బిగ్ బాస్ సీజన్-10 లో అగ్నిపరీక్ష తర్వాత అసలు సిసలు మహాపరీక్ష మొదలైందని నాగార్జున ఎపిసోడ్ లో క్లారిటీ ఇచ్చారు. స్టేజ్ పై 16 మంది కంటెస్టెంట్స్ కి ఇచ్చిన 10 పవర్స్ గురించి రివీల్ చేశారు. వెళ్లిన 16 మందిలో ముగ్గురు మాత్రమే హౌస్ మేట్స్ అయ్యారని.. ఇద్దరు ఈ వారంలోనే ఎలిమినేట్ అయ్యారని చెప్పారు. ఇంకా 11 మంది కంటెస్టెంట్స్ రిస్క్ లోనే ఉన్నారని నాగార్జున చెప్పాడు.
ఎలిమినేట్ అయిన ఇద్దరు కంటెస్టెంట్స్ విషయంలో బయట, హౌస్ లోపలా పెద్ద చర్చ జరిగింది. వాళ్లు సీక్రెట్ రూంలో ఉన్నారేమోనని అందరు అనుకున్నారు. దీనిపై క్లారిటీ ఇవ్వడానికి నాగార్జున లైవ్ కాల్ తీసుకున్నారు. చరణ్ కి కాల్ చేయగా.. నేను మా ఇంటికి వచ్చేశా, మా ఇంట్లోనే ఉన్నానని చెప్పాడు. ఆ తర్వాత చైత్ర కూడా లైవ్ లోకి వచ్చి తను సీక్రెట్ రూంలో లేనని తెగేసి చెప్పేసింది. దీంతో మిగిలిన ఇంటి సభ్యులకు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఆటలో ఏ మాత్రం అలసత్వం వచ్చినా హౌస్ నుంచి ఔట్ అవ్వాల్సిందే అంటూ హెచ్చరించారు. ఫస్ట్ వీక్ లోనే ఇద్దరిని పంపించేశారు.. ఇది ఆషామాషీ ఆట కాదని తేల్చి చెప్పారు. ఈ వార్నింగ్ తో హౌస్ మేట్స్ అందరూ సైలెంట్ అయిపోయారు. నిన్న జరిగిన ఎపిసోడ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
[Bigg Boss Telugu 10 elimination Charan Chaitra, Bigg Boss 10 secret room twist, Nagarjuna warning housemates, Bigg Boss 10 16 contestants 10 powers, Bigg Boss Telugu 10 latest Update]
Bigg Boss 10 : రోహిత్‌కి కోటింగ్.. త్రిగుణ్‌కి మరి.. నాగార్జున తీరుపై నెటిజన్స్ ఫైర్!
Bigg Boss 10 : రోహిత్‌కి కోటింగ్.. త్రిగుణ్‌కి మరి.. నాగార్జున తీరుపై నెటిజన్స్ ఫైర్!
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com
Disclaimer : All content on this website, including text, images, videos, graphics, and audio, is the intellectual property of ObjectOne Information Systems Ltd. and/or its affiliates. Any unauthorized reproduction, distribution, modification, or publication of this material, in whole or in part, is strictly prohibited without prior written consent from ObjectOne Information Systems Ltd.





