నిర్వహించడానికి గతంలో అమెరికా అంగీకరించడం తనకు ఏమాత్రం నచ్చలేదని పేర్కొన్నారు. ఈ డ్రిల్స్ వల్ల కోట్ల కొద్దీ డాలర్ల ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరవుతోందని మండిపడ్డారు. అంతేకాకుండా, అనవసరంగా ఉత్తర కొరియాకు శత్రుత్వ సంకేతాలు పంపడం ఏమాత్రం సరికాదని వ్యాఖ్యానించారు. తన పాలనా కాలంలో కిమ్ జోంగ్ ఉన్ ఎంతో మర్యాదగా, ఎలాంటి బెదిరింపులు లేకుండా నడుచుకున్నారని ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం.కుక్క మాంసంతో సూప్.. వడ దెబ్బకి విరుగుడు? కిమ్ సంచలన ఆదేశాలుఇరాన్ అణు రగడ.. దక్షిణ కొరియా నో!ఇదిలా ఉంటే, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మైంగ్తో ఇటీవల జరిగిన సంభాషణను కూడా ట్రంప్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇరాన్ అణు నిరోధక చర్యల్లో (డీన్యూక్లియరైజేషన్) అమెరికాతో చేతులు కలపాల్సిందిగా దక్షిణ కొరియాను కోరానని, అయితే వారు అందుకు నిరాకరించారని ట్రంప్ తెలిపారు. మరోవైపు, ఈ విన్యాసాల వల్ల కొరియా ద్వీపకల్పంలో తీవ్ర ఉద్రిక్తతలు

చెన్నై సూపర్ కింగ్స్‌కు 18 ఏళ్లపాటు కోచ్‌గా ఉన్న స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇటీవల ఆ బంధానికి ముగింపు పలికిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సీఎస్కేకు కొత్త హెడ్‌గా ఎవరొస్తారనే దానిపై క్రికెట్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో.. స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీల్లో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కీలక మార్పులకు సిద్ధమైంది. ఇటీవలే 18 సీజన్ల పాటు హెడ్ కోచ్‌గా వ్యవహరించిన స్టీఫెన్ ఫ్లెమింగ్ (Stephen Fleming) ఆ బాధ్యతల నుంచి వైదొలగాడు. దీంతో సీఎస్కే కొత్త కోచ్ ఎంపికపై ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ను 2019 వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలిపిన మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, అలాగే న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ బ్రెండన్ మెకల్లమ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సీఎస్కే హెడ్ కోచ్ అంశంపై ఇటీవల భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ.. ఇయాన్ మోర్గాన్ కొత్త హెడ్ కోచ్ రేసులో ఉన్నారని, దీనిపై ఇప్పటికే అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయని తెలిపాడు. అయితే తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్, సీఎస్కే మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ (Krishnamachari Srikkanth) ఈ వాదనను తీవ్రంగా వ్యతిరేకించాడు. తన యూట్యూబ్ ఛానల్ వేదికగా మాట్లాడుతూ.. మోర్గాన్ గొప్ప ప్లేయరే అయినప్పటికీ, కోచ్‌గా అతడ్ని తాను అంగీకరించబోనని స్పష్టం చేశాడు. కేకేఆర్ (KKR) కెప్టెన్‌గా మోర్గాన్ ప్రత్యేకించి ఏమీ సాధించలేదని, అతడు కేవలం కామెంటరీకే పరిమితం కావడం మంచిదని అభిప్రాయపడ్డాడు. ఇదే సమయంలో బ్రెండన్ మెకల్లమ్ నియామకాన్ని కూడా క్రిష్ వ్యతిరేకించాడు. బయటి వ్యక్తుల కోసం వెతకడానికి బదులుగా, సీఎస్కేను పూర్తిగా అర్థం చేసుకున్న 'మిస్టర్ క్రికెట్' మైకేల్ హస్సీ (Michael Hussey) అయితేనే సరైన హెడ్ కోచ్ అవుతారని శ్రీకాంత్ సూచించాడు. ఇప్పటికే హస్సీ సీఎస్కే జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా సేవలు అందించిన అనుభవం ఉండటంతో, అతడ్ని నేరుగా

