సార్లు బోనస్ తో దశ తిరిగింది.. డివిడెండ్లు కూడా.. లక్షను రూ. 32 లక్షలు చేసినస్టాక్ ఇదే
Bonus Shares: పెట్టుబడుల్లో స్టాక్ మార్కెట్ రిస్క్‌తో కూడుకున్నదని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఏ స్టాక్ ఎప్పుడు పెరుగుతుందో, ఏ స్టాక్ ఎప్పుడు పడిపోతుందో చెప్పలేం. కానీ కొన్ని స్టాక్స్ ఊహించని స్థాయిలో రిటర్న్స్ ఇస్తుంటాయి. ఇదే ఆశతో చాలా మంది ఏమాత్రం అవగాహన లేకుండా అందులోకి దిగి మోసపోతుంటారు. కానీ అవగాహన లేకుండా స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం అంత మంచిది కాదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. కచ్చితంగా సెబీ ఎక్స్పర్ట్స్ సలహాలు తీసుకోవాలని చెబుతుంటారు. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్లో ముఖ్యంగా ఆయా కంపెనీల పనితీరు, ఫలితాలు, పెట్టుబడి ప్రణాళికలు, ప్రకటనలు ఇలా అన్నీ గమనిస్తూ దీర్ఘ కాలం పాటు పెట్టుబడులు కొనసాగిస్తూ ఓపికతో ఉంటేనే మంచి రాబడి ఆశించవచ్చు.ఇక్కడ లాంగ్ రన్లో చూస్తే కేవలం స్టాక్ ధర పెరగడంతోనే కాదు కంపెనీ ప్రకటించే ఇతర ఆఫర్లు కూడా రాబడిని పెంచుతుంటాయి. ఇందులో బోనస్ ఇష్యూ, డివిడెండ్లు, స్టాక్ స్ప్లిట్, షేర్ల బైబ్యాక్ వంటివి ప్రకటిస్తుంటాయి. దీని వల్ల అదనపు రాబడి వస్తుంటుంది. ఇలానే బోనస్ ఇష్యూ, డివిడెండ్లు అందిస్తూ అదే స్థాయిలో దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ అందించిన ఒక మల్టీబ్యాగర్ స్టాక్ గురించి చూద్దాం.అదే స్కై గోల్డ్ అండ్ డైమండ్స్ లిమిటెడ్. ప్రస్తుతం ఈ షేరు ధర రూ. 723 గా ఉంది. గత శుక్రవారం సెషన్లో దాదాపు 5 శాతం పెరిగింది. మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 11.14 వేల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 728.40 కాగా, కనిష్ఠ ధర రూ. 259 గా ఉంది. ఇప్పుడు కంపెనీ క్యూ1 ఫలితాల్లోనూ అదరగొట్టింది. నికర ఆదాయం సమీక్షా త్రైమాసికంలో ఏకంగా 78 శాతం పెరిగింది. ప్రాఫిట్ కూడా 2.4 రెట్లు పెరిగింది.Read Also: ప్రతి నెలా రూ. 15 వేల సిప్ చేస్తే 30 ఏళ్లలో ఎంతొస్తుందో తెలుసా? భారీ సంపద.. లెక్కలివేఈ