Power India Share Price Today: స్టాక్ మార్కెట్లలో ఎప్పుడు ఏం జరుగుతుందో ముందుగానే చెప్పలేం. కొన్ని స్టాక్స్ అప్పటికప్పుడు పతనమైనా, ఇంకొన్ని స్టాక్స్ మాత్రం భారీ రిటర్న్స్ అందిస్తుంటాయి. ఎప్పుడు ఎలా స్పందిస్తుంటాయో మార్కెట్లను జాగ్రత్తగా గమనిస్తే అంచనా వేయొచ్చు. అలా అని పెరుగుతుందని కొనేయడం, పడుతుంది కదా అని అమ్మేయడం కూడా చేయొద్దు. ఇక్కడ ఆయా కంపెనీల ఫలితాలు, ప్రకటనలు, భవిష్యత్తు వ్యూహాలు, పెట్టుబడి ప్రణాళికలు ఇలా అన్నీ కీలక పాత్ర పోషిస్తుంటాయి. వీటి గురించి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా తెలుసుకోవడం ముఖ్యం. ఏదేమైనా రిస్క్‌తో కూడుకున్న స్టాక్ మార్కెట్లలో మాత్రం ఆర్థిక నిపుణుల సలహాతోనే ఇన్వెస్ట్ చేయడం మంచిది. అప్పుడే రిస్క్ ఉన్నా దీర్ఘకాలంలో మెరుగైన రిటర్న్స్ అందుకునేందుకు అవకాశం ఉండొచ్చు.ముఖ్యంగా ఫలితాల సమయంలో చూస్తే కొన్ని స్టాక్స్ ఫలితాలకు ముందూ, తర్వాత రికార్డు స్థాయిలో పెరిగేవి ఉంటాయి. ఫలితాలు నిరాశపర్చితే అదే స్థాయిలో పడిపోయేవి ఉంటాయి. ఇప్పుడు 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఫలితాల్ని వెల్లడించిన అనంతరం ఒక స్టాక్ భారీగా పుంజుకుంది. అదే భారతదేశంలోని ప్రముఖ పవర్ ట్రాన్స్మిషన్, క్లీన్ ఎనర్జీ మౌలిక వసతుల రంగంలో పనిచేస్తున్న పవర్ టెక్నాలజీ సంస్థ హితాచీ ఎనర్జీ ఇండియా లిమిటెడ్. ఇది స్టాక్ ఎక్స్చేంజీల్లో పవర్ ఇండియా పేరుతో లిస్టయి ఉంది.సోమవారం సెషన్లో ఈ స్టాక్ ధర ఊహించని స్థాయిలో పెరిగింది. గత శుక్రవారం రోజు NSE లో ఈ స్టాక్ ధర రూ. 32,600 వద్ద ముగియగా ఇవాళ నేరుగా 7 శాతానికిపైగా పెరిగి రూ. 35 వేల వద్ద ఓపెన్ అయింది. అంతటితో ఆగిందా లేదు. ఇంకా పెరిగి ఇంట్రాడేలో ఒక దశలో ఏకంగా 10 శాతానికిపైగా పుంజుకొని రూ. 35,880 వద్ద సెషన్ గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఇక్కడ స్టాక్ ధర ఒక్కో షేరుపై ఒక్కరోజులోనే ఏకంగా రూ. 3280 పెరగడం విశేషం. దీంతో ఈ స్టాక్ కలిగి ఉన్న వారు అద్భుత స్థాయిలో రిటర్న్స్ అందుకున్నారు. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 38,785 గా ఉండగా దానికి చేరువైంది. 52 వారాల కనిష్ఠ ధర రూ. 16111 గా ఉంది. కంపెనీ మార్కెట్ వాల్యుయేషన్ రూ. 1.61 లక్షల కోట్లుగా ఉంది. ఇక గత 6 నెలల్లోనే ఈ స్టాక్ ధర 60 శాతం పెరిగింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు అంటే 7 నెలల్లో 94 శాతం ఎగబాకింది.Read Also: డబ్బు సంపాదిస్తేనే చాలదు.. ఈ 10 ఫైనాన్స్ రూల్స్ పాటిస్తే జీవితాంతం ఢోకా ఉండదు!ఈ కంపెనీ షేర్లు ఇవాళ రికార్డు స్థాయిలో పుంజుకునేందుకు ప్రధాన కారణం క్యూ1 ఫలితాలే. అవును ఆగస్ట్ 7న మార్కెట్ ముగిసే సమయంలో కంపెనీ తొలి త్రైమాసికం ఫలితాల్ని వెల్లడించింది. రూ. 2493 కోట్ల విలువైన సేల్స్ నమోదు చేసింది. ఇదే ఆదాయం అని చెప్పొచ్చు. ఇక్కడ ఏడాది కిందటితో పోలిస్తే 68 శాతం పెరిగింది. నికర లాభం 123.5 శాతం పెరిగి రూ. 294 కోట్లుగా నమోదైంది. ఆర్డర్ బుక్, మార్జిన్లు కూడా పెరగడంతో పలు బ్రోకరేజీలు ఈ స్టాక్ రేటింగ్ పెంచి, టార్గెట్ ప్రైస్ కూడా పెంచారు. దీంతో మంచి కొనుగోళ్లు నమోదవుతున్నట్లు నిపుణలు చెబుతున్నారు.Disclaimer: పైన ఇచ్చింది సమాచారంగానే పరిగణించాలి. పెట్టుబడులకు సిఫార్సు కాదు. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి చేసే ముందు ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మర్చిపోవద్దు.