ప్రపంచవ్యాప్తంగా చాలా విమానాలు తెల్లరంగులోనే ఉంటాయి. అసలు ఎందుకు విమానాలు తెల్ల రంగులోనే ఉంటాయి? దీని వెనుక కారణాలు ఏమిటి? అనేది ఆసక్తి కలిగించే అంశం. తెల్ల రంగులోనే కనిపిస్తాయి, అవి కేవలం అందం కోసం మాత్రమే కాదు, విమానాలకు తెల్ల పెయింట్ వేయడం వల్ల అనేక కారణాలు ఉన్నాయి. దీని వెనుక శాస్త్రీయ ఆర్థిక భద్రత కారణాలు ఉన్నాయని చెబుతారు. మరి అవేమిటో తెలుసుకుందాం.విమానాలకు తెల్లరంగు వేయటం వెనుక తెల్ల రంగు సూర్యరశ్మిని ప్రతిబింబిస్తుంది. ఫలితంగా ఇది ఎక్కువ వేడిని గ్రహించకుండా, వేడిని తగ్గిస్తుంది. నలుపు కానీ ఇతర ముదురు రంగులు కానీ ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. విమానం ఆకాశంలో ప్రయాణం చేస్తున్న సమయంలో సూర్యుడు వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. తెల్ల పెయింట్ వేయడం వల్ల విమానం లోపల ఉష్ణోగ్రత తగ్గి ఎయిర్ కండిషనింగ్ సిస్టం పైన భారం తగ్గుతుంది. దీనివల్ల ఇంధన వినియోగం ఆదా అవుతుంది.భద్రతకు తెలుపు రంగు బెస్ట్ ఎలాగంటేమరొక కారణం తెలుపు రంగు మాత్రమే విమానం బాడీ పైన గీతలు, తుప్పు, పగుళ్లు, ఆయిల్ లీకేజ్ వంటివి ఈజీగా గుర్తించటానికి వీలవుతుంది. ముదురు రంగుల పైన అవి అంత త్వరగా కనిపించవు కాబట్టి భద్రత దృష్ట్యా కూడా విమానాలకు తెల్ల రంగుని వేస్తారు. సహజంగా విమానం బరువుగా ఉంటుంది. అటువంటి విమానానికి బరువైన పెయింట్లు వేయకుండా తక్కువ పిగ్మెంట్ తో ఉండే తెల్ల రంగు వేస్తే బరువు తగ్గి ఫ్యూయల్ ఆదా అవుతుంది.తెల్ల రంగు విమానాలే సేల్, రీసేల్ కూ వాల్యూ విమానానికి సంబంధించి ఒక కిలో బరువు తగ్గినా భారీగానే ఇంధనం ఆదా అవుతుందని ఒక అంచనా. అంతేకాదు తెల్ల పెయింట్ సులభంగా లభిస్తుంది, నిర్వహణఖర్చు కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి దీనినే ఎక్కువ వినియోగిస్తారు. ఇక విమానాలను కొనుగోలు చేసేటప్పుడు, అమ్మేటప్పుడు తెల్లరంగు న్యూట్రల్ రంగు కాబట్టి తెల్లరంగు ఉన్న వాటిని ఎక్కువగా కొంటారు

దేశవ్యాప్తంగా 80వ భారత స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి మారుమూల గ్రామం వరకు పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముంబై, ఆగస్టు 16: దేశవ్యాప్తంగా 80వ భారత స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి మారుమూల గ్రామం వరకు పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను ఎవరికి వారు ప్రత్యేక రీతిలో జరుపుకున్నారు. భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి తనదైన శైలిలో ఈ వేడుకలు నిర్వహించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అవిషాగ్ హెఫర్.. ముంబైలోని ఇజ్రాయెల్ కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో డిప్యూటీ కౌన్సిల్ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆగస్టు 15వ తేదీన ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ (సీఎస్ఎంటీ)కు ఆమె చేరుకున్నారు. జాతీయ జెండాలను రైల్వే స్టేషన్‌లోని ప్రయాణికులకు అవిషాగ్ హెఫర్ అందజేశారు. ఆమె తెల్ల చొక్కా, నల్ల స్కర్ట్ ధరించారు. చేతిలో భారీగా జాతీయ జెండాలు పట్టుకున్నారు. ఆమె స్టేషన్లో తిరుగుతూ.. చిరునవ్వుతో ప్రయాణికులకు ఆ జెండాలను అందిస్తున్నారు. ఆ వీడియోను ట్విట్టర్ పోస్ట్ చేశారు. హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా ముంబైలోని ఇజ్రాయెల్ డిప్యూటీ కాన్సుల్ జనరల్ అవిషాగ్ హెఫర్.. ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ స్టేషన్లో భారత త్రివర్ణ పతాకాన్ని పంపిణీ చేసి.. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారని ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. భారత్, ఇజ్రాయెల్ మధ్య స్నేహం ఎల్లప్పుడూ బలంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ మనకు అత్యంత సన్నిహిత మిత్ర దేశం అని పేర్కొన్నారు. చాక్లెట్ లాక్కుందని తల్లిపై పోలీసులకు బాలుడి ఫిర్యాదు.. వీడియో వైరల్ మేకను తినేందుకు వచ్చిన కొండచిలువ.. మద్యం మత్తులో యువకుడు ఏం చేశాడంటే

గల్ఫ్ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగేలా ఇరాన్-ఖతార్ మధ్య పైలట్ల వివాదం తెరపైకి వచ్చింది. ముగ్గురు ఇరాన్ యుద్ధ విమాన పైలట్లను ఖతార్ బలగాలు సజీవంగా పట్టుకున్నాయని ఇరాన్ వర్గాలు ప్రకటించగా ఖతార్ మాత్రం ఆ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ IRNA కథనం ప్రకారం, మార్చిలో ఖతార్‌లోని ఒక సైనిక స్థావరంపై దాడి చేసే మిషన్‌లో పాల్గొన్న మూడు యుద్ధ విమానాలు దెబ్బతిన్నాయి. వాటిలోని పైలట్లు విమానాల నుంచి బయటకు దూకిన అనంతరం ఖతార్ బలగాలకు చిక్కారని ఇరాన్ సైనిక అధికారి పేర్కొన్నారు. ఈ ముగ్గురి ఆచూకీ కోసం అంతర్జాతీయ రెడ్‌క్రాస్ సహాయం కోరినట్లు ఇరాన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ తెలిపింది. అయితే ఖతర్ కథనం పూర్తిగా భిన్నంగా ఉంది. ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ప్రకారం, ఆ ఇరాన్ పైలట్లు ఖతార్ గగనతలంలోకి ప్రవేశించారు. వారిని సంప్రదించేందుకు అధికారులు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ స్పందన రాలేదని తెలిపారు. అనంతరం చేపట్టిన గాలింపు, రక్షణ చర్యల్లో ఒక పైలట్ మృతదేహాన్ని మాత్రమే గుర్తించినట్లు ఖతార్ వెల్లడించింది. అంతేకాదు, ఆ మృతదేహాన్ని ఇరాన్‌కు అప్పగించే అంశంపై కూడా ఖతార్ సంప్రదింపులు జరిపిందని తెలిపింది. ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను పరిశీలించేందుకు ఇరాన్‌ను ఆహ్వానించినప్పటికీ, ఇప్పటివరకు స్పందన రాలేదని ఆరోపించింది. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. ముగ్గురు పైలట్లు సజీవంగా ఖతార్ అదుపులో ఉన్నారా? లేక ఒక పైలట్ మాత్రమే మరణించాడా?. ఈ వివాదం కేవలం ముగ్గురు సైనికుల ఆచూకీకి సంబంధించినది కాదు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతల్లో ఉన్న ప్రాంతంలో ఇరాన్, ఖతార్ మధ్య ఈ ఆరోపణలు కొత్త రాజకీయ, సైనిక పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. ఇరాన్‌పై జరిగిన దాడులకు ప్రతిస్పందనగా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలను కూడా ఇరాన్ లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గల్ఫ్ దేశాల్లోని స్థావరాలను అమెరికా, ఇజ్రాయెల్ తమ

