© 2026 nimisham.in
సూపర్‌స్టార్ కృష్ణ తనయుడిగా సినీ ఎంట్రీ ఇచ్చి తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు. బాక్సాఫీస్కా బాప్ అంటూ ఫ్యాన్స్‌తో ముద్దుగా పిలిపించుకునే మహేశ్నేడు పుట్టినరోజు(ఆగస్టు 9) జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా అభిమానులతో పాటు సెలబ్రెటీలు సైతం సోషల్‌మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.* వారణాసి’ నుంచి 'రుద్ర' మాస్ లుక్... సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేశ్ బర్త్‌డే పోస్టర్స్మహేష్బాబు బర్త్‌డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా స్పందిస్తూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు. మహేశ్‌బాబును చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చానని, ఈ రోజు ఆయన భారతీయ చిత్రసీమలోనే అత్యంత ఆదరణ, ప్రజాదరణ పొందిన దిగ్గజ తారలలో ఒకరిగా ఎదిగిన తీరును తిలకించడం తనకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ఆ భగవంతుని ఆశీస్సులు మహేశ్‌కు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. బండ్ల గణేష్ ఆసక్తికర ట్వీట్మరోవైపు నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కూడా మహేశ్‌బాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. మహేశ్‌బాబును ఒక హీరోగా అభిమానించడం గర్వకారణమని, ఒక గొప్ప వ్యక్తిగా ఆయనను గౌరవించడం తమకు దక్కిన అదృష్టమని కొనియాడారు. మహేష్‌లో ఉన్న క్రమశిక్షణ, కష్టపడే తత్వం, అంకితభావం మరియు వినయపూర్వక నడవడిక ఆయనను కేవలం సూపర్‌స్టార్‌గానే కాకుండా కోట్లమందికి స్ఫూర్తిగా నిలబెట్టాయని అన్నారు. అంతేకాకుండా, రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ‘వారణాసి’ చిత్రంపై బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2027 ఏప్రిల్ 7న విడుదల కానున్న ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డులను తిరగరాసి, దేశంలోనే నంబర్ వన్ చిత్రంగా నిలుస్తుందని దృఢంగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ‘వారణాసి’ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని తాను ఆత్రుతగా ఎదురుచూస్తున్నానన్నారు. బాక్సాఫీస్‌ను ఏలుతూ, చరిత్రను సృష్టిస్తూ ఇలాగే మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకున్నారు.* ‘తప్పంతా నాదే, త్వరలోనే స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇస్తా’... అజయ్ భూపతి ఎమోషనల్ పోస్ట్సూపర్స్టార్ మహేష్ బాబుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ వినయం, వెండితెరపై మీ స్క్రీన్ ప్రెజెన్స్, కోట్లాది మంది అభిమానుల నుండి మీరు సంపాదించుకున్న ప్రేమ ఎప్పటికీ చెరగనివి. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆయురారోగ్యాలతో ఉంటూ భవిష్యత్తులో రోజుల్లో మరెన్నో గొప్ప విజయాలు లభించాలని ఆకాంక్షిస్తున్నా – రణ్‌బీర్ కపూర్రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్-వరల్డ్ అడ్వెంచరస్ చిత్రం ‘వారణాసి’ నుంచి మేకర్స్ ‘రుద్ర’ పోస్టర్లని రిలీజ్ చేశారు. రఫ్ అండ్ టఫ్ లుక్‌లో ఉన్న మహేశ్ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. టైమ్ ట్రావెల్, పురాణాలు, ఆస్టెరాయిడ్ ముప్పు నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం ఉగాది కానుకగా 2027, ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Film Critic & Entertainment Desk • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.








