
© 2026 nimisham.in

సీనియర్ హీరో నాగార్జున నటిస్తున్న 100వ చిత్రం నత్తనడకన సాగుతోంది. ఏడాదిగా పైగా షూటింగ్ లో ఉంది. ఇంకా పూర్తి కాలేదు. ఇక నందమూరి బాలకృష్ణ ఇటీవల గాయపడి, సర్జరీ జరుపుకున్నారు. దాంతో ఆయన చిత్రం షూటింగ్ ఆగింది. ఐతే, మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటిస్తున్న కొత్త సినిమా (Mega158) షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతోంది.
దర్శకుడు బాబీ తీస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి కొత్త తరహాలో కనిపిస్తారట. డ్యూయెట్ పాటలు, రొమాన్స్ వంటి రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా కొత్త పద్దతిలో చిరంజీవిని చూపించాలని బాబీ ప్రయత్నిస్తున్నాడట.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. మలయాళ భామ అనశ్వర రాజన్ చిరంజీవికి కూతురిగా నటిస్తోంది. ప్రియమణి ఒక కీలక పాత్రలో కనిపిస్తుంది. మరో కీలక పాత్రలో నివేత పేతురాజు నటిస్తోంది.
ఇక తాజాగా మరో భామని కూడా ఈ సినిమాలోకి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఆ పాత్ర ఏ హీరోయిన్ పోషిస్తుందో చూడాలి. చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో ఇంతకుముందు ‘వాల్తేర్ వీరయ్య’ వచ్చింది. అది పెద్ద హిట్. ఈ సినిమాని కూడా ‘వాల్తేర్ వీరయ్య’లాగే సంక్రాంతి బరిలో దింపాలని ప్లాన్ చేస్తున్నారు.
Film Critic & Entertainment Desk • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.








