
© 2026 nimisham.in

మెగాస్టార్ చిరంజీవి ఇవాళ(ఆగస్టు 22) పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ క్రీడా ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 'ప్రముఖ చలనచిత్ర నటుడు, కేంద్ర మాజీ మంత్రి, పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. 1978లో తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టి అంచెలంచెలుగా ఎదిగి ఎనలేని కీర్తి ప్రతిష్టలను, ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని మెగాస్టార్ గా నిలిచారు. రక్తనిధి, నేత్ర నిధి ఏర్పాటు చేసి మానవత్వాన్ని చాటుకుని సమాజం పట్ల తన బాధ్యతను నెరవేరుస్తున్నారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, సినీ ప్రేక్షకులను మరింతగా అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని ఎక్స్ (ట్విట్టర్)లో రాసుకొచ్చారు చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో మెగాభిమానులు హంగామా చేస్తున్నారు. మెగాస్టార్ కు సంబంధించిన పాత సినిమాలు, ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ బర్త్ డే విషెస్ చెబుతున్నారు.
ప్రముఖ చలనచిత్ర నటుడు, కేంద్ర మాజీ మంత్రి, పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. 1978లో తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టి అంచెలంచెలుగా ఎదిగి ఎనలేని కీర్తి ప్రతిష్టలను, ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని మెగాస్టార్ గా నిలిచారు. రక్తనిధి, నేత్ర నిధి ఏర్పాటు చేసి… — N Chandrababu Naidu (@ncbn) August 22, 2026 చిరంజీవి పుట్టిన రోజు.. ఆహా స్పెషల్ వీడియో..
Generations maarina, Gen-Z laku ardham kakapoyina… aayana sthaanam, staayi veru🔥 Wishing the God of Commercial Cinema, the Demo God of Masses,Indrasena of Industry Hits @KChiruTweets garu, a very Happy Birthday! ❤️🔥#HappyBirthdayChiranjeevi #Aha #Megastar — ahavideoin (@ahavideoIN) August 22, 2026
Film Critic & Entertainment Desk • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.