గల్ఫ్ దేశాలలోని ప్రవాస భారతీయులు 80వ భారత స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా మార్గదర్శకాలను అనుసరించి భారతీయ ఎంబసీల వేడుకల్లో పూర్తి ఆరు చరణాల వందేమాతర గేయాన్ని ఆలపించారు. ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: గల్ఫ్ దేశాలలోని ప్రవాస భారతీయులు 80వ భారత స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా మార్గదర్శకాలను అనుసరించి భారతీయ ఎంబసీల వేడుకల్లో పూర్తి ఆరు చరణాల వందేమాతర గేయాన్ని ఆలపించారు. సౌదీ అరేబియా, యూఏఈ తదితర దేశాల్లో జాతీయ జెండా ఎగురవేసిన సందర్భంగా భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు కూడా చేశారు. గతంలో ఎప్పుడూ లేని ఈసారి దుబాయిలో భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ‘హర్ ఘర్ తిరంగా’, ‘భారత్ కో జానీయే’ కార్యక్రమాలకు కూడా విదేశాల్లో ఆశాజనకమైన స్పందన లభించింది. కాలమానం ప్రకారం సూర్యపథ్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఒక దేశం తర్వాత మరో దేశంలోని ఎంబసీలు క్రమంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే వినూత్న కార్యక్రమం జరిగింది. సమయ పీఠిక ప్రకారం సెంట్రల్ ఆసియాలోని ఉజ్బెకిస్థాన్ మొదలు గల్ఫ్ లోని ఒమాన్, సౌదీ అరేబియాల్లో.. ఆపై ఇథియోపియాలో వేడుకలు జరిగాయి. దుబాయిలో నూతన కాన్సుల్ జనరల్ డాక్టర్ ఇ. విష్ణువర్ధన్ రెడ్డి మువ్వన్నెల జెండాను ఎగురవేసి రాష్ట్రపతి ప్రసంగ పాఠాన్ని చదివి వినిపించారు. పాస్‌పోర్టుల జారీలో గత కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులను పరిష్కరించినట్లుగా ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రవాసీయుల సంక్షేమం, భారతీయ వాణిజ్య సంబంధాల బలోపేతానికి తాము ప్రాధాన్యం ఇస్తున్నామని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా నూతనంగా పదవీ భాద్యతలను స్వీకరించిన విష్ణువర్ధన్ రెడ్డిని కలువడానికి భారతీయ ప్రముఖులు ఆసక్తి ప్రదర్శించారు. అనేక మంది తెలుగు ప్రవాసీ ప్రముఖులు కూడా ఆయనను వేదికపై కలుసుకున్నారు. తెలుగు రసమయి పక్షాన యస్వీరెడ్డి, తెలుగు అసోసియేషన్ పక్షాన మసీయోద్దీన్, దినేష్, జాఫర్, భీం, తౌఫీఖ్, సౌజన్య

ఇంటర్నెట్ డెస్క్: హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)పై పూర్తి నియంత్రణ అమెరికాదేనని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇరాన్ (Iran) ఖండించింది. జలసంధి ఎప్పటికీ తమ నియంత్రణలోనే ఉంటుందని.. దానిని ఎవరూ ఆక్రమించుకోలేరని పేర్కొంది. హర్మూజ్‌ను మూసి ఉంచాలా? తెరవాలా? అనేది తమ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ (Kazem Gharibabadi) తెలిపారు. యుద్ధ నౌకల మోహరింపు ద్వారా జలసంధిని స్వాధీనం చేసుకోలేరని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. అగ్రరాజ్యం తన భ్రమలను విడిచిపెట్టి.. ఓటమిని అంగీకరించే వరకు హర్మూజ్‌పై ఇరాన్ దిగ్బంధనాన్ని అమలు చేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. తాము బెదిరింపులకు భయపడబోమని.. సైనిక ప్రదర్శనలకు లొంగబోమని స్పష్టం చేశారు. హర్మూజ్ ద్వారా నౌకలు స్వేచ్ఛగా ప్రయాణిస్తున్నాయని అమెరికా చెబుతున్న మాటల్లో నిజం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ (Abbas Araghchi) పేర్కొన్నారు. గతంలో మాదిరిగానే.. జలసంధి పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందన్నారు. తమ సాయుధ దళాల అనుమతి లేకుండా ఏ వాణిజ్య నౌక కూడా ఈ మార్గంలో ప్రయాణించబోదని స్పష్టం చేశారు. హర్మూజ్ విషయంలో అమెరికా తప్పుడు అంచనాలు వేస్తోందన్నారు. యుద్ధంలో ఇరాన్‌ను ఓడిస్తామని.. ఆ దేశం ఓటమిని చవిచూసిన అనంతరం హర్మూజ్‌ను అమెరికా భూభాగంగా ప్రకటిస్తామని శనివారం జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ (US President Trump) పేర్కొన్నారు. ఆ దేశం వద్ద అణ్వాయుధ సామర్థ్యం ఉండడం ఎప్పటికైనా ప్రమాదమేనని.. అందుకే దానిని నాశనం చేయాలనే లక్ష్యంతో యుద్ధానికి దిగినట్లు వెల్లడించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో

భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ భారతీయులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపాడు. భారత్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నాడు. “నా భారతీయ స్నేహితులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీ దేశం అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడి ప్రజలంటే నాకు ఎంతో ఇష్టం. జైహింద్!” అంటూ పోస్ట్ చేశాడు. భారత్‌తో తనకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తుచేశాడు.భారత క్రికెట్‌తో పీటర్సన్‌కు సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆటగాడిగా ఉన్న సమయంలోనే భారత్‌లో క్రికెట్ ఆడిన కేపీ, ముఖ్యంగా ఐపీఎల్లో పాల్గొని భారత క్రికెట్ అభిమానులకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత వ్యాఖ్యాతగా, క్రికెట్ విశ్లేషకుడిగా కూడా భారత్‌తో తన అనుబంధాన్ని కొనసాగించాడు. భారతీయుల ఆతిథ్యం, అభిమానాన్ని ఎన్నో సందర్భాల్లో ఆస్వాదించిన పీటర్సన్.. ఈసారి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షల్లో అదే అభిమానాన్ని చాటుకున్నాడు.భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పలువురు క్రీడాకారులు, క్రికెటర్లు భారత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అయితే పీటర్సన్ సందేశం మాత్రం దేశంపై తనకున్న వ్యక్తిగత అభిమానాన్ని ప్రధానంగా చూపించింది. భారతీయ ప్రజలతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ అతడు చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా నిలిచింది.ఈ సందర్భంగా దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ కూడా భారతీయులకు శుభాకాంక్షలు తెలిపాడు. భారత్ తనకు ఎప్పుడూ ప్రత్యేకమైన దేశమని, ఇక్కడ ఆడిన రోజులు మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోయాయని చెప్పాడు. భారతీయుల ఆతిథ్యం, సంస్కృతి, క్రికెట్‌పై ఉన్న అపారమైన అభిమానం తనను ఎప్పటికీ ఆకట్టుకుంటాయని పేర్కొన్నాడు. భారత్

UAE Iran Deal 2026 : అమెరికా – ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు బిగ్ షాకిస్తూ.. ఇరాన్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా ఇరాన్ కు విమానాలతోపాటు.. భారీగా నగదు.. టన్నుల కొద్దీ బంగారంను తరలించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అమెరికా సైన్యం ఇరాన్‌పై మిసైళ్ల వర్షం కురిపిస్తోంది. ఇరాన్ సైతం అందుకు తగ్గట్టుగానే దాడులతో దీటుగా సమాధానం ఇస్తోంది. అమెరి ఇరాన్‌పై దాడులు చేస్తుంటే.. ఇరాన్ యూఏఈలోని అమెరికా స్థావరాలు, కీలక ప్రాంతాలపై మిసైళ్ల వర్షం కురిపిస్తోంది. అయితే, ఇటీవల అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ.. అది అమలు కావడం లేదు. దీంతో ఇరాన్ గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తోంది. ఇక మీదట తాము ఇలా టార్గెట్ కాకూడదని యోచిస్తున్న యూఏఈ ఇరాన్‌ను బుజ్జగించే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అమెరికా