
© 2026 nimisham.in

Mega star Chiranjeevi dual role in KAAKA movie
Kaaka : మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న కాకా మూవీపై ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. కాకా మూవీలో చిరంజీవి డ్యూయల్ రోల్లో నటించబోతున్నారని టాక్. ఒక పాత్రలో ప్రస్తుత వయసుకు తగ్గ మెచ్యూర్డ్ లుక్‌లో కనిపిస్తే..మరో పాత్రలో యంగ్ చిరంజీవిగా కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో చిరు రెండు భిన్నమైన షేడ్స్‌లో కనిపించడం ఈ టాక్‌కు మరింత బలం చేకూరుస్తోంది. ముఖ్యంగా యంగ్ చిరంజీవి లుక్, స్టైల్, యాక్షన్ మోడ్‌లో కనిపించే తీరు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
Lirisha Reddy : పట్టులో సరళత, గులాబీ రంగులో అందం.. చీరలో సూపర్ ఉమెన్ సింగారం.. లిరీష క్యూట్ ఫోటోలు..
ఈ యంగ్ చిరు పాత్ర కేవలం ఫ్లాష్‌బ్యాక్ కోసం మాత్రమే కాకుండా.. కథలో చాలా కీలకంగా ఉంటుందని టాక్. ఇప్పటివరకు మెగాస్టార్‌ను చూడని సరికొత్త గెటప్, స్టైలింగ్‌తో దర్శకుడు బాబీ చిరు రోల్‌ను డిజైన్ చేశారనే ప్రచారం జరుగుతోంది. ఒకవైపు సింపుల్‌గా కనిపించే పాత్ర..మరోవైపు గతంలో గన్స్ పట్టుకుని మాస్ యాక్షన్‌లో కనిపించే యంగ్ చిరు..ఈ రెండు షేడ్స్ మధ్య వచ్చే కథ, ట్విస్ట్ సినిమాకు మెయిన్ హైలైట్‌గా నిలుస్తాయని అంటున్నారు.
ఇదే నిజమైతే మెగాస్టార్ అభిమానులకు కాకాలో డబుల్ ట్రీట్ ఖాయమనే చెప్పాలి. ముఖ్యంగా యంగ్ చిరంజీవిని కొత్త టెక్నాలజీతో తెరపై ప్రెజెంట్ చేసే విధానం సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశం ఉంది.
Film Critic & Entertainment Desk • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.








