
© 2026 nimisham.in

ప్రభాస్ (Prabhas) ఎప్పుడూ మూడు సినిమాలు సెట్ పై ఉండేలా చూసుకుంటున్నాడా లేక అలా అనుకోకుండా జరుగుతున్నాయో తెలియడం లేదు. సాహో (Saaho)తర్వాత ప్రభాస్ అనేక సినిమాలు ఒప్పుకున్నాడు.
కానీ అవన్నీ ఆలస్యం అయి… విడుదలకు చాలా టైం తీసుకున్నాయి. దాంతో ఎప్పుడూ మూడు సినిమాలు సెట్స్ పై ఉంటూ వస్తున్నాయి.
సాహో విడుదల కాగానే ఆదిపురుష్, రాధే శ్యామ్, సలార్ మొదటి భాగం సెట్స్ పైకి వచ్చాయి. రాధే శ్యామ్ విడుదల అయిన తర్వాత ఆదిపురుష్, సలార్ సెట్స్ పై ఉంటూ కల్కి 2898 AD వచ్చి చేరింది. ఆదిపురుష్ విడుదల తర్వాత సలార్, కల్కి సెట్స్ పై ఉంటూ ది రాజాసాబ్ చేరింది. ఆ తర్వాత సలార్ విడుదలైంది, ఆపై కల్కి, ది రాజాసాబ్ విడుదల అయ్యాయి.
ఇప్పుడు ‘ఫౌజీ’ విడుదలకు సిధ్దం అవుతోంది. ఈ డిసెంబర్ 3న రానుంది. “ఫౌజీ” సెట్స్ పై ఉండగానే ‘స్పిరిట్’ సినిమా జరుగుతోంది. త్వరలోనే ‘కల్కి 2’ సినిమా షూటింగ్ లో కూడా ప్రభాస్ పాల్గొంటాడు. ఈ డిసెంబర్ లో ‘ఫౌజీ’ విడుదల తర్వాత అటు స్పిరిట్ షూటింగ్ కొనసాగుతుంది, అలాగే ‘కల్కి 2’ కూడా సెట్స్ పై ఉంటుంది.
ఇక తాజాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘సలార్ 2’ సినిమాని వచ్చే ఏడాది ప్రారంభంలోనే స్టార్ట్ చేసేందుకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నాడు. అంటే వచ్చే ఏడాది మళ్ళీ మూడు సినిమాలు సెట్స్ పై ఉంటాయి. ‘స్పిరిట్’ విడుదల తర్వాత మరోటి కూడా ఒప్పుకోవచ్చు.
Film Critic & Entertainment Desk • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.