
© 2026 nimisham.in

ఇంటర్నెట్ డెస్క్: అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్ (Mohanlal) యువ హీరోలతో ఎప్పుడూ పోటీ పడుతూనే ఉంటారు. తాజాగా ఆయన తన అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. రాబోయే ప్రాజెక్టుల గురించి ఓ ఆసక్తికర విషయాన్ని ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. ఏకంగా 7 సినిమాల్లో తాను నటిస్తున్నట్లు తెలిపారు. ‘‘ఉత్కంఠభరితమైన కథలు, ప్రయాణాలు, ప్రత్యేకమైన చిత్ర నిర్మాతలు’’ అంటూ పోస్ట్ పెట్టారు. ఆ సినిమాలకు సంబంధించిన దర్శకుల పేర్లు సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
అందులో ప్రియదర్శన్, దిలీశ్ పోతన్, సత్యన్ అంతికాడ్, జీతూ జోసెఫ్, విష్ణు మోహన్, అనూప్ సత్యన్, జూడ్ ఆంథోనీ జోసెఫ్ ఉన్నారు. అయితే, ఈ 7 సినిమాల్లో ఏది ముందు సెట్స్‌కు వెళ్తుందనే దానిపై స్పష్టత లేదు. ఈ ఏడాది ‘తుడక్కం’, ‘దృశ్యం3’ సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన మోహన్‌లాల్.. ఇకపై వరుస చిత్రాలతో అలరించేందుకు రెడీ అవుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
వరుణ్ తేజ్ (Varun Tej) కథానాయకుడిగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju).
చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన మాస్‌యాక్షన్ ఎంటర్టైనర్ ‘ముఠా మేస్త్రీ’.
Film Critic & Entertainment Desk • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.