ఆంక్షల కారణంగా పలు దేశాల్లోని బ్యాంకుల వద్ద ఇరాన్ ఆస్తులు ఫ్రీజ్ అయ్యి ఉన్నాయి. అలా తమ వద్ద ఉన్న ఇరాన్ నిధులను విడుదల చేసి యుద్ధానికి దూరంగా ఉండాలని యూఏఈ నిర్ణయించుకున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇరాన్ దాడుల నుంచి తప్పించుకునేందుకు ఈనెల 11, 12 తేదీల్లో ఆ దేశానికి విమానాలతోపాటు డబ్బులు, భారీగా బంగారం తరలించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా యూఏఈలోని కొన్ని సంస్థల ద్వారా ఇరాన్ విమానయాన సంస్థలకు ఇప్పటికే ఉపయోగించిన దాదాపు 15 సెకండ్ హ్యాండ్ విమానాలను విక్రయించేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. వీటిలో సెకండ్ హ్యాండ్ Saudia Boeing 777, అలాగే కొన్ని Boeing 737, Airbus A320 విమానాలు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇప్పటికే రెండు Airbus A320 విమానాలు ఇరాన్‌కు చేరినట్లు పేర్కొంది. అవికాక మరో 14 ప్యాసింజర్ విమానాలను

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వేల కోట్ల రూపాయల డ్రగ్స్ కేసులో మోస్ట్ వాంటెడ్ నిందితుడు, కీలక సూత్రధారి వీరేందర్ సింగ్ బసోయాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు భారత్‌కు రప్పించారు. యూఏఈలో తలదాచుకుంటున్న అతడిని అక్కడ అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగస్టు 14న అధికారికంగా వెల్లడించారు.పుణెలో పట్టుబడిన సుమారు 1,837 కిలోల మెఫిడ్రోన్ (విలువ రూ.6,000 కోట్లు), ఢిల్లీలో బయటపడిన దాదాపు రూ.13,000 కోట్ల విలువైన డ్రగ్స్ కేసులతో వీరేందర్ బసోయాకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. మాదకద్రవ్యాలను విదేశాలకు అక్రమంగా తరలించడంలో అతడు కీలక సమన్వయకర్తగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2024 ఫిబ్రవరిలో పూణె డ్రగ్స్ రాకెట్ వెలుగులోకి వచ్చిన తర్వాత బసోయా భారత్ నుంచి పరారయ్యాడు.ఎన్సీబీ అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయడంతో, ఈ ఏడాది జూన్‌లో యూఏఈ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని భారత్‌కు అప్పగించగా, ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకుని అధికారికంగా అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని సరోజినీ నగర్ నివాసి అయిన బసోయా కుమారుడు రిషబ్ బసోయాను కూడా భారత్‌కు రప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం అనుసరిస్తున్న "జీరో టాలరెన్స్" విధానంలో ఇది ఒక కీలక మైలురాయి అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. డ్రగ్స్ స్మగ్లర్లు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ

అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో మోస్ట్ వాంటెడ్, డ్రగ్ మాఫియా సూత్రధారి వీరేందర్ సింగ్ బసోయాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు ఎట్టకేలకు భారత్‌కు రప్పించారు. న్యూఢిల్లీ, ఆగస్టు 14: అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో మోస్ట్ వాంటెడ్, డ్రగ్ మాఫియా సూత్రధారి వీరేందర్ సింగ్ బసోయాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు ఎట్టకేలకు భారత్‌కు రప్పించారు. రూ.13 వేల కోట్ల విలువైన డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో రెండేళ్లుగా పరారీలో ఉన్న బసోయాను ఇంటర్ పోల్ సాయంతో అదుపులోకి తీసుకుని భారత్‌కు తీసుకొచ్చారు. ఎన్సీబీ అభ్యర్థన మేరకు ఈ ఏడాది జూన్‌లో యూఏఈ పోలీసులు బసోయాను అరెస్టు చేశారు. ఎన్సీబీ అధికారులు అతన్ని యూఏఈ నుంచి భారత్‌కు తీసుకొచ్చారు. యూఏఈ బోసోయాను భారత్‌కు అప్పగించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ప్రకటించారు. డ్రగ్స్ మాఫియా విదేశాల్లో దాక్కున్నా సరే వేటాడుతామని ‘ఎక్స్’లో పేర్కొన్నారు

