
© 2026 nimisham.in

చిరంజీవి రీ-ఎంట్రీ తర్వాత సక్సెస్ అందుకున్న మూడు సినిమాలూ సంక్రాంతి సీజన్ లోనే రావడం విశేషం. ఇప్పుడు బాబీ డైరెక్షన్లో చేస్తున్న సినిమా సైతం సంక్రాంతికే వస్తుండటంతో చిరు డబుల్ హ్యాట్రిక్ కు ఈ సినిమాతో శ్రీకారం చుడతారని మెగాభిమానులు భావిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సెకండ్ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఇటీవలే 40 రోజుల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా జనం ముందుకు రాబోతోంది. విశేషం ఏమంటే... ఈ సినిమా రిలీజ్ విషయంలో మేకర్స్ క్లారిటీ ఇచ్చిన తర్వాత చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత పొంగల్ బరిలో హ్యాట్రిక్ సాధించిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటున్నారు. చిరు - బాబి కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఆయన సెకండ్ హ్యాట్రిక్ కు శ్రీకారం చుట్టడం ఖాయమని మెగాభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
చిరంజీవి కొన్నేళ్ళ గ్యాప్ తర్వాత 2017లో 'ఖైదీ నెం. 150' తో రీ-ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. చిరంజీవి సినిమా ఎన్నేళ్ళ తర్వాత వచ్చినా అభిమానులు అక్కున చేర్చుకోవడం ఖాయమని ఆ సినిమాతో నిరూపితమైంది. అయితే ఆ తర్వాత 2019లో వచ్చిన 'సైరా నరసింహారెడ్డి' విమర్శకుల ప్రశంసలు అందుకున్నా... సాధారణ ప్రేక్షకుడిని మెప్పించలేకపోయింది. ఆపైన 2022లో వచ్చిన 'ఆచార్య, గాడ్ ఫాదర్' చిత్రాలు సైతం కమర్షియల్ సక్సెస్ సాధించలేదు.
ఇక 2013లో బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' ఆ యేడాది సంక్రాంతి బరిలో నిలిచి విజేతగా జయకేతనం ఎగరేసింది. విశేషం ఏమంటే... రీ-ఎంట్రీ తర్వాత చిరంజీవి రెండో విజయం కూడా సంక్రాంతికే లభించింది. ఈ యేడాది సంక్రాంతికి వచ్చిన చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తెలుగు సీనియర్ హీరోల చిత్రాలలో రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసిన చిత్రంగా రికార్డ్ నెలకొల్పింది. దీంతో చిరంజీవి రీ-ఎంట్రీ తర్వాత సంక్రాంతి సీజన్ లో హ్యాట్రిక్ కొట్టినట్టు అయ్యింది. ఇప్పుడు బాబీతోనే చేస్తున్న రెండో సినిమా వచ్చే సంక్రాంతికి ఘన విజయాన్ని సొంతం చేసుకుంటే.. ఆయన సెకండ్ హ్యాట్రిక్ కు శుభారంభం పలికినట్టు అవుతుంది.
ఇటీవలే సాయిధరమ్ తేజ్ నటిస్తున్న 'సంబరాల యేటి గట్టు' సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయబోతున్నట్టు నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రకటించారు. అయితే ఇప్పుడు చిరంజీవి సినిమా రాబోతున్న నేపథ్యంలో ఆ సినిమాను ఖచ్చితంగా వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. సంక్రాంతి సీజన్ లో మరికొన్ని ప్రామిసింగ్ మూవీస్ రాబోతున్నట్టు ఇప్పటికే ప్రకటనలు వచ్చాయి. అయితే చిరంజీవికి రీ-ఎంట్రీ తర్వాత సంక్రాంతి సీజన్ బాగా కలిసొచ్చింది కాబట్టి... బాబీతో చేస్తున్న సినిమా కూడా సక్సెస్ ఖాయమని మెగాభిమానులు భావిస్తున్నారు. మరి వారి ఆశలు నెరవేరతాయో లేదో చూడాలి.
పెళ్ళైన మగాడితో అడ్డంగా దొరికిన ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్...
Balakrishna: 'రాముడు - భీముడు' సినీ నిర్మాత మృతి
ఓటీటీకి వచ్చేస్తోన్న కల్ట్ క్లాసిక్ చెన్నై లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చు అంటే
Film Critic & Entertainment Desk • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.








