
© 2026 nimisham.in

ఇంటర్నెట్‌డెస్క్: జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘బావగారూ.. బాగున్నారా’. రంభ (Rambha), రచన, శ్రీహరి, కోట శ్రీనివాసరావు, పరేశ్ రావల్ కీలక పాత్రలు పోషించారు. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నాగబాబు ఈ మూవీని నిర్మించారు. 1998లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇందులో చిరంజీవి చేసే బంగీ జంప్, మణిశర్మ పాటలు వాటికి నాయకనాయికల డ్యాన్స్‌లు సినిమాను ప్రత్యేకంగా నిలిపాయి. సాధారణంగా చిరంజీవి సినిమా టైటిల్ అంటే కాస్త మాసీగా ఉంటుంది. కానీ, ఈ మూవీ ‘బావగారూ.. బాగున్నారా’ (Bavagaru Bagunnara) అని క్లాసీ టైటిల్ పెట్టడం వెనుక ఓ కారణం ఉంది. ఈ మూవీ దర్శకత్వ విభాగంలో పని చేసిన వీఎన్ ఆదిత్య గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆ విషయాలు పంచుకున్నారు.
‘‘అప్పట్లో జయంత్ గారు తీసిన ‘ప్రేమించుకుందాం రా’ హిట్ అవడంతో టైటిల్ చివరిలో ‘రా’ సెంటిమెంట్ ఉంటే బాగుంటుందని మేము అనుకున్నాం. అయితే, ఆయనకు అలాంటి పట్టింపులేమీ లేవు. కథను బట్టి ఏ టైటిల్ అయితే బాగుంటుందోనని ఊహించి 96 టైటిల్స్ రాసి ఒక ఫైల్ చేశాం. డైలాగ్ వెర్షన్‌కు కూడా అంత కసరత్తు చేయలేదు. పైగా చిరంజీవిగారి ఇమేజ్ తగిన మాస్ సినిమా కాదు. ఒక క్లాస్ అండ్ ఫ్యామిలీ మూవీ. మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ జానర్లో జయంత్ లాంటి స్టైలిష్ డైరెక్టర్, చిరంజీవి లాంటి పెద్ద హీరో చేస్తుండంంతో అంచనాలు పెరిగాయి. అలాంటప్పుడు టైటిల్ కూడా కాస్త వైవిధ్యంగా ఉండాలనుకున్నాం. ఒకరోజు చిరంజీవిగారు ఫోన్ చేసి, ‘టైటిల్‌కు సంబంధించి క్లారిటీ ఇచ్చేద్దాం ఆఫీస్‌కు రండి’ అన్నారు’’
‘‘టైటిల్స్ ఫైల్ తీసుకుని నేను వెళ్లేసరికి జయంత్, చిరంజీవి, నాగాబాబు, పరుచూరి వెంకటేశ్వరరావు అందరూ కూర్చొన్నారు. ఆ ఫైల్ బయటకు తీసి, గదిలోకి వెళ్లే ముందు మొదటి టైటిల్ పైన ‘బావగారూ బాగున్నారా’ అని రాసి, బ్రాకెట్లో (చిరంజీవి గారి ‘మాస్టర్’లోని సాంగ్) అని రాసి ఇచ్చా. అది చూసి ‘ఇదేం టైటిల్’ అన్నారు. ఆ టైటిల్ ఎందుకు పెట్టాలో వారికి వివరించా. తన అక్క మొగుడు రాజు (చిరంజీవి) అని స్వప్నకు తెలిసే సన్నివేశంతో ఆమె ముఖంపై ఇంటర్వెల్ కార్డు పడుతుందని మేము మొదట రాసుకున్నాం. ఇక్కడే ఒక బిట్ యాడ్ చేద్దామని సలహా ఇచ్చా’’
‘‘తాను ప్రేమించి అబ్బాయి అక్క మొగుడని తెలిసిన తర్వాత షాక్ అయిన స్వప్న ముఖంపై విరామం టైటిల్ వేయకుండా, ఆ అమ్మాయి వచ్చి రాజుని గుడిలో కలుస్తుంది. స్వప్నను చూడగానే రాజు కంగారుపడతాడు. ఆమె అనూహ్యమైన యాంగిల్లో ‘బావగారూ.. బాగున్నారా’అని అడిగితే రాజు ఫేస్ మీద ఇంటర్వెల్ పడేలా వేద్దాం’’ అని ఒక అభిమానిలా చెప్పా. అది చెబుతున్నప్పుడే చిరంజీవిగారు విచిత్రమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. అందరం నవ్వుకున్నాం. అప్పటికప్పుడే ప్రెస్‌మీట్ పెట్టి టైటిల్ ప్రకటించారు’’ అని వీఎన్ ఆదిత్య నాటి విషయాల్ని పంచుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Film Critic & Entertainment Desk • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.