బంగ్లాదేశ్‌ను అడ్డాగా మార్చుకుని ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరించేందుకు అల్‌ఖైదా ప్రయత్నిస్తోందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ‘అల్‌ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్‌కాంటినెంట్’ (ఏక్యూఐఎస్) అక్కడ ఉగ్రవాద సెల్స్‌ను ఏర్పాటు చేసేందుకు చురుగ్గా కదులుతున్నట్లు వెల్లడించింది. దక్షిణాసియాలో ఉగ్ర ముప్పు మరింత తీవ్రంగా మారుతోందని పేర్కొంది.ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి సమర్పించిన 38వ నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. ఐసిస్, అల్‌ఖైదా తదితర ఉగ్ర సంస్థలపై పనిచేసే విశ్లేషణ, ఆంక్షల పర్యవేక్షణ బృందం ఈ నివేదికను రూపొందించింది.నివేదిక ప్రకారం.. ఏక్యూఐఎస్ గతంలో మాదిరిగా పెద్ద ఉగ్ర బృందాలపై ఆధారపడటం లేదు. చిన్నచిన్న, చెదురుమదురు సెల్స్‌తో పనిచేస్తోంది. లాజిస్టిక్స్, ఆర్థిక నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేసుకుంటోంది. ఈ విధానంతో ప్రాంతీయంగా తన కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది.2025 నవంబరులో ఢిల్లీలో జరిగిన ఎర్రకోట దాడికి ఏక్యూఐఎస్‌తో సంబంధం ఉన్నట్లు నివేదిక పేర్కొన్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌ను ఉగ్ర నెట్వర్క్ నిర్మాణానికి స్థావరంగా మార్చుకునే ప్రయత్నాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిణామాల తర్వాత ఉగ్ర సంస్థలకు అనుకూల వాతావరణం ఏర్పడే అవకాశాలపై ఇప్పటికే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐరాస తాజా హెచ్చరిక ప్రాధాన్యం సంతరించుకుంది.దక్షిణాసియాలో ఉగ్ర ముప్పు పెరగడానికి పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు కూడా కారణమవుతున్నాయని నివేదిక తెలిపింది. తాలిబన్ పాలనలో ఆఫ్ఘనిస్థాన్‌లో పలు ఉగ్ర సంస్థలు కార్యకలాపాలు సాగించడం పొరుగు దేశాలకు దీర్ఘకాలిక ముప్పుగా మారిందని హెచ్చరించింది

సినిమా పేరు & తారాగణం సినిమా పేరు: విశ్వనాథ్ అండ్ సన్స్ (Vishwanath and Sons) తారాగణం: సూర్య, మమిత బైజు, రాధిక శరత్‌కుమార్, రవీనా టండన్ తదితరులు దర్శకత్వం: వెంకీ అట్లూరి సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్ సినిమాటోగ్రఫీ: నిమిష్ రవి ఎడిటింగ్: నవీన్ నూలి నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య బ్యానర్స్: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ కథ : సినిమా కథలోకి వెళితే, సంజయ్ విశ్వనాథ్ (సూర్య) ఒక అత్యంత ధనవంతుడైన ఇండస్ట్రియలిస్ట్. అంతేకాదు, గతంలో ఓ ఒలింపిక్స్ పోటీలో గన్ సరిగ్గా పని చేయక తన కెరీర్ మలుపు తిరిగిన నేపథ్యం ఉన్న మాజీ షార్ప్‌షూటర్. ఇప్పుడు అతను ఒక కార్పొరేట్ ప్రపంచంలో క్రైసిస్ హ్యాండ్లర్‌గా వ్యవహరిస్తూ ఉంటాడు. జీవితంలో అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ, పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే