
Bigg Boss Telugu 10 Day 7 బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చిన 16 మందిలో డే వన్‌లోనే 8 మందికి పవర్స్ వచ్చాయి. ఆ తర్వాత ఆ 8 మంది కలిసి మరో ఇద్దరికీ పవర్స్ ఇప్పించారు. అలా ఇంట్లో ఉన్న పది మందికి మ్యాజికల్ కీ ద్వారా కొన్ని పవర్స్ లభించాయి. అయితే చరణ్, చైత్రా రాయ్ వెళ్లిన తర్వాత మిగిలిన వర్షిణి, సుధీర్, రోహిత్, అమన్‌లకు మాత్రం ఎలాంటి కీ లభించలేదు. వారికి ఎలాంటి పవర్స్ లేవు. దీంతో ఈ నలుగురిలో ఎవరో ఒకరికి మ్యాజికల్ కీ లభించి పవర్ దక్కేలా కనిపిస్తోంది. అంతే కాకుండా ఆల్రెడీ పవర్స్ ఉన్న పది మందిలో ఒకరికి పవర్ కోల్పోయే ఛాన్స్ ఉంది.
Tags:#bigg-boss-telugu-10
Found this helpful?
