
Aug 16 2026 5:23 PM | Updated on Aug 16 2026 6:08 PM
హైదరాబాద్: 2027 జనాభా లెక్కల్లో ఓబీసీలకు ప్రత్యేక కేటగిరీ ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానికి లేఖ రాశారు పొన్నం. ‘ ఓబీసీ, ఎస్ఈబీసీల సమగ్ర కులగణకు ప్రత్యేక విధానం రూపొందించాలి. ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీలకు ప్రశ్నావళిలో ప్రత్యేక కేటగిరి చేర్చాలి. ప్రతి కులం, సముదాయానికి డిజిటల్ కోడ్లు కేటాయించాలి.
కులగణనలో బీసీల సమాచారాన్ని సేకరించాలి. బీసీల లెక్కలు తేలితేనే సామాజిక న్యాయం జరుగుతుంది. SECC-2011లో ఎదురైన కులపేర్ల సమస్యలు 2027 జనాభా లెక్కల్లో పునరావృతం కాకూడదు.
రాష్ట్రాల వారీగా మాస్టర్ కుల డైరెక్టరీ.. ప్రతి కులం, సముదాయానికి డిజిటల్ కోడ్లు ఇవ్వాలి. స్థానిక, వివాదాస్పద కులపేర్ల నమోదుకు ప్రత్యేక ధృవీకరణ విధానం ఉండాలి. వ్యక్తి స్వయంగా ప్రకటించిన కులం, అధికారిక వర్గీకరణ రెండింటినీ డేటాలో భద్రపరచాలి. తెలంగాణ SEEPC సర్వే అనుభవాలను 2027 జనాభా లెక్కల రూపకల్పనలో పరిగణనలోకి తీసుకోవాలి’ అని లేఖలో పేర్కొన్నారు.
భర్త బర్త్డే.. క్యూట్ ఫొటోలు షేర్ చేసిన కరీనా (ఫొటోలు)
నల్లని చీర.. ఎర్రటి పూలు.. అందంగా రాశీ (ఫొటోలు)
'ఇరుముడి'లో రవితేజ కూతురిగా చేసిన పాప ఎవరో తెలుసా? (ఫొటోలు)
అమ్మ చీరలో త్రిష.. ఇది చాలా స్పెషల్ (ఫొటోలు)
ఆ రోజు ఇంట్లో ఏం జరిగింది! రూపా రెడ్డి భర్తపై పోలీసుల అనుమానాలు
100 షేర్లకు 1000 షేర్లు! లిస్టయిన 10 రోజుల్లోనే బంపరాఫర్..
ఎవరిది గొడ్డలి పార్టీ? ఇదిగో సాక్ష్యం.. ఈ వీడియో చూసే దమ్ముందా బాబు..
పెళ్లైన 7 రోజులకే.. నా భర్త అరాచకం అంతా ఇంతా కాదు
సిగ్గుందా..! ఫస్ట్ మహిళలకు క్షమాపణ చెప్పు.. బాబు,లోకేష్ కు ఇచ్చిపడేసిన రోజా