తన తల్లితో కలిసి జీవిస్తుంటాడు. అయితే తన తల్లి కోరిక మేరకు, ఒక బిడ్డకు తండ్రి కావాలని అతను సరోగసి మార్గాన్ని ఎంచుకుంటాడు. ఈ ప్రయాణంలో అనుకోకుండా అతని జీవితంలోకి మ్యాడీ (మమిత బైజు) ప్రవేశిస్తుంది. మొదట ఒక సాధారణ పరిచయంగా మొదలైన వీరిద్దరి బంధం క్రమంగా ప్రేమగా మారుతుంది. సంజయ్ తన తల్లి కోరికను ఎలా నెరవేర్చాడు? సరోగసి ప్రయాణం ఎలాంటి మలుపులు తిరిగింది? విదేశాల నుంచి వచ్చిన మ్యాడీని సంజయ్ తన జీవిత భాగస్వామిగా అంగీకరించాడా? ఈ ప్రయాణంలో కుటుంబం ఎదుర్కొన్న భావోద్వేగాలు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్ర కథాంశం. విశ్లేషణ: డైరెక్టర్ వెంకీ అట్లూరి ఎప్పుడూ కూడా కాంటెంపరరీ అర్బన్ ఫ్యామిలీ డ్రామాలను చాలా స్టైలిష్‌గా తెరకెక్కించడంలో తనకంటూ ప్రత్యేకమైన శైలిని కలిగి ఉంటారు. ఈ చిత్రంలో కూడా ఆయన అదే ఫార్ములాను నమ్ముకుని, ఒక సున్నితమైన పాయింట్‌ను ఎంచుకుని కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. సినిమా ప్రారంభంలోనే సంజయ్ విశ్వనాథ్ పాత్రను పరిచయం చేసే

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టర్కీ నుంచి తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్న వేళ ఇజ్రాయెల్ ఇచ్చిన ఓ కీలక హెచ్చరిక అమెరికా భద్రతా వ్యవస్థను అప్రమత్తం చేసినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. ఇరాన్ నుంచి ట్రంప్ ప్రయాణిస్తున్న విమానంపై క్షిపణి దాడి జరిగే అవకాశం ఉందని ఇజ్రాయెల్ అమెరికా అధికారులను హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీంతో ట్రంప్‌ను అసలు విమానం నుంచి రహస్యంగా దించి.. మరో చిన్న మిలిటరీ జెట్‌లోకి తరలించారు. అయితే, ఇజ్రాయెల్ ఇచ్చిన హెచ్చరికపై అమెరికా నిఘా వర్గాల్లోనే అనుమానాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కొత్త చర్చ ప్రారంభమైంది. టర్కీలో జరిగిన నాటో సదస్సు ముగిసిన తర్వాత ట్రంప్ తొలుత ఎయిర్‌ఫోర్స్ వన్‌గా భావించిన విమానంలోకి ఎక్కారు. అదే విమానంలో విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్, వైట్‌హౌస్ సిబ్బంది, మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారు. అయితే ఇజ్రాయెల్ నుంచి వచ్చిన హెచ్చరిక నేపథ్యంలో సీక్రెట్ సర్వీస్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ట్రంప్‌ను ఎవరికీ తెలియకుండా మరో చిన్న సైనిక విమానంలోకి మార్చినట్లు ది వాషింగ్టన్ పోస్ట్, NPR వంటి అమెరికా మీడియా సంస్థలు వెల్లడించాయి. ఇందుకోసం క్యాటరింగ్ వాహనాన్ని ఉపయోగించినట్లు సమాచారం. దీంతో మీడియా, కొంతమంది వైట్‌హౌస్ సిబ్బందికి తెలియకుండానే ట్రంప్ మరో విమానంలో అమెరికా బయలుదేరారు. అయితే ఇజ్రాయెల్ ఇచ్చిన హెచ్చరికపై అమెరికా నిఘా వర్గాల్లోనే అనుమానాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారం ఒక్క వర్గం నుంచే వచ్చిందని, దానికి బలమైన ఆధారాలు లేవని కొందరు అమెరికా అధికారులు భావించినట్లు కథనాలు చెబుతున్నాయి. CIA విశ్లేషకులు కూడా ఈ సమాచారాన్ని అధిక విశ్వసనీయత కలిగినదిగా పరిగణించలేదని సమాచారం. టర్కీ భద్రతా సంస్థలు కూడా ఈ అంశాన్ని పరిశీలించినప్పటికీ.. అంకారాలో ట్రంప్‌ను హత్య చేసేందుకు నిర్దిష్టమైన కుట్ర ఉన్నట్లు గుర్తించలేదని అమెరికా మీడియా పేర్కొంది. అయినప్పటికీ, ట్రంప్‌పై గతంలో జరిగిన హత్యాయత్నాలను దృష్టిలో