
మల్లమ్మ సెంటర్ (నరసరావుపేట): నరసరావుపేట పట్టణంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వినుకొండ రోడ్డులోని ఎన్ఎస్బీ కార్ డెక్కర్లో సిబ్బంది వెల్డింగ్ పని చేస్తుండగా ప్రమాదవశాత్తూ కారుకు మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో సిబ్బంది కార్ సర్వీసింగ్ సెంటర్ నుంచి బయటకు వచ్చేశారు. మూడు కార్లకు మంటలు వ్యాపించాయి. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఆరుగురు సీఐలు, పోలీసు సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనలో సుమారు రూ.50 లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక సిబ్బంది అంచనా వేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




