
© 2026 nimisham.in

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా కొరియన్ కనకరాజు. ఆగస్టు 07న విడుదలైన ఈ కామెడీ హారర్ థ్రిల్లర్ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ సాధించింది. దీంతో మంగళవారం (ఆగస్టు 11) హైదరాబాద్ వేదికగా కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే కొరియన్ కనకరాజు చిత్ర బృందం కూడా హాజరైంది. అయితే ఈ మెగా ఈవెంట్లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఈ సినిమాలో పొట్టి మామగా మెప్పించిన నటుడు రవీంద్ర కుమార్ మెగాస్టార్ చిరంజీవి కాళ్లపై పడబోయారు. ఇది గమనించిన చిరంజీవి అలా చేయవద్దని అతన్ని వారించారు. రవీంద్ర ను దగ్గరికి తీసుకుని ఓదార్చారు. చివరగా అతనిని పక్కన కూర్చుపెట్టుకుని ఫోటో దిగి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
రవీంద్ర కుమార్ అలియాస్ పొట్టిమామ.. సోషల్ మీడియాను బాగా ఫాలో అయ్యే వారికి ఇతను బాగా పరిచయం. ముఖ్యంగా యూట్యూబ్ లో పొట్టి మామకు మంచి క్రేజ్, పాపులారిటీ ఉంది. చిరంజీవి అభిమాని అయిన రవీంద్ర కుమార్ ఎక్కువగా మెగాస్టార్ పాటలకు డ్యాన్స్ లు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. పొట్టి మామ డ్యాన్స్ వీడియోలకు భారీగా వ్యూస్ వస్తుంటాయి. ఇప్పటివరకు సోషల్ మీడియాలోనే కనిపించిన రవీంద్ర కుమార్ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరిశాడు. కొరియన్ కనకరాజు సినిమాలోని ఓ పాటలో తళుక్కున మెరిశాడు. ఈ క్రమంలోనే కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్ కు హాజరయ్యాడు. అక్కడ చిరును స్టేజ్ ముందు చూసి ఎమోషనల్ అయిపోయి బాగా ఏడ్చేసాడు. ఇక ఇదే సక్సెస్ మీట్లో చిరంజీవి ఈ తరం దర్శకులకు బడ్జెట్ ప్లానింగ్ విషయంలో క్లాస్ తీసుకున్నారు. సినిమాను అనుకున్న బడ్జెట్ పరిధిలో, క్లారిటీతో ఎలా తీయాలో ఈ చిత్ర దర్శకుడు మేర్లపాక గాంధీని చూసి నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. తక్కువ బడ్జెట్లో ఇంతటి క్వాలిటీ ఔట్ పుట్ తీసుకురావడం కేవలం పక్కా ప్లానింగ్ వల్లే సాధ్యమైందని, కొత్త దర్శకులు దీనిని ఒక ఉదాహరణగా తీసుకోవాలని అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Film Critic & Entertainment Desk • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.








