Bonus Shares: పెట్టుబడుల్లో స్టాక్ మార్కెట్ రిస్క్‌తో కూడుకున్నదని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఏ స్టాక్ ఎప్పుడు పెరుగుతుందో, ఏ స్టాక్ ఎప్పుడు పడిపోతుందో చెప్పలేం. కానీ కొన్ని స్టాక్స్ ఊహించని స్థాయిలో రిటర్న్స్ ఇస్తుంటాయి. ఇదే ఆశతో చాలా మంది ఏమాత్రం అవగాహన లేకుండా అందులోకి దిగి మోసపోతుంటారు. కానీ అవగాహన లేకుండా స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం అంత మంచిది కాదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. కచ్చితంగా సెబీ ఎక్స్పర్ట్స్ సలహాలు తీసుకోవాలని చెబుతుంటారు. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్లో ముఖ్యంగా ఆయా కంపెనీల పనితీరు, ఫలితాలు, పెట్టుబడి ప్రణాళికలు, ప్రకటనలు ఇలా అన్నీ గమనిస్తూ దీర్ఘ కాలం పాటు పెట్టుబడులు కొనసాగిస్తూ ఓపికతో ఉంటేనే మంచి రాబడి ఆశించవచ్చు.ఇక్కడ లాంగ్ రన్లో చూస్తే కేవలం స్టాక్ ధర పెరగడంతోనే కాదు కంపెనీ ప్రకటించే ఇతర ఆఫర్లు కూడా రాబడిని పెంచుతుంటాయి. ఇందులో బోనస్ ఇష్యూ, డివిడెండ్లు, స్టాక్ స్ప్లిట్, షేర్ల బైబ్యాక్ వంటివి ప్రకటిస్తుంటాయి. దీని వల్ల అదనపు రాబడి వస్తుంటుంది. ఇలానే బోనస్ ఇష్యూ, డివిడెండ్లు అందిస్తూ అదే స్థాయిలో దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ అందించిన ఒక మల్టీబ్యాగర్ స్టాక్ గురించి చూద్దాం.అదే స్కై గోల్డ్ అండ్ డైమండ్స్ లిమిటెడ్. ప్రస్తుతం ఈ షేరు ధర రూ. 723 గా ఉంది. గత శుక్రవారం సెషన్లో దాదాపు 5 శాతం పెరిగింది. మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 11.14 వేల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 728.40 కాగా, కనిష్ఠ ధర రూ. 259 గా ఉంది. ఇప్పుడు కంపెనీ క్యూ1 ఫలితాల్లోనూ అదరగొట్టింది. నికర ఆదాయం సమీక్షా త్రైమాసికంలో ఏకంగా 78 శాతం పెరిగింది. ప్రాఫిట్ కూడా 2.4 రెట్లు పెరిగింది.Read Also: ప్రతి నెలా రూ. 15 వేల సిప్ చేస్తే 30 ఏళ్లలో ఎంతొస్తుందో తెలుసా? భారీ సంపద.. లెక్కలివేఈ కంపెనీ గత కొంత కాలంగా ఇన్వెస్టర్లకు అద్భుత రిటర్న్స్ అందిస్తుంది. రెండేళ్లలో 251 శాతం పుంజుకోగా, మూడేళ్లలో 2600 శాతానికిపైగా పెరిగింది. 6 నెలల్లోనే పెట్టుబడిని రెట్టింపు చేయగా లక్షకు రూ. 2 లక్షలకుపైగా వచ్చాయి. ఏడాదిలో 170 శాతం పెరిగింది. గత ఐదేళ్లలో చూస్తే 3100 శాతానికిపైగా పెరగ్గా ఇక్కడ లక్ష పెట్టుబడిని ఏకంగా రూ. 32 లక్షలు చేసింది.బోనస్ ఇష్యూలు, డివిడెండ్లు2022లో ఈ కంపెనీ ఒకసారి 1:1 రేషియోలో బోనస్ షేర్లను జారీ చేసింది. అంటే ఒక షేరుపై మరో షేరు అదనంగా వచ్చింది. 2024లో 9:1 రేషియోలో బోనస్ ఇష్యూ ప్రకటించింది. ఇక్కడ ఒక్కో షేరుపై 9 షేర్లు అదనంగా వచ్చాయి. ఇంకా రెండు సార్లు ఒక్కో షేరుపై రూ. 1 చొప్పున డివిడెండ్లను కూడా ప్రకటించింది. అంటే ఇక్కడ బోనస్ ఇష్యూ వల్ల ఎలాంటి అదనపు పెట్టుబడి లేకుండానే షేర్లు పెరగ్గా ఇదే సమయంలో రాబడి ఎక్కువగా వచ్చింది. అదనంగా మళ్లీ డివిడెండ్ ఆదాయం కూడా రెండు సార్లు వచ్చింది.