
దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే SIIMA Awards 2026 వేడుక అట్టహాసంగా జరుగుతోంది. బెంగళూరులోని కోరమంగళ ఇండోర్‌ స్టేడియం వేదికగా రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ వేడుకకు టాలీవుడ్, శాండల్‌వుడ్‌ (కన్నడ) సినీ తారలు తరలివచ్చారు. అవార్డుల వేడుకలో స్టార్స్‌ సందడి ఒకవైపు ఉంటే.. మరోవైపు యువ ప్రతిభకు పట్టం కట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సెప్టెంబర్‌ 12న జరిగిన తొలి రోజు కార్యక్రమంలో తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, గాయకులు వివిధ విభాగాల్లో అవార్డులు అందుకున్నారు. ఈసారి ఊహించని విధంగా పలువురు యంగ్‌ టాలెంట్‌ అవార్డులు కొల్లగొట్టడంతో వేడుక ఆసక్తికరంగా మారింది.
తెలుగులో యంగ్‌ టాలెంట్‌ జోరు..
తెలుగు విభాగంలో ‘మిరాయ్‌’ సినిమాతో తేజ సజ్జ ఉత్తమ నటుడి అవార్డును సొంతం చేసుకున్నారు. మరోవైపు ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో ఐశ్వర్య రాజేష్ ఉత్తమ నటి అవార్డుతో పాటు క్రిటిక్స్‌ విభాగంలోనూ అవార్డు అందుకున్నారు.
In Mirai, #TejaSajja brought power, conviction and an undeniable screen presence to a character built for the big screen. A performance that carried the scale of the story and the spirit of a true Super Yodha. Celebrating Teja Sajja as Best Actor for Mirai at SIIMA 2026. Book… pic.twitter.com/0UDE2rVyCm
ఇక డెబ్యూ విభాగాల్లోనూ యువ నటీనటులు సత్తా చాటారు. ‘కోర్ట్‌: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’తో హర్ష్‌ రోషన్‌ ఉత్తమ డెబ్యూ నటుడిగా, శ్రీదేవి ఉత్తమ డెబ్యూ నటిగా అవార్డులు అందుకున్నారు. ‘మోగ్లీ’తో సాక్షి మడోల్కర్‌ కూడా డెబ్యూ నటి (క్రిటిక్స్‌) అవార్డును సొంతం చేసుకున్నారు.
Where laughter meets family, chaos meets celebration, and Every moment feels like a festival. Sankranthiki Vasthunaam brought the true spirit of entertainment to the big screen. SVS Productions’ Sankranthiki Vasthunaam wins Entertaining Film of the Year. #SIIMA2026 #NEXASIIMA … pic.twitter.com/A1NeV0S2Q3
ఉత్తమ నటుడు: తేజ సజ్జ – మిరాయ్‌ ఉత్తమ నటి: ఐశ్వర్య రాజేష్ – సంక్రాంతికి వస్తున్నాం ఉత్తమ నటి – క్రిటిక్స్: ఐశ్వర్య రాజేష్ – సంక్రాంతికి వస్తున్నాం ఉత్తమ సహాయ నటి - శ్రద్ధా శ్రీనాథ్‌ (డాకు మహారాజ్‌) ఉత్తమ హాస్య నటుడు - బుల్లిరాజు అలియాస్‌ భీమల రేవంత్‌ (సంక్రాంతికి వస్తున్నాం) ఉత్తమ నటుడు (డెబ్యూ) - హర్ష్‌ రోషన్‌ (కోర్ట్‌) ఉత్తమ నటి (డెబ్యూ) - శ్రీదేవి (కోర్ట్‌) ఉత్తమ డెబ్యూ నటి (క్రిటిక్స్): సాక్షి మడోల్కర్ – మోగ్లీ ఉత్తమ సినిమాటోగ్రఫీ -కార్తిక్‌ ఘట్టమనేని (మిరాయ్‌) ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ – మేల్: రమణ గోగుల – “గోదారి గట్టు” (సంక్రాంతికి వస్తున్నాం) ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ – ఫీమేల్: సమీరా భరద్వాజ్ – “ప్రేమలో” (కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ) ఉత్తమ గేయ రచయిత: పూర్ణా చారి (కోర్ట్‌)
ఐశ్వర్య రాజేష్ రెండు అవార్డులతో సత్తా చాటగా.. సాక్షి మడోల్కర్ కూడా డెబ్యూ నటి, డెబ్యూ దర్శకురాలిగా రెండు అవార్డులు దక్కించుకున్నారు.
Great comedy is all about timing, instinct and knowing exactly when to own the moment. #BheemalaRevanth brought infectious energy and memorable comic timing to Sankranthiki Vasthunaam. For a performance that kept audiences laughing, he wins Best Actor in a Comedy Role Telugu.… pic.twitter.com/lHB9yAVyaM
ఉత్తమ నటుడు: రిషబ్‌ శెట్టి – కాంతార: చాప్టర్‌ 1 ఉత్తమ డెబ్యూ నటుడు: ఎస్‌.ఎస్‌. దుష్యంత్ – గత వైభవ ఉత్తమ సహాయ నటుడు: జె.పీ. తుమినాడ్ – సు ఫ్రమ్ సో ఉత్తమ డెబ్యూ డైరెక్టర్: జె.పీ. తుమినాడ్ – సు ఫ్రమ్ సో
Some roles demand performance. Others demand transformation. #RishabShetty embodies the intensity, strength and spirit of Kantara: Chapter 1 with commanding screen presence. For a performance that became inseparable from the world of The film, he wins Best Actor in a Leading… pic.twitter.com/Qht1T9fcDM
స్టార్స్‌ కంటే యంగ్‌ టాలెంట్‌ హైలైట్‌!
ఈసారి SIIMA అవార్డుల్లో స్టార్‌ హీరోలు, హీరోయిన్లతో పాటు కొత్త తరం నటీనటులు, దర్శకులు తమ ప్రతిభతో ప్రత్యేకంగా నిలిచారు. ముఖ్యంగా డెబ్యూ విభాగాల్లో యువతకు అవార్డులు దక్కడంతో కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడంలో SIIMA మరోసారి తన ప్రత్యేకతను చాటింది. ఇక సెప్టెంబర్‌ 13న జరిగే రెండో రోజు వేడుకలో తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన విజేతలకు అవార్డులు అందించనున్నారు. దీంతో ఈ ఏడాది SIIMA అవార్డుల వేడుక మరింత గ్రాండ్‌గా ముగియనుంది.
►ALSO READ | IRUMUDI OTT: ఓటీటీలోకి రవితేజ బ్లాక్‌బస్టర్ ‘ఇరుముడి’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
కన్నడలో రిషబ్‌ శెట్టి బెస్ట్ యాక్టర్ అవార్డుతో మెరవగా.. జె.పీ. తుమినాడ్ రెండు అవార్డులు గెలుచుకున్నారు. SIIMA 2026 వేడుకలు సెప్టెంబర్‌ 12, 13 తేదీల్లో జరుగుతున్నాయి. తొలి రోజు తెలుగు, కన్నడ సినిమాలకు అవార్డులు అందించగా.. రెండో రోజు తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన విజేతలను ప్రకటించనున్నారు. దీంతో సౌత్‌ ఇండియన్‌ సినిమా నాలుగు ఇండస్ట్రీల విజేతలతో SIIMA 2026 మరింత గ్రాండ్‌గా ముగియనుంది.





