
© 2026 nimisham.in

Aug 12 2026 7:49 AM | Updated on Aug 12 2026 7:49 AM
ముంబైలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విలే పార్లే వెస్ట్‌లోని ఓ 12 అంతస్తుల నివాస భవనంలో మంగళవారం రాత్రి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో రెండున్నరేళ్ల చిన్నారి సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు గాయపడ్డారు.
భవనంలోని 11వ అంతస్తులో రాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ముంబై అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి 10.02 గంటలకు అగ్నిమాపక శాఖకు సమాచారం అందగా.. తొలుత ప్రమాదాన్ని లెవల్-1గా ప్రకటించారు. మంటలు తీవ్రత పెరగడంతో 10.16 గంటలకు లెవల్-2కు పెంచారు. దాదాపు అర్ధరాత్రి 1 గంట సమయంలో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు.
విద్యుత్ వైరింగ్ నుంచి మంటలు? అగ్నిప్రమాదంలో ఇంట్లోని విద్యుత్ వైరింగ్, ఏసీ యూనిట్, ఫర్నిచర్, సోఫా, బెడ్, ఫాల్స్ సీలింగ్, వంటగది సామగ్రి భారీగా దెబ్బతిన్నాయి. సుమారు 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. అయితే అగ్నిప్రమాదానికి అసలు కారణం ఇంకా తెలియాల్సి ఉంది.
చిన్నారి సహా ఇద్దరి మృతి ప్రమాదంలో గాయపడిన ఎనిమిది మందిని ఆసుపత్రులకు తరలించారు. ఇద్దరిని కూపర్ ఆసుపత్రికి, మరో ఆరుగురిని నానావతి ఆసుపత్రికి తరలించారు. నానావతి ఆసుపత్రిలో రెండున్నరేళ్ల అబీర్, 23 ఏళ్ల అంకిత మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
గాయపడిన వారిలో ఫైర్‌మ్యాన్ మనోజ్ సోనావానే (30), శివమ్ ద్వివేది (29) చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. మరో నలుగురు పార్థ్ (32), హిరెన్ (64), యశస్వి (33), అభిషేక్ ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వారిలో యశస్వి, అభిషేక్ చికిత్స అనంతరం ఇంటికి వెళ్లారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
హైదరాబాద్‌లో మొదలైన వినాయక చవితి 2026 సందడి (ఫొటోలు)
‘రంభ ఊర్వశి మేనక’ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్...(ఫొటోలు)
‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్...ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు)
హాఫ్ శారీలో చిన్న పిల్లలా హీరోయిన్ నభా నటేశ (ఫొటోలు)
EVM ట్యాపరింగ్ జరిగిందో లేదో చంద్రబాబే చెప్పాలి..! ఉండవల్లి అరుణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్
రాజమండ్రి పోలీసులు అందరూ ఎలాంటివారంటే..! డాక్టర్ ప్రియాంక ఘటనపై అడ్వకేట్ బాల కామెంట్స్
నా భర్తను అక్రమంగా అరెస్ట్ చేసి... సీదిరి అప్పలరాజు భార్య సంచలన వ్యాఖ్యలు
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది మృతి
విజయ్ సంచలన నిర్ణయం.. డిప్యూటీ సీఎంగా త్రిష?
Senior Editorial Lead • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.